'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది' | We are capable of dealing with such situation: PMO | Sakshi
Sakshi News home page

'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది'

Published Mon, Jul 27 2015 11:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది'

'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది'

న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)  ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సత్తా భారత ప్రభుత్వానికి ఉందని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.

పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హోంమంత్రిత్వ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. ఇటువంటి దాడులను తిప్పికొట్టగల సత్తా తమకు ఉందని పునరుద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement