ONDC Launches Academy to Provide Info to Sellers, Network Participants on E-commerce - Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈతో కలసి ఓఎన్‌డీసీ అకాడమీ

Published Sat, Jul 22 2023 4:57 AM | Last Updated on Sat, Jul 22 2023 3:27 PM

ONDC launches academy to provide info to sellers, network participants on e-ecommerce - Sakshi

న్యూఢిల్లీ: ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ), ఎన్‌ఎస్‌ఈ సబ్సిడరీ అయిన ఎన్‌ఎస్‌ఈ అకాడమీ భాగస్వామ్యంతో ఓ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కామర్స్‌ వ్యాపారాన్ని సులభంగా ఎలా నిర్వహించాలనే దానిపై ఓపెన్‌ నెట్‌వర్క్‌ భాగస్వామ్యులు, విక్రేతలకు శిక్షణ ఇవ్వనుంది. టెక్స్‌ట్, వీడియో ఫార్మాట్‌ రూపంలో విక్రేతలకు కావాల్సిన సమాచారాన్ని ఓఎన్‌డీసీ అకాడమీ అందించనుంది.

ఈ విషయాన్ని డీపీఐఐటీ జాయింట్‌ సెక్రటరీ సంజీవ్‌ వెల్లడించారు. ఓ గ్రామస్థుడు ఈకామర్స్‌ పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినా, సెల్లర్‌ యాప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చని వివరించారు. టెక్నాలజీ పరిజ్ఞానం అవసరం లేకుండానే సొంత యాప్‌ను తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్‌ ప్రయాణాన్ని విజయవంతంగా ఎలా కొనసాగించాలనే సమాచారాన్ని సైతం ఈ అకాడమీ నుంచి పొందొచ్చు. ఓఎన్‌డీసీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్‌ ఈకామర్స్‌ నెట్‌వర్క్‌ కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement