NSE Academy
-
ఎన్ఎస్ఈతో కలసి ఓఎన్డీసీ అకాడమీ
న్యూఢిల్లీ: ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), ఎన్ఎస్ఈ సబ్సిడరీ అయిన ఎన్ఎస్ఈ అకాడమీ భాగస్వామ్యంతో ఓ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ వ్యాపారాన్ని సులభంగా ఎలా నిర్వహించాలనే దానిపై ఓపెన్ నెట్వర్క్ భాగస్వామ్యులు, విక్రేతలకు శిక్షణ ఇవ్వనుంది. టెక్స్ట్, వీడియో ఫార్మాట్ రూపంలో విక్రేతలకు కావాల్సిన సమాచారాన్ని ఓఎన్డీసీ అకాడమీ అందించనుంది. ఈ విషయాన్ని డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ వెల్లడించారు. ఓ గ్రామస్థుడు ఈకామర్స్ పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినా, సెల్లర్ యాప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చని వివరించారు. టెక్నాలజీ పరిజ్ఞానం అవసరం లేకుండానే సొంత యాప్‌ను తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్ ప్రయాణాన్ని విజయవంతంగా ఎలా కొనసాగించాలనే సమాచారాన్ని సైతం ఈ అకాడమీ నుంచి పొందొచ్చు. ఓఎన్డీసీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఈకామర్స్ నెట్వర్క్ కావడం గమనార్హం. -
మార్కెట్ నిపుణుల కోసం ఎన్ఎస్ఈ అకాడెమీ
హైదరాబాద్‌లోనూ కోర్సులు ముంబై: ఫైనాన్షియల్ మార్కెట్లో నిపుణుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని... అలాంటి వారిని తయారు చేయాలనే లక్ష్యంతో ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ ‘ఎన్ఎస్ఈ’ తాజాగా ఒక అకాడెమీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ ఈ కొత్త అకాడె మీ ద్వారా ఔత్సాహికుల కోసం పలు ఫైనాన్షియల్ కోర్సులను అందుబాటులో ఉంచింది. తొలిగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించి 11 నెలల పోస్ట్ గ్రాడ్యు యేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ఎన్ఎస్ఈ తెలిపింది. రెగ్యులర్ తరగతులు జూలై 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ అకాడె మీ శాఖ హైదరాబాద్‌లో కూడా ఉంది. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని ఎన్ఎస్ఈ తెలియజేసింది.