పెళ్ళి ఇష్టం లేదని.. ఉరేసుకుంది.. | A young girl who was killed by thugs | Sakshi
Sakshi News home page

పెళ్ళి ఇష్టం లేదని.. ఉరేసుకుంది..

Jul 17 2016 6:39 PM | Updated on Aug 24 2018 2:36 PM

పెళ్ళి ఇష్టం లేదని.. ఉరేసుకుంది.. - Sakshi

పెళ్ళి ఇష్టం లేదని.. ఉరేసుకుంది..

పెద్దలు తలపెట్టిన పెళ్లి ఇష్టం లేకపోవటంతో ఓ యువతి ఉరి వేసుకుని తనువు చాలించింది.

పెద్దలు తలపెట్టిన పెళ్లి ఇష్టం లేకపోవటంతో ఓ యువతి ఉరి వేసుకుని తనువు చాలించింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహమ్మదీయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ జిలానీ కూతురు జాస్మిన్(19) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది.

 

అయితే, అపరిచితులైన ఇద్దరు యువకులు జాస్మిన్ ఉరి వేసుకుని చనిపోయిందంటూ కేకలు వేయటంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. కాగా, జాస్మిన్ ఉరి వేసుకునే ముందు తన స్నేహితులకు ఫోన్ చేసింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, అందుకే చని పోవాలనుకుంటున్నానని వారితో అంది. అప్రమత్తమైన స్నేహితులు ఇంటికి చేరుకునే సరికే ఆమె చనిపోయి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువతి సెల్‌ఫోన్ పరిశీలించారు. స్నేహితులను ప్రశ్నించి, కాల్‌డేటా చూడగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో దెబ్బలు తిన్న ఇద్దరు యువకులను బంధ విముక్తులను చేశారు. అనవసరంగా చేయిచేసుకున్నందుకు వారికి క్షమాపణ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement