legal
-
స్వలింగ వివాహాలకు థాయ్‌లాండ్ చట్టబద్ధత
బ్యాంకాక్: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్ నిర్ణయించింది. ఇందుకు వీలు కలి్పంచే చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్కర్ణ్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచి్చన తొలి దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. 2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త వంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు వాడతారు. స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కు (ఎల్జీబీటీక్యూ)లకు థాయ్‌లాండ్‌లో మొదటినుంచీ స్వేచ్ఛ ఎక్కువే. అయితే పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్లు 20 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత బిల్లు జూన్‌లో సెనేట్ ఆమోదం పొందింది. రాజు ఆమోదంతో మంగళవారం చట్టరూపు దాల్చింది. ఇది చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు ప్రశంసించారు. ‘‘చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నాం. సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయమిది’’అని ఎల్జీబీటిక్యూ హక్కుల కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్న చుమాపోన్ అన్నారు. చట్టం అమల్లోకి రానున్న జనవరి 22న 1,000కి పైగా ఎల్జీబీటీక్యూ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించే యోచన ఉన్నట్టు ఆమె తెలిపారు.ఆసియాలో మూడో దేశం తైవాన్, నేపాల్ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కలి్పంచిన మూడో దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. తైవాన్ 2019లో తొలిసారి ఈ చర్య తీసుకుంది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. -
బ్యాంకు వారికి.. ఆ హక్కు లేదు!
ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – గ్రాట్యుటీని బ్యాంకు వారు లోన్ బకాయిల రీత్యా జమ కట్టుకోవచ్చా?ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మాధవరావు (పేరు మార్చాము) అనే ఒక వ్యక్తి కోవిడ్ సమయంలో సేవలు నిర్వహిస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం తన వారసులకు –భార్యకు రావలసిన కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ వంటి అంతిమ ఆర్థిక ప్రయోజనాలు (టెర్మినల్ బెనిఫిట్స్) భార్య అకౌంట్లోకి వచ్చాయి. అయితే, అలా అకౌంట్ లోకి వచ్చిన వెంటనే సదరు బ్యాంకు అధికారులు పెన్షన్ మొత్తాన్ని మాధవ రావు బతికుండగా తీసుకున్న లోన్ బకాయి కింద జమ కట్టుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన సదరు ఉద్యోగి భార్యను ‘ఇది మా హక్కు‘ మీ ఆయన మా బ్యాంకులో లోను తీసుకోవడమే కాక, తన టెర్మినల్ బెనిఫిట్స్ నుంచి కూడా రికవరీ చేసుకోవచ్చు అని మాకు రాసి ఇచ్చారు. అంతేకాక మీ భర్త పని చేసిన డిపార్ట్మెంట్ వారికి, మా బ్యాంకుకు మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. అందువలన మేము ఆ మొత్తాన్ని లోను కింద జమ కట్టుకున్నాము‘ అని చెప్పి ఆవిడని వెళ్ళిపొమ్మన్నారు. అప్పుడు ఇద్దరు మైనర్ పిల్లల తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.వాదోపవాదాలు విన్న తర్వాత, పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని, మరీ ముఖ్యంగా సి.పి.సి లోని సెక్షన్ 60 (1) నిబంధనల ప్రకారం ‘‘టర్మినల్ బెనిఫిట్స్ లోనుంచి వచ్చిన నిధులను, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్) వంటి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సంక్రమించిన నిధులను ఏ బ్యాంకు అయినా, కోర్టు అయినా అలా తీసుకోవడానికి, అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు’’ అని తీర్పునిస్తూ ‘‘ఆ మహిళ అకౌంట్లో నుంచి లోను బకాయి పేరుతో బ్యాంకు వారు తీసేసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఆ మహిళకు చెల్లించవలసిందే’’ అని ఆదేశించింది. అప్పటికీ కూడా బ్యాంకు వారు తిరిగి చెల్లించక΄ోవడంతో గౌరవ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాల్సి వచ్చింది. మొత్తానికి సదరు మహిళకి ఆ డబ్బులు మొత్తం బ్యాంకు వారు తిరిగి చెల్లించారు. బ్యాంకు వారికి లోన్ రికవరీ చేసే అధికారం వున్నప్పటికీ, చట్ట పరిధిలో ఉండి మాత్రమే రికవరీ చేయాల్సి వుంటుంది. లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకు లోన్ తీసుకున్నెప్పుడు ‘లోన్ ఇన్సూరెన్స్’ అనే పథకాన్ని ఎంచుకోవాలి. అంటే, రుణ బకాయీలు ఉండగా లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా, ఏదైనా శాశ్వత వైకల్యం వంటివి కలిగి ఉపాధి కోల్పోయిన సమయాలలో వారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఉండచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీ బదులు లోన్ కడతారు. మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని లోన్ఖాతాలకి లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, బ్యాంకు వారు కూడా లోన్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ చెప్పి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్‌కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!
చండీగఢ్: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం రాకతో 1980ల నుంచి భారత్‌లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు. శనివారం చండీగఢ్‌లో పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. టెక్నాలజీ వాడకం పెరగాలి టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కారమే అవుతుందని.. మనుషులంతా కూర్చుని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కాదని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు. శనివారం హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిది.. నల్సార్ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్ ఎయిడ్‌తోపాటు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ప్రోత్సహించడంలో నల్సార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!
భారతీయ సమాజంలోని వివిధ రంగాలలో సమాన హక్కులు అంతుచిక్కని లక్ష్యం. న్యాయవ్యవస్థలో కూడా ఇదే ధోరణి. భారతీయ న్యాయ వ్యవస్థలోని మహిళల ప్రాతినిధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, మగవారి ఆడవారి మధ్యలో ఉన్న అసమానత్వం స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. పైగా ఇందులో మార్పు అత్యంత అవసరం అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. అత్యున్నత న్యాయస్థానంలో 36 మంది న్యాయమూర్తులలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు. ఈ అసమానత అత్యున్నత న్యాయస్థానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది హైకోర్టుల వరకు వ్యాపించింది, ఇక్కడ వెయ్యి మంది న్యాయమూర్తులలో కేవలం 96 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. 3.3 లక్షల మంది న్యాయమూర్తులకు న్యాయ అధికారులలో కేవలం 6% మంది మహిళలు ఉన్నారు. భారతదేశంలోని విస్తృత చట్టపరమైన ల్యాండ్‌స్కేప్‌లో 15% కంటే తక్కువ మంది మహిళలు న్యాయవాదులు ఉన్నారు. ఈ నిరుత్సాహపరిచే అసమానతకు దోహదపడే కారకాలు చాల ఉన్నాయి. అవి చాలా లోతుగా పాతుకుపోయాయి. ఇప్పటికి సామాజిక పక్షపాతాలు, నిబంధనలు న్యాయవాద వృత్తిని కొనసాగించకుండా మహిళలను నిరుత్సాహపరుస్తున్నాయి. దానితో పాటు చట్టపరమైన విద్య కూడా చాల తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. న్యాయవాద వృత్తిలో ఆదాయం చాలా మారవచ్చు. ఇది న్యాయమూర్తులు కావాలనుకునే మహిళా న్యాయవాదులకు కష్టతరం చేస్తుంది. న్యాయనిర్ణేతగా మారడం వారికి కష్టంగా ఉంటుంది. ఇలా చాల సవాళ్లు ఉన్నాయి. కానీ దాంతో పాటు ఆశ కూడా మిగిలి ఉంది. మాజీ, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తులు కోర్టులలో చాల సార్లు మహిళలకు పదోన్నతులు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో చట్టపరమైన రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నాలు మరింత ముఖ్యమైనవిగా ఉండాలి. మెరుగైన మహిళా ప్రాతినిధ్యానికి స్థిరమైన లక్ష్యం, విధానం అవసరం. ఈ మొదటి అడుగు ప్రశంసనీయమే కానీ నిజమైన సమానత్వం కోసం ప్రతి ఒక్కరి కృషి అవసరం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌర సమాజం అందరు కలిసి పనిచేయాలి. ఇటీవలే, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో మహిళా కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యలు చూసి, కోర్టులు మహిళా న్యాయానికి కట్టుబడి ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు సమాన హక్కులు గూర్చి లోతైన కారణాలపై పోరాడటానికి న్యాయస్థానాలు తమ బాధ్యతను అంగీకరిస్తాయని చూపిస్తుంది. కొంతకాలం క్రితం, భారతదేశ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 7న మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితి గురించి ప్రకటన చేసారు. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వం వహించారు. ఇది ఒక కొలిక్కి రావాలంటే ఈ తరహా సహాయం ఆయన చేయాలనీ సుప్రీంకోర్టు గ్రహించింది. కాబట్టి, వారు సహాయం చేయడానికి మొత్తం మహిళల కమిటీని రూపొందించడానికి తమ ప్రణాళికను పంచుకున్నారు. ఈ ఏర్పడిన కమిటీలో ఉన్నత న్యాయస్థానాల నుంచి ముగ్గురు ప్రముఖ మాజీ న్యాయమూర్తులు ఉంటారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ కమిటీకి నాయకత్వం వహిస్తారు. ఇతర కమిటీ సభ్యులు జస్టిస్ షాలినీ ఫన్సల్కర్ జోషి (బాంబే హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసారు), జస్టిస్ ఆశా మీనన్ (గతంలో ఢిల్లీ హైకోర్టు నుండి పనిచేశారు). సహాయక చర్యలను పర్యవేక్షించడం, ప్రార్థనా స్థలాలు, గృహాలను పునరుద్ధరించడం, సహాయక చర్యలను మెరుగుపరచడం తోపాటు మరిన్ని బాధ్యతలు కమిటీకి ఉంటాయి. మే నుంచి జులై వరకు జరిగిన హింసాత్మక సంఘటనల గురించి పరిశోధన చేయడానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్ను నాయకత్వం వహించడానికి ఎంపిక చేసారు. పద్సల్గికర్ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నాగాలాండ్‌లో పనిచేశాడు. ఈ కేసుల కోసం మణిపూర్‌లో 6500 పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ, న్యాయవ్యవస్థలో లింగ సమానత్వాన్ని సాధించడానికి సమయం పడుతుంది. మహిళలకు మాత్రమే న్యాయస్థానాలను సృష్టించడం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడడం తదితరాలు సానుకూల అభివృద్ధి. కానీ, నిజమైన పురోగతికి మరిన్ని మార్పులు అవసరం. న్యాయవాద వృత్తిలో మహిళలకు మరింత అధికారం ఇవ్వడం ముఖ్యం. చట్టంలో మహిళలపై అన్యాయమైన నమ్మకాలను తొలగించడం చాలా కీలకం. మహిళలు ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మార్పుల కోసం నిరంతర శ్రద్ధ, కృషి అవసరం. ఇలాంటి కార్యక్రమాలతో మనం స్థిరంగా కొనసాగితే, న్యాయవ్యవస్థలో మహిళలు తమ స్థానాలను సక్రమంగా చేపట్టేందుకు చాల గొప్ప అవకాశం ఉంటుంది. దీని వల్ల న్యాయ వ్యవస్థలో మహిళలకు పెద్ద పాత్ర ఉంటుంది. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థ బలంగా, న్యాయంగా ఉండవచ్చు. భారతదేశ న్యాయ వ్యవస్థలో స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం ముఖ్యం. మనమందరం మహిళల అభిప్రాయాన్ని ఎక్కువగా వినడానికి, చూడటానికి సహాయం చేస్తే, పరిస్థితులు మారవచ్చు. పురుషులు, మహిళలు ఒకే విధంగా పరిగణించే భవిష్యత్తును సృష్టించడానికి ప్రయాస పడాలి. -డాక్టర్ శ్రీదేవి రెడ్డి గాధే, సీనియర్ హైకోర్టు అడ్వకేట్(అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ ఫౌండర్) -
ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్ బంపరాఫర్
‘ట్వీట్లతో రెచ్చిపోండి.. దీని వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురై లీగల్‌గా అయ్యే ఖర్చులు నేను చూసుకుంటా’ అంటున్నారు ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇలా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పలు అంశాలపై వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆయా కంపెనీల యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఆయా కంపెనీలు లీగల్‌గానూ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుంటాయి. అలాంటి వారికి అండగా నిలుస్తామని మస్క్ ప్రకటించారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్వీట్లు చేసే, లైక్ కొట్టే, కామెంట్లు చేసే ఉద్యోగులను వారి యాజమాన్యాలు, కంపెనీలు లీగల్‌గా వేధిస్తే దానికి ఎదుర్కొనేందుకు యూజర్లకు అండగా నిలుస్తామని, అందుకయ్యే మొత్తాన్ని భరిస్తామని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఇందుకు ఎటువంటి పరిమితి లేదని, అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనిపై అధిక సంఖ్యలో యూజర్లు ప్రతిస్పందించారు. మస్క్‌ను పొడగ్తలతో ముంచేస్తూ కామెంట్లు పెట్టారు. ట్విటర్ ఇటీవల దాని ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను తొలగించి దాని స్థానంలో ‘ఎక్స్’ను తీసుకొచ్చింది. ట్విటర్‌ను పూర్తిగా రీబ్రాండ్ చేసే ప్రయత్నంలో భాగంగా దాని అధినేత మస్క్ ఈ మార్పు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న మంత్లీ యూజర్లు 540 మిలియన్లకు పైగా పెరిగారంటూ చూపించే గ్రాఫ్ షేర్ చేస్తూ "కొత్త గరిష్టానికి" చేరుకున్నట్లు ప్రకటించారు. Zuck × Musk fight: ‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో.. ఇలా మస్క్ ఓ వైపు కంపెనీలో సంస్థాగత మార్పులు చేసుకుంటూ పోతుంటే మరోవైపు దీనికి పోటీగా మెటా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని నుంచి పోటీని ఎదుర్కొనేందుకు తమ యూజర్లకు మస్క్ ఈ ప్రకటించినట్లు తెలుస్తోంది. యాక్టివ్ యూజర్లు పెరిగినప్పటికీ ప్రకటనల ఆదాయంలో తగ్గుదల కారణంగా ప్రతికూల నగదు ప్రవాహం ఎదుర్కొంటున్నట్లు మస్క్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. If you were unfairly treated by your employer due to posting or liking something on this platform, we will fund your legal bill. No limit. Please let us know. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
అక్కడ పూల దండలను మూర లెక్కన అమ్మితే ఇక అంతే!
పువ్వులు అలంకరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని దండల రూపంలో ఐతే మూర లెక్కన విడి పువ్వులైతే గ్రాములు, కిలోల లెక్కన తీసుకుంటాం. ఇది సర్వసాధారణం. ఐతే ఇక నుంచి మూరలు లెక్కన పూల దండలను అమ్మడానకి వీల్లేదట. ఒకవేళ అలా అమ్మితే రెండు వేలు వరకు జరిమాన విధిస్తారట. అంతేగాదు పూల దండలను మీటర్లు లేదా సెంటీమీటర్ల చొప్పునే అమ్మాలనే నిబంధన కూడా విధించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ అంశం ఇప్పుడూ కేరళ అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..సాధారణంగా మల్లెలు, కనకాంభరాలు తదితర పూల దండలను మూరలెక్కనే అమ్మతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కేరళలో త్రిసూర్‌లో లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ ఇక నుంచి అలా అమ్మకూడదంటూ పూల వ్యాపారులకు నోటీసులు పంపింది. ఇలా అమ్మితే పూల దండ దాదాపు 24 అంగుళాలు లేదా 60 సెంటీమీటర్లే ఉంటుందని చెబుతోంది. ఇక నుంచి పూల దండలను సెంటీమీట్లర్లు లేదా మీటర్లలోనే కొలవాలని రూల్ పాస్ చేసింది. ఒకవేళ మూర లెక్కన అమ్మినట్లు తెలిస్తే వారికి రూ. 2000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. కేరళలో ఈ అంశం ఒక హాట్‌టాపిక్‌గా మారిపోయింది. త్రిసూర్ షాపులలో తనిఖీలు నిర్వహించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని లీగల్ మెట్రాలజీ విభాగం అధికారి ఏషియానెట్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 111ఈ, పీనల్ ప్రొవిజన్ 29 ప్రకారం పూల దండలను అత్యంత సాధరణ యూనిట్ ఎస్ఐ(ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్)లో కాకుండా మూర లేదా క్యూబిట్లో అమ్మడం నేరం అని, దీని కింద రూ. 2000/- జరిమాన విధిస్తామని కరాకండీగా తేల్చి చెప్పింది. ప్రజలు గనుక మూర లేదా క్యూబిన్ల కింద కోరినట్లయితే వ్యాపారులు 44.5 సెంటీమీటర్ల పూల దండను ఇవ్వాలని లీగల్ మెట్రాలజీ సూచించింది. ఐతే కొలతల్లో చాలా మార్పులు వస్తాయని వ్యాపారులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూల అమ్మకాలు చాల సంత్సరాలుగా జరగుతున్నాయి. నిజానికి సాధారణ ప్రజలకు పూలు మూర లేదా సెంటమీటర్లలో అమ్మడం అనేది అనవసరమైన విషయమని, ఇది పెద్ద సమస్య కాదంటూ ఆ నిబంధనను వ్యాపారులు కొట్టిపారేయడం గమనార్హం. (చదవండి: వామ్మో ఎంత పెద్ద క్యూ లైన్! అంతలా బారులుతీరి జనాలు ఎందుకున్నారంటే.. -
ఆ కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి
గాంధీనగర్: దేశంలో నేర న్యాయ వ్యవస్థను, ఫోరెన్సిక్ సైన్స్ దర్యాప్తును మిళితం చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే అధికంగా మన దేశంలో నేర నిరూపణల శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరేళ్లకుపైగా జైలుశిక్ష పడేందుకు అవకాశం ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి, చట్టబద్ధం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) మొదటి స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో ఫోరెన్సిక్ మొబైల్ దర్యాప్తు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్‌లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఎవరూ భారతీయ దృష్టికోణంలో చూడడం లేదన్నారు. -
భారత్‌లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Calls For Legalisation Of Sports Betting: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బెట్టింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను చట్ట బద్ధం చేస్తే దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల బెట్టింగ్‌పై నిఘా పెట్టే వీలు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు బెట్టింగ్‌కు చట్ట బద్ధత కల్పించాయని.. భారత్‌లో కూడా అలా చేస్తే పన్ను రూపేనా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని అన్నాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ చాలా కాలంగా జోరుగా సాగుతుందని, ముఖ్యంగా క్రికెట్‌పై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు నడుస్తాయని, మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో వందల కోట్లలో చేతులు మారుతుంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్‌ను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగముండదని, ఇందుకు చట్ట బద్ధత కల్పించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. రవి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. రవిశాస్త్రి కంటే ముందు పలువురు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత జస్టిస్ ముకుల్ ముద్గల్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021 అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2022లో ఓ ప్రముఖ జట్టు తరఫన కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మనీశ్ పాండే..? -
వధువు @ 21.. వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల
భారతదేశంలో మహిళలకు చట్టబద్ధమైన పెళ్లి వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ నిర్ణయం చట్టం రూపం దాల్చుతుంది. బాల్య వివాహాలను నిరోధించడానికి, చిన్న వయసులో గర్భాలను నిరోధించడానికి, యువతుల శారీరక మానసిక ఆరోగ్యాల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కొందరు భిన్న రంగాల మహిళా ఆలోచనాపరుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ 15, బుధవారం కేంద్ర కేబినెట్ స్త్రీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. వివాహానికి అవసరమైన వయసు 21 సంవత్సరాలుగా ప్రతిపాదించింది. గతంలో ఈ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21గా ఉండేది. ఇప్పుడు స్త్రీ, పురుషులకు ఒకే వయసు నిర్ణయించినట్టు అయ్యింది. దీని వల్ల జెండర్ తటస్థత పాటించినట్టు భావిస్తోంది. హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఆడపిల్ల వయసు వివాహానికి 18 ఏళ్లు ఉండాలి. ఇస్లాంలో అమ్మాయి ఈడేరిన తర్వాత వివాహానికి యోగ్యురాలిగా భావిస్తారు. స్పెషల్ మేరేజ్ యాక్ట్, 1954 ప్రకారం అబ్బాయి వయసు 21, అమ్మాయి వయసు 18గా ఉంది. తాజా ప్రతిపాదన చట్టం దాలిస్తే 21 ఏళ్లు ఉమ్మడి వయసు అవుతుంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు, యువతుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండటం కోసం, బాలింత–శిశు మరణాల నివారణకు, పోషకాహార సమతుల్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెబుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015–16లో బాల్య వివాహాలు 27 శాతం ఉంటే 2019–20లలో వీటి శాతం 23కు చేరింది. ఈ శాతాన్ని ఇంకా తగ్గించడంలో వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల ఉపయోగపడుతోందని భావిస్తోంది. 2020 కమిటీ స్త్రీల శారీరక పోషక విలువల స్థాయికి, పెళ్లి వయసుకూ మధ్య సమన్వయం, సంబంధం గురించి అంచనాకు రావడానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జయా జైట్లీ అధ్యక్షతన 2020లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 16 యూనివర్సిటీల విద్యార్థినీ విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుంది. అలాగే 15 ఎన్జిఓల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలోని అన్ని వర్గాల యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించింది. వీటన్నింటి ఆధారంగా కమిటీ యువతుల వివాహ వయసును 21కి పెంచమని రికమండ్ చేసింది. అంతేకాదు అమ్మాయిల చదువు అవకాశాలను పెంచమని, వారి రాకపోకల సౌకర్యాలను పెంచమని, అలాగే ఉపాధికి అవసరమైన ట్రైనింగులను పెంచాలని సూచించింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన నిపుణుల, ఆలోచనాపరుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఆడపిల్లలకు డబ్బు ముఖ్యం అని చెప్పాలి ఒకప్పుడు డబ్బుకు పెద్ద విలువ ఇవ్వొద్దని తల్లిదండ్రులు చెప్పేవారు. ఇప్పుడు డబ్బుకు విలువ ఇవ్వండని చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లకు ఆర్థికంగా తన మీద తాను ఆధారపడే వీలు కల్పించాలి. ఇందుకు బాగా చదివించాలి. వివాహ వయసు 21 సంవత్సరాలకు పెంచడం మంచిది. దాని వల్ల చదువుకుంటారు. ఉద్యోగాలు చేయాలనుకుంటారు. డబ్బు గురించి ఆలోచిస్తారు. కొన్ని వర్గాలలో తల్లిదండ్రులు పనికి వెళ్లాల్సి రావడం వల్ల ఇంట్లో ఆడపిల్లను ఉంచడం ఎందుకు అని పెళ్లి చేస్తున్నారు. పది ఫెయిల్ అయిన ఆడపిల్లకు పెళ్లి తప్పనిసరి అవుతోంది. పెళ్లి చేసి పంపాక అక్కడ అమ్మాయి ఇమడలేకపోతే పుట్టింటి సపోర్ట్ ఉండటం లేదు. అమ్మాయికి తన కాళ్ల మీద తాను నిలబడే ఆర్థిక శక్తి, స్కిల్స్ ఉండటం లేదు. దీని వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా కాకుండా వీళ్లను ఉపాధి పొందే ట్రయినింగుల్లోకి మళ్లించాలి. ఆ మేరకు తల్లిదండ్రులకు చైతన్యం కలిగించాలి. చట్టం తేవడం ఒక విషయం అయితే దానిని గట్టిగా అమలయ్యేలా చూడటం ఒక విషయం. ఆ విషయంపై శ్రద్ధ పెట్టాలి. – పి.సత్యవతి, రచయిత పంచాయతీలు జాగ్రత్త తీసుకోవాలి అమ్మాయి పెళ్లి వయసు 21 పెంచుతూ తీసుకున్న నిర్ణయం మంచిది. దీనిని తల్లిదండ్రులకు, యువతులకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలి. ఎలా చేస్తే చట్టబద్ధమో ఎలా చేస్తే చట్టవిరుద్ధమో విడమర్చి చెప్పాలి. ముఖ్యంగా పల్లెటూళ్లలో పంచాయతీలు అక్కడ జరుగుతున్న పెళ్లిళ్లను గమనించి ఈ నిర్ణయం అమలయ్యేలా చూడాలి. అప్పుడు దాదాపుగా ఈ నిర్ణయం వల్ల ఉపయోగం కలుగుతుంది. గ్రామాల్లో పెళ్లి చేసుకోమనే తల్లిదండ్రులను ఆడపిల్లలు ఎదిరించడం కష్టసాధ్యమైన పని. అలాంటి వారికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. వారు సర్పంచ్ చేతో మరెవరి చేతో ఈ విషయాన్ని చెప్పించి చదువు, ఉపాధిలో రాణించవచ్చు. పెళ్లి వయసు 21 చేయడం అంటే అమ్మాయిలు పరిణితితో నిర్ణయం తీసుకునే వీలు కల్పించడం. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు ఈ వయసు నియమం వల్ల తగ్గితే అదీ మంచిదే. – ఓల్గా, రచయిత టీనేజ్‌లో పెళ్లి అయితే హైరిస్క్ పదకొండు నుంచి పదమూడేళ్ల వయసు అమ్మాయిల్లో రుతుక్రమం ప్రారంభం అవుతుంది. టీనేజ్ దశలో వాళ్ల శరీరం గురించి వారికి సరైన అవగాహన ఉండదు. పెద్దవాళ్లు చెప్పరు. పద్దెనిమిది ఏళ్లు నిండగానే పెళ్ళి చేస్తే అవగాహన లేమి కారణంగా త్వరగా గర్భం దాల్చుతుంటారు. టీనేజ్‌లో రక్త హీనత సమస్య ఎక్కువ. ఈ వయసు గర్భవతుల్లో హైబీపీ రిస్క్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. దీని వల్ల వీరికి ఫిట్స్ రావడం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. అందుకని అమ్మాయిలకు తమ శరీరం గురించి, సెక్స్ఎడ్యుకేషన్ అవగాహన కల్పించాలి. అప్పుడే లైంగికపరంగా వచ్చే జబ్బుల గురించి కూడా అవగాహన ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగున్నవారు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం గురించి కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. 21 ఏళ్లకు పెళ్లి అయితే పిల్లలు కోసం ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లి సరైన జాగ్రత్తలు తీసుకునే అవగాహన ఉంటే, రాబోవు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్ లక్ష్యానికి రూపం రావాలంటే 21 ఏళ్లు నిండాలి మా ఊరు మొయినాబాద్ మండలంలోని యత్బార్పల్లి. మా ఊళ్లో పద్దెనిమిదేళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. దానికి ఒక రూపం రావాలంటే డిగ్రీ వరకు చదువుకోవాలి. మా ఇంట్లో కూడా నీకు పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేస్తాం అన్నారు. కేంద్రప్రభుత్వం అమ్మాయిలకు పెళ్లివయసు 21 ఏళ్లు చట్టం తీసుకువస్తుందని వినగానే చాలా సంతోషం వేసింది. గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఈ విషయం తెలియాలి. మా కాళ్ల మీద మేం నిలబడాలి. నేనిప్పుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. డిగ్రీ చేసి, జాబ్ తెచ్చుకోవాలి. మా అమ్మనాన్నలను మంచిగా చూసుకోవాలి. నాకో తమ్ముడు ఉన్నాడు. కానీ, అమ్మనాన్నల బాధ్యత నాది కూడా. జాబ్ చేయాలి అలాగే వ్యవసాయం కూడా చేయాలి. మా నాన్న రైతు. నేనూ పొలం పనులు చేస్తుంటాను. రైతుల కష్టాలు చూస్తూ పెరిగాను కాబట్టి, రైతుల అభివృద్ధికి కృషి చేయాలన్నది నా లక్ష్యం. – బి.భవానీ, విద్యార్థిని చట్టం సరే... చైతన్యం ఇంకా మంచిది ఉత్తరాది రాష్ట్రాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి దక్షిణాదితో పోలిస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కింది వర్గాలలో కూడా బి.టెక్, ఎంటెక్‌లు చేస్తున్నారు. 18 ఏళ్లు అంటే చదువు విషయంలో అటూ ఇటూ కాని వయసు. 21కి పెళ్లి వయసు పెంచడం వల్ల చదువు కొనసాగించి ఉద్యోగాల్లోకి వెళ్లే వీలుంటుంది. ఆ మేరకు ఈ నిర్ణయం మంచిది. అయితే ఈ విషయాన్ని చట్టం తెచ్చి చెప్పడం కన్నా చైతన్యం చేయడం ద్వారా చెప్తే బాగుంటుంది. ఒక రకంగా ఇప్పుడు పెళ్లిళ్లు అయ్యే సరికి అమ్మాయికి కొన్ని వర్గాల్లో 24 వస్తోంది. 20 ఏళ్లకు పెళ్లి చేయాలన్నా అబ్బాయిలు సెటిల్ కాకపోవడం వల్ల పెళ్లికొడుకు దొరకని పరిస్థితి ఉంది. 20 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లకే ఇప్పటి విద్య, ఉపాధి, సామాజిక పరిస్థితులు దారి తీస్తున్నాయి. మిగిలిన వర్గాల్లో ఎర్లీ మేరేజస్ తగ్గించాలంటే చైతన్యస్థాయిని పెంచడం ఇంకా మంచి మార్గం అని నా అభిప్రాయం. – ముదిగంటి సుజాతా రెడ్డి, రచయిత డిగ్రీ చదువు పూర్తవ్వాలి నా మనవరాలికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చాక పెళ్లి అయ్యింది, ఇప్పుడు పిల్లలు. ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కదిద్దుకుంటోంది. ఏ సమస్య అయినా పరిష్కరించుకోగలదు. నా రోజుల్లో స్కూల్ చదువు పూర్తికాగానే పెళ్లి చేసేశారు. దీంతో కాలేజీ చదువులు చదువుకోలేకపోయాను. పెళ్లయ్యాక బాధ్యతల్లోనే జీవితమంతా గడిచిపోయింది. మా అమ్మాయికీ పెద్దవాళ్ల జోక్యంతో చిన్న వయసులోనే పెళ్లి చేశాను. తన సమర్థత వల్ల పెళ్లి తర్వాత కూడా చదువుకుంది, బ్యూటీషియన్‌గా ఎదిగింది. అందరికీ ఆ అవకాశం ఉండదు. సాధారణంగా అమ్మాయిల బాధ్యత త్వరగా తీర్చుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, అమ్మాయి అత్తింటికి వెళ్లాక అక్కడ పరిస్థితులకు ఇమడలేకపోయినా, జీవితాన్ని చక్కదిద్దుకునే సామర్థ్యం లేకపోయినా కుటుంబానికి, తనకూ అన్యాయమే జరుగుతుంది. ఆడ–మగ ఇద్దరికీ ఉన్నది ఒకటే జీవితం. ఆనందంగా బతకాలంటే అవగాహన కూడా రావాలి. అందుకని, డిగ్రీ చదువు పూర్తయ్యాక అమ్మాయికి పెళ్లి అయితే అన్ని విధాల బాగుంటుంది. – తుమ్మ సత్యవతి, గృహిణి కలలు నెరవేరాకే పెళ్లి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లలకు జీవితంలో సాధించాల్సిన కలలు ఎన్నో ఉంటాయి. కానీ, పెళ్లి కారణంగా పెద్దవాళ్లు ఆ కలలను చంపేస్తున్నారు. బయట అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తల్లిదండ్రుల భయాలకు కారణం అవుతున్నాయి. దీని వల్లే అమ్మాయిలకు పద్దెనిమిది నిండకుండానే పెళ్లి చేసి భారం దించుకున్నాం అనుకుంటున్నారు. చిన్నవయసులో పిల్లలు పుట్టినా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. అలాగే, ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మాది రంగారెడ్డి జిల్లాలోని తోల్కట్ట అనే ఊరు. పేదింటి అమ్మాయిని. నాన్న ఊరూరు తిరుగుతూ పాతబట్టలు తీసుకొని, కొత్త ప్లాస్టిక్ టబ్బులు అమ్ముతుంటారు. వాటిని సేకరించుకుని వస్తే మేం అవన్నీ ఇంటి వద్ద సపరేట్ చేసి, మరొకరికి ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. మా అమ్మనాన్నలకు నేను అన్నయ్య, తమ్ముడు సంతానం. నాకూ పెళ్లి చేస్తామన్నారు. కానీ, నేను బతిమాలుకున్నందుకు నన్ను కాలేజీకి పంపిస్తున్నారు. ఇంకో ఏడాదిలో పెళ్లి చేస్తామన్నారు. నాకు పోలీస్ అవ్వాలన్నది కల. ఇప్పుడు ఈ చట్టం వస్తే నా కల నెరవేరుతుంది. – నిఖిత, విద్యార్థిని -
ఫలించిన బ్రిట్ని స్పియర్స్ న్యాయపోరాటం
-
ట్విటర్‌కు మరో షాక్, కేసు నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు కేంద్రం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. ఫేక్ న్యూస్, వినియోగదారుల రక్షణ అంశంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నేపథ్యంలో ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసింది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై పదే పదే హెచ్చరిస్తున్నా ట్విటర్ పట్టించుకోని కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు కీలక అధికారులను ట్విటర్ నియమాకాలపై ఇటీవల కేంద్రం తుది హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయంలో విఫలమైన కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో సోషల్ మీడియా మధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విటర్ కోల్పోయిందని, దీంతో ఇకపై భారత చట్టాల పరంగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశాయి ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై తొలి కేసు కూడా నమోదవడం గమనార్హం. మతపరమైన హింసను ప్రోత్సహింఆరంటూ పలువురు జర్నలిస్టులపైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కొత్త ఐటీ నిబంధనలపై చీఫ్ కంప్లైయెన్స్ఆఫీసర్‌తో సహా భారతదేశానికి చెందిన అధికారుల నియామకాల్లో నిబంధనలను పాటించని ఏకైక టెక్ ప్లాట్‌ఫాం ట్విటర్ అని కూడా పేర్కొంది. జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత రాత్రి థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దేశంలో ముఖ్య అధికారులను నియమించాల్సిన నిబంధనలను పాటించడంలో విఫలమైనందున ట్విట్టర్ వినియోగదారుల పోస్టులపై విచారణ నుండి భారతదేశంలో చట్టపరమైన రక్షణ కోల్పోయిందని, దీంతో యూపీలో కేసు నమోదైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.మే 25 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలన్నింటినీ ట్విటర్ ఇంకా పాటించలేదని అందుకే మధ్యవర్తిగా వారి రక్షణ లేకుండా పోయిందని వివరించింది. ఏ ప్రచురణకర్త మాదిరిగానే భారతీయ చట్టానికి వ్యతిరేకంగా జరిమానా చర్యలకు ట్విటర్ బాధ్యత వహిస్తుందని ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే నియామకాలపై స్పందించిన ట్విటర్ తాత్కాలిక చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌ను నియమించామనీ, ఈ వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పంచుకుంటామని ట్విటర్ తెలిపింది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా తాము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని వివరణ ఇచ్చింది. చదవండి: ట్విటర్‌కు మరోసారి నోటీసులు -
Jeffrey Toobin: నా చేష్టల్ని సమర్థించుకోలేను!
న్యూయార్క్: అమెరికా న్యూస్ పర్సనాలిటీ జెఫెర్రె టూబిన్ ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత హఠాత్తుగా టీవీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటి నుంచి ప్రముఖ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్లో లీగల్ అనలిస్ట్‌గా ఆయన పని చేయనున్నారు. పోయినేడాది అక్టోబర్‌లో జూమ్ కాల్లో ఆయన అసభ్య చేష్టలకు పాల్పడడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ చర్యతో ది న్యూయార్కర్ ఆయన్ని అనధికారికంగా విధుల నుంచి తప్పించింది. కాగా, తన చేష్టలకు ఆయన అందరికీ క్షమాపణలు చెబుతూ కొత్త విధుల్ని ప్రారంభించడం విశేషం. ‘‘ఆరోజు నేను చాలా మూర్ఖంగా నేను ప్రవర్తించా. ఇతరులు చూస్తారనే ధ్యాస నాకు లేదు. నా కుటుంబానికి, సహచర జర్నలిస్టులకు, అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నా. నా చేష్టలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించుకోలేను. ఆ ఘటన తర్వాత మామూలు మనిషిగా మారేందుకు టైం పట్టింది. మానసిక ప్రశాంతత కోసం థెరపీ తీసుకున్నా. ఒక ఫుడ్ బ్యాంక్‌లో పని చేశా. ఓక్లాహోమా సిటీ పేలుళ్ల గురించి ఒక బుక్ రాయడంలో లీనమయ్యా’’ అని 61 ఏళ్ల టూబిన్ చెప్పుకొచ్చాడు. కాగా, అక్టోబర్ 19, 2020న న్యూయార్కర్, డబ్ల్యూఎన్వైసీ రేడియో స్టాఫర్స్ మధ్య జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. టూబిన్ తన వ్యక్తిగత వీడియో కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ, హస్తప్రయోగం చేసుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన న్యూయార్కర్.. ఆయన్ని విధుల నుంచి దూరంగా ఉంచింది. కాగా, దాదాపు మూడు దశాబ్దాలుగా న్యూయార్కర్‌తో అనుబంధం ఉన్న టూబిన్.. జూమ్ చేష్టల ద్వారా జర్నలిజానికి మాయని మచ్చ వేశాడంటూ జిమ్మీ ఫాలోన్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ లాంటి ప్రముఖులు.. శాటర్ డే నైట్ లైవ్ ప్రోగ్రాం దుమ్మెత్తిపోశారు. లా స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే మానవీయ కోణంలో ఎన్నో పుస్తకాలు రాసి ప్రపంచవ్యాప్తంగా గొప్ప రచయితగా పేరు దక్కించుకున్నాడు టూబిన్. -
ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టబద్ధం
లండన్: ఈ నిర్ణయం కోసం ఐర్లాండ్ మహిళలు 35 ఏళ్లు పోరాటం సాగించారు. కేవలం అబార్షన్ కోసం బలవంతంగా, ఒంటరిగా బ్రిటన్‌కు వెళ్లేందుకు కష్టాలు పడ్డారు. అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ శుక్రవారం ఐర్లాండ్ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది. 80 శాతం క్యాథలిక్‌లు ఉండే ఆ దేశంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. గత కొంతకాలంగా చర్చికి వెళ్లేవారి సంఖ్య క్షీణించడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన రిఫరెండంలో 66 శాతం ప్రజలు అబార్షన్‌కు తమ సమ్మతి తెలిపారు. దీంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేయడానికి దారులు సుగమం అయ్యాయి. ఈ బిల్లును అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది. ‘ఇది ఐరిష్ మహిళలు చరిత్రలో మరిచిపోలేని క్షణం. దీనికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని ఐర్లాండ్ ప్రధాని లియో వారద్కర్‡ ట్వీట్ చేశారు. 1980 నుంచి ఇప్పటివరకు 7.77 లక్షల మంది ఐర్లాండ్ మహిళలు అబార్షన్ కోసం బలవంతంగా బ్రిటన్‌కు వెళ్లి వచ్చారు. ‘ఇకపై ఐర్లాండ్ మహిళల ఒంటరి ప్రయణాలుండవు’అని ఐర్లాండ్ ఆరోగ్యమంత్రి సైమన్ హారిస్ ట్వీట్ చేశారు. నిర్ణయం వెనుక భారతీయురాలు.. అబార్షన్‌కు అనుమతులు లేక సమయానికి అబార్షన్ జరగక ప్రాణాలు విడిచిన వారి విషాద కథనాలు ఎన్నో ఐర్లాండ్‌లో ఉన్నాయి. రక్తం విషతుల్యం అయిన కారణంగా భారత్‌కు చెందిన డెంటిస్ట్, సవిత హలప్పన్వర్ 2012లో స్థానిక గాల్వే ఆస్పత్రిలో చేరారు. ఆమె అప్పటికే గర్భవతి. ఆ సమయంలో ఆమె కడుపులో నొప్పిగా ఉందని, తనకు అబార్షన్ చేయమని చాలాసార్లు వేడుకున్నారు. చలించని వైద్యులు నిబంధనల్ని సాకుగా చూపి అబార్షన్‌కు నిరాకరించారు. దీంతో ఆమె 31 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచారు. ఆమె మృతి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఐర్లాండ్ మహిళలు ఉద్యమించారు. దాని ఫలితమే నేటి చరిత్రాత్మక నిర్ణయానికి నాంది. 2019 జనవరిలో ఈ చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం..గర్భం దాల్చిన 12 వారాల వరకు ఎప్పుడైనా అబార్షన్ చేయించుకోవచ్చు. 12 వారాల అనంతరం అబార్షన్ చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం. అయితే, ఇది అనారోగ్య సమస్యలు తలెత్తిన వారికి మాత్రమే వర్తిస్తుంది. వారికి అబార్షన్ చేయాలా? వద్దా అని ఇద్దరు వైద్యులు పరిశీలించి నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం వెనుక భారత మూలాలున్న వైద్యుడు, ప్రధాని వారద్కర్(39) చొరవ అభినందించదగినది. దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరికీ అవకాశం కల్పిస్తానని లియో ఎన్నిక తర్వాత ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ నెత్తిన మరో బాంబు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ పోర్న్ స్టార్‌తో లైంగిక సంబంధం ఉన్నట్లు అప్పట్లో ఓ కథనం అప్పట్లో అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయం బయటకు పొక్కుకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించి ఆ నటితో ట్రంప్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్ హౌజ్ ఈ వార్తలను ఖండించగా.. తాజాగా అది నిజమేనంటూ ట్రంప్ వ్యక్తిగత న్యాయసలహాదారు బాంబు పేల్చారు. ట్రంప్ వ్యక్తిగత అటార్నీ మైకేల్ కోహెన్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ‘పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ తో ట్రంప్ లక్షా,30,000 డాలర్లతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. ‘స్టోర్మీతో చేసుకున్న ట్రంప్ చేసుకున్న ఒప్పందం ప్రలోభానికి గురి చేసేందుకు ఉద్దేశించింది కాదు. రాజకీయ విమర్శలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చేసుకుంది. పైగా న్యాయబద్ధమైంది’ అని కోహెన్ వివరించారు. ఇంతకాలం గోప్యంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఆమె నిరభ్యరంతరంగా ఈ విషయాన్ని ప్రపంచానికి ఆమె వెల్లడించవచ్చు అని కోహెన్ చెప్పారు. కాగా, ఇన్ టచ్ అనే మాగ్జైన్ లో అడల్ట్ సినీతార స్టోర్మీ డేనియల్స్(అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఇంటర్వ్యూను ప్రచురించగా.. వాల్‌స్ట్రీట్ జర్నల్ దానిని యథాతథంగా ప్రచురించింది. అందులో మెలానియా(ట్రంప్ భార్య) బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ధృవీకరించింది. కొంతకాలమే కొనసాగిన తమ బంధం సరదాగా సాగిపోయిందని, పైగా తన కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్‌గా ఉంటానంటూ ట్రంప్ తరచూ తనతో చెబుతుండేవాడని స్టెఫానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే వైట్‌హౌజ్ మాత్రం ఆ ఇంటర్వ్యూను ‘ఫేక్’ అంటూ కొట్టి పడేయగా.. ఇప్పుడు మైకేల్ ధృవీకరించిన వార్తపై స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. ట్రంప్ వ్యక్తిగత న్యాయసలహాదారు మైకేల్ కోహెన్ (పాత చిత్రం) -
ఆన్లైన్ బెట్టింగ్‌కు చట్టబద్ధత!
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడల ప్రోత్సాహానికి నిధుల కొరత ఉండటంతో ఆన్లైన్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు డ్రాఫ్ట్‌ను తయారు చేస్తోంది. వచ్చే రెండెళ్లలో ఆన్లైన్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని ఆ శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే నిధులతో క్రీడలను ప్రోత్సహించాలనుకుంటుంది. ఇప్పటికే భారత్‌లో చట్ట వ్యతిరేకంగా ఏడాదికి రూ 9.6 లక్షల కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. దీంతో దీనిని చట్ట బద్ధం చేస్తే పన్నుల రూపంలో క్రీడాశాఖకు నిధులు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హార్స్ రేసింగ్‌లపై బెట్టింగ్‌లు చట్టబద్ధంగా ఉండగా కేంద్రం వీటిపై 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇటీవల ఈ విషయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ అధికారులతో సమావేశమై చర్చించారు. క్రీడాశాఖ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరచడం, ప్రపంచానికి గొప్ప క్రీడాకారులను పరిచయం చేయడం తమ అభిమతం అని క్రీడామంత్రిత్వ శాఖ పేర్కొంది. బెట్టింగ్ అనేది ఓ సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యా అని పేర్కొంది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వివాదాలు చెలరేగే అవకాశం ఉండడతో ఆచుతూచి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపింది. గతంలో సుప్రీం కోర్టుకు క్రికెట్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని చాల మంది అభిప్రాయపడినట్లు లోథా కమిటీ తమ నివేదికలో పేర్కొంది. ఇది ఇప్పటికే యూకేలో అమలవుతుందని సూచించింది. -
రిజిస్ట్రేషన్ లేకపోవడంతోనే భూ సమస్యలు
శ్రీశైలం ప్రాజెక్టు: వ్యవసాయ, నివాసిత భూములను రిజిస్ట్రేషన్ చేయించకపోవడం వల్లే న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయని జిల్లా జడ్జి, న్యాయసేవా సాధికార సంస్థ చైర్ పర్సన్ అనుపమ చక్రవర్తి అన్నారు. శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ భవనంలో న్యాయ సలహాలు–సమీక్ష–చట్టాల అవగాహనపై శనివారం వర్క్‌షాప్ ప్రారంభమైంది. మూడు రోజులుపాటు వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి గిరిజన, షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువకులు హాజరయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ.. స్వాధీనంలో ఉండి పట్టాలు లేకపోవడం, పట్టా ఉండి భూమి ఎక్కడ ఉందో తెలియకపోవడం, అనుభవంలో ఉండి పట్టా ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో లేకపోవడం వల్ల అనేక వాజ్యాలు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నాయన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పట్టాను కలిగి ఉండడంతో పాటు ప్రభుత్వ రికార్డులు నమోదు చేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. వ్యవసాయ, నివాసిత, అసైన్డ్, గ్రామ కంఠాలు, శ్మశానాలు, కమ్యూనిటీ స్థలాలు, రోడ్లు వంటి భూములపై సందేహాలను నివృత్తి చేశారు. పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్, అడంగళ్, అటవీ భూ హక్కుల చట్టం వంటి వాటిపై రీసోర్స్ పర్సన్స్ వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం 46 శాతం మంది భూమి కలిగి ఉన్నారని, 54శాతం మంది భూమిలేనివారుగా ఉన్నారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటనలు జరిపి భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే లక్షల సంఖ్యలో తెల్లకాగితాల పైనే భూముల కొనుగోలు, అమ్మకాలు జరిగాయని, ఇటువంటి లావాదేవీల వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతాయని వారు పేర్కొన్నారు. వర్క్‌షాపులో సీనియర్ సివిల్ జడ్జి ఎంఎ సోమశేఖర్, రీసోర్స్ పర్సన్స్ పి. రమేష్, టి. రాజేష్‌కుమార్, ఎం. సునీల్‌కుమార్, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయ సమస్యలు పరిష్కరించండి
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(లీగల్) : ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయ సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి జిల్లాలోని ప్యానల్ అడ్వకేట్స్ లీగల్ అడ్వకేట్స్ను కోరారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల న్యాయ సేవా సంస్థ కార్యాలయాల్లో న్యాయవాదులు ఉంటూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శిక్షకులు టి.సుబ్బారావు, ఆర్.శ్రీనివాసరావులు న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు టి.రఘురాం, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, సీనియర్ సివిల్ జడ్జీలు శివకుమార్, గాయత్రి దేవి, జూనియర్ సివిల్ జడ్జీలు గంగాభవాని, జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్లు ఎం.బాబు, కె.స్వప్నారాణి, పి.రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
న్యాయశాఖ సిబ్బందికి క్రీడలు ప్రారంభం
గుంటూరు లీగల్: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతోపాటు శారీరక దృఢత్వానికి ఉపయోగ పడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. సుమలత అన్నారు. జిల్లా న్యాయశాఖ సిబ్బందికి నిర్వహిస్తున్న క్రీడలను శుక్రవారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో ఆమె ప్రారంబించారు. జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కబడ్డీ కోర్టును తొలుత ఆమె రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించి మట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో గుంటూరు జిల్లాలోనే న్యాయశాఖ సిబ్బందికి క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడల నిర్వహణకు జిల్లాకోర్టు పరిపాలనాధికారి విజయకుమార్, ఇతర న్యాయశాఖ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం ఫ్లడ్ లై ట్ల వెలుగులో మొదట æనిర్వహించిన కబడ్డీ పోటీలో డీ. రాజశేఖర్ జట్టు, జి. వీరారెడ్డి జట్లు తలపడ్డాయి. చివరిదాకా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజశేఖర్ జట్టు 11 పాయింట్ల తేడాతో వీరారెడ్డి జట్టుపై విజయం సాధించింది. క్రీడాపోటీలకు సీనియర్ సివిల్ జడ్జి ఒ.వి. నాగేశ్వరరావు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. లక్ష్మీనరసింహారెడ్డి, ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి పి. గోవర్ఢన్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్ ప్రవీణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది హాజరయ్యారు. -
మెడికో లీగల్ కేసులపై 27న సదస్సు
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలపై ఈ నెల 27వ తేదిన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాయంత్రం 7 గంటలకు స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్‌క్లబ్‌లో సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, గౌరవ అతిథిగా ఎస్పీ ఆకె రవికృష్ణ హాజరవుతారన్నారు. సదస్సులో వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే మెడికో లీగల్ కేసులు, న్యాయపరమైన సమస్యల గురించి సుప్రీంకోర్టు న్యాయవాది మహేంద్రకుమార్ బాజ్‌పాయి వివరిస్తారన్నారు. -
అక్రమ రవాణాకు చెక్ పెట్టాలి
చెక్ పోస్టుల్లో విధులు సక్రమంగా నిర్వహించాలి సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలచే నిర్వహించబడుతున్న చెక్ పోస్టుల అధికారులు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి. దివ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ, పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మార్కెంటింగ్, రవాణా, మైనింగ్, అటవీశాఖ అధికారులతో వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహించే అధికారుల సమాచారం, ఫోన్‌నంబర్లు క్రోడికరించి ప్రతీ సమాచారం అందరికీ తెలిసేలా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ ఉషారాణిని ఆదేశించారు. పోలీస్ శాఖ సూచించిన మేరకు తొమ్మిది ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. అటవీసందప, వాణిజ్యపరమైన సరుకులు, ఇసుక, బియ్యం అక్రమ రవాణా, గంజాయి వంటి వస్తువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చెక్ పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా నిర్వహిస్తున్న బోర్డర్ చెక్ పోస్టుల వివరాలను, విధులు నిర్వహించే అధికారుల వివరాలను, మోడల్ వే బిల్లు నమూనాలను క్రోడికరించి పీడీఎఫ్ రూపంలో వాట్సాప్‌లో పొందుపర్చాలని డీఎస్ఓకు సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సాయికృష్ణ, ఎక్సైజ్ డీసీ మహేష్‌బాబు,ఆర్డీఓ మోహిమిన్,డీఎస్ఓ ఉషారాణి, గనుల శాఖ ఏడీ నర్సింహాæరెడ్డి, వాణిజ్య పన్నుల శాఖాధికారి శంకర్, మార్కెఫెడ్ డీఎం వినోద్‌కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వయసు నిబంధన.. ప్రమాదాన్ని తగ్గిస్తుంది!
హూస్టన్‌ః అనేక దేశాల్లో వివాహాలకు చట్టపరమైన వయసు నిబంధనలు ఉన్నసంగతి తెలిసిందే. కానీ అలవాట్లకు సైతం నిబంధనలు విధిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయంటున్నారు తాజా పరిశోధకులు. చిన్ననాటినుంచే చెడు అలవాట్లకు బానిసలౌతుండటంతో, అతి తక్కువ వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. మద్యపానానికి చట్టపరంగా 21 ఏళ్ళ వయసును నిర్థారిస్తే.. చిన్నవయసునుంచే మద్యం తాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మరణాల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మద్యం తాగేందుకు కనీస వయసు (మినిమమ్ లీగల్ డ్రింకింగ్ ఏజ్ (ఎంఎల్డీయే) 21 ఏళ్ళు ఉండేట్టుగా చట్టాన్ని తెస్తే మరణాల శాతం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. మద్యం తాగే వయసు కనీసం 21 ఏళ్ళు ఉండేట్లుగా చూస్తే.. యవ్వనంలో ఆరోగ్య పరంగా అనేక లాభాలు చేకూరుతాయని అధ్యయనకారులు చెప్తున్నారు. 21 ఏళ్ళ వయసుకన్నా ముందే మద్యానికి అలవాటు పడినవారు... మద్యానికి సంబంధించిన అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటమే కాక, మరణించే ప్రమాదం కూడ ఉన్నట్లు పరిశోధనల్లో తెలుసుకున్నారు. 1990 నుంచి 2010 మధ్య జనాభా మరియు, వారి మరణాలకు కారణాల డేటాను అమెరికా రీసెర్స్ సొసైటీనుంచి సేకరించిన శాస్త్రవేత్తలు.. 21 ఏళ్ళ వయసులోపు మద్యపానం అలవాటు అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలుసుకున్నారు. మద్యపానం అలవాటుతో కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడినవారు, మద్యపానం వల్ల క్యాన్సర్ తో చనిపోయినవారి రికార్డులను సైతం అధ్యయనకారులు పరిశీలించారు. దీనిద్వారా మద్యపానం సేవించే కనీస వయసు 21 ఏళ్ళు ఉండాలనే చట్టపరమైన నిబంధన విధిస్తే... అనేక ఆల్కహాలిక్ వ్యాధులవల్ల ఏర్పడే మరణాల సంఖ్య తగ్గించి, జీవించే సమయాన్ని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళనివారికి ఈ నిబంధన వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. అలాగే విద్యాలయ ప్రాంగణాల్లో 21 ఏళ్ళ వయసు లోపు ఉన్నవారిపై మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఎంఎల్డీయే వల్ల కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులకు సైతం లాభం చేకూరుతుందని భావిస్తున్న అధ్యయనకారులు తమ క్లినికల్ అండ్ ఎక్స్ పరిమెంటల్ పరిశోధనలను ఆల్కహాలిజం జర్నల్ లో నివేదించారు.