పాక్‌ అణు క్షిపణి పరీక్ష | Pak successfully test fires Shaheen-1 surface-to-surface ballistic missile | Sakshi
Sakshi News home page

పాక్‌ అణు క్షిపణి పరీక్ష

Published Tue, Nov 19 2019 4:48 AM | Last Updated on Tue, Nov 19 2019 4:48 AM

Pak successfully test fires Shaheen-1 surface-to-surface ballistic missile - Sakshi

ఇస్లామాబాద్‌: భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్‌ క్షిపణి ‘షహీన్‌–1’ను  పాక్‌ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం పరీక్షించిన ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి.  గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్‌ పరీక్షించింది. భారత్‌ కూడా ఇటీవల బ్రహ్మోస్‌ క్షిపణితో పాటు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని–2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement