departments
-
YSRCP: అనుబంధ విభాగాలకు నూతన కార్యవర్గం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలకు నూతన కార్యవర్గాల నియామకం జరిగింది. బీసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలతో పాటు రైతు విభాగం తదితరాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కార్యవర్గం సైతం ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం సాయంత్రం ఆయా పేర్లను ప్రకటించింది. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తిని నియమించారు. ఉపాధ్యక్షులుగా డోలా జగన్, కాండ్రు కమల, బి.హరిప్రసాద్లతో పాటు మరో 39 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. అలాగే.. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం జాన్సన్‌ను.. ఉపాధ్యక్షులుగా ఎం.కొండలరావు, కేఎం. జోసఫ్, కె.మార్టిన్‌లతో పాటు మరో 42 మంది సభ్యులతో కార్యవర్గం నియమించారు. ఇక.. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా వి.ఖాదర్ బాషాను, అలాగే.. ఉపాధ్యక్షులుగా ఐహెచ్.ఫారూఖ్, హంజా హుసైనీ నియామకం మరో 38 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్ నాగిరెడ్డిని, ఉపాధ్యక్షులుగా త్రినాథ్ రెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, వంగల భరత్ కుమార్ రెడ్డి నియమించారు. రైతు విభాగంలో మరో 34 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా(సంయుక్తంగా) కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణలను నియమించారు. ఉపాధ్యక్షులుగా అంబికా రాజా, కొత్త కోటేశ్వరరావుగుప్త, పమిడి సత్యనారాయణశెట్టి నియమించారు. వాణిజ్య విభాగంలో మరో 71 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఇక.. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా గంజి చిరంజీవిని నియమించారు. ఇటీవలె గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఇక చేనేత విభాగం ఉపాధ్యక్షులుగా నిమ్మన లీలారాణి, చందన నాగగౌరీశంకరకోటిలింగం, జింకా విజయలక్ష్మిలను నియమించారు. మరో 51 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్‌నగర్‌లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందన్నారు. జీఎస్టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 2022 వరకూ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ. 25,928 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నామని చెప్పారు. ఈ కాలంలో దేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపీలో 28.79శాతంగా ఉందని పేర్కొన్నారు. లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్టిమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి పరిచామన్నారు. హెచ్ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. చదవండి: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: ► పన్ను చెల్లింపు దారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలి. ►పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు ►గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలి. ► బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలి. ► ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి. ► నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ► ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులో తీసుకు రావాలి. ► దీనికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలి. ► అక్రమ మద్యం తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. ► రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. ► ఈ కమిటీలో ఐఏఎస్అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్‌లను సభ్యులుగా పెట్టాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి ► రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు దఖలు పడతాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగం అన్నదానిపై అవగాహన కల్పించాలి. ► అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. ► నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలి ► ఇందులో ప్రొఫెసనల్ ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలి. ► ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలి. ► రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలి. ► భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోదగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ► సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలన్న సీఎం. ఈ పోస్టర్లను అన్ని కార్యాలయాల్లో ఉంచాలి. ► గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం కాగా, ఈ ఏడాది సెప్టెంబరు వరకూ రూ.1400 కోట్లు ఆదాయం. ► మొత్తం ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 43శాతం పెరుగుదల ఉంటుందని అంచనాగా అధికారులు తెలిపారు. ► మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందినవారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలి. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. ► ఆపరేషన్‌లో లేనివాటిపై దృష్టిపెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలి. ► ప్రతినెలా కూడా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్నదానిపై నిరంతరం సమీక్ష చేయాలి. ► ఇతర రాష్ట్రాలతో పోల్చితే సానుకూల పరిస్థితులను సృష్టించుకోవడం ద్వారా... రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. ► కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదని, వినూత్న ఆలోచనలు చేయాలి. ► పక్కరాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు తగిన సానుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉండేలా ఆలోచనలు చేయాలి. ► ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని డీలర్లు వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగు చూశాయి. ► దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ ) కె నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీపర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ టాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు -
ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆదాయార్జన శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. మైనింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, నారాయణ స్వామి, విశ్వరూప్, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. చదవండి: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా -
కేంద్రంలో 9 లక్షల ఉద్యోగ ఖాళీలు.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది, ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కింద పనిచేసే పే రీసెర్చి వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో 9 లక్షల 79 వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయడం లేదని చెప్పారు. చదవండి: ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత ఆయా మంత్రిత్వ శాఖలదే. అదో నిరంతరం ప్రక్రియ. ఉద్యోగుల రిటైర్మెంట్, ప్రమోషన్, రాజీనామా, మరణం వంటి కారణాలతో ఖాళీలు ఏర్పడతాయని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలన్నింటినీ నిర్దిష్ట కాల పరిమితిలోగా భర్తీ చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
9.79 లక్షల ఖాళీలు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1వ తేదీ నాటికి 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 40.35 లక్షలు అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 30,55,876 మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ బాధ్యత సంబంధిత శాఖ, డిపార్టుమెంట్దేనని తేల్చిచెప్పారు. ఖాళీ పోస్టుల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. -
డిజిటల్ ఇండియా: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ ఉధృతి, తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, విభాగాల్లో డైరీలు, గ్రీటింగ్ కార్డులు, కాఫీ టేబుల్ బుక్స్, క్యాలెండర్లను భౌతిక రూపంలో ముద్రించడాన్నిని షేధించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు,స్వయంప్రతిపత్త సంస్థలతో పాటు, ఇతర ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధిత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. రాబోయే సంవత్సరంలో ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు ఇతర వస్తువులను ముద్రించకూడదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం (సెప్టెంబర్ 2న) ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు,పండుగ గ్రీటింగ్ కార్డులు లాంటి వాటిని ఇకపై ఇ-బుక్స్ రూపంలో మాత్రమే అందించాలని ఆదేశించింది. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఉత్పాదకత రెట్టింపు, ప్రణాళిక, షెడ్యూలింగ్, అంచనాలకు నూతన సాంకేతిక ఆవిష్కరణల ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడమే కాదు నిర్వహణ కూడా సమర్థవంతంగా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది. -
కేంద్రంలో ఏడు లక్షల ఉద్యోగాలు ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో దాదాపు ఏడు లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం ఆరు లక్షల 83వేల 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు అందించిన సమాచారంలో వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) బ్యాక్ లాగ్ రిజర్వు పోస్టుల్లో కూడా ఖాళీలు ఉన్నాయని మరో సమాధానంలో మంత్రి చెప్పారు. రాజ్యసభకు అందించిన లిఖిత పూర్వక సమాధానంలోని డేటా ప్రకారం గ్రూప్ సీ లో మొత్తం 5,74,289 , గ్రూప్ బీ లో 89,638 గ్రూప్ ఏ విభాగంలో 19,896 ఉద్యోగాలు భర్తీ కావల్సి వుందని తన లిపారు. ఆయా కేంద్రప్రభుత్వ విభాగాలు అందించిన సమాచారం ప్రకారం 2019-20 సంవత్సరానికి గాను 1, 05,338 పోస్టుల భర్తీ ప్రక్రియను ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) ద్వారా ప్రారంభించామన్నారు. 2017-18లో గ్రూప్ సీ లెవల్ 1 పోస్టుల 1,27,573 పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్స్ (సీఈఎన్) కింద రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ద్వారా 1,27,573 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. గ్రూప్ సీ, లెవల్ -1లో లక్షా 56వేల138 ఖాళీలను భర్తీ చేసే మరో ఐదు సీఈ నోటిఫికేషన్లను కూడా 2018-19లో జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఎస్ఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినవి కాకుండా 19,522 ఖాళీలను వివిధ గ్రేడ్లలో భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మొత్తంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సీఈఎన్‌ల ద్వారా ఖాళీలను భర్తీ చేసే నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని సింగ్ తెలిపారు. అలాగే జనవరి 1, 2019 నాటికి ఎస్సీలకు 1,713 (ఎస్సీ)బ్యాక్లాగ్ ఖాళీలు, ఎస్టీలకు 2,530 బ్యాక్లాగ్ ఖాళీలు, ఓబీసీలకు 1,773 బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ కాలేదని మంత్రి తెలిపారు -
ఇక ఆ ఉద్యోగాలన్నీ గల్లంతేనా..? కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత అయిదు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను రద్దు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక సమర్పించాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఉద్యోగాల రద్దుపై అన్ని మంత్రిత్వ శాఖలను, విభాగాలను యాక్షన్ రిపోర్టును కోరామని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని శాఖల అదనపు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, పారామిలిటరీ దళాల చీఫ్, ఇతర సంబంధిత సంస్థల అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఐదేళ్లుగా భర్తీకాని ఉద్యోగాలపై త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా గతంలోనే అన్నిమంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారులు , ఉమ్మడి కార్యదర్శులు (అడ్మినిస్ట్రేషన్) / విభాగాలను కోరినట్టు వెల్లడించింది. అయితే కొన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు స్పందించినప్పటికీ, మరికొన్ని నివేదికలు సమగ్రంగా లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జనవరి 16, 2018 తేదీన సంబంధిత మెమోరాండం జారీ చేసినట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా ప్రాథమిక అంచనా ప్రకారం, ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా అనేక వేల కేంద్ర ప్రభుత్వం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా హోంశాఖ అధికారి తెలిపారు. -
ఆసుపత్రుల్లో స్వచ్ఛత కోసమే ‘కాయకల్ప’
ప్రొగ్రాం అధికారి డాక్టర్ దుర్గప్రసాద్ బాన్సువాడ : ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ‘కాయకల్ప’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రొగ్రాం అధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని బుధవారం ఆయన పరిశీలించారు. గర్భిణుల వార్డు, మేల్, ఫిమేల్ వార్డులు, పిల్లల విభాగాన్ని, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, ప్రసూతి విభాగాన్ని, స్టాఫ్ రూంలను, పడకలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘కాయకల్ప’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతను పాటించే ఆసుపత్రులను ఎంపిక చేసి, గ్రేడింగ్ ఇస్తుందని, తద్వారా ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరవుతాయన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ద్వారా కొనసాగుతున్న బాన్సువాడ, నాగారెడ్డిపేట, నవీపేట, కమ్మర్పల్లి ఆసుపత్రులకు 70 శాతం స్వచ్ఛత గ్రేడింగ్ లభించిందన్నారు. నివేదికను అందజేసిన తరువాత ‘కాయకల్ప’కు సంబంధించిన లబ్ధి చేకూరుతుందన్నారు. ఆయన వెంట నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ అధికారి డీ వెంకటయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్‌ప్రసాద్, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ శాఖలపై సమీక్ష
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కొత్త జిల్లాల ఏర్పా టు తర్వాత ఏ విధంగా ఉండాలనే విషయంపై ఏజేసీ తరుపతిరావు, పీఓ అమయ్‌కుమార్ సమీక్షించారు. కలెక్టరేట్లోని ఏజేసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని అధికారులు, జిల్లాలకు కేటాయింపులు, సిబ్బంది కొరత, తదితర అంశాలపై చర్చిం చారు. అనంతరం కలెక్టర్‌కు తుది నివేదిక అందజేశారు. సమావేశంలో ఈడీలు నర్సింహా స్వామి, సురేష్, డీడీలు శంకర్, చందన, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల ఏర్పాటుపై 2,428 అప్పీళ్లు హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి బుధ వా రం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 2428 అప్పీళ్లు అందాయి. ఈ మేరకు అధికారులు అభ్యంతరాల వివరాలను తెలిపారు. హన్మకొండ జిల్లాపై 1145, జయశంకర్ జిల్లాపై 570, మహబూబాబాద్ జిల్లాపై 40, వరంగల్ జిల్లాపై 253 అప్పీళ్లు అందినట్లు చెప్పారు. అలాగే రెవెన్యూ డివిజన్లు, మండలాలపై మెుత్తం 420 అభ్యంతరాలు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. -
కామారెడ్డి జిల్లా ఏర్పాటు వేగవంతం
ఏర్పాట్లను పరిశీలించి జేసీ రవీందర్‌రెడ్డి కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కామారెడ్డిలో జిల్లా కలెక్టరేట్ సముదాయం కోసం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపిక చేశారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి కలెక్టరేట్ భవనంలోని ఆయా గదులను పరిశీలించారు. అనంతరం వివిధ విభాగాలకు సంబంధించి గదులను ఖరారు చేశారు. మైనార్టీ పాఠశాల భవనంలోని రెండంతస్తుల్లోని భవనంతో పాటు హాస్టల్ భవనం, డైనింగ్ హాల్‌లను సైతం కలెక్టరేట్ కార్యాలయాల కోసం కేటాయించారు. ప్రధాన భవనంలో కలెక్టర్ చాంబర్, వివిధ ముఖ్య విభాగాల కార్యాలయాలు ఉంటాయి. మొదటి అంతస్తులో వివిధ సంక్షేమ శాఖలకు కేటాయించారు. మొత్తం 60 శాఖలకు సంబంధించి కార్యాలయాలు అవసరం ఉండగా ప్రస్తుతం కలెక్టరేట్లో కలెక్టర్ చాంబర్, సంక్షేమశాఖలు, రెవెన్యూ, పరిపాలన తదితర విభాగాలకు గదులను కేటాయించారు. జిల్లా పరిషత్‌పై స్పష్టత లేకపోవడంతో పంచాయతీరాజ్‌కు సంబంధించి కార్యాలయాలకు గదులను కేటాయించలేదు. కాగా ఆయా భవనాల్లో చేపట్టాల్సిన చిన్నచిన్న మార్పుల గురించి జేసీ అధికారులకు సూచనలు చేశారు. జేసీ వెంట డీఆర్వో పద్మాకర్, ఆర్డీవో నగేష్, తహసీల్దార్ రవీందర్, ఆర్వీఎం ఈఈ కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు. కార్యాలయాల కోసం గదులను ఎంపిక చేశాం – జేసీ రవీందర్‌రెడ్డి కలెక్టరేట్ కోసం ఎంపిక చేసిన భవనంలో ఆయా విభాగాలకు సంబంధించి గదులను కేటాయించామని జేసీ రవీందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ భవనంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ దసరా నుంచి కొత్త జిల్లాలు అమలులోకి రానున్నందున కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పనులు చేపడుతున్నామని తెలిపారు. -
ఇక శాఖల వంతు
శాఖల విలీనం, కొనసాగింపుపై కసరత్తు షురూ పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం, పాలనా విభాగాలపై ఏర్పాటు నీటిపారుదల, అర్అండ్బి శాఖలకు జిల్లా హోదాతో అధికారుల ఏర్పాటు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా శాఖల పునర్ వ్యవస్థీకరణపై దృష్టి సారించింది. కొత్త జిల్లాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలి? యథాతథంగా కొనసాగించాలా? పెద్దగా పనిలేని, ప్రాధాన్యత లేని విభాగాలను విలీనం చేయాలా? కొత్త ఉద్యోగుల నియామకం అవసరమా? ఒకవేళ అవసరమైన పక్షంలో ఏ విభాగాల్లో నియమించాలి? వంటి అంశాలపై క్షుణ్నంగా కసరత్తు చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆయా అంశాలపై వెంటనే కసరత్తు మెుదలు పెట్టింది. ఒకే రకమైన పనితీరు కలిగిన విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కింది తెచ్చి జిల్లాస్థాయిలో ఒకే అధికారిని నియమించే అంశంపై జిల్లా అధికారులు ఇప్పటికే కొంత కసరత్తు చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో కసరత్తును మరింత వేగవంతం చేసి రెండ్రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఏయే విభాగాలు ఒకే రకమైన పనితీరును కలిగి ఉన్నాయి? వాటిని ఒకే గొడుగు తీసుకొస్తే కలిగే ప్రయోజనాలేమిటి? అట్లాగే ఏ విభాగానికి ఎక్కువ పని ఉంది? క్షేత్రస్థాయిలో ఉద్యోగుల అవసరం ఎక్కడ ఉంది? ప్రస్తుతమున్న శాఖలను యథావిధిగా కొనసాగిస్తే ఏవిధంగా ఉంటుంది? ఏయే శాఖలను విలీనం చేయవచ్చు? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఆయా పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఏయే పోస్టుల్లో సర్దుబాటు చేయాలనే అంశంపైనే మంగళవారం నుంచి జిల్లాలోని అన్ని శాఖల విభాగాధిపతులు కసరత్తు చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా అధికారుల కూర్పులోనూ కొత్త పద్ధతి అవలంబించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి శాఖకూ తప్పనిసరిగా జిల్లా అధికారి హోదా కలిగిన సిబ్బందిని నియమించేలా ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ప్రస్తుతం నీటిపారుదల, అర్అండ్బీ వంటి శాఖలకు ఈఈ, ఎస్ఈ, సీఈ వంటి అధికారులున్నారు. ఇకపై ఈ శాఖలకు జిల్లా నీటిపారుదల అభివృద్ధి అధికారి, రహదారుల అభివృద్ధి అధికారి హోదాతో ఆయా శాఖల జిల్లా అధిపతులను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి అధికారాలు బదలాయించాలనే అంశంపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేయనుంది. ప్రస్తుతం జిల్లాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది కంటే పర్యవేక్షించే అధికారులే ఎక్కువగా ఉన్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇకపై క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నియామకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించనున్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీలో కలెక్టర్ ఉన్నట్లా? లేనట్టా? జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పరిపాలనా విభాగాల కూర్పుపై పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కమిటీలో సీసీఎల్ఏ రేమండ్‌పీటర్, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్మితాసబర్వాల్, శాంతికుమారి, వరంగల్ జిల్లా కలెక్టర్ కరుణతోపాటు మన జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ కూడా సభ్యులుగా ఉంటారని తొలుత సమాచారమిచ్చారు. ఈ మేరకు టీవీ ఛానళ్లలో స్క్రోలింగ్ కూడా వచ్చింది. అయితే సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో మాత్రం నీతూప్రసాద్ పేరు లేదు. ఆమె స్థానంలో మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పేరుంది. టాస్క్‌ఫోర్స్ కమిటీలో మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ అధికారులను కూడా నియమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో నీతూప్రసాద్‌కు కూడా చోటు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
కీలక శాఖలు సీఎం చేతికి..
కేసీఆర్‌కు అదనంగా ఆర్డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల బాధ్యతలు మంత్రుల శాఖలు మార్చుతూ ఉత్తర్వులు జారీ కేటీఆర్‌కు మున్సిపల్, ఐటీలకుతోడు పరిశ్రమలు, గనులు, ఎన్నారై వ్యవహారాలు జూపల్లికి పంచాయతీరాజ్ శాఖతో సర్దుబాటు తలసానికి పశుసంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలు పోచారం శ్రీనివాసరెడ్డికి సహకారం.. హరీశ్ శాఖల్లో కోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన శాఖల బాధ్యతలు నేరుగా సీఎం కేసీఆర్ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఎంతో ప్రధానమైన ఆర్డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల శాఖలను కేసీఆర్ తన పరిధిలోకి తీసుకున్నారు. దీంతోపాటు మంత్రులు కె.తారకరామారావు, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డిల శాఖల్లో మార్పులు చేశారు. ముఖ్యమంత్రి తుది ఆమోదం మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేటాయింపులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి తన దగ్గరున్న శాఖలకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలు తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించి.. పశు సంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరున్నాయి. వీటిని తొలగించడంతోమిగిలిన వ్యవసాయ శాఖకు అదనంగా సహకార శాఖను పోచారానికి అప్పగించారు. మంత్రి కె.తారకరామారావుకు మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టారు. మున్సిపల్, ఐటీ శాఖలకు తోడుగా పరిశ్రమలు-వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, గనులు-భూగర్భ వనరులు, ఎన్నారై వ్యవహారాల శాఖలను అప్పగించారు. పరిశ్రమలు-వాణిజ్య శాఖకు ఇప్పటివరకు జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖను అప్పగించి సర్దుబాటు చేశారు. హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకే.. మంత్రి హరీశ్‌రావుకు మొదట కేటాయించిన శాఖల్లో మరోసారి కోత పడింది. ఇప్పటికే జరిగిన స్వల్ప మార్పుల్లో ఆయన దగ్గరున్న సహకార శాఖను తొలగించగా... ఇప్పుడు గనులు, భూగర్భ వనరుల శాఖ బాధ్యతల నుంచి తప్పించారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖలతో తనపై పనిభారం పెరిగినందున... గనులు, భూగర్భ వనరుల శాఖను మరొకరికి అప్పగించాలని హరీశ్‌రావు స్వయంగా మూడు నెలల కింద సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కొత్తగా గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వం కొత్తగా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ విభాగం పంచాయతీరాజ్‌లో అంతర్భాగంగా ఉండేది. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో... ముఖ్యమంత్రి ఈ శాఖను ప్రతిష్టాత్మకంగా స్వీకరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకుకీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. -
ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో!
► అన్ని శాఖల అధికారులకు జారీ కానున్న ఆదేశాలు ► ఆ రెండు రోజులు సీఎం సమీక్షలకు అందుబాటు కోసమే హైదరాబాద్: ఇకపై అన్ని శాఖల ఉన్నతాధికారులు ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ ఆదేశాలు జారీ చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం తరచూ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలు ఎప్పుడు ఏ శాఖపై నిర్వహిస్తారో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఫళంగా ‘సీఎం సమీక్ష నిర్వహిస్తారట, విజయవాడ రావాలంటూ’ సీఎం కార్యాలయం నుంచి హడావిడిగా ఫోన్లు రావడం, ఆదేశాలు అందుతుండడంతో సకాలంలో చేరుకోలేక అవస్థలకు గురవుతున్నారు. ఒకవేళ సమయానికి చేరుకున్నా ఒక్కోసారి సమీక్షలు గంటల తరబడి ప్రారంభం కావడం లేదు. దీంతో అధికారులకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే వారంలో రెండు రోజులు సీఎం సమీక్షల కోసం అధికారులు విజయవాడలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ నిర్ణయించారు. -
ప్రణాళికా శాఖకు బాబు అదేశాలు
-
శాఖల కేటాయింపుపై మంత్రులతో చంద్రబాబు చర్చ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపు విషయమై మంత్రులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఉప ముఖ్య మంత్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చిన్న రాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మంత్రులలో ఎవరికి ఏఏ శాఖ కేటాయించేది ఈ సమావేశంలో ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నెల 12న విశాఖలో మంత్రి మండలి తొలి సమావేశం జరుగుతుంది. 19 నుంచి అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. -
ఉమ్మడి రాజధాని,నదీజలాల పై జివోఎం చర్చల పూర్తి