సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 15న ఎత్తివేస్తారంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం పేమాఖండూ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే లాక్‌డౌన్ ఎత్తివేతపై సీఎం చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాసేపటి తర్వాత ట్వీట్‌లో దొర్లిన తప్పును గమనించిన సీఎం వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించారు.
ఈ సందర్భంగా ఆ ట్వీట్‌పై పేమాఖండూ వివరణ కూడా ఇచ్చారు. లాక్‌డౌన్‌కు సంబంధించి ట్వీట్ చేసిన అధికారికి హిందీ సరిగా రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్న సీఎం.. వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించినట్లు పేర్కొన్నారు. ‘ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మా అధికారికి లాక్‌డౌన్ గురించి హిందీలో వివరించాను. అయితే ఆయనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో ఆయన ఆ విధంగా ట్వీట్ చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఇక లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేము. అయితే లాక్‌డౌన్‌లోనూ, ఆతర్వాత కూడా ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటివి కొనసాగించాలని’ సీఎం పేమాఖండు విజ్ఞప్తి చేశారు.
The tweet with respect of lockdown period was uploaded by an officer whose comprehension in Hindi was limited. And therefore same was removed. @TimesNow https://t.co/7nuUT7QfCx
— Pema Khandu (@PemaKhanduBJP) April 2, 2020
Comments
Please login to add a commentAdd a comment