![Arunachal CM Pema Khandu, his deputy among 10 BJP candidates elected unopposed in assembly elections - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/31/10-MLAS.jpg.webp?itok=gDodjw3T)
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఆయా నియోజకవర్గాల్లో వారు మాత్రమే బరిలో మిగిలారు.
దాంతో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి పవన్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరుణాచల్‌లోని మిగతా 60 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన తొలి విడతలో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment