Unstoppable With NBK Season 4
-
క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్
ఈ సంక్రాంతికి మోత మోగిపోద్ది అంటూ ముగ్గురు హీరోలు ముందుకు వచ్చేస్తున్నారు. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'తో జనవరి 10న, నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో జనవరి 12న, వెంకటేశ్ 'సంక్రాంతికి వచ్చేస్తున్నాం'తో జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నారు. రెండు రోజుల గ్యాప్‌తో వరుసగా మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురూ ప్రమోషన్ల స్పీడు పెంచారు.అన్‌స్టాపబుల్ షోలో గేమ్ ఛేంజర్ టీమ్ఇటీవలే డాకు మహారాజ్ టీమ్ అన్‌స్టాపబుల్ షోకి విచ్చేసింది. దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 3న రిలీజైంది. ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలోకి గేమ్ ఛేంజర్ టీమ్ రానుంది. రామ్‌చరణ్‌తో పాటు, నిర్మాత దిల్ రాజు షోలో సందడి చేశారు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది.(చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)మనవడు కావాలి!వచ్చీరావడంతోనే చరణ్‌ను చిక్కుల్లో పడేశారు. ఈ ఏడాది మాకొక మనవడు కావాలంటూ తల్లి సురేఖ, నానమ్మ అంజనమ్మ కోరిక కోరారు. దానికి చెర్రీ చిరునవ్వుతోనే సమాధానం దాటవేశాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు.. ఈ ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావని బాలకృష్ణ అడగ్గా.. వీళ్లెవరితోనూ కాదు, అరవింద్‌తో పార్టీకి వెళ్తానని సమాధానమిచ్చాడు. అనంతరం క్లీంకార పుట్టిన సమయంలోని ఆనందకర క్షణాలను వీడియో వేసి చూపించడంతో చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. (చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు)కూతురికి చరణ్ గోరుముద్దలుక్లీంకారకు చరణే అన్నం తినిపిస్తాడని, అతడు తినిపిస్తే కానీ పాప తినదని అంజనమ్మ చెప్పింది. పొద్దున రెండు గంటలు పాపకే సమయం కేటాయిస్తాను. తను ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడే అందరికీ క్లీంకారను చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఉపాసన అంటే భయమా? అన్న ప్రశ్నకు చరణ్.. నన్ను వదిలేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ జనవరి 8న ఆహాలో విడుదల కానుంది.సినిమాగేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని ఐదు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశానని నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు. రెండు గంటల 45 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్ -
వంద పాములతో ఆ సీన్ చేశా: హీరో వెంకటేశ్
ఆహాలో నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’టాక్ షో(Unstoppable with NBK) నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. గత మూడు సీజన్ల మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ టాక్ షోలో పాల్గొని తమ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన చాలా విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా బాలయ్య టాక్ షోలో హీరో వెంకటేశ్(Venkatesh) సందడి చేశాడు. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానం ఇచ్చాడు. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా బొబ్బిలి రాజా(Bobbili Raja) సినిమాలో కొండ చిలువను పట్టుకునే ఓ ఫోటోను చూపించి, ‘ఇది నిజమైన పాములతో తీశారా లేదా గ్రాఫిక్స్‌తో మ్యానేజ్ చేశారా;’ అని బాలకృష్ణ అడగ్గా.. వెంకీ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఆ సినిమాలో ఒకటి కాదు ఏకంగా వంద పాములతో కలిసి ఆ సీన్ చేశానని చెప్పడంతో బాలకృష్ణతో పాటు షోలో కూర్చున్న ఆడియన్స్ కూడా షాకయ్యారు. ‘బొబ్బిలి రాజా సినిమా అంటే మా అన్నయ్యకు చాలా ఇష్టం. అందులో కొండ చిలువను పట్టుకునే సీన్ ఓ హాలీవుడ్ సినిమా నుంచి రిఫరెన్స్‌గా తీసుకున్నాం. మొదట ఆ సీన్ నేను చేయగలనా అని భయపడ్డాను. కానీ చివరకు ధైర్యం తెచ్చుకొని ఆ పాములు ఉన్న గదిలో దూకాను. అక్కడ ఉన్న పాములు పట్టే అబ్బాయి నా మీద పాములు వేశాడు. అప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అది చాలా గొప్ప అనుభవం’ అని వెంకటేశ్ చెప్పుకొచ్చాడు.ఇక సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చావని బాలయ్య అడగ్గా.. ‘నాకు సినిమాల్లోకి రావడం ఇష్టమే లేదు. హీరో అవుతానని అనుకోలేదు. విదేశాల్లో చదుకొని.. అక్కడే స్థిరపడాలి అనుకున్నాను. 1986లో ఇండియాకు తిరిగి వచ్చాక ఏదైనా బిజినెస్ చేద్దామనుకున్నాను. కానీ కుదర్లేదు. అనుకోకుండా ‘కలియుగ పాండవులు’తో నటుడిగా మారాను’ అని వెంకటేశ్ చెప్పారు. -
ప్రభాస్ ఆరడుగుల బంగారం: అల్లు అర్జున్
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తవగా నాలుగో సీజన్ కూడా సక్సెస్ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు.ప్రభాస్ గురించి ఏమన్నాడంటే?బన్నీతో పాటు అతడి తల్లి నిర్మలమ్మ కూడా షోలో సందడి చేయడం విశేషం. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి వరుస ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి మాట్లాడిన ప్రోమో విడుదల చేశారు. అందులో బన్నీ.. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని మెచ్చుకున్నాడు. అప్పట్లోనూ ఇదే మాటఇప్పుడే కాదు గతంలోనూ ప్రభాస్‌ను ఆకాశానికెత్తాడు. తన ఫేవరెట్ హీరో మాత్రమే కాదని, ఫేవరెట్ వ్యక్తి అని తెలిపాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల బంగారం అని ఓ ఈవెంట్లో పేర్కొన్నాడు. తాజాగా ఇదే మాటను ఆహా అన్‌స్టాపబుల్ షోలోనూ రిపీట్ చేయడంతో ఈ ప్రోమో వైరల్‌గా మారింది. ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. Appatiki ippatiki Same Words😍❤️.... fan boy movement🫂#Prabhas #AlluArjun pic.twitter.com/RmTPrDtcKY— Rᴀᴠɪ ᴠᴀ₹ᴍᴀ™ (@PrabhasVortex) November 14, 2024