Lily flower
-
లిల్లీ పంట ఒక్కసారి వేస్తే మూడేళ్ళ పాటు ఆదాయం
-
లిల్లీ పూల సాగుతో ఆదాయం భళా.. ఒకసారి పంట వేస్తే మూడేళ్ల వరకు లాభం
-
Photo Feature: పుష్ప‘మే’
మండే ఎండలు కాచే మే నెలలో ప్రకృతి కాస్త కరుణ చూపడంతో పాటు చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ఇదే సమయంలో ఈ నెలలో మాత్రమే పూచే కొన్ని అరుదైన జాతుల మొక్కలు పుష్పించాయి. మండుతున్న బంతిలా ఉండే ఈ విచిత్ర పూలు ఎక్కువగా గల్ఫ్‌దేశాల్లో కనిపిస్తాయి. వీటి శాస్త్రీయ నామం స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్. స్థానికంగా వీటిని బ్లడ్ లిల్లీ, ఫైర్‌బాల్ లిల్లీ అని పిలుస్తారు. యోగివేమన విశ్వవిద్యాలయం సూపరింటెండెంట్ జి.వి.నాగలక్ష్మి కృష్ణాపురంలోని తన నివాసంలో వీటిని పెంచుతున్నారు. – వైవీయూ (వైఎస్సార్ జిల్లా) -
కలువ కాదు.. మల్లె!
దీన్ని చూస్తే కలువ పువ్వులా ఉంది కదూ. నిజానికి ఇది మల్లెపువ్వు. పాలకొల్లు శంభునిపేటలో నివాసం ఉంటున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొల్లాబత్తుల సూర్యకుమార్ ఇంటి పెరట్లో మొగ్గతొడిగి ఇలా విచ్చుకుంది. కలువ పువ్వంత సైజులో పూసిన ఈ సిరి మల్లె చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన ఇంటిపెరట్లో సాధారణ మల్లె మొక్కను నాటానని.. దానికి ఇంత పెద్దపువ్వులు పూస్తున్నాయని సూర్యకుమార్ చెప్పారు. - పాలకొల్లు