
రూ. 1,17 లక్షల కోట్ల ఐటీ రిఫండ్స్
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ గడచిన ఆర్థిక సంవత్సరం చివరితేదీ నాటికి (మార్చి 31) రూ.1.17 లక్షల కోట్ల పన్ను రిఫండ్స్ చెల్లించింది. ఈ మొత్తంలో రూ.37,870 కోట్లు ఆటోమేటెడ్ విధానంలో జరిగినట్లు ఆర్థికశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ట్యాక్స్ పేయర్ సేవల నిర్వహణ విషయంలో గడచిన ఆర్థిక సంవత్సరం రికార్డు సృష్టించినట్లు కూడా ఆర్థికశాఖ తెలిపింది. బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)లో 4.14 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రాసెసింగ్ జరిగిందని పేర్కొంటూ... 2014-15 కన్నా ఈ సంఖ్య 35 శాతం అధికమని వివరించింది.