testing
-
టీబీ నుంచి డెంగ్యూ వరకూ.. 8 టీకాల పరీక్షకు అనుమతి
న్యూఢిల్లీ: టీకాలతో కరోనాకు అడ్డుకట్టవేడంలో విజయం సాధించిన అనంతరం ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం ఎనిమిది కొత్త వ్యాక్సిన్లను పరీక్షించడానికి ఆమోదించింది.ఇందులో టీబీ నుండి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వరకూ టీకాలు ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలో నాలుగు వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయి. ఈ టీకాల సాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రయోజనాలను పొందవచ్చు. వచ్చేరెండేళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తవుతాయని అంచనా. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు ఎనిమిది వేర్వేరు వ్యాక్సిన్లపై ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్ఈసీ) సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్- ఈ కంపెనీకి డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బీ (ఆర్డిఎన్ఎ), ఇన్‌యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి వ్యాక్సిన్లపై ఫేజ్- II ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. న్యూమోకాకల్ పాలీశాకరైడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీ అనుమతి పొందింది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యుమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. అదేవిధంగా డెంగ్యూ వ్యాక్సిన్‌పై మూడవ దశ ట్రయల్ నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.టీబీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చాలా కాలంగా బీసీజీ వ్యాక్సిన్‌పై కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా టీబీ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి లభించింది. ట్రయల్లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా సీడీఎస్సీఓ దశ- III ట్రయల్‌ను ప్రారంభించడానికి కూడా అనుమతిని ఇచ్చింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్వీ)తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని సీడీఎస్సీఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఊపిరితిత్తులు,శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో స్థానం దక్కింది. దీని కోసం మూడవ దశ ట్రయల్‌కు జీఎస్కే కంపెనీకి అనుమతి లభించింది. -
వొడాఫోన్ ఐడియా నుంచి ఐవోటీ ల్యాబ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాల టెస్టింగ్ కోసం ల్యాబ్–యాజ్–ఏ–సరీ్వస్‌లను ఆవిష్కరించినట్లు టెలికం సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధునాతన ఐవోటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు, సీ–డాట్ సంస్థతో కలిసి ఈ సరీ్వసులు అందిస్తున్నట్లు వివరించింది. ఇంటర్ఆపరబిలిటీ తదితర ప్రమాణాలకు సంబంధించి ఇప్పటివరకు ఆటోమొబైల్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో 50 ఐవోటీ డివైజ్‌ల టెస్టింగ్‌ను పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 5జీ డివైజ్‌లను కూడా పరీక్షిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా తెలిపారు. -
గగన్‌యాన్‌లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్ట్‌ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్–1(టీవీ–డీ1)ను ప్రయోగించనుంది. మానవ రహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేస్తే మానవసహిత ప్రయోగాలకు సోపానం కానున్నాయి. గగన్‌యాన్ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది. డీవీ–డీ1ను ప్రయోగించడంలో పీడన రహిత క్రూ మాడ్యుల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సా యంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. -
హైదరాబాద్‌లో విషతుల్యంగా నల్లానీరు!
హైదరాబాద్: భాగ్యనగరంలో ‘జలం’ విషతుల్యంగా మారింది. నల్లా నీరు తాగడానికి సురక్షితం లేనట్లుగా ‘నీటి నమూనా పరీక్షల’ ఫలితాల నివేదికలు వెల్లడిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు వందల కిలో మీటర్ల దూరంలోని గోదావరి, కృష్ణా, మంజీరా, సింగూరు నదుల నుంచి జలాల తరలింపు, నీటి శుద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం నగరవాసుల పాలిట ప్రాణసంకటంగా తయారైంది. కనీసం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీరు తాగేందుకు సంతృప్తికరం కాదని వెల్లడవుతున్న నీటి శాంపిల్స్ పరీక్షల నివేదికలను సైతం ఎక్కడికక్కడే తొక్కిపెట్టి గోప్యత ప్రదర్శించడం మరింత విస్మయానికి గురిస్తోంది. నీటి నాణ్యత అంశంలో ప్రజల నుంచి ఫిర్యాదుతో పాటు ఒత్తిడి వస్తే తప్ప అధికారులు స్పందించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రస్తుతం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీటిని వేడి చేసి చల్లార్చి వడపోస్తే తప్ప తాగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నల్లా నీటిని నేరుగా తాగితే జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు ఇతరత్రా వ్యాధుల బారిన పడుతున్నట్లు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి మాత్రం ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐఎస్ఓ నిబంధనల ప్రకారం శాసీ్త్రయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు థర్ట్ పార్టీ నిర్వహించిన నీటి నమూనా పరీక్షలు వెల్లడించడం ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగు విభాగాలుగా.. ఇంటింటికీ సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నిత్యం నాలుగు విభాగాలుగా నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జలమండలి యంత్రాంగం పేర్కొంటోంది. జలమండలి, క్యూఏటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, స్వయం సహాయక బృందాల సభ్యుల ద్వారా వేర్వేరుగా నీటి శాంపిళ్లను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్న్ శాతం 0,5 పీపీఎం కంటే తక్కువగా ఉన్నా, కలుషితంగా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినా తక్షణమే నీటి సరఫరా నిలిపివేసి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. కానీ.. ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. ఇటీవల జలమండలి యంత్రాంగం సరికొత్త సంస్కరణలో భాగంగా వినియోగదారుల సమక్షంలో ఇంటి వద్దనే నీటి పరీక్షలు నిర్వహించే విధంగా లైన్మెన్ల ఫోన్లలో ‘నాణ్యత’ పేరుతో ప్రత్యేక యాప్ ఇన్స్టాల్ చేసి అందుబాటులోకి తెచ్చినా.. లైన్‌మన్ ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు మాత్రం లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం కేవలం నాణ్యత యాప్ ద్వారానే ప్రతి రోజు సుమారు 15వేల శాంపిళ్లు సేకరించి పరీక్షిస్తున్నట్లు పేర్కొంటున్నారే తప్ప.. వాటి పరీక్షల నివేదికలు బహిర్గతం చేసేందుకు వెనుకాడటం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఇదిగో నాణ్యతలేమి.. నల్లా ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిలో నాణ్యతలేమి ఆందోళ కలిగిస్తోంది. సరఫరా చేస్తున్న నీటిలో తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరును థర్ట్‌పార్టీ నిర్వహించిన నీటి శాంపిల్ పరీక్ష ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జలమండలి క్యూఏటీ విభాగాలు సంయుక్తంగా నగర వ్యాప్తంగా సరఫరా అవుతున్న నల్లా నీటిలో ర్యాండమ్‌గా శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. నమూనా పరీక్షల్లో అసంతృప్తిగా వచ్చిన ఫలితాల నివేదికలను ఎప్పటికప్పుడు జలమండలి సంబంధిత ల్యాబ్‌కు సిఫారస్ చేస్తోంది. గత నెల (జులై)లో సేకరించిన నల్లా నీటి నమూనా పరీక్ష ఫలితాల నివేదిక ‘సాక్షి’ చేతికి చిక్కింది. వాటిని పరిశీస్తే.. నల్లా నీటిలో నాణ్యత ప్రమాణాల స్థితి బెంబేలెత్తిస్తోంది. ► మొత్తమ్మీద సుమారు 38 ప్రాంతాల్లో సరఫరా జరిగిన నీరు తాగడానికి ఆమోదయోగ్యం కానట్టు నీటి నమూనా పరీక్షల నివేదికలో వెల్లడైంది. అమీర్‌పేట్, అంబర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ, ఇమామ్‌గూడ, రెడ్‌హిల్స్, బన్సీలాల్‌పేట, బోయగూడ, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్ శాతం అసలు లేనట్లు పరీక్షలో తేలింది. ► మిగతా ప్రాంతాలు ఘాన్సీబజార్, ఆసిఫ్‌నగర్, రేతిబౌలి, షేక్‌పేట, లంగర్‌హౌస్, ఉస్మాన్‌గంజ్, చార్మినార్, వెంగళ్రావు నగర్, హుస్సేనీ ఆలం, ఖిల్వాత్, ఖైరతాబాద్, ముషీరాబాద్, రామ్‌నగర్, చంచలగూడ, కవాడిగూడ, సైదాబాద్, మలక్‌పేట, ఈదీబజార్, వనస్థిలిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్్ శాతం 0. 5 నుంచి 1.0 పీపీఎం వరకు ఉన్నప్పటికీ.. నీరు కలుషితం, ఇతరత్రా కారణంగా తాగడానికి యోగ్యం కాదని వెల్లడైంది. గడిచిన ఆరు నెలల నివేదికలు సైతం పరిశీలిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు బయటపడింది. అంతా గోప్యంగానే.. నల్లా ద్వారా సరఫరా చేసే నీటిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు జాతీయ స్థాయి సంస్ధల నుంచి అవార్డులపై అవార్డులు అందుకుంటున్న జలమండలి యంత్రాంగం నీటి శాంపిల్ పరీక్షల నివేదికలపై మాత్రం అత్యంత గోప్యత ప్రదర్శించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరవాసులకు సురక్షిత జలాలు అందించేందుకు నిత్యం సరఫరా జరిగే నీటి నాణ్యత పరిశీలన కోసం నాలుగు వేర్వేరు విభాగాల బృందాలతో నీటి శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. వాటి పరీక్షల నివేదికలు మాత్రం బహిర్గతం కాకుండా సంస్థ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు జాగ్రత్త పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తూ సంబంధిత విభాగం డైరెక్టర్ అధికారికంగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు ఇచ్చేందుకు నిరాకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక నీటి నమూనాలు పరీక్ష కేంద్రం అధికారి నివేదికలు ఇచ్చేందుకు తాను ఆథరైజ్ కాదని, ఉన్నతాధికారికి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొనడం మరింత అనుమానాలకు తావిస్తోంది. -
విమానం ఎక్కాలన్న సరదా ఇప్పుడు తీరినట్లుంది..
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వద్దికేరె గ్రామం సమీపంలో తపస్07 ఎ–14 రకం డ్రోన్ కుప్పకూలింది. చిత్రదుర్గం వద్ద డీఆర్డీఓ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ (ఏటీఆర్) ఉంది. నిత్యం ఇక్కడ డ్రోన్లు, మానవ రహిత విమానాల పరీక్షలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డీఆర్డీవో అధికారులు, పోలీసులు ధ్వంసమైన డ్రోన్‌ను అక్కడి నుంచి తరలించారు. సాంకేతిక లోపంతోనే అది కూలిందని, విచారణ జరుపుతున్నామని డీఆర్డీవో అధికారులు చెప్పారు. -
మొదటి సారి కనిపించిన మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు
Maruti Suzuki eVX: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద్రా, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను దేశీయ విఫణిలో విడుదల చేసిన మంచి అమ్మకాలను పొందుతున్నాయి. కాగా మారుతి సుజుకి కూడా ఈవీ రంగంలో నేను సైతం అంటూ 2023 ఆటో ఎక్స్‌పోలో 'ఈవీఎక్స్' (eVX) కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఈ కారు ఇప్పుడు ఎట్టకేలకు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన తరువాత ఈవీఎక్స్ రోడ్లమీద కనిపించడం ఇదే మొదటి సారి. ఈ కారు ఫోలాండ్ కాకో వీధుల్లో టెస్టింగ్ దశలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. మారుతి సుజుకి ఇప్పటికే జపాన్‌కు చెందిన టయోటాతో ఇప్పటికే అనేక సెగ్మెంట్లలో ఒప్పందాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ రెండు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఓ కొత్త ప్లాట్ఫార్మ్ను రూపొందిస్తున్నాయి. దీని ఆధారంగా 'ఈవీఎక్స్' పుట్టుకొస్తోంది. ఇది 2025 నాటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజైన్ & రేంజ్ మార్కెట్లో విడుదలకానున్న మారుతి సుజుకి ఈవీఎక్స్ మంచి డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మస్క్యులర్ బానెట్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వీ షేప్ డీఆర్ఎల్స్, మౌంటెడ్ ఓఆర్వీఎంలు, అలాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్‌లైట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ఇంటీరియర్ ఫీచర్స్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, కానీ ఆధునిక కాలంలో వినియోగించడానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన డ్యూయెల్ మోటార్ సెటప్ పొందుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జ్‌తో 550 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు ధర రూ. 18 - 20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగ్! కోడ్‌నేమ్ ఏంటో తెలుసా?
సాంకేతిక ప్రపంచంలో చాట్‌జీపీటీ ఇప్పుడు ఓ సంచలనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్ చాట్ జీపీటీని యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ అనే స్టార్టప్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్.. తన సెర్చ్ ఇంజన్ బింగ్ లోనూ చాట్ జీపీటీ తరహా సేవలు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అయితే మైక్రోసాఫ్ట్ తన బింగ్ ఏఐ చాట్‌బాట్ ‘సిడ్నీ’ని కొన్నేళ్లుగా భారత్‌లో సీక్రెట్ టెస్టింగ్ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఫోరమ్‌లలో పాత యూజర్ పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. ఇలా రహస్యంగా పరీక్షించి, సామర్థ్యాలను మెరుగుపరిచి తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ సెర్చ్ఇంజన్ అయిన బింగ్ యూజర్లకు సమాచారం అందించడంలో సహాయకంగా సిడ్నీ చాట్‌బాట్‌ను రూపొందించారు. సాధారణ భాషలో యూజర్లు ఇచ్చే కమాండ్లను ఇది అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సమాచారం అందిస్తుంది. ఈ చాట్‌బాట్‌ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్‌కు భారత్ కీలకమైన టెస్టింగ్ గ్రౌండ్‌గా ఉపయోగపడింది. (ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్‌జీపీటీ!) మైక్రోసాఫ్ట్ చాట్‌బాట్ ఫీచర్ ‘సిడ్నీ’ అనేది పాత కోడ్‌నేమ్ అని, దీన్ని తాము 2020 నుంచి భారత్‌తో పరీక్షిస్తున్నామని మైక్రోసాఫ్ట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కైట్లిన్ రౌల్స్టన్ ‘వెర్జ్’ అనే సంస్థకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియలో చాలా మంది నిపుణులు తమకు సహాయపడ్డారని, ఇలాగే సరికొత్త టెక్నిక్‌లతో యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ రంగలో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో చాట్బాట్ల రూపకల్పన కీలక అభివృద్ధి. ఈ చాట్బాట్లు ప్రస్తుతం యూజర్లకు అవసరమైన సమాచారాన్ని, సహాయాన్ని క్షణాల్లో అందిస్తూ చాలా ప్రాచుర్యం పొందాయి. మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్‌బాట్‌ను సెర్చ్ఇంజన్ కోసమే ప్రత్యేకంగా రూపొందించినా ప్రస్తుతం స్కైప్ వంటి తమ ఇతర సేవలకూ దీన్ని అనుసంధానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!) -
డోపింగ్‌లో పట్టుబడ్డ దీపా కర్మాకర్‌పై వేటు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత మెరికగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ డోపింగ్‌లో పట్టుబడింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. 2016లో ‘రియో’ విశ్వవేదికపై ప్రమాదకరమైన ‘ప్రొడునొవా’ విన్యాసంతో దీప ఆకట్టుకుంది. ప్రదర్శన ముగిసి ల్యాండింగ్ సమస్యతో త్రుటిలో ఆమె కాంస్య పతకాన్ని కోల్పోయి చివరకు నాలుగో స్థానంతో తృప్తి పడింది. అయితే భారత విశ్లేషకులు, క్రీడాభిమానులంతా ఆమె ప్రదర్శనను ఆకాశానికెత్తారు. తదనంతరం గాయాల బెడదతో మరే మెగా ఈవెంట్లోనూ ఆమె పాల్గొనలేకపోయింది. నిజానికి 2021 అక్టోబర్‌లోనే ఆమె డోపింగ్‌లో పట్టుబడింది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేశారు. అప్పటి నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది. -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్డేట్ తీసుకు రాబోతోంది. నిత్యం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్‌పై పరీకక్షిస్తోంది. వ్యూ వన్స్ టెక్ట్స్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! వాట్సాప్‌లో మెసేజ్‌ను ఒకసారి రిసీవర్ ఒకసారే మాత్రమే చూడగలరు. రిసీవర్ చదవిన వెంటనే ఆ మెసేజ్ ఆటో మేటిక్‌గా డిలీట్ అవుతుందన్న మాట. అటు మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి కూడా ఆ మెసేజ్ కనపించదు. తమ వాట్సాప్ చాట్‌ను ఎవరూ చూడకుండా సీక్రెట్‌గా ఉండాలనుకునే యూజర్లకు ఇది బాగా ఉపయోగ పడనుంది. (WhatsApp 3D Avatar: వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) వేబేటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగాఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ద్వారా ఒక్కసారి మాత్రమే కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతాయి.దీన్ని ఫార్వార్డ్ చేయడం, స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్‌ను పరీక్షిస్తుండటం గమనార్హం. -
Integrated Main Parachute Airdrop Test: ‘గగన్‌యాన్’లో ముందడుగు...
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష కార్యక్రమం ’గగన్‌యాన్’కు ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే మన ఆస్ట్రొనాట్లను సురక్షితంగా భూమ్మీదికి తిరిగి తీసుకొచ్చేందుకు వాడబోయే పారాచూట్లను విజయవంతంగా పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ మెయిన్పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ)గా పిలిచే ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైర్ రేంజ్ (బీఎఫ్ఎఫ్ఆర్) నుంచి విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. పరీక్షలో భాగంగా ఐదు వేల కిలోలున్న డమ్మీ పేలోడ్‌ను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్–76 విమానం ద్వారా జారవిడిచారు. తర్వాత ప్రధాన పారాచూట్లను తెరిచారు. ‘‘పేలోడ్ వేగాన్ని అవి సురక్షిత వేగానికి తగ్గించాయి. మూడు నిమిషాల్లోపే దాన్ని భూమిపై సురక్షితంగా లాండ్ చేశాయి. నిజానికి ప్రధాన పారాచూట్లలో ఒకటి సకాలంలో తెరుచుకోలేదు. ఇది కూడా మంచి ఫలితమేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే అంతిమంగా పూర్తిగా లోపరహితమైన పారాచూట్లను గగన్‌యాన్ కోసం సిద్ధం చేయగలుగుతాం’’ అని సారాబాయ్ సెంటర్ పేర్కొంది. ‘‘గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలో మొత్తం 10 పారాచూట్లుంటాయి. ముందుగా అపెక్స్ కవర్ సపరేషన్ పారాచూట్లు రంగంలోకి దిగుతాయి. తర్వాత రాకెట్ వేగాన్ని బాగా తగ్గించడంతో పాటు దాని దిశను స్థిరీకరించే డ్రాగ్ పారాచూట్లు విచ్చుకుంటాయి. నిజానికి ఆస్ట్రొనాట్లు సురక్షితంగా దిగేందుకు రెండు ప్రధాన పారాచూట్లు చాలు. ముందు జాగ్రత్తగా మూడోదాన్ని కూడా సిద్ధంగా ఉంచనున్నాం’’ అని ఇస్రో వివరించింది. డీఆర్డీఓతో కలిసి ఈ పారాచూట్లను రూపొందించారు. -
గేమింగ్‌లో భారీ ఉద్యోగాలు
ముంబై: గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించొచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ తెలిపింది. ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. 20–30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ‘గేమింగ్–రేపటి బ్లాక్ బస్టర్’పేరుతో టీమ్‌లీజ్ డిజిటల్ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రత్యక్షంగా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 30 శాతం ఉద్యోగాలు ప్రోగ్రామర్లు, డెవలపర్ల రూపంలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ రంగంలో గేమ్ డెవలపర్లు, యూనిటీ డెవలపర్లు, గేమ్స్ టెస్ట్ ఇంజనీర్లు, క్యూఏ హెడ్లు, యానిమేటర్లు, మోషన్ గ్రాఫిక్ డిజైనర్లు, వర్చువల్ రియాలిటీ డిజైనర్లు, వీఎఫ్ఎక్స్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. అధిక వేతనం.. ఈ రంగంలో అత్యధికంగా గేమ్ ప్రొడ్యూసర్లకు రూ.10 లక్షల వార్షిక వేతనం ఉంటే.. గేమ్ డిజైనర్లకు 6.5 లక్షలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ.5.5 లక్షలు, గేమ్ డెవలపర్లు రూ.5.25 లక్షలు, క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్లకు రూ.5.11 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీలున్నాయి. ‘‘గేమింగ్ పరిశ్రమ తదుపరి ఉదయించే రంగం. యూజర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా రానున్నాయి. తరచూ నియంత్రణపరమైన నిబంధనల మార్పు రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి ఉపాధినిస్తుంది. 2026 నాటికి 2.5 రెట్లు వృద్ధి చెందుతుంది’’అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. 2026 నాటికి గేమింగ్ పరిశ్రమ రూ.38,097 కోట్లకు చేరుతుందని టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఆదాయం పరంగా భారత్ గేమింగ్ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆరో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఈ విపణి విలువ రూ.17,24,800 కోట్లుగా ఉంది. -
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా తక్షణమే ఐసోలేషన్లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించాకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తనకు కరోనా సోకడంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. I have tested positive for Covid-19 with Mild symptoms and have isolated myself at home. Those who came in touch with me in last few days, kindly isolate yourself and get urself tested. My trip to Delhi stands cancelled. — Basavaraj S Bommai (@BSBommai) August 6, 2022 అయితే బొమ్మై జులై 25, 26న ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన వివిధ శాఖల ప్రతినిధులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఆయనకు పాజిటివ్‌గా తేలడం వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. చదవండి: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు జాతీయ జెండా పంపిన.. మోహన్ మార్కం, ఎందుకంటే? -
మహీంద్రా థార్‌కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..!
ఆఫ్ రోడ్ కార్లలో మహీంద్రా థార్ అత్యంత ఆదరణను పొందింది. ఈ సెగ్మెంట్లో మహీంద్రా థార్, మారుతి సుజుకీ జిమ్నీ కార్లకు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్స్ మోటార్స్ గుర్ఖా ఎస్యూవీను లాంచ్ చేసింది. తాజాగా గుర్ఖాను సరికొత్తగా తెచ్చేందుకు ఫోర్స్ సన్నాహాలను చేస్తోంది. 5 డోర్ వెర్షన్లో సరికొత్తగా..! గత ఏడాది ఫోర్స్ మోటార్స్ ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో గుర్ఖాను తీసుకొచ్చింది.తొలుత 3 డోర్ వెర్షన్ గుర్ఖాను ఫోర్స్ మోటార్స్ లాంచ్ చేసింది. దీనికి అదనంగా మరిన్నీ సీట్లను యాడ్ చేస్తూ 5 డోర్ వెర్షన్ గుర్ఖాను త్వరలోనే లాంచ్ చేస్తామని ఫోర్స్ తెలియజేసింది. ఇప్పుడు తాజాగా 5 డోర్ వెర్షన్ గుర్ఖా టెస్టింగ్ మోడల్‌కు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. ఈ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. నయా ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో 6-7 సీట్ల సదుపాయం ఉండనుంది. అదే డిజైన్..ఇంజిన్‌తో..! ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీ 5-డోర్ వెర్షన్ కారు అదే డిజైన్ , ఇంజిన్‌తో వచ్చే అవకాశాలున్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టూఐర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్ థీమ్‌తో ఇంటీరియర్ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలు వర్క్ చేస్తాయి. డ్రైవర్ డిస్ప్లేను సెమి డిజిటల్‌గా అందించారు. 2.6 ఫోర్ సిలిండర్ బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్ ఇంజన్ అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. గూర్ఖా ఇంజన్ 90 బీహెచ్పీతో 250 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. చదవండి: అలా చేస్తే సగం ధరకే పెట్రోల్, డీజిల్..! -
ఏటీఎస్‌లలోనే వాహనాల ఫిట్ నెస్ పరీక్షలు
న్యూఢిల్లీ: వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్‌లోనే (ఏటీఎస్) నిర్వహించడం తప్పనిసరి కానుంది. దశల వారీగా 2023 ఏప్రిల్ నుంచి ఈ నిబంధన అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. సరుకు రవాణా, ప్యాసింజర్ విభాగంలో భారీ వాహనాలకు 2023 ఏప్రిల్ 1, మధ్యస్థాయి, తేలికపాటి వాహనాలకు 2024 జూన్ 1 నుంచి ఇది తప్పనిసరి కానుంది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వ్యక్తిగత వాహనాలకు సైతం రానున్న రోజుల్లో ఈ నిబంధన అమలు చేస్తారు. -
కవ్విస్తున్న ఉత్తర కొరియా
సియోల్: ఆయుధ పరీక్షలను ఉత్తర కొరియా ఆపట్లేదు. వరుస పెట్టి ప్రయోగాలు చేస్తూ పక్క దేశాలను భయపెడుతోంది. ఉద్రిక్తతలను పెంచేలా గురువారం మరోసారి రెండు బాలిస్టిక్ మిసైళ్లను సముద్రంలోకి ప్రయోగించింది. దీంతో ఈ నెలలో ఆ దేశం చేపట్టిన ప్రయోగాల సంఖ్య ఆరుకు చేరుకుందని దక్షిణ కొరియా మిలటరీ వెల్లడించింది. ఉత్తర కొరియాలోని హామ్‌హంగ్ టౌన్ నుంచి ఈ ప్రయోగాలు జరిగాయని, 5 నిమిషాల వ్యవధిలో రెండు మిసైళ్లను వదిలారని తెలిపింది. ఈ ప్రయోగాల వల్ల జపాన్ తీరంలో నౌకలు, విమానాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడ తెలిపారు. అమెరికాతో ఆగిపోయిన అణ్వస్త్ర దౌత్య చర్చలు మళ్లీ జరిగేలా, తమపై విధించిన ఆంక్షలను ఎత్తేసేలా ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఉత్తర కొరియా ఇలా ప్రయోగాలు చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బైడెన్ సర్కారు ఉత్తర కొరియాతో అణ్వస్త్రాల నిరోధానికి సంబంధించి చర్చలు ప్రారంభించినా.. ఆయుధాలను కిమ్ పూర్తిగా విడిచిపెట్టే వరకూ ఆంక్షలు తొలగించకూడదని భావిస్తోంది. 2016 నుంచి అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతుండటంతో ఉత్తర కొరియా ప్రధాన ఎగుమతి కార్యకలాపాలు చాలా వరకు ఆగిపోయాయి. చైనా వైపు మళ్లీ తెరుచుకున్న సరిహద్దులు? కరోనా వల్ల దాదాపు రెండేళ్ల పాటు కఠినమైన లాక్డౌన్ పెట్టిన ఉత్తర కొరియా.. సరిహద్దులను క్రమం గా తెరుస్తోంది. చైనా నుంచి సరుకు రవాణాను తిరిగి ప్రారంభించడంతో ఈ విషయం స్పష్టమవుతోంది. గత వారం యాలూ నదిని దాటి ఉత్తర కొరియాకు గూడ్స్ రైలు వచ్చిందని, సరుకును ఖాళీ చేసిందని వాణిజ్య శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. అమెరికా ఆంక్షలతో తలకిందులైన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వల్ల మరింత దిగజారిందని తాజా పరిణామాల వల్ల తెలుస్తోంది. అయితే దక్షిణ కొరియాలోని ఓ వర్గం మీడియా మాత్రం.. కిమ్ తండ్రి 80వ పుట్టిన రోజు వేడుకలు వచ్చే నెలలో జరగనున్నాయని, ఆ తర్వాత ఏప్రిల్ నెలలో తన తాత 110 పుట్టిన రోజు ఉందని, ఈ వేడుకలకు గాను ప్రజలకు అవసరమైన ఆహారం, ఇతర నిత్యావసరాలను బహుమతిగా అందివ్వడానికి తాత్కాలికంగా సరిహద్దును తెరిచినట్టు చెబుతోంది. దక్షిణ కొరియా లెక్కల ప్రకారం చైనాతో ఉత్తర కొరియా వాణిజ్యం 2020 దాదాపు 80 శాతం తగ్గింది. 2021లో సరిహద్దులు మూసేయడంతో మళ్లీ 2/3 వంతు తగ్గిపోయింది. ఉత్తర కొరియాలో ఇంకా వ్యాక్సినేషన్ మొదలు కాలేదు. సరిహద్దులు తెరిచిన పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌పై ఆ దేశం ఎలా స్పందిస్తుందోనని అనుకుంటున్నారు. సరిహద్దు పట్టణాల్లో డిసిన్ఫెక్టెంట్ జోన్లను ఉత్తర కొరియా ఏర్పాటు చేసుకుందని దక్షిణ కొరియా చెబుతోంది. -
దేశంలోనే తొలి సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్
సాక్షి, కొరుక్కుపేట(తమిళనాడు): దేశంలోనే తొలిసారిగా కాంటాక్ట్ లెస్ సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్‌ను చెన్నైలో అందుబాటులోకి తెచ్చారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్, సినీ దర్శకురాలు కృతికా ఉదయనిధి అతిథులుగా పాల్గొని సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆప్టిమిస్ట్ సంస్థకు చెందిన వేల్ మురుగన్, సరస్వతి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో భాగంగా రక్త పరీక్షల కోసం వినూత్నమైన, సులువైన విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగకరంగా సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్ ఎంతో దోహదపడుతుందని దీనిని రూపొందించిన నిర్వాహకులను అభినందించారు. చదవండి: Helicoter Crash: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ -
వాహనాల ఫిట్నెస్ టెస్ట్.. ఇక ఆటోమేటెడ్
సాక్షి, హైదరాబాద్: వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆటోమేటెడ్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల నాణ్యతను, పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం తాజాగా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు అక్టోబర్ నాటికి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని చోట్ల ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ► ఆటోమెబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనానికి సంబంధించిన 40 అంశాలను ఈ ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రాలు తనిఖీ చేసి సదరు వాహనం సామర్థ్యాన్ని నిగ్గు తేలుస్తాయి. ► బస్సులు, లారీలు, ఆటోరిక్షాలు తదితర అన్ని రకాల ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలను ఈ ఫిట్నెస్ కేంద్రాల్లోనే తనిఖీలు చేయవలసి ఉంటుంది. ► ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులే అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో స్వయంగా తనిఖీలు చేసి వాహనాల సామర్థ్యాన్ని ధృవీకరిస్తుండగా రానున్న ఆ రోజుల్లో ఆ పనిని యంత్రాలు చేయనున్నాయి. ► మరో వైపు ఈ ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ స్టేషన్ల (ఏవిఎఫ్ఎస్) నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం నిర్వహించే పరీక్షలను పూర్తిగా ప్రైవేట్ అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఫిట్నెస్ కేంద్రాలను సైతం ప్రైవేటీకరించేందుకు తాజాగా రంగం సిద్ధమైంది. ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఊతం వాహనాల సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ..నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేట్ సంస్థలు ఏ మేరకు కచ్చితమైన ప్రమాణాలను పాటిస్తున్నాయో నిర్ధారించడం సాధ్యం కాదని రవాణాశాఖ సాంకేతిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్లను ఆర్టీఏలే నిర్వహించే విధంగా మార్పులు చేయాలంటున్నారు. పక్కాగా తనిఖీలు... ► వాహనం ఇంజన్ సామర్ధ్యం, బ్రేకులు, టైర్లు, కాలుష్య కారకాల తీవ్రత వంటి ముఖ్యమైన అంశాలు మొదలుకొని వైపర్లు, సైడ్ మిర్రర్లు, షాకబ్జర్వర్స్, డైనమో, బ్యాటరీ తదితర 40 అంశాలను ఈ యంత్రాలు క్షుణ్ణంగా పరీక్షిస్తాయి. ► ఎలక్ట్రికల్, మెకానికల్ లోపాలను గుర్తిస్తాయి. ► వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారకాలను గుర్తించి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్లకు అర్హత ఉన్నదీ లేనిదీ ఈ యంత్రాలే నిర్ధారిస్తాయి. ► గంటకు 30 వాహనాల వరకు తనిఖీలు నిర్వహించే విధంగా పూర్తిస్థాయిలో కంఫ్యూటరీకరించిన ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. ► ప్రస్తుతం మోటారు వాహన ఇన్స్టెక్టర్లు నిర్వహించే తనిఖీల్లో శాస్త్రీయత కొరవడినట్లు ఏఆర్ఏఐ నిపుణులు భావిస్తున్నారు. మొక్కుబడిగా నిర్వహించే ఈ తనిఖీల వల్ల కాలం చెల్లిన, డొక్కు వాహనాలకు తేలిగ్గా అనుమతి లభిస్తుందనే అభిప్రాయం ఉంది. ► ఇలా ఉత్తుత్తి తనిఖీలతో రోడ్డెక్కే వాహనాలు రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. -
వచ్చేనెలలో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చేనెలలో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకానుంది. ఎన్ఐఏ బయోటెక్నాలజీ సెంటర్లో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అతి త్వరలోనే టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ప్రస్తుతం దేశంలో కసౌలి, నోయిడాలో మాత్రమే టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పుణె, హైదరాబాద్‌లో కొత్తగా టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుతో వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రక్రియ మరింత వేగవంతం అవ్వనుంది. -
కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. కరోనా చికిత్సలో కొత్త ఔషధాన్ని లాంచ్ చేసే ప్రయత్నల్లో రిలయన్స్ బిజీగా ఉంది. అలాగే చౌక కరోనా టెస్టింగ్ కిట్‌ను కూడా లాంచ్ చేయనుంది. కోవిడ్-19కు నివారణగా నిక్లోసామైడ్ (టేప్‌వార్మ్ డ్రగ్) ఔషధాన్ని రియలన్స్ ముందుకు తీసుకు రానుంది. రిలయన్స్ తయారు చేసిన డయాగ్నొస్టిక్ కిట్లు - ఆర్-గ్రీన్, ఆర్-గ్రీన్ ప్రో లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుండి అనుమతి లభించింది. అంతేకాదు మార్కెట్ ధరలతో పోలిస్తే ఐదో వంతు తక్కువ ధరకే శానిటైజర్లను తయారుచేసే ప్రణాళికను కూడా రూపొందించింది. ఖరీదైన టెస్టింగ్ కిట్స్, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న లక్షల కొద్దీ బిల్లులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు రిలయన్స్ ప్రయత్నాలు మంచి ఊరటనివ్వనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ ఆసుపత్రులను వేధిస్తున్న వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి మరింత కృషి చేస్తోంది. ఇందుకుగాను రిఫైనింగ్-టు-రిటైల్ గ్రూప్ 3డీ టెక్నాలజీ "స్పెషల్ స్నార్కెలింగ్ మాస్క్" వినియోగిస్తోందని బ్లూం బర్గ్ నివేదించింది. నిమిషానికి 5-7 లీటర్ల సామర్థ్యం కలిగిన గ్రేడ్ ఆక్సిజన్ జనరేటర్లను డిజైన్ చేస్తోందట. కాగా కరోనాపై పోరులో భాగంగా 2020 లో రిలయన్స్ ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను తయారు చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గత ఏడాది పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ సీఎం రిలీఫ్ఫం డ్కు కోటి రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 875 పడకలను అందించింది. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాకు రిలయన్స్ చురుకుగా సహాయం చేస్తోంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి కరోనా బాధితులకు ఉచిత చికిత్స అందించేలా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో 225 పడకల సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలో దేశంలోని మొత్తం మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తిలో రిలయన్స్ 11 శాతం ఉత్పత్తి చేస్తుంది. ఏప్రిల్‌లో 15,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేసింది. సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ , జర్మనీ నుంచి 24 ఐఎస్వో కంటైనర్లను విమానంలో రప్పించిన సంగతి తెలిసిందే. చదవండి : vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్ -
భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్
కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఒకందుకు గర్విస్తుంది. భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ మా రాష్ట్రం నుంచి దేశానికి లభించింది అని ఆ రాష్ట్రం ఆశ్రిత వి. ఓలేటిని చూసి పొంగిపోతోంది. 1973 నుంచి ఎయిర్‌ఫోర్స్ నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం 275 మంది పాసవ్వగా వారిలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది. ఇకమీద భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో ఏ విమానం కొనాలన్నా, సేవలు మొదలెట్టాలన్నా దానిని పరీక్షించే ఓ.కె చేయాల్సిన బాధ్యత ఆశ్రితదే. కర్ణాటక రాష్ట్రం కొల్లెగల్ కు చెందిన ఆశ్రిత బెంగళూరులో ఇంజినీరింగ్ చేసింది. అది విశేషం కాదు. 2014లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో చేరి స్క్వాడ్రన్ లీడర్ అయ్యింది. అది కూడా విశేషం కాదు. కాని ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలెట్ స్కూల్’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్ టెస్ట్ కోర్స్’ (43వ బ్యాచ్)లో ఉత్తీర్ణత చెందింది. అదీ విశేషం. ప్రపంచంలో కేవలం 7 మాత్రమే ఉండే ఇలాంటి స్కూల్స్‌లో ఈ కోర్సులో ఉత్తీర్ణత చెందడమే కాకుండా భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ కావడం ఇంకా పెద్ద విశేషం. ఐ.ఎ.ఎఫ్ ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ప్రకటించి ఆశ్రితకు అభినందనలు తెలిపింది. ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం 6,807 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో 1607 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. నేవీలో వీరి సంఖ్య 704 మాత్రమే. పురుషులతో పోలిస్తే త్రివిధ దళాలలో స్త్రీ శాతం తక్కువే అయినా ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల్లో జెండర్ అడ్డంకులు అధిగమించి స్త్రీలు ఆ మూడు సైనిక విభాగాలలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. 2015 నుంచి ఎయిర్ ఫోర్స్ తన ఫైటర్ విభాగంలో మహిళల ప్రవేశాన్ని ఆమోదించాక సరిగ్గా ఆరేళ్లకు ఆశ్రిత తనదైన ఘనతను సాధించింది. -
లాక్డౌన్.. 48 గంటల్లోగా టెస్టింగ్
హాంకాంగ్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లోని కోలూన్ ప్రాంతంలో లాక్డౌన్ విధించింది. అక్కడ నివసించే 10వేలమంది నివాసితులు తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, అప్పటివరకు వారంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం (ఐసీసీ)కి దగ్గరగా ఉన్న ఈ నిషేధిత ప్రాంతంలో గత కొన్నిరోజులుగా జోర్దాన్ నుంచి అనేకమంది వచ్చారు. దీంతో వీరి వల్లే వైరస్ వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో 70కి పైగా నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 48 గంటల్లోగా టెస్టింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. (మోడల్ క్రేజ్.. ఫాలో అవుతోన్న బైడెన్) ఈ ప్రాంతంలో వృద్దాప్య జనాభా ఎక్కువగా ఉన్నందున కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో సాధ్యమైనంత త్వరగా టెస్టింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే 50 టెస్టింగ్ పాయింట్లను ఏర్పటు చేశారు. ఇప్పటికే ఈనెలలో 162కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిమ్, క్రీడా ప్రాంగణాలు, సెలూన్లు, సినిమా హాళ్లపై విధించిన నిషేధాన్ని జనవరి 27వరకు ప్రభుత్వం పొడిగించింది. గత 24 గంటల్లోనే హాంకాంగ్‌లో 81 కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,010కి చేరగా, ఇప్పటివరకు 160మంది కోవిడ్‌కు బలయ్యారు. (భారత్‌ను హనుమాన్తో పోల్చిన బ్రెజిల్ అధ్యక్షుడు) -
మరింత పెరగనున్న టెస్టుల సామర్థ్యం
సాక్షి, అమరావతి: కరోనా ఓవైపు తగ్గు ముఖం పడుతున్నప్పటికీ మరోవైపు టెస్టుల సంఖ్యను పెంచడానికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో గోల్డెన్ స్టాండర్డ్‌గా చెప్పుకునే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం రోజుకు 35 వేల వరకూ ఆర్టీపీసీఆర్–కోవిడ్ నిర్ధారణ టెస్ట్‌లు చేస్తున్నారు. కానీ 9వ తేదీ నుంచి 10వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు అదనంగా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీపీఆర్ టెస్ట్‌లే రోజుకు 45వేలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ల్యాబొరేటరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకూ ఆర్టీపీసీఆర్ టెస్టుకు సమయం 6 గంటల వరకూ పడుతోంది. ఇప్పుడు ఫ్రీ ఫిల్డ్ ట్యూబ్ (ముందుగానే రసాయనాలతో నింపిన ట్యూబ్)లను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తొలుత ప్రైవేట్ ల్యాబొరేటరీల్లో టెస్ట్ ధర రూ.2,800 ఉండేది. ఇప్పుడు దీన్ని రూ.1,900కు తగ్గించారు. మార్కెట్లో రేట్లను బట్టి ఎప్పటికప్పుడు టెండర్లను పిలుస్తూ తగ్గిన ధరల ప్రకారం కిట్లను కొనుగోలు చేయడం వల్ల పెద్ద మొత్తం నిధులు ఆదా అయ్యాయి. రాష్ట్రంలో రోజుకు 70వేల టెస్టులు తగ్గకుండా చేస్తున్నారు. ఇందులో 35వేలు ఆర్టీపీసీఆర్ కాగా మిగతావి ట్రూనాట్, యాంటీజెన్ టెస్టులున్నాయి. యాంటీజెన్లో పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్కు వెళ్లేవారు. అందుకే ఇకపై యాంటీజెన్ తగ్గించి ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచుతున్నారు. మార్కెట్లో రేట్లను బట్టి ఎప్పటికప్పుడు.. కరోనా నిర్ధారణ పరీక్షలకు కిట్లు తొలుత చాలా ఖరీదు ఉండేవి. రానురాను ధరలు తగ్గాయి. దీంతో ఎప్పటికప్పుడు మార్కెట్ రేట్లను బట్టి టెండర్లను పిలిచి కొనుగోలు చేశాం. ఆర్టీపీసీఆర్ టెస్టులను ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో ల్యాబొరేటరీలను మరింత మౌలికంగా తీర్చిదిద్దాం. – డా.ఎ.మల్లికార్జున, ల్యాబొరేటరీల నిర్వహణాధికారి, ఆరోగ్యశ్రీ సీఈఓ కోవిడ్ నిర్ధారణ పరీక్షల కిట్ ధరలు: కేటగిరీ ఏప్రిల్–మే సెప్టెంబర్ తర్వాత ఆర్టీపీసీఆర్ రూ.2,000 రూ.850 ట్రూనాట్ రూ.1,850 రూ.1,050 యాంటీజెన్ రూ.450 రూ.375 -
15 నిమిషాల్లోనే ఫలితం : యాంటీజెన్ టెస్ట్‌కు గ్రీన్‌సిగ్నల్
లండన్ : కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతంగా పరీక్షలు చేపట్టేందుకు పలు దేశాలు కసరత్తు ముమ్మరం చేశాయి. పెద్దసంఖ్యలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా 15 నిమిషాల్లోనే కోవిడ్-19 ఫలితాన్ని రాబట్టే పద్ధతికి ఐరోపా మార్కెట్లో అనుమతి లభించింది. బెక్టాన్ డికిన్సన్ అండ్ కో అభివృద్ధి చేసిన కరోనా వైరస్ పరీక్ష సార్స్-కోవ్-2 ఉపరితలంపై యాంటీబాడీల ఉనికిని ఇట్టే గుర్తిస్తుంది. చిన్న పరికరంతో నిర్వహించే ఈ యాంటీజెన్ పరీక్షకు లేబొరేటరీ అవసరం లేదు. ఈ తరహా కరోనా వైరస్ పరీక్షకు అమెరికన్ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర వాడకానికి జులైలోనే అనుమతించింది. ఇక అక్టోబర్ మాసాంతానికి ఐరోపా మార్కెట్లనూ టెస్టింగ్ కిట్ల విక్రయాన్ని ప్రారంభించేందుకు బెక్టాన్ డికన్సన్ సన్నాహాలు చేపట్టింది. ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ విభాగాల్లో, సాధారణ వైద్యులూ ఈ ర్యాపిడ్ కరోనా వైరస్ టెస్ట్‌ను ఈ పరికరం ద్వారా నిర్వహిస్తారు. కరోనా వైరస్ నియంత్రణలో తాము అభివృద్ధి చేసిన నూతన కోవిడ్-19 పరీక్ష గేమ్ ఛేంజర్ కానుందని బెక్టాన్ డికన్సన్ డయాగ్నస్టిక్స్ అధిపతి పేర్కొన్నారు. యూరప్‌లో రానున్న రోజుల్లో మరో విడత కరోనా వైరస్ కేసులు పెరిగే ప్రమాదం పొంచిఉండటంతో ఈ పరీక్షలకు డిమాండ్ అధికంగా ఉంటుందని చెప్పారు. కోవిడ్-19 వ్యాపించిన తొలినాళ్లలో చైనా తర్వాత ఇటలీ, స్పెయిన్లలో వేగంగా వ్యాధి విస్తరించడంతో యూరప్ కూడా కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. కాగా పీసీఆర్ పరీక్షలతో పోలిస్తే యాంటీజెన్ పరీక్షల కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమ యాంటీజెన్ టెస్ట్ 99.3 శాతం కచ్చితత్వంతో కూడినదని బెక్టాన్ డికిన్సన్ పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. చదవండి : వ్యాక్సిన్ కహానీ: అందుబాటులోకి వచ్చేదెలా? -
మూడు రెట్లు పెరిగిన కోవిడ్-19 పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ రాజధానిలో కరోనా పరీక్షలు ముమ్మరం చేశామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. పరీక్షల సామర్ధ్యాన్ని మూడు రెట్లు పెంచి రోజుకు 60,000 పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కోవిడ్-19 కేసులను అరికట్టేందుకు వ్యూహాత్మకంగా పరీక్షల సామర్ధ్యాన్ని పెంచామని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో వైరస్ కేసుల సంఖ్య రెట్టింపయ్యే సమయం 50 రోజులకు పెరిగిందని కోవిడ్-19 నుంచి ఇటీవల కోలుకున్న మంత్రి సత్యేంద్ర జైన్ వివరించారు. చదవండి : వైరల్: చీరకట్టులో అదిరిపోయే డాన్స్.. ఢిల్లీలో కరోనా వైరస్ రెండో విడత వ్యాప్తి ఊపందుకుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్న క్రమంలో కరోనా పరీక్షలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది. ఇక ఢిల్లీలో కరోనా మరణాలు తగ్గాయని, మరణాల పదిరోజుల సగటు 0.94 శాతమని మంత్రి తెలిపారు. మొత్తంగా మరణాల రేటు 1.94 శాతంగా నమోదైందని చెప్పారు. ఏడు రోజుల సగటు ఆధారంగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.5 శాతమని వివరించారు. -
కరోనా నిర్ధారణకు మరో కొత్త పరికరం
లండన్ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకిందా లేదా నిర్ధారించేందుకు మరో పరికరం ప్రపంచ మార్కెట్లోకి వస్తోంది. ఈ పరికరం ద్వారా ‘కోవిడ్ నడ్జ్ టెస్ట్’ను నిర్వహిస్తారు. మూడు గంటల్లోనే కోవిడ్ సోకిందా లేదా అనే విషయాన్ని ఈ పరికరం తేల్చి చెబుతోందని, 94 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘కోవిడ్–టెస్ట్’ పరికరాలు 70 శాతమే కచ్చితమైన ఫలితాలనిస్తుండగా ఈ కొత్త పరికరం 94 శాతం కచ్చితమైన ఫలితాలనివ్వడం విశేషమని వారు చెబుతున్నారు. బూట్ల డబ్బా అంత ఉండే ఈ పరికరంలో క్యార్టిడ్జెస్‌ను ఉపయోగిస్తారు. అనుమానితుల ముక్కు నుంచి తీసీ స్లేష్మం, నోటి లాలాజలం నుంచి తీసుకునే శాంపిల్స్‌ను ఈ క్యార్టిడ్జ్‌పై పరికరంలోకి పంపించగా, అది వాటిని మూడు గంటల్లోగా విశ్లేషించి ఫలితాన్నిస్తుంది. దాదాపు 30 పౌండ్లు అంటే దాదాపు 2,900 రూపాయలుండే ‘కోవిడ్ నడ్జ్‌టెస్ట్ బాక్స్’లను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన స్పినౌట్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఐదు వేల పరికరాలు, 58 లక్షల క్యార్టిడ్జ్‌ల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు బ్రిటన్ ఎన్హెచ్ఎస్ వర్గాలు తెలిపాయి. ( ఏపీలో ఒక్కరోజే 74,710 కోవిడ్ పరీక్షలు ) ప్రధానంగా విద్యా సంస్థలు, థియేటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు వీటి కోసం ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఇంటి వద్ద పరీక్షలకు కూడా ఇవి ఎంతోగానో ఉపయోగ పడతాయని ఎన్హెచ్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. సంగీత కచేరీలకు కూడా ఇవి బాగా ఉపయోగ పడుతున్నాయట. ఇటీవల లండన్‌లో జరిగిన సింఫని ఆర్కెస్ట్రా కచేరీలో కళాకారులందరికి ఈ పరికరాల ద్వారా కరోనా లేదని నిర్ధారించాకే లోపలికి అనుమతించారు. -
ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరీక్షలను రెట్టింపు చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ బుధవారం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతుండటంతో టెస్టింగ్ కెపాసిటీ పెంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో ప్రస్తుతం రోజుకు 20 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఈ సంఖ్యను 40 వేలకు పెంచుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. గత 24 గంటల్లో 1,544 కొత్త కేసులు నమోదయినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని కేజ్రివాల్ అన్నారు. ఇతర అంశాలును పరిగణలోకి తీసుకుంటే అవన్నీ కూడా అదుపులోనే ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు వేలల్లో వచ్చే కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతో ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు చాలా ధీమాగా ఉన్నారని, అయితే ఇక్కడితో సంతృప్తి పడరాదని కోరారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి నియమాలను పాటించాలని సూచించారు. (జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా) ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదని పేర్కొన్నారు. లక్షణాలు ఉన్నా కరోనా టెస్ట్ చేయించుకోకుంటే మీతో పాటు మీ చుట్టుపక్కన వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసినట్లే అవుతుందని అన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారితో డాక్టర్లు నిత్యం సంప్రదింపులు జరిపి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని, ఆక్సీమీటర్లను ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించారు. గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ తీవ్రత కొన్నిరోజుల నుంచి మళ్లీ అధికమయ్యింది. ఢిల్లీలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1544 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. జూన్ చివర్లో 3400గా ఉన్న కేసుల సంఖ్య ఆగస్టు మొదటివారం నాటికి 900కు తగ్గింది. దేశ రాజధానిలో ఇక కరోనా క్రమంగా తగ్గుతుంది అనుకునే లోపే గత వారం సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత టెస్టింగ్ కెపాసిటీ పెంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. (అన్‌లాక్ 4.0: స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవు!) -
నియోజకవర్గానికో మొబైల్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్ : ప్రతీ నియోజకవర్గానికి ఒక కరోనా టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీని అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా ప్రతీ గ్రామానికి వెళ్లి జ్వరం సహా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి కరోనా నిర్ధారణ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ముఖ్యమంత్రి నుంచి అనుమతి వచ్చాక ప్రజల ముంగిటకే వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించేందుకు 20 మొబైల్ కరోనా టెస్టింగ్ బస్సులను సిద్ధం చేస్తోంది. అందులో ప్రస్తుతం 3–4 బస్సులు ఇప్పటికే బస్తీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన వాటిని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తారు. అలాగే ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి ఒక మొబైల్ టెస్టింగ్ లేబొరేటరీ చొప్పున వంద బస్సులను సమకూర్చాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీలో ‘వెర’ స్మార్ట్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీస్ క్వారంటైన్ (ఐ–మాస్క్) టెక్నాలజీతో చేసిన వోల్వో బస్సుల్లో కరోనా లేబొరేటరీ కల్పించినట్లే, ప్రతీ నియోజకవర్గంలో సమకూర్చుతారు. పరీక్షల సంఖ్య రెండింతలు ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు రోజూ దాదాపు 22 వేల వరకు చేస్తున్నారు. ఇకపై రోజూ 40 వేల కరోనా పరీక్షలు చేయాలని కేబినెట్ నిర్ణయించడంతో ప్రతి బస్సులో ఒకేసారి పది మందికి కరోనా పరీక్షలు చేసే వీలుంది. అలా ప్రస్తుతం జీహెచ్ఎంసీలో నడుపుతున్న 3 మొబైల్ బస్సుల్లో రోజూ ఒక్కో దాంట్లో 300 పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే వంద బస్సులు వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో 30 వేల టెస్టులు వీటి ద్వారానే నిర్వహించవచ్చునని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
‘మూడు విభాగాలుగా విభజించి వైద్యం’
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్మెంట్ నిరంతరాయంగా కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామన్నారు. రోజుకు 17 వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ డాక్టర్లను సేవలు అందించాలని కోరాం అన్నారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసుల్లో 19 శాతం మందికి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని వయసు పై బడిన వారు... దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు...గర్భిణిలుగా విభజించి వైద్యం అందిస్తున్నామన్నారు. కరోనా రోగుల్లో కేవలం ఐదు శాతం మందికే ఆక్సిజన్ అవసరం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం 1100 సెంటర్స్ లో పరీక్షలు చేస్తున్నామన్నారు ఈటల రాజేందర్. (కోవిడ్ వారియర్స్ ఆహారంలో పురుగులు) బస్తీల్లో వయసు పై బడిన వారి నుంచి స్వాబ్ కలెక్షన్ చేయడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు ఈటల. కంటైన్మెంట్ జోన్లలో వీటిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వైద్య సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. పార్టీలు, సంస్థలు, ప్రజా సంఘాలు ... విధులు నిర్వహిస్తున్న వారికి ధైర్యం చెప్పాలని ఈటల కోరారు. -
అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్ కిట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్ కిట్ ‘కరోష్యూర్’ను తాము దేశీయంగానే అభివృద్ధి చేశామని ఐఐటీ–ఢిల్లీ వెల్లడించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారం దీన్ని ఆవిష్కరించారు. మేక్ ఇన్ ఇండియా దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ కిట్ ధర కేవలం రూ.399. ఆర్ఎన్ఏ ఐసోలేషన్, ల్యాబ్ చార్జీలు కూడా కలిపితే మొత్తం ధర రూ.650 అవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కిట్లతో పోలిస్తే ఇదే తక్కువ ధర. 3 గంటల్లో ఫలితం తెలుసుకోవచ్చు. చదవండి:( ఒకేరోజు 3.2 లక్షల కోవిడ్ పరీక్షలు) -
కోవిడ్ పరీక్షలు మరింత వేగంగా చేయనున్న ఏపీ
సాక్షి,తూర్పు గోదావరి: కాకినాడ హర్బర్ పేటలో ఆర్టీసీ సంజీవని కోవిడ్ మొబైల్ టెస్టింగ్ సేవలను బుధవారం ప్రారంభించారు. ఎంపీ వంగా గీతా,ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా 200 మంది మత్స్యకారులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఒకేసారి పది మందికి చొప్పున ముక్కు నుంచి శ్వాబ్‌ను సేకరిస్తున్నారు. వీటి ద్వారా ఫలితాలను అరగంటలో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా రోజుకు 500లకు పైగా పరీక్షలు చేయవచ్చు.ఈ రోజు మూడు సంజీవని కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనాలు జిల్లాకు చేరుకున్నాయి. రాజమండ్రి, కాకినాడ,అమలాపురం లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు త్వరలో మరో రెండు సంజీవని వాహనాలు జిల్లాకు చేరుకోనున్నాయి. చదవండి: ఆ ల్యాబ్‌లో నెగెటివ్.. ప్రభుత్వ టెస్ట్‌ల్లో పాజిటివ్ -
కోటి దాటనున్న కోవిడ్-19 టెస్ట్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నిరోధించడంలో కీలకమైన కోవిడ్-19 పరీక్షలను పెద్దసంఖ్యలో చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటనుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జులై 2 నాటికి దేశవ్యాప్తంగా పలు ల్యాబ్‌ల్లో మొత్తం 90,56,173 కోవిడ్-19 పరీక్షలను నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1065 టెస్టింగ్ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతి లభించగా వాటిలో 768 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా, 297 ప్రైవేట్ ల్యాబ్‌లున్నాయి. రోజురోజుకూ టెస్టింగ్ సామర్థ్యం మెరుగుపడుతుండగా ఈనెల 1న 2,29,598 కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. మరోవైపు పరీక్షల వేగం పెంచేందుకు కోవిడ్-19 పరీక్షను కేవలం ప్రభుత్వ వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే కాకుండా ఏ నమోదిత డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో అయినా నిర్వహించే వెసులుబాటును కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్-19 పరీక్షలను ముమ్మరంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను కోరింది. చదవండి : ‘వారికి కోవిడ్-19 ముప్పు అధికం’ -
హైదరాబాద్‌లో కరోనా పరీక్షలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కరోనా వైరస్ పరీక్షలకు అడ్డుకట్ట పడింది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 50 వేల కరోనా పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ ప్రక్రియకు తాత్కాళికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల టెస్టింగ్ ప్రక్రియ పూర్తికాని కారణంగా నేడు, రేపు పరీక్షలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. నిన్న ఒక్కరోజే 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది. చదవండి : అందుకు గర్వపడుతున్నా: మహమూద్ అలీ -
మూడురెట్లు పెరిగిన టెస్టింగ్ సామర్థ్యం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్ పరీక్షల సామర్థ్యం మూడు రెట్లకు పైగా పెంచామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గతంలో రోజుకు 5000 టెస్ట్‌లు నిర్వహించగా ప్రస్తుతం రోజుకు 18,000 కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలో కరోనా వైరస్ తాజా పరిస్థితిని సీఎం వివరిస్తూ ఇప్పుడు ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం లేదని స్పష్టం చేశారు. హోం క్వారంటైన్లో ఉన్న కరోనా వైరస్ రోగులు ఇప్పుడు తమ ఆక్సిజన్ స్థాయిలు పరీక్షించుకునేందుకు వారందరికీ పల్స్ ఆక్సీమీటర్లను అందచేస్తున్నామని చెప్పారు. చైనాతో భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని, కరోనా వైరస్‌తో పాటు సరిహద్దుల్లో చైనాతో పోరాడుతోందని జూన్ 15 నాటి ఘర్షణల నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇక దేశ రాజధానిలో కరోనా కేసులు 60,000కు చేరువగా 59,746 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 33,000 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి కాగా 25,000 క్రియాశీల కేసులున్నాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, రక్తంలో ఆక్సిజన్ స్ధాయిలు పడిపోవడవం కరోనా రోగుల్లో ముఖ్య లక్షణాలుగా కనిపిస్తున్నాయని చెప్పారు. చదవండి : వివాదాస్పద ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన ఢిల్లీ గవర్నర్ -
ఆరు లక్షల కోవిడ్-19 టెస్టులకు ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో మహమ్మారి కట్టడికి పలు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీ నగరంలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన క్రమంలో దేశ రాజధానిలో 6 లక్షల కోవిడ్-19 టెస్టులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే 169 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ మెథడాలజీ ద్వారా భారీఎత్తున టెస్ట్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19 నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కోసం ధరను 2400 రూపాయలుగా నిర్ధారించినట్టు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. మరోవైపు దేశ రాజధానిలో కరోనా వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం మరోసారి ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించారు. చదవండి : కోవిడ్-19 : అమిత్ షా కీలక భేటీ -
తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: మృతదేహాలకు కోవిడ్-19 పరీక్షలు చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంపై తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. మే 18, 26 తేదీల్లో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా... వాటిని అమలు చేయకుండా అరకొర సమాచారంతో కోర్టును మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఎలాగని ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకపోవడం, పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం, మృతదేహాలకు పరీక్షలు మొదలైన ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గత సోమవారం విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. భారత వైద్య పరిశోధన మండలి నిబంధనల ప్రకారం మృతదేహాలకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని వైద్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పరీక్షల్లో ఒకవేళ కరోనా పాజిటివ్ అని తేలితే మృతుడి కుటుంబసభ్యులకు పరీక్షలు చేయొచ్చు కదా అని ప్రశ్నించింది.(నిర్ధారణ పరీక్షల తీరుపై హైకోర్టు ఆగ్రహం) అదే విధంగా... కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం.. తామిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనంత వరకు హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. -
ఆ లక్షణాలు కనిపించినా కోవిడ్-19 టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 టెస్టింగ్‌కు రోగుల్లో కనిపించే లక్షణాల జాబితాలో మరో రెండింటిని చేర్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మూడు లక్షల మార్క్‌కు చేరువైన క్రమంలో ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనూహ్యంగా రుచి కోల్పోవడం, వాసనను పసిగట్టలేకపోవడం పలు కరోనా రోగుల్లో కనిపిస్తున్నందున వీటినీ కరోనా లక్షణాల్లో చేర్చాలని గతవారం కోవిడ్-19పై ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో చర్చకు వచ్చినా ఇంకా దీనిపై ఏకాభిప్రాయం వెల్లడికాలేదు. కోవిడ్-19 టెస్టింగ్‌కు అర్హమైన లక్షణాల జాబితాలో వీటిని చేర్చాలని కొందరు సభ్యులు సూచించగా దీనిపై చర్చ జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫ్లూ ఇతర ఇన్‌ఫ్లుయెంజాతో బాధపడేవారిలోనూ ఇలాంటి లక్షణాలు ఉంటాయని మరికొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. కాగా అమెరికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం (సీడీసీ) కోవిడ్-19 లక్షణాల జాబితాలో వాసన, రుచి కోల్పోవడాన్ని గతవారం చేర్చింది. మే 18న ఐసీఎంఆర్ జారీ చేసిన సవరించిన టెస్టింగ్ విధానాల్లో వైరస్ లక్షణాలతో బాధపడే వలస కూలీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. వైరస్ లక్షణాలు కలిగిన ఆస్పత్రల్లోని రోగులందరికీ, కంటైన్మెంట్ జోన్లలో పనిచేసే ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. నిర్ధారిత వైరస్ కేసుతో నేరుగా సంబంధం కలిగిన హైరిస్క్ కాంటాక్టులందరికీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. చదవండి : మరింత కఠినంగా లాక్డౌన్ అమలు -
తక్కువ ధరలో కరోనా టెస్టింగ్ కిట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నిర్థారణ కోసం అతి తక్కువ ధరలో, తక్కువ సాంకేతికత అవసరమయ్యే ఒక టెస్టింగ్ కిట్‌ను సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) రూపొందించింది. ఈ టెస్టింగ్ కిట్ ధర ప్రస్తుత్తం కరోనా వైరస్‌ను పరీక్షించడానికి ఉపయోగిస్తున్న రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-qPCR) ధర కంటే చవకైనది. దీనిని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ నెస్టెడ్ పీసీఆర్ (RT-nPCR) పరీక్షగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా రూపొందించిన ఈ కిట్‌ను ఉపయోగించడానికి ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనుమతి పొందాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ పరీక్షల కోసం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-qPCR) టెస్ట్ చేయడానికి మాత్రమే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్స్ చేసింది. (భారీ ఊరట : మరణాల రేటు అత్యల్పం) ప్రస్తుతం ఉపయోగిస్తున్నఆర్టీ- క్యూపీసీఆర్(RT-qPCR) కిట్‌ను కొత్తగా రూపొందించిన ఆర్టీ-ఎన్పీసీఆర్ (RT-nPCR) తో పోల్చి చూస్తే 50 శాతం తక్కువ సామార్థ్యం కలిగి ఉందని సీసీఎంబీ పరిశోధకులు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. పాత టెస్టింగ్ కిట్ ఆర్టీ- క్యూపీసీఆర్(RT-qPCR) ద్వారా పరీక్షించిన కరోనా వైరస్ నమూనాలను కొత్తగా రూపొందిచిన కిట్‌తో పరీక్షించగా 90 శాతం పాజిటివ్‌గా తేలాయన్నారు. మరోవైపు పాత టెస్టింగ్ కిట్ ఆర్టీ- క్యూపీసీఆర్(RT-qPCR) ద్వారా నెగిటివ్ అని తేలిన 13 శాతం నమూనాలు కూడా పాజిటివ్ ఫలితాలను చూపించాయన్నారు. దీని బట్టి చూస్తే ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షిస్తే కొన్ని కరోనా పాజిటివ్ కేసులు తప్పుగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాకేష్ మిశ్రా తెలిపారు. కొత్తగా రూపొందించిన టెస్టింగ్ కిట్ ఐసీఎమ్ఆర్ అనుమతి పొందాల్సి ఉందని, ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్‌లో కరోనా నెగిటివ్‌గా నమోదు అవుతుందో అక్కడ కొత్త కిట్‌తో పరీక్షిస్తే వంద శాతం సరైన ఫలితాలు పొందవచ్చని డాక్టర్ మిశ్రా పేర్కొన్నారు. (మరోసారి సంపూర్ణ లాక్డౌన్: నిజమేనా?) -
కరోనా వైద్య పరీక్షల్లో తేలిందేమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి సంబంధించి భారత్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తోన్న తీరుపై ఓ పరిశోధనా బృందం శుక్రవారం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఓ నివేదిక సమర్పించింది. జనవరి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు మొత్తం 10,21,518 మందిపై పరీక్షలు నిర్వహించగా, వారిలో 40,184 మందికి కరోనా ఉన్నట్లు తేలిందని, అంటే పాజిటివ్ కేసుల శాతం 3.9 శాతం ఉందని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు. (ఒక్క రోజే 7,964 కరోనా కేసులు) విదేశీయానం చేసి వచ్చిన వారిని, వారితో సంబంధం ఉన్న వారిని, నిర్ధారిత కేసులతో సంబంధం ఉన్న వారిని, కరోనా లక్షణాలున్న వారిని, కరోనా రోగులకు వైద్య చికిత్సలు అందించిన వైద్య సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు శాస్త్రవేత్తల బృందం నివేదికలో తెలిపింది. కరోనా కేసులతో సంబంధం ఉన్న వారికి పరీక్షలు జరపగా వారిలో 25.3 శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని, కరోనా రోగులతో సంబంధం లేకుండా శ్వాస సంబంధిత సమస్యలున్న వారికి పరీక్షలు నిర్వహించగా వారిలో 14 శాతం మందికి కరోనా నిర్ధారణ అయిందని నివేదిక వెల్లడించింది. కరోనా లక్షణాలు కలిగిన వైద్య సిబ్బందిలో 2.4 శాతం మందికి, కరోనా లక్షణాలులేని వైద్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 2.8 శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే హాట్ జోన్లలో 3 శాతం కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు నివేదిక తెలిపింది. కరోనా లక్షణాలు లేని వంద మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో ఐదుగురికి, కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు జరపగా వారిలో పది మందికి కరోనా సోకినట్లు శాస్త్రవేత్తల విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. (అలర్ట్ : ఆ రాష్ట్రాలపై కరోనా పంజా) -
కరోనా పరీక్షలు : ఐసీఎంఆర్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారించే ఆర్టీ-పీసీఆర్ టెస్టులకు ఇప్పటివరకు వసూలు చేస్తున్న రూ.4500 గరిష్ఠ నిబంధనను ఎత్తివేసింది. ఇకపై ఈ చార్జీలు నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తూ ఐసీఎంఆర్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాశారు. కోవిడ్-19 నిర్ధారణ కిట్లు బహిరంగ మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉండటం, ప్రైవేట్ ల్యాబ్‌ల మధ్య విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు దిగి వచ్చే అవకాశం వుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు, ప్రైవేట్ ల్యాబ్‌లు, సంస్థలు పరస్పర అంగీకారంతో ధర నిర్ణయించుకోవచ్చని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా నిర్ధారణ టెస్టుకు ఎంత చార్జ్ చేయాలి అనేది ఇప్పటివరకూ కేంద్ర పరిధిలో ఉన్న అంశం. తాజా నిర్ణయంతో దీన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సవరించుకునే వెసులుబాటు కల్పించింది. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు ) ఐసీఎంఆర్ లేఖ ప్రకారం, దేశంలో 428 ప్రభుత్వ ప్రయోగశాలలు, 182 ప్రైవేట్ ల్యాబ్‌లు ఇందుకోసం అందుబాటులో ఉన్నాయి. అలాగే మే 25 నాటికి ఐసీఎంఆర్ ఇప్పటికే 35 టెస్టింగ్ కిట్ల (విదేశీ,స్వదేశీ )ను ఆమోదించింది. అలాగే మే 26 నాటికి, రోజుకు లక్ష పరీక్షలు చొప్పున 31లక్షలను దాటినట్టు వెల్లడించింది. ఈ పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు 2 లక్షల పరీక్షలకు పెంచాలని యోచిస్తోంది. కాగా ఈ సంవత్సరం మార్చి17 న, పరీక్షా కిట్ల లభ్యత పరిమితంగా వుండటం, ప్రైవేట్ ల్యాబ్‌ల మోసాలను అరిట్టేందుకు ఒక్కో టెస్టుకు గరిష్టంగా రూ.4,500 మాత్రమే చార్జి చేయాలని నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. -
78 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా 2,549 మంది మరణించారు. మొత్తం 78,003 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 3,722 కేసులు బయటపడ్డాయి. 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 49,219 కాగా, 26,234 మంది చికిత్స అనంతరం కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. రికవరీ రేటు 33.63 శాతానికి పెరిగిందని వెల్లడించింది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్రను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 975 మంది కరోనా వల్ల కన్నుమూశారు. అలాగే 25,922 పాజిటివ్ కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. 13.9 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు కరోనా కేసులు రెట్టింపయ్యే వ్యవధి క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. గత మూడు రోజుల్లో ఈ వ్యవధి 13.9 రోజులకు చేరిందని చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను(ఎన్సీడీసీ) సందర్శించారు. కోబాస్–6800 టెస్టింగ్ మెషీన్లను జాతికి అంకితం చేశారు. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో గత 14 రోజులుగా 11.1 రోజులుగా ఉన్న కరోనా కేసుల డబ్లింగ్ టైమ్ గత 3 రోజులుగా 13.9 రోజులకు చేరడం శుభపరిణామమని అన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు లక్షకు పెంచామన్నారు. ఇప్పటిదాకా దాదాపు 20 లక్షల పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. అత్యాధునిక కోబాస్–6800 యంత్రంతో 24 గంటల్లోనే 1,200 కరోనా నమూనాలను పరీక్షించవచ్చని తెలిపారు. -
తొలి దేశీ కరోనా టెస్టింగ్ పరికరం..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది. వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్ 6800 టెస్టింగ్ మెషీన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్-19 టెస్ట్‌ల కోసం దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ పరికరాన్ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ఏర్పాటు చేశారు. మరోవైపు పీపీఈ కిట్లను దేశీయంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు భారత వాయుసేన ఆధ్వర్యంలో భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. చదవండి : ఫాసీ వ్యాఖ్యలతో ఏకీభవించను: ట్రంప్ -
భారత్‌కు యాంటీబాడీ టెస్టింగ్ కిట్లు..
వాషింగ్టన్: తాము రూపొందించిన కోవిడ్-19 యాంటీబాడీ టెస్టింగ్ కిట్లకు సీఈ మార్క్(సర్జిఫికేషన్ మార్కింగ్) లభించిందని హెల్త్‌కేర్ సంస్థ అబాట్ లాబొరేటరీస్ తెలిపింది. ఈ క్రమంలో యూనిట్ల తయారీని పెంచామని.. త్వరలోనే భారత్‌కు కిట్లను ఎగుమతి చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు... ‘‘కోవిడ్-19పై పోరులో అండగా నిలిచేందుకు... వీలైనంత త్వరగా టెస్టింగ్ కిట్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం. మే చివరినాటికి భారత్‌కు షిప్పింగ్ చేస్తాం. యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా ఎవరెవరు మరోసారి కరోనా బారిన పడ్డారనే విషయం సులభంగా తెలిసిపోతుంది’’ అని అబాట్ డయాగ్నటిక్స్ బిజినెస్ ఇండియా జీఎం నరేంద్ర వార్దే ఓ ప్రకటనలో పేర్కొన్నారు.(కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు!) కాగా యాంటీబాడీ లేదా సీరాలజీ బ్లడ్ టెస్టు ద్వారా కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తాన్ని పరీక్షిస్తారు. వారి శరీరంలో యాంటీబాడీస్ ఎంతకాలం వరకు వైరస్‌తో పోరాడాయి.. ఏ మేరకు రోగనిరోధక శక్తిని పటిష్టం చేశాయి అన్న విషయాల్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం వేలి నుంచి రక్తం తీసుకుని.. ఫలితం వెల్లడించడానికి కేవలం 15 నిమిషాలే పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుటకై అబాట్ లాబొరేటరీస్ మాలిక్యులర్ టెక్నాలజీని ఉపయోగించి చిన్నపాటి టోస్టర్ పరిమాణంలో ఉండే పోర్టబుల్ టెస్టింగ్ కిట్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే కరోనా పాజిటివ్.. నెగటివ్ ఫలితాన్ని ఈ కిట్ 13 నిమిషాల్లో వెలువరుస్తుందని సంస్థ పేర్కొంది.( 5 నిమిషాల్లో పాజిటివ్.. 13 నిమిషాల్లో నెగటివ్) -
ఏపీ: పది లక్షల జనాభాకు 2,152 టెస్టులు
సాక్షి, అమరావతి: దేశంలో పది లక్షల జనాభాకు 2 వేలకు పైగా కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరో మైలు రాయిని దాటింది. ఇప్పటివరకు ఏపీలో 1,14,937 టెస్టులు నిర్వహించారు. దీంతో ప్రతి పది లక్షల జనాభాకు 2,152 మందికి టెస్టులు చేస్తున్నట్టు తేలింది. ఎక్కువ టెస్టులు చేస్తున్న కారణంగా ఇన్ఫెక్షన్ ఉన్న వారిని వేగంగా గుర్తించి ఐసోలేషన్‌కు పంపగలుగుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్ రేటు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఏపీలో ఇన్ఫెక్షన్ రేటు 1.38గా నమోదైంది. జాతీయ సగటు ఇన్ఫెక్షన్ రేటు 3.81గా ఉంది. కరోనా మరణాలు రేటు కూడా గణనీయంగా తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో మరణాల రేటు 2.08గా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా 10,46,450 టెస్టులు నిర్వహించారు. ఈ గణాంకాల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 754 మందికి కరోనా నిర్థారిత టెస్టులు చేస్తున్నగా వెల్లడవుతోంది. కాగా, ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 47 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఉదయం వరకు ఏపీలో 1,583 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,062 మంది చికిత్స పొందుతున్నారు. (ఏపీ: వీరు సచివాలయానికి రావాలి) -
చైనా కిట్లపై వివాదం
‘కరోనా జాడ కనిపెట్టి, దాన్ని అరికట్టడానికి తోడ్పడటంలో చైనా చేసిన మేలు మరువలేనిది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకూ ఈ చర్య ఎంతో దోహదపడుతుంది’ అని బీజింగ్‌లో మన రాయబారి విక్రమ్ మిస్రీ ఏప్రిల్ 15న వ్యాఖ్యానించారు. కోటిన్నర వ్యక్తిగత పరిరక్షణ ఉప కరణాలు(పీపీఈలు), మరికొన్ని లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు చైనా మన దేశానికి పంపి నప్పుడు ఆయన ఈ మాటలన్నారు. కానీ పక్షం రోజులు గడవకుండానే భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) కిట్ల వాడకాన్ని నిలిపేయమని అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలివ్వాల్సి వచ్చింది. అంతేకాదు... వీటిని తిప్పి పంపాలని కూడా నిర్ణయించింది. వ్యాపార వ్యవహారాల్లో ఇలాంటి సమ స్యలు తలెత్తడం కొత్తేమీ కాదు. కిట్ల విశ్వసనీయత సరిగా లేదన్న ఆరోపణలొచ్చినప్పుడు జరిగిం దేమిటో తెలుసుకోవడం, తమ శాస్త్రవేత్తల్ని పంపి పరిశీలించడం, వాడకంలో లోటుపాట్లుంటే అవి ఎత్తి చూపడం... పనిచేయకపోవడం వాస్తవమైతే వెనక్కి తీసుకుని, మెరుగైనవి ఇస్తామని చెప్పడం చైనా బాధ్యత. కానీ ఆ దేశం ఇందుకు భిన్నంగా మాట్లాడింది. ‘మా ఉత్పత్తుల్నే తప్పుబడతారా, మా సౌహార్దాన్ని, మా చిత్తశుద్ధిని శంకిస్తారా?’ అంటూ విరుచుకుపడింది. ప్రపంచంలోనే మొట్టమొదట కరోనా మహమ్మారి బారినపడిన చైనా ఈ వ్యాధికారక వైరస్ ఆచూకీ పట్టడానికి అవసరమైన కిట్‌ను రూపొందించింది. వుహాన్‌తోపాటు ఆ సమీప నగరాలను కూడా పూర్తిగా దిగ్బంధించి, ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఏప్రిల్ 9 కల్లా ఆ మహమ్మారి నుంచి విముక్తమైంది. ఈ వ్యాధికి మొత్తం 4,632మంది మరణించారని అది వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారినపడినవారు దాదాపు 90,000మంది. ఇంత పెద్ద మహమ్మారిని జయప్రదంగా ఎదుర్కొన్నది కాబట్టే ఆ దేశం సరఫరా చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల నుంచి వెంటిలేటర్ల వరకూ అన్నిటిపైనా అందరికీ ఎంతో నమ్మకం ఏర్పడింది. కనుకనే దాదాపు అన్ని దేశాలూ వీటి కోసం క్యూ కట్టాయి. అమెరికా అడ్డదోవ తొక్కి వేరే దేశాలకు ఉద్దేశించిన సరుకును తన్ను కుపోయిందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. కరోనా పుట్టుపూర్వోత్తరాలపై ఎలాంటి అనుమానా లున్నా, ఏ మాదిరి వదంతులు వ్యాప్తిలో వున్నా... అన్ని దేశాలూ చైనా ఉత్పత్తులపై అంతగా నమ్మకాన్ని వుంచినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ఆ దేశం ప్రయత్నించాలి. సరఫరా చేసే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు సరిగా వున్నాయో లేదో నిర్ధారిం చుకుని వుంటే బాగుండేది. కానీ ఆ పని సరిగా జరిగినట్టు లేదు. కిట్ల నాణ్యతపై మన దేశం మాత్రమే కాదు.. ఇంచుమించు అన్ని దేశాలదీ అదే ఫిర్యాదు. ఒకరు చెప్పారంటే దురుద్దేశం అనుకోవచ్చు. ఇద్దరు చెబితే అవగాహనా రాహిత్యమనుకోవచ్చు. ఇంతమంది చెబుతుంటే కొట్టి పారేయడం దబాయింపు అవుతుంది. తన ఉత్పత్తులపై తనకు మాత్రమే విశ్వాసం వుంటే సరిపోదు. అది అందరిలోనూ కలిగే స్థాయిలో వాటి ప్రమాణాలుండాలి. ఐసీఎంఆర్ పుణేలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో తమ ఉత్పత్తుల్ని పరీక్ష చేయించి, ధ్రువీకరించిందని, ఆ తర్వాతే ఆర్డరిచ్చిందని చైనా వాదన. అలాగే వాటిని యూరప్, దక్షిణ అమెరికా ఖండ దేశాలకు, ఆసియాలోని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేశామని ఆ దేశం అంటోంది. నిజమే కావొచ్చు...కానీ ఈ దేశాలన్నీ ఏదో ఒక దశలో తప్పుబట్టాయి. తమకు నాసిరకం కిట్లు పంపిణీ చేసినందుకు చెల్లించిన సొమ్ము వెనక్కి ఇవ్వాలని స్పెయిన్ కోరింది. ఆ దేశం తొలి దశలో 950 వెంటిలేటర్లు, 55 లక్షల కిట్లు, కోటి పది లక్షల గ్లోవ్స్, 50 కోట్ల మాస్క్‌లు ఆర్డరిచ్చింది. అందుకు దాదాపు 47 కోట్ల డాలర్లు చెల్లించింది. కానీ వచ్చిన కిట్లన్నీ నాసిరకమని ఆరోపించి, ఇప్పటికే ఆర్డరిచ్చిన మరో 6,40,000 కిట్లు అవసరం లేదని తెలిపింది. నెదర్లాండ్స్ కూడా ఈ పనే చేసింది. స్లోవేకియా, టర్కీ, బ్రిటన్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సైతం ఈ కిట్ల పని తీరు బాగోలేదని తేల్చారు. ఏ కిట్ అయినా నూటికి నూరు శాతం బాగుండాలని ఎవరూ అడగరు. అది అశాస్త్రీయం కూడా. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష ఫలితాలతో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఫలితాలను పోల్చినప్పుడు రెండింటిమధ్యా సారూప్యత 80 శాతం వరకూ వుంటే ప్రమాణాలు బాగున్నట్టు లెక్క. కానీ చైనా కిట్లు 30శాతం లోపు వద్దనే నిలిచిపోయాయి. వాస్తవానికి మన దేశం చైనా కిట్లకు ఆర్డరిచ్చేనాటికే యూరప్ దేశాలు వాటి పనితీరును ప్రశ్నిం చాయి. పైగా ధర కూడా ఎక్కువని విమర్శలొచ్చాయి. అయినా ఐసీఎంఆర్ వీటినే ఎందుకు ఎంచు కున్నదో తెలియదు. ఇదే సమయంలో దక్షిణ కొరియా కిట్లు ఎంతో ప్రామాణికంగా వున్నాయని ప్రశంసలొచ్చాయి. అమెరికాలోని చాలా రాష్ట్రాలు ఈ కిట్లనే కొనుగోలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దక్షిణ కొరియా నుంచే దిగుమతి చేసుకుంది. ఐసీఎంఆర్ చైనా కిట్లపై మొదట్లో సంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే. అది 5 లక్షల కిట్లు తెప్పించి, అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేసింది. కానీ పశ్చిమ బెంగాల్, రాజస్తాన్‌ల నుంచి ఫిర్యాదులొచ్చాక వాస్తవమేమిటో విచారణ జరి పింది. రెండు రోజులపాటు నిలిపేయమని అందరినీ కోరింది. ఆ తర్వాత ఈ కిట్లు నాసిరకమని తేల్చి, వాటిని వాడొద్దని రాష్ట్రాలకు తెలియజేసింది. చైనా సరఫరా చేసిన వెంటిలేటర్లపై గానీ, వ్యక్తి గత పరిరక్షణ ఉపకరణాలపైగానీ ఎవరికీ ఫిర్యాదులు లేవు. అందరూ కిట్లు, మాస్క్‌లు పరమ నాసి రకమని అంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుని తనను ఆశ్ర యించాయో చైనాకు తెలుసు. ఇప్పటికే వివిధ దేశాల ఆరోగ్య విభాగాల అధికారులు కిట్ల కొను గోలులో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన సామగ్రితో వారందరినీ ఇరుకునపెట్టడమేకాక, ఎదురు దబాయించడం సరికాదని చైనా గుర్తించాలి. ఈ విషయంలో నిజా యతీగా విచారణ జరిపించి, లోటుపాట్లు వెల్లడైతే హుందాగా అంగీకరించడం అంతిమంగా ఆ దేశానికే మేలు కలిగిస్తుంది. -
భారత్ గౌరవిస్తుందని ఆశిస్తున్నాం: చైనా
న్యూఢిల్లీ: తమ దేశానికి చెందిన కంపెనీల కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్లను వాడొద్దన్న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సూచనలపై చైనా స్పందించింది. వైద్య పరికరాల నాణ్యత విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న రాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరుపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఐసీఎంఆర్‌తో చైనా రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. ఈ క్రమంలో త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి.. తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఆ రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు చైనా రాయబారి జీ రోంగ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. (అదే ఆమె ప్రాణాలు తీసింది: ఓ తండ్రి భావోద్వేగం) కాగా గువాంగ్జో వండ్ఫో బయోటెక్, జుహాయ్ లివ్సోన్ డయాగ్నస్టిక్స్ అనే రెండు చైనా కంపెనీలకు చెందిన రాపిడ్ టెస్టింటు కిట్లు కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు ఇవ్వడం లేదని ఐసీఎంఆర్ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు కంపెనీల నుంచి కిట్లు కొనవద్దని, ఒకవేళ ఇప్పటికే వాటిని ఉపయోగిస్తున్నట్లయితే వాడకం ఆపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో సదరు కంపెనీలకు ఇంతవరకు చెల్లింపులు జరుపలేదని.. ఇకపై ఒక్క పైసా కూడా చెల్లించబోమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ విషయంపై స్పందించిన జీ రోంగ్... ఆ రెండు కంపెనీల టెస్టింగ్ కిట్లకు చైనా జాతీయ వైద్య ఉత్పత్తుల పాలనావిభాగం(ఎన్ఎంపీఏ) నుంచి సర్టిఫికేషన్ లభించిందని పేర్కొన్నారు.(చైనాపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ : ట్రంప్) అదే విధంగా భారత్‌లోని పుణెలో గల జాతీయ వైరాలజీ సంస్థ వీటిని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. రాపిట్ టెస్టింగ్ కిట్ల స్టోరేజీ, రవాణా, వాడకంలో జాగ్రత్తలు పాటించకపోయినట్లయితే అది కిట్ పనితీరుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది చైనా ఉత్పత్తులు నాసిరకానికి చెందినవని కొంతమంది అనుచిత, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చైనా గుడ్‌విల్, సిన్సియారిటీని భారత్ గౌరవిస్తుందని ఆశిస్తున్నాం. వాస్తవాలను గమనించి చైనా కంపెనీలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఉంది. వైరస్లు మానవాళి ఉమ్మడి శత్రువులు. మనమంతా ఒక్కటిగా పోరాడితేనే కోవిడ్-19పై విజయం సాధించగలం. ఈ పోరులో బారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. సమస్యలు అధిగమించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారికి తోడుగా నిలుస్తాం’’అని జీ రోంగ్ వ్యాఖ్యానించారు. -
చైనా కిట్లలో అత్యంత నాణ్యత ఉంది..
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్ టెస్టింగ్ కిట్స్’ అత్యంత నాణ్యత కలిగి ఉన్నాయని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రాన్ వెల్లడించారు. వైద్యానికి సంబంధించిన రాపిడ్ టెస్టింగ్ కిట్లను ఎగుమతి చేయడంలో నాసిరకం ఉత్పత్తులను చైనా ఎప్పుడూ ప్రోత్సహించదని ఆయన చెప్పారు. అదేవిధంగా చైనా నుంచి భారత ఉన్నతాధికారులకు ఎటువంటి అత్యవసర సాయమైన అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (వాటిని రెండ్రోజులు వాడొద్దు) భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టింగ్ కిట్లను చైనా నుంచి భారత్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్ ద్వారా జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) రెండు రోజుల పాటు ఆ కిట్లను వాడవద్దని మంగళవారం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. Noticed reports concerning rapid testing kits. #China attaches great importance to the quality of exported medical products. Will keep close communication with #Indian concerned agency and provide necessary assistance. — Ji Rong (@ChinaSpox_India) April 21, 2020 -
కోవిడ్ 19: ఆ కేసులు పెరగడంపై గుబులు..
సాక్షి, న్యూఢిల్లీ : వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించని వారిలో కరోనా మహమ్మారి విస్తృతంగా పెరగడం వైద్య నిపుణులను ఆందోళనలో ముంచెత్తుతోంది. పాజిటివ్ కేసుల్లో 83 శాతం కేసుల్లో ఆయా రోగులకు వ్యాధి లక్షణాలు లేవని ఐసీఎంఆర్ వెల్లడించింది. పాజిటివ్ కేసుల్లో తమకు వ్యాధి సోకిందని తెలియని వారు అధికంగా ఉండటంతో అప్పటికే మహమ్మారి బారినపడిన వారు వైరస్‌ను సైలెంట్‌గా వ్యాప్తి చేస్తున్నారనే గుబులు మొదలైంది. ఇలాంటి వారితో సమస్యలు తలెత్తడంతో ఇంటింటి సర్వే ద్వారా వయసు మళ్లిన వారికి, హైరిస్క్ వ్యక్తులకు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించే ప్రక్రియ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నదని, నిర్ధేశిత లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదని మరికొందరు నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 80 మందికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని ఐసీఎంర్ చీఫ్ ఎపిడెమాలజిస్ట్ రామన్ ఆర్ గంగాకేడ్కర్ పేర్కొన్నారు. భారీ జనాభా ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మాస్ టెస్టింగ్‌కు ఐసీఎంఆర్ అధికారులు సిఫార్సు చేయకపోయినా ఇంటింటి సర్వే మోడల్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. పోలియో తరహాలో ఇంటింటి తనిఖీ కరోనా మహమ్మారి నిరోధానికి చేపట్టవచ్చని, మూకుమ్మడి పరీక్షలు మాత్రం మనదేశంలో సాధ్యం కావని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆలోచన ప్రాథమిక దశలోనే ఉందని ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. చదవండి : డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది దేశంలో ప్రస్తుతం విదేశాల్లో ప్రయాణించి వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు ఉన్నవారికి, లాబ్ల్లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి, లక్షణాలు కనిపించిన వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు తీవ్ర శ్వాససంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, హాట్‌స్పాట్స్, కంటెయిన్మెంట్ క్లస్టర్స్‌లో వైరస్ లక్షణాలు కనిపించిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలియకుండా వైరస్‌ను వ్యాప్తి చేసే వారు సమాజానికి ప్రమాదకరమని జపాన్, ఇటలీ, దక్షిణ కొరియా, అమెరికాలో చేపట్టిన పలు తాజా అథ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. -
కరోనా పరీక్షల్లో ఎందుకింత ఆలస్యం ?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రజలు ‘లాక్డౌన్’ను శిరసావహిస్తూ ఇంటికి పరిమితమైతే సరిపోదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రోజుకు వేల చొప్పున, లక్షల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కరోనా బాధితులను అతి త్వరగా గుర్తించడం అత్యవసరం. అందుకు వేగంగా రక్త పరీక్షలు నిర్వహించే వైద్య పరికరాలు అంతకన్నా అవసరం. కరోనా స్వల్ప లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఆర్టి–పీసీఆర్ (రివర్స్ ట్రాన్సిక్రిప్టేస్ పొలిమెరేస్ చెయిన్ రియాక్షన్ టెస్ట్) నిర్వహించే కిట్స్ మొదటి విడతగా చైనా నుంచి ఐదు లక్షలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించడం ముదావహం. ( దానిపై చర్చలు అనవసరం: యడియూరప్ప ) ఈ కిట్ల కోసం భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్చి 30వ తేదీన చైనాకు ఆర్డర్ ఇచ్చింది. అవి ఏప్రిల్ 5న భారత్‌కు రావాల్సి ఉంది. యూరప్‌కు ఎగుమతి చేసిన టెస్టింగ్ కిట్స్‌లో సమస్యలు ఉత్పన్నమయ్యాయంటూ అక్కడి నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అలాంటి పొరపాట్లు పునరావృతం కారదనే ఉద్దేశంతో చైనా అధికారులు కిట్స్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఎగుమతి చేయడంతో ఆలస్యమైంది. ఈలోగా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చైనా, యూరప్ దేశాల నుంచి ఈ కిట్ల కోసం విడి విడిగా ఆర్డర్లు ఇచ్చాయి. ఇంతవరకు ఏ రాష్ట్రానికి కూడా ఈ కిట్లు పూర్తిగా అందిన దాఖలాలు లేవు. కాస్తా ముందు చూపు ఉన్నట్లయితే భారత్‌లోనే ఈ కిట్లను ఈపాటికే ఉత్పత్తి చేసుకొని ఉండేవాళ్లం. భారత్‌లో తొమ్మిది కంపెనీలు అసెంబుల్ చేసిన టెస్టింగ్ కిట్స్ పరీక్షించి వాటికి అనుమతి జారీ చేయడానికి పుణేలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలోజీ (ఎన్ఐవీ)’ ప్రభుత్వ ల్యాబ్‌కు ఆలస్యమయింది. ఆర్డర్ ఇచ్చినప్పటికీ లైసెన్స్‌లు మంజూరవడానికి మరింత ఆలస్యమైంది. అందుకు సంక్లిష్టమైన క్రమబద్ధీకరణ నిబంధనలతోపాటు ఇతర కారణాలు ఉన్నాయి. ( సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే.. ) రాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం కేంద్ర ప్రభుత్వ కంపెనీ అయిన ‘హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్’ సంస్థకు ఎన్ఐవీ ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. 14 రోజులు కావస్తున్నా నేటికి కంపెనీ టెస్టింగ్ కిట్ల ఉత్పత్తిని ప్రారంభించలేక పోయిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని హెచ్ఎల్ఎల్ కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. వీటి ఉత్పత్తి కోసం ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ నుంచి హెచ్ఎల్ఎల్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. భారత్‌లో డ్రగ్స్, డయోగ్నస్టిక్స్ తయారీకి, ఎగుమతి, దిగుమతుల వ్యవహారాలను పూర్తిగా డ్రగ్ కంట్రోలర్ కార్యాలయమే చూసుకుంటుంది. తమకు ఉత్తర్వులు అందిన మరుసటి రోజే లైసెన్స్ కోసం డ్రగ్ కంట్రోలర్‌కు దరఖాస్తు చేసుకున్నామని ఏప్రిల్ 13వ తేదీన లైసెన్స్ మంజూరయిందని హెచ్ఎల్ఎల్ అధికారులు చెబుతున్నారు. టెస్టింగ్ కిట్ల ఉత్పత్తికి ఎన్ఐవీ నుంచి ఆర్డర్లు పొందిన ప్రైవేటు కంపెనీలకు లైసెన్స్ మంజూరు చేయడంలో కూడా తీవ్ర ఆలస్యమైంది. ఇదే విషయమై భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ వీజీ సోమనిని మీడియా సంప్రతించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. తొలుత కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలు టెస్టింగ్ కిట్ల కోసం భారత వైద్య పరిశోధనా మండలికన్నా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందుగా స్పందించాయి. కర్నాటక మార్చి 29వ తేదీనే లక్ష కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో వరుసగా రాష్ట్రాలు స్పందించి కిట్ల కోసం ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాయి. రాజస్థాన్ లక్షా పాతిక వేల కిట్ల కోసం, కేరళ రెండు లక్షల కిట్ల కోసం చైనా కంపెనీలకు ఆర్డర్లు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మేరకు దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఒకేసారి ఏకంగా లక్ష టెస్టింగ్ కిట్లను తెప్పించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగా తాను పరీక్షించుకోవడం ద్వారా కరోనా పరీక్షలకు శ్రీకారం చుట్టగా ఇప్పుడు వాటిని జిల్లాల వారిగా పంపించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ కార్యాలయం ఏప్రిల్ 16వ తేదీ నాటికి 66 రకాల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కోసం మొత్తం 49 స్వదీశీ, విదేశీ కంపెనీలకు లైసెన్స్‌లు మంజూరు చేసింది. భారత దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30వ తేదీన బయట పడగా, జనతా కర్ఫ్యూను మార్చి 22వ తేదీన అమలు చేయగా, మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా పరీక్షల కిట్ల కోసం మార్చి 30 వ తేదీన ఆర్డర్ ఇచ్చారు. ఎందుకింత ఆలస్యం ? భారత్ ఉష్ణ మండల దేశం కనుక ఏమీ కాదనే ధీమా కారణమా? అల్లం, వెల్లుల్లి, పసుపు లాంటి రోగ నిరోధక పదార్థాలను వాడే భారతీయులకు ఏమీ కాదనే అతి విశ్వాసం కారణమా ? కంట్రోలర్ జనరల్ ఆలస్యంగా స్పందించడానికి సంక్లిష్ట నిబంధనల ప్రక్రియ కారణమా? మరింకేమైన కారణాలు ఉన్నాయా? ఏదేమైనా జరగాల్సిన ఆలస్యం జరిగిందీ, ఇప్పటికైనా వేగంగా ముందుకు వెళ్లాల్సిందే. లేకపోతే ఆలస్యం విషమవుతుంది. -
పాక్ అణు క్షిపణి పరీక్ష
ఇస్లామాబాద్: భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్–1’ను పాక్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం పరీక్షించిన ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. భారత్ కూడా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణితో పాటు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని–2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. -
ఫేస్బుక్ కూడా ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. సోషల్ నెట్ వర్క్‌లో కస్టమర్లు నిజమైన పేర్లను ఉంచేలా నియోగదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇండియాలో వినియోగదారులకు ఆధార్ కార్డు ప్రకారం పేర్లను ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. చాలా పరిమితంగా ప్రస్తుతానికి దీన్ని టెస్ట్ చేస్తున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. తాము పరీక్షిస్తున్న ఈ ఫీచర్ ఒక ఐచ్ఛిక ప్రాంప్ట్ అని , ఆధార్ కార్డుపై పేరును తప్పనిసరిగా నమోదు చేయవలసిన అవసరం లేదని ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే తాజా చర్య ప్రకారం ఫేస్బుక్ లో కొత్తగా అకౌంట్ తెరిచే వారు ఆధార్ కార్డులో ఉన్న పేరు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ కాకుండా ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరును పేర్కొనాలని సూచిస్తోంది. ఇది కూడా కొందరికి మాత్రమేనని, తప్పనిసరి కాదని ఫేస్బుక్ స్పష్టం చేసింది. తద్వారా ఫేస్బుక్ యూజర్లు స్నేహితులు, బంధువులు మిమ్మల్ని గుర్తించడం సులభమవుతుందని అంటోంది. కాగా పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్లతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేసింది. ఈ లింకింగ్కోసం కొంత గడువును కూడా ఇచ్చింది. అయితే ఆధార్ లింకింగ్ ప్రక్రియపై వివాదం, ఇటీవ సుప్రీంకోర్టు ఆధార్ అనుసంధాన సమయం పొడిగింపు అంశాలు తెలిసిన సంగతే. -
సిలబస్‌పై సమ్మెటివ్!
♦ సజావుగా సమ్మెటివ్ పరీక్షలు జరిగేనా? ♦ సకాలంలో సిలబస్ పూర్తికావడం కష్టమే ♦ ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ♦ సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న సమ్మెటివ్ పరీక్షలు ♦ సిలబస్ పూర్తయిన మేరకే ప్రశ్నాపత్రాలను తయారుచేయాలి ♦ ఉపాధ్యాయ సంఘాల వినతి పాఠశాల స్థాయిలో చూస్తేనేమో సిలబస్ పూర్తికాలేదు. మరి ప్రభుత్వమేమో సమ్మెటివ్ పరీక్షలంటుంది. ఇటు సిలబస్ పూర్తికాక, అటు తరగతులు జరగక రెండింటి మధ్య విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటప్పుడు విద్యార్థులు పరీక్షలను ఎలా రాస్తారో ఏమో అధికారులకే తెలియాల్సి ఉంది. నిబంధనల ప్రకారం పాఠశాల తెరిచిన రెండున్నర, మూడు నెలల తర్వాత సమ్మెటివ్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియతోనే సమయం గడిచిపోయింది. మరి సమ్మెటివ్ పరీక్షలను విద్యార్థులు ఎలారాస్తేరో వారికే ఎరుక సుమా. పరీక్షలంటే ఉపాధ్యాయులు సైతం ఆందోళన చెందడం ఇక్కడ కొసమెరుపు. కడప ఎడ్యుకేషన్ : అటు విద్యార్థుల్లోనూ, ఇటు ఉపాధ్యాయుల్లోనూ సమ్మెటివ్ పరీక్షల టెన్షన్ ఎక్కువైంది. మరో 20 రోజుల్లో పరీక్షలు ఉండటంతో సిలబస్‌పై భయం మొదలైంది. పరీక్షల నాటికి ఎట్లాగైనా సిలబస్ పూర్తిచేయాలని అధికారులు వెంటపడుతుండటంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వరుస పండగలు, సెలవుల నేపథ్యంలో బోధన కదలని పరిస్థితి. సిలబస్ లక్ష్యం పూర్తిపై ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బోధన గాడితప్పడానికి బదిలీలే కారణమని సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలు ప్రారంభమైన జూన్ నెల నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ ఉపాధ్యాయులు బదిలీల గొడవల్లో మునిగి తేలారు. బదిలీల కోసం దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఎవరెవరికి ఏ పాఠశాల వస్తుంది, ఏ పాఠశాల అయితే బాగుంటుంది ఇలా తర్జనభర్జలలో అయ్యవార్లు బిజిబిజీగా గడిపారు. దీంతో జూన్ 12 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ జరిగిన అయ్యవార్ల బదిలీల గొడవలో విద్యార్థుల చదువులు అటకెక్కాయి. బదిలీల ప్రక్రియలో భాగంగా వరుసగా స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు, పీడీలు, ఎల్పీలు, ఎస్జీటీల స్థానచలనాలు మొత్తం ఈనెల 10వ తేదీ వరకు సాగాయి. వరుసగా సెలవులు మొదటగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఆగస్టు 1వ తేదీన వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరిపోయారు. ఆతర్వాత ఎస్జీటీలు మిగతా ఉపాధ్యాయులు ఆగస్టు 11న తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరిపోయారు. తీరా విధుల్లో చేరిన వారం పదిరోజులకే మళ్లీ నాలుగు రోజులపాటు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. తర్వాత తిరిగి పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు నాలుగు రోజులు పాఠాలు చెప్పాగానే మళ్లీ ఆదివారం వచ్చింది. తిరిగి 21, 22 తేదీలలో ఉపాధ్యాయులకు టెలీ కాన్ఫరెన్సు పేరుతో రెండు రోజులు కాలాన్ని హరించేశారు. బోధనపై దృష్టిసారించేలోపు మళ్లీ శుక్రవారం రోజు వినాయక చవితి శనివారం అదివారం ఇలా రోజులన్నీ సెలవులతో ముగిసిపోనున్నాయి. మరేమో ఇచ్చేనెల 11వ తేదీ నుంచి 1 నుంచి 9వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు సమ్మెటివ్ పరీక్షల నిర్వాహణ ప్రభుత్వం తేదీని ప్రకటించింది. సిలబస్ చూస్తే పదిశాతం కూడా పూర్తి కాని పరిస్థితి. బోధన అంతంతమాత్రమే. సమ్మెటివ్ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఈ 20 రోజులు సెలవులు లేకుండా బోధన సాగితేనే కొంతైనా విద్యార్థులు పరీక్షలు రాయగలరు. మరి ఉపాధ్యాయులు అంత బాధ్యతగా సిలబస్ పూర్తి చేస్తారా.. అనేది అనుమానామే. మరి అధికారులు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే. కాగా పూర్తయినంత సిలబస్ మేరకే సమ్మెటివ్ ప్రశ్నపత్రాలను ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత జిల్లాలో ఇంకా కొన్ని పాఠశాలల్లో సజ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇందులోభాగంగా హిందీకి సంబంధించి 28 మంది, తెలుగుకు 44 మంది, సోషల్‌కు 35 మంది, గణితానికి 15మంది, ఫిజికల్ సైన్సుకు ఐదుగురు, బయలాజికి 15 మంది చొప్పున ఉపాధ్యాయుల కొరత ఉంది. -
రోడ్లపైకి ఎలక్ట్రానిక్ దిగ్గజ కార్లు
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెస్టింగ్ పై టెక్ దిగ్గజాలన్నీ పోటీపడి మరి ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్స్ తెచ్చుకుంటున్నాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ల రారాజు, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దృష్టిసారించింది. వీటి టెస్టింగ్ కు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా తెచ్చేసుకుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెస్టింగ్ కోసం ఆమోదం తెచ్చుకున్న తొలి ఎలక్ట్రానిక్స్ దిగ్గజంగా శాంసంగ్ పేరులోకి వచ్చింది. దీంతో ఈ కంపెనీ దక్షిణ కొరియా రోడ్లపై సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను చక్కర్లు కొట్టిచనుంది. హ్యుందాయ్, కియా లాంటి కార్ల కంపెనీలకు ఇప్పటికే భూమి, మౌలికసదుపాయాలు, రవాణా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. సెన్సార్స్, కెమెరాలతో వీటి టెస్టింగ్ ను శాంసంగ్ కంపెనీ చేపట్టనుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అడ్డంకులు ఎదురైనప్పుడు వాహనాలను ఎలా నడపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా కంపెనీ అధ్యయనం చేయనుంది. స్వయంప్రతిపత్త డ్రైవింగ్ టెక్నాలజీపై కంపెనీ 2015లోనే ఓ బిజినెస్ యూనిట్ ను ప్రారంభించింది. 2016 నవంబర్ లో కనెక్టెడ్ కార్ల కోసం సాఫ్ట్ వేర్ పరికరాలను అభివృద్ధి చేసే అమెరికా సంస్థ హర్మాన్ ను శాంసంగ్ 8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. పెద్ద పెద్ద టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, ఆపిల్, బైడూ, సంప్రదాయ కారు తయారీ సంస్థలు జీఎం, ఫోర్డ్, రైడ్ హైలింగ్ స్టార్టప్ ఉబర్, దీదీలు ఇప్పటికే డ్రైవర్ లెస్ కారు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నాయి. -
19న జిల్లాస్థాయి హిందీ వ్యాసరచన పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ : హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో ఈనెల 19న హిందీ మాధ్యమంలో ‘దక్షిణ్ భారత్ మే హిందీకీ ఆవశ్యకత’ అనే అంశంపై పాఠశాల స్థాయి విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు హిందీ సేవా సదన్ వ్యవస్థాపకుడు ఎస్.గైబువల్లి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పేర్లను కార్యాలయంలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. 6,7 తరగతులను జూనియర్స్ విభాగం, 8,9 తరగతులను సీనియర్స్ విభాగంగా విభజించబడునని తెలిపారు. జూనియర్స్ విభాగం వారికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సీనియర్స్ విభాగానికి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు సెల్ : 98487 83787, 95813 86150లో సంప్రదించాలన్నారు. -
ఆల్ ద బెస్ట్!!
పిల్లలు పరీక్షలకు రెడీ.. ఆల్ ద బెస్ట్!! పేరెంట్స్ చెయ్యాల్సిందంతా చేశారు! స్ట్రెస్ లేకుండా.. స్ట్రెస్ ఇవ్వకుండా పిల్లల్ని పరీక్షలకు పంపించండి! ఆల్ ద బెస్ట్!! పిల్లల పరీక్షలు తల్లిదండ్రులకు పెద్ద పరీక్షే. పిల్లలు ఎలాగూ కష్టపడుతున్నారు. పెద్దల యాంగ్జయిటీ అంతా ‘మనం కూడా కష్టపడుతున్నామా’ అన్నదే. పిల్లల పరీక్షల్లో భాగస్వాములుగా కాకపోతే ఫెయిలవుతామేమో అన్న భయం. ‘ఆ ఫార్మూలా గుర్తుంటుందా?’, ‘ఏ కాంటినెంట్ పక్కన ఆఫ్రికా ఉందో జ్ఞాపకం ఉంటుందా?’, ‘ఏ ప్లస్ బి హోల్‌స్క్వేర్ ఎంత?’, ‘సెకండ్ టైమ్ రివిజన్ కంప్లీట్ అయిందా?’ , ‘పొద్దున మూడింటికి అలారమ్ పెట్టి లేపుతాను సరేనా?’ .. పిల్లలకు ఇవ్వన్నీ చెప్పాలంటే పేరెంట్స్ ఎంతగా ప్రిపేర్ కావాలి? ప్రిపేర్ అయ్యేది పేరెంట్స్.. పరీక్ష రాసేది పిల్లలు. పిల్లలు మంచి మార్కులతో పాసవ్వాలనే యాంగ్జయిటీలో ఒక్కోసారి పిల్లల్ని కూడా యాంగ్జయిటీకి గురిచేస్తున్నారు. పిల్లల్లో లేని భయాన్ని సృష్టిస్తున్నారు. దాంతో జవాబులన్నీ తెలుసుండీ కూడా ఆన్సర్ పేపర్ ముందుకు వెళ్లేసరికి బ్లాంక్ అయిపోతున్నారు పిల్లలు. అందుకు పిల్లలకు కొంచెం ఊపిరాడే చోటిస్తే బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు. పిల్లలూ అదే కోరుకుంటున్నారని తెలిసింది.. ఓ సోడా కంపెనీ తన సీఎస్సార్ కింద చేసిన ఓ డిజిటల్ ప్రమోషన్లో. ఇందులో పెద్దలు పెట్టిన ఒత్తిడితో సతమతమవుతున్న çపధ్నాలుగు, పదిహేనేళ్ల వయసు పిల్లలు.. పెద్దల నుంచి తాము ఎలాంటి మద్దతును ఆశిస్తున్నారో తెలుపుతూ తమ తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. చూస్తుంటే.. వింటుంటే.. హృదయం ద్రవిస్తోంది. ఆ ఉత్తరం ముక్కలను మీకోసం పట్టుకొచ్చాం.. ఒక్కసారి చదవండి! పిల్లల మనసు అర్థమవుతుంది! మీ స్ట్రెస్ చూస్తుంటే నర్వస్‌గా ఉంటుంది.. ప్రియమైన అమ్మా, నాన్నకు.. నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అయినా చదువు విషయంలో మీ ప్రవర్తన నాకు అర్థంకాదు. ఫ్రెండ్స్‌తో కలవనివ్వరు. ఆడుకోనివ్వరు. ఓ బందీలా చూస్తారు. ఎందుకమ్మా? ఎందుకు నాన్నా? నాకు పరీక్షలొస్తున్నాయంటే మీరు స్ట్రెస్ ఫీలవుతారు. మీ స్ట్రెస్ చూస్తుంటే నాకు నర్వస్‌గా ఉంటుంది. మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమంటే నాకు చాలా కన్సర్న్ నాన్నా.. అమ్మా! కాని కొన్నిసార్లు, కొన్ని విషయాల్లో నన్ను వదిలేయండి. నన్నుగా ఉండనివ్వండి. ప్లీజ్! జీవితంలో మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గించను. నన్ను కన్నందుకు మీరు గర్వపడేలా చేస్తాను. ఇట్లు మీ కూతురు కేసంగ్ నన్ను నమ్మండి ప్లీజ్ డియర్.. అమ్మా అండ్ అప్పా.. ఏ విషయంలోనైనా నాకెంత బెరుకు, భయమో మీకు తెలుసు. ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకొని మీకు ఈ ఉత్తరం రాస్తున్నా. కిందటేడాది నేను మంచి మార్కులు తెచ్చుకోలేదు. కాని ఈసారి మార్కుల కోసం బాగా కష్టపడుతున్నా. టీవీలో ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచెస్ చూడాలనుకుంటా. వాటితో రిలాక్స్ అవాలనుకుంటా. నా ప్రెషర్ తగ్గించుకోవాలనుకుంటా. కాని మీరు పరీక్షల కోసం టీవీ కనెక్షన్ కట్ చేయించారు. దయచేసి నన్ను అర్థంచేసుకోండి! నేను బాగా చదువుతున్నాను. నన్ను నమ్మంyì ప్లీజ్! మీ ప్రవర్తన వల్ల చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నా. ఎవరితో మాట్లాడకుండా బాత్రూమ్లోకి వెళ్లి తలుపేసుకొని నన్ను నేను బంధించుకోవాలనిపిస్తోంది. మనింటిని నార్మల్ హౌజ్లా ఉంచడమ్మా...! ఇట్లు మీ అబ్బాయి కార్తిక్ ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా.. ప్రియమైన నాన్నకు.. నాకు ఎగ్జామ్స్ అంటే భయంలేదు. మీరంటేనే భయమేస్తోంది. ఎంతలా అంటే మిమ్మల్ని తలచుకుంటే ధైర్యం రావాల్సింది పోయి కళ్లల్లో నీళ్లొస్తున్నాయి. అందరిముందు నిషి ఆంటి కూతురుతో నన్ను కంపేర్చేయొద్దు ప్లీజ్! నన్ను నాలా ఉండనివ్వండి నాన్నా! నువ్ అనుక్షణం నా గురించే ఆలోచిస్తూ.. నాతోనే ఉన్నా నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యమే నాకు రావడంలేదు నాన్నా.. నిన్ను తలచుకుంటేనే భయమేస్తోంది. ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా.. మీ లవింగ్ డాటర్ నిఖిత భయమేస్తోంది.. ప్రియమైన అమ్మా, నాన్నకు.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. భయమేస్తోంది. సరిగ్గా రాయలేనేమో అని కాదు.. మీరు నామీద పెట్టుకున్న అంచనాలను తలచుకుంటే భయమేస్తోంది. నా చదువు పట్ల మీరెంత శ్రద్ధ పెడుతున్నారో నాకు తెలుసు. కానీ నేనూ అంతే కష్టపడుతున్నానని మీకెందుకు అర్థంకావట్లేదమ్మా? ఎంత చదువుతున్నా.. ఎన్ని మార్క్స్ వస్తున్నా ఇంకా చదవట్లేదనే తిడ్తున్నారు. తట్టుకోలేకపోతున్నానమ్మా.. అందుకే పరీక్షలు వస్తున్నాయంటే భయమేస్తోంది! మీ ఒత్తిడికి ఊపిరాడనట్టవుతోంది. స్కూల్ నుంచి, మీ నుంచి పారిపోవాలనిపిస్తోంది. ప్లీజ్ నన్ను డిమోటివేట్ చేయొద్దమ్మా! నా మానాన నన్ను చదవనివ్వండి. మీరు తలెత్తుకునేలా చేస్తాను. ప్రామిస్! లవ్ యూ మా.. లవ్ యూ పా..! ఇట్లు మీ కూతురు అనీష మార్కులు తప్ప జీవితమే లేనట్టు... డియర్ మదర్.. నాతో నువ్వెప్పుడూ మార్కులు, కాంపిటీషన్ గురించే మాట్లాడతావ్! నువ్వు చెప్పినన్ని మార్కులు తెచ్చుకోకపోతే.. టాపర్స్‌తో కంపీట్ చేయలేకపోతే ఇక నా లైఫ్ వేస్ట్ అన్న ఫీలింగ్‌ను కలిగిస్తున్నావ్! మార్కులు తప్ప నాకు ఇక లైఫే లేదన్న ఫీల్ వస్తోందమ్మా..! జీవితమంటే మార్కులేనా అమ్మా...? నువ్వు, నాన్న .. నాతో ఒక్కసారి కూడా నెమ్మదిగా మాట్లాడరు. మార్కుల గురించి కాక ఇంకో టాపిక్ తీసుకురారు. మీరనుకున్నదానికంటే ఒక్క మార్క్ తక్కువైనా నా మీద గట్టిగట్టిగా అరుస్తారు. తిడ్తారు. మీరు తిట్టిన రాత్రిళ్లు ఒక్క క్షణం కూడా నాకు నిద్ర ఉండదు తెలుసా అమ్మా.. ! నువ్వు నామీద అరిచిన ప్రతిసారీ నాకెంతో దూరమైపోయినట్టు.. నువ్వో కొత్త మనిషిలా కనిపిస్తావమ్మా! ఆ క్షణంలో నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. కడుపులో తిప్పుతుంది. వామ్టింగ్ వచ్చినట్టువుతుంది. అమ్మా.. నేను బాగా చదువుతానమ్మా.. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను తిట్టొద్దమ్మా! మీ కూతురైనందుకు చాలా గర్వంగా ఉంది. నాకోసం ఇంతగా కష్టపడుతున్నందుకు మీకెప్పుడూ రుణపడి ఉంటా. మీ గౌరవం నిలబెడ్తా. ఇట్లు మీ చిట్టితల్లి టీనా మైడియర్ పేరెంట్స్.. పది గంటలపాటు ఒక్క ఉదుటున.. కుదురుగా కూర్చోని చదివేంత ఎనర్జి నాకు లేదని మీకు తెలుసు. అయినా ఎటూ కదలనివ్వకుండా నా గదిలో కూర్చోబెట్టి చదివిస్తుంటారు. పైగా అరగంటకు ఒకసారి వచ్చి చెక్ చేస్తుంటారు నేను కుదురుగా ఉన్నానో లేదోనని. ఇదంతా నాకు చాలా బాధగా ఉంది. మీరలా చేయడం వల్లే నేను నా కాన్సంట్రేషన్‌ను కోల్పోతున్నాను. అమ్మా... నాన్నా.. ప్లీజ్ మాటిమాటికి నా సిన్సియారిటీని చెక్ చేయకండి! నా కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయకండి.ప్లీజ్... ఇట్లు మీ అబ్బాయి అన్షుల్ ఇవి ఉత్తరాలు కావు.. పసి హృదయాల ఆవేదనకు అక్షర రూపాలు. టీనేజర్స్‌లో అంతకంతకు పెరుగుతున్న డిప్రెషన్, సూసైడల్ టెండన్స్లకు కారణం పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే ఒత్తిడేనని ఎన్నో నివేదికలు, మానసిక విశ్లేషణలూ ఘోషిస్తున్నాయి. ఈ తరమే రేపటి మన దేశ బంగారు భవిష్యత్తు. వాళ్ల అభ్యర్థనను అర్థం చేసుకుందాం. మన పిల్లల్ని కాపాడుకుందాం! మార్కుల మిల్లుల్లా కాదు మానవత్వమున్న మనషుల్లా పెంచుకుందాం! -
నీటి పరీక్షలే కీలకం
అనంతపురం అగ్రికల్చర్ : మారుతున్న వ్యవసాయ సాగు పద్ధతుల్లో నీటి పరీక్షలకు ప్రాధాన్యత ఏర్పడిందని స్థానిక మట్టి, నీటి, విత్తన పరీక్షా కేంద్రం (ఎస్టీఎల్) ఏడీఏ ఎం.కృష్ణమూర్తి తెలిపారు. పంటలు బాగా పండాలంటే మట్టి, నీరు, పత్ర విశ్లేషణ లాంటి పరీక్షలు చేయించుకొని, వాటి ఫలితాల ఆధారంగా సమగ్ర పోషక, నీటి, సస్యరక్షణ చర్యలు చేపడితే పెట్టుబడి ఖర్చులు తగ్గి పంట దిగుబడి పెరుగుతాయని తెలిపారు. నీటి పరీక్ష ఆవశక్యత : నీటి పరీక్షల ఫలితాల ఆధారంగా పంటల ఎంపిక, వాటి దిగుబడులు ఆధారపడి ఉంటాయని ఏడీఏ తెలిపారు. మట్టి పరీక్షలు, ఫలితాలు, ఎరువుల వాడకం గురించి ఇటీవల రైతుల్లో అవగాహన పెరిగినా నీటి పరీక్షల గురించి తెలియడం లేదన్నారు. పెరుగుతున్న నీటి కొరత, భూమి లోపల పొరల నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం వల్ల ఎక్కువ లవణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకు హానికరమవుతున్నాయన్నారు. దీని వల్ల పంటలు సరిగా ఎదగకపోవడమే కాక నేలలు కూడా చెడిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా సాగునీటిని పరీక్ష చేయించిన తర్వాత వాడుకోవడం మంచిదని, మట్టి, నీళ్ల శ్యాంపిల్స్ ఎప్పుడు తీసుకొచ్చినా సకాలంలో ప్రయోగశాలలో పరీక్షించి వాటి ఫలితాలను ఆన్లైన్ చేసి, హెల్త్‌కార్డు పేరుతో రైతుకు వివరాలు అందజేస్తామన్నారు. నీటి సేకరణ : నీళ్లకు ఎక్కడి పడితే అక్కడ ఎలా అంటే అలా తీసుకురాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ తెలిపారు. మొదట బోరుబావి నీటిని సుమారు 20–30 నిమిషాలు వదలిపెట్టాలన్నారు. ప్లాస్టిక్ సీసాలో అర లీటర్ నీటిని సేకరించాలి. వీలైనంత వరకు గాజు సీసా బదులు ప్లాస్టిక్ సీసాలను వాడాలని, పురుగు మందులు, టానిక్‌లు, మద్యం సీసాలను వాడకూడదని ఏడీఏ తెలిపారు. నీటి నమూనాను తీసే సీసాను అదే నీటితో రెండు మూడు సార్లు బాగా కడిగిన అనంతరం నీరు నింపుకుని రావాలన్నారు. కాలువలు లేదా చెరువులు నుంచి నీటి నమూనా తీసేటప్పుడు ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్‌ను కట్టి ఒడ్డుకు దూరంగా నీటిని తీయాలన్నారు. ఆ నీటితో సీసాను రెండు మూడు సార్లు కడిగి ఆ తరువాత నమూనాతో నింపాలన్నారు. సాగునీటి నాణ్యత పరీక్ష కోసం నమూనాను వెంటనే చేరేటట్లు సమీప భూసార పరీక్ష కేంద్రానికి పంపాలన్నారు. నమూనాతో పాటు రైతు పేరు, సర్వే నంబరు, బోరు లేక కాలువల వివరాలు, గ్రామం, మండలం తదితర విషయాలు తెలియచేయాలన్నారు. సేకరించిన రోజే పరీక్షా కేంద్రానికి అందజేయాలని ఏడీఏ చెప్పారు. -
నాణ్యతపై ‘యంత్ర’దండం
ఆర్అండ్బీ రహదారుల దృఢత్వం గుర్తింపునకు జిల్లాకు వచ్చిన అత్యాధునిక వాహనం కాకినాడ సిటీ : వేసిన రోడ్లు కొద్ది కాలానికే గోతులమయమవుతున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? కాంట్రాక్టర్లు నాణ్యత పాటించడం లేదా? అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందా?అసలు రోడ్లలో దృఢత్వమెంత..? తెలుసుకునేందుకు అధునాతన యంత్రాలు జిల్లాకు వచ్చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్అండ్బీ రహదారుల దృఢత్వం ఏ మేరకు ఉందో పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక అత్యాధునిక వాహనం(ఫాలింగ్ డిఫెక్ట్ మీటర్) జిల్లాకు వచ్చింది. సోమవారం ఆ వాహనాన్ని కాకినాడ ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లలోని రహదారులలో డిజిటల్ సర్వే చేయించి గోతులు, ఎత్తు పల్లాలను లేజర్స్ ఉపయోగించి వీడియోగ్రఫీ తీయించామన్నారు. ఇప్పుడు ఈ ప్రత్యేక వాహనం ద్వారా రహదారుల దృఢత్వం, సాయిల్ కండీషన్‌ను గుర్తిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,500 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారుల్లో కిలోమీటరుకు మూడు పాయింట్లతో రోజుకు 50 కిలోమీటర్లు చొప్పున 75 రోజుల పాటు గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. రాష్ట్రంలో రెండు ప్రత్యేక వాహనాలు తిరుగుతున్నాయని వాటిలో ఒకటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చిందన్నారు. -
వాటర్ టెస్ట్ .. వరస్ట్
పల్లెవాసులకు అందని సురక్షిత నీరు పంచాయతీల్లో మూలనపడిన టెస్టింగ్ కిట్లు వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సురక్షితమైన తాగునీరు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇదో సమాధానం లేని ప్రశ్న! అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం అందజేసిన నీటి నమూనా కిట్లు వృథాగా మారి.. పల్లెవాసులకు స్వచ్ఛమైన నీరు అందడం లేదు. ఫలితంగా ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. తూప్రాన్ మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు నీటి పరీక్షలు నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తూప్రాన్: పంచాయతీలకు 2012లో గత ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ఆధ్వర్యంలో వాటర్ టెస్టింగ్ కిట్లు పంపిణీ చేసింది. పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు నీటి నాణ్యత పరీక్షలు సంయుక్తంగా నిర్వహించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పద్ధతి ఎక్కడా కొనసాగకపోవడం గమనార్హం. తూప్రాన్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు నీటి పరీక్షలు నిర్వహించకపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యాధులు మంచుకొచ్చినప్పుడే.. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాలో లోపాలు ఉన్నారుు. భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రజలు వ్యవసాయ బోరుబావుల నుంచి నీరు తెచ్చుకొని తాగుతున్నారు. అవి కలుషితం అవుతుండటంతో విషజ్వరాలబారిన పడుతున్నారు. అటువంటి సందర్భాల్లో మాత్రమే పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎ స్, వైద్యశాఖ యంత్రాంగాలు హడావుడి చ ర్యలు తీసుకుంటున్నారు. తప్పితే సమస్య శా శ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేద న్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. నీటి పరీక్ష కి ట్లను సమర్థంగా వినియోగించుకుంటే ఇలాం టి సమస్యలు రావంటున్నరు గ్రామస్తులు. కిట్లు పడేశారు! నీటి పరీక్షల తర్వాత స్వల్పంగా బ్యాక్టీరియా ఉన్నట్లరుుతే.. ఆ నీటిని కాచి చల్లార్చిన తర్వాత వినియోగించుకోవచ్చు. ఒకవేళ అధిక శాతంలో జలాలు కలుషితమైతే ఆ నీటిని వినియోగించకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో గ్రామ కార్యదర్శులు చర్యలు చేపట్టాలి. ఈ తతంగమంతా భారం అనుకున్నారో? ఏమో? పంచాయతీల్లో కిట్లను మూలన పడేశారు. దీంతో ఒక్కో కిట్‌కు రూ.1200 చొప్పున మండలంలో 22 పంచాయతీలు, జిల్లాలో 46 మండలాల్లో 1,077 గ్రామ పంచాయతీలకు అందించిన కిట్లు వృథాగా మారారుు. ఫలితంగా రూ.12.92 లక్షలు బూడిదలో పోసిన పన్నీరైంది. శిక్షణ ఇచ్చిన చర్యలు శూన్యం ఎక్కడా కిట్లను వినియోగించిన దాఖలాలు లేవు. కిట్ల వినియోగంపై గతంలో మండల కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శి, ఆశా, అంగాన్‌వాడి వర్కర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. కానీ ఉపయోగం మాత్రం శూన్యం. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వాతిని ‘సాక్షి’ఫోన్లో వివరణ కోరగా.. ‘ఇటీవలే తూప్రాన్ మండల బాధ్యతలు స్వీకరించా, గ్రామాల్లో పర్యటించి చర్యలు తీసుకుంటా’అని చెప్పారు. మా ఊళ్ల పరీక్షలు చేయలే మా ఊళ్ల చాలా మంది విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు విషయం తెలిసినా నీటి పరీక్షలు చేయలే. గ్రామానికి సరఫరా చేసిన కిట్లు పంచాయతీలో పడేశారు. పెద్దసార్లు వెంటనే చర్యలు తీసుకోవాలి. - కృష్ణ, గుండ్రెడ్డిపల్లి -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
అసలే పరీక్ష టెన్షన్.. ఆపై భానుడి భగభగలు...అరగంటకోసారి నీళ్లు తాగకపోతే గొంతెడిపోతోంది.. కానీ తొలిరోజు పది పరీక్ష కేంద్రాల్లో చాలా చోట్ల నీళ్లు దొరక్క విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి వెలుతురు లేని సెంటర్లలో ఫ్యాన్లు, బల్బులు ఏర్పాటు చేయక పోవడంతో విద్యార్థులంతా చెమటలు కక్కుతూ పరీక్షలు రాశారు. ఇక చాలా సెంటర్లలో ఈ సారి కూడా నేలబారు పరీక్షలు తప్పలేదు. మరోవైపు సకాలంలో రవాణా సదుపాయూలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం ఎడ్యుకేషన్: ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా పదో తరగతి విద్యార్థులకు కష్టాలు తప్పలేదు. పరీక్షల సమయంలో కరెంటు కోతలు లేకపోయినా... చాలా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించలేకపోయారు. తిరగని ఫ్యాన్లు.. వేసవి తాపంతో విద్యార్థులు కఠిన పరీక్ష రాశారు. సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజు జరిగిన తెలుగు పేపర్-1 పరీక్ష కు 51,092 మంది విద్యార్థులకు గాను 50,765 మంది హాజరయ్యారు. 327 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జరిగింది. తొలిరోజు కావడంతో నిర్ధేశించిన సమయానికి గంట ముందే చాలామంది విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు గదులు వెతుక్కోవడానికి ఇబ్బందులు పడ్డారు. చేతులెత్తేసిన విద్యాశాఖ జిల్లాలోని ప్రతి కేంద్రంలోనూ ఈసారి ఫర్నీచర్ ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు పదేపదే చె ప్పినా, చివరకు చేతులెత్తేశారు. దీంతో వివిధ కేంద్రాల్లో ఫర్నీచర్ లేక విద్యార్థులు నేలమీద పరీక్షలు రాయాల్సి వచ్చింది. కొన్ని సెంటర్లలో ఉదయం వచ్చి నంబర్లు వేయడంతో విద్యార్థులు గదులు వెతుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే వివిధ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బల్లలు చిన్నవి కావడం... ఒక్కో బల్లపై ఇద్దరేసి విద్యార్థులను కూర్చోబెట్టడంతో అసౌకర్యానికి గురయ్యారు. చాలా కేంద్రాల్లో ఫ్యాన్లు తిరగకపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. ఇక ఇన్విజిలేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాండ్లపెంట కేంద్రంలోని ఇద్దరు టీచర్లను విధుల నుంచి తొలగించారు. ఏ ఒక్క విద్యార్థీ ఇబ్బంది పడకూడదు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే జేసీ-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఒక కేంద్రాన్ని పరిశీలించారు. ఏ ఒక్క విద్యార్థీ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను వారు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య 9 కేంద్రాలు, జిల్లా స్థాయి పరిశీలకులు ప్రేమానందం 6 కేంద్రాలు, స్క్వాడ్ బృందాలు 67 కేంద్రాలు తనిఖీ చేశాయి. -
ప్రశ్నాపత్రంపై ఏమీ రాయవద్దు...
ఎగ్జామ్ టిప్స్ పరీక్ష ప్రారంభించడానికి 10 నిమిషాల ముందే ఆన్సర్ బుక్లెట్స్ ఇస్తారు కాబట్టి ఆ సమయంలో మార్జిన్స్ గీసుకోవడం, ఫస్ట్‌పేజీలో పరీక్షకు సంబంధించి రాయాల్సిన వివరాలు పూర్తి చేయడం చేయాలి. మీకు కేటాయించిన సీట్లో కూర్చున్నాక కొన్ని క్షణాలు ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ... చిన్న పాటి వ్యాయామం చేయండి. ఈ వ్యాయామం మిమ్మల్ని పూర్తిగా రిలాక్స్ చేస్తుంది. పరీక్ష హాలులో నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఊహించని, కఠినమైన ప్రశ్నలు ఎదురుకావచ్చని ప్రశ్నాపత్రం అందుకోడానికి ముందే ఊహించండి.కంగారు, టెన్షన్ పడుతూ ప్రశ్నాపత్రాన్ని చూడవద్దు. అలా చూసి... ప్రశ్నలో ఒక మాటకు మరో ప్రశ్నను అన్వయించుకుని సమాధానం రాసే అవకాశం ఉంది. ప్రశ్నాపత్రంలో ప్రతి ప్రశ్ననూ జాగ్రత్తగా చదవాలి. ప్రశ్న పూర్తిగా అర్థమయ్యాక మాత్రమే సమాధానం రాయండి. ప్రశ్నాపత్రం మీద ఏమీ రాయక ండి. ఆన్సర్ బుక్‌లెట్‌లో చివరి పేజీ వెనుక షీట్లో ఉన్న ఖాళీ స్థలాన్ని రఫ్ వర్క్ చేయడానికి ఉపయోగించుకోండి.కొత్త పేజీలో కొత్త ప్రశ్నకు సమాధానం రాయడం ప్రారంభిస్తే నీట్‌గా బావుంటుంది. వీలున్నంత వరకూ కొట్టివేతలు, దిద్దుబాటులు లేకుండా రాయండి. కొట్టేసిన దాని మీదే తిరిగి రాస్తే పేపర్లు దిద్దేవారికి నచ్చదు. అక్షరాలు, పదాలు స్పష్టంగా కనపడేలా రాయడం వల్ల మరిన్ని అదనపు మార్కులు పడతాయి. - యండమూరి -
సీనియర్స్‌ను సంప్రదించండి
ఎగ్జామ్ టిప్స్ {బేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే మైండ్ బాగా చురుకుగా మారుతుంది. ఆ టైమ్‌లో కాసేపు చదవడం మేలు. పరీక్షలకు రెండు వారాల ముందుపూర్తిగా కొత్త టాపిక్‌లను నేర్చుకోవడానికి ప్రయత్నించవద్దు. పరిచయమున్న అంశాలనే రివ్యూ చేయడం మంచిది. గ్రూప్ స్టడీ చేస్తుంటే ఒకరు టాపిక్స్ డిస్కస్ చేయడం, మరొకరు సినాప్సిస్ తయారు చేసుకోవడం మంచిది.సీనియర్స్‌ను కలవండి. వారు ప్రిపేరైన విధానం అడిగి తెలుసుకోండి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలించి దేనికి ఎక్కువ ప్రాధాన్యత, దేనికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారో పరిశీలించండి.ఒకటే టాపిక్ చదవడానికి 2 లేదా 3 గంటలు వెచ్చించే కన్నా ఒక్కో దానికి 45 నిమిషాలు చొప్పున విభిన్న టాపిక్స్‌ను కవర్ చేయడానికి ప్రయత్నించడం మంచిది. 40-60 నిమిషాలు నిర్విరామంగా చదివాక కనీసం 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. రోజుకు కనీసం 6-7 గంటల రాత్రి నిద్ర తగ్గకుండా చూసుకోవాలి. స్టడీస్ కారణంగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే పగలైనా సరే 15-20 నిమిషాల పాటు కునుకు తీయడం మంచిదే. ‘‘డే బై డే ఇన్ ఎవ్రీ వే అయామ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్’’ అంటూ ప్రతిరోజూ సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. దీన్ని ప్రతి రోజూ రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం లేవగానే కళ్ళుమూసుకునే 3సార్లు మనలో మనమే అనుకోవాలి. -
భారీ టెలిస్కోప్‌ను సిద్ధం చేస్తున్న చైనా
ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలిస్కోపును చైనా సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. దీని నిర్మాణానికి మొత్తం 1,244 కోట్ల రూపాయల ఖర్చవుతోంది. 500 మీటర్ల వ్యాసంతో, భారీ యంత్రాలతో గుజ్హౌ రాష్ట్రంలో ఈ నిర్మాణం చేపట్టారు. 'ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఎపర్చర్ స్ఫెరికల్ టెలిస్కోప్' (ఫాస్ట్) అనే పేరున్న ఈ టెలిస్కోప్.. దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాలను కలిపితే ఎంత అవుతుందో.. అంత పరిమాణంలో ఉంటుంది. ఈ అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణానికి చైనా ఐదేళ్ల సమయం తీసుకుంది. 2016 సెప్టెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులోని రిఫ్లెక్టర్ డిష్ ప్రపంచం అంతటి నుంచి సిగ్నల్స్ అందుకుంటుంది. 2003లో తొలిసారిగా దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దీని బాడీ 500 మీటర్ల వ్యాసం ఉండటంతో.. దీనిచుట్టూ నడిచేందుకు 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ టెలిస్కోపులో మొత్తం 4,500 ప్యానళ్లుండగా.. వాటిలో చాలావరకు త్రికోణాకారంలో ఉంటాయి. సైడ్ ప్యానెల్స్ 11 మీటర్ల పొడవు ఉన్నాయి. ఇప్పటివరకూ టెలిస్కోప్‌లోని ముఖ్యమైన దశలు పూర్తయ్యాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ లీ డి వెల్లడించారు. ఈ టెలిస్కోప్ డిజైన్ అర్థం చేసుకోవడం అంత కష్టం ఏమీ కాదని, ఇది దాదాపు ఓ పెద్ద టీవీ యాంటెనాలాగే ఉంటుందని ఆయన చెప్పారు. సిగ్నళ్లు అందుకునే ప్రాంతం ఎక్కువగాను, మరింత సౌకర్యంగాను ఉండటంతో.. ఇప్పటికే పనిచేస్తున్న 'అరెసిబో' టెలిస్కోప్ కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఆకాశాన్ని స్కాన్ చేస్తుందన్నారు. అలాగే సున్నితత్వం కూడా 3-5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దీంతో.. పాలపుంతలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త నక్షత్రాలను కనుక్కోవడం సాధ్యమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన లిస్టర్ స్టావెలీ స్మిత్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త తెలిపారు. -
చేతిరాతకు పదును పెడదాం
అక్షరాలకు లక్షల రూపాలు. చక్కని చేతిరాత మార్కుల సాధనకే కాదు.. వ్యక్తిత్వానికి, క్రమశిక్షణకు గీటురాయి. అందంగా రాసేవారి మనసు కూడా అందంగా.. సౌమ్యంగా.. ఉంటుందట. ఏ విషయంలోనైనా స్పష్టత కలిగి ఉంటారట. దూకుడు స్వభావం కాకుండా.. శాంతంగా ఆలోచిస్తారట. ఇలా ఎన్నో సుగుణాలు మంచి చేతిరాత నేర్చుకోవడం ద్వారా అలవరచుకోవచ్చని.. ఆ రంగంలోని నిపుణులు, మానసిక విశ్లేషకుల మాట. సాక్షి, విశాఖపట్నం: మన రాత బాగుంటే ఫలితం అదే వస్తుంది. నిజమే కదూ! కాలపరీక్షకు నిలబడి తగిన ఫలితం పొందాలంటే మన చేతి రాత బాగుండాలి. మంచి హ్యాండ్ రైటింగ్ విద్యార్థుల విజయానికి ఎంతో ఉపకరిస్తుంది. ఎంత బాగా చదివితే మాత్రం.. చేతిరాత బాగోలేకపోతే స్టేట్ ర్యాంకు రావాల్సినవారు దాన్ని కోల్పోతారు. కచ్చితంగా పాసవుతామనుకునేవారు కాస్త.. అది మిస్సవుతారు. అలా జగరకుండా ఉండాలంటే.. పరీక్షల సమయానికి ముందునుంచే.. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో చేతిరాతపై దృష్టిపెడితే పరీక్షలు ఎప్పుడొచ్చినా బెంగ ఉండదు. ఈ కొద్ది కాలంలో.. చేతిరాతలో విలువైన.. సులువైన మెలకువలు నేర్చుకుంటే ఫలితంపై ఇక బెంగ అవసరం లేదు. అక్షరాలకు లక్షల రూపాలు అవును.. ఒకే అక్షరాన్ని లక్షలాది రూపాల్లో రాయొచ్చు. అయితే విద్యార్థులకు అవసరమైన రైటింగ్ స్టైల్ కేవలం రెండు రకాలు. ఒకటి కర్సివ్ రైటింగ్.. రెండోది ప్లెయిన్ లేదా ప్రింట్ స్క్రిప్ట్. కర్సివ్ రైటింగ్ యూనివర్సల్ రైటింగ్. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా చేతిరాతకు ప్రాధాన్యం ఎందుకంటే.. అది క్రమశిక్షణకు గీటురాయి లాంటిది. అక్షర స్వరూపమే కాదు.. రాసే తీరులో ఓ రిథమ్ ఉంటుంది. ఎక్కడ గాడి తప్పినా రాత బాగోదు. రాతను బట్టే విద్యార్థి శ్రద్ధాశక్తులను అంచనా వేయొచ్చు. చేతిరాత ఎందుకు బాగోదంటే... చాలామంది విద్యార్థులు బాగా చదువుతారే తప్ప రాతపై దృష్టి పెట్టరు. యూనిట్ టెస్ట్ మొదలు ఫైనల్ పరీక్షల వరకు ఆ పాఠశాల/కళాశాలలో జరిగే పరీక్షల్లో చేతిరాత బాగోపోయినా టీచర్లకు భావం/అర్థం తెలిస్తే చాలు.. మార్కులు వేసేస్తారు. దీం తో అలాంటి విద్యార్థులు చేతి రాతపై పెద్దగా దృష్టి పెట్టరు. చేతిరాత బాగోలేదని మార్కెట్లో దొరికే కాపీ పుస్తకాలు రాస్తారు. కానీ.. గురుముఖఃతా అభ్యాసన ఉండదు కనుక.. పుస్తకంలో రాత ఒకలా ఉంటే.. రాసేతీరు మరోలా ఉంటుంది. నూటికి 30 శాతానికి మించి కాపీ పుస్తకాల ద్వారా రాత మెరుగు పడినవారు అరుదు. పెన్ని గట్టిగా.. దగ్గరగా పట్టుకోవడం. ఒత్తిపెట్టి రాయడం. రాసేటప్పుడు బాగా వంగిపోవడం (పుస్తకానికి దగ్గరగా ముఖం పెట్టడం). చెప్పుకుంటే... ఇవి చాలా చిన్న లోపాలు. వీటి నుంచి బయటపడడానికి వయసు, తరగతిని బట్టి 21 నుంచి 41 గంటల అభ్యాసన (ప్రాక్టీస్) ఉంటే చాలు. ఎవరైనా మంచి చేతిరాత నిపుణుడిని సంప్రదించి ఈ లోపాలను ఇట్టే సరిదిద్దుకోవచ్చు. అదే సమయంలో మంచి మెలకువలు నేర్చుకోవాలి. శిక్షణకు వెళ్లే అవకాశం లేనివారు కింది సూచనల్ని పాటి స్తే కొంతవరకు చేతిరాతను మెరుగుపరచుకోవచ్చు. పెన్ని గట్టిగా పట్టుకోవడం, పుస్తకానికి దగ్గరగా ముఖం ఆనించి రాయడం.. కారణం ఏదైనా కావచ్చు. ఇలాంటి అలవాట్లను వదిలించుకోవాలి. అలానే ఇంగ్లిష్ విషయానికొస్తే.. కర్సివ్ రైటింగ్‌లో ప్రతి అక్షరం 80 శాతం ఉండాలి. అదీ రైట్ స్లాంటింగ్ (కుడివైపు అక్షరాలు వంగి) ఉండాలి. జోన్స కచ్చితంగా పాటించాలి. ప్రాథమికంగా ఈ అక్షరాల స్వరూపం తెలుసుకున్న తర్వాత సాధన చేయాలి. అదీ రోజుకు రెండు లేదా మూడు గంటలు. ఎవరైనా నేర్చుకోవచ్చు చేతిరాతైనా.. లేదా ఏ విద్య అయినా ముఖ్యంగా విద్యార్థి శ్రద్ధ, క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. అలాంటి శ్రద్ధ ఉన్న పిల్లలు మావద్ద కేవలం వారంలో చేతిరాత మెరుగుపరచుకోవచ్చు. సహజంగా ఏడేళ్ల వయసు దాటినవారు.. అంటే సెకెండ్ స్టాండర్డ .. ఆపై తరగతుల నుంచి విద్యార్థులు.. వారి వయసును బట్టి నిర్ణీత సమయంలో చక్కని చేతిరాత నేర్చుకోవచ్చు. 14 ఏళ్ల లోపు పిల్లలకు కచ్చితంగా 21 రోజుల సాధన అవసరం. టెన్త, ఇంటర్, డిగ్రీ విద్యార్థులైతే వారి శ్రద్ధాశక్తులను బట్టి కేవలం నాలుగు గంటల్లో రైటింగ్‌పై చక్కని అవగాహన ఏర్పరచుకోవచ్చు. అదే 14 ఏళ్లలోపు పిల్లల్లో అంత శ్రద్ధ కానరాకపోవచ్చు. వారికి నెలరోజుల వరకు శిక్షణ అవసరం. టీచర్లు, సివిల్స్ వంటివాటికి ప్రిపేర్ అయ్యేవారు కేవలం ఒక క్లాస్‌తో మెలకువలకు నేర్చుకోగలరు. తర్వాత ఇంటి వద్ద సాధన చేసుకోవచ్చు. - రాజీ, సిరి హ్యాండ్రైటింగ్ నిర్వాహకురాలు, విశాఖ -
నేడు పాలిసెట్
తొలిసారిగా ఓఎమ్మార్ షీట్ల వినియోగం జిల్లా పరిధిలో విద్యార్థులు 20,334 మంది నిమిషం ఆలస్యమైనాఅనుమతించరు విశాఖపట్నం , న్యూస్‌లైన్ : డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించనున్న పాలిసెట్-2014 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలో 20,334 మంది దీనికి హాజరవుతున్నారు. విశాఖలో 13,740 మంది, జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, భీమిలి కేంద్రాల్లో 6,594 మంది పరీక్ష రాయనున్నారు. తొలిసారిగా ఈ పరీక్షకు ఓఎమ్మార్ షీట్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హాల్ టికెట్లు అందజేశారు. హాల్ టికెట్లు అందని వారికి విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం, పాడేరుల్లోని పాలిటెక్నిక్ కళాశాలల కార్యాలయాల్లో డూప్లికేట్ హాల్ టికెట్లు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. వెబ్సైట్లో నేరుగా హాల్ టికెట్లు పొందడానికి అభ్యర్థులకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. బుధవారం ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. బుక్‌లెట్‌లో పొందుపరిచిన నియమ, నిబంధనలను విద్యార్థులు కచ్చితంగా పాటించాలని పాలిసెట్ కో-ఆర్డినేటర్ కె.సంధ్యారాణి తెలిపారు. సెల్‌ఫోన్, కాలిక్యూలేటర్‌ను కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. -
ఆహారాన్ని పరీక్షించేందుకు స్కానర్!
వాషింగ్టన్: ఆహారాన్ని పరీక్షించి అందులో ఉన్న అలర్జీ కారక పదార్థాలు, పురుగుమందుల అవశేషాలు, క్యాలరీలు, అదనంగా ఉన్న కొవ్వు వంటి వాటిని గుర్తించే వినూత్న స్కానర్‌ను టొరాంటో పరిశోధకులు తయారు చేశారు. ‘టెల్స్పెక్’ అనే ఈ పరికరంపై ఉండే ఓ బటన్‌ను నొక్కి పళ్లెంలోని ఆహారంపై అలా తిప్పితే చాలు.. స్కానింగ్ అయిపోతుంది. ఈ పరికరం నుంచి ఆహారంపై తక్కువ శక్తితో గల లేజర్ వెలువడుతుంది. లేజర్ ఆహారంపై పడగానే.. ప్రతిబింబించే కాంతి తరంగాలను ఇది రామన్ స్పెక్ట్రోమీటర్ సాయంతో పసిగడుతుంది. ఆ సమాచారాన్ని ఆన్లైన్లో ఉండే డాటాబేస్‌కు పంపిస్తుంది. దాంతో అక్కడ విశ్లేషణ పూర్తయి, వెంటనే సంబంధిత వివరాలు ఓ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు అందుతాయి. దీనితో ఆహార పదార్థాలను 97.7 శాతం కచ్చితత్వంతో స్కాన్ చేయొచ్చట. ఇప్పటిదాకా 3 వేల ఆహార పదార్థాలను స్కాన్చేసేలా డాటాబేస్ రూపొందించామని, ఇది దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలనూ స్కాన్ చేయగలదని దీన్ని తయారుచేసిన పరిశోధకులు ఇసాబెల్ హాఫ్మన్, స్టీఫెన్ వాట్సన్‌లు చెబుతున్నారు. షాపులలో ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, హోటళ్లలో కూడా ఉపయోగపడే ఈ స్కానర్‌ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నారు. ధర రూ.19,752 మాత్రమే!