ballistic missile
-
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా..
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌కు అగ్ర రాజ్యం అమెరికా బిగ్ షాకిచ్చింది. పాక్‌కు చెందిన నాలుగు మిస్సైల్స్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్షిపణులపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ మిస్సైల్స్ తయారుచేయడం తమకు సైతం అమెరికాకు కూడా ముప్పే అంటూ చెప్పుకొచ్చింది.దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాక్‌కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆంక్షల విషయంపై అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో సహా దక్షిణాసియా దేశాలకు పెద్ద ముప్పు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించడం జరిగింది. 2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత పాకిస్తాన్‌తో ఒకప్పటి సంబంధాలు లేవు అని చెప్పుకొచ్చారు.ఇక, దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీకి సంబంధించి అమెరికా ఆంక్షలు విధించిన జాబితాలో పాక్ ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ (ఎన్డీసీ) కూడా ఉండటం గమనార్హం. దీంతోపాటు అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్ప్రైజెస్ కూడా జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి.మరోవైపు.. తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆంక్షలు కేవలం పక్షపాతంతో కూడుకున్నవే అని ఘాటు విమర్శలు చేసింది పాక్ ప్రభుత్వం. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో భారత్‌పై పాక్ ఆరోపణలు చేసింది. బైడెన్ ప్రభుత్వం భారత్‌తో సన్నిహితంగా ఉన్న కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేసింది. -
ఉక్రెయిన్‌పైకి ఖండాంతర క్షిపణి ప్రయోగించిన రష్యా
కీవ్: అమెరికా తొలిసారిగా అందించిన శక్తివంత దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించిన ఉక్రెయిన్ ఊహించని దాడిని ఎదుర్కొంది. యుద్ధంలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది. అభివృద్ధిచేశాక పరీక్ష కోసం పలుదేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించినా యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారికావడం గమనార్హం. మధ్యతూర్పు ఉక్రెయిన్‌లోని డినిప్రో నగరంపైకి బుధవారం రాత్రి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) వచ్చి పడిందని ఉక్రెయిన్ టెలిగ్రామ్ మెసెంజింగ్ యాప్‌లో ప్రకటించింది. వేయి కిలోమీటర్ల దూరంలో రష్యాలో కాస్పియన్ సముద్రతీర ఆస్ట్రాఖన్ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. అయితే ఆ క్షిపణి సృష్టించిన విధ్వంసం, జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు. ‘‘ ఐసీబీఎంతోపాటు కింజార్ హైపర్సోనిక్ క్షిపణి, ఏడు కేహెచ్–101 క్రూజ్ క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిలో ఆరింటిని గాల్లోనే ధ్వంసంచేశాం. ఈ దాడిలో ఇద్దరు ఉక్రేనియన్లు గాయపడ్డారు. ఒక కర్మాగారం దెబ్బతింది. వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన పునరావాసన శిబిరం నాశనమైంది’ అని స్థానిక యంత్రాంగం పేర్కొంది. అయితే ఆర్ఎస్–26 రూబెజ్ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్–26 క్షిపణి ఏకంగా 800 కేజీల మందుగుండును మోసుకెళ్లగలదు. 5,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితోపాటు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ–ఎంట్రీ వెహికల్స్(ఎంఐఆర్వీ) సాంకేతికతనూ రష్యా వాడినట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఎంఐఆర్వీ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి.క్షిపణితో హెచ్చరించారా?సాధారణంగా ఐసీబీఎంలను అణ్వస్త్రాల వంటి భారీ బాంబులను ప్రయోగించడానికి వినియోగిస్తారు. సాధారణ మందుగుండుతో రష్యా గురువారం ఐసీబీఎంను ప్రయోగించడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి అందుకున్న అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల అండ చూసుకుని విచక్షణారహితంగా తమపై దాడులకు తెగబడితే అణ్వాయుధం ప్రయోగించేందుకైనా వెనుకాడబోమని హెచ్చరించేందుకే రష్యా ఇలా ఐసీబీఎంను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన రెండు రోజులకే రష్యా ఉక్రెయిన్‌పైకి తొలిసారిగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ‘‘ ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన రెండు బ్రిటన్ తయారీ స్టార్మ్ షాడో క్షిపణులు, ఆరు హిమార్స్ రాకెట్లు, 67 డ్రోన్లను నేలకూల్చాం’’ అని గురువారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టార్మ్షాడో క్షిపణులను తమ గగనతలరక్షణ వ్యవస్థలు కూల్చేశాయని రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే గురువారం ఉక్రెయిన్‌పై ఏ రకం ఖండాంతర క్షిపణిని ప్రయోగించారో, అసలు ప్రయోగించారో లేదో అన్న విషయాన్ని రష్యా వెల్లడించలేదు. ఇతర వివరాలు తెలిపేందుకు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా సాధారణ పత్రికా సమావేశంలో మాట్లాడుతుండగా ఆమెకు ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘ మనం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి గురించి పశ్చిమదేశాలు అప్పుడే మాట్లాడటం మొదలెట్టాయి. ఐసీబీఎంను వాడిన విషయాన్ని ప్రెస్మీట్లో ప్రస్తావించొద్దు’’ అని సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు ఫోన్లో చెప్పారు. సంబంధిత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఏమిటీ ఖండాంతర క్షిపణి?సుదూరంలోనే శత్రుస్థావరాలను తుదముట్టించేందుకు ఖండాంత క్షిపణి ఉపయోగపడుతుంది. 5, 500 కిలోమీటర్లకు మించి ప్రయా ణించగలవు. అణు, రసాయన, జీవాయుధాలను మోసుకెళ్లగలవు. సంప్రదాయక వార్‌హెడ్‌నూ మోస్తాయి. రష్యా వాడినట్లుగా చెబుతున్న ఆర్ఎస్26 రూబెజ్ క్షిపణి ఎంఐఆర్వీ టెక్నాలజీతో పనిచేసే ఘన ఇంధన మిస్సైల్. 2011 దీనిని అభివృద్ధిచేసి 2012లో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. అది ఆనాడు 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. ద్రవ ఇంధనంతో పోలిస్తే ఘన ఇంధన క్షిపణులను వాడటం చాలా తేలిక. నేలమాళిగ, మొబైల్ లాంఛర్ నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇందులోని ఇంధనం, ఆక్సిడైజర్లను రబ్బర్‌లాంటి దానితో కలిపి మిశ్రమంగా తయారుచేసి ఒక గట్టి పెట్టెలో అమర్చుతారు. ప్రొపెలంట్ మండగానే ఇంధన ప్రజ్వలన రెప్పపాటులో భారీగా జరిగి క్షిపణి శరవేగంగా దూసుకుపోతుంది. ఇంధ్రధనస్సులాగా అర్ధచంద్రాకృతిలో ప్రయాణిస్తుంది. దాదాపు 4,000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వేగంగా కిందకు పడపోవడం మొదలవుతుంది. ఈ దశలో ఇది ఏకంగా ధ్వని వేగానికి పది రెట్లు వేగంగా దూసుకొస్తుంది. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒకే క్షిపణిలో వేర్వేరు వార్హెడ్లను ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇవి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు. వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు. ఒకేసారి ప్రయోగించిన రెండు వార్హెడ్ల మధ్య దూరం 1,500 కిలోమీటర్ల దూరం ఉన్నాసరే వాటిని క్షిపణి ఖచ్చిత దిశలో జారవిడచగలదు. తొలుత కనిపెట్టిన అమెరికాఎంఐఆర్వీ టెక్నాలజీని తొలుత అమెరికా అభివృద్ధిచేసింది. 1970లో ఐసీబీఎంను పరీక్షించింది. 1971లో జలాంతర్గామి వెర్షన్లో ఎస్సీబీఎంను పరీక్షించింది. ఈ సాంకేతికతను 1970 చివర్లో నాటి సోవియట్ రష్యా అభివృద్ధిచేసింది. దీని సాయంతో ఐసీబీఎం, జలాంతర్గామి వెర్షన్ ఎస్ఎల్బీఎంను రూపొందించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా అమెరికా, రష్యాలు స్వల్ప, దీర్ఘ, ఖండాంతర క్షిపణులను ధ్వంసంచేశాయి. 1991 జూన్ ఒకటోతేదీలోపు మొత్తంగా 2,692 క్షిపణులను నాశనంచేశాయి. అయితే ఈ ఒప్పందం నుంచి 2019లో అమెరికా వైదొలగింది. -
రష్యాపైకి ఉక్రెయిన్ 100 డ్రోన్లు
కీవ్: ఉక్రెయిన్ శనివారం రాత్రి తమ పశ్చిమ ప్రాంతంపైకి 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది.గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని కూల్చేశాయని ప్రకటించింది. మొత్తం ఏడు ప్రాంతాల్లోకి 110 డ్రోన్లు చొచ్చుకురాగా, సరిహద్దుల్లోని ఒక్క కస్క్పైకే ఏకంగా 43 డ్రోన్లను పంపిందని రష్యా ఆర్మీ ప్రకటించింది. నిజ్నీ నొవ్గొరోడ్లోని పేలుడు పదార్థాల కర్మాగారానికి సమీపంలోకి వచ్చిన డ్రోన్‌ను గాల్లోనే ధ్వంసం చేశామని వివరించింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, శనివారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని క్రివ్యి రిహ్‌లో రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో 17 మంది గాయపడ్డారని యంత్రాంగం తెలిపింది. పలు నివాసాలు, వ్యాపార సంస్థలకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కాగా, వారం రోజుల వ్యవధిలో రష్యా 800 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500కు పైగా డ్రోన్లతో దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. నిత్యం తమ నగరాలు, పట్టణాలపై రష్యా దాడులు జరుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. -
చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పు
బీజింగ్: పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించినట్లు చైనా వెల్లడించింది. ఇది అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పుగా పరిణమించనున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్షిపణిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ ప్రయోగించిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలో జారవిడిచారు.దేశ వార్షిక శిక్షణ ప్రణాళికలో భాగంగానే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు చైనా పేర్కొంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ క్షిపణి ప్రయోగం ఆయుధ పనితీరు, సైనిక శిక్షణ ప్రభావాన్ని పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. 1989 తర్వాత మొదటిసారిగా ఐసీబీఎం పరీక్ష గురించి చైనా బహిరంగంగా తెలియజేసింది. చైనాకు చెందిన ఐసీబీఎం తొలి పరీక్ష 1980 మేలో జరిగింది. అనంతరం చైనా తన అణ్వాయుధ పరీక్షలు భూగర్భంలో నిర్వహిస్తూ వస్తోంది.చైనా తాజాగా చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష అంతర్జాతీయ ఆందోళనలను పెంచే అవకాశం ఉంది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్‌తో సహా అనేక దేశాలతో చైనాకు వివాదం నడుస్తోంది. మీడియాకు వెల్లడైన వివరాల ప్రకారం చైనా వద్ద 500కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 350 ఐసీబీఎంలున్నాయి. 2030 నాటికి చైనా వద్ద వెయ్యికి మించిన అణ్వాయుధాలు ఉంటాయని అంచనా. చైనా సైన్యం వందలాది రహస్య క్షిపణులను తయారు చేస్తోందని పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది.ఇది కూడా చదవండి: పని ఒత్తిడి పనిపడదాం..!హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చేద్దాం ఇలా..! -
అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం ‘అగ్ని ప్రైమ్’ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ), స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్ఎఫ్సీ) సహకారంతో భారత సైన్యం అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా సముద్ర తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అగ్నిప్రైమ్ నిర్దేశిత అన్ని లక్ష్యాలను చేరుకుందని వెల్లడించింది. ఈ మిస్సైల్ అణ్వాయుధాలను మోసకెళ్లగలదు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇది మీడియం రేంజ్ క్షిపణి. దీని స్ట్రైక్ రేంజ్ 1,000 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించడం అగ్నిప్రైమ్ ప్రత్యేకత. 1,500 నుంచి 3,000 కిలోల దాకా వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. బరువు దాదాపు 11,000 కిలోలు. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఆరో క్షిపణి కావడం విశేషం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పృథీ్వ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్ తదితర క్షిపణులను అభివృద్ధి చేశారు. అగ్నిప్రైమ్ పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, ఎస్ఎఫ్సీతోపాటు భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. అగ్ని ప్రైమ్ రాకతో మన భద్రతా బలగాలకు మరింత బలం లభిస్తుందని పేర్కొన్నారు. సైంటిస్టులకు ప్రధాన నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. -
స్వల్ప దూర అగ్ని–1 ప్రయోగ పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): స్వల్ప దూరాలను ఛేదించగల, ప్రయోగ దశలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని–1ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపంలో ఈ పరీక్షకు వేదికైంది. ‘అగ్ని–1 అద్భుతమైన సత్తా ఉన్న క్షిపణి వ్యవస్థ. ఇప్పుడు దీనిని స్వల్ప దూర లక్ష్యాలకు పరీక్షించి చూస్తున్నాం. గురువారం నాటి ప్రయోగంలో ఇది అన్ని క్షేత్రస్థాయి, సాంకేతిక పరామితులను అందుకుంది. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో–ఆప్టికల్ సిస్టమ్ వంటి అన్ని ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా దీని పనితీరును పరిశీలించాం. రెండు నౌకల ద్వారా క్షిపణి ఖచి్చతత్వాన్ని పర్యవేక్షించాం. ఇది చక్కగా పనిచేస్తోంది’’ అని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఈ రకం క్షిపణిని చివరిసారిగా జూన్ ఒకటో తేదీన ఇదే వేదికపై విజయవంతంగా పరీక్షించారు. -
సైన్యం చేతికి సరికొత్త మిసైల్.. చైనా తోకజాడిస్తే ‘ప్రళయ’మే..!
న్యూఢిల్లీ: సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు దిగుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్ గర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని భూభాగాన్ని చైనా అక్రమించుకునే ప్రయత్నం చేస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. భారత సైనిక దళాల అమ్ముల పొదిలో అత్యాధునికి మిసైల్ చేరనుంది. ‘ప్రళయ్’గా పిలిచే ఈ బాలిస్టిక్ మిసైల్ 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బాలిస్టిక్ మిసైల్‌ను సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది భారత రక్షణ దళం. ఈ వారంతాంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో అందుకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. రక్షణ శాఖలో రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చర్చల కొనసాగుతున్న క్రమంలోనే ఈ క్షిపణిని తీసుకురావలన్న ప్రతిపాదన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఓ సమావేశంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో శత్రువులను ధీటుగా ఎదుర్కొనేందుకు రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కృషి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రళయ్ ప్రత్యేకతలు.. ► మిసైల్ ప్రళయ్‌ను గత ఏడాది డిసెంబర్లో వరుసగా రెండు రోజుల్లో విజయవంతంగా పరీక్షించారు. ► విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన ఈ క్షిపణిని సైన్యంలో చేర్చుకోవాలని బలగాలు భావిస్తున్నాయి. ► ఈ మిసైల్ 150- 500 కిలోమీటర్ల దూరంలోని సూదూర లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ► ప్రళయ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు సహా ఇతర కొత్త సాంకేతికలతో పని చేస్తుంది. ► ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే పాక్షిక-బాలిస్టిక్ మిసైల్. ► శుత్రువుల మిసైల్స్‌ను కూల్చేందుకు సైతం దీనిని ఉపయోగించేలా రూపొందించారు. ► గాల్లో కొంత దూరం వెళ్లాక దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం సైతం ఈ మిసైల్‌కు ఉంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు.. -
‘కిమ్’ చేసిన పనికి జపాన్‌లో హై అలర్ట్!
టోక్యో: కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణీ పరీక్షలు చేపడుతూ తన పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు సైతం హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టి జపాన్‌లో అలజడి సృష్టించారు. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేపట్టినట్లు దక్షణ కొరియాతో పోటు జపాన్ అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మరోవైపు.. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు జపాన్ పీఎం. కొరియన్ ద్వీపకల్పం, జపాన్ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిసైల్ పడినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్‌కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. కూతురి పరిచయం ఇలాగ! -
AD-1: భారత అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం
స్వదేశీ పరిజ్ఞానంతో.. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరబోతోంది. ఐదువేల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను తునాతునకలు చేసేలా ఏడీ-1 మిస్సైల్‌ను రూపొందించింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO). ఈ మేరకు బుధవారం ఒడిశా తీరంలో జరిపిన రెండో దశ ప్రయోగం విజయవంతం అయినట్లు డీఆర్డీవో ప్రకటించింది. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. రెండు దశల అభివృద్ధి కార్యక్రమంగా ఏడీ-1 మిస్సైల్‌ను రూపొందించింది డీఆర్డీవో. గతంలో మొదటి దశ ప్రయోగంలో.. 2 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంది ఈ మిస్సైల్. అయితే.. బుధవారం జరిగిన ప్రయోగంలో ఏకంగా ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోగలిగిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ కామత్ వెల్లడించారు. మన రాడార్లు దానిని (శత్రువు క్షిపణిని) పసిగట్టగానే.. AD-1 దానిని ట్రాక్ చేస్తుంది. ఇది ప్రధానంగా ఎండో-వాతావరణానికి సంబంధించినది కానీ తక్కువ ఎక్సో-వాతావరణ ప్రాంతంలో కూడా పనిచేస్తుంది అని డీఆర్డీవో తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులు, తక్కువ ఎత్తులో ప్రయాణించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేసే సామర్థ్యం ఏడీ-1కి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి శత్రు దేశాల లక్ష్యాలను ఈ మిస్సైల్ నాశనం చేస్తుంది. 2025 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యంతో అందుబాటులోకి తెస్తామని డీఆర్డీవో ప్రకటించింది. ఇదీ చదవండి: ‘ఈ నాన్చుడెందుకు.. డైరెక్ట్‌గా అరెస్ట్ చేయండి’ -
ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించి.. ఒక్కసారిగా సరిహద్దుల్లో ఉద్రిక్తతను మరింత పెంచింది ఉత్తర కొరియా. గురువారం ఈ దుశ్చర్యకు పాల్పడగా.. దక్షిణ కొరియా తన దేశ ప్రజలతో పాటు జపాన్ను సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొరియా సరిహద్దులో ఉత్తర దిశగా లాంగ్ రేంజ్‌తో పాటు రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లోని సునాన్ ప్రాంతం నుంచి ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో దూర శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించినట్లు గుర్తించామని సియోల్ మిలిటరీ ప్రకటించింది. ఈస్ట్ ప్రాంతం వైపుగా ఈ ప్రయోగం జరిగిందని.. ఈ ప్రాంతానికి సీ ఆఫ్ జపాన్‌గా గుర్తింపు ఉందని తెలిపింది. ఆ వెంటనే ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో.. ప్యోన్గాన్ దక్షిణ ప్రావిన్స్‌లోని కయెచోన్ నుంచి రెండు షార్ట్‌రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్షించినట్లు సియోల్ మిలిటరీ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. సౌత్ కొరియా తూర్పు ద్వీపమైన ఉల్లెయుంగ్దో ప్రాంతంలో బుధవారం హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు గురువారం దాడితోనూ తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సియోల్ వర్గాలు సూచించాయి. ఇంకోవైపు జపాన్ సైతం ‘జే అలర్ట్’ ద్వారా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం ఒక్కరోజే నార్త్ కొరియా ఏకంగా 20 క్షిపణులను పరీక్షించింది. అందులో ఒకటి దక్షిణ కొరియా సరిహద్దు జలాల్లో పడిపోవడంతో అప్రమత్తం అయ్యింది సియోల్. కొరియా విభజన తర్వాత ఈ స్థాయిలో దగ్గరగా క్షిపణి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సియోల్-వాషింగ్టన్ దళాలు సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించగా.. ప్రతిగానే నార్త్ కొరియా ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. రెండు రోజుల్లోనే 23 క్షిపణులను పరీక్షించి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. -
మరోసారి రెచ్చిపోయిన నార్త్‌కొరియా.. జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశం జపాన్ మీదుగా మంగళవారం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అమెరికాకు చెందిన గ్వామ్ దీవిని సైతం తాకే సామర్థ్యమున్న ఈ అణు క్షిపణి ప్రయోగంతో జపాన్ ఉలిక్కి పడింది. #NorthKorea launched a ballistic missile that flew over #Japan, over the island of Hokkaido. Japanese air raid warning systems kicked in & people took shelter. The missile fell somewhere off the coast of the pacific. The latest test comes after US & S. Korean naval exercises. pic.twitter.com/ZSsbS3Vb0m — Indo-Pacific News - Geo-Politics & Military News (@IndoPac_Info) October 3, 2022 ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియా మంగళవారం మధ్యంతర క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పేర్కొనగా, అది మధ్యంతర లేదా దీర్ఘ శ్రేణి క్షిపణి అయి ఉంటుందని జపాన్ తెలిపింది. First time seeing a missile alert on the TV! Apparently from North Korea! #jアラート #ミサイル発射 pic.twitter.com/DCvX7Bc3cA — AetherCzar (@Aether_Czar) October 3, 2022 ఒకవేళ దీర్ఘ శ్రేణి క్షిపణి అయితే అమెరికా ప్రధాన భూభాగమే లక్ష్యంగా చేపట్టిన ప్రయోగమై ఉంటుందని నిపుణులు అంటున్నారు. తాజా పరిణామాన్ని ప్రమాదకరమైన, నిర్లక్ష్యపూరిత చర్యగా అమెరికా అభివర్ణించింది. ఈ ఏడాదిలో ఉత్తరకొరియా పలుమార్లు క్షిపణి పరీక్షలు జరిపి అమెరికా, మిత్రదేశాలకు తన సత్తా చూపింది. చదవండి: (Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో) -
మిసైల్ దూకుడు పెంచిన ఉత్తరకొరియా.. షాక్‌లో యూఎస్, దక్షిణ కొరియా
సియోల్: ఉత్తర కొరియా ఒక అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ దక్షిణ కొరియా పర్యటనకు ముందు రోజే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక ఈ విషయమై తమ జపాన్ కోస్ట్ గార్డు తీరంలో ఉన్న నౌకలకు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా జపాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియా ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం నిర్వహించనుందని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగానికి తెగబడటం గమనార్హం. ఇదిలా ఉండగా..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె ఉత్తర దక్షిణ కొరియాల సరిహద్దు పటిష్ట భద్రతను పర్యవేక్షించనున్నారు. ఈ వారంలోనే ఈ రెండు దేశాలు రోనాల్డ్ రీగన్ సముద్రతీర ప్రాంతంలో సంయుక్తంగా సైనిక కసరత్తులను నిర్వహించనున్నాయి. ఐతే ఉత్తర కొరియా ఈ ఇరు దేశాల సైనిక కసరత్తులను యుద్ధ సన్నహాలుగా పరిగణిస్తూ ఫైర్ అవుతోంది. ఐతే ఆయా దేశాలు మాత్రం తమ భద్రతా దృష్ట్యా సాగిస్తున్న విన్యాసాలుగా చెబుతున్నాయి. అదీగాక అమెరికా దక్షిణ కొరియా రక్షణ నిమిత్తం దాదాపు 28 వేల సైనికులను మోహరించింది. (చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు!) -
మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
సియోల్: అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతల్ని బేఖాతర్ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తూర్పు సముద్రంలో సోమవారం ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ వన్ ఇన్ చౌల్ వెల్లడించారు. ఆ క్షిపణి 700 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరారు. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సియోల్: అణ్వాయుధాలను తగ్గించు కోవడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ సమాజానికి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం ద్వారా పరోక్షంగా తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత బుధవారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని అమెరికా సైన్యం పేర్కొంది. సైనిక సంపత్తిని మరింతగా పెంచుకోనున్నట్లు ఉ.కొరియా ఇలా క్షిపణి ప్రయోగాల ద్వారా చెబుతోందని అమెరికా అభిప్రాయపడింది. సైన్యాన్ని పటిష్టవంతం చేస్తామని పార్టీ సమావేశంలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతిజ్ఞచేసిన వారం రోజుల్లోనే ఉత్తర జగాంగ్ ప్రావిన్స్‌లో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరగడం గమనార్హం. -
అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం
బాలాసోర్: అగ్ని ప్రైమ్(అగ్ని– పి) క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలు మోసుకవెళ్లే సామర్ధ్యమున్న ఈ బలాస్టిక్ మిసైల్‌ను ఒడిషా తీరంలోని అబ్దుల్‌కలామ్ ద్వీపం నుంచి శనివారం దిగ్విజయంగా పయ్రోగించినట్లు డీఆర్డీఓ తెలిపింది. ఇందులో పలు అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచామని తెలిపింది. 1000– 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ప్రయోగిస్తారు. పరీక్షలో క్షిపణి కచ్ఛితమైన లక్ష్యసాధన చేసిందని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ సందర్భంగా సైంటిస్టుల బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాధ్ ప్రశంసించారు. అగ్ని– పి పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్డీఓ చైర్మన్ సతీశ్‌రెడ్డి హర్షం ప్రకటించారు. తొలిసారి ఈ క్షిపణిని జూన్ 28న పరీక్షించారు. నేడు జరిపిన రెండో పరీక్షతో క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిందని, వీలయినంత త్వరలో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్డీఓ తెలిపింది. -
జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా మంగళవారం సముద్రజలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇప్పటికే కొరియా ద్వీపకల్పంలో సాగుతున్న ఉద్రిక్తతలకు ఈ పరిణామం మరింత ఆజ్యం పోసినట్లయింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించేందుకు వీలున్న ఒక ఆయుధాన్ని ఉ.కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది. సిన్పో నౌకాశ్రయం సమీపంలోని సముద్ర జలాల్లో సబ్మెరీన్ పైనుంచి తక్కువ శ్రేణి క్షిపణిని ఉ.కొరియా ప్రయోగించినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా ఆర్మీ తాజా పరిస్థితులపై విశ్లేషణ జరుపుతున్నాయి. కాగా, ఉ.కొరియా రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు తెలిసిందని జపాన్ మిలటరీ పేర్కొంది. అవి జలాంతర్గామి నుంచి ప్రయోగించినవా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టాక ఉ.కొరియా అతి ముఖ్యమైన ఆయుధ బల ప్రదర్శన ఇదే. ఉ.కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలకు సిద్ధమంటూ అమెరికా పునరుద్ఘాటించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. చివరిసారిగా ఉత్తరకొరియా 2019లో జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించింది. -
'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి
సాక్షి, బాలాసోర్: గత వారం రోజులుగా డీఆర్డీవో వరుస క్షిపణులను ప్రయోగిస్తోంది. అధునాతన వర్షన్‌తో శౌర్యా అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ శనివారం విజయవంతంగా పరీక్షించింది. భారత్- చైనా ఎల్ఏసీ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ క్షపణిని పరీక్షించడం ప్రాధాన్యం సంతరించికుంది. ఈ క్షపణి దాదాపు 800 కిలోమీటర్ల మేర లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలదు. ఈ క్షిపణి ఆపరేట్ చేసేందుకు సులువుగా, తేలిగ్గా ఉంటుందని.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి దశకు చేరుకునే సరికి హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వరుస పరీక్షలతో డీఆర్డీవో దూకుడు.. డీఆర్డీవో వరుస క్షిపణి పరీక్షలతో దూసుకెళ్తోంది. 'లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్' క్షిపణిని మంగళవారం విజయవంతంగా పరీక్షించారు. గత పదిరోజుల వ్యవధిలో రెండో క్షిపణిని పరీక్షించిండం విశేషం. మహారాష్ర్టలోని అహ్మద్‌నగర్‌లో ఈ క్షిపణిని అభివృధి చేశారు. దీని రేంజ్ ఐదు కి.మి ఉంటుందని.. వివిధ లాంచ్‌ప్యాడ్స్ ద్వారా ప్రయోగించవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రాహ్మోస్... డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన మరో ఆయుద్ధం.. 'బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షపణి'. 400 కి.మి రేంజ్‌తో లక్ష్యాన్ని ఛేదించగల శక్తి బ్రాహ్మోస్ ప్రత్యేకం. డీఆర్డీవో పీజే-10 ప్రాజెక్ట్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. ఇటువంటి క్షపణిని పరీక్షించడం ఇది రెండోసారి. -
కే 4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్..
భువనేశ్వర్ : అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేధించేలా డీఆర్డీఓ అభివృద్ధి చేసిన కే 4 బాలిస్టిక్ క్షిపణిని విశాఖపట్నానికి 30 నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో భారత్ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్ఎస్ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేసిన ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం రెండేళ్లుగా పలుమార్లు విఫలమైన క్రమంలో తాజా ప్రయోగం విజయవంతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. ఉన్నతమైన కచ్చితత్వాన్ని సాధించడమే ఈ క్షిపణి లక్ష్యమని డీఆర్డీఓ వెల్లడించింది. గత ఏడాది నవంబర్‌లో ఈ క్షిపణి ప్రయోగానికి సర్వం సిద్ధమైనా బంగాళాఖాతంలో బుల్బుల్ తుపాన్ ప్రభావంతో ప్రయోగం వాయిదా పడింది. అణు జలాంతర్గాముల్లో దీన్ని అమర్చే ముందు భారత్ ఈ క్షిపణిపై మరికొన్ని ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉంది. భారత్ తన జలాంతర్గాముల శ్రేణుల కోసం అభివృద్ధి చేస్తున్న రెండు అండర్‌వాటర్ క్షిపణుల్లో కే 4 క్షిపణి ఒకటి. -
పాక్ అణు క్షిపణి పరీక్ష
ఇస్లామాబాద్: భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్–1’ను పాక్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం పరీక్షించిన ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. భారత్ కూడా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణితో పాటు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని–2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. -
పాక్ దూకుడు.. అర్ధరాత్రి రహస్యంగా...
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి రహస్యంగా యుద్ధ క్షిపణిని పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల స్వల్పశ్రేణి యుద్ధ క్షిపణి ‘ఘజ్నవి’ని పాకిస్థాన్ ప్రయోగించింది. గురువారం తెల్లవారుజామున బలూచిస్తాన్‌లోని సోన్మియాని టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగినట్టు పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రయోగానికి సంబంధించిన 30 సెకన్ల వీడియోను షేర్ చేశారు. నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్(ఎన్డీసీ) తయారు చేసిన ఘజ్నవి క్షిపణి 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని ఆయన తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, జాతికి ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభినందనలు తెలిపారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాకిస్తాన్ కొద్దిరోజులుగా మాటల యుద్ధానికి దిగింది. భారత్‌తో యుద్ధానికి సిద్ధమంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం రాబోతోందని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం రావల్పిండిలో వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై ఎంతవరకైనా వెళ్తామని, అణు యుద్ధానికి వెనుకాడబోమని అంతకుముందు ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్షిపణిని ప్రయోగించడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: భారత్‌పై పాక్ నిషేధం; గందరగోళం) -
క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రయోగం సక్సెస్
బాలాసోర్: గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. శత్రుదేశాలు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగిస్తే గాల్లోనే పేల్చివేయగల రెండంచెల క్షిపణి నిరోధక వ్యవస్థను ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత ఓ క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రాడార్లు అప్రమత్తం చేయడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న పృథ్వీ డిఫెన్స్ వెహికల్(పీడీవీ) దీన్ని నిలువరించేందుకు గాల్లోకి దూసుకెళ్లింది. అనంతరం భూమికి 50 కి.మీ ఎత్తులో క్షిపణిని పృథ్వీ నాశనం చేసింది. -
గగనతల పటిష్టతకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: ముంబై, ఢిల్లీలతోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గగన తలాన్ని మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే వైమానిక రక్షణ వ్వవస్థకు అవసరమైన క్షిపణులు, లాంచర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్లను అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాగే దీనిలో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు మిలటరీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్నేళ్లుగా డ్రాగన్ కంట్రీ చైనా వైమానిక శక్తిని గణనీయంగా పెంచుకుందని.. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా గగన తలాన్ని పటిష్టపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు వివరించాయి. వైమానిక పటిష్టతకు అవసరమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్స్, యుద్ధ విమానాలను కొనుగొలు చేసేందుకు అమెరికాతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే సుమారు 2 బిలియన్ల డాలర్ల విలువ గల సముద్ర పరిరక్షణ డ్రోన్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వం లేని దేశానికి డ్రోన్లను విక్రయించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతోపాటు సుమారు రూ.40 వేల కోట్లతో రష్యా నుంచి ఎస్–400 ట్రియాంప్ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను కొనుగొలుకు సంబంధించిన ఒప్పందం తుది చర్చల్లో ఉంది. అలాగే 5 వేల కిలోమీటర్ల లక్ష్యాలను చేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ను కూడా త్వరలోనే ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. -
అగ్ని–5 గ్రాండ్ సక్సెస్
బాలసోర్: దేశీయంగా అభివృద్ధి చేసిన, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అత్యాధునిక అగ్ని–5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రక్షణ శాఖ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9.45 గంటలకు మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించి పరీక్షించామని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. క్షిపణి పరీక్ష విజయవంతం అవడంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రజ్ఞులు, సిబ్బందికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు చెప్పారు. 2012 ఏప్రిల్ 19 నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఆరుసార్లు అగ్ని–5 క్షిపణిని పరీక్షించగా, అన్నిసార్లూ విజయవంతంగా క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికే అగ్ని–1 (700 కిలోమీటర్ల పరిధి), అగ్ని–2 (2 వేల కి.మీ), అగ్ని–3 (2,500 కి.మీ) క్షిపణులు రక్షణ శాఖ వద్ద ఉన్నాయి. అగ్ని–5 పరిధిని 5వేల కిలోమీటర్లకు పెంచడంతోపాటు దిక్సూచి వ్యవస్థ, ఇంజిన్, వార్‌హెడ్ తదితరాలకు సంబంధించి అత్యాధునిక సాంకేతికతను జోడించి దీనిని అభివృద్ధి చేశారు. అన్ని వ్యవస్థలూ సరిగ్గా పనిచేస్తున్నట్లు పరీక్షలో తేలిందని ఓ అధికారి తెలిపారు. క్షిపణి కచ్చితంగా సరైన మార్గంలోనే వెళ్లేలా చేయడం కోసం రింగ్ లేజర్ గైరో ఆధారిత దిక్సూచి వ్యవస్థను, మిసైల్‌లో ప్రత్యేక కంప్యూటర్ను వినియోగించారు. చైనా ముందు దిగదుడుపే అగ్ని–5 క్షిపణి ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నవాటిల్లోకెల్లా అత్యాధునికమైనదే. అయితే చైనా క్షిపణులతో పోలిస్తే దీని సామర్థ్యాలు చాలా తక్కువనే చెప్పాలి. చైనా వద్దనున్న ‘సీఎస్ఎస్–10 మోడ్ 2’ క్షిపణి పరిధి 11,200 కిలో మీటర్లు. అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇది చేరుకోగలదు. డీఎఫ్–41 అనే మరో క్షిపణిని కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. ఇది ఒకేసారి 10 అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. దీని పరిధి 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్ల వరకు ఉండనుందని అంచనా. డీఎఫ్–41 క్షిపణితో ప్రపంచంలోని ఏ దేశంపైనైనా దాడి చేయగల సామర్థ్యం చైనా సొంతం కానుంది. ‘అగ్ని–5’ ప్రత్యేకతలు ► ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా డీఆర్డీవో ఈ క్షిపణిని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ► 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 ట న్నుల బరువుండే ఈ అత్యాధునిక క్షిపణి 1500 కేజీల అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. ► ఇది సైన్యానికి అందుబాటులోకి వస్తే.. 5000–5500 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణులను కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ల సరసన భారత్ చేరుతుంది. ► అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3 క్షిపణులు ఇప్పటికే భారత సైన్యంలో చేరి సేవలందిస్తున్నాయి. ► ప్రస్తుతం భారత్‌కు ఉన్న అన్ని క్షిపణిల్లోకెల్లా అత్యధిక పరిధి కలిగిన క్షిపణి ఇదే. ► తూర్పున చైనా మొత్తం, పడమరన యూరప్ మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. ఆసియా, యూరప్ల్లోని అన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేయగలదు. ► మొత్తంగా 800 కిలో మీటర్ల ఎత్తు వరకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ భూమిపైకి తిరిగొచ్చి లక్ష్యాలను ఢీకొట్టగలిగే సామర్థ్యం ఉంది. -
‘ధనుష్’ ప్రయోగం సక్సెస్
బాలాసోర్(ఒడిశా): అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని భారత నావికా దళానికి చెందిన ఓ నౌక ద్వారా ధనుష్‌ను పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణిని నావికా దళ అవసరాల కోసం అభివృద్ధి పరిచి ధనుష్ క్షిపణిగా రూపొందించారు. ఈ క్షిపణిని శుక్రవారం ఉదయం బంగాళాఖాతంలో పారాదీప్ దగ్గర్లోని ఓ నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించినట్టు అధికారులు చెప్పారు. ధనుష్ క్షిపణి 500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. భూ, సముద్ర తలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ధనుష్ ఇప్పటికే భారత రక్షణ బలగాల్లో చేరింది. -
అగ్ని–5 పరీక్ష విజయవంతం
బాలాసోర్/చెన్నై: భారత్ మరో విజయం సాధించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5 పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఎన్నో అత్యాధునిక సాంకేతికతలున్న ఈ క్షిపణి ప్రయోగంవిజయవంతం కావడంతో క్షిపణి తయారీలో దేశీయ సాంకేతికతకు నూతనోత్సాహం వచ్చింది. అన్ని రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు క్షిపణి పనితీరును పరిశీలించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పరీక్ష పూర్తిగా విజయవంతమైందని, 19 నిమిషాల పాటు ప్రయాణించిన క్షిపణి 4,900 కిలోమీటర్లు దూసుకెళ్లిందని వెల్లడించాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి కానిస్టర్ ద్వారా గురువారం ఈ క్షిపణిని పరీక్షించారు. అగ్ని శ్రేణిలో ‘అగ్ని–5’మరింత ఆధునికమైంది. కొత్త సాంకేతికతలతో అభివృద్ధిచేశారు. విస్తారమైన నావిగేషన్ వ్యవస్థ (ఆర్ఐఎన్ఎస్), అత్యాధునికమైన మైక్రో నావిగేషన్ వ్యవస్థ (ఎంఐఎన్‌ఎస్)లు ఉండటం వల్ల ఈ క్షిపణి చాలా కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగలదు. తమిళనాడు పాత్ర కీలకం..: అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం కావడంలో తమిళనాడు పాత్ర మరువలేనిదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బాలిస్టిక్ క్షిపణిలో అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు తమిళనాడు పరిశ్రమల నుంచే వచ్చాయని చెప్పారు. గురువారం చెన్నైలో జరిగిన రక్షణ పరిశ్రమల అభివృద్ధి సదస్సులో ఆమె పాల్గొన్నారు. అగ్ని శ్రేణిలో క్షిపణులు.. ♦ క్షిపణి లక్ష్యాన్ని చేధించగలిగే సామర్థ్యం, ♦ అగ్ని–1,700 కి.మీ., ♦ అగ్ని–2, 2000 కి.మీ., ♦ అగ్ని–3, 42,500 నుంచి 3,500 కి.మీ., ♦ అగ్ని–5 5,000 కి.మీ.