candidates list
-
హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే..
చంఢీఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. మంగళవారం 21 మంది అభ్యర్థులతో రెండో జాబితానువ విడుదల చేసింది. బరోడా నుంచి బరిలోకి ప్రదీప్ సంగ్వాన్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై కెప్టెన్ యోగేష్ బైరాగిని బీజేపీ పోటీకి నిలిపింది.Haryana elections | BJP releases its second list of 21 candidates. Pradeep Sangwan to contest from Baroda. pic.twitter.com/hisVZkD7Ix— ANI (@ANI) September 10, 2024కీలకమైన జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్‌కు పోటీగా కెప్టెన్ యోగేష్ బైరాగి పేరును బీజేపీ ప్రకటించగా.. ఆయన ప్రస్థానం గురించి చర్చ జరుగుతోంది. ఆయన ఫేస్బుక్ అకౌంట్ ప్రకారం.. బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ హర్యానా స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ యోగేష్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక.. ఈ జాబితా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చింది బీజేపీ. గనౌర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్మల్ రాణి స్థానంలో దేవేంద్ర కౌశిక్, రాయ్ ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణ గెహ్లావత్ స్థానంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీని బీజేపీ బరిలోకి దింపింది. ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని కర్నాల్ నుంచి కాకుండా ఈసారి లాడ్వా సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపింది బీజేపీ.చదవండి: Haryana Election: తొమ్మిది మంది అభ్యర్థులతో ఆప్ రెండో జాబితా విడుదల -
హర్యానా ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా
చంఢిఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది. ఓవైపు.. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో 20 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల చేసింది. కలయత్ నుంచి అనురాగ్ ధండా, మెహమ్ నుంచి వికాస్ నెహ్రా, రోహ్ తక్ నుంచి బిజేందర్ హుడాను ఆప్ బరిలోకి దించించింది. కాంగ్రెస్‌తో చర్చలవేళ ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా చర్చనీయాంశంగా మారింది. 📢Announcement 📢 The Party hereby announces the following candidates for the state elections for Haryana Assembly.Congratulations to all 💐 pic.twitter.com/Ulca3eVppu— AAP (@AamAadmiParty) September 9, 2024పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.చదవండి: 90 స్థానాల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం! -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
-
4th Phase Election: ఏపీ, తెలంగాణలో అభ్యర్థుల సంఖ్య..
సాక్షి, ఢిల్లీ: నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరుగనుంది. ఇక, నాలుగో విడతలో పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగునున్నాయి. లోక్‌సభ ఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.ఇక, పదో విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల బరిలో ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను 454 మంది పోటీలో నిలిచారు. అలాగే, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గాను 525 మంది పోటీలో ఉన్నారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది.ఇక, నాలుగో విడతలో మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో ఇలా.. బీహార్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీజమ్మూ కాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి బరిలో 24 మందిజార్ఖండ్లో నాలుగు పార్లమెంట్ స్థానాలకు 45 మంది పోటీమధ్యప్రదేశ్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలకు 74 మంది పోటీమహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు జరగనున్న బరిలో 209 మందిఒడిశాలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు బరిలో 37 మందిఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకు బరిలో 130 మందివెస్ట్ బెంగాల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు 75 మంది. -
బీజేపీ మరో జాబితా: డైమండ్ హార్బర్ నుంచి అభిజిత్ దాస్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ అభ్యర్థుల మరో జాబితా విడుదల చేసింది. మంగళవారం బీజేపీ 12వ అభ్యర్థల జాబితాను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నుంచి అభిజిత్ దాస్ (బాబీ)ని బరిలో నిలిపింది. ఇక్కడ టీఎంసీ తరఫున సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న విసయం తెలిసిందే. 12 జాబితాలోని అభ్యర్థులు వీరే.. సతారా(మహారాష్ట్ర)-ఉదయన్‌రాజే భోంస్లే, ఖదూర్ సాహిబ్ (పంజాబ్)-మంజీత్ సింగ్ మన్నా మియావింద్, హోషియార్పూర్ (పంజాబ్)- అనితా సోమ్ ప్రకాష్, బటిండా( పంజాబ్)- పరంపాల్ కౌర్ సిద్ధూ, ఐఏఎస్, ఫిరోజాబాద్, (ఉత్తరప్రదేశ్) ఠాకూర్ విశ్వదీప్ సింగ్, డియోరియా (ఉత్తరప్రదేశ్)-శశాంక్ మణి త్రిపాఠిని పోటీలో నిలిపింది. भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने आगामी लोकसभा चुनाव-2024 के लिए 12वीं सूची में निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/VdGHChERQa — BJP (@BJP4India) April 16, 2024 అదే విధంగా తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థిగా డా. టీఎన్ వంశీ తిలక్‌ను బరిలోకి దించింది. भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने तेलंगाना एवं उत्तर प्रदेश में होने वाले आगामी विधानसभा उप-चुनाव 2024 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/LMFNNFueC0 — BJP (@BJP4India) April 16, 2024 21 మంది అభ్యర్థులతో ఒడిషా అసెంబ్లీ ఎన్నికల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. The BJP Central Election Committee has decided on the following names for the ensuing elections to the Legislative Assembly of Odisha. Here is the second list. pic.twitter.com/nmuVozPOE2 — BJP (@BJP4India) April 16, 2024 -
కాంగ్రెస్ మరో జాబితా.. కన్హయ్య కుమార్ అక్కడి నుంచే..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు పలు రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనటంలో బీజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రటించింది. పదిమంది అభ్యర్థులతో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ, పంజాబ్, అలహాబాద్ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈశాన్య ఢిల్లీ సీటు నుంచి కన్హయ్య కుమార్ బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా 75 మందితో ఒడిస్సా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की लिस्ट। pic.twitter.com/jHaWDAlXKB — Congress (@INCIndia) April 14, 2024 The candidates selected by the Central Election Committee of Congress for the ensuing elections to the Legislative Assembly of Odisha 👇🏼 pic.twitter.com/V6RkjWAKdF — Congress (@INCIndia) April 14, 2024 -
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు లోక్‌సభ, 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ మంగళవారం(ఏప్రిల్ 2) విడుదల చేసింది. కడప పార్లమెంట్ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, బాపట్ల- జేడీశీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ లోక్‌సభ బరిలో ఉండనున్నారు. ఇక అసెంబ్లీ టికెట్లు పొందినవారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలిజాలకు నందికొట్కూరు, చింతలపూడి నుంచి టికెట్లు దక్కాయి. కుప్పం అసెంబ్లీ నుంచి ఆవుల గోవిందరాజులు బరిలో దిగనున్నారు. ఇదీ చదవండి.. చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా -
బీజేపీ 8వ జాబితా రిలీజ్.. ప్రముఖ బాలీవుడ్ హీరోకు నో టికెట్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం(మార్చ్ 30) సాయంత్రం విడుదల చేసింది. ఒడిషా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 11 సీట్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బ్లాక్ బస్టర్ గదర్ హీరో సన్నీ డియోల్‌కు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్‌పూర్ నుంచి దినేష్‌సింగ్ బాబును బరిలోకి దింపింది. పార్లమెంటుకు సరిగా హాజరు కాకపోవడం వల్లే సన్నీ డియోల్‌కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదని సమాచారం. మాజీ సీఎం అమరేందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌కు పార్టీలో చేరిన కొద్ది రోజులకే పటియాల నుంచి టికెట్ ఇచ్చారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్‌సింగ్ సంధుకు అమృత్సర్ నుంచి అవకాశం కల్పించారు. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుశీల్‌కుమార్ రింకూను జలంధర్ నుంచి బరిలోకి దింపారు. ఒడిషాలో ఇటీవలే రాష్ట్రంలో అధికార బీజేడీ నుంచి బీజేపీలో చేరిన మోస్ట్ సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌కు కటక్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇదీ చదవండి.. బీజేపీ వాషింగ్‌మెషిన్‌ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు -
సీపీఎం మొదటి లిస్ట్ విడుదల
రానున్న లోక్‌సభ ఎన్నికలకు సీపీఎం తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో ఒకటీ రెండు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం.. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లకు తమ అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17 స్థానాలు ఉన్నాయి. కేరళకు చెందిన 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో అలప్పుజా నుంచి సిట్టింగ్ ఎంపీ ఆరిఫ్, వడకర నుంచి మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ టీచర్, కాజీకోడ్ నుంచి రాజ్యసభ ఎంపీ ఎలమరం కరీం ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 17 పేర్లలో ముర్షిదాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం పేరు కూడా ఉంది. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మధురై నుంచి సిట్టింగ్ ఎంపీలు ఎస్ వెంకటేశన్, దిండిగల్ ఆర్ సచ్చిదానందంలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని భువనగిరి స్థానానికి ఎండీ జహంగీర్ పేరును, ఆంధ్ర ప్రదేశ్‌లోని అరకు స్థానానికి పాచిపెంట అప్పలనరస పేరును మొదటి జాబితాలో వెల్లడించింది. -
Lok Sabha: టీకాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్.. మూడు స్థానాలపై సస్పెన్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మిగిలి ఉన్న ఎనిమది లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొననున్నారు. ఇక, ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రెండు దఫాల్లో ఏఐసీసీ తొమ్మిది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎనిమిదింటిలో మూడు పార్లమెంట్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం నుండి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, యుగెంధర్, రాజేంద్ర ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక, భువనగిరి నుండి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. లేనిపక్షంలో బీసీ అభ్యర్థికి ఈ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. భువనగిరి లోక్‌సభ స్థానానికి ఓయూ విద్యార్థి నేత కైలాష్ అప్లికేషన్ పెట్టుకున్నారు. కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ముగ్గురిలో ఎవరు? నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మస్కత్ ఆశిస్తున్నారు. వరంగల్ స్థానంపై దమ్మాటి సాంబయ్య ఆశలు పెట్టుకున్నారు. మెదక్ రేసులో నీలం మధు ఉన్నారు. ఆదిలాబాద్ సీటు కోసం ఆదివాసీ, లంబాడ నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. -
శివసేన(యూబీటీ) తొలి జాబితా విడుదల.. 17 మందికి చోటు
ముంబై:లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ శివసేన (యూబీటీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే.. 17 మంది అభ్యర్థులను శివసేన(యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీనేత సంజయ్ రౌత్ జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కీలకమైన ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్‌కి కేటాయించింది. ఐదు సిట్టింగ్ అభ్యర్థులకు శివసేన(యూబీటీ) మళ్లీ అవకాశం కల్పించింది. ముంబై సౌత్- అరవింద్ సావంత్, ముంబై నార్తీస్ట్- సంజయ్ పాటిల్, ముంబై నార్ట్ వెస్- అమోల్ కిర్తికార్, థానే- రాజన్ విచారే, వినాయక్ రౌత్- రత్నగిరి సింధ్‌దుర్గ్, పర్బానీ-సంజయ్ జాదవ్, ఉస్మానాబాద్- ఓంరాజే నింబాల్కర్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా శివసేన (యూబీటీ) ఔరంగాబాద్‌లో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరేను బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే( రాయ్‌గఢ్), అరవింద్ సావంత్(దక్షిణ ముంబై) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.మహావికాస్ ఆఘాడీ భాగస్వామి కాంగ్రెస్ పట్టుబట్టిన సాంగ్లీ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్‌ను పోటీకి దింపింది శివసేన(యూబీటీ). ముత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై.. ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది. हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे.. *मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे. इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF — Sanjay Raut (@rautsanjay61) March 27, 2024 -
హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో, తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. 1. హైదరాబాద్: గడ్డం శ్రీనివాస్ యాదవ్ 2.నాగర్‌కర్నూల్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, 3. మెదక్: వెంకట్రామిరెడ్డి, 4. మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి, 5. కరీంనగర్: వినోద్ కుమార్, 6.పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్, 7. జహీరాబాద్: గాలి అనిల్ కుమార్, 8. ఖమ్మం: నామా నాగేశ్వర్ రావు, 9. చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, 10.మహబూబాబాద్ : మాలోత్ కవిత, 11. మల్కాజ్గిరి : రాగిడి లక్ష్మారెడ్డి, 12. ఆదిలాబాద్: ఆత్రం సక్కు, 13. నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్, 14. వరంగల్ : కడియం కావ్య 15. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ 16. భువనగిరి - క్యామ మల్లేశ్ 17 నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి -
వలస పక్షులకే ఏపీ బీజేపీలో ఎంపీ సీట్లు
-
పవన్ కళ్యాణ్..మరీ ఇంత దుర్మార్గమా ?
-
బీజేపీ పల్లవి డెంపో.. గోవాలో నయా హిస్టరీ..
పనాజీ: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇదే సమయంలో అభ్యర్థుల ప్రకటన కీలకంగా మారింది. ఇక, తాజాగా గోవాలో బీజేపీ అభ్యర్థి పల్లవి డెంపో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. గోవా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. 111 మందితో ఆదివారం జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బరిలోకి దింపింది. దీంతో, రాష్ట్రంలో బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. ప్రస్తుతం సౌత్ గోవా ఎంపీగా కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఉన్నారు. ఇదిలా ఉండగా.. 1962 నుంచి ఇప్పటి వరకు ఆ స్థానంలో 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించిండం విశేషం. ఇక, పల్లవి డెంపో.. పుణెలోని ఎంఐటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పట్టా కూడా అందుకున్నారు. ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవరిస్తున్నారు. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది. వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త శ్రీనివాస్ డెంపో.. ఆయన ప్రస్తుతం గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు. #WATCH | Goa: BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections. On her candidature from South Goa, Pallavi Shrinivas Dempo says, "I am grateful to the BJP for this nomination and I accept this in deep humility... We will try our level best to win this… pic.twitter.com/7vDWZnecva — ANI (@ANI) March 24, 2024 -
మోసపోయిన బీజేపీ నేతలు...టీడీపీ నేతలకే ఎంపీ సీట్లు
-
111 మంది అభ్యర్థులతో బీజేపీ 5వ జాబితా
-
కంగనా రనౌత్, నవీన్ జిందాల్‌కు బీజేపీ టికెట్లు.. మరో 111 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో జాబితా విడుదల.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ..పేర్లు ఖరారు ?
-
కాంగ్రెస్ 4వ జాబితా
-
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు..!
-
టీడీపీలో ఆగ్రహ జ్వాలలు
-
టీడీపీ 3వ జాబితా కనిపించని సీనియర్ నేతల పేర్లు...
-
టీడీపీ మూడో లిస్ట్ విడుదల
-
టీ కాంగ్రెస్ లో సీట్ల పంచాయతీ