న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1వ తేదీ నాటికి 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 40.35 లక్షలు అని తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 30,55,876 మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ బాధ్యత సంబంధిత శాఖ, డిపార్టుమెంట్‌దేనని తేల్చిచెప్పారు. ఖాళీ పోస్టుల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment