సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాలకు నూతన కార్యవర్గాల నియామకం జరిగింది. బీసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలతో పాటు రైతు విభాగం తదితరాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కార్యవర్గం సైతం ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం సాయంత్రం ఆయా పేర్లను ప్రకటించింది.
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తిని నియమించారు. ఉపాధ్యక్షులుగా డోలా జగన్, కాండ్రు కమల, బి.హరిప్రసాద్లతో పాటు మరో 39 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. అలాగే.. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం జాన్సన్‌ను.. ఉపాధ్యక్షులుగా ఎం.కొండలరావు, కేఎం. జోసఫ్, కె.మార్టిన్‌లతో పాటు మరో 42 మంది సభ్యులతో కార్యవర్గం నియమించారు. ఇక.. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా వి.ఖాదర్ బాషాను, అలాగే.. ఉపాధ్యక్షులుగా ఐహెచ్.ఫారూఖ్, హంజా హుసైనీ నియామకం మరో 38 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్ నాగిరెడ్డిని, ఉపాధ్యక్షులుగా త్రినాథ్ రెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, వంగల భరత్ కుమార్ రెడ్డి నియమించారు. రైతు విభాగంలో మరో 34 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా(సంయుక్తంగా) కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణలను నియమించారు. ఉపాధ్యక్షులుగా అంబికా రాజా, కొత్త కోటేశ్వరరావుగుప్త, పమిడి సత్యనారాయణశెట్టి నియమించారు. వాణిజ్య విభాగంలో మరో 71 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు.
ఇక.. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా గంజి చిరంజీవిని నియమించారు. ఇటీవలె గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఇక చేనేత విభాగం ఉపాధ్యక్షులుగా నిమ్మన లీలారాణి, చందన నాగగౌరీశంకరకోటిలింగం, జింకా విజయలక్ష్మిలను నియమించారు. మరో 51 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment