Automated
-
ఈజీగా ఇంటర్నేషనల్ జర్నీ
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ–టీటీపీ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సత్ఫలితాలిస్తోంది.ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా విదేశాలకు క్రమం తప్పకుండా ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. సాధారణ ఇమిగ్రేషన్ క్యూలైన్లకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ ఈ–గేట్లను ఏర్పాటు చేశారు. – సాక్షి, హైదరాబాద్నమ్మకమైన ప్రయాణికుల కోసమే..హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 70 వేల మందికి పైగా డొమెస్టిక్ (దేశీయ), ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చేవారు ఉన్నారు. వీరిలో తరచూ ప్రయాణించేవారికి ఈ ఫాస్ట్‌ట్రాక్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. టూరిస్టులు, రెండుమూడేళ్లకోసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోలేరని, తరచూ రాకపోకలు సాగించే నమ్మకమైన ప్రయాణికుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.‘ఇది భారతీయ పాస్ట్‌పోర్ట్‌లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు కలిగిన వాళ్ల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ. ఇమిగ్రేషన్ చెక్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను ముగించి రాకపోకలు సాగించవచ్చు’అని ఆయన చెప్పారు.ఇప్పటివరకు 500 మందికి పైగా ఎఫ్టీఐ–టీటీపీలో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోజూ 10 – 15 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 8 గేట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.దరఖాస్తు ఇలా..ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే www.ftittp.mha.gov.in వెబ్సైట్లో ప్రయాణికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు సమయంలోనే పాస్‌పోర్ట్‌ను అప్లోడ్ చేసి, ఇతర అన్ని వివరాలు నమోదు చేయాలి. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఎఫ్టీఐ–టీటీపీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ బ్యూరో పరిశీలించి ఆమోదిస్తే, ఆ సమాచారం ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఈ మెయిల్‌కు కూడా సందేశం వస్తుంది. వేలిముద్రలు, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసేందుకు ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.సేవలు ఇలా.. ⇒ ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ సదుపాయం కలిగిన ప్రయాణికులు వీసా తనిఖీ పూర్తయిన తరువాత బోర్డింగ్ పాస్ కోసం రిజిస్టర్డ్ ప్యాసింజర్ చెక్–ఇన్ కౌంటర్లో సంప్రదించాలి. ⇒ బోర్డింగ్ పాస్ తీసుకున్న తరువాత ఇమిగ్రేషన్ కోసం వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. ⇒ మొదటి గేట్ వద్ద పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్‌కు అనుమతి లభిస్తుంది. ⇒ రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రయోజనాలు ఇవీ.. ⇒ సాధారణ ఇమిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా ఒకే క్యూలైన్లో వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడిగాపులు తప్పవు.⇒ అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత సంబంధిత ఎయిర్‌లైన్స్‌లో క్యూలో వేచి ఉండి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అదే సమయంలో లగేజ్ చెక్ –ఇన్ ఉంటుంది. ఆ తరువాత వరుసగా భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్ లైన్లలోకి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎఫ్టీఐ టీటీపీ వ్యవస్థలో ముందే వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సాధారణ భద్రతా తనిఖీల అనంతరం నేరుగా ఈ–గేట్ ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లవచ్చు. డిజియాత్ర మొబైల్ యాప్ ఉన్న ప్రయాణికులు బోర్డింగ్పాస్ను ఆన్లైన్లోనే పొందవచ్చు. -
లగేజ్ మోసే బాధ లేదు.. ఎంచక్కా అదే వస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనిషి అన్ని పనులను సునాయాసంగా చేసుకోవడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, విమాశ్రయాలలో పైకి ఎక్కడానికి లేదా కిందికి దిగటానికి ఎస్కలేటర్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాడు. లగేజ్ తీసుకెళ్లడానికి కూడా బెల్ట్ కన్వేయర్స్ ఉపయోగిస్తున్నాడు. అయితే ఇవన్నీ చిన్న దూరాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అదే ఒక నగరం నుంచి మరో నగరానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లగేజ్ తీసుకెళ్లే అవకాశం ఉంటే? నిజంగా ఇది వినటానికే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది కదూ..! దీన్ని నిజం చేయడానికే జపాన్.. సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది.జపాన్ గవర్నమెంట్ ప్రధాన నగరాల్లో ఆటోమేటెడ్ జీరో ఎమిషన్స్ లాజిస్టిక్స్ లింక్‌లను ఏర్పాటు చేయడానికి ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది అమలులోకి వస్తే.. ఒక వ్యక్తి తన లగేజిని ప్రత్యేకంగా తనతోపాటే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా కన్వేయర్ బెల్ట్ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయన్నమాట.ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే లగేజీని మనతో పాటు తీసుకెళ్లాలి. కానీ కన్వేయర్ బెల్ట్ ఉంటే.. లగేజ్ అక్కడ ఇచ్చేసి మీరు హ్యాపీగా విజయవాడ వెళ్లిపోవచ్చు. లగేజీని దొంగలు తీసుకెళ్లారని భయంగానీ.. ఎక్కడైనా మరచిపోతామేమో అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ నిర్వాహకులు లేదా అధికారులు ఆ లగేజీని గమ్యానికి చేరుస్తారు. మీరు మళ్ళీ అక్కడ తీసుకుంటే సరిపోతుంది.జపాన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడానికి గత ఫిబ్రవరి నుంచి చర్చలు జరుపుతోంది. ఇది 2034 నాటికి అమలులోకి వస్తుందని సమాచారం. మొదటి లింక్ టోక్యో నుంచి ఒకసా మధ్య ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చిన తరువాత లక్షల టన్నుల బరువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు.టోక్యో నుంచి ఒకసా నగరాల మధ్య సుమారు 500 కిమీ దూరాన్ని కవర్ చేయడానికి భారీ కన్వేయర్ బెల్ట్‌లను ఏర్పటు చేస్తారు. ఈ బెల్ట్ కన్వేయర్స్ హైవేల పక్కన, సొరంగాలు మార్గాల్లో కొనసాగుతుంది. ఇది మొత్తం డ్రైవర్‌లెస్ టెక్నాలజీతో రూపొందుతుంది. ఇందులో కార్గోలు లగేజీని సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తాయి. కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా డ్రైవర్స్ అవసరం లేదు.ఈ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చడానికి మంత్రిత్వ శాఖ ప్రైవేట్ కంపెనీలకు పిలుపునిచ్చింది. ఈ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా, గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని రవాణా & పర్యాటక మంత్రి టెట్సువో సైటో పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇది అద్భుతమైన టెక్నాలజీ అనే చెప్పాలి. ఇలాంటి సదుపాయాన్ని మన దేశంలో కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. -
ఇక పక్కాగా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందుకోసం వాహనాల ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించే దిశగా కార్యాచరణకు ఉపక్రమించింది. రోడ్డు ప్రమాదాలకు కారణాల్లో వాహనాలు తగిన ఫిట్నెస్తో లేకపోవడం ఒకటని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు రవాణా శాఖ అధికారులు వాహనాలను స్వయంగా పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 26 ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీసీ)లు ఏర్పాటుకు ఉపక్రమించింది. పుణెలోని ఆటో మోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) ప్రమాణాల మేరకు ఈ ఏటీసీలను డిజైన్ చేశారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్: రాష్ట్రంలో మొదటి ఏటీసీని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేశారు. రూ. 18.50 కోట్లతో అక్కడ ఏటీసీ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి రవాణా శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మొదటి దశలో 15 ఏటీసీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. వాటిలో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఏటీసీల నిర్మాణానికి త్వరలోనే బిడ్లను ఖరారు చేయనున్నారు. మిగిలిన జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి ఫిబ్రవరి మొదటివారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఏటీసీల టెండర్లు ఖరారు అయిన తరువాత ఏడాదిలోగా వాటిని ప్రారంభించాలన్నది రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఏటీసీలను ప్రభుత్వం నెలకొల్పుతోంది. తద్వారా వాహనాల ఫిట్నెస్ను శాస్త్రీయంగా పరీక్షించి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఏడాదిలోగా ఈ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. – ఎంకే సిన్హా, రవాణా శాఖ కమిషనర్ ఏటీసీల స్వరూపం ఇలా.. జిల్లా కేంద్రానికి గరిష్టంగా 30 కి.మీ. దూరంలో ఏటీసీలను నెలకొల్పుతారు. కనీసం 3 వేల చ.గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. అధునాతన సెన్సార్లు, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవింగ్ ట్రాకులను ని ర్మిస్తారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఏటీసీలో నాలుగు లేన్లతో కూడిన డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు రెండు ట్రాక్‌లు, లైట్ వెహికిల్స్‌ను రెండు డ్రైవింగ్ ట్రాక్‌లను కేటాయించారు. కాగా మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఏటీసీలలో రెండేసి చొప్పున డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. హెవీ వెహికిల్స్‌కు ఒక ట్రాక్, లైట్ వెహికిల్స్‌కు ఒక ట్రాక్‌ను కేటాయిస్తారు. ఫిట్‌నెస్‌కు వచ్చే వాహనాలు ఆ డ్రైవింగ్ ట్రాక్‌లలో ప్రయాణిస్తే... సెన్సార్ల ద్వారా వాటి ఫిట్నెస్ను పరీక్షిస్తారు. బ్రేకుల పనితీరు, ఇంజిన్ కండిషన్, ఇతర ప్రమాణాలను ఆటోమేటెడ్ విధానంలో నిర్ధారిస్తారు. దాంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ విధానాన్ని అమలులోకి తీసుకువస్తారు. -
ఓఎన్డీసీలో ఫిర్యాదుల పరిష్కారానికి ఆటోమేటెడ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులను కూడా ఈ–కామర్స్‌లో భాగం చేసేందుకు ఉద్దేశించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో టీ. కోషి తెలిపారు. త్వరలోనే ఆన్లైన్ పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. చిన్న రిటైలర్లు కూడా డిజిటల్ కామర్స్ ప్రయోజనాలను అందుకోవడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 2021 డిసెంబర్లో ఓఎన్డీసీని ప్రవేశపెట్టింది. ఇది కొన్నాళ్లుగా శరవేగంగా విస్తరిస్తోందని, గత కొద్ది నెలల్లోనే నెట్‌వర్క్‌లోని విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్ల సంఖ్య లక్ష దాటిందని కోషి వివరించారు. -
ఏటీఎస్‌లలోనే వాహనాల ఫిట్ నెస్ పరీక్షలు
న్యూఢిల్లీ: వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్‌లోనే (ఏటీఎస్) నిర్వహించడం తప్పనిసరి కానుంది. దశల వారీగా 2023 ఏప్రిల్ నుంచి ఈ నిబంధన అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. సరుకు రవాణా, ప్యాసింజర్ విభాగంలో భారీ వాహనాలకు 2023 ఏప్రిల్ 1, మధ్యస్థాయి, తేలికపాటి వాహనాలకు 2024 జూన్ 1 నుంచి ఇది తప్పనిసరి కానుంది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వ్యక్తిగత వాహనాలకు సైతం రానున్న రోజుల్లో ఈ నిబంధన అమలు చేస్తారు. -
రూ. 1,17 లక్షల కోట్ల ఐటీ రిఫండ్స్
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ గడచిన ఆర్థిక సంవత్సరం చివరితేదీ నాటికి (మార్చి 31) రూ.1.17 లక్షల కోట్ల పన్ను రిఫండ్స్ చెల్లించింది. ఈ మొత్తంలో రూ.37,870 కోట్లు ఆటోమేటెడ్ విధానంలో జరిగినట్లు ఆర్థికశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ట్యాక్స్ పేయర్ సేవల నిర్వహణ విషయంలో గడచిన ఆర్థిక సంవత్సరం రికార్డు సృష్టించినట్లు కూడా ఆర్థికశాఖ తెలిపింది. బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)లో 4.14 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రాసెసింగ్ జరిగిందని పేర్కొంటూ... 2014-15 కన్నా ఈ సంఖ్య 35 శాతం అధికమని వివరించింది. -
ట్రాఫిక్ నియంత్రణకు కొత్త సిస్టం