సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నిరోధించడంలో కీలకమైన కోవిడ్-19 పరీక్షలను పెద్దసంఖ్యలో చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటనుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జులై 2 నాటికి దేశవ్యాప్తంగా పలు ల్యాబ్‌ల్లో మొత్తం 90,56,173 కోవిడ్-19 పరీక్షలను నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1065 టెస్టింగ్ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతి లభించగా వాటిలో 768 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా, 297 ప్రైవేట్ ల్యాబ్‌లున్నాయి.
రోజురోజుకూ టెస్టింగ్ సామర్థ్యం మెరుగుపడుతుండగా ఈనెల 1న 2,29,598 కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. మరోవైపు పరీక్షల వేగం పెంచేందుకు కోవిడ్-19 పరీక్షను కేవలం ప్రభుత్వ వైద్యుల ప్రిస్క్రిప‍్షన్‌తోనే కాకుండా ఏ నమోదిత డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో అయినా నిర్వహించే వెసులుబాటును కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్-19 పరీక్షలను ముమ్మరంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను కోరింది. చదవండి : ‘వారికి కోవిడ్-19 ముప్పు అధికం’
Comments
Please login to add a commentAdd a comment