న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులను కూడా ఈ–కామర్స్‌లో భాగం చేసేందుకు ఉద్దేశించిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో టీ. కోషి తెలిపారు. త్వరలోనే ఆన్‌లైన్ పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు.
చిన్న రిటైలర్లు కూడా డిజిటల్ కామర్స్ ప్రయోజనాలను అందుకోవడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 2021 డిసెంబర్‌లో ఓఎన్‌డీసీని ప్రవేశపెట్టింది. ఇది కొన్నాళ్లుగా శరవేగంగా విస్తరిస్తోందని, గత కొద్ది నెలల్లోనే నెట్‌వర్క్‌లోని విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్ల సంఖ్య లక్ష దాటిందని కోషి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment