
ప్రశ్నాపత్రంపై ఏమీ రాయవద్దు...
ఎగ్జామ్ టిప్స్
పరీక్ష ప్రారంభించడానికి 10 నిమిషాల ముందే ఆన్సర్ బుక్‌లెట్స్ ఇస్తారు కాబట్టి ఆ సమయంలో మార్జిన్స్ గీసుకోవడం, ఫస్ట్‌పేజీలో పరీక్షకు సంబంధించి రాయాల్సిన వివరాలు పూర్తి చేయడం చేయాలి. మీకు కేటాయించిన సీట్లో కూర్చున్నాక కొన్ని క్షణాలు ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ... చిన్న పాటి వ్యాయామం చేయండి. ఈ వ్యాయామం మిమ్మల్ని పూర్తిగా రిలాక్స్ చేస్తుంది. పరీక్ష హాలులో నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఊహించని, కఠినమైన ప్రశ్నలు ఎదురుకావచ్చని ప్రశ్నాపత్రం అందుకోడానికి ముందే ఊహించండి.కంగారు, టెన్షన్ పడుతూ ప్రశ్నాపత్రాన్ని చూడవద్దు. అలా చూసి... ప్రశ్నలో ఒక మాటకు మరో ప్రశ్నను అన్వయించుకుని సమాధానం రాసే అవకాశం ఉంది.
ప్రశ్నాపత్రంలో ప్రతి ప్రశ్ననూ జాగ్రత్తగా చదవాలి. ప్రశ్న పూర్తిగా అర్థమయ్యాక మాత్రమే సమాధానం రాయండి. ప్రశ్నాపత్రం మీద ఏమీ రాయక ండి. ఆన్సర్ బుక్‌లెట్‌లో చివరి పేజీ వెనుక షీట్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని రఫ్ వర్క్ చేయడానికి ఉపయోగించుకోండి.కొత్త పేజీలో కొత్త ప్రశ్నకు సమాధానం రాయడం ప్రారంభిస్తే నీట్‌గా బావుంటుంది. వీలున్నంత వరకూ కొట్టివేతలు, దిద్దుబాటులు లేకుండా రాయండి. కొట్టేసిన దాని మీదే తిరిగి రాస్తే పేపర్లు దిద్దేవారికి నచ్చదు. అక్షరాలు, పదాలు స్పష్టంగా కనపడేలా రాయడం వల్ల మరిన్ని అదనపు మార్కులు పడతాయి.
- యండమూరి