అరుణాచల్ కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు | Pema Khandu elected CLP leader in Arunachal Pradesh replacing Chief Minister Nabam Tuki | Sakshi
Sakshi News home page

అరుణాచల్ కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు

Published Sat, Jul 16 2016 11:41 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

అరుణాచల్ కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు

అరుణాచల్ కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా నబమ్ తుకీ శనివారం రాజీనామా చేశారు. కొత్త సీఎల్పీ నేతగా పెమ ఖండూ ఎన్నికయ్యారు. ఈవాళ ఉదయం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి 40మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా సొంత గూటికి చేరుకున్నారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమం అయింది.

కాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీర్పు అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నబమ్ టుకీ.. అసెంబ్లీలో బలనిరూపణకు మరింత సమయం కోరుతుండగా.. శనివారం రోజే బలపరీక్ష తప్పదని గవర్నర్ తథాగతరాయ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement