subsidiary
-
ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఒక స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎమ్ (భీమ్) తన ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్‌ను బీహెచ్ఐఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.లలితా నటరాజ్ గతంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేశారు. కాబట్టి నటరాజన్ 'బీహెచ్ఐఎమ్'ను వేగంగా అభివృద్ధి చేస్తారని భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సహరిస్తున్నట్లు సమాచారం. భారతదేశంలో ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ యాప్‌ల మీద ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బీహెచ్ఐఎమ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ఆలోచిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 85 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం భవిష్యత్తులో ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.బీహెచ్ఐఎమ్ అనేది 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్‌ని నేరుగా బ్యాంక్ చెల్లింపులు చేయడానికి లేదా యూపీఐ చెల్లింపులు చేయడానికి ఉపయోగించుకుపోవచ్చు. అయితే గూగుల్ పే, ఫోన్ పే వాడకంలోకి వచ్చిన తరువాత బీహెచ్ఐఎమ్ వినియోగం తగ్గిపోయింది. కాబట్టి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. -
YSRCP: అనుబంధ విభాగాలకు నూతన కార్యవర్గం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలకు నూతన కార్యవర్గాల నియామకం జరిగింది. బీసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలతో పాటు రైతు విభాగం తదితరాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కార్యవర్గం సైతం ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం సాయంత్రం ఆయా పేర్లను ప్రకటించింది. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తిని నియమించారు. ఉపాధ్యక్షులుగా డోలా జగన్, కాండ్రు కమల, బి.హరిప్రసాద్లతో పాటు మరో 39 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. అలాగే.. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం జాన్సన్‌ను.. ఉపాధ్యక్షులుగా ఎం.కొండలరావు, కేఎం. జోసఫ్, కె.మార్టిన్‌లతో పాటు మరో 42 మంది సభ్యులతో కార్యవర్గం నియమించారు. ఇక.. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా వి.ఖాదర్ బాషాను, అలాగే.. ఉపాధ్యక్షులుగా ఐహెచ్.ఫారూఖ్, హంజా హుసైనీ నియామకం మరో 38 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్ నాగిరెడ్డిని, ఉపాధ్యక్షులుగా త్రినాథ్ రెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, వంగల భరత్ కుమార్ రెడ్డి నియమించారు. రైతు విభాగంలో మరో 34 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా(సంయుక్తంగా) కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణలను నియమించారు. ఉపాధ్యక్షులుగా అంబికా రాజా, కొత్త కోటేశ్వరరావుగుప్త, పమిడి సత్యనారాయణశెట్టి నియమించారు. వాణిజ్య విభాగంలో మరో 71 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఇక.. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా గంజి చిరంజీవిని నియమించారు. ఇటీవలె గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఇక చేనేత విభాగం ఉపాధ్యక్షులుగా నిమ్మన లీలారాణి, చందన నాగగౌరీశంకరకోటిలింగం, జింకా విజయలక్ష్మిలను నియమించారు. మరో 51 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. -
ఎన్ఎస్ఈతో కలసి ఓఎన్డీసీ అకాడమీ
న్యూఢిల్లీ: ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), ఎన్ఎస్ఈ సబ్సిడరీ అయిన ఎన్ఎస్ఈ అకాడమీ భాగస్వామ్యంతో ఓ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ వ్యాపారాన్ని సులభంగా ఎలా నిర్వహించాలనే దానిపై ఓపెన్ నెట్వర్క్ భాగస్వామ్యులు, విక్రేతలకు శిక్షణ ఇవ్వనుంది. టెక్స్ట్, వీడియో ఫార్మాట్ రూపంలో విక్రేతలకు కావాల్సిన సమాచారాన్ని ఓఎన్డీసీ అకాడమీ అందించనుంది. ఈ విషయాన్ని డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ వెల్లడించారు. ఓ గ్రామస్థుడు ఈకామర్స్ పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినా, సెల్లర్ యాప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చని వివరించారు. టెక్నాలజీ పరిజ్ఞానం అవసరం లేకుండానే సొంత యాప్‌ను తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్ ప్రయాణాన్ని విజయవంతంగా ఎలా కొనసాగించాలనే సమాచారాన్ని సైతం ఈ అకాడమీ నుంచి పొందొచ్చు. ఓఎన్డీసీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఈకామర్స్ నెట్వర్క్ కావడం గమనార్హం. -
అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ విస్తరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన విభాగంలో కార్యకలాపాలు మరింత విస్తరించింది. తాజాగా పూర్తి అనుబంధ సంస్థ అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఫోర్ లిమిటెడ్ ద్వారా మూడు అనుబంధ సంస్థల ఏర్పాటుకు తెరతీసింది. పునరుత్పాదక ఇంధన బిజినెస్ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్‌కు ఇవి అనుబంధ సంస్థలుగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. వీటి ద్వారా ప్రధానంగా పవన విద్యుత్, సౌర విద్యుత్‌సహా వివిధ పునరుత్పాదక ఇంధన మార్గాల ద్వారా విద్యుత్ ప్రసారం, అభివృద్ధి, పంపిణీ, విక్రయం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమై రూ. 2,088 వద్ద ముగిసింది. -
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత ‘వెలుగు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేవే. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా లాంటి అనేక ప్రజారంజక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కుటుబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వారి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపింది. లబ్దిదారుల కళ్లలో ఆనందం జిల్లాలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు నిరుపేదలే. నెలకు రూ.200 లోపు విద్యుత్ వినియోగించే ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆయా కుటుంబాలు ఎంతగానో ఆనందిస్తున్నాయి. గతంలో ఆయా కుటుంబాల్లో చాలామందికి విద్యుత్ సౌకర్యం ఉండేదికాదు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్ పెట్టుకునేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 జిల్లాలో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 ఉన్నాయి. వాటిలో ఎస్సీ విద్యుత్ కనెక్షన్లు 48,635, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 36,455 ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి జూలై నెల వరకు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్‌శాఖకు ప్రభుత్వం రూ.6.11 కోట్లు సబ్సిడీ కింద చెల్లించింది. చదవండి :మహిళల జీవితాల్లో ‘వైఎస్సార్ చేయూత’ వెలుగులు -
డీలిస్టింగ్‌పై సెబీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: లిస్టెడ్ అనుబంధ సంస్థల డీలిస్టింగ్ విషయంలో హోల్డింగ్ కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రామాణిక నిర్వహణ విధానాలను ప్రకటించింది. సర్దుబాటు పథకంలో భాగంగా లిస్టెడ్ అనుబంధ సంస్థను లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ స్టాక్ ఎక్సే్ంజీల నుంచి డీలిస్ట్ చేయదలచినప్పుడు రివర్స్ బుక్ బిల్డింగ్ పద్ధతి నుంచి మినహాయింపునకు సెబీ ఇటీవల అనుమతించింది. ఇందుకు వీలుగా పూర్తిస్థాయి నిబంధనలను తాజాగా విడుదల చేసింది. లిస్టయిన అనుబంధ సంస్థలు, హోల్డింగ్ కంపెనీలు ఒకే విధమైన బిజినెస్‌లు నిర్వహిస్తున్నప్పుడు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. వీటి ప్రకారం రెండు కంపెనీలు కలసిపోవడం ద్వారా భారీ ప్రయోజనాలకు అవకాశముండాలి. రెండు కంపెనీల ఆదాయంలో కనీసం 50 శాతం ఒకే బిజినెస్ నుంచి నమోదవుతూ ఉండాలి. అంతేకాకుండా రెండు సంస్థలూ ఒకే గ్రూప్‌నకు చెంది ఉండాలి. రెండు సంస్థలూ కనీసం మూడేళ్లుగా స్టాక్ ఎక్సే్ంజీలలో లిస్టయి ఉండాలి. వెరసి జూన్‌లో నోటిఫై చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సెబీ తాజాగా పలు నిబంధనలను విడుదల చేసింది. -
రిలయన్స్ భారీ పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. దీనిలో భాగంగా చమురు, రసాయనాల(ఆయిల్ టు కెమికల్స్–ఓటూసీ) విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. తదుపరి కంపెనీలో సౌదీ అరామ్కో వంటి వ్యూహాత్మక విదేశీ ఇన్వెస్టర్‌కు వాటాను విక్రయించనుంది. తద్వారా వాటాదారులకు మరింత విలువను చేకూర్చాలని యోచిస్తోంది. ఓటూసీ బిజినెస్‌కు మాతృ సంస్థ నుంచి 25 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.81 లక్షల కోట్లు) రుణం లభించనుంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ద్వారా ఓటూసీ వేల్యూ చైన్‌లో లభించనున్న అవకాశాలపై దృష్టిపెట్టేందుకు వీలు చిక్కనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. దీంతో సొంతంగా మూలధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశముంటుందని వివరించింది. కంపెనీ కోసం ప్రత్యేకించిన యాజమాన్య టీమ్, ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం.. తదితరాలతో పటిష్టతను సంతరించుకోనుందని పేర్కొంది. హోల్డింగ్ కంపెనీగా.. ఆర్ఐఎల్కు చెందిన చమురు రిఫైనరీ, పెట్రోకెమికల్ ఆస్తులు, రిటైల్ ఇంధన బిజినెస్‌లతో ఓటూసీ ఏర్పాటుకానుంది. అయితే ఆయిల్, గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కేజీ డీ6 క్షేత్రాలు, టెక్స్టైల్ బిజినెస్‌లు ఓటూసీలో భాగం కాబోవని ఆర్ఐఎల్ వెల్లడించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ తదుపరి ఆర్ఐఎల్ కేజీ–డీ6తో కూడిన చమురు, గ్యాస్ వెలికితీత, ఉత్పత్తి బిజినెస్‌లతోపాటు.. ఫైనాన్షియల్ సర్వీసులు, ట్రెజరీ, టెక్స్టైల్ బిజినెస్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా నిలవనుంది. ఇతర బిజినెస్‌లు... ఆర్ఐఎల్ గ్రూప్‌లోని రిటైల్ బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహిస్తోంది. టెలికం, డిజిటల్ వెంచర్స్‌ను జియో ప్లాట్‌ఫామ్స్ కలిగి ఉంటుంది. రిలయన్స్ రిటైల్‌లో 85.1 శాతం, వాటా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 67.3 శాతం చొప్పున ఆర్ఐఎల్కు వాటాలున్నాయి. మిగిలిన రూ. 2 లక్షల కోట్ల విలువైన వాటాలను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఫేస్బుక్, గూగుల్ తదితరాలకు కేటాయించిన విషయం విదితమే. పూర్తి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్న ఓటూసీకి ఫ్లోటింగ్ రేటుపై పదేళ్ల కాలానికి రుణాన్ని ఆర్ఐఎల్ అందించనుంది. ఈ రుణాలను చమురు, గ్యాస్ రంగంలో ఆస్తుల కొనుగోలుకి ఓటూసీ వినియోగించనుంది. వచ్చే ఏడాది(2021–22) ద్వితీయార్థంలో ఓటూసీ ఏర్పాటుకు అన్ని అనుమతులూ లభించగలవని ఆర్ఐఎల్ అంచనా వేస్తోంది. ఓటూసీలో భాగం ప్రత్యేక కంపెనీగా ఆవిర్భవించనున్న ఓటూసీకి ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ ప్లాంట్లు, తయారీ యూనిట్లతోపాటు.. బ్రిటిష్ పెట్రోలియంతో ఏర్పాటు చేసిన ఇంధన రిటైల్ మార్కెటింగ్ జేవీలో ఆర్ఐఎల్కు గల 51 శాతం వాటా బదిలీకానుంది. సింగపూర్, యూకేలలోని అనుబంధ చమురు ట్రేడింగ్ సంస్థలు, ఉరుగ్వే పెట్రో మార్కెటింగ్ సంస్థను సైతం సొంతం చేసుకోనుంది. గుజరాత్, మహారాష్ట్ర మధ్య ఏర్పాటు చేసిన రిలయన్స్ ఇథేన్ పైప్‌లైన్, సిబూర్ జేవీలో ఆర్‌ఐఎల్‌కుగల దాదాపు 75 శాతం వాటాను పొందనుంది. -
రిలయన్స్ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ కలిగి ఉంటుందని ఆర్ఐఎల్ తెలిపింది. మొత్తం అపరేటింగ్ టీం, కొత్త సంస్థలోకి మారుతుందనీ, అలాగే ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఓటూసీ వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందనీ, ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదని రెగ్యులేటరీ సమాచారంలో రిలయన్స్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం లభించినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. అయితే, ఈక్విటీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ, ఎన్సీఎల్టీ బెంచ్‌ల నుండి ఇంకా క్లియరెన్స్ పొందలేదని చెప్పింది. 2022 నాటికి ముంబై, అహ్మదాబాద్ ఎన్సీఎల్టీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. సంస్థకు చెందిన రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్ ఆస్తులు మొత్తం కొత్త అనుబంధ సంస్థలోకి బదిలీ అవుతాయి. సౌదీ అరామ్కోతో ఒప్పందం అనంతరం మరింతగా ఇన్వెస్టర్ల ద్వారా కేపిటల్ సమకూర్చుకోవడానికి దోహద పడుతుందని కంపెనీ తెలిపింది. -
చైనాకు మరో పెద్ద దెబ్బ
టోక్యో : అమెరికా, ఇండియా నుంచి వరుస షాక్ లతో సతమవుతున్న చైనాకు వాణిజ్యపరంగా మరో దెబ్బ పడింది. జపాన్ తయారుదారుల పెట్టుబడులు చైనా నుంచి వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్దమవుతోంది. తమ యూనిట్లను చైనానుంచి ఇతర ఆసియా దేశాలకు తరలించే తమ దేశ ఉత్పత్తిదారులకు బ్సిడీలను ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్ తయారీదారులు చైనా నుండి ఉత్పత్తిని భారతదేశం లేదా బంగ్లాదేశ్ కు మార్చినట్లయితే సబ్సిడీలకు అర్హులని ఆర్థిక, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. (చైనాకు ఇస్కాన్ షాక్) జపాన్ వాణిజ్య విస్తరణ కార్యక్రమం ద్వారా దేశ సరఫరాలను నిర్దిష్ట ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించాలని, సబ్సిడీ కార్యక్రమం పరిధిని విస్తరించడం ద్వారా వైవిధ్యంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా దేశాలకు ఉత్పత్తిని తరలించే సంస్థలకు 2020 ఆర్థిక సంవత్సరానికి జపాన్ అనుబంధ బడ్జెట్ 23.5 బిలియన్ యెన్లను కేటాయించింది. ప్రధానంగా అత్యవసర పరిస్థితులలో కూడా వైద్య సామగ్రి, ఎలక్ట్రానిక్ భాగాల స్థిరమైన సరఫరాను అందించే వ్యవస్థను నిర్మించాలని భావిస్తోంది. జపాన్ నుంచి ప్రామాణిక పెట్టుబడుదారులనుంచి నమ్మకమైన భాగస్వాములకోసం చూస్తున్నామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. జపాన్, భారతదేశం వాణిజ్య వ్యాపార సంబంధాలను విస్తరించడం చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు. అలాగే దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా 13వ జపాన్ పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అస్సాంలో ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తోందని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర ఒక సమావేశంలో తెలిపారు. జపాన్ కంపెనీల సరఫరా గొలుసు చైనాపై ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది నిలిచిపోయింది. దీంతో మొదటి దశలో వియత్నాం లావోస్‌లలో హోయా ఎలక్ట్రానిక్ భాగాల ప్రాజెక్టు తయారీ సహా 30 తయారీ సంబంధిత ప్రాజెక్టులను జపాన్ ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం10 బిలియన్ యెన్లకు సబ్సిడీలను అందించింది. ఈ క్రమంలోనే తరువాతి ప్రణాళికలను కూడా తయారు చేస్తోంది. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రోడ్డు ఆస్తుల అమ్మకం!
ముంబై: భారీ రుణ భారంతో కుదేలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ భారత్‌లోని రహదారుల ఆస్తులన్నింటినీ విక్రయానికి పెట్టింది. రహదారుల రంగానికి సంబంధించిన కంపెనీల్లో ఈక్విటీ వాటాను విక్రయించనున్నామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరించిన 1,774 కి.మీల మేర ఉన్న ఏడు ఆపరేషనల్ యాన్యుటీ ఆధారిత ప్రాజెక్ట్‌లను, 6,572 కి.మీ. మేర విస్తరించిన 8 టోల్ ఆధారిత ప్రాజెక్టుల్లో వాటాను విక్రయించనున్నామని పేర్కొంది. అంతేకాకుండా 1,736 కి.మీ. మేర విస్తరించిన నిర్మాణంలోని 4 రోడ్డు ప్రాజెక్టుల్లోని వాటాను కూడా అమ్మకానికి పెట్టినట్లు వివరించింది. తిరువనంతపురంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను, ఈపీసీ విభాగానికి సంబంధించిన ఆస్తులను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్కు చెందిన నిర్వహణ, మెయింటెనెన్స్ వ్యాపారాలను కూడా ఈ గ్రూప్ విక్రయించనున్నది. -
సబ్సిడీ బర్రెల పథకానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ పాడి పశువుల పథకానికి తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటివరకు తమ వాటా సొమ్ము చెల్లించిన రైతులు తప్ప కొత్త వారి నుంచి ఎలాంటి డీడీలు తీసుకోకూడదని అధికారులకు అంతర్గత ఆదేశాలు వెళ్లాయి. అనేకచోట్ల బర్రెలు, ఆవులు కొనకుండానే కొన్నట్లు చూపుతుండటం, అధికారుల అవినీతి నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పైగా ఎన్నికల సమయంలో పర్యవేక్షణ లేకపోవడం కూడా అక్రమాలకు కారణంగా భావిస్తున్నారు. రైతులకు ఇదే విషయాన్ని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అటు కొత్తగా డీడీలు చెల్లించాలనుకున్న రైతులు, ఇటు ఇప్పటికే డీడీలు చెల్లించి పాడి పశువులు పొందని వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 52,491 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించగా అందులో 32,175 మందికి పాడి పశువులను సరఫరా చేశారు. మిగిలిన రైతులు కూడా చాలామంది డీడీలు చెల్లించేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు వద్దనీ ఎన్నికల తర్వాత ఇవ్వండని పశు సంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఐటీసీ అమెరికా అనుబంధ కంపెనీ విక్రయం
♦ పూర్తి వాటా విక్రయించిన ఐటీసీ ♦ డీల్ విలువ రూ.160 కోట్లు న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ తన అమెరికా పూర్తి అనుబంధ సంస్థ, కింగ్ మేకర్ మార్కెటింగ్‌లో పూర్తి వాటాను విక్రయించనున్నది. ఈ వాటాను రూ.160 కోట్లకు విక్రయించనున్నామని ఐటీసీ కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నమోదైన కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ.. ఐటీసీ తయారు చేసిన సిగరెట్లను అమెరికాలో పంపిణి చేస్తోంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీలో పూర్తి వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనను తమ కార్పొరేట్ మేనేజ్మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందని ఐటీసీ వివరించింది. దీనికి సంబంధించిన ఒక ఒప్పందం ఈ నెల 8న జరిగిందని, ఈ విక్రయానికి అమెరికాలోని వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. ఏస్, చక్కర్స్, హై-వాల్, గోల్డ్ క్రెస్ట్బ్రాండ్లను కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ పంపిణి చేస్తోంది. ఈ విక్రయం పూర్తయిన తర్వాత కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ తమ అనుబంధ కంపెనీగా కొనసాగదని ఐటీసీ స్పష్టం చేసింది. ఈ వాటా విక్రయ నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీసీ షేర్ అర శాతం లాభపడి రూ.240 వద్ద ముగిసింది. -
డిఫెన్స్ రంగంలోకి అనిల్ అంబానీ గ్రూప్
మూడు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసిన రిలయన్స్ ఇన్ఫ్రా న్యూఢిల్లీ: రక్షణ, విమానయాన విడిభాగాల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ గురువారం ప్రకటించింది. భారీగా వృద్ధి అవకాశాలున్న ఈ రంగం మార్కెట్ పరిమాణం వచ్చే పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా. దీనికోసం గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాక్చర్ నేతృత్వంలో మూడు అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం.. దేశంలో సమగ్ర రక్షణ పరికరాల పరిశ్రమ రూపుదిద్దుకోవడానికి అత్యం త సానుకూల పరిస్థితులను కల్పిస్తోంది. తయారీ రంగానికి జోష్‌నిచ్చేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో అడాగ్ గణనీయమైన పాత్రను పోషిస్తుంది. భారత భద్రత దళాలకు అత్యుత్తమ సేవలను అందించడంతో పాటు రక్షణ పరికరాల దిగుమతులను భారీగా తగ్గించడం, ఈ రంగంలో సుశిక్షితులైన నిపుణులను తయారు చేయడం మా లక్ష్యం’ అని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. -
వొడాఫోన్ ఇండియా.. ఇక బ్రిటిష్ కంపెనీ
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా సబ్సిడరీలోని మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను రూ.10,141 కోట్లతో కొనుగోలు చేయడానికి యునెటైడ్ కింగ్డమ్కు చెందిన వొడాఫోన్ గ్రూప్ చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశీయ టెలికం రంగంలో అతిపెద్ద ఏకమొత్తం విదేశీ పెట్టుబడి ఇదే. కొనుగోలు పూర్తయిన తర్వాత పూర్తిగా విదేశీ సంస్థ ఆధీనంలో ఉండే కంపెనీగా వొడాఫోన్ ఇండియా ఆవిర్భవించనుంది. వొడాఫోన్ గ్రూప్ ప్రతిపాదనను ఆమోదించినట్లు గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం అనంతరం ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. టెలికంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను అనుమతిస్తూ ప్రభుత్వం గతేడాది నిర్ణయించడం విదితమే. చందాదారుల సంఖ్య పరంగా దేశంలో రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఇండియాలో ప్రస్తుతం 64.38% వాటా వొడాఫోన్ గ్రూప్‌నకు ఉంది. మైనారిటీ షేర్హోల్డర్లలో అజయ్ పిరమల్ వద్ద 10.97%, వొడాఫోన్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జీత్ సింగ్ వద్ద 24.65% షేర్లున్నాయి. వీటి కొనుగోలుకు గాను అనల్జీత్ సింగ్‌కు రూ.1,241 కోట్లు, పిరమల్‌కు రూ.8,900 కోట్లను వొడాఫోన్ గ్రూప్ చెల్లించనుంది. పిరమల్‌కంటే ఎక్కువ వాటా వున్న అనల్జీత్‌కు బాగా తక్కువ మొత్తం చెల్లించడానికి సింగ్, వొడాఫోన్ల మధ్య ఒప్పందమే కారణం. సింగ్‌కు చెందిన మరో కంపెనీలో పరోక్షంగా వొడాఫోన్ పెట్టుబడి చేయడం దీని నేపథ్యం. -
రూ.70కి పైగా పెరిగిన సబ్బిడీయేతర వంటగ్యస్ ధర