బాలాసోర్: గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. శత్రుదేశాలు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగిస్తే గాల్లోనే పేల్చివేయగల రెండంచెల క్షిపణి నిరోధక వ్యవస్థను ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత ఓ క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రాడార్లు అప్రమత్తం చేయడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న పృథ్వీ డిఫెన్స్ వెహికల్(పీడీవీ) దీన్ని నిలువరించేందుకు గాల్లోకి దూసుకెళ్లింది. అనంతరం భూమికి 50 కి.మీ ఎత్తులో క్షిపణిని పృథ్వీ నాశనం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment