Jitendra Singh
-
2027లో చంద్రయాన్–4
న్యూఢిల్లీ: చంద్రుడిపై శిలలను సేకరించి భూమిపైకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మిషన్‌లో భాగంగా రెండు వేర్వేరు ప్రయోగాలుంటాయన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా ఐదు రకాల సాంకేతిక వస్తు సామాగ్రిని కక్ష్యలోకి పంపి, అక్కడే వాటిని అసెంబుల్ చేయిస్తారని వివరించారు. వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో ఇద్దరు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపి, తిరిగి సురక్షితంగా తీసుకువస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో గగన్‌యాన్ మానవరహిత మిషన్ లో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. దీంతోపాటు, 2026లో సముద్రయాన్‌లో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తలను 6 వేల మీటర్ల లోతులో సముద్రం అడుగు భాగానికి పంపిస్తామని వెల్లడించారు. వీరు సముద్రగర్భంలో వనరులు, కీలక, అరుదైన ఖనిజాల అన్వేషణతోపాటు, సముద్ర జీవజాలంపై పరిశోధనలు జరుపుతారని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1969లో అవతరించగా మొదటి లాంఛ్ ప్యాడ్ రెండు దశాబ్దాల అనంతరం 1993లో కార్యరూపం దాల్చిందని చెప్పారు. మరో దశాబ్ద కాలం తర్వాత 2004లో రెండో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించామన్నారు. విస్తరణ, మౌలిక వనరుల కల్పన, పెట్టుబడుల విషయంలో ఇస్రో గణనీయమైన ప్రగతి సాధించిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత అంతరిక్ష ఆర్థిక రంగ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని వివరించారు. దీనిని వచ్చే పదేళ్లలో 44 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లి, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. -
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ప్రపంచంలో ప్రత్యేకంగా ‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అన్నారు. సముద్ర ఉత్పత్తులపై ఆధారపడిన ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేలా భారత్ స్థిరమైన బ్లూఎకానమీపై దృష్టి సారిస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..‘కొత్త ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా డీప్ సీ మిషన్‌ను విస్తరించాలని భావిస్తోంది. భారత్‌కు సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉంది. జీవనోపాధి కోసం సముద్ర ఉత్పత్తులపై ఆధారపడేవారి ఆర్థికస్థితిగతులను మరింత మెరుగుపరచాలి. స్థిరమైన బ్లూఎనానమీని సాధించేలా కృషి చేయాలి. అందుకోసం సెంట్రల్ ఇన్స్టిట్యూట్లు సహకారం అందించాలి. డీప్ సీ మిషన్ కేవలం సముద్రంలోని ఖనిజాలు అన్వేషించడానికి మాత్రమే పరిమితం కాదు. సముద్రంలోని వైవిధ్యమైన వృక్ష, జంతుజాలాన్ని కనుగొనడానికి ఉపయోగపడాలి. సముద్రంలో 6,000 మీటర్ల లోతున డైవ్ చేయగల ‘మత్స్యయాన్ 6000’ అభివృద్ధి కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) చేసిన కృషి అభినందనీయం. సముద్రం లోతుకువెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా, ఒత్తిడిని తట్టుకునేలా ఇస్రో సహకారంతో ‘టైటానియం హల్’ను అభివృద్ధి చేస్తున్నాం’ అని చెప్పారు.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, 72 గంటల పాటు నీటిలో మునిగిఉండేలా అభివృద్ధి చేస్తున్న సెల్ఫ్-ఫ్లోటేషన్ టెక్నాలజీ పురోగతిని ఆయన సమీక్షించారు. డీప్ సీ మిషన్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందండీప్ సీ మిషన్భారతదేశ సముద్రజలాల్లోని ఖనిజాలను కనుగొనేందుకు డీప్ సీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సిబ్బంది సహాయం లేకుండా సముద్రగర్భంలోకి వెళ్లి మాంగనీస్ , నికెల్, కోబాల్ట్, కాపర్, ఐరన్ హైడ్రాక్సైడ్ వంటి ఖనిజాలతో కూడిన పాలీమెటాలిక్ పార్టికల్స్‌ను అన్వేషించి వాటిని వెలికితీసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఖనిజాలను ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఖనిజాల పరిశోధనతోపాటు వైవిధ్యమైన సముద్ర వృక్ష, జీవజాతులపై పరిశోధనలు జరిగేలా ఈ డీప్ సీ మిషన్‌ను వినియోగించుకోవాలని తాజాగా మంత్రి సూచిస్తున్నారు. -
Public Exam Bill 2024: పేపర్ లీకేజీలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీ ఉదంతాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో పరీక్షల అక్రమార్కులపై కేంద్రం కఠిన చర్యల కొరడా ఝులిపించింది. పేపర్ లీకేజీలు, నకిలీ వెబ్సైట్లుసహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు–2024’ను తీసుకొచ్చింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేకపోవడంతో దీనిని తీసుకొచ్చారు. బిల్లులో ఏముంది? ► ప్రశ్నపత్రం, ప్రశ్నపత్రం కీ లీకేజీకి పాల్పడి నా, కంప్యూటర్ నెట్వర్క్/ రీసోర్స్/ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసిన వ్యక్తులు/సంస్థలను కఠినంగా శిక్షిస్తారు ► నకిలీ వెబ్సైట్లు నిర్వహించడం, నకిలీ ఉద్యోగ/ప్రవేశ పరీక్షలు చేపట్టడం, నకిలీ అడ్మిట్ కార్డులు, ఆఫర్ లెటర్లు ఇవ్వడం, ఒకరి బదులు ఇంకొకరితో ఎగ్జామ్ రాయించడం వంటి అవకతవకలు చేసి నగదు వసూళ్లకు పాల్పడితే గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ► వీటితో ప్రమేయమున్న వ్యక్తులు/సంస్థలు/ఏజెన్సీలు/వ్యాపారసంస్థలు/ సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.1 కోటి జరిమానా విధిస్తారు. ఇంకోసారి ప్రభుత్వం నుంచి సంబంధిత పనులు చేపట్టకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధిస్తారు. ► యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్స్‌లో కలగజేసుకున్న అక్రమార్కులను సంబంధిత నియమాల కింద శిక్షిస్తారు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకూ ఈ బిల్లులోని నియమాలు వర్తిస్తాయి. ► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు చూసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సిబ్బంది మొత్తం ఈ చట్టపరిధిలోకి వస్తారు. -
2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో ఆరు పీఎస్ఎల్వీ మిషన్లు, మూడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఒక లాంచ్ వెహికల్ మార్క్–3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకొనేందుకు రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ..
తిరువనంతపురం: భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్ల(రూ.3.30 లక్షల కోట్ల)కు చేరుకోనుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఏకేడీ వంటి కొన్ని విదేశీ సంస్థలైతే భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి ఏకంగా 100 బిలియన్ డాలర్లకు కూడా చేరుకోవచ్చని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కేవలం 8 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇది ఇప్పుడు శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఒక్క విదేశీ ఉపగ్రహాల ప్రయోగం విభాగంలో యూరప్ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 240 మిలియన్ యూరోలు, అమెరికా ఉపగ్రహాల ప్రయోగం ద్వారా మరో 180 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించగలిగామని శనివారం ఆయన పీటీఐకి చెప్పారు. నేషనల్ రీసెర్చి ఫౌండేషన్, అనుసంధాన్‌ను నెలకొల్పాక అంతరిక్ష పరిశ్రమల ఏర్పాటు వేగంపుంజుకుందని తెలిపారు. -
స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1 సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సంస్థ, హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తిగా దేశీయంగా రూపొందించిన ఏడంతస్తుల పొడవైన, బహుళ దశల లో–ఎర్త్ ఆర్బిట్ రాకెట్ విక్రమ్–1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 300 కిలోల వరకు బరువుండే పేలోడ్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఈ రాకెట్‌ను ఆవిష్కరించారు. అలాగే 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ సంస్థ నూతన కేంద్ర కార్యాలయం ‘మ్యాక్స్–క్యూ’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్రసింగ్ మాట్లాడుతూ స్కైరూట్ ఏరోస్పేస్ను దేశంలోకెల్లా ఒకే గొడుగు కింద ఉన్న అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ అభివృద్ధి కేంద్రంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ చందన తదితరులు పాల్గొన్నారు. 2024 తొలినాళ్లలో ప్రయోగం విక్రమ్–1 పూర్తిగా కార్బన్–ఫైబర్‌తో తయారైన రాకెట్. ఇందులో 3డీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లను అమర్చారు. ఇది బహుళ ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచగలదు. 2024 తొలినాళ్లలోనే విక్రమ్–1ను ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే స్కైరూట్ 2022 నవంబర్ 18న విక్రమ్–ఎస్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించింది. -
చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు. ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు. సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు. చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్‌పుట్స్‌గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు. ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో? -
బీచ్‌శాండ్ మైనింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్‌శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బీచ్‌శాండ్ మైనింగ్‌లో ప్రైవేటు సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్రం.. అందులో అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటోందని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. గత ఏడెనిమిదేళ్లలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్‌శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా తీసుకుంటున్న చర్యల్లో పురోగతి కనిపిస్తుందన్నారు. అరుదైన ఖనిజ నిక్షేపాల మైనింగ్‌లో స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు. రిమోట్ ఓటింగ్‌పై పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ రిమోట్ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. ఫిబ్రవరి 28లోపు తమ అభిప్రాయాలను పంపాలని ఆయా పార్టీలకు సూచించామన్నారు. ఓటింగ్ ప్రక్రియలో వలస కార్మికుల భాగస్వామ్యం పెంచేందుకు ఈసీ గతేడాది డిసెంబర్ 28న ఒక నోట్‌ను అన్ని రాజకీయ పార్టీలకు పంపిందన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘వలస ఓటరును ఏ విధంగా నిర్వచించాలి, వారిని ఏ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించాలి, రిమోట్ ఓటింగ్ విధానం, వారి ఓట్ల లెక్కింపు, వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఏ విధంగా వర్తింప చేయాలి? వంటి అంశాలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీలను కోరాం’’ అని తెలిపారు. ఏపీ హైకోర్టులో 2,41,465 కేసులు పెండింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2,41,465 కేసులు, తెలంగాణ హైకోర్టులో 2,53,358 పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అంతేకాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నాటికి సుప్రీంకోర్టులో 69,511 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అదే సమయంలో దేశంలో అన్ని హైకోర్టుల్లో మొత్తం 59,87,477 కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. -
కొవ్వాడ అణువిద్యుత్‌పై వెస్టింగ్ హౌస్‌తో చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: కొవ్వాడలో ఆరు అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకోసం వెస్టింగ్‌హౌస్ కంపెనీ (అమెరికా)తో చర్చలు జరుపుతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. వెస్టింగ్ హౌస్ కంపెనీతో చర్చలు ముగిసిన అనంతరం అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం వంటి వివరాలతో ప్రాజెక్టు ప్రతిపాదనలు ఖరారవుతాయని వివరించారు. ప్రస్తుతానికి భూసేకరణ, ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన అనుమతులు పొందడం, ప్రాజెక్టు స్థలంలో భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం వంటి పనులు జరుగుతున్నాయని, అణు విద్యుత్ ప్రాజెక్టు కోసం 2,079 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 2,061 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, దీనిని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ పేరిట బదలాయించడం కూడా పూర్తయిందని ఆయన తెలిపారు. నిర్మాణ దశలో 8వేల మందికి, నిర్మాణం పూర్తిచేసుకుని విద్యుదుత్పత్తి ప్రారంభించిన అనంతరం ప్రతి యూనిట్లో 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 564 మంది విద్యార్థులకు కేవీపీవై ఫెలోషిప్‌లు.. కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) పథకం కింద గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 564 మంది విద్యార్థులకు ఫెలోషిప్ అందించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. విజయ సాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. కేవీపీవైకి ప్రత్యేకించి నిధులు కేటాయింపు ఏదీ ఉండదని, ఇన్స్పైర్, ఇన్స్పైర్–షీ బడ్జెట్ కింద కేటాయించిన నిధులతోనే కేవీపీవై ప్రోగ్రాం అమలుచేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పరిశోధన రంగంలో ప్రతిభ, యోగ్యత కలిగిన విద్యార్థులను అధిక సంఖ్యలో గుర్తించేందుకు కేవీపీవై ప్రోగ్రాంను (ఎస్హెచ్ఈ) స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో అనుసంధానించినట్లు తెలిపారు. దీని ద్వారా ఔత్సాహికులు ప్రాథమిక, నేచురల్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం లభిస్తుందని అన్నారు. అలాగే, ఇన్స్పైర్–మానక్ కింద ఏటా దేశవ్యాప్తంగా 10 లక్షల ఐడియాల నుంచి లక్ష ఐడియాలను ఎంపికచేసి వాటిని ప్రతిపాదించిన ఒక్కో విద్యార్థి బ్యాంకు అకౌంట్లో నేరుగా రూ.10 వేలు జమచేస్తున్నట్లు తెలిపారు. ఏపీ హైకోర్టులో ఐదు న్యాయమూర్తుల ఖాళీలు ఏపీహైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను గత నెల 30 వరకు 32 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ ఐదు న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండగా, ఒక ఖాళీ ప్రతిపాదన ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీ జియం వద్ద పెండింగ్‌లో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. (క్లిక్ చేయండి: ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు) -
'గతంతో పోలిస్తే త్వరితగతిన స.హ చట్టం కేసుల పరిష్కారం'
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు పీఎంవో కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వంలోని కేంద్ర ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్లతోపాటు ఇన్ఫర్మేషన్ అధికారులు, అప్పిలేట్ అథారిటీలో సభ్యుల సంఖ్య పెరగనందున కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యంతోపాటు పెండింగ్ కేసుల జాబితా పెరిగిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మౌఖికంగా జవాబిచ్చారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ఫర్మేషన్ కమిషన్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తూ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆర్టీఐ ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేసే ప్రయత్నం జరిగింది. తొలి అపీల్, మలి అపీల్, మడో అపీల్‌కు కాలవ్యవధిని నిర్ణయించాం. సమాచార హక్కు చట్టం కింద 24 వేల మంది ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో మాదిరి కాకుండా వార్షిక రిటర్న్స్ ఫైలింగ్ 92 శాతం దాటింది. గడచిన ఎనిమిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నట్లు రుజువు చేస్తున్నాయని చెప్పారు. చదవండి: (తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా) -
ఎనిమిదేళ్లలో కొత్తగా 20 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: అదనంగా 15వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 ఏడాదికల్లా దేశంలో కొత్తగా 20 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయం చెప్పారు. కొత్త వాటిల్లో మొదటిదానిని వచ్చే ఏడాది గుజరాత్‌లోని కాక్రపార్‌లో 700 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతారు. 2024 ఏడాదిలో కల్పకంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ప్రోటోటైప్ ఫాస్ట్‌బ్రీడ్ రియాక్టర్‌ను, 2025లో చెరో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను కుడంకుళంలో నిర్మిస్తారు. రాజస్తాన్‌లోని రావత్‌భటాలో చెరో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు, 2027లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. హరియాణాలోని గోరఖ్‌పూర్‌లో 2029 ఏడాదిలో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు సిద్ధంచేస్తారు. 700 సామర్థ్యంతో మరో పదింటిని వేర్వేరు రాష్ట్రాల్లో.. అంటే హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో నిర్మిస్తారు. -
నైపుణ్యం, సాంకేతికతతోనే దేశ ప్రగతి
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం అన్న రెండు స్తంభాల ఆధారంగానే భారతదేశ అభివృద్ధి ప్రస్థానం కొనసాగిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అన్నది అందరినీ కలుపుకొని పోయే సాధనంగా అవతరించిందని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం నిర్వహిస్తున్న ‘ప్రపంచ భూ ప్రాదేశిక సమాచార కాంగ్రెస్ –2022’ నాలుగు రోజుల సదస్సు మంగళవారం హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని వీడియో ద్వారా తన సందేశం అందించారు. ఎవరూ వెనుకబడిపో కూడదనే ప్రపంచ భూ ప్రాదేశిక సమాచార కాంగ్రెస్ ప్రధాన ఇతివృత్తం (జియో ఎనేబిలింగ్ గ్లోబల్ విలేజ్: నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్) మాదిరిగానే భారత ప్రభుత్వం కూడా చిట్టచివరి వ్యక్తికీ సాధికా రత కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోందని మోదీ తెలిపారు. అట్టడుగు వర్గాలకు కూడా భారీ లబ్ధి చేకూర్చే లక్ష్యంతో తాము కార్యక్ర మాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 45 కోట్ల మందికి బ్యాంకింగ్ సౌకర్యాలు, 13.5 కోట్ల మందికి బీమా ప్రయోజనం, 11 కోట్ల కుటుంబాలకు పారిశుధ్య వసతి, ఆరు కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా తాగునీరు అందించగలిగామని చెప్పారు. లబ్ధిదారులు పలు పాశ్చాత్యదేశాల జనాభా కంటే ఎన్నో రెట్లు ఎక్కువని మోదీ పేర్కొన్నారు. ఆ రెండే కీలకం... దేశ అభివృద్ధి ప్రస్థానంలో టెక్నాలజీ, నైపుణ్యం రెండే కీలకమైన స్తంభాలని ప్రధాని తెలిపారు. టెక్నాలజీ మార్పును తీసుకొస్తుందని, అతిచిన్న వ్యాపారి కూడా ఈ రోజున డిజిటల్ పేమెంట్లకు అంగీకరిస్తుండటం అలాంటి మార్పేనని వివరించారు. కోవిడ్–19 సమయంలోనూ ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో పేదలను ఆదుకుందని జామ్ ట్రినిటీగా చెప్పుకునే జన్‌ధన్ యోజన, ఆధార్ కార్డు ఆధారిత డేటాబేస్, మొబైల్ నంబర్ల ద్వారా 80 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందించగలిగిందని గుర్తుచేశారు. వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొనేందుకు కూడా టెక్నాలజీనే కీలకం కానుందన్నారు. అందరికీ అందుబాటులో భూ ప్రాదేశిక సమాచారం కోవిడ్ మహమ్మారి ప్రపంచానికి ఓ మేలుకొలుపు లాంటిదని, సంక్షోభ సమయంలో అన్ని వర్గాల వారినీ కలుపుకుని పోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిందని మోదీ చెప్పారు. భూ ప్రాదేశిక సమాచారం లాభాలను సమాజంతో పంచుకునే విషయంలో భారత్ ఇప్పటికే తనదైన ముద్ర వేసిందన్నారు. రెండు వందల సంవత్సరాలుగా పలు జాతీయ సంస్థలు సేకరించిన భూ ప్రాదేశిక సమాచారాన్ని ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చామని.. ఇది దేశ ప్రగతి ప్రస్థానంలో రెండో స్తంభమైన యువ నైపుణ్యానికి కొత్త దారులు పరిచిందని చెప్పారు. స్టార్టప్‌ల ఏర్పాటులో అగ్రగామిగా భారత్ స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, 2021 నుంచి ఇప్పటివరకూ వందకోట్ల డాలర్ల టర్నోవర్ సాధించిన యునికార్న్ స్టార్టప్‌లు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఇదంతా యువత నైపుణ్యం వల్లనే సాధ్యమైందన్నారు. ప్రభుత్వం భూ ప్రాదేశిక రంగంతోపాటు డ్రోన్ల వినియోగాన్నీ ప్రోత్సహిస్తోందని, అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ సంస్థలకూ భాగస్వామ్యం కల్పించిందని వివరించారు. మంగళవారం నాటి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
గగన్‌యాన్ తొలి ప్రయోగంపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 2024లో ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. 2022లోనే చేపట్టాల్సిన ఈ ప్రయోగంపై కరోనా ప్రభావం పడిందన్నారు. రష్యాలో వ్యోమగాముల శిక్షణ కూడా కరోనా వల్లే వాయిదా పడిందన్నారు. ‘‘గగన్‌యాన్ మిషన్ తొలి ప్రయోగ పరీక్ష ఈ ఏడాది చివర్లో ఉంటుంది. అంతరిక్ష నౌకను 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగిస్తారు. క్యాప్సూల్‌ను పారాచ్యూట్ల సాయంతో భూమిపైకి తీసుకొస్తారు. రెండోసారి అంతరిక్ష నౌకను మరింత ఎత్తుకు తీసుకెళ్తారు’’ అని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది చేపట్టే మరో యాత్రలో మహిళ ముఖ కవళికలుండే వ్యోమ్ మిత్ర అనే హ్యూమనాయిడ్‌ను పంపిస్తామని మంత్రి తెలిపారు. ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన 'విచిత్ర జీవి': వీడియో -
Nuclear Power Plants: దేశంలో 21 అణు విద్యుత్ కేంద్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 21 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు పీఎంవో మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. కార్బన్ ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలలో భాగంగా 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుందని గ్లాస్కోలో జరిగిన కాప్26 సదస్సులో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తద్వారా దేశ ఇంధన అవసరాలలో 50 శాతం మేర పునరుత్పాదక ఇంధనం ద్వారా పొందేలా అణు విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించినట్లు తెలిపారు. చదవండి: కేంద్రంలో 9 లక్షల ఉద్యోగ ఖాళీలు.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు దేశంలో నెలకొల్పుతున్న అణు రియాక్టర్లలో 8700 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన 11 రియాక్టర్లలో కొన్ని ఇప్పటికే ప్రారంభ అయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇవికాకుండా 700 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మరో 10 అణు రియాక్టర్ల స్థాపనకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్లుల్లో పనులు చురుగ్గా సాగుతుండగా కొన్ని చోట్ల పలు కారణాల వలన పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. అణు రియాక్టర్ల ఏర్పాటుకు అవసరమైన కీలక పరికరాల సరఫరాలో అవాంతరాలు, ఆర్థిక సమస్యలు, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతతోపాటు కోవిడ్ మహమ్మారి వంటి కారణాల వలన రియాక్టర్ల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకున్నట్లు వివరించారు. -
కేంద్రంలో 9 లక్షల ఉద్యోగ ఖాళీలు.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది, ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కింద పనిచేసే పే రీసెర్చి వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో 9 లక్షల 79 వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయడం లేదని చెప్పారు. చదవండి: ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత ఆయా మంత్రిత్వ శాఖలదే. అదో నిరంతరం ప్రక్రియ. ఉద్యోగుల రిటైర్మెంట్, ప్రమోషన్, రాజీనామా, మరణం వంటి కారణాలతో ఖాళీలు ఏర్పడతాయని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలన్నింటినీ నిర్దిష్ట కాల పరిమితిలోగా భర్తీ చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
9.79 లక్షల ఖాళీలు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1వ తేదీ నాటికి 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 40.35 లక్షలు అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 30,55,876 మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ బాధ్యత సంబంధిత శాఖ, డిపార్టుమెంట్దేనని తేల్చిచెప్పారు. ఖాళీ పోస్టుల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. -
'రిస్క్ హై తో ఇష్క్ హై', కేంద్ర సహాయ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించేవి స్టార్టప్ సంస్థలేనని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అంకుర సంస్థలకు ఊతం ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన విజయాల్లో ఒకటని ఆయన చెప్పారు. ‘స్టార్టప్‌లు భారత భవిష్యత్ ఎకానమీని నిర్దేశించగలవు. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ దిశా నిర్దేశం చేయగలదు‘ అని మంత్రి తెలిపారు. ‘2016లో దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు ప్రభుత్వం తోడ్పాటు అందించడం మొదలుపెట్టింది. దీనితో కేవలం అయిదు–ఆరేళ్లలోనే భారత స్టార్టప్ వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎగబాకింది‘ అని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత అంకుర సంస్థలు చరిత్ర లిఖిస్తున్నాయని, అత్యంత తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని అబ్బురపర్చే స్థాయికి ఎదిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. The Start-Ups have a huge opportunity to contribute in Sunrise Sectors-AI, Geospatial systems, Green Energy, Pharmaceuticals, Drones, Space Economy & Semi-conductors. pic.twitter.com/wwwwvNhWh0 — Anupriya Patel (@AnupriyaSPatel) June 2, 2022 ‘నవభారతం ఎంత సేపూ భవిష్యత్ భద్రత గురించి ఆలోచించడం లేదు. రిస్కులు తీసుకునేందుకు, కొత్తవి ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉంటోంది. స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది‘ అని ఆమె వివరించారు. అంకుర సంస్థలు కేవలం కాస్మోపాలిటన్ నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఉంటున్నాయని అనుప్రియ పటేల్ పేర్కొన్నారు. -
అనుమతుల్లో ఆలస్యం.. ఎన్ఐవో ల్యాబ్ నిర్మాణంలో జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని రిషికొండలో తలపెట్టిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) ల్యాబొరేటరీ నిర్మాణంలో అసాధారణ జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని కేంద్ర సైన్స్, టెక్నాలజీశాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అంగీకరించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. జాప్యానికి కారణాలను వివరించారు. ఎన్ఐవో ల్యాబొరేటరీ నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతి సాధించడంలో జాప్యం జరిగిందని చెప్పారు. అలాగే స్కీమ్‌లకు తుదిరూపం ఇవ్వడంలో, ఇతర పాలనాపరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరిగినట్లు తెలిపారు. ల్యాబొరేటరీ భవనాల ఆకృతులను రూపొందించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సంస్థను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ (పీఎంసీ)గా ఎంపికచేసి 2009లో పని అప్పగించినట్లు చెప్పారు. పీఎంసీ రూ.30 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ల్యాబొరేటరీ భవనాల డ్రాయింగ్లను సమర్పించిందన్నారు. కాంట్రాక్ట్ బాధ్యతల ప్రకారం ఎన్ఐవో క్యాంపస్‌కు సంబంధించి ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ పనులను పీఎంసీనే చేపట్టాలన్నారు. కానీ ఒప్పందంలోని బాధ్యతలను అది నేరవేర్చనందున ఎన్ఐవో క్యాంపస్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని చెప్పారు. అందువల్ల బీఎస్ఎన్ఎల్కు అప్పగించిన పీఎంసీ కాంట్రాక్టును రద్దుచేయడానికి ఉభయుల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దయిన వెంటనే ప్రభుత్వం కొత్త పీఎంసీ కోసం టెండరు పిలుస్తుందన్నారు. కొత్త పీఎంసీకి పనులు అప్పగించిన తర్వాత ఆరునెలల్లో పాలనాపరమైన, ఆర్థిక అనుమతులు పొందగలమని భావిస్తున్నట్లు చెప్పారు. క్యాంపస్, భవనాల నిర్మాణం ప్రారంభమైన తర్వాత 18 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
సివిల్స్ అభ్యర్థులకు సడలింపులు లేవు
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి, ఇతరత్రా ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందా అన్న వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆన్లైన్ క్రీడల క్రమబద్ధీకరణపై అధ్యయనం దేశంలో ఆన్లైన్ ఫాంటసీ క్రీడల ప్లాట్‌ఫామ్‌ల క్రమబద్ధీకరణకు జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై వివిధ మంత్రిత్వ శాఖలు అధ్యయనం చేస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్.. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రి టెండరు జారీకాలేదు ఆంధ్రప్రదేశ్‌లో రూ.384.26 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈఎస్ఐ ఆస్పత్రికి సంబంధించి టెండరు జారీచేయలేదని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. 400 పడకల ఆస్పత్రి (అదనంగా 50 పడకలు సూపర్ స్పెషాలిటీ వింగ్) బాధ్యతను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ)కి అప్పగించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఎన్ఆర్డీఎంఎస్లో ఏపీ లేదు న్యాచురల్ రీసోర్స్ డాటా మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎన్ఆర్డీఎంఎస్)లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లను చేర్చలేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞానశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్.. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమల్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. ఆదర్శ సంపర్క్‌లో మౌలిక వసతులు ఆదర్శ సంపర్క్ పథకంలో భాగంగా లేపాక్షి వీరభద్ర ఆలయం, శ్రీకాకుళంలోని శాలిహుండం బౌద్ధ ఆనవాళ్లు, నాగార్జున కొండల్లో పర్యాటకులకు మౌలికవసతులు కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చేనేతకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోండి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను రక్షించేలా కేంద్రం వారికి ప్రోత్సాహమిచ్చే చర్యలు తక్షణమే చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ కోరారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్ కేటాయించాలని, నూలు కొనుగోళ్లపై నేత కార్మికులకు సబ్సిడీని అందించే పథకాన్ని సవరించి అమలు చేయాలని కోరారు. దీన దయాళ్ హెల్త్ కార్గ్ ప్రోత్సాహ యోజనను పునరుద్ధరించడంతోపాటు రూ.30 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న సొసైటీలే ఈ పథకానికి అర్హులన్న నిబంధనలను తొలగించాలని సూచించారు. నూలు వస్త్రంపై విధించిన 5 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని కోరారు. -
అమెరికా సహకారంతో కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు పీఎంవో కార్యాలయ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిస్తూ.. మొత్తం ఆరు రియాక్టర్లతో 1,208 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ (పీహెచ్‌డబ్ల్యూఆర్)ను ఈ అణువిద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అణువిద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా మరో ఆరు నిర్మాణంలో ఉన్నాయని, మరో 10 పీహెచ్‌డబ్ల్యూఆర్‌ల ఏర్పాటుకు ఆర్థిక, పాలనాపరమైన మంజూరు లభించిందని వివరించారు. ఈ మొత్తం రియాక్టర్ల ద్వారా 7 వేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర పథకం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేసే ప్రాథమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వలదే అయినప్పటికీ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్రం పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకం కింద మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 2021 నుంచి మరో అయిదేళ్లు పొడిగించిందని తెలిపారు. ఈ పథకం కింద రూ.9 వేల కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 5,307 కోట్లని తెలిపారు. 1993–94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు 8,758 కోట్లు విడుదల చేసిందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.199 కోట్లని చెప్పారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల పెంపు ప్రతిపాదన వచ్చింది ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదన వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో కలిపి పూర్తి ప్రతిపాదనలు పంపాలని గత నవంబర్ 29న, గతనెల 3వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలను కోరామని కేంద్రమంత్రి చెప్పారు. -
తెలంగాణా రాష్ట్రానికి ఐటీఐఆర్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ విధానాన్ని పునః సమీక్షించాలని.. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఏడున్నరేళ్లలో రూ.1.47 లక్షల కోట్లకు చేరాయని.. ఈ రంగంలో రాష్ట్రానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో 24వ ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సును కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్క్లస్టర్లను అభివృద్ధి చేశామని.. మరో రెండు క్లస్టర్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. బెంగళూరు, అహ్మదాబాద్ తరహాలో అంతరిక్ష పరిశోధనలకు కేంద్రంగా, అనేక రక్షణ రంగ పరిశోధన సంస్థలకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో.. ఇన్‌స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచీ పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన పౌరసేవలు అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2017లో ‘మీసేవ’ను ఆధునీకరించామని.. రాష్ట్రంలోని 4,500 కేంద్రాల ద్వారా రోజూ లక్ష మందికి సేవలు అందించే వేదికగా తీర్చిదిద్దామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ‘ఈ–తాల్’ గణాంకాల ప్రకారం ‘మీసేవ’ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం.. ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎస్తోనియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. 2019 నుంచి ఈ టెక్నాలజీ ఆధారంగా పౌర సేవలు నిరంతరం అందిస్తున్నామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ నుంచి రిటైర్డ్ ఉద్యోగుల లైఫ్ సర్టిఫికెట్లు, ఓటర్ల గుర్తింపు వంటి అనేక అంశాల్లో ఈ–గవర్నెన్స్‌కు పెద్దపీట వేస్తున్నామన్నారు. టీ–ఫైబర్ ద్వారా మొదటిదశలో రాష్ట్రంలోని 30వేల ప్రభుత్వ కార్యాలయాలను, రెండో దశలో 51 లక్షల గ్రామీణ, 32 లక్షల పట్టణ గృహాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో 3 కేటగిరీల్లో 2021 ఈ–గవర్నెన్స్ జాతీయ అవార్డులను అందజేశారు. తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ‘మన ఇసుక వాహనం’కు అవార్డు లభించింది. తెలంగాణలో ఎంతో ‘స్పేస్’ దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచామని.. ఇప్పటికే అంతరిక్ష రంగ స్టార్టప్‌లకు వేదికగా ఉన్న తెలంగాణకు ఈ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని జితేంద్రసింగ్ అన్నారు. అంతరిక్ష రంగ సాంకేతికతలో ప్రపంచ ప్రమాణాలను అందుకునే శక్తి రాష్ట్రానికి ఉందన్నారు. ఈ మేరకు అంతరిక్ష పరిశోధనలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు. కోవిడ్ సమయంలో డిజిటల్ గవర్నెన్స్ తో ప్రజలను చేరుకోగలిగామని చెప్పారు. ప్రధాని మోదీ కృషి వల్లే దేశంలో డిజిటల్ జీవితం సాధ్యమవుతోందన్నారు. పౌరసేవల్లో రాష్ట్రాలు అమలు చేస్తున్న ఈ–గవర్నెన్స్ విధానాల్లోని సారూప్య అంశాలను జోడిస్తూ కొత్త నమూనాకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
సాంకేతికతతో సమస్యల పని పట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తల సహకారం అందుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు. వాళ్ల ఆశలు కార్యరూపం దాల్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సూచించారు. బలమైన శాస్త్ర సాంకేతిక పునాది తో రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ సీఎస్ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ రాక్ మ్యూజియం’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ.. వినూత్న శాస్త్రీయ విధానాలతో సామాన్యులకు శాస్త్ర సాంకేతికతను మరింత చేరువ చేయవచ్చన్నారు. ఇలాంటి ఆలోచనలతో ప్రజల సమస్యలను పరిష్కరించే అంశాలకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ అంటే చార్మి నార్, గోల్కొండ కాదని.. ఇదో సైన్స్ సిటీ అని అన్నారు. లక్నో, డెహ్రాడూన్ నగరాలకు పొంచి ఉన్న భూకంప ముప్పుపై రూపొందించిన మ్యాప్‌లను మంత్రి విడుదల చేశారు. రాక్ మ్యూజియంలో రకరకాల రాళ్లు ‘ఓపెన్ రాక్ మ్యూజియం’లో భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 530 లక్షల నుంచి 33 లక్షల సంవత్సరాల కాలం నాటి 35 రకాల రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. భూమి అడుగు భాగాన 175 కిలోమీటర్ల లోతులో బయటపడిన రాళ్లనూ ప్రదర్శనకు పెట్టారు. సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం త్యాగి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే వివరించారు. -
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు సుదూరంలోని సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి వచ్చేది. అలాంటి వారికి లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్‌కు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు. 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్‌వో, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు. -
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. ఇక వారి కష్టాలు తీరినట్టే!
పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆయా పెన్షన్లను పొందుతున్న వారు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉండేది. వీటిస్థానంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పెన్షన్ దారుల కోసం యూనిక్ ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీని ప్రారంభించారు. దీంతో పెన్షనర్లకు ఊరట కల్గనుంది. లైఫ్ సర్టిఫికేట్ల విషయంలో పెన్షన్‌దారులు ఇబ్బందులను ఎదుర్కొవడంతో పలు ఫిర్యాదులను చేశారు. ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్‌గా లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. పెన్షన్ దారుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రత్యేకమైన ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీ పెన్షనర్లకు మరింత సులభతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీతో 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోందని అన్నారు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఎఐకి సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ పెనాల్టీ..! ఎందుకంటే.. -
కీలక ప్రాజెక్టుతో ఆ ఐదు దేశాల సరసన చేరిన భారత్!
సముద్ర గర్భంలో పరిశోధన కోసం భారతదేశం తన తొలి మానవసహిత సముద్ర మిషన్ 'సముద్రయాన్' ప్రారంభించింది. దీంతో సముద్ర జలాల లోపల కార్యకలాపాలు సాగించే వాహనాలు కలిగి ఉన్న యుఎస్ఎ, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాల జాబితాలో భారత్ చేరింది. చెన్నైలో ఈ మిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం గొప్ప పురోగతి సాధించిందని, గగన్ యాన్ కార్యక్రమంలో భాగంగా ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తుంటే, మరొకరు సముద్రంలోకి అడుగుభాగనికి వెళ్లబోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జలాంతర్గాములు సైతం సముద్రంలో 200 మీటర్ల లోతుకు మించి వెళ్లలేవు. కానీ మన సైంటిస్టులు ఏకంగా 6 వేల మీటర్ల లోతుకు ముగ్గురు సైంటిస్టులను, రోబోటిక్ పరికరాలను పంపేందుకు సిద్ధమవుతున్నారు! ఇందుకు అత్యంత ముఖ్యమైన క్రూ మాడ్యూల్ డిజైన్ కూడా పూర్తి చేశారు. దీంతో వందల కోట్లతో చేపట్టబోయే ఈ మిషన్ లో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ మాడ్యూల్ డిజైన్ కు ఇస్రో అత్యంత క్లిష్టమైన టెక్నాలజీని వాడినట్లు చెప్పారు. గోళాకారంలో ఉండే ఈ చిన్న సబ్ మెర్సిబుల్ వెహికిల్ తయారీకి టైటానియం లోహాన్ని వాడనున్నట్లు తెలిపారు. సముద్ర గర్భంలో ఉన్న ఖనిజాలు, ఇంధన వనరులను వెతికిపట్టుకోవడం బ్లూ ఎకానమీకి దోహదం చేస్తుంది. సముద్రగర్భంలో ఉన్న జీవజాలంపై అధ్యయనం చేస్తారు. Launched India’s First Manned Ocean Mission #Samudrayan at #Chennai. India joins elite club of select nations USA, Russia, Japan,France & China having such underwater vehicles.A new chapter opens to explore ocean resources for drinking water, clean energy & blue economy. pic.twitter.com/FArZULj4NB — Dr Jitendra Singh (@DrJitendraSingh) October 29, 2021 సముద్రయాన్ గురించి ఆసక్తికర విషయాలు: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) చేపట్టిన ₹6,000 కోట్ల సముద్రయన్ ప్రాజెక్టు డీప్ ఓషన్ మిషన్ లో ఒక భాగం. సముద్రయాన్ ప్రాజెక్టు కోసం సముద్ర వాహనం అయిన మత్స్య 6000 రూపొందించారు. 2.1 మీటర్ల వ్యాసం కలిగిన ఈ టైటానియం గోళంలో ముగ్గురు సైంటిస్టులు సముద్ర అడుగుభాగనికి వెళ్లనున్నారు. క్రూ మాడ్యూల్ కనీసం 72 గంటల పాటు సముద్రం అడుగున అత్యంత తీవ్రమైన ప్రెజర్ ను తట్టుకుని ఉండగలిగేలా తయారు చేస్తున్నారు. సముద్రంలో దాదాపు 6 కిలోమీటర్ల లోతు వరకూ వెళ్లి అక్కడ సముద్రం అడుగున అనేక అంశాలను స్టడీ చేయనున్నారు. సముద్ర గర్భంలో ఉన్న పాలీమెటాలిక్ మాంగనీస్ నోడ్యూల్స్, గ్యాస్ హైడ్రేట్స్, హైడ్రో థర్మల్ సల్ఫైడ్స్, కోబాల్ట్ క్రస్ట్లు వంటి నాన్ లివింగ్ వనరుల అన్వేషణ కోసం ఈ ప్రాజెక్టు చెప్పటినట్లు తెలుస్తుంది. ఐరన్, మాంగనీస్, నికెల్, కాపర్, కోబాల్ట్ తో కూడిన ముడి ఖనిజాలనే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు. మనం ఈ ఖనిజ సంపదలో కేవలం 10 శాతం తెచ్చుకోగలిగినా.. ఇండియాకు వందేళ్ల పాటు ఇంధన అవసరాలు తీరిపోతాయట!. ఎన్ఐఓటీ అధికారిక సమాచార ప్రకారం.. మత్స్య 6000 డిసెంబర్ 2024 నాటికి ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంటుంది. కేంద్ర భూశాస్త్రా మంత్రిత్వ శాఖ 5 సంవత్సరాల కాలానికి మొత్తం ₹4,077 కోట్ల బడ్జెట్‌తో అమలు చేయాల్సిన డీప్ ఓషన్ మిషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
గగన్‌యాన్ మిషన్ లాంచ్‌పై స్పష్టత..!
భారత్ మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం గగన్‌యాన్ మిషన్‌ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. మిషన్‌లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సు కూడా పూర్తి చేసుకున్నారు. కాగా తాజాగా గగన్‌యాన్ మిషన్‌పై కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ స్పందించారు. 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగిస్తామని జీతేంద్ర సింగ్ బుధవారం రోజున వెల్లడించారు. చదవండి: ఐపీఎల్ ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త! తొలుత గగన్‌యాన్ మిషన్‌ను 2022లో లాంచ్ చేయాలని ఇస్రో భావించగా కరోనా రాకతో మిషన్ ముందడుగు వేయలేదన్నారు. ఫిక్కి నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా స్పేస్ టెక్నాలజీ పార్టనర్‌షిప్‌పై జరిగిన వెబినార్‌లో కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ తెలిపారు. అంతేకాకుండా అంతరిక్ష రంగంలో స్టార్టప్ ప్రాముఖ్యత ఎంతగానో ఉందన్నారు. గగన్మిషన్ ద్వారా భారత వ్యోమగాములను లో ఎర్త్ ఆర్బిట్ చేర్చనుంది. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో మానవ సహిత అంతరిక్షయాత్ర కోసం వాడే లిక్విడ్ ప్రోపెలెంట్ వికాస్ ఇంజన్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. చదవండి: SpaceX Inspiration4: బ్రాన్సన్, బెజోస్‌లది ఉత్తుత్తి ఫీట్.. స్పేస్ ఎక్స్ పెనుసంచలనం, ఇదీ అసలైన ఛాలెంజ్! -
2022లోనే చంద్రయాన్-3 ప్రయోగం
న్యూఢిల్లీ: భారతదేశ ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2022 మూడో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేడు(జూలై 28) తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాని పురోగతికి ఆటంకం కలిగిందని నొక్కి చెప్పారు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ చంద్రయాన్-3 ప్రయోగాన్ని రీషెడ్యూల్ చేసినట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది అని ఆయన అన్నారు. అయితే, లాక్ డౌన్ సమయాల్లో కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పనులు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఇస్రో శాస్త్రవేత్తలు సాధ్యమైన అన్ని పనులు చేశారు అన్నారు. అన్ లాక్ తర్వాత చంద్రయాన్-3 ప్రాజెక్టు వేగం పెరిగింది, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు చివర దశలో ఉన్నట్లు ఆయన చెప్పారు. 2019 జూలై 22న అత్యంత శక్తివంతమైన జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ ద్వారా చంద్రయాన్-2 మిషన్ చేపట్టారు. అయితే, సెప్టెంబర్ 7, 2019న చంద్రుని ఉపరితలం మీద దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయింది. ఈ ప్రయోగంతో తొలి ప్రయత్నంలోనే చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిన మొదటి అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలవాలని అనుకుంది. కానీ, చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో భవిష్యత్తులో చేపట్టేబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రయాన్-3 కీలకం కానుంది. -
సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటు దిశగా కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్టీ) చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అటానమస్ ఇన్స్టిట్యూట్ల నుంచి ఆర్థిక సాయాన్ని పొంది అధునాతన పరిశోధనలతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. టెక్నాలజీ భవన్లో ఆయన శనివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో భారత్ మూడో ర్యాంకులో ఉందన్నారు. అంతేగాక నాణ్యమైన పరిశోధనా పత్రాలను వెల్లడించడంలో 9వ స్థానంలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి టాప్-5 లోకి వచ్చే విధంగా కృషి జరగాలన్నారు. ప్రధాని మోదీ సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, వ్యక్తిగతంగా ఆ విభాగాన్ని పరిశీలిస్తున్నారని చెప్పారు. -
అన్ని ఉద్యోగాలకు ఒకటే పరీక్ష..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు భవిష్యత్తులో అన్నింటికీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హాయంలో ఈ నిర్ణయం గొప్ప సంస్కరణగా చెప్పవచ్చునని పేర్కొన్నారు. ఈ సంస్కరణ మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు మేలుజరగనుంది. అంతేకాకుండా అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు రావడానిక అయ్యే రవాణా ఖర్చులు, పరీక్ష ఫీజులు తగ్గుతాయి, అందుకుగాను నేషనల్ రిక్రూట్ ఎజెన్సీ (ఎన్ఆర్ఏ) ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్ఆర్ఏ సెట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించనున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ వివరించారు. ఎన్ఆర్ఏ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎన్ఆర్ఏ స్వతంత్ర బోర్ఢ్‌గా వ్యవహరించనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ , రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిర్వహించే పరీక్షలను ఈ బోర్డ్ నిర్వహించనుంది. ప్రస్తుతం ఎస్ఎస్సీ , ఆర్ఆర్బీ , ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. -
సెప్టెంబర్‌లో ఉమ్మడి అర్హత పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్)ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శనివారం వెల్లడించారు. ఈ పరీక్షను నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) నిర్వహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకొనే యువతకు మంచి అవకాశమన్నారు. గ్రూప్–బి, గ్రూప్–సి(నాన్ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి ‘సెట్’ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం ఉంటుందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు ఇది ఉపయోగకరమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు పరీక్ష కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతోనే ఈ ఏడాది నుంచి ‘సెట్’ అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. ఇదొక గొప్ప సంస్కరణ అని అభివర్ణించారు. ‘సెట్’ ఉన్నప్పటికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వంటి సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీలు కొనసాగుతాయని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. -
కొలువుల కోసం కొత్త విధానాలు
ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది దాకా అభ్యర్థులు పరీక్షలు రాస్తారు. వీరు 1.25 లక్షల ఉద్యోగాల కోసం పలు రకాల పరీక్షలను రాస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం నుంచి ఈ బాధ వుండదు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదించిన జాతీయ ఉద్యోగ నియామక ఏజెన్సీ ఏర్పాటు కోట్లాదిమంది యువతకు ఒక వరం లాంటిది. కింది స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలను తొలగించడమే కాకుండా కాలం చెల్లిన పురాతనమైన 1,500 నిబంధనలు, చట్టాలను రద్దు చేశారు. ఇకపై ఉమ్మడి అర్హతా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక సంస్కరణకు ఈమధ్యనే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ సంస్కరణ జాతీయ ఉద్యోగ నియా మక ఏజెన్సీ (నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ–ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయ డానికి సంబంధించినది. ఆమోదిం చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ.. దేశంలోని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంస్కరణ దేశంలోని కోట్లాదిమంది యువతకు ఒక వరంలాంటిదని అన్నారు. అంతేకాదు ఈ సంస్కరణ కారణంగా పలు పరీక్షలు రాసే శ్రమ తప్పుతుందని, విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయని అన్నారు. ఆయన మరోమాట కూడా అన్నారు. ఎన్ఆర్ఏను ఏర్పాటు చేయడమనేది పారదర్శకతను బలోపేతం చేస్తుందని... పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన మైన విధానమని మోదీ అన్నారు. పలు సంస్థల వ్యవస్థగా రూపొందిన జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఒక ఉమ్మడి అర్హతాపరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్– సీఈటీ)ను నిర్వహిస్తుంది. దీనిద్వారా గ్రూప్ బి, సి (నాన్ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకోసం కావలసిన అభ్యర్థులను వడపోస్తారు. రైల్వేలు, ఆర్థికశాఖ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్‌ల నుంచి ప్రతినిధులు ఎన్ఆర్ఏలో వుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపా దించాలంటే పలు సంస్థలు నిర్వహించే పలు రకాల పరీక్షలను ఉద్యో గార్థులు రాయాల్సి ఉంటుంది. సరాసరి తీసుకుంటే ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది దాకా అభ్యర్థులు పరీక్షలు రాస్తారు. వీరు 1.25 లక్షల ఉద్యోగాల కోసం ఈ పరీక్షలను రాస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం నుంచి ఈ బాధ వుండదు. ఎన్ఆర్ఏ ఉమ్మడి అర్హతా పరీక్ష(సీఈటీ)ను నిర్వ హిస్తుంది. సీఈటీ మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది దేశంలోని లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలను సంతోషపెట్టే ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. ఈ మార్పు కారణంగా వారి సమయం, వన రులు ఆదా అవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ ఊహించని అసాధారణమైన సంస్కరణలను తెచ్చాము. గతంలో డాక్యుమెంట్లను గెజిటెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేసేవారు. ఆ విధానాన్ని తొలగించి సెల్ఫ్అటెస్టేషన్ ప్రవేశ పెట్టాం. కింది స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలను తొలగిం చడమే కాకుండా కాలం చెల్లిన పురాతనమైన 1,500 నిబంధనలు, చట్టాలను రద్దు చేశాం. ఐఏఎస్ అధికారులు తమ కెరీర్ ప్రారంభంలో మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వంలో సేవలందించాలని నియమం పెట్టాం. అవినీతి నిరోధక చట్టంలో సవరణ తీసుకొచ్చాం. ప్రధాని ఎక్సలెన్స్ అవార్డుల కోసం కొత్త ఫార్మాట్‌ను రూపొందించాం. ఇదే వరుసలో ముందుకొచ్చిన ఎన్ఆర్ఏ ఒక విశిష్టమైన విధానం. ప్రభుత్వ ఉద్యో గాల నియామక ప్రక్రియలో ఒక ప్రాథమికమైన మార్పుగా దీన్ని పేర్కొనవచ్చు. ఉద్యోగాల కోసం కృషి చేస్తున్న యువత ఒడిదుడు కులు లేకుండా జీవించాలనేది మోదీ ప్రభుత్వవిధానం. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని, ఎంపిక, ఉద్యోగ కేటా యింపును సరళతరం చేసింది. ఇంతవరకు ఉన్న పలు నియామక పరీక్షలనేవి అభ్యర్థులకు భారంగా మారాయి. ఉద్యోగులను ఎంపిక చేసే సంస్థలపైన కూడా ఇది భారంగా పరిణమించింది. ఖర్చులు, శాంతి భద్రతల సమస్య, పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలైన సమ స్యలు ఆందోళన కలిగించేవి. అందువల్ల అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలిగించకుండా, వారికి అనుకూలంగా, తక్కువ వ్యయంతో ఉద్యోగ నియామకాలు చేయడానికి ఎన్ఆర్ఏను ఏర్పాటు చేశాం. సులువుగా పరీక్ష కేంద్రాల అందుబాటు దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంవల్ల అవి మారుమూల ప్రాంత అభ్యర్థులకు సైతం పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా 117 జిల్లాల్లో పరీక్ష లకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సదుపాయాల కారణంగా ఈ జిల్లాల్లోని అభ్యర్థులు తమ నివాసానికి సమీపంలోనే పరీక్షలకు హాజరు కావచ్చు. ఎన్ఆర్ఏ ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం కొండప్రాంతాల్లో, గ్రామీణ, మారు మూల ప్రాంతాల్లో నివసించే కోట్లాదిమంది ఉద్యోగార్థులకు వరంలా మారింది. ఈ నిర్ణయం ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు మరింత ప్రయోజనకరం. ఎందుకంటే వివిధ కేంద్రాల్లో వివిధ సమయాల్లో ఈ పరీక్షలను రాయాలంటే మహిళా అభ్యర్థులు అనేక సమస్యలను ఎదు ర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు వారికి ఖర్చులు, శ్రమ తగ్గడమే కాకుండా వారికి తగిన భద్రత కూడా లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలను ప్రజ లకు అందుబాటులోకి తేవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సాహసో పేతమైనది. ఇది దేశంలోని యువత జీవనాన్ని సరళతరం చేస్తుంది. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కోసం మాక్‌టెస్ట్ నిర్వహిస్తారు. అంతేకాదు 24/7 హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేస్తు న్నారు. సీఈటీలో వచ్చిన మార్కులు మూడేళ్లపాటు పరిగణనలోకి తీసుకుంటారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా పరీక్షలు రాయవచ్చు. పరీక్ష ఫలితాలు వచ్చిన తేదీ నుంచి మూడేళ్లపాటు ఆ మార్కులకు విలువ వుండేలా చేయాలనుకోవడం ఇందులో ఒక గొప్ప అంశం. గరిష్ట వయోపరిమితికి లోబడి ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు. వాటిలో ఉత్తమమైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అమలులో వున్న ప్రభుత్వ విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంకా ఇతర కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమి తిలో సడలింపు ఇస్తారు కూడా. కాబట్టి ఎన్ఆర్ఏ అనేది అభ్యర్థులు ఇంతకాలం పడుతున్న కష్టాలను తగ్గిస్తుంది. అంతేకాదు వారి సమ యాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. ప్రామాణికంగా పరీక్షలు గ్రాడ్యుయేషన్, హయ్యర్ సెకండరీ (12వ తరగతి పాస్), మెట్రిక్యు లేషన్ (10వ తరగతి పాస్) ఈ మూడు స్థాయిల అభ్యర్థులకు ప్రత్యే కంగా సీఈటీ వుంటుంది. ఈ అభ్యర్థుల కోసం ప్రస్తుతం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ), బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఇన్స్టిట్యూట్ (ఐబీపీఎస్) సంస్థలు పరీక్షలు నిర్వ హిస్తున్నాయి. ఇవి ఇకముందు ఉండవు. సీఈటీ స్థాయిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను విభాగాలుగా వర్గీకరించి తుది ఎంపికకు పంపుతారు. తుది ఎంపిక కోసం పరీక్షలను సంబంధిత నియామక సంస్థలు నిర్వహిస్తాయి. సీఈటీ కోసం పాఠ్యప్రణాళిక ఉమ్మడిగా వుంటుంది. ప్రామాణికంగా వుంటుంది. ఇంతకాలం వివిధ పాఠ్యప్రణాళికలతో ఆయా ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా తయారయ్యే అభ్యర్థులకు ఇకముందు ఆ ఇబ్బంది వుండదు. పరీక్ష కేంద్రాల ఎంపి కలో, పరీక్షల నిర్వహణలో సరళీకరణ సీఈటీ కోసం దరఖాస్తు చేసు కునే అభ్యర్థులు తమ పేర్లను ఉమ్మడి పోర్టల్‌లో నమోదు చేసుకో వచ్చు. అంతేకాదు తమకు అనువైన పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసు కోవచ్చు. అందుబాటునుబట్టి వారికి కేంద్రాలను కేటాయిస్తారు. ప్రభుత్వ అంతిమ ఉద్దేశం ఏంటంటే అభ్యర్థులు తమకు అనుకూల కేంద్రాల్లో పరీక్షలు రాయడం. బహుళభాషల్లో అందుబాటులోకి వస్తున్న సీఈటీ పలు భాషల్లో సీఈటీ రాయవచ్చు. దీని కారణంగా దేశవ్యాప్తంగా పలు భాషలు మాట్లాడే అభ్యర్థులు పరీక్షలు రాయవచ్చు. ఎంపిక అయ్యే అవకాశాలు దేశంలో అందరికీ సమానంగా ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్తో పాటు పన్నెండు భాషల్లో సీఈటీ నిర్వహించడానికి ప్రయ త్నిస్తున్నాం. రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భాషల్లో సీఈటీ నిర్వహించడానికి ముందు ముందు ప్రయత్నాలు చేస్తారు కూడా. సీఈటీలో వచ్చే మార్కులను మొదటగా మూడు ప్రధా నమైన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉపయోగించుకుంటాయి. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర నియా మక సంస్థలు కూడా వీటిని ఉపయోగించుకుంటాయి. మరికొంత కాలం తర్వాత పబ్లిక్, ప్రైవేట్ రంగంలోని ఇతర సంస్థలు కూడా వారికి అవసరమనుకుంటే ఈ సీఈటీని ఉపయోగించుకోవచ్చు. సహ కార సమాఖ్య విధానం అసలైన స్ఫూర్తిని ప్రతిఫలించేలా సీఈటీ మార్కులను కేంద్ర ప్రభుత్వంలోని ఇతర నియామక సంస్థలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియామక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. డాక్టర్ జితేంద్రసింగ్ కేంద్ర సహాయమంత్రి -
పునర్విభజన కమిటీలోకి ఎంపీలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ అసోసియేట్ సభ్యులుగా 15 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిరేన్ రిజిజు, జితేంద్ర సింగ్ సైతం ఉన్నారు. 26న వెలువడిన లోక్‌సభ బులెటిన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌కు కిరేన్ రిజిజు, తపిర్ గావో ప్రాతినిధ్యం వహిస్తారు. అస్సాంకు పల్లవ్ లోచన్ దాస్, అబ్దుల్ ఖలేక్, రాజ్‌దీప్ రాయ్, దిలీప్ సైకియా, నబ సరానియా, మణిపూర్‌కు లోర్హో ఫోజ్, రంజన్ రాజ్‌కుమార్, నాగాలాండ్‌కు టోఖెహో యెఫ్తోమి ప్రాతినిధ్యం వహిస్తారు. జమ్మూకశ్మీర్‌కు ఫరూక్ అబ్దుల్లా, మొహమ్మద్ అబ్దుల్ లోనె, హస్నైన్ మసూదీ, జుగల్ కిశోర్ శర్మ, జితేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో కేంద్రం మార్చి 6న పునర్ విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఎక్స్–అఫీషియో సభ్యులుగా ఉంటారు. పునర్విభజన చట్టం2002, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జమ్మూకశ్మీర్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వీరు పాలుపంచుకుంటారు. -
కరోనా నుంచి బయటపడ్డ 5 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర కోవిడ్-19 లేని రాష్ట్రాలుగా నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలైన అసోం, మిజోరం, మేఘాలయా.. కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కోవిడ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. (కరోనా వైరస్.. మరో దుర్వార్త) ‘దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యవసర సరుకుల కొరత రాకుండా కార్గో విమానాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు తరలిస్తున్నాం. ఎయిర్ ఇండియా, ఇండియన్ వాయుసేన ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లకు ప్రాధాన్యతా క్రమంలో సరుకులు పంపిస్తున్నామ’ని జితేంద్ర సింగ్ తెలిపారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కట్టడికి షిల్లాంగ్‌లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ కంటే ముందే కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం) -
ఆనాటి నుంచే సీఏఏ కశ్మీర్లో అమల్లోకి..
శ్రీనగర్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రకారం రోహింగ్యాలకు భారత పౌరసత్వం వచ్చే వీలు లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. త్వరలోనే వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారుల శిక్షణా కార్యక్రమానికి జితేంద్ర సింగ్ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చిన నాటి నుంచే జమ్మూ కశ్మీర్లో అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. నూతన చట్టం ప్రకారం రోహింగ్యాలకు భారత్‌లో ఉండేందుకు ఎటువంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. ‘రోహింగ్యాలను ఎలా పంపించాలో కేంద్రం ఆలోచిస్తోంది. జాబితాలు తయారు చేస్తున్నాం. అవసరమైన చోట్ల బయోమెట్రిక్ గుర్తింంపు కార్డులు అందజేస్తాం. ఎందుకంటే సీఏఏ ప్రకారం రోహింగ్యాలు భారత్‌లో ఉండే అవకాశం లేదు. చట్టంలో పేర్కొన్న ఆరు మైనార్టీలో వీరి ప్రస్తావన లేదు. అంతేకాదు వీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు కాదు. మయన్మార్ నుంచి వచ్చిన వాళ్లు గనుక వారు అక్కడికే వెళ్లిపోవాలి. అంతేకాదు వాళ్లు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌ను దాటుకుని జమ్మూ కశ్మీర్ వరకు ఎలా రాగలిగారన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నాం’ అని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.(ఎవరూ తప్పించుకోలేరు: కేంద్ర మంత్రి) కాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం జమ్మూ, సాంబా జిల్లాల్లో దాదాపు 13,700 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో రోహింగ్యాలతో పాటు పలువురు బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు. 2008 నుంచి 2016 మధ్య వీరి జనాభా ఆరు వేలకు పైగా పెరిగింది. ఇక డిసెంబరు 31, 2014 తర్వాత ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సీఏఏ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఓ వర్గం ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.(అసలేంటి ఇదంతా.. నాకేం అర్థం కావట్లేదు!) -
ఈ ఏడాదే చంద్రయాన్ 3
సాక్షి, న్యూఢిల్లీ: ‘చంద్రయాన్-3’ ప్రయోగం ఈ సంవత్సరం (2020)లోనే ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ప్రయోగానికయ్యే ఖర్చు చంద్రయాన్-2 ప్రయోగానికి అయిన ఖర్చు కన్నా తక్కువే అవుతుందన్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని వైఫల్యంగా భావించరాదని ప్రధాని కార్యాలయంలో సహాయమంత్రి బాధ్యతల్లో ఉన్న సింగ్ వ్యాఖ్యానించారు. మొదటి ప్రయత్నంలోనే చంద్రుడి ఉపరితలానికి చేరామని, తొలి ప్రయత్నంలో ఈ స్థాయి విజయాన్ని ఏ దేశమూ సాధించలేదన్నారు. -
కేంద్రంలో ఏడు లక్షల ఉద్యోగాలు ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో దాదాపు ఏడు లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం ఆరు లక్షల 83వేల 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు అందించిన సమాచారంలో వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) బ్యాక్ లాగ్ రిజర్వు పోస్టుల్లో కూడా ఖాళీలు ఉన్నాయని మరో సమాధానంలో మంత్రి చెప్పారు. రాజ్యసభకు అందించిన లిఖిత పూర్వక సమాధానంలోని డేటా ప్రకారం గ్రూప్ సీ లో మొత్తం 5,74,289 , గ్రూప్ బీ లో 89,638 గ్రూప్ ఏ విభాగంలో 19,896 ఉద్యోగాలు భర్తీ కావల్సి వుందని తన లిపారు. ఆయా కేంద్రప్రభుత్వ విభాగాలు అందించిన సమాచారం ప్రకారం 2019-20 సంవత్సరానికి గాను 1, 05,338 పోస్టుల భర్తీ ప్రక్రియను ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) ద్వారా ప్రారంభించామన్నారు. 2017-18లో గ్రూప్ సీ లెవల్ 1 పోస్టుల 1,27,573 పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్స్ (సీఈఎన్) కింద రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ద్వారా 1,27,573 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. గ్రూప్ సీ, లెవల్ -1లో లక్షా 56వేల138 ఖాళీలను భర్తీ చేసే మరో ఐదు సీఈ నోటిఫికేషన్లను కూడా 2018-19లో జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఎస్ఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినవి కాకుండా 19,522 ఖాళీలను వివిధ గ్రేడ్లలో భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మొత్తంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సీఈఎన్‌ల ద్వారా ఖాళీలను భర్తీ చేసే నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని సింగ్ తెలిపారు. అలాగే జనవరి 1, 2019 నాటికి ఎస్సీలకు 1,713 (ఎస్సీ)బ్యాక్లాగ్ ఖాళీలు, ఎస్టీలకు 2,530 బ్యాక్లాగ్ ఖాళీలు, ఓబీసీలకు 1,773 బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ కాలేదని మంత్రి తెలిపారు -
పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో 13న జరిగే జల్సా (ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. – న్యూఢిల్లీ/గ్వాలియర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జల్సా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేను తిరిగి భారత్‌లో అంతర్భాగంగా చేసుకోవడమే ప్రభుత్వం తదుపరి లక్ష్యమంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన ప్రకటనపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీవోకేను స్వాధీనం చేసు కోవడంతోపాటు దేనికైనా మేం సంసిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో 13వ తేదీన జరిగే జల్సా(ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేపై ప్రత్యేక వ్యూహం ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వెల్లడించారు. మన బలగాలు పీవోకేలోకి ప్రవేశించేందుకు సదా సన్నద్ధంగా ఉన్నాయి.. అయితే, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..‘పీవోకే విషయంలో ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి విషయాలను బహిర్గతం చేయరాదు’అని తెలిపారు. -
ఎన్ఆర్ఐలూ ఆర్టీఐ దరఖాస్తు చేయొచ్చు!
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న భారతీయులు (ఎన్ఆర్ఐలు) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రభుత్వ విభాగాలను సమాచారం కోరవచ్చని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఆర్టీఐ దరఖాస్తులు చేసేందుకు ఎన్ఆర్ఐలు అర్హులు కాదని ఈ ఏడాది ఆగస్టు 8న సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు తెలియజేశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం భారతీయులందరికీ ఆ అవకాశం ఉంటుందనీ, ఎన్ఆర్ఐలు కూడా భారతీయులేనంటూ లోకేశ్ బాత్రా అనే సామాజిక కార్యకర్త మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీంతో జితేంద్ర సింగ్ ఇచ్చిన సమాచారాన్ని మార్చి, ఆ సమాధానాన్ని ప్రభుత్వం మళ్లీ లోక్‌సభ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. -
‘సివిల్స్’కు వయో పరిమితి 32 ఏళ్లు
న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు ఆగస్టు 1, 2018నాటికి జనరల్ అభ్యర్థులు 32ఏళ్లకు మించని వారు అయి ఉండాలి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలను రాజ్యసభలో తెలిపారు. సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన జితేంద్ర సింగ్.. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని.. అభ్యర్థులు సరైన సమాచారం ఇవ్వని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని పేర్కొన్నారు. దీంతో వయోపరిమితిపై అభ్యర్థుల అనుమానాలకు ఫుల్స్టాప్ పడినట్లే. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్ (డీఓపీ అండ్ టీ) తెలిపిన మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితిని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రతి ఏడాది యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ సర్వీస్‌లో అభ్యర్థుల ఎంపిక మొత్తం మూడు దశలల్లో జరుగుతుందన్న విషయం విదితమే. మొదట ప్రిలిమినరీ పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తారు. సివిల్ సర్వీసెస్ రాసేందుకు అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థి భారత పౌరుడు/పౌరురాలై ఉండాలి నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హతపత్రం చూపించి సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు జనరల్ అభ్యర్థులు- 4 సార్లుయ ఓబీసీ అభ్యర్థులు- 7సార్లు వికలాంగులు (జనరల్)- 7 సార్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు. -
ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట!
న్యూఢిల్లీ : ప్రతేడాది లక్షల మంది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులకు పోటీపడుతూ ఉంటారు. వీళ్లలో చాలా తక్కువ మందే ఈ పోస్టులకు ఎంపికయ్యేది. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున్న అభ్యర్థుల నుంచి ఆసక్తి వస్తున్నప్పటికీ, చాలా తక్కువ మందే దీనికి అర్హత సాధిస్తున్నారు. ప్రస్తుతం 2,400 ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. దేశంలో మొత్తం మంజూరైన 6,553 ఐఏఎస్ పోస్టుల్లో 22.11 శాతం సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. కేవలం ఇవి మాత్రమే కాక, 4,940 ఐపీఎస్ ఆఫీసర్ పోస్టుల్లో 19.64 శాతం సీట్లను ఇంకా భర్తిచేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. అంటే మొత్తంగా 2,400కు పైగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో 1,449 ఐఏఎస్ పోస్టులు, 970 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. కాగ, ప్రతేడాది యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వంటి ఇతర ముఖ్యమైన, హైలెవల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేస్తూ ఉంటోంది. ఈ పోస్టులకు అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుడు భారత పౌరుడే ఉండాలి నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హత పత్రం చూపించి సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు జనరల్ అభ్యర్థులు-4 సార్లు ఒబిసి అభ్యర్థులు-7సార్లు వికలాంగులు (జనరల్)- 7 సార్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు. -
‘పటేల్‌ను నెహ్రూ ఆడ్డుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి (అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ఛార్జి) జితేంద్ర సింగ్ స్పందించారు. కశ్మీర్‌కు బదులుగా హైదరాబాద్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేందుకు తొలి హోంమంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ పాక్‌కు ఆఫర్ చేశారని సైఫుద్దీన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జితేంద్ర సింగ్.. కశ్మీర్ విషయంలో పటేల్ జోక్యం చేసుకుని ఉంటే ఈ రోజు భారతదేశ చర్రిత మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై పటేల్ జోక్యం చేసుకోకుండా ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నియంత్రించారని, లేకపోతే కశ్మీర్ సమస్యకు అప్పడే శాస్వత పరిష్కారం ఏర్పడేదని పేర్కొన్నారు. హోంమంత్రి స్థానంలో ఉన్నా పటేల్‌ను ప్రధాని నెహ్రూ నిలువరించారని, కశ్మీర్‌పై నెహ్రూ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కశ్మీర్ సమస్య ఏర్పడిందని తెలిపారు. పటేల్ చర్యల కారణంగానే హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగిందని, కశ్మీర్ సమస్య కూడా ఆనాడే ముగిసిపోయి ఉండేదని అన్నారు. ప్రస్తుత కశ్మీర్లో పాకిస్తాన్ భాగంగా ఉందని అది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. -
సక్సెస్ అయితే.. నాసా కంటే ఇస్రోనే తోపు
సాక్షి, న్యూఢిల్లీ : అంతరిక్ష ప్రయోగ చరిత్రలో చంద్రయాన్-2ను ఓ మరుపురాని ప్రాజెక్టుగా మార్చేందుకు భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) సిద్ధమైపోయింది. సుమారు 800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధం చేస్తున్న ఈ ప్రాజెక్టును ఏప్రిల్‌లో ప్రయోగించాలని నిర్ణయించుకుంది. నాసో అపోలో మిషన్ల కన్నా చంద్రయాన్-2 చాలా శక్తివంతమైందని కేంద్ర మంత్రి(అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ఛార్జి మంత్రి) జితేంద్ర సింగ్ చెబుతున్నారు. ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ‘ఇస్రో ఇప్పటిదాకా చేపట్టిన ప్రయోగాలలో చంద్రయాన్-2 ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రపంచంలోనే ఓ అద్భుత ఘట్టంగా దీనిని తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై నిశితంగా స్పేస్ క్రాఫ్ట్‌లను ల్యాండ్ చేయటంలో విజయవంతం అయ్యాయి. ఇప్పుడు భారత్ గనక ఆ ఘనత సాధిస్తే ఇస్రో చరిత్ర సృష్టించినట్లే. ఎందుకంటే నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) కంటే ఇస్రో 20 రేట్లు తక్కువ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును ప్రయోగించబోతోంది’ అని జితేంద్ర వెల్లడించారు. చంద్రుడి మీద దక్షిణ దృవంలో చంద్రయాన్-2 ల్యాండ్ అయ్యే దిశగా ఇస్రో ప్రణాళికలు చేస్తోంది. 2008లో చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం కాగా, 2009లో నీటి జాడలు ఉన్నట్లు స్పేస్ క్రాఫ్ట్ గుర్తించింది. ఈ విజయం నింపిన ఉత్సా హంతో ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది. ప్రయోగం ఎలా సాగుతుందంటే... చంద్రయాన్-2 వ్యోమనౌక,ల్యాండర్,రోవర్.. ప్రధాన,ఉప వ్యవస్థల అనుసంధానాలు అవుతాయి. చంద్రయాన్-1 లా కాకుండా వ్యోమనౌక నెమ్మదిగా దిగేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. దీని ప్రకారం వ్యోమనౌకను 100 మీటర్ల ఎత్తునుంచి కిందకు జార విడుస్తారు. వ్యోమనౌక కక్ష్య నుంచి రోవర్ చంద్రునిపై కుప్పకూలకుండా నెమ్మదిగా వాలేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందందని సైంటిస్టులు భావిస్తున్నారు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం 100 మీటర్ల ఎత్తులో చంద్రమండలంలోని గురుత్వాకర్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు. 500 కిలో గ్రాముల బరువైన వ్యోమనౌకను మండించడం ద్వారా కిందకు శాటిలైట్‌ను జారవిడుస్తారు. నౌక దిగాల్సిన దగ్గర రాళ్లు,బండలు ఉంటే మరో సురక్షిత స్థానాన్ని గుర్తించి అక్కడ దిగేందుకు అడ్డం-నిలువు విన్యాసాలు సాయపడుతాయన్నారు. ప్రస్తుతం వ్యోమనౌక సమర్ధతను తమిళనాడు మహేంద్రగిరి ఇస్రో ఇందన కేంద్రంలో పరీక్షిస్తున్నారు. చంద్రునిపై రోవర్.. ఖనిజ వనరులు, మూలకాల్ని, మానవ జాతి మనుగడకు గల సాధ్యాసాధ్యాలను పరీక్షిస్తుంది. -
ప్రభుత్వ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో 4 లక్షలకు పైగా పోస్టులు ఖాళీ అయ్యాయని.. వాటిని త్వరలోనే భర్తీ చేయనున్నట్టు బుధవారం వెల్లడించింది. సీనియర్ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం.. కొందరు మధ్యలోనే ఉద్యోగాలను వదిలేయడంతో లక్షల సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ''వార్షిక రిపోర్టు ప్రకారం...2016 మార్చి 1 వరకు కేంద్ర ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల్లో 36,33,935 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటిల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయి'' అని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అంతేకాక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్దకు రాలేదని వెల్లడించారు. -
'కాంగ్రెస్‌కు అదో అలవాటుగా మారింది'
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల విషయంలో ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటుగా మారిపోయిందని బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పోరుబందర్, సూరత్, జెట్పూర్, నావ్‌సారిలో ఈవీఎంలు బ్లూటూత్‌కు అనుసంధానించారంటూ చేసిన ఆరోపణలకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. నిజమేనా అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంటుందని, అలాంటివి గత ఎన్నికల సమయంలో కూడా చూశామని ఆయన గుర్తు చేశారు. 'కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ మాత్రం అదే.. కాకపోతే చేస్తున్న ప్రాంతాలు వేరు. అప్పడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భం, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇలా కొన్ని చోట్ల జరిగిన ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీ ఇలాగే చేస్తుంటుంది. మేం ఆ పరీక్షలను ఎదుర్కొంటున్నాం ఫలితాలను చూస్తున్నాం' అని ఆయన చెప్పారు. -
జీపీఎఫ్ చందాదారులకు చల్లని కబురు
న్యూఢిల్లీ: జీపీఎఫ్ (సాధారణ భవిష్య నిధి) చందారులకు కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు అందించింది. జీపీఎఫ్ నుంచి అడ్వాన్స్ తీసుకోవాలన్నా, పూర్తిగా విత్‌డ్రా చేసుకోవాలన్నా ఎటువంటి పత్రాలనూ సాక్ష్యాలుగా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి జితేంత్ర సింగ్ బుధవారం లోక్‌సభలో చెప్పారు. దరఖాస్తుతోపాటు చందాదారు నుంచి డిక్లరేషన్ ఉంటే చాలన్నారు. 2017 మార్చి 7 నుంచి జీపీఎఫ్ నుంచి విద్య, అనారోగ్యం, ఏవైనా వస్తువులు కొనుక్కోవడం తదితర ఖర్చుల కోసం అడ్వాన్స్ తీసుకోవడం లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకోవడం కోసం పాటించాల్సిన విధానాలను ప్రభుత్వం సరళీకరించిందని మంత్రి చెప్పారు. జీపీఎఫ్ నుంచి అడ్వాన్స్, విత్‌డ్రా పూర్తిగా చేసుకుంటే నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరపాలన్న నిబంధన పెట్టినట్టు వెల్లడించారు. జీపీఎఫ్ వడ్డీ రేటును ఈపీఎఫ్‌తో సమానంగా పెంచే యోచనేదీ లేదని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. -
నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు కొలువులు
న్యూఢిల్లీ: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దేశవ్యాప్తంగా 1,832 మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు తేలిందని కేంద్రం ప్రకటించింది. ఈ వివరాలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2010లో ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం 1832 మందిలో సుమారు 1200 మంది బ్యాంకులు, బీమా సంస్థల్లో కొలువులు సంపాదించిన వారేనని బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. నకిలీ పత్రాలు లేదా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గుర్తించిన 1,832 కేసుల్లో 276 మందిపై సస్పెన్షన్ వేటు లేదా తొలగింపు, 521మందిపై కోర్టు కేసులు ఉండగా 1,035మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కుల ధ్రువీకరణ నకిలీ పత్రాలతో 157 మంది ఎస్బీఐలో, 135 మంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, 112 మంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో, 103 మంది సిండికేట్ బ్యాంక్ లోనూ పోస్టింగులు పొందారని చెప్పారు. ఇంకా న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్‌లో 41మంది చొప్పున ఉద్యోగాల్లో ఉన్నారని జితేంద్ర సింగ్ వెల్లడించారు. -
పాక్ ఆ ప్రాంతాలు విడిచి వెళ్లాల్సిందే: భారత్
-
పాక్ ఆ ప్రాంతాలు విడిచి వెళ్లాల్సిందే: భారత్
న్యూఢిల్లీ: ఆక్రమిత కశ్మీర్ భూభాగం, గిల్గిత్ బాల్తిస్థాన్ భూభాగం నుంచి పాకిస్థాన్ వెళ్లిపోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఎన్నో ఏళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యకు ఇదే కారణమని చెప్పింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ అక్రమంగా ఏయే ప్రాంతాలను ఆక్రమించుకుందో వాటన్నింటిని వదిలేసి వెళ్లిపోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కశ్మీర్ ప్రజల కోరుకుంటున్నట్లుగా ఆ సమస్యకు పరిష్కారం చూపే తీర్మానానికి తాను అనుకూలం అంటూ పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ప్రకటించిన నేపథ్యంలో దానికి కౌంటర్‌గా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ విషయంలో భారత్, పాక్ మధ్య ఏదైనా సమస్య ఉందంటే అది ఒక్క పాక్ అక్రమంగా ఆక్రమించినదాని గురించే. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం కావచ్చు. గిల్గిత్ బాల్తిస్థాన్ కావచ్చు. పాక్ అక్రమించిన భూభాగానికి తిరిగి ఎలా స్వాతంత్ర్యం ఇప్పించాలన్నది, తిరిగి భారత భూభాగంలో ఎలా కలపాలన్నదే ఇప్పుడు ప్రధానమైన అంశం’ అని ఆయన నొక్కి చెప్పారు. -
నెహ్రూ తప్పిదం వల్లే కశ్మీర్లో ఉగ్రవాదం
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపణ న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పాక్ ప్రాయోజిత ఉగ్రవాదానికి తొలి ప్రధాని నెహ్రూ తప్పిదాలతో మొదలై 60 ఏళ్లుగా సాగిన తప్పిదాలే కారణమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. ‘కశ్మీర్ అంశాన్ని అప్పటి హోం మంత్రి పటేల్‌కు వదిలిపెట్టి ఉంటే భారత ఉపఖండ చరిత్ర మరో విధంగా ఉండేది’ అని అన్నారు. భారత సర్జికల్ దాడులు, పెద్దనోట్ల రద్దు.. పాక్ ప్రాయోజిత ఉగ్రవాద నిరోధంలో నిర్ణయాత్మక చర్యలన్నారు. నోట్ల రద్దుతో ఉగ్రవాద కార్యకలాపాలు 60 శాతం, టెర్రరిస్టులకు పాక్ హవాలా మార్గంలో అందిస్తున్న నిధులు 50 శాతం తగ్గాయన్నారు. భారత నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న పాక్‌లోని రెండు ప్రెస్సులు మూతపడ్డాయని తెలిపారు. -
‘నోట్ల రద్దుతో పాకిస్థాన్ కు షాక్’
విశాఖపట్నం: మనదేశంలో పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాకిస్థాన్ కు షాక్ తగిలిందని పీఎంఓ, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పాకిస్థాన్ లో రెండు కరెన్సీ ముద్రణ సంస్థలు మూత పడ్డాయని వెల్లడించారు. డిమోనిటైజేషన్ తో సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో ఈ-గవర్నెన్స్ రెండు రోజుల జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్ లో తీవ్రవాద సంబంధిత హింసాకార్యకలాపాలు 60 వరకు తగ్గాయని తెలిపారు. హవాలా కార్యకలాపాలు సగానికి పడిపోయాయని చెప్పారు. కశ్మీర్ లో హింసను ప్రేరేపించడానికి.. తీవ్రవాద కార్యకలాపాలకు, ఈశాన్య ప్రాంతంలో అలజడులు రేపడానికి నకిలీ నోట్లు, హవాలా డబ్బు వినియోగిస్తున్నారని ఆరోపించారు. డిమోనిటైజేషన్ తో ఇటువంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడి హింసాత్మక చర్యలు తగ్గాయని వివరించారు. ‘పాకిస్థాన్ లో మన కరెన్సీని అక్రమంగా ముద్రిస్తున్న రెండు ముద్రణ సంస్థలు డిమోనిటైజేషన్ తో మూతపడినట్టు మా ప్రభుత్వానికి సమాచారం అందింది. పాత నోట్లను రద్దు చేయడంతో రెండు నెలల్లోనే మంచి ఫలితాలు వచ్చాయ’ని జితేంద్ర సింగ్ అన్నారు. -
నిజాయితీ అధికారులకు రక్షణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల విషయంలో మార్పులకు రంగం సిద్ధమైంది. సీబీఐ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించేముందు ఆయా శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిజాయితీ అధికారులను కాపాడేందుకు అవినీతి వ్యతిరేక బిల్లులో సవరణలు తీసుకొచ్చి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునేలా ఈ బిల్లు ధైర్యాన్నిస్తుందని.. సుపరిపాలనకు ఇది కీలకమైన అంశమని మంత్రి అన్నారు. అవినీతి వ్యతిరేక సవరణ బిల్లును 2013, ఆగస్టు 19న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదించారు. 2016, ఫిబ్రవరి 6న రాజ్యసభకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. గతేడాది ఏప్రిల్ 29న బిల్లులోని సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఈ-ఆఫీస్ గా మార్చేయండి..ప్రధాని అవార్డు పట్టేయండి!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖల కార్యాలయాలు ఇకనుంచి కాగిత రహిత కార్యాలయాలుగా(ఈ-ఆఫీస్) మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఈ ఆఫీస్ నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచే శాఖకు ఏటా పౌరసేవల దినోత్సవం నాడు ప్రధాని అవార్డుతో సత్కరించనున్నారు. ‘ఈ-ఆఫీసు ఏర్పాటుతో పరిపాలన వేగవంత మవుతుందని..ఫలితంగా ప్రభుత్వ ఖజానాను ఆదా చేసినవారమవుతామ’ని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన, బాధ్యతాయుతమైన పాలనను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఈ-ఆఫీసులుగా మార్చడం ద్వారా ఆ లక్ష్యానికి చేరవవుతామని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధామంత్రి లక్ష్యమైన ‘ప్రగతి’ని చేరుకునేందుకు ఈ-ఆఫీసు ఏర్పాటు అమలుకు పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆర్థికసాయం చేస్తుందని సింగ్ వెల్లడించారు. ఈ-ఆఫీసు ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ వరుసలో ముందుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ-ఆఫీసుగా మారి లక్ష్యాన్ని చేరుకుంటున్న దశలో...ఇప్పుడు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ ఆఫీసుగా మారి ఆ లక్ష్యాన్ని చేరుకోనుంది. -
సర్కారీ కొలువులు..రెండు లక్షలకు పైనే!
ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై బడ్జెట్లో అంచనా న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త. ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో రెండు లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు 2.18 లక్షల మేర పెరుగుతాయని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో 2015లో 33.05 లక్షలుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య వచ్చే ఏడాది నాటికి 35.23 లక్షలకు పెరగనుంది. ప్రభుత్వ భవిష్యత్ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొలువుల అంచనాలను బడ్జెట్లో ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. -
ఎజెండా నిర్దేశిస్తున్న మీడియా: జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార మంత్రి అరుణ్ జైట్లీ మీడియా తీరును మళ్లీ తప్పుపట్టారు. దాని స్వరూపం మారిందని, వార్తా సేకరణకు బదులు ‘ఎజెండా నిర్దేశిత సంస్థ’గా వ్యవహరిస్తోందని అన్నారు. రాజకీయ నేతలు కూడా అందుకు అనుగుణంగానే స్పందించాలనేలా బహుముఖ పోకడలు పోతోందన్నారు. ఈ మార్పులను ప్రభుత్వం గ్రహించిందన్నారు. ‘ఈ క్రమంలో వార్తా సేకరణ సంస్థలను గుర్తించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలతో పాటు సంప్రదాయ వార్తా పత్రికల్లో రిపోర్టింగ్‌కు కొంత అవకాశం ఉందనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఇందుకు స్థానమే లేదు. ఎందుకంటే వాటిల్లో రోజురోజుకూ వార్తల ప్రాధాన్యం తగ్గిపోతోంది’ అని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో జైట్లీ అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో కొత్తగా ఏర్పడే పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందనిజైట్లీ చెప్పారు. వనరులు అనుకూలిస్తే గత నవంబర్‌లో కశ్మీర్‌కు ప్రధాని ప్రకటించిన రూ.80 వేల కోట్ల విడుదలకు ప్రయత్నిస్తామన్నారు.హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలు లెఫ్ట్ ప్రేరేపిత ఉద్యమాలని, కొందరు జిహాదీల ప్రమేయం కూడా ఉందన్నారు. ఏడో వేతన సంఘం కమిటీపై అభ్యంతరం న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులపై నివేదిక కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి ప్యానల్లో మార్పులు చేయాలని సివిల్ సర్వీస్ అధికారుల ప్రతినిధి బృందం కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసింది. 13 మంది సభ్యుల ప్యానల్లో ఎనిమిది మంది ఒకే సర్వీసుకు చెందిన వారున్నార ంది. విజ్ఞప్తుల్ని పరిశీలిస్తామని మంత్రి వారికి హామీనిచ్చారు. ఈ బృందంలో ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ అధికారులున్నారు. -
‘పాకిస్తాన్ డే’ కార్యక్రమానికి రండి: పాక్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే ‘పాకిస్తాన్ డే’ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కశ్మీర్ వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీషా గిలానీ, అసియా అంద్రబీ సహా పలువురిని పాకిస్తాన్ ఆహ్వానించింది. గిలానీ, అంద్రబీ సహా జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్, హురియత్ మితవాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్‌లతో పాటు మరికొందరు వేర్పాటువాద నేతలను కూడా భారత్‌లోని పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో మార్చి 23న జరిగే పాకిస్తాన్ డే ఉత్సవాలకు ఆహ్వానించారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌కు కూడా ఆహ్వానం పంపించారని, అయితే, ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చన్నాయి. -
చర్చలే మార్గం.. యుద్ధం కాదు!
పాక్‌తో సంబంధాలపై లోక్‌సభలో సుష్మా స్వరాజ్ న్యూఢిల్లీ: ఉగ్రవాద నీడలు తొలగించేందుకు పాకిస్తాన్‌తో చర్చలే ఏకైక మార్గమని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలన్న ఆలోచన లేదని పేర్కొంది. ఉగ్రవాదంపై చర్చలు జరపాలన్నది భారత్, పాక్‌ల ప్రధానులు మోదీ, షరీఫ్‌లు రష్యాలోని ఉఫాలో, ఇటీవల పారిస్‌లో కలుసుకున్న సందర్భంలో తీసుకున్న నిర్ణయమని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ గుర్తు చేశారు. ‘బ్యాంకాక్‌లో జాతీయ భద్రత సలహాదారుల భేటీలో ఉగ్రవాదంపై చర్చించాం. ఒక్కసారి చర్చిస్తే సరిపోదు. చర్చల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించా’మన్నారు. లోక్‌సభలో బుధవారం జీరో అవర్‌లో సుష్మా ఈ విషయమై మాట్లాడారు. లాడెన్‌ను తుదముట్టించేందుకు పాక్‌లో అమెరికా చేపట్టిన సైనిక చర్య తరహా ప్రయత్నాల గురించి భారత్ ఆలోచిస్తోందా? అన్న బీజేపీ సభ్యుడు గణేశ్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై చర్యలు తీసుకునే విషయమై పాక్‌తో చర్చిస్తున్నామన్నారు. తన తాజా పర్యటన సందర్భంగా.. ఉగ్రవాదానికి సంబంధించి అన్ని అంశాలపై ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు జరపాలని ఇరుదేశాలు నిర్ణయించాయన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఐరాస, ఈయూ సహా దాదాపు అన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించామని చెప్పారు. ఐరాసలో పెండింగ్‌లో ఉన్న ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం’లో కదలిక తెచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు వారధి భారత్‌లోని రామేశ్వరం నుంచి శ్రీలంకకు సముద్రం మీదుగా వారధిని, సొరంగాన్ని నిర్మించనున్నామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ బుధవారం పార్లమెంటుకు తెలిపారు. నిర్మాణానికి 100% నిధులను అందించేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టు వ్యయం రూ. 24 వేల కోట్లుగా ఉంటుందన్నారు. దేశాల మధ్య వాహనాలు నిరంతరాయంగా తిరిగేలా బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ► పారిస్ వాతావరణ ఒప్పందంలో భారత ప్రయోజనాలకు సముచిత ప్రాధాన్యత లభించిందని కేంద్ర పర్యావరణ మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. భారత ప్రధాన డిమాండ్లకు ఆమోదం లభించిందన్నారు. వాతావరణ సదస్సులో భారత్ పోషించిన పాత్రను పార్లమెంటు ఉభయసభలకు జవదేకర్ వివరించారు. ► {పభుత్వ సంస్థల్లో అవినీతిని, అవకతవకలను వెలికితీస్తున్న విజిల్ బ్లోయర్స్, సమాచార హక్కు కార్యకర్తలు ఎంతమంది హతమయ్యారో తెలిపే కేంద్రీకృత సమాచారం తమవద్ద లేదని ప్రభుత్వం తెలిపింది. ► సొంత ప్రాంతాల అభివృద్ధి కోసం పార్లమెంటు సభ్యులకిచ్చే మొత్తాన్ని ఏడాదికి రూ. 5 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచాలని పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రస్తుతమిస్తున్న ఎంపీల్యాడ్స్ నిధులు సరిపోవడం లేదన్నారు. ► అత్యంత విలువైన వాణిజ్యపరమైన వ్యాజ్యాల విచారణకు ప్రత్యేకంగా కొన్ని ఎంపిక చేసిన హైకోర్టుల్లో ‘కమర్షియల్ బెంచ్’లను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ► చంద్రయాన్ 2’లో భాగంగా భారతీయ రాకెట్ 2017లో చంద్రుడిపై దిగుతుందని ప్రధాని కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభకు తెలిపారు. దేశ తొలి సోలార్ మిషన్ ‘ఆదిత్య ఎల్1’ 2019లో ప్రారంభమవుతుందన్నారు. -
'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది'
న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సత్తా భారత ప్రభుత్వానికి ఉందని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హోంమంత్రిత్వ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. ఇటువంటి దాడులను తిప్పికొట్టగల సత్తా తమకు ఉందని పునరుద్ఘాటించారు. -
యూపీలో మరో దారుణం
పాత్రికేయుడి తల్లికి నిప్పంటించిన పోలీసులు బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం! జితేంద్రసింగ్ అనే పాత్రికేయుడిని పోలీసులు సజీవదహనం చేసిన ఉదంతం మరువకముందే అలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. భర్తను విడిపించుకునేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ఓ పాత్రికే యుడి తల్లికి పోలీసులు నిప్పంటించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తెల్లవారుజామున మరణించింది. బారాబంకీ జిల్లా కోథీ పోలీసు స్టేషన్ పోలీసులు స్థానిక హిందీ దినపత్రిక జర్నలిస్టు సంతోష్ తండ్రి అయిన రామ్ నారాయణ్‌ను ఈవ్‌టీజింగ్ కేసులో విచారించాలంటూ శనివారం తీసుకె ళ్లారు. భర్తను విడిపించుకునేందుకు స్టేషన్‌కు వచ్చిన నీతూను పోలీసులు రూ. లక్ష డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమెను అవమానించి, దుర్భాషలాడి గెంటేశారు. తర్వాత పెట్రోల్ చల్లి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన బాధితురాలు లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసు స్టేషన్ ఇన్చార్జి రామ్ సాహెబ్ సింగ్ యాదవ్, ఎస్ఐ అఖిలేశ్ రాయ్‌లే తన కు నిప్పంటించారని బాధితురాలు మేజిస్ట్రేట్, మీడియా ముందు వాంగ్మూలం ఇచ్చింది. ‘అందరూ చోద్యం చూస్తున్నారు. నాకెవరూ సాయం చేయలేదు. నాపై పెట్రోల్ చల్లి, అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటించారు’ అని చెప్పింది. అయితే, బాధితురాలే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. తన తల్లికి పోలీసులే నిప్పంటించారని సంతోష్ చెప్పారు. పోలీసులపై మోపిన అభియోగాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తన తండ్రిని అక్రమంగా 24 గంటలు నిర్బంధంలో ఉంచుకున్నారన్న కారణంతోనే ఇద్దరు పోలీసు అధికారులనూ సస్పెండ్ చేశారన్నారు. వారిపై హత్య కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. ఈ ఉదంతంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించామని సీఎం అఖిలేశ్ వెల్లడించారు. -
నిజంపై జులుం
దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, భావప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కి మరో పది రోజులకు నాలుగు దశాబ్దాలు పూర్తవుతుంది. అప్పటికీ, ఇప్పటికీ పాలకులు తెలివిమీరారు. బాహాటంగా అలాంటి చర్యకు పాల్పడకుండానే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా తమకు ఎదురులేకుండా చేసుకోవాలను కుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో ఆన్లైన్ మీడియాకు చెందిన పాత్రికేయుడు జగేంద్ర సింగ్ ను ఇటీవల అత్యంత దుర్మార్గంగా హత్యచేసిన ఉదంతం ఈ సంగతినే ధ్రువపరుస్తున్నది. జగేంద్ర సింగ్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొంతకాలంగా ఉత్తరప్రదేశ్ మంత్రి రామ్మూర్తి సింగ్ వర్మ పాల్పడ్డారంటున్న అక్రమాలను వెలుగులోకి తెస్తున్నాడు. ఆయనా, ఆయన మనుషులు భూకబ్జాలకూ, అక్రమ మైనింగ్‌కూ పాల్పడుతున్నారని, ఒక అంగన్వాడీ కార్యకర్తపై అత్యాచారం చేశారని కథనాలు వెలువరించాడు. ఈ అక్రమాలన్నిటా స్థానిక పోలీసుల హస్తం ఉన్నదని చెప్పాడు. ఆ కథనాలతో ఆగ్రహించిన పోలీసులు ఆయన ఇంటిపై దాడిచేసి జగేంద్ర సింగ్ ను కొట్టి ఆయనపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. 60 శాతంపైగా కాలిన గాయాలతో వారంరోజులపాటు నరకయాతన అనుభవించిన జగేంద్ర సింగ్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తనపై దాడి చేసింది ఎవరెవరో, వారు ఎవరి తరఫున వచ్చారో చనిపోయే ముందు చెప్పాడు. ఎంతో ఆందోళన జరిగిన తర్వాత ఈ కేసులో మంత్రి, స్థానిక ఎస్ఐతోపాటు తొమ్మిది మందిని ముద్దాయిలుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. ‘నేను రాసిన రాతలపై అభ్యంతరం ఉంటే నాపై కేసులు పెట్టొచ్చు...మంత్రి నన్ను పిలిపించి కొట్టవచ్చు. కానీ, ఇలా నిలువునా నిప్పెడతారా...’ అని జగేంద్ర సింగ్ తన మరణవాంగ్మూలంలో వాపోయాడు. నిజమే... ఆయనను కొట్టి ఉండొచ్చు, ప్రలోభాలు చూపి నోరు నొక్కొచ్చు. మరెప్పుడూ ఇలాంటి సాహసానికి పాల్పడకుండా బెదిరించి ఉండొచ్చు. ఆయనపై కేసులు పెట్టొచ్చు...కోర్టులకు ఈడ్చవచ్చు. అయితే, అలా చేస్తే ఈ జితేంద్ర పోయి మరొకరెవరో రావచ్చు. వారు అంతకుమించిన చురుకుదనాన్ని ప్రదర్శించవచ్చు. కనుక జగేంద్ర సింగ్ ప్రాణాలు తీయడమే ఆ దుండగుల లక్ష్యమైంది. దాన్ని కూడా గుట్టు చప్పుడు కాకుండా చేస్తే ఆశించిన ఫలితం రాదు. అందుకే ఆ పనిని వీలైనంత కర్కశంగా, భయానకంగా ఉండేలా చేస్తేనే... జగేంద్ర రలాంటివారందరిలోనూ భయోత్పాతం కలుగుతుందని వారు భావించారు. ఒకపక్క ఆ పాత్రికేయుడు చావుబతుకుల్లో ఉండగానే...పాత్రికేయ సంఘాలు ఆందోళన చేస్తుండగానే అధికార మదంతో కన్నూ మిన్నూగానని కొందరు సమాజ్‌వాదీ నేతలు జగేంద్ర సింగ్ ఇంటికెళ్లి మరింతగా బెదిరించారు. ‘ఎందుకు మంత్రిపై నిందలేస్తారు? మీ నాన్నను నిజంగా చంపదల్చుకుంటే కస్టడీలోనే పోలీసులు ఆ పని చేసేవారు’ అంటూ ఎస్పీ నేత మిథిలేష్ కుమార్ హెచ్చరించాడు. స్థానికులు ఆగ్రహించి వెంబడించడంతో అక్కడినుంచి ఆయన పలాయనం చిత్తగించాడు. మరో మంత్రి ప్రశాంత్ యాదవ్ అయితే ఈ ఉదంతాన్ని ప్రకృతి సహజమని, విధి లిఖితమని తేల్చాడు. జగేంద్ర సింగ్ గతంలో పాత్రికేయుడైతే కావొచ్చుగానీ... ఇప్పుడు కాదని, దేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న 30 కోట్లమందిలో అతను ఒకడని మరో ఎస్పీ నేత వ్యాఖ్య. ఒక దుర్మార్గమైన ఉదంతమూ, దాని వెంబడే మరికొందరి అమానుష వ్యాఖ్యలు యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. ఆరోపణలొచ్చిన మంత్రిని తొలగించే ఉద్దేశం లేదని సీఎం అఖిలేష్ ప్రకటించారు. పోలీసుల దర్యాప్తు పూర్తయి ఆధారాలేమైనా లభిస్తేనే ఆ పని చేస్తారట! ఎమర్జెన్సీ విధించిననాటికీ, ఇప్పటికీ పరిస్థితులు ఎంతగా దిగజారాయో ఈ ఉదంతం వెల్లడిస్తుంది. అఖిలేష్ కేబినెట్లోని 48మంది మంత్రుల్లో 26మందిపై నేరారోపణలున్నాయి. ఈ ఉదంతంలో ఆరోపణలొచ్చిన వర్మ వారిలో లేరు. అంతటి నిజాయితీపరుణ్ణి అనవసరంగా రచ్చకీడ్చే ప్రయత్నంచేశాడని జగేంద్రపై ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. జగేంద్రను చంపడమే కాదు...అతన్ని బ్లాక్‌మెయిలర్‌గా చిత్రించే యత్నం చేస్తున్నారు. తమ ఇంట్లో కనీసం టీవీ సెట్ కూడా లేదని, తమ బ్యాంకు ఖాతాలన్నీ తనిఖీ చేసుకోవచ్చునని కుటుంబసభ్యులు చేస్తున్న సవాలుకు వారివద్ద జవాబులేదు. యూపీలో మాత్రమే కాదు...దేశంలోనే ఇలా నిజాలను బట్టబయలు చేస్తున్నవారిపైనా, పాత్రికేయులపైనా దాడులు పెరిగాయి. అక్రమాలకు పాల్పడేవారిలో అసహనం కట్టలు తెంచుకుంటున్నది. జగేంద్ర ఉదంతానికి ముందు యూపీలో మరో పాత్రికేయుణ్ణి తీవ్రంగా కొట్టి, తాళ్లతో మోటార్‌సైకిల్‌కు కట్టి ఈడ్చుకెళ్లారు. ఇంకా వెనక్కి వెళ్తే 2012లో మనోజ్ పాండే అనే పాత్రికేయుణ్ణి కాల్చిచంపారు. ఆ మరుసటి ఏడాది రాజేష్ వర్మ అనే పాత్రికేయుణ్ణి హతమార్చారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఆడియో, వీడియోలకు అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నేతలు గత కొన్ని రోజులుగా ఎలా బెదిరిస్తున్నారో, ఏ రకమైన వాదనలు చేస్తున్నారో దేశమంతా చూస్తూనే ఉన్నారు. ఒక ఎంపీ అయితే కోపంతో ఊగిపోయి నోటికొచ్చినట్టు వదరడం చానెళ్లన్నీ చూపాయి. అధికారానికి రాకముందునుంచే తనకు గిట్టని మీడియాను ఏ కార్యక్రమానికీ పిలవకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించడం మొదలెట్టిన టీడీపీనుంచి ఇంతకంటే మెరుగైన ప్రవర్తనను ఆశించలేం. పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసేవారికి అంతో, ఇంతో రక్షణ ఉంటుంది. వారి తరఫున పోరాడేందుకు బలమైన పాత్రికేయ సంఘాలుంటాయి. కానీ, మారుమూల ప్రాంతాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తున్న చిన్నతరహా మీడియా ప్రతినిధులకూ, అక్రమాలను సహించలేక సామాజిక మాధ్యమాలే వేదికగా పోరాడుతున్న అసంఖ్యాకమైన పౌరులకూ ఎలాంటి రక్షణా ఉండటం లేదు. డబ్బు, పలుకుబడి ఉన్నవారు అలాంటి వారిపై కక్షగట్టి అక్రమ కేసుల్లో ఇరికిస్తుంటే...దాడులు చేస్తుంటే వారు నిస్సహాయులుగా మిగులుతున్నారు. కనీసం ఇప్పుడు యూపీలో జరిగిన ఘోర ఉదంతం అందరి కళ్లూ తెరిపించాలి. ఎంత చిన్న స్వరంతోనైనా, ఎన్ని పరిమితులకు లోబడైనా చిత్తశుద్ధితో, నిర్భయంగా పోరాడుతున్నవారికి అందరూ అండగా నిలబడాలి. అలాంటివారి రక్షణకు అవసరమైన చట్టాలు ఏర్పడేందుకు కృషి జరగాలి. -
'పాక్ ఒక్క తూటాకి.. భారత్ నాలుగు తూటాలు'
జమ్ము: పాకిస్తాన్ ఒక్క తూటా పేల్చితే... భారత సైన్యం నాలుగు తూటాలతో దీటుగా సమాధానమిస్తుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. 'మన బలగాలు చేసిన పనిని ప్రజలు కొనియాడుతున్నందున... నేను చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను' అని అన్నారు. సరిహద్దు ప్రాంతాల పర్యటనలో భాగంగా కతువా జిల్లాలో సైన్యం పనితీరుని ఆయన ప్రశంసించారు. పాక్ బలగాలు సామాన్య ప్రజలపై కాల్పులకు పాల్పడుతోందని జితేంద్ర సింగ్ మండిపడ్డారు.. చాలా ఏళ్ల తర్వాత భారత సైన్యం దాయాది దేశం పాకిస్తాన్ దాడులకు దీటుగా బదులిచ్చిందని ప్రజలు చెబుతున్నారని.. జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల వలసదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఆయన చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ ముగిస్తామని జితేంద్ర సింగ్ తెలిపారు. -
‘శారదా’కు ఉగ్ర లింకు లేదు
బీజేపీ చీఫ్ అమిత్ షా వాదనతో విభేదించిన కేంద్రం న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ సొమ్ము బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారన్న విషయంలో ప్రభుత్వం, బీజేపీ మధ్య భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్మును బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పగా.. ఓ కేంద్ర మంత్రి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు శారదా చిట్ ఫండ్ సొమ్ము ఉపయోగించినట్లు ఇంతవరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు’’ అని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆదివారం కోల్‌కతాలోని ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2న బర్ద్వాన్లో జరిగిన పేలుడుకు శారదా కుంభకోణం సొమ్మే ఉపయోగించారు. అయితే దాన్ని దర్యాప్తు చేయకుండా ఎన్ఐఏను కొందరు అడ్డుకుంటున్నారు. ఆ పేలుడుతో సంబంధమున్న కొందరు టీఎంసీ నాయకులును కాపాడేందుకే ఇలా చేస్తున్నారు’’ అని ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు శారదా స్కాం అంశంపై జితేంద్రసింగ్ ప్రకటనను మీడియా వక్రీకరించిందని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. శారద స్కాం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, బంగ్లాదేశ్‌లో ఉగ్ర కార్యకలాపాలకు ఆ సొమ్ము వాడినట్లు ఇప్పటివరకూ ఏమీ బయటపడలేదనే మంత్రి పేర్కొన్నట్లు వివరించాయి. -
'సంతృప్తి పరచడానికి సమయం పడుతుంది'
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికారులు అందరినీ సంతృప్తి పరచడానికి సమయం పడుతుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐఏఎస్ అధికారుల విభజన పారదర్శికంగా జరుగుతుందని చెప్పారు. 15 రోజుల్లో అధికారుల విభజన జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రానికి ఏ అధికారిని కేటాయించాలన్నదానిపై చర్చ జరుగుతుందని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సివిల్ సర్వీసెస్ అధికారుల కేటాయింపుపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ముగిసింది. వివాదంలేని అధికారుల కేటాయింపునకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 20 మంది అధికారులు కమిటీ ముందు హాజరయ్యారు. కమిటీ అధికారుల అభ్యంతరాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ** -
రాత్రికి రాత్రే మార్పులు చేయడం అసాధ్యం!
న్యూఢిల్లీ:యూపీఎస్సీపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆందోళనకు ఇక్కడతో ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా యూపీఎస్సీఅర్హత పరీక్ష జరగడానికి ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విన్నవించారు. దీనిపై గురువారం లోక్ సభలో ప్రసంగించిన ఆయన.. ఈ సమస్యకు భవిష్యత్తులో తగిన పరిష్కారం కనుగొనేందుకు యత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 'ఆగస్టు 24 వ తేదీన యూపీఎస్సీ పరీక్ష జరుగనుంది. ఇప్పుడు ఈ వివాదం సరికాదు. ఈ తాజా గందరగోళంతో విద్యార్థులను మరింత ఆందోళనలోకి నెట్టవద్దు.'అని తెలిపారు. 2014లో యూపీఎస్సీ పరీక్షా విధానంపై విద్యార్థులు గళం విప్పారు. ముంగానే ఈ పరీక్షా విధానం ఖరారైంది. రాత్రికి రాత్రి మార్పులు తీసుకురావడం అసాధ్యం'అంటూ తనదైన శైలిలో వెంకయ్య తెలిపారు. అయితే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నెల 24న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు మాత్రం సుముఖత చూపలేదు. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న యూపీఎస్సీ వివాదంపై మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. -
యూపీఎస్సీ వివాదంపై అఖిలపక్షం!
విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు నో న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నెల 24న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు మాత్రం సుముఖత చూపలేదు. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న యూపీఎస్సీ వివాదంపై మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన వెంటనే విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. మెరిట్ నిర్ధారణలో ఇంగ్లిష్ మార్కులను పరిగణనలోకి తీసుకోబోమంటూ సోమవారం సిబ్బంది, శిక్షణ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ ప్రకటన సమస్యను మరింత సంక్లిష్టం చేసిందని విమర్శించాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత పోరు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని సాగదీస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్‌తివారీ ఆరోపించారు. మరిం త చర్చ జరగాల్సి ఉన్నందున ఈ సమస్యపై ఆగస్టు 24లోగా పరిష్కారం సాధ్యం కాదని టీఎంసీ సభ్యుడు డెరిక్ఒబ్రీన్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ అంటే లోహే కా పేఢ్.. సివిల్స్ ప్రశ్నపత్రంలోని అనువాద లోపాలను ఎస్పీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ ఎత్తి చూపారు. ‘నార్త్ పోల్’ను హిందీలో ‘ఉత్తరీ ఖంభా’ అని, ‘స్టీల్ ప్లాంట్’ను ‘లోహే కా పేఢ్’ అని అనువదించారన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ సూచనకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ప్రకాశ్ జవదేకర్ ‘తప్పకుండా అఖిలపక్ష భేటీ ఉంటుంది. అవసరమైతే అలాంటి సమావేశాలను మరికొన్నింటిని నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. ‘ఇది సున్నితమైన అంశం. పరీక్షావిధానంలో భారీ మార్పులు అవసరమా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ‘ఈ అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభిప్రాయాలను తెలిపాయి. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా మళ్లీ అఖిలపక్ష భేటీ ఏంటీ?’ అని సీపీఎం సభ్యుడు సీతారాం యేచూరి ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. కాగా, సివిల్స్ ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి హిందీకి చేసిన అనువాదంలో తప్పులేం లేవని ప్రభుత్వం ప్రకటించింది. -
ఇంగ్లిష్ మార్కులను పరిగణించం!
సివిల్స్ సీశాట్ 2 పరీక్ష విధానంలో మార్పునకు ప్రభుత్వం ఆమోదం లోక్‌సభలో ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్ శాంతించని అభ్యర్థులు; పేపర్ 2ను పూర్తిగా తొలగించాలని డిమాండ్ ఆగస్టు 24ననే ప్రిలిమ్స్: యూపీఎస్సీ; వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వివాదం ముదురుతుండటంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ‘సీశాట్(సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్)’ రెండో పేపర్లోని ఇంగ్లిష్ విభాగంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని సోమవారం ప్రకటించింది. అయితే, తాము సీశాట్ విధానంలో మార్పులను కోరడం లేదని, మొత్తంగా ఆ పేపర్‌ను తొలగించాలన్నది తమ డిమాండ్ అని గత 25 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సివిల్స్ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం ప్రకటించిన మార్పులను చేర్చి ముందు ప్రకటించినట్లుగానే ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 24ననే నిర్వహిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ‘‘ సీశాట్ పేపర్ 2 లోని ‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్’ విభాగంలోని మార్కులను మెరిట్ నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తోంది’’ అని కేంద్ర సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. అలాగే, 2011లో సివిల్స్ పరీక్ష రాసినవారికి 2015లో మరో అవకాశమిస్తామని కూడా వెల్లడించారు. సీశాట్ పేపర్ 2ను తొలగించడం, ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయడం.. ఈ డిమాండ్లతో ఇప్పటివరకు ముఖర్జీ నగర్లో ఆందోళన నిర్వహిస్తున్న అభ్యర్థులు.. తమ నిరసన స్థలాన్ని సోమవారం జంతర్‌మంతర్‌కు మార్చారు. పార్లమెంటులో రభస.. ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. రాజ్యసభలో గందరగోళం చెలరేగి సభ ఒకసారి వాయిదా పడింది. జితేంద్రసింగ్ ప్రకటన రాజ్యసభలో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ, డీఎంకే, తృణమూల్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ, జేడీయూ పార్టీల సభ్యులను శాంతింపచేయలేదు. సివిల్స్ అభ్యర్థులు ఈ పరీక్షను తమ మాతృభాషలో రాసే అవకాశముందా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. సీశాట్ వివాద పరిష్కారానికి నిర్దేశిత గడువు విధించాలని డిమాండ్ చేశారు. కాగా, నేపాల్ పర్యటన నుంచి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జితేంద్రసింగ్‌లు ఈ అంశంపై తాజా పరిణామాలను వివరించారు. -
పార్లమెంటుకు ‘ప్రిలిమ్స్’ సెగ!
పరీక్ష విధానంపై పార్లమెంటులో ఆందోళన సివిల్స్ అభ్యర్థులకు అన్యాయం జరగనివ్వబోమని ప్రభుత్వం హామీ న్యూఢిల్లీ: కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై తలెత్తిన వివాదం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. హిందీతోపాటు ప్రాంతీయ భాషల అభ్యర్థులకు నష్టం చేకూర్చేలా ఉన్న సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్ఏటీ) పేపర్-2ను మార్చాలన్న విపక్షాల డిమాండ్‌తో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడగా లోక్‌సభలో ఈ అంశాన్ని తక్షణమే చర్చకు చేపట్టాలంటూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అభ్యర్థులకు భాషాపరంగా అన్యాయం జరగబోనివ్వమని హామీ ఇచ్చింది. వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని వారంలోగా నివేదిక అందించాల్సిందిగా కోరినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ అభ్యర్థులు నిరసనల వంటి భౌతిక చర్యలకు దిగరాదని కోరారు. ప్రాంతీయ అభ్యర్థులపై వివక్ష: శరద్ యాదవ్ ప్రభుత్వ ప్రకటనపై విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షలో ప్రాంతీయ భాషల అభ్యర్థులపై వివక్ష ఉంటోందన్నారు. ఈ పరీక్షలో పాసయ్యే తమిళం, తెలుగు, హిందీ, ఇతర భాషల అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోతుంటే అదే సమయంలో ఆంగ్ల మాధ్యమం అభ్యర్థుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రాంతీయ భాషల్లోనూ రూపొందించాలని కోరారు. యూపీఎస్సీ పరీక్ష నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎంపీ డి. రాజా డిమాండ్ చేశారు. దేశంలో 500 భాషల్లో పరీక్షను నిర్వహించాలా? అంటూ ఇంగ్లిష్ భాషకు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీ గిల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు మండిపడ్డారు. లోక్‌సభలోనూ నిరసనలు... లోక్‌సభలోనూ ఈ అంశంపై విపక్షాలు నిరసనలకు దిగాయి. సభ ప్రారంభం కాగానే ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఈ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ కోరగా అందుకు ఆమె నిరాకరించారు. మాతృభాషలోనే రాసేందుకు అనుమతించాలి: కేశవరావు సాక్షి, న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలను మాతృభాషలో రాసేందుకు అనుమతించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘ఒక సమస్యను పార్లమెంటు చర్చించిందంటే ఆ సమస్య దేశ సమస్యగా కేంద్రం అర్థం చేసుకోవాలి. సమస్య లేకుండా చేయాలనే మేమంతా కోరుతున్నాం. మీ వద్ద ఉన్న నిగ్వేకర్ కమిటీ నివేదికను పక్కన పెట్టేశారు. ముందుగా హాల్టిక్కెట్ల పంపిణీని ఆపండి. ఇది ఆందోళన తీవ్రతను తగ్గిస్తుంది. 2012 నుంచి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ పరీక్ష(సీశాట్)లో రెండు సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించాల్సిన చోట ఆంగ్లాన్ని ప్రవేశపెట్టారు. ఆ పరీక్షను తమ భాషలో నిర్వహించాలని హిందీతోపాటు ఇతర మాతృ భాషల అభ్యర్థులు కోరుతున్నారు.’’ అని కేంద్రాన్ని అన్నారు.గ ఏమిటీ వివాదం... సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్ఏటీ) పేపర్-2లో కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ వంటి విభాగాల్లో ప్రశ్నలను ఆంగ్లంలోనే అడగడం వల్ల హిందీ, ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే ప్రశ్నలు కఠినంగా ఉండటంతోపాటు సైన్స్ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలానే ఉంటున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. -
‘370’ వివాదం!
సంపాదకీయం: దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో కీలకమైనదని అందరూ భావిస్తున్న కాశ్మీర్ విషయంలో మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజే వ్యాఖ్యానించి ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి జితేంద్రసింగ్ పెద్ద తేనెతుట్టెను కదిపారు. జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దుచేయడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆయన ప్రకటన సారాంశం. ఆ అధికరణపై బీజేపీకున్న అభిప్రాయమేమిటో ఎవరికీ తెలియనిది కాదు. ఆ అభిప్రాయాన్ని కాంగ్రెస్‌వంటి పార్టీలు మాత్రమే కాదు...ఆ పార్టీతో ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన పార్టీలు సైతం గతంలో వ్యతిరేకించాయి. మరికొన్ని అంశాలతోపాటు 370 జోలికెళ్లబోమని హామీ ఇచ్చాకే ఆ పార్టీలు ఎన్డీఏలో చేరడానికి అంగీకరించాయి. అంతమాత్రంచేత బీజేపీ ఆ విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు. అయితే, 370 గురించి గతంలో బీజేపీ మాట్లాడినదానికీ, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడుదలచేసిన మేనిఫెస్టోలో ఆ పార్టీ పొందుపరిచిన అంశాలకూ మధ్య వ్యత్యాసముంది. తమకు సొంతంగా మెజారిటీ వస్తే ఆ అధికరణను రద్దు చేస్తామని గతంలో చెప్పిన బీజేపీ...అందుకోసం సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని ఈసారి చెప్పింది. 370వ అధికరణ ఏ చారిత్రక సందర్భంలో రాజ్యాంగంలో వచ్చి చేరింది, దాన్ని రద్దు చేస్తే కలిగే పరిణామాలేమిటన్న అంశాలను పక్కనబెడితే... వివాదాస్పదం అనుకున్న ఏ అంశంపైన అయినా అందరితో చర్చించాలనుకోవడం, వారిని ఒప్పించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలనుకోవడం హర్షించదగిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడింది కూడా దానికి భిన్నమైనది కాదు. అయితే, ఇలాంటి చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని ఆయన చెబుతున్నారు. సరిగ్గా నెలక్రితం కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా గిలానీ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. నరేంద్ర మోడీ తన వద్దకు ఇద్దరు దూతలను పంపారని, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సహకరించమని కోరారని ఆయన చెప్పారు. ఈ విషయంలో మోడీతో నేరుగా మాట్లాడే ఏర్పాటుచేస్తామని ఆ దూతలు చెప్పినట్టు వెల్లడించారు. హురియత్ నేతలను కూడా ఆ దూతలు కలిశారని, తాను మాత్రమే మోడీతో చర్చించేందుకు నిరాకరించానని కూడా గిలానీ చెప్పారు. ఇందులో నిజం లేదని హురియత్ నేతలనగా, తాము ఎవరినీ దూతలుగా పంపలేదని బీజేపీ తోసిపుచ్చింది. ఆ వచ్చినవారి పేర్లు బయటపెట్టాలని కూడా సవాల్ చేసింది. మరి ఇప్పుడు మంత్రిగారు చెబుతున్నదేమిటి? సంబంధిత పక్షాలతో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయనంటున్నారు. ఆ ‘సంబంధిత పక్షాలు’ ఎవరో వెల్లడిస్తే విషయం మరింత స్పష్టంగా ఉండేది. జమ్మూ-కాశ్మీర్లో పాలకపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్, విపక్షమైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)వంటివి తమతో ఎవరూ చర్చించలేదంటున్నాయి. తాను మాట్లాడలేదని గిలానీ అంటే...తమనూ ఎవరూ కలవలేదని హురియత్ నేతలు చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంప్రదిస్తున్న నేతలెవరు? జితేంద్రసింగ్ వివరణ ఇస్తే తప్ప ఈ సంగతి తె లిసే అవకాశం లేదు. రాజ్యాంగ సభ చర్చించి చేర్చిన 370వ అధికరణ వెనక పెద్ద చరిత్రే ఉన్నది. జమ్మూ-కాశ్మీర్ పాలకుడు హరిసింగ్ 1947లో ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆ అధికరణ వచ్చిచేరింది. దీనికింద విదేశీ వ్యవహారాలు, ఆర్ధికం, కమ్యూనికేషన్లు, రక్షణ వంటివి మినహా మిగిలిన అంశాల్లో జమ్మూ- కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప కేంద్రం చేసే చట్టాలేవీ ఆ రాష్ట్రానికి వర్తించవు. అందువల్ల జమ్మూ-కాశ్మీర్‌కు పౌరసత్వం, ఆస్తిహక్కు వంటి అంశాల్లో సొంత చట్టాలున్నాయి. పర్యవసానంగా బయటివారు అక్కడ ఆస్తులు సమకూర్చుకోవడం సాధ్యంకాదు. రాజ్యాంగ సభ అవసరంలేదని భావిస్తే తప్ప 370ను రద్దుచేయడం సాధ్యంకాదని అదే అధికరణలోని మూడో క్లాజు చెబుతోంది. అసలు రాజ్యాంగ సభే 1957లో రద్దయింది గనుక అలాంటిదే మరో సభ ఏర్పడి దీన్ని కాదంటే తప్ప రద్దుచేయడం అసాధ్యమని కొందరి వాదన. అయితే, ఇందుకు భిన్నంగా...రాజ్యాంగంలో ఏమి ఉన్నా వాటిని రద్దుచేసే/సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని 368వ అధికరణ చెబుతున్నది. ఇందులో చివరకు చెల్లుబాటయ్యేది ఏమిటన్న సంగతి అలా ఉంచితే రాజ్యాంగాన్ని సవరించడానికి సభలో మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం. లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ ప్రస్తుతానికైతే అలాంటి మెజారిటీ ఎన్డీఏకు లేదు. కనుక 370 అధికరణ రద్దు ఇప్పటికిప్పుడైతే అసాధ్యం. పైగా ఈ అధికరణ గురించి ఆలోచించాల్సినంత అత్యవసర పరిస్థితులేవీ కాశ్మీర్లో ప్రస్తుతానికి లేవు. మరి కేంద్రమంత్రి అంత ఆదరాబాదరాగా, బాధ్యతలు చేపట్టిన వెంటనే దాన్ని గురించి ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఒకపక్క యూపీఏ హయాంలో హరించిన రాష్ట్రాల హక్కులను పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంగా బీజేపీ చెప్పింది. ఇప్పుడు కాశ్మీర్ అనుభవిస్తున్న ప్రత్యేక హక్కుల్లో కొన్నింటిపై బీజేపీకి అభ్యంతరం ఉండొచ్చుగానీ వాటిల్లో చాలాభాగం ఇతర రాష్ట్రాలకు వర్తింపజేయవలసినవి ఉన్నాయని గుర్తించాలి. ఒక్క యూపీఏ పాలనలో మాత్రమేకాదు... ఇందిరాగాంధీ పాలనాకాలం నుంచి ‘ఉమ్మడి జాబితా’ క్రమేపీ చిక్కిపోతూ వస్తున్నది. కేంద్రం ఏదో సాకుతో ప్రతి రంగంలోనికీ చొరబడి రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చింది. దీన్ని సరిచేయవలసిన ప్రస్తుత తరుణంలో అందులో భాగంగా 370 అధికరణ గురించి కూడా చర్చిస్తే అందరూ స్వాగతిస్తారు. కేంద్రమంత్రి ఈ సంగతిని గుర్తించాలి. -
ఆర్టికల్ 370 రద్దుపై విస్తృత చర్చ!
* వివాదానికి తెరతీసిన పీఎంఓ మంత్రి వ్యాఖ్యలు * మండిపడ్డ ఒమర్, పీడీపీ * వివరణ ప్రకటన విడుదల చేసిన జితేంద్ర సింగ్ న్యూఢిల్లీ/శ్రీనగర్: ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన కార్యాలయూనికి (పీఎంఓ) చెందిన ఓ మంత్రి వివాదానికి తెరతీశారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని అధికరణం 370 రద్దుకు సంబంధించి పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రతిపక్ష పీడీపీ ఆగ్రహానికి కారణమయ్యూయి. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సింగ్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు అంగీకరించని వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ అంశంలోని మంచిచెడులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లోని ప్రతి ఒక్కరినీ సంప్రదించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ అంశంపై బీజేపీ పూర్తిగా వృత్తిపరమైన నైపుణ్యంతో వ్యవహరిస్తోందని, కాశ్మీర్ లోయలో సమావేశాలు నిర్వహిస్తోందని వివరించారు. కొందరికి నచ్చజెప్పడంలో (ఆర్టికల్ 370 రద్దుపై) సఫలీకృతులమయ్యూమని కూడా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. రాష్ట్రానికి, మిగతా దేశానికి మధ్య ఉన్న ఏకైక రాజ్యాంగపరమైన సంబంధం ఆర్టికల్ 370 ఒక్కటేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘రాసి పెట్టుకోండి.. అంతేకాదు ఈ ట్వీట్‌ను సేవ్ కూడా చేసుకోండి. మోడీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయినా.. 370 ఉన్నంత కాలం కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉంటుంది. అది లేకపోతే ఉండదు ’ అంటూ తీవ్రంగా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై వ్యాఖ్యలు చేసిన జితేంద్ర సింగ్‌కు ప్రధాని, బీజేపీ నాయకత్వం కళ్లెం వేయూలని పీడీపీ సూచించింది. వివాదం నేపథ్యంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక మంత్రి మరో ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను మీడియూ తప్పుగా చిత్రీకరించిందన్నారు. ప్రధానమంత్రిని ఉటంకిస్తూ ఆర్టికల్ 370పై తానెలాంటి వ్యాఖ్యలూ చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం ఇదంత ప్రాధాన్యత లేని వివాదంగా పేర్కొనేందుకు ప్రయత్నించింది. ‘దీనిపై మేమో నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల ప్రచారంలో మేమేం చెప్పామో మీరు చూశారు. ప్రభుత్వం దీనిపై నిర్మాణాత్మక దృక్పథాన్ని అనుసరిస్తుంది..’ అని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. -
సీబీఐ క్రెడిబిలిటిని పెంచుతాం: జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రలో బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్రిడిబిలిటి మరింత పెరిగే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో సీబీఐ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తున్న సమయంలో జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాలకు సీబీఐ అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణల్ని ఆయన ఖండించారు. జమ్మూ, కాశ్మీర్ లోని ఉద్దమ్ పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి బిజేపీ టికెట్ పై గెలుపొందిన జితేంద్ర సింగ్ కు ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖతోపాటు, సిబ్బంది వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ (స్వతంత్ర) శాఖను అప్పగించారు. -
బాక్సర్లకు ఇబ్బంది రానివ్వం
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) గుర్తింపును అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) రద్దు చేసినా.. బాక్సర్లకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగనివ్వమని క్రీడల మంత్రి జితేంద్రసింగ్ హామీ ఇచ్చారు. బుధవారం జాతీయ సైక్లింగ్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘ఐబీఎఫ్‌పై ఐబా వేటు ప్రభావం బాక్సర్లపై పడకుండా చూస్తాం. సమస్య పరిష్కారమయ్యేదాకా బాక్సర్ల శిక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని అన్నారు. హాకీ ఇండియాకు జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్) హోదా కల్పించడంపై స్పందిస్తూ.. ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యలు గుర్తించిన క్రీడా సంఘాల్నే తాము ఆమోదిస్తామన్నారు. 2017లో జరగనున్న ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమవ్వనుండడం భారత్‌కు గర్వకారణమని జితేంద్రసింగ్ తెలిపారు. -
పునరాభివృద్ధికి సహకరిస్తా
ముంబై: వాయువ్య ముంబైలో పాత భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారి సమస్యలను పరిష్కరిస్తానని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హామీని ఇచ్చారు. వీరు ఉంటున్న పాత భవనాలను ఖాళీ చేసి పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంభ్యతర పత్రం (నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్) తప్పనిసరి సమర్పించాలన్న రక్షణ శాఖ నిబంధనాలను సడలించేందుకు ప్రయత్నిస్తానని గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నిరంభ్యతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) పొం దేందుకు కఠిన నిబంధనలు అమలుచేస్తుండటంతో ఈ ప్రాంతంలో పునరాభివృద్ధి ప్రతిపాదనలు అటకెక్కిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ‘సంబంధిత అధికారులతో సోమవారం సమావేశమవుతా. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం తర్వాత మంత్రిత్వ మార్గదర్శకాలు కఠినం చేయడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను రక్షణ మంత్రి ఏకే ఆంటోని దృష్టికి తీసుకెళతా’నని అన్నారు. కందివలి, మలాడ్ ప్రాంతాల్లో ఉన్న సెంట్రల్ అర్డనన్స్ డిపోకు 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని రకాల నిర్మాణ ప్రాజెక్టులకు ఎన్వోసీని రక్షణ మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేయడంతో స్థానికులు గతకొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తర ముంబై కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరూపమ్ వివరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దీనిపై అనుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎన్నికలకు ముందు ప్రజ లకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో ఉన్నా. అధికార సభ్యునిగా ఉన్నప్పటికీ సామాన్యులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వంపైనే పోరాడేందుకు కూడా వెనుకాడన’ని నిరూపమ్ పేర్కొన్నారు. కొత్త కట్టడాలకు మాత్రమే ఎన్వోసీ కావాలనే నిబంధన ఉండేదని, అయితే ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం తర్వాత రక్షణ దళాల పరిధిలోని భూముల సమీపం లో చేపట్టే కొత్త కట్టడాలు, పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లకు కూడా ఎన్వోసీ తప్పనిసరని అనే నిబంధనను చేర్చిందని వివరించారు. 1970లో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీటిని పునరాభివృద్ధి చేయాల్సి ఉందని, అయితే ఎన్వోసీ తప్పనిసరి అనే నిబంధనతో ఇప్పటికీ వారు అందులోనే బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారని తెలిపారు. దీన్ని ప్రాథమ్యంగా తీసుకొని రక్షణ శాఖ నిబంధనాల్లో సడలించాలని కోరారు. -
ధ్యాన్‌చంద్‌కూ ‘భారతరత్న’!
సంగ్రూర్ (పంజాబ్): ప్రతిష్టాత్మక పౌరపురస్కారం ‘భారతరత్న’ను హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కూ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. ఇక్కడి వార్ హీరోస్ స్టేడియంలో రూ. 6.87 కోట్లతో నిర్మించనున్న సింథటిక్ ట్రాక్ శంకుస్థాపన కోసం వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వచ్చే ఒలింపిక్స్‌లో తమ అథ్లెట్లు భారత జాతీయ జెండా కిందనే పోటీల్లో పాల్గొంటారన్నారు. బర్నాలలోని ఎస్డీ కాలేజి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఎక్స్టెన్షన్ సెంటర్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలున్న ఇలాంటి సెంటర్లను ప్రతీ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు మంత్రి చొరవ చూపాలని స్థానిక కాంగ్రెస్ ఎంపీ విజయ్ ఇందర్ సింగ్లా కోరారు. -
గుత్తా జ్వాలకు మద్దతిస్తాం: మంత్రి జితేంద్ర
న్యూఢిల్లీ: జీవితకాల ప్రతిపాదన ఎదుర్కొంటున్న బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు అవసరమైన మద్దతు అందిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసును పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ ఉదంతం గురించి పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ రాసిన లేఖకు ఆయన పై స్పందించారు. జ్వాల అంశాన్నిపూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టాలని తన శాఖను ఆదేశించినట్లు జితేంద్ర తెలిపారు. ఆమెకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కాగా, ఆమెకు బాయ్ తో తలెత్తిన వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లిందని, కోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. -
షట్లర్ సింధుకు మంత్రి జితేందర్ అభినందనలు
న్యూఢిల్లీ: భారత షట్లర్ పి.వి.సింధుకు క్రీడల మంత్రి జితేందర్ సింగ్ అభినందలు తెలిపారు. చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళలు సింగిల్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. జితేందర్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సింధు కాంస్యం సాధించడం యావత్తు దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ప్రపంచ ర్యాకింగ్‌లో 12వ స్థానంలో ఉన్న సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఇద్దరు చైనా మహిళలను కంగుతినిపించి కాంస్యం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో సింధు 10-21, 13-21 తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. -
ఇవేం సన్నాహకాలు?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌కు భారత అథ్లెట్ల సన్నాహకాలు బాగాలేవని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ‘సాయ్’ అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష జరిపారు. పతకాలు సాధించే క్రీడాకారుల శిక్షణకు సంబంధించిన పూర్తి అంశాలను కొన్ని సమాఖ్యలు మాత్రమే ఈ సమావేశంలో అందజేశాయి. దీనిపై నిరాశను వ్యక్తం చేసిన మంత్రి... క్రీడా కార్యదర్శి పీకే దేవ్ నేతృత్వంలో ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి క్రీడకు చీఫ్ కోచ్‌తో పాటు సహాయక సిబ్బందిని నియమించి పూర్తి బాధ్యతలను వాళ్లకు అప్పగించాలని సూచించారు. రొటేషన్ పద్ధతిలో ప్రతి క్రీడలో అథ్లెట్ల పురోగతిపై స్టీరింగ్ కమిటీ ప్రతివారం సమీక్ష జరిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్ వరకు ఇది కొనసాగించాలని చెప్పారు. అత్యున్నత స్థాయి శిక్షణ అవసరమయ్యే క్రీడాకారులను గుర్తించి వారికి ఎన్ఎస్డీఎఫ్ ద్వారా నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అలాగే అథ్లెట్ల శిక్షణకు కావాల్సిన పూర్తి వ్యయాన్ని అంచనా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.