
సీనియర్స్‌ను సంప్రదించండి
ఎగ్జామ్ టిప్స్
{బేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే మైండ్ బాగా చురుకుగా మారుతుంది. ఆ టైమ్‌లో కాసేపు చదవడం మేలు. పరీక్షలకు రెండు వారాల ముందుపూర్తిగా కొత్త టాపిక్‌లను నేర్చుకోవడానికి ప్రయత్నించవద్దు. పరిచయమున్న అంశాలనే రివ్యూ చేయడం మంచిది. గ్రూప్ స్టడీ చేస్తుంటే ఒకరు టాపిక్స్ డిస్కస్ చేయడం, మరొకరు సినాప్సిస్ తయారు చేసుకోవడం మంచిది.సీనియర్స్‌ను కలవండి. వారు ప్రిపేరైన విధానం అడిగి తెలుసుకోండి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలించి దేనికి ఎక్కువ ప్రాధాన్యత, దేనికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారో పరిశీలించండి.ఒకటే టాపిక్ చదవడానికి 2 లేదా 3 గంటలు వెచ్చించే కన్నా ఒక్కో దానికి 45 నిమిషాలు చొప్పున విభిన్న టాపిక్స్‌ను కవర్ చేయడానికి ప్రయత్నించడం మంచిది.
40-60 నిమిషాలు నిర్విరామంగా చదివాక కనీసం 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. రోజుకు కనీసం 6-7 గంటల రాత్రి నిద్ర తగ్గకుండా చూసుకోవాలి. స్టడీస్ కారణంగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే పగలైనా సరే 15-20 నిమిషాల పాటు కునుకు తీయడం మంచిదే. ‘‘డే బై డే ఇన్ ఎవ్రీ వే అయామ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్’’ అంటూ ప్రతిరోజూ సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. దీన్ని ప్రతి రోజూ రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం లేవగానే కళ్ళుమూసుకునే 3సార్లు మనలో మనమే అనుకోవాలి.