Jasmeen Kaur Case: Ex-Lover May Get Life Sentence - Sakshi
Sakshi News home page

ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు

Published Thu, Jul 6 2023 3:05 PM | Last Updated on Thu, Jul 6 2023 3:18 PM

Jasmeen Kaur Case: Ex Lover May Get Life Sentence - Sakshi

నర్సింగ్‌ స్టూడెంట్‌ జాస్మిన్‌ అతన్ని ప్రేమించింది. కానీ.. 

క్రైమ్‌: దారుణ ఉదంతంలో ఎట్టకేలకు బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. భారత సంతతికి చెందిన యువతిని ఆమెను ప్రేమించిన వ్యక్తే అతికిరాతకంగా హత్య చేశాడు. అదీ బతికుండగానే కళ్లు, కాళ్లు చేతులు కట్టేసి మరీ పూడ్చిపెట్టి సజీవ సమాధి చేశాడు. తనను దూరం పెట్టిందనే కోపంతోనే ఆ ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్ట్రేలియా ఈ ఘోరం రెండేళ్ల కిందట చోటు చేసుకుంది. 

భారత్‌కు చెందిన జాస్మిన్‌ కౌర్‌(21) ఆస్ట్రేలియాలో నర్సింగ్‌ చదువుకునేందుకు వెళ్లింది. అక్కడే తారిక్‌జోత్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే.. తారిక్‌ ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె.. అతన్ని దూరం పెడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్నాడు.  అడిలైడ్‌లో ఆమె పని చేసే చోట నుంచే కిడ్నాప్‌ చేశాడు తారిక్‌. కారులో ఆమెను బంధించి.. నాలుగు గంటలపాటు ప్రయాణించి ఫ్లిండర్స్‌ రేంజ్స్‌ చేరుకున్నాడు. అక్కడే ఘోరానికి పాల్పడ్డాడు. 

ఆమె కళ్లకు గంతలు కట్టి.. కాళ్లు చేతుల్ని కేబుల్స్‌తో కట్టేసి.. సమాధి చేశాడు. మార్చి 2021లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆమె మిస్సింగ్‌ కేసు నమోదుకాగా.. కొన్ని నెలలకు ఆమె హత్యకు గురైందన్న విషయం బయటపడింది.  అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనే దోషిగా తేలింది. ఈ మేరకు బుధవారం వాదనలు విన్న స్థానిక కోర్టు.. అతనిది ప్రతీకారచర్యగా తేల్చడంతో పాటు జీవిత ఖైదు శిక్ష పడొచ్చని తేల్చి చెప్పింది. మనిషిలో మృగస్వభావం ఏమేర ఉంటుందనేది తారిక్‌ను చూసి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఇక..

తాను చేసిన పొరపాటల్లా.. తన కూతురిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపడమేనని, ఆ తర్వాత మళ్లీ తన కూతురిని కళ్లారా చూసుకోలేకపోయానని విలపిస్తోంది జాస్మిన్‌​కౌర్‌ తల్లి. వందసార్లు తిరస్కరించినా కూడా తన కూతురి వెంటపడడం తారిక్‌జోత్ సింగ్ ఆపలేదని.. అతని నేరానికి క్షమాపణే ఉండకూదని కోరుకుంటోందామె. జాస్మిన్‌ను ఎక్కడైతే ఆ ప్రేమోన్మాది పూడ్చిపెట్టి హత్య చేశాడో.. అక్కడే ఆమెకు సమాధి కట్టి ప్రార్థనల ద్వారా నివాళులర్పిస్తూ వస్తోంది ఆ కుటుంబం. 

ఇదీ చదవండి: గర్భం దాల్చిన ప్రియురాలు.. ప్రియుడి దాష్టీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement