ఉత్తరకొరియా మరోసారి.. | North Korea on Sunday tested its most powerful intercontinental ballistic missile | Sakshi
Sakshi News home page

ఉత్తరకొరియా మరోసారి..

Published Sun, May 21 2017 5:58 PM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

ఉత్తరకొరియా మరోసారి..

ఉత్తరకొరియా మరోసారి..

ప్యాంగ్‌యాంగ్‌: అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు, ఒత్తిళ్లు వచ్చినా ఉత్తరకొరియా మాత్రం తన పంథాను కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం మరో ఖండాంతర క్షిపణిని ఆ దేశం ప్రయోగించింది.

పుక్చాంగ్‌ సమీపం నుంచి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణికి అలస్కా, హవాయ్‌లలోని లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యముందని ‘ది ఇండిపెండెంట్‌’ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే.. ఆ క్షిపణికి హెవీ న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉందా? అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాల దూకుడుకు కళ్లెం వేసేలా దౌత్యపరమైన చర్యలు, ఆంక్షలకు ట్రంప్‌ ఉపక్రమిస్తున్న నేపథ్యంలోనే మరో ఖండాంతర క్షపణి ప్రయోగాన్ని ఆ దేశం నిర్వహించడం గమనార్హం. జనవరిలో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాతే.. ఉత్తరకొరియా సుమారు 10 క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement