నాగవంశీపై కూడా తారక్ ఫ్యాన్స్ ఫైర్
‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj ) సినిమా నుంచి తాజాగా విడుదలైన 'దబిడి సాంగ్'లో బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులలో వెగటును తెప్పించేలా ఉన్నాయి. గతంలో పైసా వసూల్ అంటూ చేతి వెకిలి సైగల స్టెప్పులే మేలు అనేలా ఇప్పుడు విడుదలైన సాంగ్ ఉందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అయితే, ఇదీ చాలదన్నట్లు జూ.ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య సినిమాపై భగ్గుమంటున్నారు. డాకు మహారాజ్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీనంతటికీ కారణాలు కూడా ఉన్నాయని వారు తెలుపుతున్నారు.
డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్‌లో బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోలో చిత్ర దర్శకుడు బాబితో పాటు నాగవంశీ, తమన్ (Thaman S) గెస్టులుగా వెళ్లారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. బాబి ఇప్పటి వరకు డైరక్ట్ చేసిన సినిమాలతో పాటు అందులో నటించిన హీరోల గురించి మాట్లాడారు.
అయితే బాబి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన జై లవకుశ సినిమా, ఎన్టీఆర్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. బాలయ్య సూచనమేరకే ఈ టాపిక్ రాలేదని వైరల్ అయింది. ఈ షోకు గెస్టులుగా ఎవరు వచ్చినా సరే.. ఎవరూ కూడా ఎట్టి పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దని బాలయ్య చెప్పాడని వైరల్ అయింది. బాబి తను తీసిని సినిమా హీరోల అందరి పేర్లు ప్రస్తావించి ఎన్టీఆర్ పేరు తెరపైకి తీసుకురాకపోవడంతో తారక్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ డాకు మహారాజ్ సినిమాకు వెళ్లొద్దని తారక్ ఫ్యాన్స్‌కు సూచన చేస్తున్నారు.
(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్' ఊచకోత ట్రైలర్ వచ్చేసింది)
సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిర్మాత నాగవంశీకి (Suryadevara Naga Vamsi) అసలు విషయం అర్థమైనట్లు ఉంది. నెట్టింట ఇలాగే కొనసాగితే డాకు మహారాజ్‌కు డ్యామేజ్ తప్పదని గ్రహించిన ఆయన ఇలా ట్వీట్ చేశారు. 'ఇది మన అందరి సినిమా.. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్‌బస్టర్ చేసేందుకు ప్రయత్నిద్దాం.' అంటూ రాసుకొచ్చారు.
దీంతో నాగవంశీపై కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్‌కు వీరాభిమానినని అన్నావ్.. కేవలం తారక్‌పై ఇష్టంతోనే దేవర సినిమా రైట్స్ తీసుకున్నానని చెప్పుకున్నావ్. మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్‌గా చెప్పుకోవడం ఏంటి అంటూ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో తాము డాకు మహారాజ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నామని కామెంట్ చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
మరికొందరు మాత్రం ‘ఈ ఒక్కసారి నీ సినిమా చూడం’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకూ డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇంతకీ మీరు ఏం సినిమా తీసినారో చెప్పలేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే, బాలకృష్ణ అభిమానులు కూడా తమకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ అక్కర్లేదంటూ తిరిగి సమాధానంగా చెప్పుకొస్తున్నారు.
ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం.
అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వటానికి ప్రయత్నిద్దాం.
మీ
Naga Vamsi— Naga Vamsi (@vamsi84) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment