pema khandu
-
అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ.. మోదీ శుభాకాంక్షలు
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బీజేపీ నేత పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా మరో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, రెండు దశాబ్దాల తర్వాత అరుణాచల్‌లో తొలి మహిళా మంత్రిగా దాసంగ్లు పుల్ ప్రమాణం చేయడం విశేషం.ఇక, గురువారం ఉదయం ఈటానగర్‌లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజుజులతో పాటుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరయ్యారు. కాగా, పెమా ఖండూ 2016లో మొదటి సారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో 60 స్థానాలకు గానూ 46 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందే పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. #WATCH | Pema Khandu takes oath as the Chief Minister of Arunachal Pradesh. pic.twitter.com/413tSLcgrY— ANI (@ANI) June 13, 2024 మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫేమా ఖండూకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. అరుణచల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి సహా, మంత్రి వర్గం పాటుపడాలని కోరారు. Prime Minister Narendra Modi congratulates Pema Khandu on taking oath as the Chief Minister of Arunachal Pradesh. pic.twitter.com/VkJpqMGh8E— ANI (@ANI) June 13, 2024ఇదిలా ఉండగా.. అరుణాచల్‌ప్రదేశ్ కేబినెట్లో రెండు దశాబ్దాల తర్వాత తొలి మహిళా మంత్రిగా దాసంగ్లు పుల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..‘నాకు ఎంతో ఆనందంగా ఉంది. బీజేపీ ఓ మహిళకు (రాష్ట్రంలో) క్యాబినెట్ బెర్త్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. మహిళా సాధికారత కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Itanagar: After swearing-in ceremony, the first woman minister in Arunachal Pradesh cabinet in 2 decades, Dasanglu Pul says, "I am delighted, women of the entire state are delighted. BJP has given a cabinet berth to a woman (in the state) for the first time. I thank the… pic.twitter.com/EelwJSJD9z— ANI (@ANI) June 13, 2024 -
అరుణాచల్‌లో బీజేపీ
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలకు గాను ఏకంగా 46 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడింది. 10 స్థానాలు ముందే ఏకగ్రీవంగా బీజేపీ సొంతం కావడంతో ఏప్రిల్ 19న మిగతా 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 5, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) 2 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు సాధించగా ఈసారి మరో ఐదు పెరగడం విశేషం. ఏకగ్రీవంగా నెగ్గిన వారిలో సీఎం పెమా ఖండూ కూడా ఉన్నారు. అభివృద్ధి రాజకీయాలకు పట్టం: మోదీ అరుణాచల్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. బీజేపీకి మరోసారి విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం మరింత ఉత్సాహంగా, నూతన శక్తితో పని చేస్తామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషితోనే ఈ విజయం సాధ్యమైంది’’ అని అన్నారు. సంగీతాభిమాని...అరుణాచల్‌లో బీజేపీని వరుసగా మూడోసారి గెలుపు బాటన నడిపిన నాయకుడిగా పెమా ఖండూ పేరు మార్మోగిపోతోంది. క్రీడలు, సంగీతం పట్ల అమితాసక్తి ఉన్న ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2000లో కాంగ్రెస్‌లో చేరిన ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ప్రాతినిధ్యం వహించిన ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. నబామ్ తుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2016 జనవరిలో రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ మద్దతిచి్చన కల్హోపుల్ ప్రభుత్వంలో మరోసారి మంత్రి అయ్యారు. సుప్రీంకోర్టు జోక్యంతో తుకీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. తుకీ రాజీనామాతో 2016లో ఖండూ 37 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు. 2019లో రెండోసారి సీఎం అయి ఐదేళ్లూ కొనసాగారు. తాజాగా మరోసారి విజయం దక్కించుకున్నారు. బౌద్ధ మతస్థుడైన పెమా ఖండూ మోన్పా గిరిజన తెగకు చెందినవారు. తండ్రి డోర్జీ 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. -
అరుణాచల్‌లో 10 ఏకగ్రీవాలు
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఆయా నియోజకవర్గాల్లో వారు మాత్రమే బరిలో మిగిలారు. దాంతో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి పవన్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరుణాచల్‌లోని మిగతా 60 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన తొలి విడతలో పోలింగ్ జరగనుంది. -
BJP: అరుణాచల్ అభ్యర్థుల జాబితా విడుదల
లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొనడంతో కేంద్రంలోని అధికార బీజేపీ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేసేందుకు కాషాయ పార్టీ పూర్తిస్థాయి సన్నద్ధతతో ముందుకెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. రెండో జాబితాపై ఫోకస్ పెట్టింది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 60 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను బుధవారం బీజేపీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ముక్తో(ఎస్టీ) సీటు నుంచే మళ్లీ బరిలో దిగనున్నారు. అరుణాచల్ బీజేపీ చీఫ్ బియూరామ్ వాహ్గే పక్కే-కేసాంగ్ (ఎస్టీ) నుంచి,, ఉప ముఖ్యమంత్రి చౌనా మేన్ చౌకన్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించిన పూర్తి జాబితాను పార్టీ తన ట్విటర్లో షేర్ చేసింది. -
ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతూ మృత్యు ఒడిలోకి..
24 ఏళ్ల భారత యువ కిక్ బాక్సర్ యోరా టేడ్ గురువారం రాత్రి(ఆగస్టు 25న) కన్నుమూశాడు. నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం చెన్నైలోని సదరన్ సిటీ వేదికగా కేశవ్ ముడేల్తో ఫైనల్ మ్యాచ్ జరిగింది. బౌట్లో భాగంగా ప్రత్యర్థి ముడేల్ ఇచ్చిన పంచ్ యోరా తలకు బలంగా తాకింది. దీంతో సృహతప్పిన యోరా రింగ్‌లోనే కుప్పకూలాడు. వెంటనే చెన్నైలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యోరా గురువారం కన్నుమూసినట్లు ఆసుపత్రి జనరల్ డైరెక్టర్ పేర్కొన్నారు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యోరా టేడ్ ఇండియన్ ఎడిషన్ అయిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్‌బాక్సింగ్ ఆర్గనైజేషన్ టోర్నమెంట్లో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా పోలీసులు టేడా మృతదేహాన్ని అరుణాచల్ ప్రదేశ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా యోరా టేడా మృతిపట్ల అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ విచారం వ్యక్తం చేశారు. ''యువ బాక్సర్ యోరా టేడా ఇంత తొందరగా మమ్మల్ని విడిచి స్వర్గాన్ని వెళ్లిపోతాడని ఊహించలేదు. కిక్ బాక్సింగ్‌లో అతనికి మంచి భవిష్యత్తు ఉందని ఆశించా. కానీ మృత్యువు అతన్ని వెంటాడింది ఇది నిజంగా దురదృష్టం. చెప్పడానికి మాటలు రావడం లేదు.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. అతని కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాడ సానుభూతి'' అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. Jolted to learn that our bright Kickboxer Yora Tade left for his heavenly abode. Too early to leave us, dear Tade! No words to express my grief. You will ever be in our hearts. Condolences to bereaved family, friends & admirers. May your journey to ultimate abode be peaceful! 🙏 pic.twitter.com/d1wgHDoGAp — Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) August 23, 2022 చదవండి: 11 ఏళ్లుగా సింగర్‌తో సహజీవనం, బ్రేకప్.. ఇప్పుడు ఇంకో అమ్మాయితో! 'లైగర్' సినిమా ఎమ్ఎంఏ ఫైట్.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా -
వైరల్ ప్రధాని మెచ్చారు!
జాతీయోద్యమ కాలంలో పాట చూపించిన ప్రభావం తక్కువేమీ కాదు. ఊరూరు తిరిగింది... ఉర్రూతలూగించింది. అణువణువులో దేశభక్తి నింపుకొని కదం తొక్కింది.... పాట బలమైన ఆయుధం అయింది. అలాంటి తమిళ దేశభక్తి గీతం ఒకటి ఇప్పుడు సామాజిక వేదికలలో వైరల్ అయింది. ‘అద్భుతం’ అనిపించిన ఆ పాటను ఆలపించింది తమిళులు కాదు... అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు... అశప్‌మై, కుమారి బెహల్టీలు స్వాతంత్య్ర సమరయోధుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ దేశభక్తి గేయం ‘పారుక్కుళ్లే నల్ల నాళ్ ఎంగళ్ భారతినాడు’ను ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారి ఈ వీడియోను అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రశంసావాక్యాలు రాశారు. 24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘ఈ వీడియోను చూసి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఈ షైనింగ్ స్టార్స్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచల్ సిస్టర్స్ గొంతులో వినిపించిన తమిళదేశభక్తి గీతం ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ స్ఫూర్తిని చాటుతుంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని. ఇక సోషల్ మీడియా ‘కామెంట్ సెక్షన్’లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘అచ్చం తమిళ సిస్టర్స్ పాడినట్లుగానే ఉంది’ అని ఎంతోమంది అరుణాచల్ ప్రదేశ్ సిస్టర్స్‌ను ఆకాశానికెత్తారు. ‘మా అమ్మాయిలు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లోని గొప్పదేశభక్తి పాటలు పాడడానికి సిద్ధం అవుతున్నారు’ అని ఒక తమిళియన్ కామెంట్ పెట్టాడు. ‘మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై పోకుండా, అందరికీ సుపరిచితమై పోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి’ అని ఒకరు స్పందించారు. మంచిదే కదా! -
అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్!
యుపియా: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో చూస్తే అరుణాచల్‌లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పన సాకారమైందని మోదీ అన్నారు. ‘21వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్యప్రాంతం దేశాభివృద్ధికి ఇంజన్‌లా పనిచేస్తోంది’ అని మోదీ అన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సారథ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింతగా కష్టపడి పనిచేయనుంది అనిమోదీ అన్నారు. ‘అరుణాచల్ అద్భుత ప్రగతి దిశగా అడుగులేస్తోంది. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. -
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు కరోనా
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఆయన మంగళవారం ట్వీటర్లో ప్రకటించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన తన ట్వీట్లో తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రజలకు సూచించారు. ప్రస్తుతం తాను ఎస్ఓపీ నిబంధనల మేరకు క్వారంటైన్లో ఉన్నానట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 1756 ఉండగా.. 4531 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జీ అయ్యారు. కరోనా కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. (చదవండి: ఢిల్లీలో కొత్తగా 4,263 పాజిటివ్ కేసులు) I had undergone Covid test RT-PCR and have tested positive for Covid19. I am asymptomatic and feeling healthy. However as per SOP and safety of others, I am self isolating myself and request everyone who came in contact with me to adhere to the SOP. — Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) September 15, 2020 -
18 వేల మందిని రాష్ట్రానికి తీసుకొస్తాం : సీఎం
ఇటానగర్ : దేశవ్యాప్త లాక్‌డౌక్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను దశల వారిగా తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించినట్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ తెలిపారు. మొదటి దశలో ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నవారిని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన దాదాపు 18 వేల మంది విద్యార్థులు, కార్మికులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని, వారిని ప్రాధాన్యత క్రమంలో తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. (ట్రెండింగ్ టిక్‌టాక్‌లో శృతిహాసన్, అక్షర హాసన్ ) కాగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరో రెండు వారాలపాటు (మే 17 వరకు) పెంచడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న అరుణాచల్ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీనియర్ అధికారులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారని కావున వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. అరుణాచల్‌లో ఆరు జిల్లాలు మాత్రమే ఆరెంజ్ జోన్లో ఉన్నాయని, మిగతా అన్ని జిల్లాలు గ్రీన్ జోన్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. (చైనాలో కొత్తగా ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు! ) ఢిల్లీలో చిక్కుకుపోయిన విద్యార్థులు, కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ, కేంద్ర మంత్రి కిరన్ రిజిజు వారితో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఢిల్లీలోని అరుణాచల్ భవన్ అధికారులు వారితో సమావేశ మయ్యారని చెప్పారు. రెడో దశలో ఏయే రాష్ట్రాల నుంచి ప్రజలను తిరిగి తీసుకురావాలో ఇంకా నిర్ణయించలేదని, దీనిపై త్వరలోనే క్యాబినెట్ సమావేశంతోపాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. (సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా ) -
‘లాక్డౌన్ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదం
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్డౌన్ ఏప్రిల్ 15న ఎత్తివేస్తారంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం పేమాఖండూ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే లాక్డౌన్ ఎత్తివేతపై సీఎం చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాసేపటి తర్వాత ట్వీట్లో దొర్లిన తప్పును గమనించిన సీఎం వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించారు. ఈ సందర్భంగా ఆ ట్వీట్‌పై పేమాఖండూ వివరణ కూడా ఇచ్చారు. లాక్‌డౌన్‌కు సంబంధించి ట్వీట్ చేసిన అధికారికి హిందీ సరిగా రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్న సీఎం.. వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించినట్లు పేర్కొన్నారు. ‘ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మా అధికారికి లాక్డౌన్ గురించి హిందీలో వివరించాను. అయితే ఆయనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో ఆయన ఆ విధంగా ట్వీట్ చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఇక లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేము. అయితే లాక్‌డౌన్‌లోనూ, ఆతర్వాత కూడా ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటివి కొనసాగించాలని’ సీఎం పేమాఖండు విజ్ఞప్తి చేశారు. The tweet with respect of lockdown period was uploaded by an officer whose comprehension in Hindi was limited. And therefore same was removed. @TimesNow https://t.co/7nuUT7QfCx — Pema Khandu (@PemaKhanduBJP) April 2, 2020 -
ఓ కూతురి స్పందన ఇది: సీఎం
ఇటానగర్: ‘‘ప్రధాని బయటకు వెళ్లకూడదని చెప్పారు కదా. ఎక్కడికీ వెళ్లొద్దు నాన్నా’’ అంటూ ఓ చిన్నారి తన తండ్రితో సంభాషించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఆవశ్యకతను ఎంత చక్కగా చెప్పిందో అంటూ ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజా రవాణా సహా దాదాపు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. నిత్యావసర వస్తువుల కోసం మినహా బయటకు వెళ్లకూడని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబంతో కలసి సమయాన్ని గడుపుతున్నారు.(కార్మికుడిపై పూల వర్షం.. నోట్ల దండలు!) ఈ క్రమంలో ఓ రోజు ఆఫీసుకు వెళ్తున్నానంటూ తన కూతురితో చెప్పగా.. ఆమె వద్దంటూ వారించింది. తలుపులకు అడ్డుగా నిలబడి తండ్రిని ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతూ ముఖ్యమంత్రిని కూడా చేరింది. దీంతో ఈ చిన్నారి వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ.. ‘‘ తన తండ్రిని ఆఫీసుకు వెళ్తున్నట్టు నటించగా... ఓ కూతురి స్పందన ఇది. తండ్రి బయటకు వెళ్లకుండా తనే తలుపులు మూసివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తిని తండ్రికి గుర్తు చేసింది. ఈ అరుణాచల్ ప్రదేశ్ చిన్నారి కంటే ఎవరికి ఎక్కువగా లాక్డౌన్ ఆవశ్యకత తెలుసునంటారు’’ అని ఆమెపై ప్రశంసలు కురిపించారు. -
సీఎం జగన్‌కు పెమఖండు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమఖండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్ వేదికగా పెమఖండు స్పందించారు. లాక్డౌన్ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉంటున్న తమ రాష్ట్రవాసులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు స్పందించటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రవాసులకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా తమ రాష్ట్రానికి చెందిన వారికి అండగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ పక్కాగా అమలు జరుగుతోంది. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. I would like to thank @AndhraPradeshCM and DGP Andhra Pradesh Shri Gautam Sawang in their prompt response in attending to a distress call made by Arunachalee citizens stranded in Vizag. I look forward to more such cooperation during these times of crisis to fight #COVID19 — Pema Khandu (@PemaKhanduBJP) March 27, 2020 -
వైఎస్ జగన్‌కు అరుణాచల్ ప్రదేశ్ సీఎం కృతఙ్ఞతలు
-
సీఎం రోడ్డుట్రిప్పు.. మీరు గ్రేట్ సార్!
-
బైక్‌పై సీఎం 122 కి.మీ. ప్రయాణం.. ఎందుకంటే
ఇటానగర్ : ‘లీడర్’ సినిమాలో అర్జున్ ప్రసాద్.. అదేనండీ హీరో రానా దగ్గుబాటి సీఎం హోదాలో బైక్ వేసుకుని రోడ్లపై తిరగడం అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ కోరిక మేరకు ఆమెను సరదాగా బైక్‌పై బయటకు తీసుకువెళ్తాడు మన యంగ్ సీఎం. అదంతా రీల్‌లైఫ్ అయితే రియల్ లైఫ్‌లోనూ అలాంటి యంగ్ సీఎం ఒకరు రోడ్డుపై బైక్‌తో చక్కర్లు కొట్టారు. అయితే ఆయన కేవలం సరదా కోసం బైక్ రైడింగ్ చేయడం లేదు. రాష్ట్ర పర్యాటక రంగం ప్రమోషన్లలో భాగంగా రయ్‌మంటూ బైక్‌పై దూసుకుపోతూ కాన్వాయ్‌ను పరుగులు పెట్టించారు. ఆయనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు(40). కాగా ప్రకృతి అందాలకు నెలవైన అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం పెమా ఖండు సైతం తన వంతుగా యింగ్కోయింగ్ నుంచి పసీఘాట్ వరకు బైక్ రైడ్ చేస్తూ.. సాహస క్రీడలకు సాక్షిగా నిలుస్తున్న సియాంగ్ నది అందాలను నెటిజన్ల కళ్లకుకట్టారు. రాయల్ ఎన్ఫీల్్డ బైక్‌పై దాదాపు వంద కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ వీడియోను ట్విటర్లో చేశారు. ఈ మేరకు ‘ యింగ్కోయింగ్ నుంచి పసీఘాట్ వరకు రోడ్డుట్రిప్నకు సంబంధించిన వీడియో. పర్యాటకుల గమ్యస్థానం అరుణాచల్ అందాలను ప్రమోట్ చేసే ప్రయత్నం. 122 కిలోమీటర్ల ప్రయాణం. బైకర్స్‌కు కూడా అరుణాచల్ ప్రదేశ్ ఎంతో సురక్షితమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో.. ‘మీరు గ్రేట్ సార్. అరుణాచల్ పర్యాటకంపై విశేష దృష్టి సారిస్తున్నారు. బైకర్స్‌కు కూడా మంచి రైడింగ్ స్పాట్ పరిచయం చేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక పెమా ఖండు గతంలో సైతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ బీజేపీ సీఎంకు.. #AmazingArunachal, #VisitArunachal హ్యాష్‌ట్యాగ్‌లతో రాష్ట్ర పర్యాటక స్థలాలను ప్రమోట్ చేయడం పరిపాటి. -
ఒడిశా, అరుణాచల్ సీఎంల ప్రమాణం
భువనేశ్వర్/ఈటానగర్: ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో నూతన ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంగా వరుసగా ఐదోసారి ప్రమాణం చేశారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గవర్నర్ గణేశీలాల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అలాగే ఆయనతో పాటు 20 మంది నూతనంగా ఎన్నికైన బీజేడీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణంచేశారు.147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేడీ 112 స్థానాల్లో గెలుపొందింది. ఒడిశాలో 2000 సంవత్సరం నుంచి బీజేడీ అధికారంలో కొనసాగుతోంది. నవీన్ వరుసగా 2000, 2004, 2009, 2014ల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘పట్నాయక్‌కు అభినందనలు. ఒడిశా అభివృద్ధికి కేంద్రం నుంచి మా వంతు పూర్తి సహకారం ఉంటుంది’అని మోదీ ట్వీట్ చేశారు. అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ బీజేపీ సీనియర్ నేత పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ పదో సీఎంగా బుధవారం ప్రమాణం చేశారు. ఈటానగర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎం చౌనా మేతో సహా 11 మంది కేబినెట్ మంత్రులు పెమా ఖండూతో పాటు ప్రమాణం స్వీకారం చేశారు. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ సీఎంలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెమా ఖండూ మాట్లాడుతూ.. ‘ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక రోజు. మా ప్రభుత్వం అవినీతి రహితంగా పనిచేస్తుంది’ అని అన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌లో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందింది. -
ఖండూతో లామా ఢీ
అరుణాచల్‌ప్రదేశ్‌లోని ముక్తో శాసనసభ నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత ఈసారి ఎన్నికల్లో ‘పోటీ’ జరుగుతోంది. తవాంగ్ జిల్లాలో భారత్–చైనా సరిహద్దున ఉన్న ఈ నియోజకవర్గంలో 1999 నుంచి ఎమ్మెల్యేలందరూ పోటీ లేకుండానే ఎన్నికవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెమ ఖండూ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెమ ఖండూ 2014 ఎన్నికల్లో, అంతకు ముందు 2011లో జరిగిన ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెమ తండ్రి దోర్జీఖండూ కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అవసరమయింది. 1990 నుంచి ముక్తో సీటు దోర్జీ చేతిలోనే ఉంటూ వచ్చింది. మన్పా కులస్తుల ఆధిపత్యం గల ఈ నియోజకవర్గం ఖండూ కుటుంబానికి పెట్టని కోటగా ఉంటోంది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ తరఫున పెమ ఖండూ పోటీ చేస్తోంటే, జనతాదళ్ (ఎస్) అభ్యర్థిగా బౌద్ధ సన్యాసి లామా లాబ్‌సంగ్ గెట్సోను నిలబెట్టింది. తవాంగ్ జిల్లాలో రెండు భారీ ఆనకట్టల నిర్మాణానికి వ్యతిరేకంగా లాబ్ సంగ్(39) నాయకత్వంలో ప్రజా ఉద్యమం సాగుతోంది. ఈ కారణంగానే 2016లో ప్రభుత్వం లాబ్‌సంగ్‌ను అరెస్టు చేసింది. ఆయనను విడుదల చేయాలని కోరుతూ ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. దానిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు బౌద్ధ సన్యాసులు మరణించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కూడా ఈయన పాలు పంచుకున్నాడు. 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకున్నానని, అయితే కుదరలేదని ఆయన చెప్పాడు. పర్యావరణానికి హాని కలిగించే భారీ ప్రాజెక్టుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆ సన్యాసి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 60 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. -
సీఎం అత్యాచారం చేశారు; జోక్యం చేసుకోలేం!
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 2008లో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ రంజన్ గొగోయ్, దీపక్ మిశ్రా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించాలని, అదే విధంగా రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరాలని సూచించింది. కాగా సీఎంకు వ్యతిరేకంగా తాను చేసిన ఫిర్యాదును చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, పోలీసులు స్వీకరించినందువల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించానని సదరు మహిళ పేర్కొన్నారు. పిటిషన్లో ఉన్న వివరాల ప్రకారం.. తాను మైనర్‌గా ఉన్న సమయంలో సీఎం పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పిటిషన్లో పేర్కొన్నారు. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘15 ఏళ్ల వయస్సులో నాపై నలుగురు వ్యక్తులు నాపై అత్యాచారం చేశారు. అప్పుడు నేను పబ్లిక్ కాల్ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ఆశ చూపాడు. అతని మాటలు నమ్మి ఓ రోజు కలవడానికి వెళ్లాను. ఆ సమయంలో కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం నలుగురు వ్యక్తులు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు’ అని పేర్కొన్నారు. ఇక తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ 2018లో జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. వ్యవస్థలపై నమ్మకం పోతుంది.. ‘ అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులపై నేను ఫిర్యాదు చేశాను. కోర్టు నుంచి గానీ, పోలీసుల నుంచి గానీ సరైన స్పందన రావడం లేదు. అందరూ కూడా నన్నో మోసగత్తెగా చూస్తున్నారు. నేను చెప్పేది అబద్ధం అంటున్నారు. ఇక్కడ కూడా నాకు న్యాయం దొరక్కపోతే, నాలాంటి ఎంతో మంది బాధితులకు అన్ని వ్యవస్థలపై నమ్మకం పోతుంది అని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలను సీఎం పెమా ఖండు ఖండించారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని కొట్టిపారేశారు. -
సీఎంపై రేప్ ఆరోపణలు..
ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 10 ఏళ్ల క్రితం పెమా, మరికొందరు తనపై గ్యాంగ్ రేప్ చేశారంటూ ఆరోపిస్తోంది. పోలీసులు, జాతీయ మహిళా కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో తగిన ఆధారాలతో మీడియా ముందుకు వచ్చేందుకు ఆమె సిద్ధపడింది. కాగా, తనపై ఆ మహిళ చేస్తున్న ఆరోపణలను ఖండూ తీవ్రంగా ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని.. అనవసరమైన ఆరోపణలతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పరువు నష్టం దావా వేసినట్లు ఆయన తెలిపారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బీజేపీ మండిపడింది. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందించింది. ఆ ఫిర్యాదు వెనుక దురుద్దేశం, ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. విషయంలోకి వెళ్తే... 2008 జులైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె చెబుతోంది. అయితే, ఆ సమయంలో తాను స్పృహలో లేనని, ఘటనపై ఎంత మందికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని ఆమె తెలిపింది. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత అంటే 2015లో (సరిగ్గా ఖండూ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొద్ది నెలల ముందు) ఆమె ఇటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో అదంతా ఉత్తదేనని తేల్చారు. తాజాగా ఓ న్యాయవాది సాయంతో ఆమె జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించారు. కానీ, ఎన్డబ్ల్యూసీ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆమె ఫిర్యాదు చేసిన రోజే (ఫిబ్రవరి 20) ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ‘ముఖ్యమంత్రి నాపై అత్యాచారం చేశాడంటే ప్రజలు కానీ, పోలీసులు కానీ నమ్మడం లేదు. నాపై అత్యాచారం జరిగినప్పుడు ఆయన(పెమా ఖండూ) సీఎం పదవిలో లేడు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి నా మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు’ అని ఆమె వాపోతోంది. ఏడాది కాలంగా తనను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె వివరించింది. -
అధికార పార్టీ నుంచి 33 మంది ఎమ్మెల్యేలు జంప్
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ)కు భారీ షాక్ తగిలింది. శనివారం ఆ పార్టీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరారు. దీంతో 60 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో పీపీఏకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్(పీపీఏ) వేటు వేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. నాయకత్వ మార్పు తప్పదని పీపీఏ వెల్లడించింది. అయితే ఖండూ చెప్పినట్టుగా ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేయడంతో పీపీఏకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖండూ సహా 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. బీజేపీ ఖండూకే తమ మద్దతు ప్రకటించింది. బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఖండూకు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ లభించినట్టయ్యింది. -
అరుణాచల్‌లో సంక్షోభం
- సీఎం ఖండూ సహా ఏడుగురిని సస్పెండ్ చేసిన పీపీఏ - తనకు 49 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఖండూ - తదుపరి ముఖ్యమంత్రిగా టకమ్ పరియో? ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తింది. సీఎం పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్(పీపీఏ) వేటు వేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అయితే తమకు మెజారిటీ ఉందని ఖండూ ప్రభుత్వం చెపుతోంది. బీజేపీ కూడా ఖండూకే తమ మద్దతు ప్రకటించింది. అధికార పీపీఏ మాత్రం నాయకత్వ మార్పు తప్పదని సంకేతాలిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌తో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలపై గురువారం పీపీఏ తాత్కాలికంగా వేటేయడం తెలిసిందే. వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేసింది. దీనిపై ఖండూ ప్రభుత్వం శుక్రవారం స్పందిస్తూ.. 60 మంది సభ్యులున్న శాసనసభలో తమకు 49 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పింది. వీరిలో పీపీఏకి చెందిన 35 మంది కూడా ఉన్నారంటోంది. ప్రభుత్వ ప్రతినిధి బమంగ్ ఫెలిక్స్ మాట్లాడుతూ.. 43 మంది పీపీఏ సభ్యుల్లో తమకు 35 మంది మద్దతు ఉందని చెప్పారు. 12 మంది బీజేపీ సభ్యులు, ఒక అనుబంధ సభ్యుడు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా తమకు అనుకూలంగా ఉన్నారన్నారు. సీఎంకుS పూర్తి మెజారిటీ ఉందని, నాయకత్వ మార్పు సమస్యే లేదని అన్నారు. ‘నాయకత్వ మార్పు తప్పదు’ నాయకత్వ మార్పు తప్పదని పీపీఏ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుత కేబినెట్లో ప్రజారోగ్య, ఇంజనీరింగ్ మంత్రి టకమ్ పరియో తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పీపీఏ అధ్యక్షుడు ఖాఫా బెంగియా చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ సీఎం నబమ్ టుకీపై తిరుగుబాటుతో రాజకీయ అనిశ్చితి మొదలైంది. ఫిబ్రవరిలో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ రెబల్ నేత ఖలికో పుల్ సీఎం అయ్యారు. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో టుకీ ప్రభుత్వాన్ని కోర్టు పునరుద్ధరించింది. అయితే అసెంబ్లీలో మద్దతు లేకపోవడంతో కొద్ది రోజుల్లోనే టుకీ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో ఖండూ ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించారు. ఆగస్టులో ఖలికో పుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సెప్టెంబర్‌లో 42 మంది ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పెమా ఖండూ పీపీఏలో చేరారు. -
నాటకీయ మలుపుల..రాజకీయ చదరంగం
ఏడాది కాలంలో ఎన్నెన్ని నాటకీయ పరిణామాలో...! ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ చదరంగం రంజుగా సాగుతోంది. ఏకంగా ముగ్గురు సీఎంలు మారారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిర పర్చేందుకు కేంద్రంలో పాలన సాగిస్తున్న పార్టీ చూపిన ఉత్సాహం, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం, రాష్ట్రపతి పాలన విధించడం, కాంగ్రెస్‌లో చీలిక, సుప్రీంకోర్టు జోక్యం, పదవి పోగొట్టుకున్న సీఎం ఆత్మహత్య... ఇలా ఒకదానికి తర్వాత మరొకటి. తాజాగా మరో ముసలం. 2014లో ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకుగాను కాంగ్రెస్ 42 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. 2011 నుంచి సీఎంగా ఉన్న నబమ్ టుకీయే మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2014 డిసెంబరులో వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి కలిఖో పుల్ను మంత్రివర్గం నుంచి టుకీ తప్పించారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో పుల్ అసమ్మతిని లేవదీశారు. 2016 జనవరి 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీన్ని ముందుకు జరుపుతూ డిసెంబరు 16, 2015 నుంచే అసెంబ్లీ సమావేశాలుంటాయని గవర్నర్ జె.పి.రాజ్‌ఖోవా ఆదేశాలిచ్చారు. టుకీని దింపేందుకు అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. టుకీ ప్రభుత్వం అసెంబ్లీకి తాళం వేయడంతో... డిసెంబరు 16న మరోచోట సమావేశమైన 33 మంది ఎమ్మెల్యేలు (పుల్ వర్గం, బీజేపీ) స్పీకర్‌గా రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు. మరుసటి రోజు హోటల్లో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. టుకీని తొలగించి కలిఖో పుల్ను సీఎంగా ఎన్నుకున్నారు. తర్వాత రెబియాతో పాటు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు లేకుండా... బీజేపీకి చెందిన 11 మంది, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు చేసిన తీర్మానం మేరకు అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ఎలా ముందుకు జరుపుతారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ వాదించింది. అరుణాచల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు సిఫారసు చేసింది. ఈ ఏడాది జనవరి 26న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన విధించాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. దీన్ని సుప్రీం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ఇచ్చిన నివేదికను తమకు అందజేయాలని కోరింది. తర్వాత వాదోపవాదాలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ తమ చర్యలను సమర్థించుకున్నారు. 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ రెబియా ఇచ్చిన ఆదేశాలపై గౌహతి హైకోర్టు ఇచ్చిన స్టేను ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనే కాంగ్రెస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దాంతో కేంద్రం వేగంగా పావులు కదిపింది. మరుసటి రోజు రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అసమ్మతి నేత కలిఖో పుల్ ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జులై 13న సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. అసెంబ్లీని ముందుకు జరుపుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. డిసెంబరు 15 నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది. దాంతో నబమ్ టుకీ నేతృత్వంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచిన కేంద్రానికి ఇది గట్టి ఎదురుదెబ్బ. తాత్కాలిక గవర్నర్‌గా ఉన్న తథాగత రాయ్ రెండురోజుల్లోనే... జులై 16న బల నిరూపణ చేసుకోవాలని టుకీని కోరారు. కనీసం 10 రోజుల గడువివ్వాలని టుకీ కోరగా గవర్నర్ నిరాకరించారు. ఈలోపు తెరవెనుక మంత్రాంగం నడిచి అసమ్మతి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. టుకీ బలపరచబోమని, మరొకరిని సీఎం చేయాలని కోరారు. దాంతో మధ్యేమార్గంగా పెమా ఖండూను సీఎంగా ఎన్నుకోగా... అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సుప్రీం తీర్పుతో పదవి పోగోట్టుకున్న కలిఖో పుల్ ఆగష్టు 9న తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సుప్రీంతీర్పుతో కంగుతిన్న బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతో పావులు కదిపారు. ఫలితంగా సెప్టెంబరు 16న ముఖ్యమంత్రి పెమా ఖండూ 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ)లో చేరిపోయారు. ఎన్డీయేకు చెందిన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (నెడా)లో పీపీఏ భాగస్వామి. కాంగ్రెస్ పార్టీలో చివరికి మాజీ సీఎం నబమ్ టుకీ రూపంలో ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు. రాజీనామా చేయాలనే కేంద్రం సూచనలు పట్టించుకోకుండా గవర్నర్ పదవిలో కొనసాగిన రాజ్‌ఖోవాను సెప్టెంబరు 22న చివరకు రాష్ట్రపతి డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఖండూను, మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన పీపీఏ... శుక్రవారం తమ లెజిస్లేటివ్ పార్టీ నేతగా రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యే (ఎన్నికల అఫిడవిట్ తన ఆస్తుల విలువను 187 కోట్లుగా చూపారు) టకమ్ పారియోను ఎన్నుకున్నట్లు స్పీకర్‌కు తెలియజేసింది. 12 మంది సభ్యులున్న బీజేపీ పెద్దన్న పాత్రను పోషిస్తూ... 43 మంది సభ్యులున్న పీపీఏను చిన్నచూపు చూస్తోందనేది తిరుగుబాటు నేతల వాదన. ఖండూకే తమ మద్దతు ఉంటుందని, మరొకరిని సీఎంగా అంగీకరించమని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అంటోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజుతో టకమ్ పారియోకు తీవ్ర రాజకీయవైరముంది. బీజేపీ (12), ఖండూ వర్గం (సస్పెండైన ఏడుగురు) లేకున్నా... 36 మందితో పీపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఉంది. రెండు జాతీయ పార్టీలు... బీజేపీ, కాంగ్రెస్‌లకు రాజకీయ చదరంగంగా మారిన అరుణాచల్‌లో తాజా పరిణామాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అరుణాచల్ సంక్షోభంలో కొత్త ట్విస్ట్
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ) నుంచి సస్పెన్షన్ కు గురైన సీఎం పెమా ఖండూకు బీజేపీ బాసటగా నిలిచింది. పెమా ఖండూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఇప్పటికీ ఆయననే ముఖ్యమంత్రిగా భావిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాపిర్ గయో పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఖండూ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ స్పష్టం చేశారు. ఖండూ నాయకత్వంపై తాము అసంతృప్తిగా ఉన్నామని, ఆయన ఒంటెత్తు పోకడలు అవలంభిస్తున్నారని పీపీఏ అధ్యక్షుడు ఖాఫా బెంజియా తెలిపారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం సాధించడంతో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు ఖండూ స్థానంలో సీఎం పదవికి ముగ్గురు పీపీఏ నేతలు పోటీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. పీపీఏ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖండూ సీఎం పదవికి రాజీనామా చేస్తారా, లేదా ఆసక్తికరంగా మారింది. ఆయనతో క్రమశిక్షణ చర్య ఎదుర్కొన్న డిప్యూటీ సీఎం చౌనా మీన్ తో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేల భవిష్యత్ కార్యాచరణతో అరుణాచల్ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. -
పార్టీ నుంచి సీఎంపై సస్పెన్షన్ వేటు!
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూకు పార్టీ ఝలక్ ఇచ్చింది. పెమా ఖండూతో సహా ఏడుగురు నేతలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ) నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ తో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పార్టీ అధ్యక్షుడు కఫియా బెంగియా గురువారం రాత్రి వెల్లడించారు. పీపీఏ పక్షనేతగా పెమా ఖండూ ఇక ఎక్కువకాలం ఉండే ప్రసక్తేలేదని ఆయన తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతోనే వారిపై ఈ చర్య తీసుకున్నామని, పెమా ఖండూ నిర్వహించే సమావేశానికి పార్టీ నేతలు ఎవరూ హాజరు అవరాదని ఆదేశాలు జారీచేశారు. పార్టీ సస్పెన్షన్‌తో సీఎం పెమా ఖండూ పీపీఏ లెజిస్లేచర్ పక్షనేతగా ఉండే అర్హతను కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ గత సెప్టెంబర్ లో పెమా ఖండూ నేతృత్వంలోని 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్డీఏ మిత్రపక్షమైన పీపీఏలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పెమా ఖండూ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. పీపీఏ లెజిస్లేచర్ పార్టీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని పార్టీ అధ్యక్షుడు కఫియా బెంగియా వివరించారు. -
పార్టీ నుంచి అరుణాచల్ సీఎం తొలగింపు
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని పీపుల్స్ పార్టీ (పీపీఏ) అధినాయకత్వం ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మీన్, మరో ఐదుగురు శాసనసభ్యుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణం కింద వారు గురువారం రాత్రి సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తనకు ఉన్న విచక్షణాధికారంతో ఈ సస్పెన్షన్ విధిస్తున్నట్లు పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాఫా బెంగియా చెప్పారు. ఈ సస్పెన్షన్ తో పీపీఏ లెజిస్లేచర్ పార్టీకి నాయకుడిగా ఉండే అర్హతను సీఎం కోల్పోయారు.