అరుణాచల్‌ సీఎంగా పెమా ఖండూ.. మోదీ శుభాకాంక్షలు | Pema Khandu Taking Oath As Chief Minister of Arunachal Pradesh, PM Modi Congratulates Him | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌ సీఎంగా పెమా ఖండూ.. మోదీ శుభాకాంక్షలు

Published Thu, Jun 13 2024 2:28 PM | Last Updated on Thu, Jun 13 2024 3:02 PM

Pema Khandu Taking Oath As Chief Minister of Arunachal Pradesh

ఈటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి బీజేపీ నేత పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా మరో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, రెండు దశాబ్దాల తర్వాత అరుణాచల్‌లో తొలి మహిళా మంత్రిగా దాసంగ్లు పుల్‌ ప్రమాణం చేయడం విశేషం.

ఇక, గురువారం ఉదయం ఈటానగర్‌లోని డీకే స్టేట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, కిరణ్‌ రిజుజులతో పాటుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరయ్యారు. కాగా, పెమా ఖండూ 2016లో మొదటి సారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60 స్థానాలకు గానూ 46 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందే పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

 

 

మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫేమా ఖండూకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోదీ.. అరుణచల్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి సహా, మంత్రి వర్గం పాటుపడాలని కోరారు.

 


ఇదిలా ఉండగా.. అరుణాచల్‌ప్రదేశ్‌ కేబినెట్‌లో రెండు దశాబ్దాల తర్వాత తొలి మహిళా మంత్రిగా దాసంగ్లు పుల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..‘నాకు ఎంతో ఆనందంగా ఉంది. బీజేపీ ఓ మహిళకు (రాష్ట్రంలో) క్యాబినెట్ బెర్త్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. మహిళా సాధికారత కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement