Barbora Krejcikova
-
క్రెజికోవాకు కిరీటం
లండన్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సారి వింబుల్డన్ ఫైనల్ చేరిన ఇద్దరు ప్లేయర్ల మధ్య శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరులో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది. 1 గంటా 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మూడు సెట్ల సమరంలో 28 ఏళ్ల చెక్ ప్లేయర్ పైచేయి సాధించింది. 2021లో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్న క్రెజికోవా కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. వింబుల్డన్‌లో 31వ సీడ్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రెజికోవా చివరకు టైటిల్‌తో ముగించింది. ఫైనల్ పోరులో ఆరంభంలో జాస్మిన్‌పై ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 11 పాయింట్లలో 10 గెలుచుకొని ముందంజ వేసింది. ఆ తర్వాత డబుల్ బ్రేక్‌తో 5–1తో ఆధిక్యంలో నిలిచిన ఆమె సునాయాసంగా సెట్‌ను ముగించింది. ఆమె జోరు చూస్తే రెండో సెట్లోనే మ్యాచ్ గెలిచేస్తుందని అనిపించింది. అయితే విరామ సమయంలో పావొలిని ఆట మారింది. చక్కటి గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో దూసుకుపోయి 3–0తో నిలిచి ఇటలీ ప్లేయర్ ప్రత్యర్థి ని కోలుకోనీయకుండా సెట్‌ను ముగించింది. చివరి సెట్లో ఆట ఆసక్తికరంగా సాగింది. క్రెజికోవా 5–3 వద్ద ఉన్న దశలో పావొలిని గేమ్ గెలిచి కొంత పోటీనిచ్చినా...పదో గేమ్‌లో క్రెజికోవా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజేతగా అవతరించింది. క్రెజికోవా ఖాతాలో రెండు సింగిల్స్ టైటిల్స్‌తో పాటు 7 డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి. నేడు పురుషుల ఫైనల్ జొకోవిచ్ (సెర్బియా) గీ అల్కరాజ్ (స్పెయిన్) సా.గం.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
Wimbledon 2024: సరికొత్త చాంపియన్ క్రిచికోవా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన టెన్నిస్ ప్లేయర్ బార్బరా క్రిచికోవా వింబుల్డన్-2024 టైటిల్ సాధించింది.లండన్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో క్రిచికోవా.. ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిపై గెలుపొందింది. 6-2, 2-6, 6-4 తేడాతో జాస్మిన్ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిచికోవా.. వరల్డ్ సెవన్త్ ర్యాంకర్ జాస్మిన్‌కు చెమటలు పట్టించింది. అయితే, రెండో సెట్లో మాత్రం క్రిచికోవాను సమర్థవంతంగా ఎదుర్కొంది జాస్మిన్.ఈ క్రమంలో కీలకమైన మూడో సెట్లోనూ దూకుడుగా ఆడిన జాస్మిన్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలిగింది. కానీ.. తిరిగి కోలుకున్న క్రిచికోవా .. జాస్మిన్‌కు మరో అవకాశం ఇవ్వలేదు.కాగా 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ట్రోఫీ గెలిచింది. మరోవైపు.. 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియా టెక్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా వింబుల్డన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లోనూ ఆమెకు ఇలా చేదు అనుభవమే ఎదురైంది.The moment a dream became reality ✨#Wimbledon | @BKrejcikova pic.twitter.com/38xPz9pCin— Wimbledon (@Wimbledon) July 13, 2024Showing off the Venus Rosewater Dish to the adoring #Wimbledon fans 🤩 pic.twitter.com/GmMlsOPMWW— Wimbledon (@Wimbledon) July 13, 2024 -
'మోస్ట్ అన్‌లక్కీ'.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఔట్
డిఫెండింగ్ చాంపియన్ బార్బరా క్రేజీకోవా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అనూహ్యంగా వైదొలిగింది. ఇప్పటికే సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన క్రేజీకోవా.. తాజాగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో డబుల్స్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో డబుల్స్ టైటిల్‌ను నిలుపుకోవాలనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. ఈ విషయాన్ని క్రేజీకోవా 'దురదృష్టవంతురాలిని' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మెడికల్ అప్డేట్ను షేర్ చేసుకుంది. ''మంగళవారం రాత్రి కాస్త అలసటగా అనిపించింది. తెల్లారి చూసేసరికి కొద్దిగా జ్వరం వచ్చినట్లయింది. దీంతో టెస్టుకు వెళ్లగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలియగానే వెంటనే టోర్నీ నుంచి వైదొలిగాను. సింగిల్స్ ఓడిపోయాను.. కనీసం డబుల్స్ టైటిల్ నిలుపుకుందామనుకున్నా.. కానీ బ్యాడ్‌లక్ కుదరలేదు''అంటూ ఎమెషనల్ అయింది. కాగా కేజ్రీకోవాతో పాటు చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మేరీ బౌజ్కోవా కూడా ఆరోగ్య కారణాలతో రెండో రౌండ్ సింగిల్స్ ఆడకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. కాగా సోమవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో బార్బరా క్రేజీకోవా 19 ఏళ్ల డైన్ పారీ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన కేజ్రీకోవా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాంపియన్‌గా నిలిచింది. సింగిల్స్ ఫైనల్లో అనస్తాసియా పావ్లియుచెంకోవాను ఓడించి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సినికోవాతో జతకట్టి ఫైనల్లో గెలిచిన కేజ్రీకోవా డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. కాగా మేరీ పియర్స్ తర్వాత ఒక ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ విజేతగా నిలిచిన రెండో మహిళగా కేజ్రీకోవా నిలిచింది. చదవండి: Nikhat Zareen-Mary Kom: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది French Open 2022: మూడో రౌండ్లోకి నొవాక్ జొకోవిచ్ -
ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌కు పరాభవం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రెండో రోజు పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ బార్బరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 97వ ర్యాంకర్, 19 ఏళ్ల ఫ్రాన్స్ అమ్మాయి డియాన్ పారీ 1–6, 6–2, 6–3తో క్రిచికోవాపై సంచలన విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన మూడో డిఫెండింగ్ చాంపియన్‌గా క్రిచికోవా నిలిచింది. గతంలో అనస్తాసియా మిస్కినా (రష్యా–2005), ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా–2019) మాత్రమే టైటిల్ సాధించిన తర్వాత ఏడాది తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 38వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. 28వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) 7–5, 6–4తో మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకాను ఓడించింది. టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–0తో సురెంకో (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో 13 సార్లు చాంపియన్ నాదల్ (స్పెయిన్) తొలి రౌండ్లో 6–2, 6–2, 6–2తో థాంప్సన్ (ఆస్ట్రేలియా)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2015 విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–2, 3–6, 6–7 (2/7), 3–6తో ముటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు.