Jasmine
-
దిగ్గజాలకు గడ్డుకాలం: భవిష్యత్తు అతడిదేనా!
సుదీర్ఘకాలంగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఇటలీకి ఈ ఏడాది రెండు టైటిల్స్ దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో విజేతగా నిలిచాడు. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టి కాంస్య పతకం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో జాస్మిన్ పావోలిని జోరు సాగిస్తుంటే... డబుల్స్‌లోనూ లెక్కకు మిక్కిలి జోడీలు టైటిల్స్‌తో సత్తా చాటుతున్నాయి. టెన్నిస్ కోర్టులో అడుగు పెడితే విజేతగా నిలవడమే లక్ష్యంగా ఇటలీ ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం లొరెంజోఈ ఏడాది అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో ఇటలీ ఆటగాళ్ల జోరు సాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ యానిక్ సినెర్ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకోవడంతోపాటు మరో నాలుగు ఏటీపీ టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఇక మహిళల సింగిల్స్‌లో జాస్మిన్ పావోలిని వింబుల్డన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ–ఆండ్రియా వవసోరి... మహిళల డబుల్స్‌లో సారా ఎరాని–జాస్మిన్ పావోలిని రన్నరప్‌గా నిలిచారు. అదే విధంగా.. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ–ఆండె వవసోరి రన్నరప్‌గా నిలిచారు. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సారా ఎరాని–వవసోరకి జోడీ చాంపియన్‌గా అవతరించింది. ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్‌లో సారా ఎరాని–జాస్మిన్ పావోలిని జంట స్వర్ణ పతకం గెలుచుకోగా... పురుషుల సింగిల్స్‌లో లొరెంజో ముసెట్టి కాంస్య పతకంతో మెరిశాడు. విశ్వక్రీడల పురుషుల సింగిల్స్‌లో వందేళ్ల తర్వాత ఇటలీకి ఇదే తొలి పతకం కావడం విశేషం. భవిష్యత్తు అతడిదేనా! సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవడంతో దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఇటలీ ప్లేయర్‌గా సినెర్ రికార్డుల్లోకి ఎక్కాడు. చివరిసారిగా 1976 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇటలీ నుంచి ఆండ్రియానో పనట్టా టైటిల్ గెలిచాడు. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గత కొంతకాలంగా నిలకడ సాగిస్తున్న 23 ఏళ్ల సినెర్ భవిష్యత్తు తనదే అని చెప్పకనే చెబుతున్నాడు. ఈ ఏడాది అతడు ఆడిన 60 మ్యాచ్‌ల్లో 55 విజయాలు సాధించాడంటే సినెర్ జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు... రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన సినెర్ ఈ ఏడాది ఓవరాల్‌గా ఆరు టైటిల్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకగా... స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ గాయాలతో సతమతమవుతున్నాడు. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ కూడా కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో సినెర్ ఇదే నిలకడ కొనసాగిస్తే... భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక మహిళల విభాగంలో జాస్మిన్ అనూహ్య ఆటతీరుతో దూసుకొస్తోంది. మంచి రోజులు ముందున్నాయి... దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరిగుతున్న తరుణంలో భవిష్యత్తు తమ ప్లేయర్లదే అని ఇటలీ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు ఏంజెలో బినాఘి అంటున్నారు. ‘కొత్త తరంలోకి అడుగు పెడుతున్నాం. అందుకు ఇటలీ సిద్ధంగా ఉంది. దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో అవకాశాలను వినియోగించుకుంటూ సత్తాచాటుతున్నాం. మహిళల విభాగంలోనూ మా పురోభివృద్ధి బాగుంది’ అని బినాఘి అన్నారు.ప్రస్తుతం పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ టాప్–50లో ఏడుగురు ఇటలీ ప్లేయర్లు ఉన్నారు. కేవలం సింగిల్స్‌లోనే కాకుండా... డబుల్స్‌లోనూ ఇటలీ ప్లేయర్లు నిలకడ సాగిస్తున్నారు. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ‘దాదాపు యాభై ఏళ్లుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తుంటే... ఈ సంవత్సరం సినెర్ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. ఇతర టోర్నీల్లోనూ ఇటలీ ప్లేయర్ల ప్రదర్శన బాగుంది. డేవిస్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాం. ఇదే జోరు సాగిస్తూ సొంతగడ్డపై పెద్ద టోరీ్నలో విజయం సాధించడమే తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నాం. విజయవంతంగా సాగుతున్న ఈ ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని బినాఘి పేర్కొన్నారు. ఏటీపీ ఫైనల్స్‌పై దృష్టి విదేశాల్లో వరస విజయాలు సాధిస్తున్న ఇటలీ ప్లేయర్లు... స్వదేశంలో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్న సినెర్ గాయం కారణంగా ఇటాలియన్ ఓపెన్ బరిలోకి దిగలేదు. 1976 ఇటాలియన్ ఓపెన్‌లో చివరిసారిగా స్థానిక ఆటగాడు పనట్టా పురుషుల సింగిల్స్ విజేతగా నిలవగా.. 1985లో మహిళల సింగిల్స్‌లో రఫ్పెల్లా రెగ్గీ టైటిల్ సాధించింది. అప్పటి నుంచి స్థానిక ఆటగాళ్లెవరూ ఇటాలియన్ ఓపెన్ గెలుచుకోలేదు. ఇకపై స్వదేశంలోనూ సత్తా చాటడంపై దృష్టి పెట్టనున్నట్లు బినాఘి తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో వరసగా నాలుగోసారి ఇటలీలో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ జరగనుంది. గత ఏడాది జొకోవిచ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన సినెర్ ఈసారి టైటిల్ సాధించాలని కసితో ఉన్నాడు. యూఎస్ ఓపెన్ ప్రారంభానికి ముందు డోపింగ్ వివాదంతో వార్తల్లోకి ఎక్కిన సినెర్ తన ఆటతీరుపై ఆ ప్రభావం పడలేదని నిరూపించుకున్నాడు. ఇటీవల యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ఇటలీలో ప్రతి పది మందిలో ఒకరు వీక్షించారని బినాఘి తెలిపారు. మౌలిక వసతుల కల్పన వల్లే నైపుణ్యం గల ఆటగాళ్లను వెలికి తీయగలిగామని ఆయన పేర్కొన్నారు. సీనియర్ స్థాయిలోనే కాకుండా... జూనియర్ ఈవెంట్స్‌లోనూ ఇటలీ ప్లేయర్లు హవా సాగిస్తున్నారు. ఈ ఏడాది జూనియర్ సర్క్యూట్లో ఇటలీ ప్లేయర్లు 10 టైటిట్స్ సాధించారు. చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
క్రెజికోవాకు కిరీటం
లండన్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సారి వింబుల్డన్ ఫైనల్ చేరిన ఇద్దరు ప్లేయర్ల మధ్య శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరులో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది. 1 గంటా 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మూడు సెట్ల సమరంలో 28 ఏళ్ల చెక్ ప్లేయర్ పైచేయి సాధించింది. 2021లో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్న క్రెజికోవా కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. వింబుల్డన్‌లో 31వ సీడ్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రెజికోవా చివరకు టైటిల్‌తో ముగించింది. ఫైనల్ పోరులో ఆరంభంలో జాస్మిన్‌పై ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 11 పాయింట్లలో 10 గెలుచుకొని ముందంజ వేసింది. ఆ తర్వాత డబుల్ బ్రేక్‌తో 5–1తో ఆధిక్యంలో నిలిచిన ఆమె సునాయాసంగా సెట్‌ను ముగించింది. ఆమె జోరు చూస్తే రెండో సెట్లోనే మ్యాచ్ గెలిచేస్తుందని అనిపించింది. అయితే విరామ సమయంలో పావొలిని ఆట మారింది. చక్కటి గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో దూసుకుపోయి 3–0తో నిలిచి ఇటలీ ప్లేయర్ ప్రత్యర్థి ని కోలుకోనీయకుండా సెట్‌ను ముగించింది. చివరి సెట్లో ఆట ఆసక్తికరంగా సాగింది. క్రెజికోవా 5–3 వద్ద ఉన్న దశలో పావొలిని గేమ్ గెలిచి కొంత పోటీనిచ్చినా...పదో గేమ్‌లో క్రెజికోవా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజేతగా అవతరించింది. క్రెజికోవా ఖాతాలో రెండు సింగిల్స్ టైటిల్స్‌తో పాటు 7 డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి. నేడు పురుషుల ఫైనల్ జొకోవిచ్ (సెర్బియా) గీ అల్కరాజ్ (స్పెయిన్) సా.గం.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
Wimbledon 2024: సరికొత్త చాంపియన్ క్రిచికోవా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన టెన్నిస్ ప్లేయర్ బార్బరా క్రిచికోవా వింబుల్డన్-2024 టైటిల్ సాధించింది.లండన్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో క్రిచికోవా.. ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిపై గెలుపొందింది. 6-2, 2-6, 6-4 తేడాతో జాస్మిన్ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిచికోవా.. వరల్డ్ సెవన్త్ ర్యాంకర్ జాస్మిన్‌కు చెమటలు పట్టించింది. అయితే, రెండో సెట్లో మాత్రం క్రిచికోవాను సమర్థవంతంగా ఎదుర్కొంది జాస్మిన్.ఈ క్రమంలో కీలకమైన మూడో సెట్లోనూ దూకుడుగా ఆడిన జాస్మిన్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలిగింది. కానీ.. తిరిగి కోలుకున్న క్రిచికోవా .. జాస్మిన్‌కు మరో అవకాశం ఇవ్వలేదు.కాగా 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ట్రోఫీ గెలిచింది. మరోవైపు.. 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియా టెక్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా వింబుల్డన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లోనూ ఆమెకు ఇలా చేదు అనుభవమే ఎదురైంది.The moment a dream became reality ✨#Wimbledon | @BKrejcikova pic.twitter.com/38xPz9pCin— Wimbledon (@Wimbledon) July 13, 2024Showing off the Venus Rosewater Dish to the adoring #Wimbledon fans 🤩 pic.twitter.com/GmMlsOPMWW— Wimbledon (@Wimbledon) July 13, 2024 -
క్రిచికోవా X జాస్మిన్... నేడు వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్
ఈ ఏడాది వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించనుంది. లండన్ లో ఈరోజు జరిగే ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)తో ప్రపంచ 32వ ర్యాంకర్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తలపడుతుంది. వీరిద్దరు తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నారు. 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గగా... 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది వింబుల్డన్ సింగిల్స్ చాంపియన్‌కు 27 లక్షల పౌండ్లు (రూ. 29 కోట్ల 23 లక్షలు)... రన్నరప్‌కు 14 లక్షల పౌండ్లు (రూ. 15 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
జాస్మిన్ జయహో
లండన్: గత మూడేళ్లు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావోలిని... ఈసారి మాత్రం విన్నర్స్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లేందుకు విజయం దూరంలో ఉంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ వింబుల్డన్ టోర్నీలోనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 28 ఏళ్ల జాస్మిన్ 2 గంటల 51 నిమిషాల్లో 2–6, 6–4, 7–6 (10/8)తో ప్రపంచ 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై గెలిచింది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 2 గంటల 7 నిమిషాల్లో 3–6, 6–3, 6–4తో 2022 విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. రేపు జరిగే తుది పోరులో జాస్మిన్‌తో క్రిచికోవా తలపడుతుంది. ఎవరు నెగ్గినా వారికి తొలి వింబుల్డన్ టైటిల్ అవుతుంది. వెకిచ్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలి సెట్‌ను కోల్పోయిన జాస్మిన్ రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 4–5 వద్ద... టైబ్రేక్‌లో 5–6 వద్ద జాస్మిన్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి ఇటలీ క్రీడాకారిణిగా జాస్మిన్ రికార్డు నెలకొల్పింది. 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ వింబుల్డన్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మహిళల సెమీఫైనల్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2009లో సెరెనా విలియమ్స్ (అమెరికా), ఎలీనా దెమెంతియెవా (రష్యా) మధ్య సెమీఫైనల్ 2 గంటల 49 నిమిషాలు సాగింది. కెరీర్లో తొలిసారి సెమీఫైనల్ ఆడిన వెకిచ్ అందివచ్చిన అవకాశాలను చేజార్చుకొని మూల్యం చెల్లించుకుంది. జాస్మిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు వెకిచ్కు 14 సార్లు అవకాశం లభించగా ఆమె నాలుగుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. 42 విన్నర్స్ కొట్టిన వెకిచ్ ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేసింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్)తో మెద్వెదెవ్ (రష్యా); ముసెట్టి (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా) ఆడతారు. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
Vijay Mallya Son Wedding: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కొడుకు (ఫోటోలు)
-
పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కుమారుడు.. ఫోటో వైరల్
వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు 'సిద్ధార్థ మాల్యా' శనివారం తన స్నేహితురాలు జాస్మిన్ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి లండన్ సమీపంలోని ఓ విలాసవంతమైన ఎస్టేట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సిద్ధార్థ, జాస్మిన్ ఫ్రెండ్ జనాంగి షేర్ చేశారు.సిద్ధార్థ మాల్యా ఎమరాల్డ్ గ్రీన్ వెల్వెట్ టక్సేడోను ధరించగా, జాస్మిన్ తెల్లటి గౌనులో కనిపించారు. తమ పెళ్లి ఉంగరాలు సంబంధించిన ఫోటోలను జాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సిద్ధార్థ మాల్యాను ట్యాగ్ చేశారు. వివాహానికి కేవలం కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. -
మాల్యా ఇంట పెళ్లి సందడి : లవర్‌తో సిద్ధూ వెడ్లాక్ (ఫొటోలు)
-
విజయ్ మాల్యా ఇంట పెళ్లి సందడి
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరూ ఫొటో షూట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా? లేదంటే కొద్ది మంది సమక్షంలోనే జరపనున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వీళ్లిద్దరూ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. కిందటి ఏడాది హలోవీన్ సందర్భంలో రింగ్ తొడిగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు సిద్ధార్థ్. అలా ఆ ప్రపోజల్‌తో ఈ జంట వార్తల్లోకి ఎక్కింది. జాస్మిన్ ఇన్‌స్టా బయోలో యూఎస్ అని ఉంది. ఆమె ప్రొఫైల్‌ను బట్టి మాజీ మోడల్‌గా తెలుస్తోంది. ఇంతకి మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె కుటుంబ నేపథ్యం తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధార్థ్ నటుడిగా, మోడల్‌గా పరిచయస్థుడే. విజయ్ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతులకు సిద్ధార్థ్ జన్మించాడు. కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో పుట్టి.. లండన్, యూఏఈలో పెరిగాడు సిద్ధార్థ్. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్ తరఫున ఆర్బీబీ డైరెక్టర్‌గానూ వ్యవహరించిన సిద్ధార్థ్.. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్‌ఫిషర్ మోడల్స్ జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్‌గా మారాడు. నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే.. ఆ తర్వాతే సిద్ధార్థ్ కెరీర్లో మార్పు కనిపించింది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ వైపు మళ్లిన సిద్ధార్థ్.. యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు. View this post on Instagram A post shared by Sid (@sidmallya)ఇక.. సిద్ధార్థ్ తండ్రి విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఆయన భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్‌ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది. అతడు ఫ్రాన్స్‌లో 35 మిలియన్ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్మో హోల్డింగ్ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరో వైపు ఫ్రాన్స్ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది. -
పారిస్ ఒలింపిక్స్‌కు అమిత్, జైస్మిన్ అర్హత
బ్యాంకాక్: భారత బాక్సర్లు అమిత్ పంఘాల్, జైస్మిన్ లంబోరియా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీలో ఆదివారం పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్ ... మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి ‘పారిస్’ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. పురుషుల 57 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ 5–0తో చువాంగ్ లియు (చైనా)పై... జైస్మిన్ 5–0తో మరీన్ కమారా (మాలి)పై గెలుపొందారు. మరోవైపు ‘బాక్స్ ఆఫ్’ మ్యాచ్‌లో సచిన్ సివాచ్ 0–5తో మునార్బెక్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. హరియాణాకు చెందిన 28 ఏళ్ల అమిత్ వరుసగా రెండో సారి ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అమిత్ 52 కేజీల విభాగంలో పాల్గొని రెండో రౌండ్లో ఓడిపోయాడు. 2019 ప్రపంచ చాంపియన్íÙప్లో రజతం, 2019 ఆసియా చాంపి యన్íÙప్లో స్వర్ణం నెగ్గిన అమిత్ 2018 ఆసియా క్రీడల్లో, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు గెలిచాడు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం తొమ్మిది మంది బాక్సర్లు బరిలోకి దిగగా... ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో ఆరుగురు భారత బాక్సర్లు మాత్రమే పోటీపడనున్నారు. మహిళల విభాగంలో నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు), లవ్లీనా (75 కేజీలు)... పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. -
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్‌లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్‌లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్‌లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్‌కు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్‌ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్‌ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్‌ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్‌ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్‌తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్‌ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్‌లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్‌ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
ఇంతింతై ట్రెండింతై...
అనగనగా ఒక జాస్మిన్ కౌర్. దిల్లీలో వస్త్ర దుకాణం నడుపుతోంది. క్లాత్స్టోర్లోకి కొత్తగా వచ్చిన పీస్‌లను ప్రమోట్ చేయడానికి వాటి ముందు కెమెరా పెట్టి ‘జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అన్నది. ఈ మాట కాస్తా సోషల్ మీడియా ట్రెండై పోయింది. ‘ఇంతింతై ట్రెండింతై’ అన్నట్లు బాలీవుడ్ వరకు వెళ్లింది. బెంగాలీ నటి, పార్లమెంట్ సభ్యురాలు నుస్రత్ జహాన్ ఈ ట్రెండ్‌కు హాయ్ చెప్పింది. ఇంతకుముందు బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోన్, సన్యా మల్హోత్రాలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వీడియోలు చేసి ‘వావ్’ అనిపించారు. ఫేమస్ డైలాగ్ ‘సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ను లిప్–సింకింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది దీపిక. దీపిక భర్త రణ్‌వీర్‌సింగ్, డైరెక్టర్–ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్ పెట్టారు. -
కాళ్లు చేతులు కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు
క్రైమ్: దారుణ ఉదంతంలో ఎట్టకేలకు బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. భారత సంతతికి చెందిన యువతిని ఆమెను ప్రేమించిన వ్యక్తే అతికిరాతకంగా హత్య చేశాడు. అదీ బతికుండగానే కళ్లు, కాళ్లు చేతులు కట్టేసి మరీ పూడ్చిపెట్టి సజీవ సమాధి చేశాడు. తనను దూరం పెట్టిందనే కోపంతోనే ఆ ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్ట్రేలియా ఈ ఘోరం రెండేళ్ల కిందట చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన జాస్మిన్ కౌర్(21) ఆస్ట్రేలియాలో నర్సింగ్ చదువుకునేందుకు వెళ్లింది. అక్కడే తారిక్‌జోత్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే.. తారిక్ ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె.. అతన్ని దూరం పెడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్నాడు. అడిలైడ్‌లో ఆమె పని చేసే చోట నుంచే కిడ్నాప్ చేశాడు తారిక్. కారులో ఆమెను బంధించి.. నాలుగు గంటలపాటు ప్రయాణించి ఫ్లిండర్స్ రేంజ్స్ చేరుకున్నాడు. అక్కడే ఘోరానికి పాల్పడ్డాడు. ఆమె కళ్లకు గంతలు కట్టి.. కాళ్లు చేతుల్ని కేబుల్స్‌తో కట్టేసి.. సమాధి చేశాడు. మార్చి 2021లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆమె మిస్సింగ్ కేసు నమోదుకాగా.. కొన్ని నెలలకు ఆమె హత్యకు గురైందన్న విషయం బయటపడింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనే దోషిగా తేలింది. ఈ మేరకు బుధవారం వాదనలు విన్న స్థానిక కోర్టు.. అతనిది ప్రతీకారచర్యగా తేల్చడంతో పాటు జీవిత ఖైదు శిక్ష పడొచ్చని తేల్చి చెప్పింది. మనిషిలో మృగస్వభావం ఏమేర ఉంటుందనేది తారిక్‌ను చూసి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఇక.. తాను చేసిన పొరపాటల్లా.. తన కూతురిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపడమేనని, ఆ తర్వాత మళ్లీ తన కూతురిని కళ్లారా చూసుకోలేకపోయానని విలపిస్తోంది జాస్మిన్కౌర్ తల్లి. వందసార్లు తిరస్కరించినా కూడా తన కూతురి వెంటపడడం తారిక్‌జోత్ సింగ్ ఆపలేదని.. అతని నేరానికి క్షమాపణే ఉండకూదని కోరుకుంటోందామె. జాస్మిన్ను ఎక్కడైతే ఆ ప్రేమోన్మాది పూడ్చిపెట్టి హత్య చేశాడో.. అక్కడే ఆమెకు సమాధి కట్టి ప్రార్థనల ద్వారా నివాళులర్పిస్తూ వస్తోంది ఆ కుటుంబం. ఇదీ చదవండి: గర్భం దాల్చిన ప్రియురాలు.. ప్రియుడి దాష్టీకం -
అక్కడ పూల దండలను మూర లెక్కన అమ్మితే ఇక అంతే!
పువ్వులు అలంకరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని దండల రూపంలో ఐతే మూర లెక్కన విడి పువ్వులైతే గ్రాములు, కిలోల లెక్కన తీసుకుంటాం. ఇది సర్వసాధారణం. ఐతే ఇక నుంచి మూరలు లెక్కన పూల దండలను అమ్మడానకి వీల్లేదట. ఒకవేళ అలా అమ్మితే రెండు వేలు వరకు జరిమాన విధిస్తారట. అంతేగాదు పూల దండలను మీటర్లు లేదా సెంటీమీటర్ల చొప్పునే అమ్మాలనే నిబంధన కూడా విధించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ అంశం ఇప్పుడూ కేరళ అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..సాధారణంగా మల్లెలు, కనకాంభరాలు తదితర పూల దండలను మూరలెక్కనే అమ్మతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కేరళలో త్రిసూర్‌లో లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ ఇక నుంచి అలా అమ్మకూడదంటూ పూల వ్యాపారులకు నోటీసులు పంపింది. ఇలా అమ్మితే పూల దండ దాదాపు 24 అంగుళాలు లేదా 60 సెంటీమీటర్లే ఉంటుందని చెబుతోంది. ఇక నుంచి పూల దండలను సెంటీమీట్లర్లు లేదా మీటర్లలోనే కొలవాలని రూల్ పాస్ చేసింది. ఒకవేళ మూర లెక్కన అమ్మినట్లు తెలిస్తే వారికి రూ. 2000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. కేరళలో ఈ అంశం ఒక హాట్‌టాపిక్‌గా మారిపోయింది. త్రిసూర్ షాపులలో తనిఖీలు నిర్వహించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని లీగల్ మెట్రాలజీ విభాగం అధికారి ఏషియానెట్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 111ఈ, పీనల్ ప్రొవిజన్ 29 ప్రకారం పూల దండలను అత్యంత సాధరణ యూనిట్ ఎస్ఐ(ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్)లో కాకుండా మూర లేదా క్యూబిట్లో అమ్మడం నేరం అని, దీని కింద రూ. 2000/- జరిమాన విధిస్తామని కరాకండీగా తేల్చి చెప్పింది. ప్రజలు గనుక మూర లేదా క్యూబిన్ల కింద కోరినట్లయితే వ్యాపారులు 44.5 సెంటీమీటర్ల పూల దండను ఇవ్వాలని లీగల్ మెట్రాలజీ సూచించింది. ఐతే కొలతల్లో చాలా మార్పులు వస్తాయని వ్యాపారులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూల అమ్మకాలు చాల సంత్సరాలుగా జరగుతున్నాయి. నిజానికి సాధారణ ప్రజలకు పూలు మూర లేదా సెంటమీటర్లలో అమ్మడం అనేది అనవసరమైన విషయమని, ఇది పెద్ద సమస్య కాదంటూ ఆ నిబంధనను వ్యాపారులు కొట్టిపారేయడం గమనార్హం. (చదవండి: వామ్మో ఎంత పెద్ద క్యూ లైన్! అంతలా బారులుతీరి జనాలు ఎందుకున్నారంటే.. -
తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్’ అనే రసాయనం
వేసవి అంటే సూర్యుడు చండ్రనిప్పులు కురిపించే మండుటెండలు. వేసవి అంటే మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతలు. వేసవి అంటే మామిడి రుచులు, తాటిముంజెల చవులు. వేసవి అంటే నసాళానికెక్కే ఘాటైన ఆవకాయల కారాలు. వేసవి అంటే ఇవే కాదు, మల్లెల పరిమళాలు కూడా! మల్లెలు వేసవిలోనే విరగబూస్తాయి. వీథి వీథినా బుట్టలు బుట్టలుగా అమ్మకానికొస్తాయి. బజారుల్లో గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. పరిసరాలను పరిమళభరితం చేస్తాయి. ఎండ చల్లబడిన సాయంవేళ చక్కగా స్నానం చేసి, కొప్పున మూరెడు మల్లెలు ముడుచుకుంటేనే తెలుగు పడతులకు అదో తృప్తి! ఇదివరకటి కాలంలో ఆడా మగా తేడా లేకుండా అందరూ తలలో మల్లెలను అలకరించుకునే వారు. శరవేగంగా పరుగులు తీసే కాలం తెచ్చిన పెనుమార్పులతో పురుషుల అలంకరణ నుంచి మల్లెలు తప్పుకున్నాయి. అలాగని, పురుషులకు మల్లెలంటే మొహంమొత్తినట్లు కాదు. మల్లెల పరిమళాన్ని ఇష్టపడటం వల్లనే ఉద్యోగాలు చేసే పురుషులు చాలామంది విధులు ముగించుకుని ఇళ్లకు మళ్లేటప్పుడు తోవలో భార్యల కోసం మల్లెలు కొనుక్కుని మరీ పోతారు. చిరకాలంగా మల్లెలు మన సంస్కృతిలో భాగం. మల్లెలను మాలలుగా అల్లడం ఒక ప్రత్యేకమైన కళ. మల్లెల పరిమళమే లేకపోతే వేసవులు మరింత దుర్భరంగా ఉండేవి. మండుటెండా కాలంలో మల్లెల పరిమళమే మనుషులకు ఊరట! మగువల అలంకరణల్లోనే కాదు, పూజ పురస్కారాల్లోనూ మల్లెలకు విశేషమైన స్థానం ఉంది. మన సాహిత్యంలో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సాహిత్యంలో మల్లెలను ఆరాధించని కవులు దాదాపుగా లేరు. శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ తెలుగుతల్లికి మల్లెపూల దండతోనే పదాలంకరణ చేశారు. మల్లెలను సంస్కృతంలో ‘మల్ల’, ‘మల్లి’, ‘మల్లిక’ అంటారు. వేసవి మొదలయ్యే వసంత రుతువులో మల్లెలు పూయడం ప్రారంభిస్తాయి. అందువల్ల వీటిని ‘వార్షికి’ అంటారు. శీతాకాలంలో చలి పెరిగే సమయంలో మల్లెలు కనుమరుగైపోతాయి. అందువల్ల మల్లెలను ‘శీతభీరువు’ అని కూడా అంటారు. మల్లెల్లో వాటి రేకులు, పరిమాణాన్ని బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు, అడవి మల్లెలు, విడి మల్లెలు, దొంతర మల్లెలు, బొడ్డు మల్లెలు వంటివి మన దేశంలో విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అన్ని రకాల మల్లెలు తెల్లగానే ఉంటాయి. వీటి పరిమళంలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కొన్ని చోట్ల అరుదుగా పసుపు రంగులోను, గులాబి రంగులోను పూచే మల్లెలు కూడా కనిపిస్తాయి. మల్లెల ఉత్పాదనలో భారత్, ఈజిప్టు దేశాలే అగ్రస్థానంలో ఉంటాయి. మల్లెలు సహజంగా పూచే పరిస్థితులు లేని చలి దేశాలు ఈ దేశాల నుంచి భారీ ఎత్తున మల్లెలను దిగుమతి చేసుకుంటాయి. కేవలం మల్లెలనే ఉపాధి చేసుకుని బతికేవారు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తారు. మల్లెలు పరిమళించే దేశాలు ప్రపంచంలోని ఉష్ణమండల దేశాల్లోని వాతావరణం మల్లెలకు అనుకూలంగా ఉంటుంది. భారత్‌తో పాటు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లోను; ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో రకరకాల మల్లెలు ఏటా వేసవిలో విరివిగా కనిపిస్తాయి. అలాగే కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెల్లో దాదాపు మూడువందల రకాలు ఉన్నాయి. వీటిలో 75 రకాలు భారత్‌లో పూస్తాయి. మల్లె మొక్కలను చాలామంది పెరటితోటల్లోను, కుండీల్లోను పెంచుకుంటారు. భూవసతి కలిగిన ఉద్యాన రైతులు వాణిజ్యపరంగా కూడా మల్లెలను సాగు చేస్తారు. మన దేశంలో వాణిజ్యపరంగా మల్లెల సాగు చేయడంలో తమిళనాడు అగ్రస్థానంలో నిలుస్తుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోను మల్లెల సాగు గణనీయంగానే జరుగుతోంది. ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్‌లో వాణిజ్యపరంగా మల్లెల సాగు జరుగుతోంది. మల్లెలను సాగుచేసే రైతులు టోకు వర్తకులకు పెద్దమొత్తంలో మల్లెలను విక్రయిస్తారు. వీటిని టోకు వర్తకులు వినియోగం ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాలకు తరలిస్తారు. వివిధ దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు కూడా మల్లెలను పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. వాణిజ్యపరంగా మల్లెల సాగు మన దేశంలో చిరకాలంగా సాగుతున్నప్పటికీ, మల్లెల సాగు విస్తీర్ణం, ఏటా స్థానికంగా జరిగే మల్లెల వ్యాపారం విలువ, మల్లెల ఎగుమతులు వంటి వివరాలపై గణాంకాలేవీ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరం. పూల రారాణి మల్లెపువ్వును ‘పూల రారాణి’ అంటారు. ఇంగ్లిష్‌లో దీనికి ‘బెల్ ఆఫ్ ఇండియా’– అంటే ‘భారత సుందరి’ అనే పేరు, ‘క్వీన్ ఆఫ్ ఫ్రాగ్రన్స్’– ‘సుగంధ రాణి’ అనే పేరు కూడా ఉన్నాయి. మల్లెకు పర్షియన్ భాషలో ‘యాస్మిన్’ అనే పేరు ఉంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లోని అన్ని భాషల్లోనూ మల్లెను ‘యాస్మిన్’ అనే పిలుస్తారు. ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషల్లో ‘జాస్మిన్’ అంటారు. హిందీలో మల్లెను మోగ్రా, చమేలీ, జూహీ అనే పేర్లతో పిలుస్తారు. భారత దేశంలోను, ఇతర దక్షిణాసియా దేశాల్లోను మల్లెలను మహిళలు సిగలలో అలంకరించుకుంటారు. శుభకార్యాల సమయంలో చేసే పుష్పాలంకరణలలోను, దేవాలయాల్లోను భారీ పరిమాణంలోని మల్లెమాలలను ఉపయోగిస్తారు. మల్లెలకు అనేక ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఉన్నాయి. మల్లెలతో దేవతార్చన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మల్లెల మహిమ గురించి ‘పుష్పచింతామణి’ ఇలా చెబుతోంది: ‘మల్లికాజ్ఞా నకర్మార్థ మర్చయంతో మహేశ్వరమ్ లభంతే పరమం జ్ఞానం సంసార భయనాశనం’ ఎలాంటి కోరికలు లేకుండా మల్లెలతో ఈశ్వరార్చన చేసినట్లయితే సంసార భయాలు తొలగి, పరమజ్ఞానం కలుగుతుంది. ‘మల్లికా కుసుమై రేవం వసంతే గరుడధ్వజమ్ యోర్చయే పరయా భక్త్యా దహేత్ పాపం త్రిధార్జితమ్’ వసంత రుతువులో శ్రీమహావిష్ణువును మల్లెలతో అర్చిస్తే, మనో వాక్కాయ కర్మల వల్ల ప్రాప్తించిన పాపాలన్నీ తొలగిపోతాయి. భక్తులకు గల ఈ విశ్వాసం కారణంగానే వైష్ణవాలయాల్లో జరిగే పూజార్చనల్లో మల్లెలను విశేషంగా ఉపయోగిస్తారు. తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఇతర పుష్పాలతో పాటు భారీస్థాయిలో మల్లెలను అలంకరిస్తారు. భాషా సాహిత్యాల్లో మల్లెలు మన భాషా సాహిత్యాల్లో మల్లెల ప్రస్తావన కనిపిస్తుంది. మన సామెతలు, జాతీయాల్లోనూ మల్లెల మాటలు వినిపిస్తాయి. ఉదాహరణ చెప్పుకోవాలంటే, ‘బోడితలకు బొడ్డు మల్లెలు ముడిచినట్లు’ అనే సామెత ఉంది. ఒకదానికొకటి ఏమాత్రం పొసగని వాటిని బోడితలకు బొడ్డు మల్లెలతో పోలుస్తారు. ‘జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా?’ అని మరో సామెత ఉంది. దుర్మార్గుల సంతానం దుర్మార్గులే అవుతారు గాని సన్మార్గులు కాలేరనే అర్థంతో ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాగే, ‘ఉల్లి మల్లె కాదు, కాకి కోకిల కాదు’ అనే సామెత కూడా మనకు వాడుకలో ఉంది. మల్లెపూల గురించి చలం అద్భుతమైన కవిత రాశాడు. ‘మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!/ విచ్చిన మల్లెపూలు! ఆ పరిమళం నాకిచ్చే సందేశం యే మాటలతో తెలపగలను!’ అంటూనే మల్లెల గురించి ఆయన ఈ కవితలో చాలా విశేషాలే చెబుతాడు. ‘ఒక్క స్వర్గంలో తప్ప/ ఇలాంటి వెలుగు తెలుపు/ లేదేమో– అనిపించే మల్లెపూలు’ అని పరవశించిపోతాడు. ఎంతైనా మల్లెలను అలంకరించుకునే అలవాటు ఉన్న మహానుభావుడాయన! మల్లెల పరిమళాలు కేవలం మన సాహిత్యంలోనే కాదు, పాశ్చాత్య సాహిత్యంలోనూ అక్కడక్కడా గుబాళింపులు వెదజల్లుతూనే ఉంటాయి. ‘అద్భుతమైన మల్లె మళ్లీ పరిమళిస్తుంది/ తన సుమనోహర సుగంధంతో ఈ బీడునేల మళ్లీ వికసిస్తుంది’ అంటూ మల్లెల సౌరభాన్ని అమెరికన్ కవయిత్రి సిల్వియా ఫ్రాన్సిస్ చాన్ తన ‘వండర్ జాస్మిన్’ కవితలో వర్ణించింది. ఇక మన తెలుగు సినీ సాహిత్యంలోనైతే మల్లెల పాటలు కొల్లలుగా వినిపిస్తాయి. మల్లెలూ కొన్ని రకాలూ... వివిధ దేశాల్లో వేసవిలో సర్వసాధారణంగా కనిపించే మల్లెల్లో ‘పోయెట్స్ జాస్మిన్’ ఒక రకం. వీటి పూలు చూడటానికి నందివర్ధనం పూలలా కనిపించినా, మంచి పరిమళాన్ని వెదజల్లుతాయి. ఈ జాతి మల్లెల మొక్కలు గుబురుగా పొదలుగా ఎదుగుతాయి. ఇవి దాదాపు నలభై అడుగుల వరకు విస్తరిస్తాయి. మన దేశంలో సర్వసాధారణంగా కనిపించే మల్లెలను ‘ఇండియన్ జాస్మిన్’ అంటారు. వీటినే సాదా మల్లెలు అంటారు. పశ్చిమాసియా, ఈజిప్టు ప్రాంతాల్లో చిన్న గులాబీల్లా కనిపించే మల్లెలను ‘అరేబియన్ జాస్మిన్’ అంటారు. విడివిడి రేకులతో వివిధ పరిమాణాల్లో కనిపించే మల్లెల్లో స్పానిష్ జాస్మిన్, ఏంజెల్ వింగ్ జాస్మిన్, అజోరియన్ జాస్మిన్ వంటివి ప్రధానమైన రకాలు. మల్లెల్లో ఎక్కువ రకాలు తెల్లగానే ఉంటాయి. అయితే, ఇటాలియన్ జాస్మిన్, షోయీ జాస్మిన్ వంటి అరుదైన రకాలు పసుపు రంగులోను; పింక్ జాస్మిన్, ఫ్రాగ్రంట్ ఫైనరీ జాస్మిన్, స్టీఫాన్ జాస్మిన్ వంటివి గులాబి రంగులోను కనిపిస్తాయి. ఆకారాలు, రంగులు ఎలా ఉన్నా, చక్కని పరిమళాన్ని వెదజల్లడం మల్లెల ప్రత్యేకత. చరిత్రలో మల్లెల సౌరభం భారత్, చైనా, ఈజిప్టు, అరేబియా ప్రాంతాల్లో పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెలను చిరకాలంగా ఉపయోగిస్తున్నారు. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలోనే ఈజిప్టు, భారత్ ప్రాంతాల్లో తాజా మల్లెలను వేడినీటిలో వేసి, స్నానానికి ఉపయోగించేవారు. భారత్‌లో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నుంచే మల్లెలను ప్రత్యేకంగా సాగుచేయడం మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. చైనాలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటి నుంచి మల్లెల సాగు మొదలైంది. చైనాను అప్పట్లో పరిపాలించిన హాన్ వంశస్థులు మల్లెల సాగును బాగా ప్రోత్సహించినట్లు ఆధారాలు ఉన్నాయి. యూరోప్‌కు మల్లెలు చాలా ఆలస్యంగా పరిచయమయ్యాయి. అరబ్బుల ద్వారా క్రీస్తుశకం పదహారో శతాబ్దంలో గ్రీస్, ఫ్రాన్స్ ప్రాంతాలకు తొలిసారిగా మల్లెలు చేరాయి. ఫిలిప్పీన్స్‌కు పదిహేడో శతాబ్దిలో మల్లెలు పరిచయమయ్యాయి. మల్లెలపై మనసు పారేసుకున్న ఫిలిప్పీన్స్ మల్లెపూవును తన జాతీయపుష్పంగా ప్రకటించుకుంది. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేసియా, టునీసియా దేశాలకు కూడా మల్లెపూవే జాతీయపుష్పం కావడం విశేషం. పరిమళ ద్రవ్యాల తయారీలో... పరిమళ ద్రవ్యాల తయారీలో మల్లెల వినియోగం శతాబ్దాలుగా సాగుతోంది. మల్లెల నుంచి అత్తరులు, సెంట్లు వంటివి తయారు చేస్తారు. సబ్బులు, అగరొత్తుల తయారీలోనూ మల్లెల నుంచి సేకరించిన పరిమళ తైలాన్ని వినియోగిస్తారు. మల్లెల నుంచి ఒక కిలో సుగంధతైలం సేకరించాలంటే, వెయ్యి కిలోల మల్లెలు అవసరమవుతాయి. మిగిలిన పూల నుంచి సుగంధ తైలాన్ని సేకరించడానికి వాటిని నీటిలో ఉడికించి, ఆవిరిని సేకరించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇది ఒకే దశలో జరిగే ప్రక్రియ. మల్లెల నుంచి సుగంధతైలాన్ని సేకరించడం ఒకే దశలో సాధ్యమయ్యే పని కాదు. మొదటగా తాజాగా సేకరించిన మల్లెలను వాటిని సేకరించిన చోటనే నీటిలో ఉడికించి, ఆవిరి పడతారు. తొలిదశలో పరిమళాలు వెదజల్లే మైనం వంటి పదార్థం తయారవుతుంది. దీనిని ‘జాస్మిన్ కాంక్రీట్’ అంటారు. రెండో దశలో ఈ ‘జాస్మిన్ కాంక్రీట్’ను శుద్ధి చేయడం ద్వారా దీని సుగంధ తైలాన్ని సేకరిస్తారు. ఇంతగా ఎంతో శ్రమించి సేకరించిన సుగంధ తైలాన్నే అత్తరులు, సెంట్లు వంటి పరిమళ ద్రవ్యాల తయారీలోను, సబ్బులు, అగరొత్తులు వంటి ఉత్పత్తుల కోసం వినియోగిస్తారు. మల్లెల నుంచి సుగంధతైలం సేకరణ చాలా క్లిష్టమైన ప్రక్రియ కావడం వల్ల మల్లెల పరిమళాన్ని వెదజల్లే అత్తరులు, సెంట్లు వంటి ఉత్పత్తుల ధరలు కళ్లు చెదిరే స్థాయిలో ఉంటాయి. సంప్రదాయ వైద్యంలో... ►మల్లెలను మన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలోను, చైనా సంప్రదాయ వైద్యంలోను చిరకాలంగా వినియోగిస్తున్నారు. మల్లెపూలను తలలో ధరించడం వల్ల వెంట్రుకలకు, కళ్లకు మేలు జరుగుతుందని; ►మల్లె ఆకులను దట్టంగా తలపైవేసి కట్టు కట్టినట్లయితే, కళ్లు ఎర్రబారడం, కళ్లకలకలు వంటి నేత్రవ్యాధులు నయమవుతాయని, ►మల్లె ఆకులను నూనెలో వేసి కాచిన తైలాన్ని తలకు పట్టించినట్లయినా నేత్రవ్యాధులు నయమవుతాయని; ►మల్లెల వేరు నుంచి తయారు చేసిన కషాయం వాత పైత్య దోషాలను హరిస్తుందని, రక్తదోషాలను తొలగిస్తుందని ‘వస్తుగుణ దీపిక’ చెబుతోంది. ►ఒత్తిడిని తగ్గించడంలోను, మానసిక ప్రశాంతతను కలిగించడంలోను మల్లెల సుగంధం బాగా పనిచేస్తుందని పలు ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ►చైనా సంప్రదాయ వైద్యంలో మల్లెపూవును ‘మో లి హువా’ అంటారు. ►దీనిని చర్మవ్యాధులు నయం చేయడానికి, మానసిక ఆందోళనను తగ్గించడానికి విరివిగా ఉపయోగిస్తారు. ►మల్లెల ఆకులతో తయారు చేసిన కషాయాన్ని జీర్ణకోశ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ►మల్లెపూలలో ఉండే ‘ఆర్సిటిన్’ అనే రసాయనం రక్తపోటును అదుపు చేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. -
కదిరి మల్లెల గుబాళింపు.. ఎకరాకు రూ.5 లక్షల ఆదాయం
సాక్షి, సత్యసాయి జిల్లా(కదిరి): కదిరి మల్లెల గుబాళింపునకు దేశంలోనే పేరుంది. ఇక్కడి మల్లెలు వెదజల్లినంతగా ఏప్రాంత మల్లెలు సువాసనలు ఇవ్వలేవన్న పేరు ఉంది. ముఖ్యంగా బ్రహ్మో త్సవాల సమయానికి విరబూసే మల్లెలు మరింత సువాసనలు ఇస్తాయని అంటుంటారు. ఈ ప్రాంతంలోని మల్లెల సౌరభాలు ఖాద్రీశుడికి ఎంతో ప్రీతిపాత్రం. కదిరి మల్లెలకు భలే గిరాకీ కదిరి పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే మల్లెల గుబాళింపు అందరినీ మైమరిపిస్తుంది. ఈ ప్రాంతంలో మల్లె తోటలు ఎక్కువ. దాదాపు 600 ఎకరాలకు పైగా రైతులు మల్లెలు సాగుచేస్తుంటారు. ఇవి ఎందరికో ఉపాధి నిస్తున్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ పట్టణాలకు మల్లెలను వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో మల్లెపూలను విక్రయించేవారు ప్రత్యేకంగా కదిరి మల్లెలని అరుస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు. ఈ ప్రాంత నేల స్వభావం కారణంగానే మల్లెలు మంచి సువాసననిస్తుంటాని రైతులు చెబుతున్నారు. ఖాద్రీశుడికి మల్లెపూల ఉత్సవం అలంకార ప్రియుడైన లక్ష్మీ నారసింహ స్వామికి తెల్లని మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ సువాసనలు వెదజల్లే కదిరి మల్లెలంటే మరింత ప్రీతికరం. దీంతో ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. ఏటా వైశాఖ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మల్లెపూల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆరోజు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పట్టణానికి సమీపంలోని మద్దిలేటి ఒడ్డున ఉన్న ఉత్సవ మంటపం వద్ద కొలువుదీర్చి ప్రత్యేకంగా మల్లెపూలతోనే అలంకరిస్తారు. మల్లెపూలను సాగుచేసే రైతులే ఈ ఉత్సవానికి ఉభయదారులుగా వ్యవహరిస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టం హిందువుల ఆరాధ్య దైవం శ్రీమహా విష్ణువుకు మల్లెలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెపూలతో అలంకరిస్తాం. శ్రీవారికి మల్లెపూలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో మోహినీ ఉత్సవం నాడు స్వామివారి కుచ్చుల వాలుజడ కదిర మల్లెలతోనే సిద్దం చేస్తాం. ఏటా మల్లెపూల ఉత్సవాన్ని మరింత శోభాయమానంగా నిర్వహిస్తాం. – నరసింహాచార్యులు, నృసింహాలయ ప్రధాన అర్చకుడు ఎకరాకు రూ.5 లక్షలు వస్తుంది ఎకరం పొలంలో మల్లె తోట సాగు చేస్తే ఏడాదికి రూ.5 లక్షలు సంపాదించవచ్చు. నాకున్న 72 సెంట్ల స్థలంలో పూర్తిగా మల్లెలే సాగు చేస్తున్నా. వేసవిలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలో మల్లెపూలు రూ.500కు అమ్ముడు పోతుంటాయి. సన్నమల్లెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. – విశ్వనాథ్, మల్లెతోట యజమాని, కదిరి రోజూ రూ.300 సంపాదిస్తా కిలో మల్లెపూలు కోస్తే రూ.75 కూలి చెల్లిస్తారు. ఈ లెక్కన రోజూ రూ.300 వరకు సంపాదిస్తాను. ఈ డబ్బుతోనే నా కుమార్తెను బాగా చదివిస్తున్నా. ఏడాదిలో 8 నుంచి 9 నెలలు పూల కోత పని ఉంటుంది. – ప్రమీలమ్మ, కదిరి -
కామన్వెల్త్ క్రీడలకు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటిన నిఖత్ తొలిసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనుంది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ ట్రయల్ పోరులో నిఖత్ 7–0తో మీనాక్షి (హరియాణా)పై నెగ్గింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ కామన్వెల్త్ గేమ్స్ కోసం 50 కేజీల విభాగానికి మారింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (70 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) కూడా ఫైనల్ బౌట్లలో విజయాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. -
పొరుగింట్లో అల్లాను చూసింది
హజ్ చేయడాన్ని ముస్లింలు జీవిత పరమావధిగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఇందుకోసం కలలు కనే పెద్దలు లక్షల్లో ఉంటారు. కేరళకు చెందిన జాస్మిన్‌కు 28 సెంట్ల భూమి (1350 గజాలు) ఉంది. దాన్ని అమ్మి భర్తతో హజ్‌కు వెళ్లాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. కాని ఆ సమయంలో ఆమె దృష్టి పొరుగింటిపై పడింది. ఆ ఇంట్లో ఉంటున్న నిరుపేదలు సొంతిల్లు లేక అవస్థ పడుతూ కనిపించారు. పొరుగువారికి సాయం చేయమనే కదా అల్లా కూడా చెప్పాడు అని హజ్‌ను మానుకుంది. తన స్థలం మొత్తాన్ని కేరళ ప్రభుత్వం చేపట్టిన నిరుపేదల గృహపథకానికి ఇచ్చేసింది. కొందరు పొరుగువారిలో దేవుణ్ణి చూస్తారు. మానవత్వమే దైవత్వం అని చాటి చెబుతారు. బాల సాహిత్యంలో ఈ కథ కనిపిస్తుంది. అరేబియాలోని ఒక ఊళ్లో చాలా పేద కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారి ఆడపిల్లలకు ఆ వేళ చాలా ఆకలిగా ఉంటుంది. తల్లికి ఏం వండి పెట్టాలో తెలియదు. ఇంట్లో ఒక్క నూక గింజ కూడా లేదు. పని వెతుక్కుంటూ దేశం మీదకు వెళ్లిన తండ్రి ఏమయ్యాడో ఏమో. ఆకలికి తాళలేని ఆ పిల్లలు ఏం చేయాలో తోచక వీధిగుండా నడుచుకుంటూ వెళుతుంటే ఒక పిట్ట చచ్చిపడి ఉంటుంది. ఇస్లాంలో చనిపోయిన దానిని తినడం ‘హరాం’ (నిషిద్ధం). కాని విపరీతమైన ఆకలితో ఉన్న ఆ పిల్లలు ఆ చనిపోయిన పిట్టను ఇంటికి తీసుకొస్తే తల్లి చూసి ‘అయ్యో... బంగారు తల్లులూ మీకెంత ఖర్మ పట్టింది’ అని వేరే గత్యంతరం లేక ఆ పిట్టనే శుభ్రం చేసి, పొయ్యి రాజేసి, సట్టిలో ఉప్పుగల్లు వేసి ఉడికించడం మొదలెడుతుంది. ఆశ్చర్యం... సట్టిలో నుంచి ఎలాంటి సువాసన రేగుతుందంటే చుట్టుపక్కల వాళ్లందరికీ ‘ఆహా.. ఎవరు ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనిపించింది. ఈ పేదవాళ్ల ఇంటి పక్కనే ఉన్న షావుకారు భార్యకు కూడా అలాగే అనిపించి, కూతురిని పిలిచి ‘పొరుగింట్లో ఏదో ఒండుతున్నారు. అదేమిటో కనుక్కునిరా’ అని పంపిస్తుంది. షావుకారు కూతురు పొరుగింటికి వచ్చి ‘ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనడిగితే ‘చచ్చిన పిట్టను వండుకుని తింటున్నాం’ అని చెప్పడానికి నామోషీ వేసిన ఆ తల్లి ‘మీకు హరాం (తినకూడనిది)... మాకు హలాల్ (తినదగ్గది) వండుతున్నాం’ అంటుంది. వెనక్కు వచ్చిన షావుకారు కూతురు అదే మాట తల్లితో అంటే ఆమెకు కోపం వస్తుంది. ‘అరె... వారు తినదగ్గది మేము తినకూడనిది ఏముంటుంది’ అని భర్తకు కబురు పెట్టిస్తుంది. భర్త రాగానే పొరుగింటి అవమానాన్ని చెప్పి ‘వారేదో తినదగ్గది తింటున్నారట... మనం దానిని తినకూడదట... ఏంటది’ అని కోపం పోతుంది. భర్త ఆలోచనాపరుడు. పొరుగింటికి వెళ్లి ఆరా తీస్తే ఆ పేదతల్లి ‘అయ్యా... మీరు షావుకార్లు. చచ్చినవాటిని తినకూడదు. హరాం. మేము పేదవాళ్లం. ఆకలికి తాళలేక అలాంటివి తినొచ్చు. హలాల్. అందుకనే అలా చెప్పాను’ అని కన్నీరు కారుస్తుంది. ఆ సమయానికి ఆ షావుకారు హజ్‌కు వెళ్లడానికి సిద్ధం అవుతూ ఉంటాడు. అతడు తన హజ్ డబ్బు మొత్తాన్ని ఆ పేదరాలికి ఇచ్చి హజ్ మానుకుంటాడు. కాని ఆ సంవత్సరం హజ్‌కు వెళ్లిన ఇరుగుపొరుగు వారికి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆ షావుకారు కనిపించి ఆశ్చర్యం వేస్తుంది. అంటే వెళ్లిన పుణ్యం దక్కిందని అర్థం. అదీ కథ. కేరళలో అచ్చు ఇలాగే జరిగింది. అక్కడి పత్థానంతిట్ట జిల్లాలోని అరన్మలలో 48 ఏళ్ల జాస్మిన్‌కు ఎప్పటి నుంచో హజ్‌కు వెళ్లాలని కోరిక. భర్త హనీఫా (57) కు కూడా అదే కల. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి కావలసినంత డబ్బు లేదు. జాస్మిన్‌కు తండ్రి నుంచి సంక్రమించిన 28 సెంట్ల భూమి అదే ఊళ్లో ఉంది. దానిని అమ్మి ఆ డబ్బుతో హజ్‌కు వెళ్లాలని భార్యాభర్తలు నిశ్చయించుకున్నారు. ఈలోపు కోవిడ్ వచ్చింది. చాలామంది కష్టాలు పడ్డారు. జాస్మిన్ ఇరుగుపొరుగున అద్దె ఇళ్లల్లో నివసించే మధ్యతరగతి వారు అద్దె చెల్లించలేని ఆర్థిక కష్టాలకు వెళ్లారు. తినడానికి ఉన్నా లేకపోయినా నీడ ఉంటే అదో పెద్ద ధైర్యం అని వారి మాటలు జాస్మిన్ను తాకాయి. అదే సమయంలో కేరళలో ‘లైఫ్ మిషన్’ పేరుతో పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చే పథకం మొదలైంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రజలను కూడా స్థలాలు ఇమ్మని కోరింది. జాస్మిన్ భర్తతో చర్చించి ‘పేదల ఇళ్ల కోసం మన స్థలం ఇస్తే అల్లా కూడా సంతోషపడతాడు’ అని చెప్పి, హజ్ యాత్ర మానుకుని, ఆ స్థలాన్ని ప్రభుత్వ పరం చేసింది. మొన్నటి ఆదివారం కేరళ ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జి స్వయంగా జాస్మిన్ ఇంటికి వచ్చి ఆమెను అభినందించింది. జాస్మిన్, హనీఫా చూపిన ఔదార్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి. అన్నట్టు హజ్‌కు వెళ్లాలని వెళ్లలేకపోయిన వృద్ధ జంట కథతో 2011లో మలయాళంలో తీసిన ‘అడమింటె మకన్ అబు’ సినిమా ప్రశంసలు అందుకుంది. అందులో ముఖ్యపాత్రలో నటించిన సలీం కుమార్‌కు జాతీయ అవార్డు దక్కింది. మన తెలుగు జరీనా వహాబ్ది మరో ముఖ్యపాత్ర. కేరళలో ఇప్పుడు ఈ సినిమాను కూడా గుర్తు చేసుకుంటున్నారు. -
Jasmine: మల్లెల్ని మెత్తగా నూరి.. ఇలా చేశారంటే.. ఉపశమనం కలుగుతుంది!
వేసవిలో మల్లెలు పంచే పరిమళం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం అలంకరణకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలను దూరం చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. తాజాగా ఉన్న మల్లెల్ని మెత్తగా నూరి.. తడిబట్టపై చుట్టి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేస్తే కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు ఉండటం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది. ఇక మీకెప్పుడైనా తలనొప్పి లేదా తలంతా పట్టేసినట్టు ఉంటే మల్లెపూలతో వాసెన కట్టులా కడితే ఉపశమనం కలుగుతుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది. ఇలా మాత్రం చేయకండి! స్నానం చేసేటప్పుడు శరీరానికి సోప్ అప్లై చేశాక లూఫాతో రుద్దుతుంటాం. అయితే చాలాసార్లు స్నానం తర్వాత మనం లూఫాను శుభ్రం చేయకుండా వదిలేస్తాం. మరుసటి రోజు మళ్లీ అదే లూఫాతో ఒంటిని రుద్దుతాం. ఇలా చేయడం వల్ల ఆ లూఫాలో పేరుకు పోయిన బాక్టీరియా శరీరాన్ని చేరి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి లూఫాను శుభ్రం చేశాకే వాడాలి. మీకు తెలుసా? భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ప్రజలు సరైన నిద్ర పోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 59 శాతం మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు. మొబైల్ వాడకమే అందుకు కారణం. చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
సైకో థ్రిల్లర్
అనిల్, జాస్మిన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపాల్ రెడ్డి కాచిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ శ్రీ శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై టీఎమ్ఎస్ ఆచార్య నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆధ్యాత్మిక గురువు హరిప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎమ్ఎస్ ఆచార్య మాట్లాడుతూ– ‘‘ఆసక్తికర కథతో గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా ఇది మా మొదటి ప్రయత్నం’’ అన్నారు. ‘‘ఆసక్తికరమైన మలుపులతో సాగే సైకో థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు గోపాల్ రెడ్డి కాచిడి. ‘‘నాకు హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థ్యాంక్స్’’ అన్నారు అనిల్. ‘‘తెలుగులో ఇది నా రెండో సినిమా’’ అన్నారు సబీనా జాస్మిన్. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: సీతా రామాంజనేయులు ఉప్పతల. -
వక్క లెక్కే వేరు!
ప్రయోగ శీలి అయిన రైతే కొండంత ధైర్యంతో సరికొత్త పంటలను పలకరించగలడు. అటువంటి విలక్షణ రైతే వేమూరి కోటేశ్వరరావు. ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల దిగుబడినిచ్చే వక్క, జాజి, మిరియం వంటి అరుదైన పంటలను శ్రద్ధతో సాగు చేస్తూ.. గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వేసవి పగటి ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో వక్క దిగుబడి కొంత తక్కువగా ఉంటుందని.. జాజి, మిరియాల దిగుబడి బాగానే వస్తుందంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయదారుడు కోటేశ్వరరావు అనుభవ పాఠాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ఉద్యాన తోటల సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న అన్నదాత వేమూరి కోటేశ్వరరావు. ఆయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కొత్త పంటలకు, ఔషధ పంటలకు నిలయం. కృష్టా జిల్లా పమిడిముక్కల మండలం పడమట లంకపల్లి గ్రామం నుంచి∙1999లో విజయనగరం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయితీ బట్టివలస గ్రామానికి కోటేశ్వరరావు వలస వచ్చి స్థిరపడి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వక్కతోపాటు ఔషధ మొక్కలను కలిపి సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. మొదట్లో చేదు అనుభవం... కర్ణాటకలోని శృంగేరీలో వక్క పంట సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మంగళ, సుమంగళ, శ్రీమంగళ, మెహిత్‌నగర్ రకాల విత్తనాన్ని తెప్పించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మెహిత్‌నగర్ రకం అధిక దిగుబడినిస్తుంది. 2003లో ఆయిల్‌పామ్ తోటలో అంతరపంటగా వక్క సాగు ప్రారంభించారు. కానీ, ఆ విధానం వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. దీంతో వక్క తీసేశారు. 2009లో మళ్లీ రెండెకరాల్లో వక్క సాగు మొదలు పెట్టారు. ఐదు సంవత్సరాలకు ఫలసాయం రావటం మొదలైంది. ఆ ఉత్సాహంతో మరో ఐదెకరాల్లో వక్క మొక్కలు వేశారు. అలా ఏటా పెంచుకుంటూ వెళ్లి ప్రస్తుతం 14 ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. సాధారణంగా ఐదున్నరేళ్లకు తొలి దిగుబడినిచ్చే వక్క పంట ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న కోటేశ్వరరావు పొలంలో నాలుగున్నరేళ్లకే ఫలసాయాన్ని అందిస్తున్నది. అరటి+ వక్క+మిరియం+జాజి... వక్క సాగు కొత్త కావటంతో కోటేశ్వరరావు తొలుత సాళ్లమధ్య, మొక్కల మధ్య 6 అడుగుల దూరంలో వక్క నాటారు. చెట్లు పెరిగేటప్పటికి బాగా వత్తుగా అయి, ఎత్తు పెరిగిపోతున్నాయి. పొలం మొత్తాన్నీ 7.5 అడుగుల దూరంలో బోదెలు తోలుకొని.. రెండు వరుసలు ఎటు చూసినా 7.5 అడుగుల దూరంలో వక్క నాటుకోవాలి. మూడో వరుసలో జాజి మొక్కలు నాటుకోవాలని కోటేశ్వరరావు తెలిపారు. వక్క ఎత్తు పెరిగాక మిరియం తీగలు పాకించాలి. మొదట్లోనే వక్క మొక్కలు నాటకూడదు. ఎండకు తట్టుకోలేవు. మొదట అరటి మొక్కలు నాటి నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వక్క మొక్కలు నాటుకోవాలి. విజయనగరం జిల్లా వాతావరణానికి వచ్చినంతగా కృష్ణా తదితర జిల్లాల్లో వక్క దిగుబడి రాదు. మార్చిలో వక్క పిందె వస్తుంది. ఎండలకు పిందె కొంత రాలుతుంది కాబట్టి దిగుబడి తగ్గుతుంది. మిరియం, జాజి దిగుబడి ఆ జిల్లాల్లోనూ బాగానే వస్తున్నదంటున్నారని కోటేశ్వరరావు వివరించారు. వక్క ఆదాయం ఎకరానికి రూ. లక్షన్నర ఒక చెట్టు నుంచి రెండు కేజీల వక్క కాయలు ఏటా లభ్యమవుతాయి. వక్క, జాజి చెట్లు ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల వరకు ఆదాయాన్నిస్తాయి. కేజీ వక్క రూ.120 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. ఎకరా పొలంలో 750 వరకూ వక్క మొక్కలు నాటుకోవచ్చు. అంతర పంటలు లేకుంటే వెయ్యి మొక్కలు నాటుకోవచ్చు. దగ్గరగా వేస్తే ఎత్తుగా పెరుగుతుంది. దానివల్ల గెలలు కోయడానికి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఏడాదికి ఎకరాకి రూ.1.5 లక్షలకు పైబడి ఆదాయం లభిస్తుంది. అంతరపంటగా వేసిన జాజి, మిరియం కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. వక్కలో ఏడేళ్ల తర్వాత దిగుబడి పెరుగుదల నిలిచిపోతుంది. జాజిలో ప్రతి ఏటా దిగుబడి పెరుగుతుందని కోటేశ్వరరావు అంటున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవామృతాన్ని, వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని సాగుకు వినియోగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఆయన సాగుచేస్తున్న ఔషధ మొక్కలతో పలువురు రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు. మండలంలో ఎవరికైనా పాము కరిస్తే ముందు గుర్తుచ్చేది కోటేశ్వరరావే. ఉల్లిపాము(రక్తపింజరి) కాటుకు ఆయుర్వేద మందును కోటేశ్వరరావు ఉచితంగా అందిస్తుంటారు. మిశ్రమ పంటల సాగు లాభదాయకం వక్క పంట విత్తనాలను మొక్కలుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, అంబాజీపేట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వారు మన రాష్ట్రంతో పాటుæ హైదరాబాద్, కర్ణాటక పట్టణాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఒక్కో మొక్క రూ.16 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. వక్క చెట్టు మట్టల(జంటలు)తో చక్కని పేపరు ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ పంట అధికంగా కర్ణాటకలో సాగులో ఉంది. ఇందులో మిశ్రమ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అంతే కాకుండా ఆయుర్వేదిక్ మార్కెట్లో గిరాకి కలిగిన అతిమధురం, సరస్వతి, నేలవేము, దుంపరాష్ట్రం తదితర ఔషధ పంటలతో పాటు మిరియాలు వంటి సుగంధ ద్రవ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు! ఉత్తరాంధ్రలో వక్క పంటను ప్రత్యేకంగా సాగు చేస్తున్నది నేనొక్కడినే. వక్క పంట సాగుకు ప్రత్యేక వాతావరణం అవసరం. ఈ మొక్కలు అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. నేలలో తేమ మాత్రమే ఉండాలి. నీరు నిల్వ ఉండకూడదు. మక్కువ మండలంలో ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల వక్క సాగుకు అనుకూలత ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర దిగుబడి బాగుంటుంది. కుళ్లిన అరటి చెట్ల ఆకులు, గోమూత్రం, పేడ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. అంతర పంటల ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతాయి. వక్కలో అంతరపంట మిరియాలతో వచ్చిన ఆదాయంతో వక్క పంటకు వెచ్చించిన ఖర్చు వచేస్తుంది. ఈ ఏడాది జాజికాయ, నల్ల మిరియాల పంటల సాగు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇతర రాష్ట్రాల్లో వక్క పంట సాగుకు ప్రభుత్వ రాయితీలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. దాంతో, ఎంతగా అవగాహన కల్పించినా వక్క సాగు చేసేందుకు మన రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవలే జాజికాయ సాగు మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వక్క మొక్కల నర్సరీ ఆకు ముడత రానివ్వదు! ఇది సిక్కిం రాష్ట్రానికి చెందిన దేశవాళీ మిరప రకం. ఆకు ముడతను దరి చేరనివ్వకపోవడం, ఒకసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుడినివ్వటం (బహువార్షిక రకం), చక్కని వాసన కలిగి ఉండటం.. ప్రత్యేకతలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు బాలరాజు(98663 73183) దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్– 83329 45368. చీడపీడల నివారణలో.. చేతిని మించిన సాధనం లేదు! కాకర ఆకుల మీద పసుపు రంగు నల్లులు చేరి పత్రహరితాన్ని తింటాయి. ఆకులన్నీ అస్థిపంజరాల వలె అవుతాయి. నివారణ ఏ మందులూ అవసరం లేదు. చీడపీడల నివారణలో, చేతిని మించిన సాధనం లేదు! ఆకులపై నల్లులు కనిపిస్తే చేతి వేళ్లతో నలిపేయాలి. అలా వరుసగా రెండు, మూడు రోజులు చెయ్యాలి. ఈ పని చేస్తే నల్లుల సమస్య సునాయాసంగానే పోతుంది. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు – వేమూరి కోటేశ్వరరావు (94407 45555), వక్క రైతు, బట్టివలస, మక్కువ మండలం, విజయనగరం జిల్లా దివంగత వైఎస్సార్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న కోటేశ్వరరావు వక్కల చెట్లకు పాకిన మిరియాల పాదులు – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం ఫొటోలు: బత్తెన శాంతీశ్వరరావు, మక్కువ -
ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఇవే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. వేప చెట్టును రాష్ట్ర వృక్షంగా, కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా, రామ చిలుకను రాష్ట్ర పక్షిగా, మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తిస్తూ అటవీ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండేది. దాని స్థానంలో రామ చిలుకను రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. -
అ‘ధర’గొడుతున్న మల్లెలు
సాక్షి, అమరావతి: సువాసనలు వెదజల్లుతూ మధురానుభూతులు పంచే మల్లెలు పెరిగిన ధరలతో వినియోగదారుల ముక్కుపుటాలను అ‘ధర’గొడుతున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో వాటి ధర పెరగడంతో కొనడానికి వినియోగదారులు జంకుతున్నారు. పూల కొట్ల వద్ద మూర మల్లెపూలను రూ.30 నుంచి రూ.35కి, పూల మార్కెట్లో కిలో రూ.1000కి అమ్ముతున్నారు. గతంలో మూర రూ.10 నుంచి రూ.20లోపు, కిలో రూ.500 వరకూ ఉండేది. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం కొంచెం డిమాండ్ ఉండేది. ప్రస్తుతం అవేమీ లేకపోయినా మల్లెపూల ధరలు షాక్ కొడుతున్నాయి. మల్లెపూలు ఎక్కువగా సాగయ్యే రాజధానిలో ప్రభుత్వ భూసమీకరణ వల్ల సాగు తగ్గి ఉత్పత్తి పడిపోయింది. దీంతో డిమాండ్‌తోపాటు పూలకు రేటూ పెరిగింది. గతంలో రాష్ట్రంలో 12 వేల నుంచి 15 వేల ఎకరాల్లో మల్లె సాగు జరిగేది. ప్రస్తుతం 7 వేల ఎకరాలకే పరిమితమైంది. రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి మండలంలో నిడమర్రు, కురగల్లు, బేతపూడి మల్లె సాగుకు పెట్టింది పేరు. గతంలో ఈ మూడు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం అది 700 ఎకరాలకు పడిపోయింది. నిడమర్రులోనే గతంలో 1500 ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం 500 ఎకరాల్లో కూడా సాగు లేకుండాపోయింది. రాజధానికి భూములు తీసుకోవడంతో మల్లె తోటల స్థానంలో బీడు భూములు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో ఎకరానికి వెయ్యి క్వింటాలు మల్లెపూల దిగుబడి వచ్చేదని, కానీ ఇప్పుడు తగ్గిందని చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు గతంలో తోటల్లో రైతులు కిలో మల్లె పూలను రూ.200కి వ్యాపారులకు అమ్మేవారు. వ్యాపారులు పూల కొట్లకు రూ.300 నుంచి రూ.400కి విక్రయించేవారు. మూర ధర రూ.10, రూ.15 ఉండేది. కానీ తోటలు తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. గతంలో విజయవాడ, గుంటూరుతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ఇక్కడి నుంచే పూలు పంపేవారు. ప్రస్తుతం విజయవాడకే పూలు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో వడ్లపూడి, చీరాల, మైలవరం, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో మల్లె సాగు జరుగుతున్నా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రాజధాని పరిధిలో మూడు గ్రామాలతోపాటు పరిసర గ్రామాల్లో పూల సాగు తగ్గిపోవడంతో రైతులు, కూలీలు, ఉపాధి కోల్పోయారు. తోటలన్నీ పోయాయి మల్లె తోటలతో మా ఊరు కళకళలాడేది. అందరికీ పని దొరికేది. రాజధానికి చాలావరకూ భూములు పోవడంతో పనే లేకుండా పోయింది. గతంలో కిలో మల్లెలు రూ.150 నుంచి రూ.200కి అమ్మినప్పుడు బాగా లాభాలు వచ్చేవి. ఇప్పుడు రూ.500కి అమ్ముతున్నా గిట్టుబాటు కావడంలేదు. – భద్రారెడ్డి, మల్లె తోట రైతు, నిడమర్రు పనులు లేక కష్టాలు రోజూ రెండు, మూడు గంటలు పూలు కోసి రూ.80 సంపాదించేవాళ్లం. ఆ తర్వాత వేరే పని చేసుకునేవాళ్లం. ఇప్పుడు మల్లె తోటల్లో పని లేకుండాపోయింది. అరకొర పనితో ఏమీ ఉపయోగం ఉండడం లేదు. ఇతర పనులు కూడా లేక చాలా కష్టాలు పడుతున్నాం. –సుజాత, కూలీ, నిడమర్రు -
నిఖత్ ముందంజ
రోహ్తక్: జాతీయ మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ముందంజ వేసింది. సోమవారం జరిగిన ఫ్లయ్ వెయిట్ కేటగిరి బౌట్లో నిఖత్ 5–0తో అంజూ సాబు (కేరళ)పై గెలిచింది. వెల్టర్ వెయిట్ విభాగంలో తెలంగాణకే చెందిన షేక్ రూహి తన ప్రత్యర్థి జాస్మీ జోస్ (కేరళ)కు వాకోవర్ ఇచ్చింది. లైట్ వెల్టర్ వెయిట్ బౌట్లో జి. షరా (ఆంధ్రప్రదేశ్) 0–5తో చవోబా దేవి (మణిపూర్) చేతిలో పరాజయం పాలైంది. -
పూలు కడితే పైసలు వచ్చేవి
వేసవి జ్ఞాపకం వేసవి వచ్చిందంటే పాత జ్ఞాపకాలన్నీ ఇప్పుడే కోసిన పూలలా తాజా అవుతుంటాయి. వేసవిలో బాల్యం, బాల్యంలో వేసవి రెండూ బాగుంటాయి. అబ్బాయిల సంగతేమోకాని అమ్మాయిలకు వేసవి వచ్చిందంటే సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషానికి కారణం మల్లెపూలు. సాయంత్రం అయ్యాక వీధి దీపాలు వెలుగుతుండగా చుట్టుముట్టిన వేడిని ఆరుబయట నీళ్లు చల్లి చల్లబరుచుకుంటూ ఉండగా వీధిలోకి మల్లెపూల బండి వచ్చేది. నాలుగు చక్రాల బండిపై రాశులు పోసిన మల్లెపూలను అమ్ముతూ ‘మల్లెమొగ్గల్... మల్లెమొగ్గల్’... అని అరుస్తూ బండివాడు తిరుగుతూ ఉంటే వాటిని కొనడానికి అమ్మ దగ్గర మారాము చేయాల్సి వచ్చేది. కొని, మాల కట్టి, తలలో పెట్టుకునేదాక కాలు నిలువదు. ఉత్త పూలు ఒకోసారి, మరువం వేసి ఒకోసారి, దవనంతో ఒకసారి, అప్పుడప్పుడు మధ్య మధ్య అలంకారంగా నాలుగు కనకాంబరాలు వేసి ఒకసారి అల్లి పూలు పెట్టుకుంటే మనసు విప్పారేది. రాత్రి పూట నిద్రపోతే దిండు మీద అవన్నీ నలిగిపోయి నిద్రలో కదలడం వల్ల పక్కంతా అయ్యి తెల్లవారుజామున నిద్ర లేస్తుంటే ఒకటే సువాసన. వేసవి అంటే పెద్ద పెద్ద ఎండలే కాదు పొడవు పొడవు మల్లెపూల జడలు కూడా. ఆ జడలు వేసుకొని ఫొటో స్టుడియోకి వెళ్లి అద్దంలో జడ కనిపించేలా ఫొటో దిగి దానికి ఫ్రేమ్ కట్టించుకుని గోడకు వేలాడదీసే దాకా అదో పెద్ద హడావిడి. మా ఊళ్లో మే నెలలో మల్లెపూల గిరాకీ ఇంకా పెరిగిపోయేది. అంగళ్లలో విడిపూలకు కాకుండా మాలలకే డిమాండ్ ఎక్కువ. అప్పుడు మాకు తెలిసిన ఒక షాపు వాళ్లు మా ఇంటికి విడి పూలు తెచ్చి ఇచ్చేవారు. వాటిని మాలలుగా కట్టి ఇస్తే కట్టినందుకు కూలి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లేవారు. అవి పెద్ద డబ్బులు కాకపోయినా చిల్లర పైసలే అయినా పూలు కట్టి సంపాదించిన ఆ డబ్బులు పెద్ద పెన్నిధిగా అనిపించేవి. వారమంతా పూలు అల్లితే ఆదివారం దర్జాగా సినిమాకు వెళ్లి ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ తాగేంత డబ్బులు వచ్చేవి. మా ఇంట్లోనే కాదు చుట్టుపక్కల ఇళ్లల్లో చాలామంది ఆడపిల్లలు వేసవిలో మల్లెపూలను మాలలుగా కట్టి ఇచ్చే కాంట్రాక్టుల్లో బిజీగా ఉండేవారు. ఇప్పుడు పెద్దవాళ్లం అయిపోయాం. కాని బజారులో నిలబడి ఈ సాయంత్రాల్లో మల్లెలు కొన్నప్పుడల్లా ఆ జ్ఞాపకం చటుక్కున మనసును తాకుతుంది. గుప్పెడు పూలను దోసిట్లో తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకున్నంత మధురంగా అనిపిస్తుంది. వేసవీ... జిందాబాద్. మల్లెమాలా వర్థిల్లు. – షబీనా, బాపట్ల