పువ్వులు అలంకరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని దండల రూపంలో ఐతే మూర లెక్కన విడి పువ్వులైతే గ్రాములు, కిలోల లెక్కన తీసుకుంటాం. ఇది సర్వసాధారణం. ఐతే ఇక నుంచి మూరలు లెక్కన పూల దండలను అమ్మడానకి వీల్లేదట. ఒకవేళ అలా అమ్మితే రెండు వేలు వరకు జరిమాన విధిస్తారట. అంతేగాదు పూల దండలను మీటర్లు లేదా సెంటీమీటర్ల చొప్పునే అమ్మాలనే నిబంధన కూడా విధించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ అంశం ఇప్పుడూ కేరళ అంతటా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..సాధారణంగా మల్లెలు, కనకాంభరాలు తదితర పూల దండలను మూరలెక్కనే అమ్మతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కేరళలో త్రిసూర్‌లో లీగల్ మెట్రోలజీ డిపార్ట్‌మెంట్ ఇక నుంచి అలా అమ్మకూడదంటూ పూల వ్యాపారులకు నోటీసులు పంపింది. ఇలా అమ్మితే పూల దండ దాదాపు 24 అంగుళాలు లేదా 60 సెంటీమీటర్లే ఉంటుందని చెబుతోంది. ఇక నుంచి పూల దండలను సెంటీమీట్లర్లు లేదా మీటర్లలోనే కొలవాలని రూల్ పాస్ చేసింది.
ఒకవేళ మూర లెక్కన అమ్మినట్లు తెలిస్తే వారికి రూ. 2000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. కేరళలో ఈ అంశం ఒక హాట్‌టాపిక్‌గా మారిపోయింది. త్రిసూర్ షాపులలో తనిఖీలు నిర్వహించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని లీగల్ మెట్రాలజీ విభాగం అధికారి ఏషియానెట్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 111ఈ, పీనల్ ప్రొవిజన్ 29 ప్రకారం పూల దండలను అత్యంత సాధరణ యూనిట్ ఎస్‌ఐ(ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్)లో కాకుండా మూర లేదా క్యూబిట్‌లో అమ్మడం నేరం అని, దీని కింద రూ. 2000/- జరిమాన విధిస్తామని కరాకండీగా తేల్చి చెప్పింది.
ప్రజలు గనుక మూర లేదా క్యూబిన్‌ల కింద కోరినట్లయితే వ్యాపారులు 44.5 సెంటీమీటర్ల పూల దండను ఇవ్వాలని లీగల్ మెట్రాలజీ సూచించింది. ఐతే కొలతల్లో చాలా మార్పులు వస్తాయని వ్యాపారులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూల అమ్మకాలు చాల సంత్సరాలుగా జరగుతున్నాయి. నిజానికి సాధారణ ప్రజలకు పూలు మూర లేదా సెంటమీటర్లలో అమ్మడం అనేది అనవసరమైన విషయమని, ఇది పెద్ద సమస్య కాదంటూ ఆ నిబంధనను వ్యాపారులు కొట్టిపారేయడం గమనార్హం.
(చదవండి: వామ్మో ఎంత పెద్ద క్యూ లైన్! అంతలా బారులుతీరి జనాలు ఎందుకున్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment