Wimbledon 2024: సరికొత్త చాంపియన్‌ క్రిచికోవా | Wimbledon 2024 Women Singles: Krejcikova Defeats Paolini Won Title | Sakshi
Sakshi News home page

Wimbledon 2024: సరికొత్త చాంపియన్‌ క్రిచికోవా

Published Sat, Jul 13 2024 9:31 PM | Last Updated on Sat, Jul 13 2024 9:31 PM

Wimbledon 2024 Women Singles: Krejcikova Defeats Paolini Won Title

PC: Wimbledon X

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌ అవతరించింది. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ బార్బరా క్రిచికోవా వింబుల్డన్‌-2024 టైటిల్‌ సాధించింది.

లండన్‌ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో క్రిచికోవా.. ఇటలీకి చెందిన జాస్మిన్‌ పావోలిపై గెలుపొందింది. 6-2, 2-6, 6-4 తేడాతో జాస్మిన్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ప్రపంచ 31వ ర్యాంకర్‌ క్రిచికోవా.. వరల్డ్‌ సెవన్త్‌ ర్యాంకర్‌ జాస్మిన్‌కు చెమటలు పట్టించింది. అయితే, రెండో సెట్‌లో మాత్రం క్రిచికోవాను సమర్థవంతంగా ఎదుర్కొంది జాస్మిన్‌.

ఈ క్రమంలో కీలకమైన మూడో సెట్‌లోనూ దూకుడుగా ఆడిన జాస్మిన్‌ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలిగింది. కానీ.. తిరిగి కోలుకున్న క్రిచికోవా .. జాస్మిన్‌కు మరో అవకాశం ఇవ్వలేదు.

కాగా 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ ట్రోఫీ గెలిచింది. మరోవైపు.. 28 ఏళ్ల జాస్మిన్‌ గత నెలలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఇగా స్వియా టెక్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా వింబుల్డన్‌ వుమెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లోనూ ఆమెకు ఇలా చేదు అనుభవమే ఎదురైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement