న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం(మార్చ్ 30) సాయంత్రం విడుదల చేసింది. ఒడిషా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 11 సీట్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బ్లాక్ బస్టర్ గదర్ హీరో సన్నీ డియోల్‌కు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది.
సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్‌పూర్ నుంచి దినేష్‌సింగ్ బాబును బరిలోకి దింపింది. పార్లమెంటుకు సరిగా హాజరు కాకపోవడం వల్లే సన్నీ డియోల్‌కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదని సమాచారం. మాజీ సీఎం అమరేందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌కు పార్టీలో చేరిన కొద్ది రోజులకే పటియాల నుంచి టికెట్ ఇచ్చారు.
అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్‌సింగ్ సంధుకు అమృత్‌సర్ నుంచి అవకాశం కల్పించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుశీల్‌కుమార్ రింకూను జలంధర్ నుంచి బరిలోకి దింపారు. ఒడిషాలో ఇటీవలే రాష్ట్రంలో అధికార బీజేడీ నుంచి బీజేపీలో చేరిన మోస్ట్ సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌కు కటక్ నుంచి టికెట్ ఇచ్చారు.
ఇదీ చదవండి.. బీజేపీ వాషింగ్‌మెషిన్‌ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు
Comments
Please login to add a commentAdd a comment