
కలువ కాదు.. మల్లె!
దీన్ని చూస్తే కలువ పువ్వులా ఉంది కదూ. నిజానికి ఇది మల్లెపువ్వు. పాలకొల్లు శంభునిపేటలో నివాసం ఉంటున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొల్లాబత్తుల సూర్యకుమార్ ఇంటి పెరట్లో మొగ్గతొడిగి ఇలా విచ్చుకుంది. కలువ పువ్వంత సైజులో పూసిన ఈ సిరి మల్లె చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన ఇంటిపెరట్లో సాధారణ మల్లె మొక్కను నాటానని.. దానికి ఇంత పెద్దపువ్వులు పూస్తున్నాయని సూర్యకుమార్ చెప్పారు.
- పాలకొల్లు