సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నిర్థారణ కోసం అతి తక్కువ ధరలో, తక్కువ సాంకేతికత అవసరమయ్యే ఒక టెస్టింగ్ కిట్‌ను సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) రూపొందించింది. ఈ టెస్టింగ్ కిట్ ధర ప్రస్తుత్తం కరోనా వైరస్‌ను పరీక్షించడానికి ఉపయోగిస్తున్న రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-qPCR) ధర కంటే చవకైనది. దీనిని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ నెస్టెడ్ పీసీఆర్ (RT-nPCR) పరీక్షగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా రూపొందించిన ఈ కిట్‌ను ఉపయోగించడానికి ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనుమతి పొందాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ పరీక్షల కోసం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-qPCR) టెస్ట్ చేయడానికి మాత్రమే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్స్ చేసింది.
(భారీ ఊరట : మరణాల రేటు అత్యల్పం)
ప్రస్తుతం ఉపయోగిస్తున్నఆర్‌టీ- క్యూపీసీఆర్(RT-qPCR) కిట్‌ను కొత్తగా రూపొందించిన ఆర్‌టీ-ఎన్‌పీసీఆర్ (RT-nPCR) తో పోల్చి చూస్తే 50 శాతం తక్కువ సామార్థ్యం కలిగి ఉందని సీసీఎంబీ పరిశోధకులు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. పాత టెస్టింగ్ కిట్ ఆర్‌టీ- క్యూపీసీఆర్(RT-qPCR) ద్వారా పరీక్షించిన కరోనా వైరస్ నమూనాలను కొత్తగా రూపొందిచిన కిట్‌తో పరీక్షించగా 90 శాతం పాజిటివ్‌గా తేలాయన్నారు. మరోవైపు పాత టెస్టింగ్ కిట్ ఆర్‌టీ- క్యూపీసీఆర్(RT-qPCR) ద్వారా నెగిటివ్ అని తేలిన 13 శాతం నమూనాలు కూడా పాజిటివ్ ఫలితాలను చూపించాయన్నారు. దీని బట్టి చూస్తే ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షిస్తే కొన్ని కరోనా పాజిటివ్ కేసులు తప్పుగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాకేష్ మిశ్రా తెలిపారు. కొత్తగా రూపొందించిన టెస్టింగ్ కిట్ ఐసీఎమ్‌ఆర్ అనుమతి పొందాల్సి ఉందని, ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్‌లో కరోనా నెగిటివ్‌గా నమోదు అవుతుందో అక్కడ కొత్త కిట్‌తో పరీక్షిస్తే వంద శాతం సరైన ఫలితాలు పొందవచ్చని డాక్టర్ మిశ్రా పేర్కొన్నారు. (మరోసారి సంపూర్ణ లాక్డౌన్: నిజమేనా?)
Comments
Please login to add a commentAdd a comment