
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 గెలుపే లక్ష్యంగా నిన్న( శనివారం) 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి వీలుగా మొదటి జాబితాలో గతంలో పోల్చితే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే భిన్నమైన సమీకణలతో గెలుపు గుర్రాలకే మొదిటి జాబితాలో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోని 195 అభ్యుర్థుల్లో 33 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టి కొత్త వారికి బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది.
అసోం
అసోంలో 11 లోక్‌సభ సీట్లు ప్రకటించగా.. ఆరుగురు సిట్టింగ్‌లు కాగా మిగిలిన ఐదుగురు కొత్తవారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజ్‌దీప్ రాయ్ గెలుపొందిన సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పరిమళ్ సుక్లబైధ్యను బీజేపీ పోటీకి దింపింది. అటానమస్ డిస్ట్రిక్ట్ (ఎస్టీ) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హోరెన్ సింగ్‌బే బదులు అమర్‌సింగ్ టిస్సోని బరితో దింపింది. గౌహతి లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ క్వీన్ ఓజాకు బదులు బిజులీ కలిత మేధి పోటీ చేయనున్నారు. ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ గెలిచిన తేజ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రంజిత్ దత్తాకు బీజేపీ అవకాశం ఇచ్చింది. దిబ్రూగఢ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ రామేశ్వర్ తేలీని పక్కనబెట్టి కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్‌ను బీజేపీ లోక్‌సభ బరిలోకి దించింది.
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ లోని 11 స్థానాలకు అభ్యర్థుల జాబితాలో నలుగురు ముఖాలకు బీజేపీ అవకాశం ఇచ్చింది. జంజ్‌గిర్ చంపా (ఎస్సీ) నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ గుహరమ్ అజ్‌గల్లీకి బదులుగా కమలేష్ జంగ్డేను బరిలోకి దించింది. రాయ్‌పూర్ నుంచి సునీల్ కుమార్ సోని స్థానంలో సీనియర్ నేత బ్రిజ్‌మోహన్ అగర్వాల్ అవకాశం వచ్చింది. మహాసముంద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ చున్నీ లాల్ సాహుకు బదులుగా బీజేపీ అభ్యర్థి రూప్ కుమారి చౌదరి, సిట్టింగ్ ఎంపీ మోహన్ మాండవి స్థానంలో భోజ్‌రాజ్ నాగ్‌ని కాంకేర్ (ఎస్టీ) తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నునారు.
ఢిల్లీ
ఢిల్లీలోని ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు సిట్టింగ్ ఎంపీలను బీజేపీ పక్కనపెట్టది. రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్‌ను పక్కన పెట్టి చందానీ చౌక్ లోక్‌సభ స్థానం నుంచి ప్రవీణ్ ఖండేల్‌వాల్ బీజేపీ ప్రకటించింది. పశ్చిమ ఢిల్లీ స్థానానికి బీజేపీ రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ స్థానంలో కమల్‌జీత్ సెహ్రావత్‌కు అవకాశం ఇచ్చింది. ప్రస్తుత కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది. దక్షిణ ఢిల్లీ నుంచి రమేశ్ బిధూరిని పక్కనబెట్టి బీజేపీ ఆయన అభ్యర్థిగా రామ్‌వీర్ సింగ్ బిధూరిని ప్రకటించింది.
గుజరాత్
ఐదుగురు సిట్టింగ్ ఎంపీలను పక్కన బెట్టిన బీజేపీ గుజరాత్‌లోని 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రభాత్‌భాయ్ సావాభాయ్ పటేల్‌కు బదులుగా రేఖాబెన్ హితేష్‌భాయ్ చౌదరిని బరిలోకి దించింది. అహ్మదాబాద్ వెస్ట్ (ఎస్సీ ) స్థానంలో మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన కిరీట్ సోలంకి బదులు.. దినేష్‌భాయ్ కిదర్‌భాయ్ మక్వానా అవకాశం ఇచ్చారు. రాజ్‌కోట్ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపి మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియాను పక్కబెట్టి.. కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలాకు అవకాశం ఇచ్చింది. పోర్‌బందర్ నియోజకవర్గంలో ఎంపీ రమేశ్‌భాయ్ లావ్‌జీభాయ్ ధాదుక్‌కు బదులు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అవకాశం ఇచ్చింది. పంచమహల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రతన్‌సిన్హ్ మగన్‌సిన్హ్ రాథోడ్‌కు బదులు రాజ్‌పాల్‌సిన్హ్ మహేంద్రసింగ్ జాదవ్ బరిలోకి దింపింది.
జార్ఖండ్
జార్ఖండ్‌లో ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా హజారీబాగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటాని శనివారం ప్రకటించారు. ఆ స్థానం మనీష్ జైస్వాల్‌ను పోటీకి దింపింది బీజేపీ. లోహర్దగా (ఎస్టీ) సీటులో మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన సుదర్శన్ భగత్‌ను పక్కనబెట్టి సమీర్ ఓరాన్‌ను ఎంపిక చేసింది.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితాలో.. ఏడుగురు సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది బీజేపీ. గ్వాలియర్ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ వివేక్ నారాయణ్ షెజ్‌వాల్కర్‌కు బదులుగా భరత్ సింగ్ కుష్వాహను బరిలోకి దించింది. గుణ స్థానంలో సిట్టింగ్ ఎంపీ కృష్ణపాల్ సింగ్ యాదవ్‌ను తప్పించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు అవకాశం ఇచ్చింది. రాజ్‌బహదూర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సాగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి లతా వాంఖడే బరిలోకి దింపింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను అభ్యర్థిగా ప్రకటించేందుకు విదిశా స్థానంలో సిట్టింగ్ ఎంపీ రమాకాంత్ భార్గవను బీజేపీ పక్కనపెట్టింది. ఇక.. ప్రస్తుతం సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు చెందిన భోపాల్ స్థానం నుంచి అలోక్ శర్మను బీజేపీ బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎంపీ గుమన్‌సింగ్ దామోర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రత్లాం (ఎస్టీ) స్థానం నుంచి అనితా నగర్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment