ప్రభాస్‌ ఆరడుగుల బంగారం: అల్లు అర్జున్‌ | Unstoppable with NBK Season 4: Allu Arjun About Prabhas | Sakshi
Sakshi News home page

అప్పుడు ఇప్పుడు బన్నీ ఒక్కటే మాట.. ప్రభాస్‌ గురించి..

Published Thu, Nov 14 2024 7:15 PM | Last Updated on Thu, Nov 14 2024 7:20 PM

Unstoppable with NBK Season 4: Allu Arjun About Prabhas

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో విజయవంతంగా రన్‌ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తవగా నాలుగో సీజన్‌ కూడా సక్సెస్‌ఫుల్‌ రన్‌ అవుతోంది. తాజాగా ఈ షోకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వచ్చేశాడు.

ప్రభాస్‌ గురించి ఏమన్నాడంటే?
బన్నీతో పాటు అతడి తల్లి నిర్మలమ్మ కూడా షోలో సందడి చేయడం విశేషం. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి వరుస ప్రోమోలు రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ గురించి మాట్లాడిన ప్రోమో విడుదల చేశారు. అందులో బన్నీ.. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని మెచ్చుకున్నాడు. 

అప్పట్లోనూ ఇదే మాట
ఇప్పుడే కాదు గతంలోనూ ప్రభాస్‌ను ఆకాశానికెత్తాడు. తన ఫేవరెట్‌ హీరో మాత్రమే కాదని, ఫేవరెట్‌ వ్యక్తి అని తెలిపాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల బంగారం అని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నాడు. తాజాగా ఇదే మాటను ఆహా అన్‌స్టాపబుల్‌ షోలోనూ రిపీట్‌ చేయడంతో ఈ ప్రోమో వైరల్‌గా మారింది. ఫుల్‌ ఎపిసోడ్‌ నవంబర్‌ 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారం కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement