వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌కు అగ్ర రాజ్యం అమెరికా బిగ్ షాకిచ్చింది. పాక్‌కు చెందిన నాలుగు మిస్సైల్స్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్షిపణులపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ మిస్సైల్స్ తయారుచేయడం తమకు సైతం అమెరికాకు కూడా ముప్పే అంటూ చెప్పుకొచ్చింది.
దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాక్‌కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆంక్షల విషయంపై అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో సహా దక్షిణాసియా దేశాలకు పెద్ద ముప్పు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించడం జరిగింది. 2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత పాకిస్తాన్‌తో ఒకప్పటి సంబంధాలు లేవు అని చెప్పుకొచ్చారు.
ఇక, దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీకి సంబంధించి అమెరికా ఆంక్షలు విధించిన జాబితాలో పాక్ ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్ (ఎన్‌డీసీ) కూడా ఉండటం గమనార్హం. దీంతోపాటు అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్‌ప్రైజెస్ కూడా జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి.
మరోవైపు.. తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆంక్షలు కేవలం పక్షపాతంతో కూడుకున్నవే అని ఘాటు విమర్శలు చేసింది పాక్ ప్రభుత్వం. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో భారత్‌పై పాక్ ఆరోపణలు చేసింది. బైడెన్ ప్రభుత్వం భారత్‌తో సన్నిహితంగా ఉన్న కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment