Pawan Kumar
-
బాలుడి కిడ్నాప్ విషాదాంతం
కేటీదొడ్డి: చేతబడి చేసి తన అన్నను చంపారని కక్ష పెంచుకున్న ఓ తమ్ముడు.. అందుకు కారణమైన కుటుంబంలోని బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె మచ్చప్ప, వడ్డె నర్సింహులు సొంత అన్నదమ్ములు. వడ్డె మచ్చప్ప–లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు రాజు(28), గోవిందు. కాగా, రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వడ్డె నర్సింహులుకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. నర్సింహులు కుమారుడు పవన్‌కుమార్(7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతు న్నాడు. గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన పవన్ సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోవింద్ బైక్‌పై పవన్‌ను చూసినట్టు గ్రామస్తులు చెప్పా రు. అదే సమయంలో గోవిందు సైతం కనిపించలేదు. దీంతో పోలీసులు మచ్చ ప్ప కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. శుక్రవారం కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా యాపల్‌దిన్నె పోలీస్‌స్టేషన్ పరిధిలో గాలింపు చేపట్టారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా.. సోలార్ పవర్ ప్రాజెక్ట్ వద్ద గోవిందు బైక్ పార్కు చేసి ఉండటం గుర్తించారు. పోలీసులు సెల్‌నంబర్ ట్రేస్ చేయగా, సిగ్నల్స్ ఆధారంగా ఓ పాడు పడిన బావి వద్ద చివరి లొకేషన్ చూపించింది. దీంతో అనుమానంతో పోలీసులు బావిలో వెతకగా గోవిందు మృతదేహం లభ్యమైంది. గజ ఈతగాళ్ల సాయంతో మళ్లీ వెతకగా బాలుడి మృతదేహం సైతం లభ్యమైంది.ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. కాగా, తన అన్న రాజును నర్సింహులు కుటుంబ సభ్యులు చేతబడి(బాణామతి) చేసి చంపేశారనే కోపంతో గోవింద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యమే.. ప్రాణాలు తీసింది
లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రాణాపాయస్థితిలో చికిత్స కోసం వస్తే సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే రోగి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగిన ఘటన శనివారం విజయవాడలో చోటుచేసుకుంది. మృతుని మేనమామ కథనం మేరకు.. కృష్ణాజిల్లా, పామర్రు మండలం జుజ్జువరం గ్రామానికి చెందిన గార్లపాటి ఆది పవన్‌కుమార్ (35) తాపీపని చేస్తుంటాడు. ఇటీవల కాలుకు దెబ్బతగలడం, మూడురోజులుగా జ్వరం ఉండటంలో స్థానికంగా చికిత్సపొందుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి హార్ట్‌రేట్ ఎక్కువగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. లెటర్లో వైరల్ ఫీవర్, గ్యాస్ట్రయిటిస్ అని పేర్కొన్నారు. శనివారం తెల్లవారు జామున విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి, జనరల్ వార్డులో అడ్మిట్ చేశారు. ఈక్రమంలో ఉదయం 9.30 గంటలకు పవన్‌కుమార్ మృతి చెందాడు. బంధువుల ఆందోళన ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కనీసం ఐసీయూలో ఉంచకుండా, సాధారణ వార్డులో చేర్చడం వల్లే మృతి చెందాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. అదేమని అడిగితే బెడ్లు ఖాళీలేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయారు. వైద్యులు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల ఆందోళన తర్వాత ఆస్పత్రి అధికారులు వారి వద్దకు వచ్చి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.అంతర్గత రక్తస్రావంతోనే మృతి రోగి పవన్‌కుమార్ మూడురోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. మచిలీపట్నం నుంచి రిఫర్‌చేసిన లెటర్లో కూడా వైరల్ ఫీవర్, గ్యాస్రై్టటీస్ అని రాశారు. వైరల్ ఫీవర్‌లో ప్లేట్స్‌లెట్స్ తగ్గిన కారణంగా అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్)తో ఒక్కసారిగా బీపీ తగ్గి మరణం సంభవించింది. రోగి బంధువుల ఆరోపణలపై కూడా విచారణ చేస్తాం. ఇందుకు ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో విచారణకు కమిటీ వేశాం. – డాక్టర్ ఎ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ -
ఆకట్టుకుంటున్న మాస్ సాంగ్ ‘రాలే పువ్వే’
‘మెరిసే మెరిసే’ఫేం పవన్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. వరుసగా కంటెంట్‌ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే పాటలు, టీజర్, పోస్టర్ అంటూ బజ్ క్రియేట్ చేశారు. తాజాగా మంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ ఉన్న పాటను విడుదల చేశారు.రాలే పువ్వే అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేశారు. కార్తీక్ బి కొడకండ్ల అందించిన క్యాచీ ట్యూన్.. భువనేశ్వర్ రాగిఫణి సాహిత్యం.. లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. రాజ్ పైడి మాస్టర్ స్టెప్పులు కుర్రకారును కట్టిపడేసేలా ఉన్నాయి. -
Average Student Nani: ఆకట్టుకుంటున్న రొమాంటిక్ మెలోడీ
‘మెరిసే మెరిసే’సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కుమార్ కొత్తూరి ఇప్పుడు హీరోగా మారాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'యావరేజ్ స్టూడెంట్ నాని'. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ లోనే తన ఎక్స్ ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు పవన్ కుమార్. ఈ రోజు సెకండ్ సింగిల్ ‘ఏమైందో మనసే’ అనే పాటను రిలీజ్ చేశారు.పూర్తి రొమాంటిక్ మోడ్‌లో సాగే ఈ మెలోడీ పాటకు కార్తీక్ బి కొడకండ్ల మంచి బాణీని అందించారు. శక్తి శ్రీ గోపాలన్ గానం వినసొంపుగా ఉంది. కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. -
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
పవన్ కుమార్ కొత్తూరి, స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ సినిమాతో పవన్ కుమార్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు. ‘సారా సారా’ అంటూ సాగే ఓ మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటకు శివకృష్ణచారి ఎర్రోజు లిరిక్స్ అందించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ సినిమాలో ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి కీలక పాత్రలు పోషించారు. -
పవన్‌ను బహిష్కరించిన బీజేపీ
రెబల్ అభ్యర్థిగా.. పార్టీకి తలనొప్పిగా మారిన భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఎన్డీయే కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్ వేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. వాస్తవానికి.. లోక్‌సభ ఎన్నికల కోసం 200 మందితో కూడిన తొలి జాబితాలోనే పవన్ సింగ్ పేరును ప్రకటించింది బీజేపీ. కానీ, పశ్చిమ బెంగాల్ అసన్సోల్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేని పవన్ సింగ్.. బీజేపీకి క్షమాపణలు చెప్పారు. అయితే సొంత రాష్ట్రంలో పోటీ చేసేందుకు మాత్రం ఆయన ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో.. బీజేపీ తరఫున బీహార్‌లో పోటీ చేయాలని ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఆర్జేడీ తరఫున టికెట్ కోసం కూడా యత్నించారు. రెండు వైపుల నుంచి ఆయన సానుకూలత దక్కలేదు. చివరకు.. కారాకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేయడమే కాకుండా.. తన తల్లితోనూ ముందు జాగ్రత్తగా మరో నామినేషన్ వేయించారు. చివరకు ఉపసంహరణ గడువు ముగిసేనాడు.. తన తల్లితో నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. ఈ పరిణామాలన్నింటిని బీజేపీ తీవ్రంగా పరిగణించింది.మరోవైపు పవన్ సింగ్‌ను కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయని బీజేపీ.. చివరకు పవన్‌పై బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కారాకాట్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, ఆర్ఎల్ఎం నేత ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి తరఫున సీపీఐ(ఎంఎల్)ఎల్ తరఫున రాజా రామ్ సింగ్ కుష్వాహా బరిలో ఉన్నారు. జూన్ 1వ తేదీన కారాకాట్కు పోలింగ్ జరగనుంది. -
అరుణాచల్‌లో 10 ఏకగ్రీవాలు
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఆయా నియోజకవర్గాల్లో వారు మాత్రమే బరిలో మిగిలారు. దాంతో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి పవన్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరుణాచల్‌లోని మిగతా 60 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన తొలి విడతలో పోలింగ్ జరగనుంది. -
భారత్- కెనడా మధ్య విభేదాలు.. ఎవరీ పవన్ కుమార్ రాయ్?
India-Canada diplomatic row ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంతో భారత్- కెనడా మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు ఈ వివాదానికి తెరలేపాయి. నిజ్జర్ హత్యతో భారత్ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక కెనడాలో భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పవన్ కుమార్ రాయ్‌ను కెనడా విదేశాంగశాఖ ఆ దేశం నుంచి బహిష్కరించింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు పలు ఆంక్షలు విధించాయి. అక్కడి భారతీయులకు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చిరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. అలాగే తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కెనడాకు వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? ఎవరీ పవన్ కుమార్ రాయ్ పవన్ కుమార్ రాయ్ కెనడాలో భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. భారత్, కెనడా మధ్య ఏర్పడిన ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అతనే ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. పవన్ కుమార్ రాయ్ 1997 బ్యాచ్ కు చెందిన పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి. రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధిత కేసులను సమర్ధవంతంగా పరిష్కరించిన చరిత్ర ఆయనకు ఉంది. 2010 జులై 1 నుంచి డిప్యుటేషన్ పై ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అంతకుముందు జలందర్, అమృత్ సర్ జిల్లాల సీనియర్ ఎస్పీగా పనిచేశారు. అతని సేవలను గుర్తించిన పంజాబ్ ప్రభుత్వం జనవరి 31, 2023న అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) స్థాయి పదోన్నతి కల్పించింది. రాయ్‌కు భారత ఇంటెలిజెన్స్ విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) మాజీ చీఫ్ సమంత్ కుమార్ గోయెల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2018లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కేంద్రం నియమించింది. అనంతరం కెనడాలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా ఎంపికయ్యారు. కాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు, భారత్ నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) అధినేత హర్దీప్ సింగ్‌ను గత జూన్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. జూన్ 18న పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నిజ్జర్‌ను కాల్చి చంపారు. అయితే హర్దీప్సింగ్ నిజ్జర్‌ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. అతడిని పట్టించిన వారికి 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది., -
ఈసారి పండక్కి..నా సామి రంగ
సంక్రాంతికి ‘నా సామి రంగ’ అంటున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘నా సామి రంగ’ టైటిల్‌ను ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్ట్ 29) నాగార్జున బర్త్ డే. ఈ సందర్భంగా ‘నా సామి రంగ’ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘ఈసారి పండక్కి నా సామి రంగ’ అంటూ ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాతో ‘పలాస’ ఫేమ్ దర్శకుడు కరుణకుమార్ నటుడిగా పరిచయం అవుతున్నారు. ‘‘సంక్రాంతి సీజన్లో నాగార్జునగారికి చాలా హిట్ ఫిల్మ్స్ ఉన్నాయి. వినోదాత్మకంగా సాగే ‘నా సామి రంగ’ సినిమాను సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ చేయనున్నాం. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, డైలాగ్స్ అందిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి. పవర్ఫుల్ రోల్: ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రూ΄÷ందనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించనున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో నాగార్జున ఓ పవర్ఫుల్ రోల్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
బలవంతంగా సంతకాలు చేయించి అబార్షన్... మాకు రక్షణ కావాలి
ఒంగోలు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను కుటుంబసభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని పుల్లలచెరువుకు చెందిన ప్రేమజంట పోలీసులను రక్షణ కోరారు. పుల్లలచెరువు గ్రామానికి చెందిన దేశావత్ రూపాబాయి, పవన్ కుమార్‌లు సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనలో పోలీసు అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. దేశావత్ రూపాబాయి గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న వీరిద్దరూ ఈ విషయాన్ని ఇళ్లల్లో పెద్దలకు తెలియజేశారు. ఈపెళ్లికి పవన్ కుటుంబసభ్యులు అంగీకరించగా రూప కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో నాలుగు నెలల క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇంట్లో విషయం చెప్పగా..తల్లిదండ్రులు మేం చూసిన సంబంధమే చేసుకోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. గర్భిణి అయిన రూపను నంద్యాలలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా సంతకాలు చేయించి అబార్షన్ చేయించారు. మరో పెళ్లికి ఏర్పాటు చేస్తుండటంతో ఈ నెల 9న పెద్దలకు తెలియకుండా ఇంటి నుంచి వచ్చేశారు. మాకు రక్షణ కల్పించాలని, తన మీద దాడి చేసిన తలిదండ్రులు, మావయ్య, అమ్మమ్మలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. -
ఆ రెసిపీ ఎవరికీ తెలియదు
‘‘నాకు షూటింగ్ లొకేషన్ హాలిడే స్పాట్లాంటిది. షూటింగ్ చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఏ రోజైనా షూటింగ్ లేదంటే నాకు బోర్ అనిపిస్తుంది. అంతగా ప్రొఫెషన్ అంటే నాకు ప్రేమ’’ అన్నారు కృతీ శెట్టి. నాగచైతన్య సరసన కృతీ నటించిన ‘కస్టడీ’ ఈ నెల 12న విడుదల కానుంది. పవన్‌కుమార్ సమర్పణలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు. ► ముందుగా ‘కస్టడీ’ స్టోరీ లైన్ గురించి.. సాధారణంగా ఏ సినిమాలో అయినా విలన్ని చంపడం, ఓడించడం... కథ ఇలా ఉంటుంది. అయితే ‘కస్టడీ’లో మాత్రం విలన్‌ను కాపాడటానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. కొత్త స్టోరీ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► స్టోరీ లైన్ కొత్తగా ఉంది... మీ పాత్ర? ఇందులో నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశాను. సీరియస్‌గా నడుస్తున్న కథను నా పాత్ర బ్యాలెన్స్ చేయడమే కాకుండా స్క్రీన్ ప్లేలతో పాటు ప్రయాణం చేస్తుంది. నేనిప్పటివరకూ చేసిన సిని మాలన్నింట్లోకీ ఈ సినిమాలో చేసిన పాత్ర నిడివి ఎక్కువ. ► కానీ యాక్షన్ సినిమాల్లో హీరోయిన్‌కు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా? అది కొంత నిజమే. అయితే ‘కస్టడీ’ యాక్షన్ సినిమా అయినప్పటికీ హీరోయిన్ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువ. ఈ సినిమాలో నాకు నచ్చిన అంశం కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే.. వేరే సినిమాలకు డ్యాన్స్ప్రాక్టీస్ చేశాను. కానీ ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను. అందుకే డైరెక్టర్ వెంకట్ ప్రభుగారితో ఈ సినిమా చూశాక హాలీవుడ్ నుంచి నాకు మార్వెల్ ఫిలింస్‌కి, డిస్నీ సంస్థ నుంచి ఫోన్ వస్తుందేమో అని సరదాగా అన్నాను. ► ‘కస్టడీ’లో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ చిత్రీకరణ ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? ఈ యాక్షన్ సీన్స్ తీయడానికి 15 రోజులు పట్టింది. ఇందులో 5 రోజులు పూర్తిగా 20 ఫీట్ల వాటర్ పూల్‌లో షూటింగ్ చేశాం. తీసే ముందు రెండు రోజులుప్రాక్టీస్ చేశాం. కొన్నిసార్లు 40 సెకండ్ల నుంచి ఒక నిమిషం వరకు ఊపిరి తీసుకోకుండా చేయాల్సి వచ్చింది. ఈ సీన్లలో చైతూ, సంపత్‌గారు, అరవింద్ స్వామిగారు, నేను ఉంటాం. అందుకే భయం వేసింది. ఎందుకంటే ఎవరికి ‘అన్ ఈజీ’గా అనిపించినా మళ్లీ సీన్ తీయాల్సి ఉంటుంది. నా కారణంగా అలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదని కోరుకున్నాను. ► ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్యతో ‘కస్టడీ’ సినిమా చేశారు.. మీ కెమిస్ట్రీ గురించి? చైతన్య నా ఫేవరెట్ కో–స్టార్, అలాగే తన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. జనరల్‌గా ఆఫ్ స్క్రీన్‌లో కో–స్టార్స్ మధ్య మంచి రిలేషన్ ఉంటే అది ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఆఫ్ స్క్రీన్ చై, నా రిలేషన్ బాగుంటుంది. తనతో ఉన్న సాన్నిహిత్యం మా కెమిస్ట్రీని మరింత అందంగా పండించింది. కొన్నిసార్లయితేప్రాక్టీస్ చేయకుండానే సహజంగానే నటించాం. చైతూతో ఆ కంఫర్ట్ ఉంటుంది. ► ‘ఉప్పెన’ తర్వాత మీరు చేసిన సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితం సాధించలేదు. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకున్నారా? ‘ఉప్పెన’ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ వంటి మంచి సినిమాలు చేశాను. ఆ విషయం పక్కన పెట్టి ఫలితం గురించి చె΄్పాలంటే.. పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న నటులు ఉన్నారు. అయితే వారితో పాటు సక్సెస్ రెసిపీ ఎవరికీ తెలియదు. అది తెలిస్తే అన్నీ హిట్లే వస్తాయి. మా వంతుగా మేం చేయగలిగింది కష్టపడి పని చేయడమే. నేను చేసిన సినిమా ఫ్లాప్ అయినా పశ్చాత్తాపపడను. ఎందుకంటే ఆ సినిమా కూడా ఎంతో కొంత అనుభవాన్ని మిగుల్చు తుంది కదా. ఆ అనుభవం నా భవిష్యత్ సినిమాల ఎంపికకు పనికొస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ► నటన కాకుండా మీకున్న వ్యాపకాలు? దర్శకత్వం చేయాలనుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్షన్‌కి సంబంధించిన విషయాల మీద ఆసక్తి చూపిస్తుంటాను. సెట్స్‌లో అందరూ ఆటపట్టిస్తుంటారు.. అయితే పదేళ్ల తర్వాతే డైరెక్షన్ చేస్తాను. ► తదుపరి సినిమాల గురించి... మలయాళంలో ఒక సినిమా, శర్వానంద్‌తో తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను. -
విమానం టికెట్‌తో అంతరిక్షానికి!
సాక్షి, హైదరాబాద్: విమానం టికెట్‌తో అంతరిక్షంలోకి ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవని, మరో పదేళ్లలోనే అది సాధ్యమవుతుందని స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన అన్నారు. రాకెట్ల నిర్మాణానికి హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా అనుకూలమైందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను తయారు చేసిన సంస్థ స్కైరూట్ అనే విషయం తెలిసిందే. ఫిక్కీలేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే అంతరిక్షానికి ఎగిరిన తమ రాకెట్ పూర్తిగా హైదరాబాద్‌లోనే తయారైందని, అది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైనదని పేర్కొన్నారు. సొంతంగా ఉపగ్రహాలను తయారు చేసుకోగల సామర్థ్యం చాలా కొద్దిదేశాలకే ఉందని, భారత్ ఈ రంగంలో ఇప్పటికే ముందు వరసలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ కూడా అంతరిక్ష రంగంలో ఓ ప్రధానకేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా వంద నుంచి 150 ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉంటే, రానున్న పదేళ్లలో వీటి సంఖ్య పదివేలకు తరువాతి పదేళ్లలో 40 వేలకూ చేరుకుంటుందని చెప్పారు. అంతరిక్షంలో విహారయాత్రలకు పాశ్చాత్య దేశాలు సిద్ధమవుతున్నాయని, భారత్‌లోనూ ఇంకో పదేళ్లకు ఇది సాధ్యం కావచ్చని పవన్‌కుమార్ తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రస్తుతానికి ఈ అంశంపై దృష్టి పెట్టడంలేదన్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ తయారు చేస్తున్న రాకెట్ ‘విక్రాంత్ 1’ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదని, దీని ప్రయోగం వచ్చే ఏడాది జరగవచ్చని తెలిపారు. ఇప్పటివరకూ రాకెట్ల ద్వారా గరిష్టంగా పదిమంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుందని, ఎక్కువ మందితో ప్రయాణించే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం దేశంలో అంతరిక్ష పరిజ్ఞానం వృద్ధిలో తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతైనా ఉందని, స్టార్టప్ కంపెనీలు ధ్రువ స్పేస్, స్కై రూట్ ఏరోస్పేస్‌లు హైదరాబాద్‌లో ఉండటం, రాకెట్ ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట ఏపీలో ఉండటాన్ని పవన్‌కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏరోస్పేస్ రంగంలో ఇప్పటికీ మహిళల భాగస్వామ్యం పదిశాతం మాత్రమే ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ కల్పనా చావ్లా స్ఫూర్తితో మరింతమంది ఈ రంగంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాలసీ బజార్ వైస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అలోక్ బన్సర్, రాపిడో బైక్ షేరింగ్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుంటుపల్లి పవన్ తదితరులు కూడా స్టార్టప్ రంగంలో తమ అనుభవాలను పంచుకున్నారు. -
తాళికట్టి రోజు గడవక ముందే.. నవ్వును దూరం చేసి దుఃఖాన్ని మిగిల్చి
ఆ పెళ్లిని మృత్యువు వెక్కిరించింది. కలకాలం కలిసి ఉంటామని బాసలు చేసుకున్న కొత్త జంటను కర్కశంగా విడదీసింది. పసుపు కుంకుమలను రక్తంతో తుడిచేసింది. తాళి కట్టి ఒక్కరోజైనా గడవక ముందే వరుడి ప్రాణాలను మింగేసింది. పెళ్లి ఆనందంలో ఉన్న రెండు కుటుంబాలకు నవ్వును దూరం చేసి దుఖాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి సింహాచలంలో వివాహం చేసుకున్న జమ్మాన పవన్‌కుమార్ (20) శనివారం మధ్యాహ్నానికి అరిణాం అక్కివలస వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎచ్చెర్ల క్యాంపస్/ఎల్ఎన్ పేట: అరిణాం అక్కి వలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్ఎన్ పేట మండలం పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన జమ్మా న పవన్‌కుమార్ మృతి చెందాడు. అతడి మేన మామ బలగ సోమేశ్వరరావు గాయపడ్డారు. పవన్ కుమార్ విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి శుక్రవారం రాత్రి సింహాచలంలో ఇదే మండలం శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీకి చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం చేసుకున్న వీరు స్వగ్రామంలో వారం రోజులు ఉందామని సింహాచలం నుంచి శనివారం బయల్దేరారు. చదవండి: (పెళ్లయిన ఐదు రోజులకే.. మామ చేతిలో అల్లుడి దారుణ హత్య) పెళ్లి జనమంతా బస్సులో రాగా.. పవన్ మాత్రం తన మేనమామతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. ఎచ్చెర్ల మండలం అరిణాం–అక్కివలస ప్రాంతానికి వచ్చే సరికి వీరి బండిని వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సోమేశ్వరరావుకు గా యాలయ్యాయి. వెనుక వస్తున్న మరో లారీ డ్రై వర్ 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరించారు. ఎ చ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. రెండు గ్రామాల్లో విషాదం పవన్ మృతి చెందాడన్న వార్త తెలిసి అతడి స్వ గ్రామం పెద్దకొల్లివలస పునరావస కాలనీలో ను, వధువు ఊరు శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీలోను విషాదం అలముకుంది. ఒక్క రోజులో నే ఎంత ఘోరం జరిగిందని చర్చించుకున్నారు. -
నాలుగు పెళ్లిళ్లు.. ఆరుగురితో సహజీవనం
సాక్షి, హైదరాబాద్ : నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమేగాక మరో ఆరుగురితో సహజీవనం చేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ మంగళవారం సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హిమబిందు అనే మహిళకు మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా 2018లో మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణప్యాలస్‌లో ఉంటున్న వెంకటబాలకృష్ణ పవన్‌కుమార్‌తో వివాహం జరిగిందన్నారు. కట్నంగా రూ.28లక్షలు, పెళ్లి ఖర్చులకు మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వివాహం అనంతరం తనను దుబాయ్ తీసికెళ్లిన పవన్‌కుమార్ అక్కడ వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. తనకు ఇదివరకే మరో ముగ్గురితో పెళ్లి జరిగిందని, మొదటి భార్య, రెండో భార్యను వదిలేసినట్లు అతనే స్వయంగా తనతో చెప్పాడని, మూడో భార్యను నేరుగా తనకు పరిచయం చేయడమేగాక ఆమె తన నిజమైన భార్య అని చెప్పినట్లు ఆరోపించింది. ఓ రోజు ఐరన్‌బాక్స్‌తో తన ముఖంపై కాల్చేందుకు ప్రయత్నించాడని, ఆ తర్వాత కూడా పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాది క్రితం మహిళా పోలీసు స్టేషన్లో కేసు పెట్టానని, న్యాయం కోసం పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. కొద్దిరోజులుగా తన ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ హ్యాక్ చేశారని ఆరోపించింది. తన భర్త పవన్‌కుమార్‌కు కఠినంగా శిక్షించి కట్నం డబ్బులు, పెళ్లి ఖర్చులు మొత్తం రూ.38లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. -
అతడు.. ఆమె.. ఓ అన్న!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ విద్యార్థి యువతిగా ‘మారాడు’.. ఆ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఎర వేశాడు... తన ఫొటోలు అంటూ డమ్మీవి పంపించి.. బాధితుడి నుంచి ‘అసలైనవి’ సంగ్రహించాడు.. ఇవి చేజిక్కిన తర్వాత పెళ్లి ప్రస్తావనతీసుకువచ్చి బెదిరించాడు... ఆపై తన అన్న అంటూ తానే మరో పాత్రలో ప్రవేశించి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు... చివరకు బాధితుడి నుంచి రూ.3.5 లక్షలు కాజేసి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఆ వివరాలు ఇవీ.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్‌కిరణ్ (20) నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ జూదానికి, ఇతర విలాసాలకు అలవాటుపడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడానికి పథకం వేశాడు. ఓ యువతి పేరు, ఆకర్షణీయమైన ఫొటోలు వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా తెరిచాడు. దీని ద్వారా కాచిగూడ ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ రిక్వెస్ట్ వచ్చింది సదరు యువతి నుంచే అని భావించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాక్సెప్ట్ చేశాడు. ఇలా కొన్నాళ్ల పాటు యువతి మాదిరే చాటింగ్స్ చేశాడు. తన ఉనికి బయటకు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఓ దశలో తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెబుతూ కొన్ని ‘ఫొటోలు’ పంపిస్తానంటూ యువతిగానే చెప్పాడు. దానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంగీకరించడంతో ఇంటర్నెట్ నుంచే డౌన్లోడ్ చేసిన కొన్ని అర్ధనగ్న ఫొటోలను తనవే అంటూ పంపించాడు. వీటిని బాధితుడు చూశాడని నిర్ధారించుకున్న తర్వాత చాటింగ్ కొనసాగించాడు. ఆపై పెళ్లి ప్రస్తావన.. చాటింగ్ గారడీ ద్వారానే బాధితుడు సైతం తనంత తానుగా అతడికి చెందిన కొన్ని అలాంటి ఫొటోలే తనకు ఇన్‌స్ట్రాగామ్‌లో పంపేలా చేసుకున్నాడు. ఆపై అసలు కథను ప్రారంభించాడు పవన్ కిరణ్. ఉద్దేశపూర్వకంగా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నిన్నే పూర్తిగా నమ్మానని, అందుకే వ్యక్తిగత ఫొటోలను సైతం షేర్ చేశానంటూ చాటింగ్ మొదలెట్టాడు. ఈ ప్రస్తావనతో హడలిపోయన బాధితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి పేరుతో ఉన్న పవన్ కిరణ్ ఖాతాను బ్లాక్ చేశాడు. దీంతో వాట్సాప్ ద్వారా రంగంలోకి దిగిన నిందితుడు తనను పెళ్లి చేసుకోమంటే బ్లాక్ చేసి మోసం చేస్తున్నావంటూ సందేశాలు పంపాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. మూడో పాత్రలోకి దిగి.. ఈ విషయం తన అన్న వద్దకు వెళుతోందని, ఆయనే మాట్లాడతారంటూ సందేశం పెట్టిన పవన్ మూడో పాత్రలోకి దిగాడు. బాధితుడైన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫోన్లు చేయడం ప్రారంభించిన పవన్ ‘అన్న’ మాదిరిగా మాట్లాడుతూ బెదిరించాడు. తన వద్ద ఉన్న అతడి వ్యక్తిగత ఫొటోలను సైతం మచ్చుకు పంపిస్తున్నానంటూ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో రూ.3.5 లక్షలు చెల్లించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వదలిపెట్టని పవన్ మరికొంత మొత్తం ఇవ్వాలని పదేపదే ఫోన్లు చేశాడు. దీంతో బాధితుడు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుడు వినియోగించిన ఫోన్నంబర్ల ద్వారా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారి గురువారం పవన్‌కిరణ్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
సంచలన విషయాలు చెప్పిన తలారి పవన్
-
వంశంలో చివరి తలారి
తీహార్ జైల్లో ఈ సోమవారం ఉదయం నిశ్శబ్దంగా నాలుగు ఉరితీతలు జరిగిపోయాయి! డమ్మీ ఉరితీతలవి. వాటిని తీసిన తలారి పవన్ కుమార్. ఫిబ్రవరి 1న నలుగురు ‘నిర్భయ దోషుల్ని ఉరి తీయబోతున్నది అతడే. జనవరి 7న దోషులకు తొలిసారి డెత్ వారంట్ జారీ అయిన వెంటనే ఆయన తన స్వస్థలం అయిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ఉరి సరంజామాతో పాటు ఢిల్లీ వచ్చేసి, అప్పట్నుంచీ తీహార్ జైల్లో ఉంటున్నాడు. పవన్‌కి ఉరితీసిన అనుభవం లేదు! ఆ వంశంలో మిగిలిన చిట్టచివరి తలారి కూడా అతడే. పవన్ కుమార్ కనీసం ఒక ఉరినైనా తీయడం కోసం ఏడేళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నాడు. పవన్ తండ్రి మమ్మూసింగ్ చనిపోయే వరకు ఉత్తరప్రదేశ్ అధికారిక తలారిగా ఉండేవారు. ఆయన చనిపోయిన రెండేళ్లకు యు.పి. డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ ఆ హోదాను పవన్‌కి ఇచ్చింది. ఉరితీసే అవకాశాన్ని వృత్తిపరమైన మహద్భాగ్యంగా భావిస్తాడు పవన్. ఆ భాగ్యం అతడి జీవితంలో తొలిసారిగా 2014 కలగబోయి, ఆఖరి నిమిషంలో చేజారిపోయింది! ‘నిఠారి హత్యల’ నేరస్తుడు సురీందర్ కోలి ఉరి వాయిదా పడటంతో పవన్ చేతుల్లోంచి తప్పించుకున్నాడు. పవన్ తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు. ‘‘ఏడు రోజులుగా ఏర్పాట్లన్నీ చేసుకుని కూర్చున్నాను. ప్ఛ్.. తప్పించుకున్నాడు’’ అని బాధపడ్డాడు. అంతకన్నా అతడిని కలతకు గురిచేసిన విషయం.. తన కుటుంబంలోని పూర్వీకులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. అది కుదర్లేదు. పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్ బ్రిటిష్ పాలనలో వృత్తిరీత్యా అనేక మంది స్వాతంత్య్ర సమరయోధుల్ని ఉరితియ్యవలసి వచ్చింది. ఆ బాధ ఈ తలారుల వంశంలో అలా ఉండిపోయింది. పవన్ తాత కల్లూ, పవన్ తండ్రి మమ్మూ కూడా ఎవర్నైనా ఉరితీసిన ప్రతిసారీ బ్రిటిష్ కాలంలో తమ కుటుంబానికి అంటిన రక్తపు మరకల్ని కొంత కడిగేసుకున్నట్లుగా ఉపశమనం పొందేవారు. పవన్‌కే ఆ ఉపశమనం ఇప్పటికీ లభించలేదు.పవన్ తండ్రి మమ్మూ 26/11 దాడుల దోషి అజ్మల్ కసబ్‌ను, పార్లమెంటుపై దాడి జరిగిన కేసులో అఫ్జల్ గురును ఉరితీసి పాపాన్ని పూర్తిగా కడిగేసుకోవాలని ఆశపడ్డాడు కానీ, వారిని ఉరితీయడానికి ముందే 2011 మేలో ఆయన చనిపోయాడు. కసబ్‌ను 2012లో, అఫ్జల్ గురును 2013లో ఉరితీశారు. అప్పటికి తండ్రి ‘పోస్టు’ తనయుడికి రాలేదు కాబట్టి పవన్‌కి వారిని ఉరితీసే అవకాశం రాలేదు. 2014లో సురీందర్ కోలి మిస్ అయ్యాడు. 2015లో యాకూబ్ మెమన్ (’93 ముంబై పేలుళ్ల కేసు) ఉరితీత కూడా పవన్ వరకూ రాలేదు. రహస్యంగా ఒక జైలు కానిస్టేబుల్ చేత అతడిని ఉరితీయించారు. ఇప్పుడైనా నిర్భయ దోషుల్ని ఉరితియ్యడానికి పవన్నే ఢిల్లీ ప్రభుత్వం పిలిపించడానికి కారణం ఉంది. ప్రస్తుతం దేశంలో తలారులెవరూ లేరు. ఉత్తరప్రదేశ్‌లో పవన్ కాకుండా, అహ్మదుల్లా అనే తలారి ఒకరు లక్నోలో ఉన్నారు. అయితే వయసు మీద పడి, తీవ్రమైన అనారోగ్యంతో నేడో, రేపో అన్నట్లు ఉన్నారాయన. మైనర్ కాకుండా ఉండి, ఐదు అడుగుల, నాలుగు అంగుళాల ఎత్తు ఉన్నవారెవరైనా తలారిగా ఉండేందుకు అర్హులు. పవన్‌కి 54 ఏళ్లు. ‘‘ఇలాంటి వాళ్లను ఉరి తీయాల్సిందే. వదిలిపెడితే బయటికి వచ్చి మళ్లీ ఇలాంటివే చేస్తారు. వీళ్లను వదిలేశారు కదా అని మిగతావాళ్లూ బరితెగిస్తారు’’ అంటాడు పవన్.. నిర్భయ దోషుల గురించి. మీరట్‌లోని లోహియానగర్‌లో కాన్షీరామ్ అవాజ్ యోజన పథకం కింద కట్టిన గూళ్లలో ఒక గూటిలో ఉంటుంది పవన్ కుటుంబం. ఏడుగురు పిల్లలు. ఒక తోపుడు బండిలో బట్టలు పెట్టుకుని వీధుల్లో అమ్ముతుంటాడు పవన్. ‘‘నా పిల్లల్ని మాత్రం ఈ వృత్తిలోకి రానివ్వను. నాతోనే ఇది ఆఖరు అవ్వాలి’’ అంటాడు. అతడి తండ్రి మమ్మూ 47 ఏళ్ల పాటు ప్రభుత్వ తలారిగా పని చేశాడు. ఆ ఇంటికి వచ్చిందేమీ లేదు. ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తున్న రూ.3,000 ఉపకారవేతనం తప్ప. పూర్వపు తలారులు జనార్ధన్ పిళ్లై 1940లలో ట్రావన్కూర్ (ఇప్పటి కేరళ ప్రాంతం) రాజుగారి ఆస్థానంలో తలారి. పిళ్లై జీవితం మీద శశి వారియర్ ‘ది లాస్ట్ హ్యాంగ్మేన్’ అనే పుస్తకం రాశారు. పిళ్లై భావోద్వేగాలు లేని మనిషి. ఇలా ఉరి తీసి, అలా మిగతా పనుల్లో పడిపోయేవాడు. అతడి వృత్తి ధర్మమే అయినప్పటికీ.. నాటి సమాజం ఆయన్ని వెలివేసింది. మొత్తం 117 మందిని ఉరి తీశాడు పిళ్లై. నాటా మల్లిక్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తలారి. పద్నాలుగేళ్ల స్కూలు విద్యార్థినిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ధనుంజయ్ ఛటర్జీని కోల్‌కతాలోని అలీపూర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో ఉరితీసింది ఇతడే. 2009లో చనిపోయాడు. ఉరితీసే ముందు బాగా తాగేవాడు. మనసు ‘అయ్యో పాపం’ అనుకుని లివర్‌ను సరిగా లాగలేదేమోనన్న భయంతో తాగేవాడట. ఉరితీసినందుకు అతడికి 150 రూపాయల నగదు, ఓల్డ్ మంక్ రమ్ము సీసా ఇచ్చేవారు. ఉరితీసిన వెంటనే సీసాలోంచి కొద్దిగా రమ్మును చేతుల్లోకి తీసుకుని ఉరి కొయ్యపై చల్లేవాడు. అలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందని అతడు నమ్మేవాడు. ఈ విషయాలన్నీ సునీల్ గుప్త అనే రచయిత ‘బ్లాక్ వారెంట్’ పుస్తకంలో రాశారు. మల్లిక్ తన జీవితకాలంలో మొత్తం 25 మందిని ఉరితీశాడు. కల్లూ, ఫకీరా కల్లూ.. పవన్ తాత. ఫకీరా వేరే ఇంకొక తలారి. ఒకరు అందుబాటులో లేకుంటే ఇంకొకర్ని పిలిపించేవారు. కల్లూ మీరట్ జైల్లో, ఫకీరా ఫరీద్కోట్ (పంజాబ్) జైల్లో పనిచేసేవారు. ఇందిరాగాంధీ హత్యకేసులో దోషులైన సత్వంత్ సింగ్, కేహార్సింగ్లను ఉరితీసింది వీళ్లే. వీళ్లిద్దరూ ఎంతమందిని ఉరి తీశారన్న దానిపై కచ్చితమైన వివరాల్లేవు. మమ్మూసింగ్ మమ్మూసింగ్.. పవన్ తండ్రి. మమ్మూకి తన తండ్రి కల్లూ నుంచి ఈ విద్య అబ్బింది. ‘‘మా వాడు మంచి తలారి. అతడి సేవల్ని వినియోగించుకోండి’’ అని తీహార్, ఇంకా వేరే వేరే జైళ్ల అధికారులకు ఉత్తరాలు రాస్తుండేవాడు కల్లూ. అయితే మమ్మూ ప్రభుత్వ తలారి కాకపోవడంతో ఒక్కసారి కూడా తీహార్ జైల్లో ఉరితీసే అవకాశం రాలేదు. మీరట్ జైల్లో వచ్చింది. తన కెరీర్ మొత్తంలో 15 మందిని ఉరి తీశాడు మమ్మూ. -
నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషిగా ఉన్న పవన్ కుమార్ గుప్తాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో మైనర్‌ననీ, ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిందని ఆరోపిస్తూ పవన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పవన్ దాఖలు చేసిన పిటిషన్లో పరిశీలించాల్సిన అంశాలేమీ కనబడలేదని పేర్కొంది. గతంలో పవన్ దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లు హైకోర్టు, ట్రయల్ కోర్టులలో తిరస్కరణకు గురయ్యాయని గుర్తు చేసింది. వీటిపై వేసిన రివ్యూ పిటిషన్లను సైతం తిరస్కరించామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తగదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నామని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..పవన్ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ కోర్టులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్నారు. పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి మార్గం సుగమమైంది. మార్గదర్శకాలు ఇవ్వాలి: నిర్భయ తండ్రి ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఎన్నిసార్లు పిటిషన్లు దాఖలు చేయవచ్చో తెలుపుతూ మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్భయ తండ్రి సుప్రీంకోర్టును కోరారు. నిర్ణీత సమయంలో మాత్రమే పిటిషన్లు దాఖలు చేసేలా మార్గదర్శకాలు ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. వీటివల్ల నిర్ణీత సమయంలో దోషులకు శిక్ష పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. -
‘నిర్భయ’ దోషి ఆనాడు మైనర్ కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నాటి ‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిలో ఒకరు ఆ ఏడాది తాను మైనర్‌నంటూ చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దోషి పవన్ కుమార్ గుప్తా తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఘటన జరిగే నాటికి పవన్ కుమార్ మైనర్ అని, దీనికి సంబంధించి మరిన్ని నివేదికలు సమర్పించేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. అందుకు జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ అంగీకరించి కేసును జనవరి 24కు వాయిదా వేశారు. అయితే తర్వాత బాధితురాలి తల్లిదండ్రుల తరఫున వాదిస్తున్న లాయర్లు దీనిపై అభ్యంతరం లేవనెత్తారు. గతంలో ఇదే విషయంపై ట్రయల్‌కోర్టులో విచారణ జరిగిందని, ఘటన జరిగే నాటికి పవన్ కుమార్ మైనర్ కాదని తేలిందని వారు చెప్పారు. దీనిపై విచారించేందుకు లాయర్ ఏపీ సింగ్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. మధ్యాహ్నానికి వాయిదా వేసి, లాయర్‌కు సమాచారం ఇచ్చి వేచి చూసినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో కోర్టు ఎదుట హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ లాయర్‌కు రూ.25వేల జరిమానా విధించింది. -
చిరకాల స్వప్నం.. సివిల్స్‌లో విజేతను చేసింది
చెన్నై, తిరువళ్లూరు: సన్మాన గ్రహీత రమేష్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే నిశ్శబ్ద వాతావరణం...సుమారు 20 నిమిషాల ప్రసంగం.. మద్యలో ఒక యువకుడిని వేదిక మీదకు పిలిచి, నా తర్వాత సివిల్స్ విజేత ఇతనే అంటూ పరిచయం చేశాడు. రమేష్‌రెడ్డి చెప్పిన మాటలకు అక్కడున్న వారిలో పూర్తి నమ్మకం.. కారణం అతడు క్లాస్‌టాపర్ మాత్రమే కాదు అనుకున్నది సాధించే మొండి వాడు కూడా. అనాడు రమేష్‌రెడ్డి చెప్పిన మాటలను నిజం చేస్తూ సివిల్స్‌లో 179వ ర్యాంక్ సాధించారు ప్రకాశం జిల్లాకు చెందిన అల్లాటిపల్లి పవన్‌కుమార్‌రెడ్డి. నేపథ్యం అల్లాటిపల్లి పవన్‌కుమార్‌రెడ్డిది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు. తండ్రి నారాయణరెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి వెంటకరత్నమ్మ గహిణి. ఐదవ తరగతి వరకు నేరేడుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆ తర్వాత 10 వరకు ఒంగోలులోని నవోదయ పాఠశాలలో, ఇంటర్ రత్నం కళాశాలలో పూర్తి చేశారు. బాపట్ల వ్యవసాయ కళాళాలలో అగ్రికల్చర్ బీఎస్సీ జాయిన్ అయ్యారు. బీఎస్సీ పూర్తి కాగానే ఉత్తరాఖాండ్‌లోని జీపీ పంత్ కళాశాలలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత దొనకొండ ఏఈఓగా 2011 లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. సివిల్స్‌పై సమరం: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ సన్నాహాలు ప్రారంభించారు పవన్. 2012లో సివిల్స్ రాయడం మొదలుపెట్టి 2015 వరకు సివిల్స్‌పై సమరం సాగించారు. 2012లో ప్రిలిమినరీ, 2014, 2015లో మెయిన్స్ వరకు వచ్చి ఓడిపోయినా నిరాశ చెందలేదు. జీవితంలో ఓడిపోయానని అనిపించిన ప్రతిసారి స్టేజీపై రమేష్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. 2016లో ఢిల్లీ నుండి హైదరాబాదుకు తిరిగి వచ్చి స్నేహితులతో కలసి మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. గతంలో ఏర్పడిన వైపల్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. నాలుగవ ప్రయత్నంలో మెయిన్స్‌ను పూర్తి చేసి ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇంటర్వ్యూను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. చిరకాల స్వప్నం నిజమైన వేళ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లారు పవన్. 2016 మే10న పలితాలు విడుదలయ్యాయి. 179వ ర్యాంక్‌తో ఐపిఎస్‌కు సెలక్ట్ అయ్యారు. ఆరోజు సంఘటన ఆయన మాటల్లోనే ‘‘ ఫలితాల్లో నా పేరు చూడగానే అమ్మానాన్న అంటూ గట్టిగా అరిచేసా. పక్కరూమ్లో వున్న అమ్మానాన్నలు పరుగెత్తుకొచ్చి గట్టిగా కౌగలించుకున్నారు. ఓ అరగంట పాటు ఆనందభాష్పాలు. కష్టానికి తగిన ప్రతిçఫలం దక్కిందన్న సంతృప్తి. ఆరోజు రమేష్‌రెడ్డి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. సర్వీస్ రాకముందు, వచ్చిన తర్వాత ఆ ఒక్కక్షణం జీవితంలో ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవనేవారు ఆయన. అది నిజమే’’ అంటూ ఆ మధుర జ్ఞాపకాలను సాక్షికి వివరించారు పవన్. తెలుగు సాహిత్యాభిలాషి పవన్‌కుమార్‌రెడ్డికి తన విధులు ఎంతో ముఖ్యమో అంతకంటే తెలుగు సాహిత్యంపైన మక్కువ. సమయం దొరికితే చాలు పుస్తకాలతో సావాసం చేస్తారు. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతోనే సివిల్స్ మెయిన్స్‌కు తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. కుక్కపిల్ల..సబ్బుబిల్ల,.. కాదేదీ కవితకు అనర్హం అంటూ శ్రీశ్రీ చెప్పిన మాటల స్ఫూర్తితో ఇప్పటి వరకు 30 పైగా కవిత్వాలు కూడా రాశారు. తెలుగు మీడియం విద్యార్థులకు సివిల్స్‌పై ఉన్న భయాన్ని పోగట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు పవన్. స్నేహితులతో కలిసి తెలుగులో సివిల్స్ మెటీరియల్ తయారు చేస్తున్నారు. మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి పొన్నేరీ ఏఎస్పీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మత్య్సకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపాళయవనం పొన్నేరి తదితర ప్రాంతాల్లో 35 మత్సకార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ తరచూ ఘర్షణలు, హత్యలు, దాడులతో నిత్యం రణరంగంగా ఉండేవి. ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కుమార్ అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి అందరి వద్ద ప్రశంసలు కూడా అందుకున్నారు. ప‘వన్’ మ్యాన్ షో: సివిల్స్‌లో విజయం సాధించాక ఎన్పీఏలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని పొన్నేరీ అసిస్టెంట్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. రౌడీలకు షెల్టర్‌గా వున్న పొన్నేరీలో శాంతిభద్రతల అదుపు కోసం అల్లరిమూకలను జల్లెడపట్టారు. సుమారు 25 మంది రౌడీలను అరెస్టు చేశారు.. 10 మందిపై గూండాచట్టం ప్రయోగించారు. ఎర్రచందనం, రేషన్‌బియ్యం, గంజా విక్రయంపై ఉక్కుపాదం మోపారు. 300 పైగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాపిక్‌ను నియంత్రించి శభాష్ అనిపించుకున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక మాఫియాను నెలరోజుల్లోనే అణచివేసి అక్రమార్కులకు సింహస్వప్నంలా మారారు. ఎంతలా అంటే ఆయన సెలవు పెట్టి రెండు రోజులు ఊరికి వెళితే.. బదిలీపై వెళ్లిపోయాడని ఇసుక మాఫియా తమకు అడ్డు తొలగిందని టపాసులు కాల్చేంతగా. మొత్తానికి అక్రమార్కులకు తెలుగోడి సత్తాను చూపించారు పవన్. వేదిక : బాపట్లలోని వ్యవసాయ కళాశాల కార్యక్రమం : సివిల్స్‌లో విజయం సాధించిన కళాశాల పూర్వ విద్యార్థి ఆవుల రమేష్‌రెడ్డికి సన్మానం.. -
యాంకర్ తేజస్విని ఆత్మహత్య..
కంకిపాడు (పెనమలూరు) : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మట్టపల్లి పవన్‌కుమార్, తేజస్విని (25) ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిపించారు. వీరికి ఒక పాప. కొద్ది కాలంగా ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. పవన్ కుమార్ ఉయ్యూరులోని బజాజ్ రిలయన్స్‌లో పని చేస్తున్నాడు. తేజస్విని విజయవాడలోని ఓ చానల్లో న్యూస్ రీడర్‌గా పని చేశారు. ఇటీవల పవన్‌కుమార్ షిర్డీ వెళ్లాడు. శనివారం సాయంత్రం తేజస్వినికి, అత్త అన్నపూర్ణాదేవికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న తేజస్విని సాయంత్రం అయినా తీయలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి కిటికీలో నుంచి చూడగా గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించారు. తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లిన పోలీసులు తేజస్విని మృతి చెందినట్లు నిర్ధారించుకుని వివరాలు సేకరించారు. తేజస్విని స్నేహితురాలి ద్వారా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అర్థరాత్రి సమయంలో వారు ఈడుపుగల్లు చేరుకున్నారు. వారి సమక్షంలో తేజస్విని మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ కె. శివాజీ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. 174వ సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్ళి ఇష్టం లేదని.. ఉరేసుకుంది..
పెద్దలు తలపెట్టిన పెళ్లి ఇష్టం లేకపోవటంతో ఓ యువతి ఉరి వేసుకుని తనువు చాలించింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహమ్మదీయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ జిలానీ కూతురు జాస్మిన్(19) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. అయితే, అపరిచితులైన ఇద్దరు యువకులు జాస్మిన్ ఉరి వేసుకుని చనిపోయిందంటూ కేకలు వేయటంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. కాగా, జాస్మిన్ ఉరి వేసుకునే ముందు తన స్నేహితులకు ఫోన్ చేసింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, అందుకే చని పోవాలనుకుంటున్నానని వారితో అంది. అప్రమత్తమైన స్నేహితులు ఇంటికి చేరుకునే సరికే ఆమె చనిపోయి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువతి సెల్‌ఫోన్ పరిశీలించారు. స్నేహితులను ప్రశ్నించి, కాల్‌డేటా చూడగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో దెబ్బలు తిన్న ఇద్దరు యువకులను బంధ విముక్తులను చేశారు. అనవసరంగా చేయిచేసుకున్నందుకు వారికి క్షమాపణ చెప్పారు. -
సమంత 'యు టర్న్' తీసుకుంటుందట
ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో అల్లరిపిల్లలా కనిపించిన సమంత, త్వరలో లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. ఇన్నాళ్లు చేసిన సినిమాలతో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ వచ్చినా, నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మాత్రం రాలేదు. అందుకే తానే స్వయంగా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను నిర్మించాలనుకుంటోంది. అయితే కొత్త కథతో రిస్క్ చేసేకన్నా ఇప్పటికే సక్సెస్ అయిన సినిమా అయితే బెటర్ అని నిర్ణయించుకుంది. అందుకే కన్నడgలో సక్సెస్ సాధించిన 'యు టర్న్' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది సమంత. ఇటీవల రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీ శాండల్‌వుడ్‌లో సంఛలన విజయం సాధించింది. ఓ యు టర్న్ దగ్గర వరుసగా మరణాలు సంభవిస్తుండటం వెనుక మిస్టరీని ఛేదించే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల నాగచైతన్యతో కలిసి ఈ సినిమా చూసిన సమంత త్వరలోనే రీమేక్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లనుంది. కన్నడలో లూసియా ఫేం పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ నటించలేదు. అయినా మౌత్ టాక్‌తో మంచి వసూళ్లను సాధిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న యు టర్న్ సినిమా రీమేక్‌కు సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఈసీఐఎల్ ఉద్యోగి భార్య ఆత్మహత్య
ఈసీఐఎల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పవన్‌కుమార్ ఈసీఐల్ ఉద్యోగం చేస్తూ కుషాయిగూడ డీఐ కాలనీలో భార్య శ్వేతాశర్మతో కలసి నివాసం ఉంటున్నారు. కాగా, పవన్‌కమార్, అతని భార్య శ్వేతాశర్మ(27) మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్వేతాశర్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా సోమవారం ఉదయం గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమ్మకు ప్రేమతో....
బెంగళూరు: కరవు కాటకాలతో అల్లాడిపోతున్న ఈ దేశంలో గుక్కెడు మంచినీళ్ల కోసం మన తల్లులు, చెల్లెళ్లు బిందెలు భుజానెత్తుకొని కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కాలినడకన వెళ్లి రావాల్సి వస్తున్న విషయం తెల్సిందే. ఆ మధ్య ఓ చెల్లెలు మహారాష్ట్రలో నీళ్ల కోసం ఎర్రటి ఎండలో వెళ్లి గుండెపోటుతో మరణించిన విషాదాంతం కూడా కదిలించింది. తాజాగా కర్ణాటకలోని సెట్టిసార గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే 17 ఏళ్ల యువకుడు అందరి తల్లులలాగే తన తల్లి నీళ్ల కోసం ఎంతోదూరం వెళ్లి కష్టపడడం చూసి కదలిపోయాడు. ఎలాగైనా తన తల్లికి ఈ తిప్పలు తప్పించాలనుకున్నాడు. ఇంటి వెనక పెరట్లో బావిని తవ్విస్తే బాగుంటుందని భావించాడు. అందుకు ఇంటి ఆర్థిక స్థోమత సరిపోదు. తల్లి ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో, తండ్రి వంటవాడిగా పనిచేస్తున్నా వారికొచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతోంది. మరి బావిని తవ్వడం ఎలా? అని పవన్ కుమార్ ఆలోచించాడు. బీహార్‌లో దశరథ్ రామ్ మాంఝీ అనే దళితుడు గ్రామం రోడ్డు కోసం 22 ఏళ్లపాడు ఓ కొండను తవ్వి రోడ్డేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అంతే, తన ఇంట్లో బావిని తానే తవ్వాలనుకున్నాడు. ఫిబ్రవరి 26వ తేదీన పవన్ కుమార్ తమ ఇంటి వెనక పెరట్లో బావిని తవ్వడం ప్రారంభించారు. రేయనక, పగలనక అవిశ్రాంతంగా తవ్వుతూ వెళ్లగా అదష్టవశాత్తు 53 అడుగుల వద్దనే బావిలో నీరు పడింది. మరో రెండడుగులు బావిని తవ్వి పని ముగించాడు. మధ్యలో పీయూ పరీక్షల కోసం పది రోజుల పాటు బావి తవ్వక పనులను పక్కన పెట్టాడు. మొత్తంగా 45 రోజులు పనిచేసి బావిని తవ్వానని, తన తల్లికి మంచినీళ్ల కష్టాలను తొలగించినందుకు తనకెంతో ఆనందంగా ఉందని తనను కలసుకున్న మీడియాతో పవన్ కుమార్ వ్యాఖ్యానించాడు. -
నకిలీ ఐడీ కార్డుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్
మంచిర్యాల: నకిలీ ఐడీ కార్డుతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీకార్డుతో పవన్‌కుమార్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేవాడు. స్టాఫ్ అని చెబుతూ కండక్టర్లను నమ్మించేవాడు. అయితే సోమవారం మంచిర్యాలలో స్పెషల్ స్క్వాడ్ అధికారులు కార్డును తనిఖీచేసి నకిలీదని గుర్తించారు. ఆర్టీసీ అధికారులు నిందితుడిని మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
నైజీరియాలో కిడ్నాప్ కథ సుఖాంతం
♦ కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా ♦ బయటపడిన పవన్‌కుమార్ సాక్షి, గుంటూరు: నైజీరియాలో అపహరణకు గురైన అయిశెట్టి వెంకట పవన్‌కుమార్ ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో రెండ్రోజులుగా భయాందోళనలో ఉన్న పవన్‌కుమార్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్‌కుమార్ ఈనెల 20న కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం అందిన విషయం విదితమే. పవన్‌కుమార్‌తోపాటు కిడ్నాప్‌నకు గురైన ఇద్దరు వ్యక్తులను వదిలేసిన కిడ్నాపర్లు.. పవన్‌కుమార్‌ను మాత్రం శుక్రవారం అర్ధరాత్రి వరకూ వదలకపోవడంతో పవన్ భార్య లక్ష్మీఅన్నపూర్ణ, తల్లి వెంకటరత్నం తీవ్ర ఆందోళన చెందారు. శుక్రవారం పవన్‌కుమార్ తల్లి వెంకటరత్నం పడిన ఆవేదన వర్ణనాతీతమైంది. కిడ్నాపర్లు మనసు మార్చుకుని ఎటువంటి డిమాండ్లు పెట్టకుండానే పవన్‌కుమార్‌ను శనివారం తెల్లవారుజామున సురక్షితంగా వదిలేశారు. కిడ్నాపర్ల చెర నుంచి పవన్‌కుమార్ బయటపడ్డాడన్న వార్త తెలుసుకున్న కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. మిఠాయిలు పంచుకుని ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలు రాల్చారు. తన బిడ్డ కిడ్నాపర్ల చెర నుంచి బయటపడడానికి సహకరించిన వారందరికీ పవన్‌కుమార్ తల్లి వెంకటరత్నం కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ రాత్రి ఏం జరిగింది..?
► నరసాపురంలో యువకుడి అనుమానాస్పద మృతి ► డబ్బు కోసం వదినకు మరిది వేధింపులు ► తెల్లవారే సరికి ఉరికి వేలాడిన నిందితుడు ► అనుమానాలకు బలం చేకూరుస్తున్న గాయాలు అనంతపురం: పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం తెల్లవారుజామున కలకలం రేగింది. గ్రామానికి చెందిన పవన్‌కుమార్(28) అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడన్న సమాచారం క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది. అప్పుడప్పుడే నిద్ర నుంచి మేల్కొంటున్న గ్రామస్తులు ఏం జరిగిందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. మద్యానికి బానిసై... ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసే పవన్‌కుమార్ అన్న ఓబులేసు, వదిన ఎరుకలమ్మతో కలసి జీవించేవాడు. ఏడాది కిందట అనారోగ్యంతో అన్న చనిపోయినా వదినతో కలసే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసయ్యాడు. మందు కోసం తెలిసిన వారి దగ్గర చిల్లర అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు వదినను వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు డబ్బుల కోసం వదినతో గొడవకు దిగాడు. అంతటితో ఆగక ఆమెపై చేయి చేసుకున్నాడు. పుట్టింటోళ్లకు విషయం తెలిపి.. మరిది పవన్‌కుమార్ చేతిలో దెబ్బలు తిన్న ఎరుకలమ్మ తన పరిస్థితిని తండ్రితో పాటు అన్నలకు ఫోన్లో తెలిపి విలపించింది. అక్కడి నుంచి వారు బైక్‌లో వచ్చి రాత్రికి రాత్రే పవన్‌తో గొడవపెట్టుకున్నారు. ఆ తరువాత ఎరుకలమ్మను పొరుగింట్లో ఉంచి వెళ్లిపోయారు. తెల్లారేసరికి ఉరికి వేలాడిన పవన్ ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో గానీ తెల్లారేసరికి ఇంట్లోనే ఫ్యాన్‌కు పవన్‌కుమార్ ఉరి వేసు కున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ శ్రీహర్ష తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకున్నారు. మృతుని తల, వీపు, కాళ్లపై గాయాలుండడాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది. పోలీ సులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజనిజాలు వెల్లడవుతాయని గ్రామస్తులు అంటున్నారు. మృతుని వదిన ఎరుకలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
జగిత్యాల రూరల్(కరీంనగర్): క్వారీలో పనిచేస్తున్న యువకుడు లారీ డ్రైవర్ అజాగ్రత్తకు బలయ్యాడు. లారీలోని లోడ్ దించిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనియడానికి బదులు ఒక్కసారిగి వెనక్కి రావడంతో.. అక్కడే నిల్చొని ఉన్న యువకుడు లారీ వెనక చక్రాల కింద పడి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం అర్పపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలోని జోగుల పవన్ కుమార్(18) ఇటుక భట్టీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు ఉదయాన్నే లారీ నుంచి బూడిద లోడ్ దించాక అక్కడే నిల్చొని ఉన్న లావన్ కుమార్‌ను ముందుకు వెళ్లాల్సిన లారీ వెనక్కి వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కిందపడి మృతిచెందాడు. -
చిన్నారి ‘శ్రీమంతుడు’
-
చిన్నారి ‘శ్రీమంతుడు’
⇒ మృత్యు ముఖంలోనూ ఊరి బాగు కోసం ⇒తపన.. ‘శ్రీమంతుడే’ స్ఫూర్తి ⇒పోలీసుల సహకారంతో బైక్‌పై షికారు చేయాలనే ⇒తన కోరికను నెరవేర్చుకున్న బాలుడు ⇒బ్యాటరీ బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై షికారు హైదరాబాద్: శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబులాగా తన ఊరి బాగు కోసం కృషి చేస్తానంటున్నాడు మృత్యువుకు చేరువలో ఉన్న ఓ చిన్నారి. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఈ బాలుడు.. బైక్‌పై షికారు చేయాలనేది తన కోరికగా చెప్పాడు. ఈ విషయం మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆ మేరకు సోమవారం ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ఎర్రగుంట్లకు చెందిన చాకిబండ పవన్‌కుమార్ (7) అక్కడే శ్రీ చైతన్య స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్లో తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు రామాంజనేయులు, అంజలితో కలసి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షల అనంతరం పవన్‌కు బ్లడ్ కేన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడిని ఎంఎన్జీ కేన్సర్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మూడు నెలల కిందట అక్కడి వచ్చిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులకు తనకు బైక్ నడపాలని ఉందని పవన్ చెప్పాడు. ఈ విషయాన్ని వారు ట్రాఫిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు నుంచి బ్యాటరీ బైక్‌పై పవన్ చక్కర్లు కొట్టాడు. ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్. చౌహాన్, అదనపు కమిషనర్ పాపయ్య, పంజగుట్ట ఏసీపీ మాసుం బాషా, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఉమా మహేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ట్రాఫిక్‌ను నియంత్రించి బాలుడి కోరిక తీర్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తనకు సీబీఐ ఆఫీసర్ కావాలని ఉందని, సినీ నటుడు మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు హర్షగా.. ఊరి బాగు కోసం కృషి చేసినట్లు తాను కూడా తన గ్రామం అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపాడు. -
స్నేహితురాలితో అసభ్య ప్రవర్తన
ఎంబీఏ విద్యార్థి అరెస్టు బంజారాహిల్స్: తాగిన మైకంలో స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎంబీఏ విద్యార్థి కటకటాల పాలయ్యాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రహ్మత్‌నగర్ నివాసి పవన్‌కుమార్ (23)ఎంబీఏ చదువుతున్నాడు. బోనాల సంద ర్భంగా ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న పవన్ సోమవారం తె ల్లవారుజామున 4 గంటలకు శాలివాహననగర్‌లో నివసించే తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
విజయవాడ టూ ఒంగోలు.. వయా గుంటూరు
ఒంగోలు క్రైం : ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఇద్దరిని ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ పి.జాషువా మంగళవారం తన కార్యాలయంలో వన్‌టౌన్ సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్సై ఎస్కే నాయబ్స్రూల్తో కలిసి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఒంగోలు గంటాపాలేనికి చెందిన పాండ్రంటి గిరిబాబు స్థానిక గాంధీరోడ్డులో బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆయన్ను హత్య చేసేందుకు విజయవాడకు చెందిన అల్లు మురళీ, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన కూనంరెడ్డి పవన్‌కుమార్‌లు పథకం రచించారు. మురళీ కూడా గిరిబాబుతో పాటు బంగారం పని చేస్తూ ఉండేవాడు. ఈ వృత్తి వల్లే ఇద్దరికీ పరిచయమైంది. ఒంగోలుకు చెందిన పద్మ అనే యువతిని మురళీకిచ్చి గిరిబాబు వివాహం జరిపించాడు. ఈ పరిచయంతో విజయవాడ వెళ్లినప్పుడల్లా గిరిబాబు తరచూ మురళీ ఇంటికి వెళ్లేవాడు. అక్కడ ఆయన భార్య పద్మతో చనువుగా ఉండేవాడు. ఇది నచ్చని మురళీ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గిరిబాబును హత్య చేయించేందుకు డి గ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కూనంరెడ్డి పవన్‌కుమార్‌తో రూ. 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా తొలివిడతగా రూ. 30 వేలు అడ్వాన్సు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మురళీ, గిరిబాబు కొంతకాలం విడిపోయి ఆరు నెలల కిందట తిరిగి దగ్గరయ్యారు. ఎలాగైనా గిరిబాబును మట్టుబెట్టాలని మురళీ మళ్లీ నిర్ణయించుకున్నాడు. బంగారం పనిలో వాడే సైనైడ్ ఇంజెక్షన్ ఎక్కించి అంతమొందించాలనుకున్నాడు. అతడు గమనిస్తాడేమోనని అనుమానించి టూత్‌పేస్ట్‌లో సైనైడ్ ఎక్కించాడు. పేస్టు రంగు మారటంతో దానితో నోరు శుభ్రం చేసుకోకుండా గిరిబాబు పక్కనబెట్టాడు. అంతటితో వారి పథకం బెడిసి కొట్టింది. ఇదంతా పాత కథ.. ఇదీ.. తాజాగా జరిగింది పవన్‌కుమార్ సోమవారం ఒంగోలు వచ్చి స్థానిక 60 అడుగుల రోడ్డులోని సాయి లాడ్జిలో మకాం వేశాడు. గంటాపాలెం గిరిబాబు ఇంటి సమీపంలో రెండుమూడు సార్లు అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో అక్కడి బడ్డీకొట్టు నిర్వాహకునికి అనుమానం వచ్చిచి గిరిబాబుకు సమాచారం అందించాడు. ఆయన వెంటనే వన్‌టౌన్ ఎస్సై ఎస్కే నాయబ్స్రూల్‌కు ఫిర్యాదు చేశాడు. ఎస్సై తన సిబ్బందితో రంగంలోకి దిగి పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని మురళీని కూడా ఎస్సై ఆధ్వర్యంలోని బృందం మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకొని ఒంగోలు తెచ్చింది. నిందితులను అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు. వారి నుంచి సైనైడ్ ప్యాకెట్, సిరంజి, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన వన్‌టౌన్ పోలీసులను డీఎస్పీ జాషువా అభినందించారు. -
మా అబ్బాయికి నటనపై మక్కువ : సుమ
నటుడు రాజీవ్ కనకాల, బుల్లితెర వ్యాఖ్యాత్రి సుమ తనయుడు రోషన్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘అనంతమ్’. పార్ధసారథి, వందిత నటిస్తున్న ఈ చిత్రానికి రమణలోక్‌వర్మ దర్శకుడు. వి.శ్రవణ్‌కుమార్, పవన్‌కుమార్ నిర్మాతలు. సాకేత్‌సాయిరామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. పడిన కష్టానికి తగు ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉందని రాజీవ్ కనకాల ఆశాభావం వెలిబుచ్చారు. సుమ మాట్లాడుతూ -‘‘చిన్నప్పట్నుంచీ మా అబ్బాయికి నటనపై మక్కువ. రాజీవ్ ప్రోత్సహిస్తున్నా, చదువు దెబ్బతింటుందని నేనే ఆపాను. ఏడాది క్రితం రమణలోక్‌వర్మ చెప్పిన కథ మాకు బాగా నచ్చి ఇద్దరం పచ్చజెండా ఊపేశాం. ఈ సినిమాకు పనిచేసిన అందరితో పాటు, మా అబ్బాయిక్కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు సునీల్‌కుమార్‌రెడ్డి, దేవీ ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రామరాజు తదితరులు మాట్లాడారు. -
ఎంసెట్ - 2014 టాపర్ల మనోగతాలు
నా లక్ష్యం.. సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపనకాలేజీలో ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే పూర్తిచేయడం, చదివినంతసేపూ ఏకాగ్రతతో చదవడం.. తన విజయానికి కారణమంటున్నాడు ఎంసెట్-2014 ఇంజనీరింగ్ మొదటి ర్యాంకర్ నందిగం పవన్ కుమార్. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో ఆ ఆశను నెరవేర్చుకోలేని అమ్మానాన్న ప్రోత్సాహం విజయశిఖరాలను చేర్చిందంటూ తన అంతరంగాన్ని ‘భవిత’తో పంచుకున్నారు... ఎంసెట్ ఇంజనీరింగ్ టాపర్ పరీక్ష రాయడానికి ముందు ఏ రోజూ టాప్ ర్యాంకు వస్తుందని అనుకోలేదు. అయితే పరీక్ష తర్వాత కీ చూసుకున్నాను.. టాప్ ర్యాంక్ తప్పకుండా నాకే వస్తుందని అనుకున్నా. ఏకంగా మొదటి ర్యాంకుతో విజయాన్ని అందుకోవడం చాలా ఆనందం కలిగిస్తోంది. ఫిజిక్స్‌లో రెండు మార్కులు తగ్గటం వల్ల స్కోర్ 158 దగ్గర ఆగింది. ఎప్పటికప్పుడు నన్ను గమనిస్తూ, పొరపాట్లను సరిదిద్దుతూ ప్రోత్సహించిన అమ్మానాన్నకే ఈ విజయం దక్కుతుంది. మొదటి ర్యాంకు సాధించే దిశగా నాలో స్ఫూర్తి నింపింది మాత్రం గతేడాది జేఈఈ టాపర్, నా సీనియర్ అయిన సందీప్‌రెడ్డి. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వచ్చే అవకాశముంది. అదే జరిగితే ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో చేరుతా. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసి, కొందరికి ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం. వ్యక్తిగతం: మా నివాసం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ. అమ్మ దీప గృహిణి. నాన్న నారాయణరావు, ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చెల్లి కావ్య ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఆరో తరగతి వరకు సెయింట్ మేరీస్ హైస్కూల్లో చదివాను. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు చైతన్య టెక్నో స్కూల్లో చదివాను. ఇంటర్మీడియెట్ శార్వాణి కాలేజీలో చదివా. మొదట్నుంచీ బాగానే చదివేవాణ్ని. కేవీపీవై స్కాలర్షిప్ సాధించడం, ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో అవార్డు తెచ్చుకోవడం నా అకడమిక్ జీవితంలో గొప్ప ఘటనలు. రోజూ క్రికెట్.. వారానికో సినిమా: మంచి ర్యాంకు సాధించాలంటే 24 గంటలూ పుస్తకాలతో కుస్తీపట్టాల్సిన అవసరం లేదు. ఓ ప్రణాళికా ప్రకారం చదివితే చాలు! ఇంటర్ మొదటి ఏడాదిలో చేరినప్పటి నుంచి ఎప్పటి సిలబస్‌ను అప్పుడే పూర్తిచేసేవాణ్ని. నాకు ఇష్టమైన సబ్జెక్టు కెమిస్ట్రీకి అధిక సమయం కేటాయించాను. మానసిక ప్రశాంతత కోసం రోజూ కొంత సమయం క్రికెట్ ఆడేవాణ్ని. వారానికో సినిమా చూసేవాణ్ని. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండేవాణ్ని. ఇంటర్‌కోసం రెండు వారాలే: ఇంటర్ సెకండియర్‌లో పూర్తి సమయం ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కే కేటాయించాను. ఇంటర్ బోర్డు పరీక్షలకు రెండు వారాల ముందు మాత్రమే చదివాను. కాలేజీ క్యాంపస్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు టీచింగ్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉండేవారు. సబ్జెక్టుకు సంబంధించి ఎప్పుడు ఏ సందేహమొచ్చినా, వెంటనే నివృత్తి చేసేవారు. దీంతో గ్రాండ్ టెస్ట్‌లో మంచి స్కోర్ వస్తుండేది. కెమిస్ట్రీకి రోజులో ఎక్కువ సమయం కేటాయిస్తూ, ఫిజిక్స్ రెండు గంటలు చదివాను. మ్యాథమెటిక్స్ సమస్యల్ని రోజూ ప్రాక్టీస్ చేసేవాణ్ని. ఇలా ప్రణాళిక ప్రకారం చదవడం వల్ల అన్ని సబ్జెక్టులపైనా పట్టు చిక్కింది. ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి ఎలా వచ్చినా, సమాధానం రాసే సామర్థ్యం సొంతమైంది. పాఠ్య పుస్తకాలు ప్రధానం: ఇంటర్ ఆధారంగా జరిగే ఏ పరీక్షలో అయినా ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకాల నుంచే ఇవ్వాలి. అందుకే మొదట ఆ పుస్తకాలను ఆసాంతం చదవాలి. బట్టీపట్టడం కాకుండా అర్థం చేసుకుంటూ, ఏకాగ్రతతో చదవాలి. మ్యాథమెటిక్స్‌కు ప్రాక్టీస్ ముఖ్యం కాబట్టి ఎక్కువ సమయం కేటాయించాలి. మన ఆలోచనలే మనకు బలం. ‘‘నేను సాధించగలను’’ అనే సానుకూల దృక్పథం ఉంటే విజయం మనదే. అన్నిటికీ మించి నాకు మంచి ర్యాంకు వస్తుందో.. లేదో? అని ఆందోళన చెందుతూ, ఒత్తిడి పెంచుకోకూడదు. ర్యాంకు గురించి ఆలోచించకుండా నిజాయితీగా కష్టపడితే సక్సెస్ సొంతమవుతుంది. పర్సనల్ ప్రొఫైల్: పదోతరగతి: 9.7 జీపీఏ. ఇంటర్మీడియెట్: 980 మార్కులు. ఎంసెట్ మార్కులు: 158/160 కంబైన్డ్స్కోరు: 99.02 నా లక్ష్యం.. న్యూరాలజిస్టు! ఎంసెట్ మెడిసిన్ టాపర్ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో టాప్ 5లో ఉంటాననుకున్నా. అయితే ఏకంగా మొదటి ర్యాంకు రావడంతో చాలా ఆనందంగా ఉంది. ప్రతి 15 రోజులకోసారి కాలేజీకి వచ్చి, నా చదువు గురించి తెలుసుకొని, ఆపై తప్పులు సరిదిద్ది ప్రోత్సహించిన అమ్మానాన్నకే ఈ విజయం చెందుతుంది. వ్యక్తిగతం: మాది ప్రకాశం జిల్లా మార్కాపూరం. నాన్న డాక్టర్ గుర్రం మోహన్‌రామ్, ఆర్థోపెడిక్. అమ్మ డాక్టర్ రాధిక, ఆప్తమాలజిస్టు. ఇద్దరూ మార్కాపురంలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ తీసుకొని, సాంకేతిక విద్య దిశగా వెళ్లాలనుకున్నాను. కానీ, అభిప్రాయం మారి, బైపీసీలో చేరి.. ఇప్పుడు మంచి విజయం సాధించాను. ఎప్పుడూ ఉత్తమ విద్యార్థినే: ఒకటో తరగతి నుంచి ఎప్పుడూ ఉత్తమ విద్యార్థిగానే ఉండేవాణ్ని. తరగతిలో టాప్ ర్యాంకు వచ్చేది. 1-4వ తరగతి వరకు లయోలా హైస్కూల్, ఐదో తరగతి సాయిబాబా స్కూల్లో చదివాను. 6-10 వ తరగతి వరకు ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ (సీబీఎస్ఈ సిలబస్)లో చదివాను. ఇంటర్మీడియట్ శ్రీచైతన్య కాలేజీలో పూర్తిచేశాను. ఎంసెట్‌లో ఫిజిక్స్‌లో బబ్లింగ్ తప్పిదం వల్ల ఒక మార్కు తగ్గింది. ఇంటర్‌కు నెలరోజులు: పేరున్న జాతీయ సంస్థలో వైద్య విద్యను అభ్యసించాలని ఉండేది. అదే లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగించాను. ఎంసెట్‌తో పాటు జిప్మిర్, ఏఎంసీ, సీఎంసీ, ఏఐపీఎంటీ పరీక్షలు రాశాను. ఇంటర్ బోర్డు పరీక్షలకు నెల రోజులు మాత్రమే చదివాను. రోజూ ఉదయం 6-12 గంటల వరకు తరగతులు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు స్టడీఅవర్స్. రెండేళ్లపాటు ఇలా చదవటం వల్ల రాసిన పరీక్షలన్నింటిలోనూ మంచి ర్యాంకు తెచ్చుకోగలిగా. ఇంటర్ అర్హతతో జరిగే ఏ పరీక్షలో అయినా అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. కాబట్టి ఎక్కడా సమస్యలు ఎదురుకాలేదు. వేర్వేరు పరీక్షలకు సిద్ధమవుతున్న భావన రాలేదు. మొదటి లక్ష్యం.. న్యూరాలజిస్టు: ఎంసెట్‌తో పాటు జాతీయస్థాయి వైద్య కోర్సుల ప్రవేశ పరీక్షలకు హాజరయ్యా. ఏఎంసీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. వెల్లూరు సీఎంసీకు రెండో దశ ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఏఐపీఎంటీలో ఆలిండియా 38వ ర్యాంకు వచ్చింది. అత్యున్నత సంస్థలో ఎంబీబీఎస్ పూర్తిచేయడం, ఆ తర్వాత న్యూరాలజిస్టు కావడం నా మొదటి లక్ష్యం. పరిశోధనలు చేసి, వైద్యునిగా సమాజానికి నా వంతు తోడ్పాటును అందించాలన్నది నా ఆశయం. సిలబస్‌ను అనుసరిస్తే చాలు: ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాలంటే మొదట చేయాల్సింది తరగతిలో టీచర్ చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినడం. ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే చదవడం పూర్తిచేయాలి. లేదంటే ఒత్తిడి పెరిగి, ప్రిపరేషన్ గాడి తప్పుతుంది. సిలబస్ కొండలా కనిపిస్తుంది. మెడిసిన్ ప్రవేశ పరీక్షలో చాలా పోటీ ఉంటుంది. అయితే కాస్త ఏకాగ్రతతో ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి ర్యాంకు తెచ్చుకోవచ్చు. ఇంటర్లో చేరిన మొదటి రోజు నుంచే ఏకాగ్రతతో ప్రతి సబ్జెక్టును క్షుణ్నంగా చదవడం అలవరచుకోవాలి. సిలబస్‌ను అర్థం చేసుకుంటూ, ప్రణాళిక ప్రకారం చదవాలి. కాలేజీలో ఇచ్చే మెటీరియల్‌ను విశ్లేషణాత్మకంగా చదవాలి. అకడెమిక్ ప్రొఫైల్: పదో తరగతి: 10 జీపీఏ. ఇంటర్మీడియెట్: 972 మార్కులు. ఎంసెట్ మార్కులు: 159/160. కంబైన్డ్స్కోరు: 99.45 -
కాదేదీ చోరీకి అనర్హం
విశ్రాంతి గదిలో సామగ్రితో ఉడాయిస్తున్న ప్రయాణికులు - మహిళా ప్రయాణికులు విశ్రమిస్తున్న చోటే చోరీలు అధికం - పాలుపోని అధికారులు - ఇతరుల తప్పులకు తాము బలవుతున్నామంటూ ఆవేదన సాక్షి, ముంబై: పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లోని విశ్రాంతి గదిలోనూ దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచిన సామగ్రి తరచూ చోరీకి గురవుతున్నాయి. దీనిని గత ఏడాది ఏప్రిల్‌లో అప్పటి రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ప్రారంభించారు. ఇక్కడ ప్రయాణికుల కోసం తువ్వాళ్లు, సబ్బులను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఇవి కూడా చోరీకి గురవుతున్నాయి. ఇందులో 12 గంటల పాటు ఉన్న వారి వద్ద నుంచి రూ.150, 24 గంటల పాటు ఉన్నవారి వద్ద నుంచి రూ.250 వసూలు చేస్తారు. ఇక్కడ 78 పడకలను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో 58 పడకలు పురుషుల కోసం, మిగతావాటిని మహిళల కోసం ఉంచారు. అయితే గత కొన్ని రోజులుగా ఇందులోని బల్బులు, ఇతర చిన్న చిన్న పరికరాలు చోరీకి గురవుతున్నాయి. విచిత్రమేమిటంటే మహిళల విశ్రాంతి గదిలోనే ఎక్కువ చోరీలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. చోరీల విషయమై భద్రతా సిబ్బంది అనేక పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. ప్రయాణికులు గది విడిచి వెళుతున్న సమయంలో దుప్పట్లు కూడా తీసుకెళ్తున్నట్లు గమనించిన సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ గదిని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు సామగ్రి చోరీకి గురవుతూనే ఉందని వారు పేర్కొన్నారు. ఇందులోకి వచ్చే ప్రతి ప్రయాణికుడి సామగ్రిని తనిఖీ చేయాలంటూ ఇటీవల సంబంధిత అధికారులు సిబ్బందికి సూచించారు. అయితే రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారని, అందువల్ల తనిఖీ సాధ్యం కావడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 20 దుప్పట్లు చోరీకి గురైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక అధికారులు చవకైన సామగ్రిని ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరో చోరీలకు పాల్పడుతున్నారని, అయితే అందుకు తాము బాధ్యత వహించాల్సి వస్తోందంటూ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
'సినిమా నచ్చితేనే డబ్బులివ్వండి'
సినిమా చూడాలంటే ముందుగానే టికెట్ కొనుక్కోవాలి. వందో రెండొందలో పెట్టి టికెట్ కొనుక్కుని చూసిన తర్వాత సినిమా నచ్చినా, నచ్చకపోయినా ఏమీ చేయలేం. కానీ, కన్నద దర్శకుడు పవన్ కుమార్ దీనికో పరిష్కారం చూపిస్తున్నారు. 'లూసియా' సినిమాతో తారాపథానికి వెళ్లిన ఈయన, కొత్త పద్ధతి సూచిస్తున్నారు. సినిమా నచ్చితేనే టికెట్ డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అక్కర్లేదని అంటున్నారు! మేకింగ్ ఆఫ్ లూసియా అనే డాక్యుమెంటరీని ముందు ఉచితంగా చూడొచ్చని, అది నచ్చితేనే దానికి డబ్బులు ఇవ్వాలని ఆయన తన ఫేస్బుక్ పేజీలో రాశాడు. ఈ ప్రయోగం ఫలిస్తే, సినిమాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నాడు. అప్పుడు సినిమాలు విడుదల చేయడానికి కూడా ప్రత్యామ్నాయ డిస్ట్రిబ్యూషన్ విధానాలు అవసరం అవుతాయన్నాడు. లూసియా సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈలోపు సిద్ధార్థ హీరోగా ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. -
నన్ను మారనివ్వండి ప్లీజ్!
*ఘరానా చోరీలు.. జల్సా జీవితం *చోరీ సొత్తులో కొంత పేదలకు పంపకం *ఆరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 110 నేరాలు *భూక్యానాయక్ నేరాల స్టైలే వేరు! *ఆటకట్టించిన కార్ఖానా పోలీసులు రాంగోపాల్‌పేట, న్యూస్‌లైన్: ఖరీదైన ప్రాంతాలే టార్గెట్.. చోరీ సొత్తులో కొంత బీదాబిక్కీకి పంపకం.. ఊరు దాటాలంటే ఫ్లైట్.. బస చేయాలంటే ఫైవ్‌స్టార్ హోటల్.. గజదొంగ భూక్యానాయక్ శైలి ఇది. అతని ఆటకట్టించిన కార్ఖానా పోలీసులు 85 తులాల బంగారు, రెండు కేజీల వెండి ఆభరణాలు, నగదు స్వాధీ నం చేసుకున్నారు. సోమవారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి వివరాలు వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో పంజా విసిరి... కృష్ణా జిల్లా ఎ.కొండూరుకి చెందిన భూక్యానాయక్ 2007 నుంచి చోరీలకు అలవాటుపడ్డాడు. హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు నేరాలు చేశాడు. పి.ఉమామహేశ్వరరావు, పి.సురేష్, ఎన్.సురేష్, ఎం.భాస్కర్ (చనిపోయాడు), కె.విజయకృష్ణతో ముఠాకట్టి ఆరేళ్లలో 110 కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లొచ్చాడు. ఇతనిపై పలు ఠాణాల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా... మేలో బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం కార్ఖానా ఠాణా పరిధిలో ఐదిళ్లలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నాడు. చోరీ సొత్తును చార్మినార్‌లో విక్రయించేందుకు సోమవారం సిటీకి వచ్చిన ఇతగాడు సికింద్రాబాద్‌లోని ఓ బస్టాప్ వద్ద వేచి ఉన్నాడు. సమాచారం అందుకున్న కార్ఖానా ఠాణా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వి.నాగయ్య బృందంతో దాడిచేసి అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి చోరీ సొత్తును కొన్న గుత్తికొండ పవన్కుమార్నూ పట్టుకున్నారు. పవన్ బీకాం (కంప్యూటర్స్) చదివాడు. భూక్యానాయక్ గురించి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిటికెలో చోరీ.. పగలూరాత్రి తేడా లేకుండా పంజా విసిరే భూక్యానాయక్కు ఖరీదైన ప్రాంతాల్లో నివసించే వారే టార్గెట్. తాను చేసిన చోరీలపై బాధితులు ఫిర్యాదు చేయడానికీ వెనుకాడే పరిస్థితి కల్పిస్తాడు. పట్టపగలు ఇంటి ముందు వాచ్మెన్ కాపలా ఉన్నా... కళ్లుగప్పి తాళం పగులగొట్టి ఊడ్చుకుపోతాడు. చోరీ సొత్తులోని కొంత భాగం యాచకులకు, రాత్రి వేళల్లో ఆస్పత్రుల వద్ద రోడ్డు పక్కనే నిద్రించే వారికి పంచుతాడు. పోలీసులకు దొరికినప్పుడు మాత్రం అప్పటికి ఏ సందర్భంలోనైనా తనను ఇబ్బంది పెట్టిన వాళ్లను ఇరికించడానికి యత్నిస్తాడు. నేరాల్లో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు చెప్పడం ద్వారా పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తాడు. బెయిల్‌పై వచ్చాక ‘నీ ఏరియాలో చోరీ చేస్తున్నా.. దమ్ముంటే కాచుకో’ అంటూ చాలెంజ్ చేయడం భూక్యా నైజం. 2010లో మచిలీపట్నం నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసు ఎస్కార్ట్కు మస్కా కొట్టి జీపులో నుంచి దూకి తప్పించుకున్నాడు. ‘రియల్’ ముసుగులో జల్సాలు చోరీల ద్వారా భారీ మొత్తం మూటగట్టాక పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కర్ణాటక, తమిళనాడు, గోవాకు విమానాల్లో చెక్కేస్తాడు. రియల్ఎస్టేట్ వ్యాపారినంటూ బిల్డప్ ఇచ్చి ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తాడు. చిన్న వస్తువు కొనాలన్నా పెద్ద షాపింగ్ మాల్‌కు వెళ్లాల్సిందే. ఎక్కడా నిలకడగా ఉండకుండా తరచూ సెల్‌ఫోన్, సిమ్‌కార్డు మారుస్తూ నిఘా నుంచి తప్పించుకుంటాడు. స్టార్‌హోటళ్లలో బస చేసినప్పుడు మాత్రమే రెడ్‌వైన్ తాగుతాడు. ఏడో తరగతి మాత్రమే చదివిన భూక్యా.. తనకు సహకరించేందుకు ఇద్దరు ముగ్గురు సన్నిహితులను తీసుకువెళ్తుంటాడు. డ్యాన్సర్ కూడా కావడంతో పబ్‌లకు వెళ్లి చిందేస్తాడు. సినీ పరిశ్రమలోనూ పలువురితో పరిచయాలు ఉన్నట్లు సమాచారం. కోస్తా జిల్లాల పోలీసుల తొలి టార్గెట్‌లో ఎప్పుడూ భూక్యానాయక్ ఉంటాడు. బెయిల్ పిటిషన్ వేయడానికి పోటీ భూక్యానాయక్ నిరంతరం కొందరు అడ్వకేట్లతో టచ్‌లో ఉంటాడు. పోలీసులకు చిక్కినప్పుడు బెయిల్ పిటిషన్ వేయడానికి వారు పోటీపడతారని తెలుస్తోంది. ఈ ఖర్చులకే భూక్యా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ఖర్చు చేసి ఉంటాడని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇతడి స్నేహితుల్లో కొందరు ప్రస్తుతం బాగా ‘స్థిరపడినట్లు’ సమాచారం. ఇతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నన్ను మారనివ్వండి ప్లీజ్! 'నేను దొంగతనాలు మాని సాధారణ జీవితం గడపాలనుకున్నా, పోలీసులు నన్నలా ఉండనివ్వట్లేదు. నా ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఉన్నతస్థాయిలో చూడాలని ఉంది. పోలీసుల తీరుతోనే ఇలా మళ్లీ మళ్లీ దొంగగా మారాల్ని వస్తోంది. పోలీసులు, మీడియా నేను మారేందుకు సహకరించాలి' అంటూ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో భూక్యా నాయక్ అన్నాడు.