ఏటీఎస్‌లలోనే వాహనాల ఫిట్‌ నెస్‌ పరీక్షలు | Government of India Plans to Make Fitness Testing of Vehicles Mandatory From April 2023 | Sakshi
Sakshi News home page

ఏటీఎస్‌లలోనే వాహనాల ఫిట్‌ నెస్‌ పరీక్షలు

Published Mon, Feb 7 2022 6:26 AM | Last Updated on Mon, Feb 7 2022 6:26 AM

Government of India Plans to Make Fitness Testing of Vehicles Mandatory From April 2023 - Sakshi

న్యూఢిల్లీ: వాహనాల ఫిట్నెస్‌ పరీక్షలను ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్స్‌లోనే (ఏటీఎస్‌) నిర్వహించడం తప్పనిసరి కానుంది. దశల వారీగా 2023 ఏప్రిల్‌ నుంచి ఈ నిబంధన అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. సరుకు రవాణా, ప్యాసింజర్‌ విభాగంలో భారీ వాహనాలకు 2023 ఏప్రిల్‌ 1, మధ్యస్థాయి, తేలికపాటి వాహనాలకు 2024 జూన్‌ 1 నుంచి ఇది తప్పనిసరి కానుంది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాల కోసం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వ్యక్తిగత వాహనాలకు సైతం రానున్న రోజుల్లో ఈ నిబంధన అమలు చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement