లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొనడంతో కేంద్రంలోని అధికార బీజేపీ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేసేందుకు కాషాయ పార్టీ పూర్తిస్థాయి సన్నద్ధతతో ముందుకెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. రెండో జాబితాపై ఫోకస్ పెట్టింది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో తాజాగా అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 60 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను బుధవారం బీజేపీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ముక్తో(ఎస్టీ) సీటు నుంచే మళ్లీ బరిలో దిగనున్నారు. అరుణాచల్ బీజేపీ చీఫ్ బియూరామ్ వాహ్గే పక్కే-కేసాంగ్ (ఎస్టీ) నుంచి,, ఉప ముఖ్యమంత్రి చౌనా మేన్ చౌకన్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించిన పూర్తి జాబితాను పార్టీ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment