Digital commerce
-
ఓఎన్డీసీతో ఆర్థిక సేవలు, తయారీకి దన్ను
న్యూఢిల్లీ: చిన్న రిటైలర్లకు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో నాలుగు కీలక రంగాల వృద్ధికి ఊతం లభించగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవలు, వ్యవసాయం, తయారీ, ఈ–కామర్స్ రిటైల్ వీటిలో ఉంటాయని పేర్కొంది. రుణ అవసరాల కోసం ప్రభుత్వ పథకాలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఆర్థిక సేవల సంస్థలు చేరువయ్యేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడగలదని వివరించింది. సాధారణంగా ఎంఎస్ఎంఈల ఆర్థిక గణాంకాల సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల వాటి రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. అయితే, ఓఎన్డీసీ ద్వారా అవి నిర్వహించే లావాదేవీల డేటా అంతా వ్యవస్థలో డిజిటల్‌గా నిక్షిప్తం కావడం వల్ల వాటికి అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించడానికి ఫైనాన్షియల్ సంస్థలకు వీలవుతుందని నివేదిక పేర్కొంది. ‘పరిస్థితికి అనుగుణంగా మారగలిగే స్వభావం, భద్రత, లాభదాయకత.. ఏకకాలంలో ఈ మూడింటి మేళవింపుతో ఓఎన్డీసీ ఎంతో విశిష్టంగా రూపొందింది. ఇది సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసాలను భర్తీ చేయగలదు. నవకల్పనలకు తోడ్పాటునివ్వగలదు. తద్వారా కొత్త తరం వినూత్నంగా ఆలోచించేందుకు బాటలు వేయగలదు‘ అని డెలాయిట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ (కన్సలి్టంగ్) సతీష్ గోపాలయ్య తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ఓఎన్డీసీ ఒక గొప్ప అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► కోవిడ్ మహమ్మారి అనంతరం భోగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, పరికరాల కొరత, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తయారీ సంస్థలు ఈ సవాళ్లను వ్యాపార అవకాశాలుగా మల్చుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడవచ్చు. ఓఎన్డీసీలో లాజిస్టిక్స్ సేవలు అందించే సంస్థలు పుష్కలంగా ఉన్నందున.. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించుకునేందుకు, మరింత సమర్ధంగా డిమాండ్‌కి అనుగుణంగా స్పందించేందుకు వీలవుతుంది. ► ఆన్లైన్ అమ్మకాలకు ప్రాధాన్యం పెరుగుతున్నందున, రిటైల్ పరిశ్రమ భాగస్వాములు (బ్రాండ్లు, రిటైలర్లు, పంపిణీదారులు, సరఫరాదారులు) తమ వ్యవస్థలో అంతర్గతంగా మిగతా వర్గాలతో కలిసి పనిచేసేందుకు, అలాగే కస్టమర్లను చేరుకునేందుకు కూడా ఓఎన్డీసీ సహాయకరంగా ఉండనుంది. ► గత కొద్ది నెలలుగా నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ, గృహాలంకరణ, ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫార్మా తదితర విభాగాల సంస్థలు ఓఎన్డీసీ నెట్‌వర్క్‌ను సమర్ధమంతంగా వినియోగించుకుంటున్నాయి. ► డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తక్కువ వ్యయాలతో పరిష్కరించుకోవడానికి బ్రాండ్స్/రిటైలర్లు/ఎంఎస్ఎంఈలకు ఓఎన్డీసీ ద్వారా అవకాశం లభిస్తుంది. బ్రాండ్లు నేరుగా రిటైలర్లను చేరుకోవడానికి, పంపిణీదారులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కూడా ఇది తోడ్పడగలదు. ఇందుకోసం ఆయా సంస్థలు ఇరవై నాలుగ్గంటలూ ఆర్డర్ చేసేందుకు వెసులుబాటు, మరుసటి రోజే డెలివరీ, ఆటో ఆర్డరింగ్ వంటి సదుపాయాలను కలి్పంచవచ్చు. ► బ్రాండ్స్/రిటైలర్లు తమ సరఫరాదారుల వ్యవస్థను విస్తరించుకునేందుకు, ముడి వనరులు లేదా తయారీ ఉత్పత్తుల సేకరణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగకరంగా ఉండగలదు. ► ఇటు కొనుగోలుదారులను, అటు విక్రేతలను ఒకే వేదికపైకి తెచ్చే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఇది సహాయకరంగా ఉండగలదు. ప్రాచుర్యం పొందడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న అగ్రిటెక్ అంకుర వ్యవస్థలకు ఈ నెట్వర్క్ ఒక వరంగా మారగలదు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్‌పీవో) ముడి సరుకు, సాంకేతికత, పరికరాలు, సేవలు అందుబాటులోకి రాగలవు. -
ఎన్ఎస్ఈతో కలసి ఓఎన్డీసీ అకాడమీ
న్యూఢిల్లీ: ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), ఎన్ఎస్ఈ సబ్సిడరీ అయిన ఎన్ఎస్ఈ అకాడమీ భాగస్వామ్యంతో ఓ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ వ్యాపారాన్ని సులభంగా ఎలా నిర్వహించాలనే దానిపై ఓపెన్ నెట్వర్క్ భాగస్వామ్యులు, విక్రేతలకు శిక్షణ ఇవ్వనుంది. టెక్స్ట్, వీడియో ఫార్మాట్ రూపంలో విక్రేతలకు కావాల్సిన సమాచారాన్ని ఓఎన్డీసీ అకాడమీ అందించనుంది. ఈ విషయాన్ని డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ వెల్లడించారు. ఓ గ్రామస్థుడు ఈకామర్స్ పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినా, సెల్లర్ యాప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చని వివరించారు. టెక్నాలజీ పరిజ్ఞానం అవసరం లేకుండానే సొంత యాప్‌ను తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్ ప్రయాణాన్ని విజయవంతంగా ఎలా కొనసాగించాలనే సమాచారాన్ని సైతం ఈ అకాడమీ నుంచి పొందొచ్చు. ఓఎన్డీసీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఈకామర్స్ నెట్వర్క్ కావడం గమనార్హం. -
ఓఎన్డీసీలో ఫిర్యాదుల పరిష్కారానికి ఆటోమేటెడ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులను కూడా ఈ–కామర్స్‌లో భాగం చేసేందుకు ఉద్దేశించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో టీ. కోషి తెలిపారు. త్వరలోనే ఆన్లైన్ పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. చిన్న రిటైలర్లు కూడా డిజిటల్ కామర్స్ ప్రయోజనాలను అందుకోవడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 2021 డిసెంబర్లో ఓఎన్డీసీని ప్రవేశపెట్టింది. ఇది కొన్నాళ్లుగా శరవేగంగా విస్తరిస్తోందని, గత కొద్ది నెలల్లోనే నెట్‌వర్క్‌లోని విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్ల సంఖ్య లక్ష దాటిందని కోషి వివరించారు. -
ఓఎన్‌డీసీలోకి మీషో, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో తాజాగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరింది. కొనుగోలుదారులను హైపర్‌లోకల్ విక్రేతలకు అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడ గలదని సంస్థ తెలిపింది. తమ పైలట్ ప్రాజెక్టు ముందుగా బెంగళూరులో ప్రారంభమై తర్వాత మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే?) మీషోలో 8 లక్షల మంది పైగా విక్రేతలు ఉన్నారు. విక్రేతలు, వినియోగదారుల వ్యయాల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓఎన్డీసీని తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో తక్కువ రేట్లకు ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలుదారులు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. (Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు) -
గెట్.. సెట్.. స్టార్టప్!
కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేయవచ్చు గాక, కానీ స్టార్టప్‌లకు మాత్రం జోష్‌నిచ్చింది. కరోనా కాలంలో చాలా స్టార్టప్‌ల అమ్మకాలు, లాభదాయకత అంచనాలకు మించి పెరిగాయి. దీంతో నిధుల సమీకరణ నిమిత్తం, లేదా మరింత విలువ పెంచుకోవడం కోసం (వేల్యూ అన్‌లాక్) పలు స్టార్టప్‌లు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లకు రానున్నాయి. అసలైతే రెండు, మూడేళ్ల తర్వాత గాని ఐపీఓల గురించి ఆలోచించని స్టార్టప్‌లన్నీ ఇప్పుడు ఐపీఓలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయమై సాక్షి స్పెషల్ స్టోరీ.... కరోనా వైరస్... స్టార్టప్ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రణాళికలను ముందుకు జరుపుతోంది. డిజిటల్ కామర్స్, పేమెంట్స్ కంపెనీలు ఐపీఓ మార్గంలో నిధులు సమీకరించాలని యోచిస్తున్నాయి. స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఈ ఐపీఓల ద్వారా తమ తమ వాటాలను విక్రయించనున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫార్మ్ జొమాటొ, ఫ్యాషన్ ఇటెయిలర్ నైకా, లాజిస్టిక్స్, డెలివరీ సంస్థ డెలివరీ, ఇన్సూరెన్స్ డిస్కవరీ ప్లాట్ఫార్మ్ పాలసీ బజార్, కళ్లజోళ్ల రిటైల్ చెయిన్ లెన్స్‌కార్ట్, విద్యాసేవలకు సంబంధించిన ఎడ్యుటెక్, ఆన్లైన్ ట్యూషన్ల సంస్థ బైజుస్.. ఈ సంస్థలన్నీ బాహాటంగానే తమ తమ ఐపీఓ ప్రణాళికలను వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే, ఆన్లైన్ బిల్ చెల్లింపుల సంస్థ మోబిక్విక్లు కూడా ఐపీఓ కోసం కసరత్తు చేస్తున్నాయని సమాచారం. కరోనాతో జోరు.... కరోనా కారణంగా ఈ స్టార్టప్‌ల వ్యాపారం కుదురుకోవడమే కాకుండా జోరుగా పెరిగేలా చేసిందని, అందుకే ఈ స్టార్టప్‌లు తమ ఐపీఓ ప్రణాళికలను ముందుకు జరుపుతున్నాయని నిపుణులంటున్నారు. ఈ కంపెనీల తదుపరి వ్యాపార వ్యూహం ఐపీఓయేనని వారంటున్నారు. సీఈఓగా ప్రమోషన్... ఐపీఓ కోసమే తమ కంపెనీ అమ్మకాలు, లాభదాయకత మరింతగా పెరిగాయని ఫ్యాషన్ ఇటెయిలర్ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ పేర్కొన్నారు. ఫలితంగా ఐపీఓ ప్రణాళికలను ఈ కంపెనీ ముందుకు జరిపే అవకాశాలున్నాయి. ఇక మోబిక్విక్ సంస్థ తన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చందన్ జోషిని సీఈఓగా ప్రమోట్ చేసింది. ఐపీఓ ప్రణాళిక కోసమే ఈ మార్పు జరిగిందని సమాచారం. కాగా ఐపీఓకు వచ్చేది ఖాయమేనని, అయితే ఎప్పుడనేది త్వరలోనే నిర్ణయిస్తామని బైజుస్ సీఈఓ బైజు రవీంద్రన్ ఇటీవలనే తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ విదేశాల్లో లిస్టయ్యే యోచన చేస్తోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ కంపెనీ విలువ 5,000 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీల్లో ఒక్క ఫ్లిప్‌కార్ట్‌కే నష్టాలు వస్తున్నాయి. 2019లో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్, ఈ సంస్థ హోల్‌సేల్ వ్యాపారాలకు కలిపి రూ.5,459 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరో ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌తో పోటీపడాలంటే ఐపీఓకు రావడమే ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న ఏకైక మార్గమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఐపీఓకువస్తే, ఈ స్టార్టప్‌ల విలువలు గతంలో మాదిరిగా భారీగా పెరగకపోవచ్చని విశ్లేషకులంటున్నారు. విదేశాల్లో లిస్టింగ్ ఇక ఫ్లిప్‌కార్ట్ సంస్థ విదేశాల్లో లిస్టయ్యే యోచన చేస్తోంది. ఈ కంపెనీ విలువ 5,000 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇక పాలసీ బజార్ సంస్థ న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో వచ్చే ఏడాది లిస్ట్ కావాలని కసరత్తు చేస్తోంది. 350 కోట్ల డాలర్ల విలువ సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారత కంపెనీల విదేశీ లిస్టింగ్‌కు సంబంధించి కంపెనీల సవరణ చట్టాన్ని ఇటీవలే లోక్‌సభ ఆమోదించింది. ఈ సవరణ కారణంగా భారత కంపెనీలు విదేశాల నుంచి నిధుల సమీకరణ గతంలో కంటే సులువు కానున్నది. ముందుగానే ఐపీఓకు.... ఎందుకంటే ► కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ విధించింది. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తూ వచ్చింది. ఈ కాలంలో స్టార్టప్‌ల కార్యకలాపాలు బాగా పుంజుకున్నాయి. అమ్మకాలు, లాభదాయకత పెరగడంతో పలు సంస్థలు నిధుల సమీకరణకు ఐపీఓ బాట పడుతున్నాయి. ► కరోనాకు ముందు పీఈ(ప్రైవేట్ ఈక్విటీ), వీసీ(వెంచర్ క్యాపిటల్) సంస్థల నుంచి జోరుగా పెట్టుబడులు వచ్చాయి,. కరోనా కాలంలో ఈ పెట్టుబడులు ఆగిపోయాయి. దీంతో నిధుల కోసం స్టార్టప్‌లు ఐపీఓ వైపు చూస్తున్నాయి. ► గతంలో ఆలీబాబా, టెన్సెంట్ వంటి చైనా సంస్థల నుంచి స్టార్టప్‌లకు పెట్టుబడుల వరద పారేది. మన దేశంతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడంతో చైనా నుంచి పెట్టుబడుల విషయమై భారత ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. దీంతో చైనా సంస్థల నుంచి నిధులు రావడం లేదు. ఫలితంగా స్టార్టప్‌లు తమ ఐపీఓ ప్రణాళికలను ముందుకు జరపక తప్పడం లేదు. -
జీఎస్టీతో రాష్ట్రానికి ఏటా 2వేల కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ (వస్తు సేవల పన్ను)తో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ విధానంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలిపారు. దీన్ని పూడ్చేందుకు కేంద్రం ప్రత్యేక హామీ ఇచ్చినప్పటికీ సరైన విధానం లేకపోవడంతో నష్ట నివారణ జరగడం లేదన్నారు. శనివారం తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘డిజిటల్ కామర్స్ అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై జరిగిన నేషనల్ కామర్స్ కాన్ఫరెన్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్కెట్‌కు అనుగుణంగా కామర్స్‌లో కొత్త కోర్సులు రూపొందించాలన్నారు. ఐటీ, కామర్స్ కలిపి అద్భుతమైన డిజిటల్ కామర్స్‌కు రాష్ట్రం నుంచే పునాదులు పడాలని, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎస్.రామచంద్రం, పాలమూరు యూనివర్సిటీ వీసీ రాజారత్నం ఇద్దరు కలసి ఈ పనికి పూనుకోవాలని సూచించారు. వర్సిటీలకు మంజూరు చేసిన 1,061 పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతులిచ్చినప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ఆలస్యం చేస్తున్నాయం టూ వర్సిటీ పాలకమండళ్లపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావు, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
భారత డిజిటల్ కామర్స్‌కు వాట్సాప్ తోడ్పాటు
న్యూఢిల్లీ: డిజిటల్ కామర్స్ విభాగంలో తమ వంతు తోడ్పాటు అందించడంపై చర్చించేందుకు మెసేజింగ్ యాప్ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ యాక్టన్ శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. తమకు కీలకమైన భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారని యాక్టన్ తెలిపారు. డిజిటల్ ఇండియా నినాదం లక్ష్యాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులు సురక్షితమైనవిగాను, సరళతరంగాను ఉంటాయని ఆయన వివరించారు. భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు యాక్టన్ వెల్లడించినట్లు మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు. ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్ ప్రస్తుతం భారత్‌తో పాటు బ్రెజిల్ తదితర దేశాల్లో డీఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా మారింది. భారత్‌లో హైక్, స్నాప్‌చాట్, వైబర్ వంటి సంస్థలతో పోటీ పడుతోంది. వాట్సాప్‌కి 100 కోట్ల పైగా యూజర్లు ఉండగా.. ఇందులో సుమారు 20 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ఆదాయ ఆర్జన దిశగా ఈ ఏడాది నుంచి యాడ్లపై కూడా వాట్సాప్ దృష్టి సారిస్తోంది. -
128 బిలియన్ డాలర్లకి డిజిటల్ కామర్స్ మార్కెట్
న్యూఢిల్లీ: భారత డిజిటలఖ కామర్స్ మార్కెటఖ 2017 నాటికి 128 బిలియన్ డాలర్లకు చేరుతుందని అసోచావఖు, డెలాయిట్ సంస్థలు అంచనా వేశాయి. డిజిటల్ కామర్స్ మార్కెట్ పెరుగుదలకు మొబైల్ వినియోగ వృద్ధి, ఇంటర్నెటఖ వ్యాప్తి, మొబైలఖ-కామర్స్ అమ్మకాలు, అడ్వానఖ్సడ్ షిప్పింగ్ అండ్ పేమెంటఖ ఆప్షనఖ్స, డిస్కౌంట్లు వంటి తదితర అంశాలు గణనీయంగా దోహదపడతాయని వివరించాయి. అసోచావఖు-డెలాయిట్ సంయుక్త సర్వే ప్రకారం.. ప్రస్తుతం 42 బిలియన్ డాలర్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెటఖ 2017లో 128 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఈ-కామర్స్ కంపెనీలు వాటి వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి, కస్టమర్ల అవసరాలను గుర్తించడం కోసం సోషల్ మీడియాలో కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయని సర్వే తెలిపింది. ఇనఖఫ్రాస్ట్రక్చర్ వృద్ధి అంతంత మాత్రంగా ఉన్న భారతఖలో మారుమూల ప్రదేశాలకు కూడా వస్తువులను సరఫరా చేయడం కష్టమని, సప్లై చైన్, లాజిస్టిక్స్ విభాగాలు చాలా ఒత్తిడికి గురికావాల్సి ఉంటుందని అసోచావఖు సెక్రటరీ జనరల్ డి ?స రావత్ తెలిపారు. దేశంలో ఈ-బిజినె?సకు సంబంధించిన పన్ను అంశాలు స్పష్టంగా లేవని, దీనిపై పురోగతి రావాల్సి ఉందన్నారు. డి జిటలఖ మార్కెటఖ వృద్ధికి ప్రభుత్వపు డిజిటలఖ ఇండియా కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు.