మెడికో లీగల్ కేసులపై 27న సదస్సు
Published Sat, Nov 26 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలపై ఈ నెల 27వ తేదిన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాయంత్రం 7 గంటలకు స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్‌క్లబ్‌లో సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, గౌరవ అతిథిగా ఎస్పీ ఆకె రవికృష్ణ హాజరవుతారన్నారు. సదస్సులో వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే మెడికో లీగల్ కేసులు, న్యాయపరమైన సమస్యల గురించి సుప్రీంకోర్టు న్యాయవాది మహేంద్రకుమార్ బాజ్‌పాయి వివరిస్తారన్నారు.
Advertisement
Advertisement