టెర్రరిస్టుల్లో ఒకడు వీడే
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రత బలగాలు హతమార్చాయి. మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరి దగ్గర ఏకే-47 తుపాకీ, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉన్నాయి. నలుపు రంగు దుస్తులు ధరించి, చేతులకు గ్లౌజులు వేసుకుని గుబురు గడ్డంతో ఉన్నాడు. మృతుల పేరు, వివరాలు వెల్లడికావాల్సి ఉంది. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్టు సమాచారం.
మరోవైపు దీనానగర్ పోలీసు స్టేషన్ లో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతి చెందారు. ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సీనియర్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా సమావేశమయ్యారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ వద్ద అదనపు బలగాలు మొహరించారు.