seminar
-
సముద్ర వాణిజ్యంలో భద్రతా సవాళ్లను అధిగమిద్దాం
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్లూ ఎకానమీలో మారీటైమ్ డొమైన్ కీలకంగా వ్యవహరిస్తోందనీ.. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా.. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని సాముద్రిక ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ మహా సముద్రాలంతటా దేశాల మధ్య సహకారం, అభివృద్ధికి వేదికగా మిలాన్ మారిందన్నారు. దేశ చరిత్రలో కీలకంగా వ్యవహరిస్తూ సముద్ర భద్రతలో, భారతదేశ సముద్ర చరిత్రలో కీలకమైన పాత్రను పోషించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో మిలాన్‌తో పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, వివిధ దేశాలతో భాగస్వామ్యాలు, సహకారంతో సాగర జలాల్లో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో మన దేశం పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. సముద్ర వాణిజ్యంలో భద్రత సవాళ్లను కలిసికట్టుగా అధిగవిుంచాలని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఎంతో అవసరమని, ఇందుకోసం భద్రత, సుస్థిరతను నిర్ధారించడానికి దేశాలు కలిసివచ్చి.. సహకార వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఉప రాష్ట్రపతి ధన్కర్ చెప్పారు. సదస్సులో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు మిలాన్–2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఐఎన్ఎస్ డేగాలో నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మేయర్ హరివెంకటకుమారి, తూర్పు నావికాదళాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డీజీ(గ్రేహౌండ్స్) ఆర్కే మీనా తదితరులున్నారు. -
T Hubలో 'TTA' సేవాడేస్.. పాల్గొన్న యువ పారిశ్రామికవేత్తలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా డేస్ కార్యక్రమం రెండో రోజు హైదరబాద్‌లోని టీ-హబ్‌లో ఘనంగా జరిగింది. TTA ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టార్టప్, ఇన్వెస్ట్మెంట్, ఏఐ అంశాలపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ , ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి, హైదరాబాద్ ఐఐఐటీ కో-ఇన్నోవేషన్ ప్రొఫెసర్ రమేష్ లోగనాథన్ పాల్గొని ప్రసంగించారు. టీటీఏ సభ్యులు తమ ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. మారుమూల గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లి ఎంప్లాయిమెంట్ సృష్టించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న విజయ గాద తన ప్రసంగంతో యువ పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించి సన్మానించారు. -
వాటి అమలులో ఏపీ దేశంలోనే ముందుంది: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై గురువారం విజయవాడలో సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన 17 కోర్సుల పాఠ్య పుస్తకాలను అందజేశారు. విద్యార్థులకు శిక్షణ కోసం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌తో విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సెమినార్లో మంత్రి బొత్స మాట్లాడుతూ.. 'కళాశాలల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఉండాలనే స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే మంత్రివర్గంలో ఒక ప్రత్యేక పోర్ట్ ఫోలియో కూడా పెట్టాం. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఏపీ దేశంలోనే ముందుంది. ఏపీ నుంచి వచ్చిన విద్యార్ధులు గ్లోబల్ స్టూడెంట్ అనిపించుకోవడం ముఖ్యం. అందుకే ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాం. లక్ష మందికి పైగా విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నాం. విద్యార్థులపై ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పైసా ఖర్చు సంక్షేమం కోసమే కాదు పెట్టుబడి. దానిని వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి' అని మంత్రి బొత్స ఆకాంక్షించారు. చదవండి: (అక్కడ ఈడ్చి తంతే హైదరాబాద్‌లో పడ్డాడు: మంత్రి ఆర్కే రోజా) -
నేను విఫలమైన రాజకీయ నాయకుడిని.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఇప్పటికైతే ‘తానొక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడిని’ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని తాను అంగీకరిస్తున్నానని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో సీఏ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్లో మాట్లాడారు. రాజకీయాల్లో విఫలమయ్యానని తానేమీ బాధపడడం లేదన్నారు. తాను కనీసం ప్రయత్నం చేశానని అనుకుంటానన్నారు. ఫెయిల్యూర్ కూడా సగం విజయంతో సమానమని భావిస్తున్నానని తెలిపారు. సినిమాల్లో హీరోగా నటించాలని తాను ఎప్పుడూ కోరుకోలేదన్నారు. తన మొదటి సినిమా ఫ్లాప్ అయిందని గుర్తుచేశారు. ఆ అపజయం తర్వాత కూడా తానెప్పుడూ నిరుత్సాహపడలేదన్నారు. తన విజయాల గ్రాఫ్ ఏడో సినిమా తర్వాత మాత్రమే పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆరేడేళ్లపాటు అపజయాలనే చవిచూశానన్నారు. ఆ తర్వాతే ‘గబ్బర్ సింగ్’ సినిమా విజయం దక్కిందని వెల్లడించారు. జీవితంలో అపజయాలు, విజయాలు సర్వసాధారణమన్నారు. విజయం కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తతతో ఉంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఏ విద్యార్థులకు సూచించారు. తాము ఊహించే ఉద్యోగం దొరక్కపోవచ్చని, దొరికిన ఉద్యోగంలోనే తమ విజయాన్ని వెతుక్కోవాలన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘అపజయం ఎదురైనా చింతించవద్దు.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు’ అని పవన్ సూచించారు. చదవండి: ('నేనున్నాను'.. మీకేం కాదు) -
ఆటిజంపై నాట్స్ సదస్సు
నార్త్ అమెరికా తెలుగు సోసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని నాట్స్ బోర్డ్ చైర్ఉమన్ అరుణగంటి, ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నెలు తెలిపారు. 2022 ఏప్రిల్ 30న మధ్యాహ్నాం 2:00 గంటలు (4:30 ఈఎస్టీ) ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, నిపుణులు ఆటిజంపై చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మాదిరాజు, మీనాక్షి చింతపల్లి, రామ్ ప్రయాగ, శుభ బొలిశెట్టి, కాశినాథుని రాధ, పద్మజా యలమంచిలిలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం వీక్షించేందుకు www.natsworld.org/autism-awareness-acceptance ఉపయోగించవచ్చు. ఫేస్బుక్లో కూడా లైవ్ ఇస్తామని నాట్స్ తెలిపింది. -
స్టేట్ క్రెడిట్ సెమినార్ 2022-23లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్ 2022-23లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్టేట్ ఫోకస్ పేపర్ 2022-23ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ఛైర్మన్ డాక్టర్ జి.ఆర్.చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
మిథనాల్ తయారీకి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి
-
న్యూ లుక్ హెయిర్ స్టైల్స్...
-
'విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ బీచ్ రోడ్ యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో నేచర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బాలల సమాలోచన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అసెంబ్లీ లేజిస్లేటివ్ కమిటీ స్త్రీ, శిశు సంక్షమ వ్యవహారాలు చైర్మన్ విశ్వాసరాయి కళావతి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జి.హైమవతి తదితరులు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విద్య, బాలల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి బాలల హక్కుల పోరాట నేత కైలాష్ నాథ్ చటర్జీ జగన్‌ను కలిసి ప్రశంసించారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. సుస్థిర లక్ష్యాల సాధన కోసం బాలల సమాలోచన సదస్సు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శిశు సంక్షమ వ్యవహారాలు చైర్మన్ విశ్వాసరాయి కళావతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం బాలల చదువు కోసమేనని, సమాజంలో పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పాఠశాలలో బాలలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని, ఆదీవాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం త్వరలోనే భాషా వలంటీర్లను నియమించనుందని కళావతి పేర్కొన్నారు. -
సీవీఆర్, చోహన్ క్యు సాగు పద్ధతులపై శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యు ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, స్వచ్ఛంద సంస్థ ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు)తోపాటు.. మట్టిని ఎరువుగా, పురుగులమందుగా వాడే మట్టి సేద్య పద్ధతి ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) ఈ నెల 29(బుధవారం)న రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు శిక్షణ ఇస్తారు. డా. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు ఈ శిక్షణలో రైతులకు తెలియజేస్తారు. డా. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యేక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయ రంగంలో వివిధ స్థాయిలో వ్యాపారావకాశాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు, సమస్యలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం నిర్వహించనున్నట్లు సి.ఎస్.ఎ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు. పిజిఎస్ ఇండియా సేంద్రియ సర్టిఫికేషన్ నియమాలపై కూడా అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్ తార్నాకలోని సెయింట్ ఆన్స్ జెనరలేట్‌లో జరుగుతుంది. ఫీజు రూ. 15 వేలు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నంబరు.. 85006 83300. trainings@csa-india.org/https://csa-india.org/events/200217-organic-food-marketing/ 2న కొర్నెపాడులో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2 (ఆదివారం)న గొర్రెలు, మేకల పెంపకంపై కడప జిల్లాకు చెందిన పశువైద్య నిపుణులు డా. జి. రాంబాబు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు 97053 83666, 0863–2286255 2న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. రేపు సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్‌పై సదస్సు సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, మార్కెటింగ్ సమస్యలపై ఈ నెల 29(బుధవారం) మధ్యాహ్నం 2 గం. నుంచి సా. 5 గం. వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని మారుతి నర్సరీ(అమ్మపల్లి, నర్కోడా–ఒయాసిస్ స్కూల్ ఎదురు)లో రైతులు, వ్యాపారుల అవగాహన సదస్సు జరగనుంది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, హార్ట్ ట్రస్టు, భారతీయ కిసాన్ సంఘ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు – 76598 55588, మహిపాల్‌రెడ్డి – 76609 66644 -
ఆటా ఆధ్వర్యంలో 'యూఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్' సెమినార్
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసొసియేషన్(ఆటా), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో ' యూఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్' పై గురువారం సెమినార్ నిర్వహించారు. అమెరికాలో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్న విద్యార్థులకు సరైన ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యూహం, మార్గదర్శనం చేయడమే ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం.తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ టి. పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా ఆధ్వర్యంలో ఈ సెమినార్‌ను నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు సరైన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సెమినార్ నిర్వహించిన ఆటాకు, యూస్ కాన్సులేట్ జనరల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి. వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వచ్చేవారు 80శాతం మంది గ్రామీణ విద్యార్థులే ఉంటారని, అందులోనూ మద్య,దిగువ తరగతికి చెందినవారే ఉంటారని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రాజెక్టు వర్క్‌కోసం వచ్చే విద్యార్థులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ కన్సులర్ సెక్షన్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్, స్టేట్ యునివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ రిజిష్ట్రార్ రాజశేఖర్ వంగపతి, ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీమ్‌రెడ్డి, భువనేశ్ కుమార్, జయదేవ్ చల్లా, కవిత(తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం), జాఫర్ జావేద్, ఫ్రొపెసర్ లింబాద్రి, ఫ్రొపెసర్ వి. వెంకటరమణ(టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్), సుల్తాన్ ఉల్ ఉలూం యునివర్సిటికీ చెందిన 50 మంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
అధికారులకు ఎస్పీ సిద్ధార్థ్ సెమినార్
సాక్షి, ఒంగోలు: ఆన్లైన్ దర్యాప్తుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచించారు. శనివారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు ఆన్లైన్ దర్యాప్తుపై అవగాహన కల్పించేందుకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్ దర్యాప్తు అనగానే సైబర్ క్రైం కాదని గుర్తుంచుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా నేడు సాంకేతిక వినియోగం పెరిగిపోయిందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు సాంకేతికతను వినియోగిస్తూ పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకచోట నేరం చేస్తూ మరోచోట తలదాచుకునే వారి గుట్టును సులువుగా ఛేదించాలంటే ఆన్లైన్ దర్యాప్తుపై అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ఒక అనుమానితుడి వేలిముద్రను గుర్తించినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు యాప్ ద్వారా సులువుగా అతనిపై ఉన్న కేసులను తెలుసుకోవచ్చని, ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపడం, వారు వాటిని సెర్చి చేసి నివేదిక అందించాల్సి రావడంతో వేగవంతమైన దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ప్రాథమిక అవగాహన కోసమే సెమినార్ ప్రస్తుతం నిర్వహిస్తున్న సెమినార్ కేవలం ప్రాథమిక అవగాహన కోసమేనని, ఇంకా మలిదశలో మరికొన్ని సెమినార్లు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. అన్ని దశల్లో శిక్షణ పూర్తి చేసుకుని అవగాహన పెంపొందించుకుంటే మీరే సుశిక్షితులైన సైబర్ ఎక్స్‌పర్ట్‌గా ఉంటారని సీనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థ డేటా బేస్‌ను అందుబాటులో ఉంచితే ఆన్లైన్ దర్యాప్తునకు అవకాశం ఏర్పడిందన్నారు. చాలామంది ఆన్లైన్ దర్యాప్తునకు కేవలం ఈ కాప్స్ మీద ఆధారపడుతున్నారని, ఇది సమంజసం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి తగ్గట్లు మనం కూడా వాటిని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో నేరం చేసిన వ్యక్తి మరో ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు పొందే అవకాశాలు లేకపోలేదని, ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు వినియోగం, రేషన్ కార్డు వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్ వినియోగం ఇలా అనేక రకాలైన వాటిలో ఏదో ఒకదాన్ని నేరగాడు తప్పకుండా వినియోగిస్తుంటాడని పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలపై సెల్లో శిక్షణ పొందుతున్న పోలీసు అధికారులు క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్) ప్రస్తుతం అందుబాటులో ఉన్నా అందులో కొంత సమస్య ఉందని, వాటిని సైతం అధిగమించేలా ప్రతి ఒక్కరు మారాలన్నారు. ఇప్పటి వరకు ఎవరో ఒకరిని ఇన్ఫార్మర్గా పెట్టుకుని నిందితులను అరెస్టు చేసేవారని, ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అతడిని ట్రేస్ చేసి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉంటాడో కూడా తెలుసుకోవడం ద్వారా దర్యాప్తు వేగవంతం కావాలని ఎస్పీ వివరించారు. పంజాబ్‌లో ఇటీవల నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారన్నారు. ఫలానా సమయంలో ఫలానా హత్య తానే చేశానని, ఎలా చేసింది కూడా వివరంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేస్తున్నారని, ఇటువంటి నేరస్తులను అరెస్టు చేయాలంటే సాంకేతి వినియోగంపై నైపుణ్యం తప్పనిసరన్నారు. అద్దంకి సీఐ అశోక్‌వర్థన్ ఇటీవల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంచలన కేసులను ఛేదించారని, ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని చిత్తశుద్ధితో ప్రాక్టీస్ చేయాలని వివరించారు. ఇక నుంచి నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే వారు సాంకేతికతను ఎలా వినియోగించుకుంటున్నారనే దాన్ని పరిశీలించేందుకు ఒక ఐటీ టీమ్‌ను కూడా నైట్ షిఫ్ట్‌లో కొనసాగించాలని నిర్ణయించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఏ నేరస్తుడికి సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తున్నాయి, వారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనేది కూడా తెలుసుకోగలుగుతామన్నారు. ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని సాంకేతిక నిపుణులుగా మారాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకాంక్షించారు. దశల వారీగా తాము నిర్వహించే కార్యక్రమాల్లో ఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు అధికారులు తాము ఏం నేర్చుకున్నామో కూడా అందరికీ వివరించాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం వేలిముద్రలు, సైబర్ నేరాలకు సంబంధించిన వాటిపై ఆన్లైన్ ద్వారా ఎలా దర్యాప్తు చేయాలనే దానిపై డెమో ఇచ్చారు. డీఎస్పీ నేతృత్వంలో సంబంధిత సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలకు పెద్ద మానిటర్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. స్పెషల్ బ్రాంచి సీఐలు కె.శ్రీనివాసరావు, శ్రీకాంత్‌బాబు, ఐటీ కోర్ టీమ్ ఎస్ఐ నాయబ్‌రసూల్ పాల్గొన్నారు. -
ఐఏఎఫ్‌సీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
డల్లాస్ : ‘సామాజిక భద్రతా సమాచారం’ పై భారతీయ అమెరికన్లకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) డల్లాస్‌లో ఓ సదస్సు నిర్వహించింది. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ప్రజా వ్యవహారాల నిపుణుడు ఆంజీ హోక్వాంగ్ విచ్చేసి తన విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుల్లో దాదాపు 100 మంది పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకు హోక్వాంగ్ సమాధానం చెప్పారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ అవగాహన సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన మిచిగాన్ రాష్ట్ర పతినిధి పద్మ కుప్ప మాట్లాడుతూ.. సామాజిక భద్రత గురించి తప్పుడు సమాచారం, అపార్థాలను తొలగించడానికి ఇలాంటి సెమినార్లు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ఐఏఎఫ్‌సీ బృంధాన్ని అభినందించారు. సెమినార్ అనంతరం అమె నగరంలోని మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలవేసి నివాళర్పించారు. ఈ కర్యాక్రమంలో ఐఏఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తైయాబ్ కుండవాలా, వైస్ ప్రెసిడెంట్ రావు కాల్వల తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక వ్యవస్థపై రోడ్డు ప్రమాదాల ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రతపై నగర ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రోడ్లు, రవాణా, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఖైరతాబాద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్లో ‘రోడ్ సేఫ్టీ ఆడిట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సేప్టీ’ పై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డిమాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో 12 లక్షల మంది మరణిస్తున్నారని, 5 కోట్ల మంది గాయపడుతున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోవలసి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తగ్గుతున్న దేశ జీడీపీ.. ప్రమాదాల వలనే 3 శాతం దేశ జీడీపీ తగ్గిపోతుందన్నారు. వాహనాలు నడిపే వ్యక్తి అజాగ్రత్త, సేఫ్టీపై అవగాహన లేకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారి సౌకర్యం సరిగా లేని కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల విద్యలో రోడ్డు భద్రతపై సిలబస్ ప్రవేశపెట్టడం ద్వారా అవగాహన పెంచవచ్చన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో సెలబ్రెటీలు, ప్రముఖులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ప్రచారం చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలి.. రోడ్డు భద్రత విషయంలో నిబంధనలను ప్రభుత్వం కఠినగా అమలు చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు పొల్యూషన్ చెక్ చేసి వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నారు. జాతీయ రహదారులపై అంబులెన్స్‌లు సంఖ్య పెంచాలన్నారు. బ్లాక్ స్పాట్లను ముందుగానే గుర్తించి వాటిని పూడిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఆర్అండ్బి అధికారులకు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్‌ల మంజూరులో నిబంధనలు కఠినతరం చేయాలని కోరారు. లైసెన్స్‌లు ఇచ్చినప్పుడే రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రతపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి జానార్ధన్ రెడ్డి, అర్అండ్బి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ డీజీపీ కృష్ణ ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దేవదాసీలకు చేయూత నిద్దాం..
సాక్షి, విజయవాడ: అణగదొక్క బడుతున్న దేవదాసీలకు చేయూత నివ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఏపీ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ నేతృత్వంలో దేవదాసీ వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు 1988లో చట్టం వచ్చిందని..వ్యవస్థలోని కొందరి వలన ఆ చట్టంతో అనుకున్న స్థాయిలో దేవదాసీలకు న్యాయం జరగలేదన్నారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలించడం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ వ్యవస్థ నిర్మూలన కోసం న్యాయమూర్తి కేసీ భాను ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నారు... దేవదాసీ వ్యవస్థ నిర్మూలన చట్టం రూపొందించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చల్లప్పా మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు నాయకులకు లోబడి పనిచేస్తున్నారని..గతంలో ఏ ప్రభుత్వం కూడా దేవదాసీ నిర్మూలన కోసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదాసీ నిర్మూలనకు కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు. సీఎం జగన్ సాంఘిక సంక్షేమం కోసం విదేశాల్లో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. ఐఏఎస్‌లు రవిచంద్ర, దమయంతి.. దేవదాసీ నిర్మూల కోసం ఎంతో పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్,ఎస్సీ కార్పొరేషన్ ఎండి గంథం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
22న ఐఐటీ, జేఈఈ, నీట్‌లపై ‘శశి’అవగాహన సదస్సు
ఉండ్రాజవరం: ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్‌పై ఈనెల 22వ తేదీన విశాఖపట్నం, వేలివెన్ను క్యాంపస్‌లలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు శశి విద్యాసంస్థ ల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ సదస్సులో ఐఐటీ, నీట్ శిక్షణలలో అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపక బృందం.. సీట్లు, సిలబస్ వివరాలు, పరీక్షా విధానం గురించి వివరిస్తారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వేలివెన్ను క్యాంపస్ 08819– 242222, విశాఖ క్యాంపస్ 9705925599 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ సదస్సులో తల్లిదండ్రులకు, విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ వైస్ చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్, మేకా నరేంద్రకృష్ణ తెలిపారు. -
నవాజ్ షరీఫ్‌కు షూ దెబ్బ!
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం జమియా నమీయా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో ఓ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నవాజ్‌పై ఓ విద్యార్థి షూ విసిరాడు. ఆయన ప్రసంగించేందుకు మైక్ వద్దకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షూ నేరుగా నవాజ్ భుజాలు, చెవులకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడితో పాటు అతని సహాయకుడ్ని భద్రతాధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. -
సేంద్రియంపై సెమినార్
► అన్నా యూనివర్సిటీలో జాతీయస్థాయి సెమినార్ ► 9,10,11 తేదీల్లో చెన్నైలో నిర్వహణ ► వేలాది మంది రైతులతో చర్చాగోష్టి, శిక్షణ సాక్షి ప్రతినిధి, చెన్నై: విషతుల్యమైన రసాయనాల వాడకం ద్వారా స్వల్ప వ్యవధిలో అధిక దిగుబడుల మోజులో కొట్టుకుపోతున్న అన్నదాతల్లో వస్తున్న అనూహ్యమైన మార్పు దేశాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపిస్తోంది. ధైర్యంగా పట్టెడన్నం కూడా తినలేని ప్రజలకు సేంద్రియ వ్యవసాయం భరోసా కల్పిస్తోంది. రోజురోజుకూ కలుషితమై కాలకూట విషంగా మారిపోతున్న సాగుభూములకు సేంద్రియ విధానం రక్షణ కల్పిస్తూ భూమాతను కాపాడుతోంది. దేశంలో విస్తరిస్తున్న సేంద్రియ సంప్రదాయానికి, విత్తన సంపదకు చెన్నై అన్నాయూనివర్సిటీలో జరగనున్న జాతీయ సెమినార్ అద్దం పట్టబోతోంది. తాగే నీరు కాలుష్యం, పీల్చేగాలి కాలుష్యం, తినే ఆహారం కాలుష్యం..ఇలా అనేక కోణాల్లో కాలుష్యపు కాటుకు మానవుడు బలైపోతున్నాడు. కొన్ని కాలుష్యాలను గత్యంతరం లేక భరిస్తున్నాడు. అయితే ఆహార కాలుష్యానికి మాత్రం సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని ‘సేఫ్ ఫుడ్ అలయన్స్’ కో ఆర్డినేటర్ అనంతశయనన్ స్పష్టం చేశారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు చెన్నై అన్నాయూనివర్సిటీలో ‘నేషనల్ సీడ్స్ డైవర్సిటీ ఫెస్టివల్–4’ నిర్వహిస్తున్నారు. ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’, ‘అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్’ (ఆషా) సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సెమినార్ జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వేలాది మంది రైతులు దేశం నలుమూల నుంచి ఈ సెమినార్‌కు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ దేశంలోని రైతుల్లో ఎంతో మార్పు వచ్చిందని, పెద్ద సంఖ్యలో సేంద్రియ వ్యవసాయం పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఢిల్లీ, చండీగడ్, హైదరాబాద్‌లలో మూడు సెమినార్లు నిర్వహించగా, చెన్నైలో జరగనున్న నాల్గవ సెమినార్‌కు గతంలో కంటే పెద్ద సంఖ్యలో రైతులు ఉత్సాహం చూపుతున్నట్లు చెప్పారు. సేంద్రియ వ్యవసాయం మాత్రమే కాదు సేంద్రియ విత్తనాలను విస్తృత వాడకంలోకి తేవడమే తమ సెమినార్ల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. చెన్నై సెమినార్లో సైతం వందలాది రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ప్రతిరైతు తన పరిధిలో ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలను చెన్నై సెమినార్లో ప్రదర్శించి ఒకరి అనుభవాలను ఒకరు పంచుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, టెర్రకోట ఉత్పత్తులను ప్రతినిధుల చేత స్వయంగా తయారుచేయిస్తామని. అలాగే రైతులకు శిక్షణ తరగతులను నిర్వహించడంతోపాటు రైతులే తమ అనుభవాలను పరస్పరం పంచుకుంటారని చెప్పారు. వివిధ రకాల పంటల విత్తనాలతోపాటు వైద్యపరమైన విత్తనాలను సైతం ప్రదర్శించనున్నారు. అలాగే ప్రజలకు టెర్రస్గార్డెన్పై అవగాహన శిక్షణ ఇవ్వనున్నారు. సేంద్రియ పానీయాలు, బియ్యం, సంప్రదాయ పత్తితో చేతితో నేసిన వస్రాల అమ్మకం ఇలా ఎన్నో ఆకర్షణలకు సెమినార్ వేదిక కానుందని అన్నారు. సేంద్రియం అంటే ఇంకా తెలియని వారిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. బెంగళూరులో సహజ సమృధ పేరుతో సేంద్రియ ప్రాధాన్యతను ప్రచారం చేసే కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నెట్ వర్క్ ఆఫ్ సీడ్స్ సేవర్స్ ఇన్ ఇండియాకు వ్యవస్థాపకులని, నాలుగేళ్ల కిత్రం ప్రారంభమైన ఈ నెట్ వర్క్ కిందనే సెమినార్లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెట్ వర్క్ కింద వందలాది మంది రైతులు సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు. తొలిరోజుల్లో రైతుల కోసం మాత్రమే పనిచేయగా ప్రస్తుతం అర్బన్‌పై కూడా దృష్టిపెట్టి పట్టణవాసుల్లో సేంద్రియపద్ధతుల్లో టెర్రస్‌గార్డెన్, టెర్రస్ సీడ్స్‌ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సేంద్రియ సాగుపై విదేశీయులు సైతం ఎంతో ఆసక్తి చూపడమేకాదు, ఆచరిస్తున్నారని తెలిపారు. సేంద్రియ వల్ల మనిషి ఆరోగ్యాన్నే కాదు, భూమాతను కాలుష్యం కోరల నుంచి రక్షించినట్లేనని అన్నారు. ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతతో సెమినార్ సాగుతుందని, సేంద్రియ ప్రియులందరికీ ఆహ్వానం పలుకుతున్నామని ఆయన చెప్పారు. -
ఎస్‌ఎంసీల పాత్ర కీలకం
- జడ్జి ఎంఏ సోమశేఖర్ - ఎస్‌ఎంసీలపై జాతీయ సదస్సు కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం అమలులో స్కూల్ మేనెజ్మెంట్ కమిటీలది కీలక పాత్ర అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఏ. సోమశేఖర్ అన్నారు. స్థానిక మథర్ థెరిస్సా ఎక్స్లెంట్ ఇన్ టీచర్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హాల్లో మంగళవారం తేజ రూరల్ డెవలప్మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎంసీలపై రెండు రోజుల జాతీయ శిక్షణ, జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ఎస్ఎంసీలు చేపట్టే పనులు అభినందనీయమన్నారు. 6-14 సంవత్సరాల వయసున్న బాలబాలికలు బడి బయట ఉండరాదన్నారు. అనంతరం ఎస్ఎస్ఏ డైరెక్టర్ ఆంజనేయులు, హుసేన్, జనార్ధన్‌గౌడు, సైకాలజిస్టు పెద్దగారి లక్ష్మన్న, సిల్వర్ జూబ్లీ కాలేజీ అధ్యాపకులు డా.ఎస్ జహాన్, రిసోర్స్ పర్సన్ ఏవీ రమణయ్య, ఉస్మానియా కాలేజీ అధ్యాపకులు గౌస్, స్వచ్చంధ సంస్థ సభ్యులు బాబురావు, వెంకటేశ్వర్లు, సర్దార్ బాషా, మేఘన తదితరులు పాల్గొన్నారు -
ఎంబీఏ విభాగంలో ముగిసిన జాతీయసదస్సు
ఎస్కేయూ : వర్సిటీ ఎంబీఏ విభాగంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. కార్యక్రమానికి ఎస్కేయూ రెక్టార్ ఆచార్య లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ వాణిజ్య విధానంలో భారత్ అవలంభించిన విధానాలు విద్యార్థులకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు అంతర్జాతీయ వాణిజ్యం పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కే.సుధాకర్ బాబు, ఫిజిస్తు కంపెనీ డిప్యూటీ మేనేజర్ మనోహర్ రెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి
పటమట(విజయవాడ తూర్పు) : విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలుతో భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి విద్యార్థి లక్ష్య సాధనవైపు అడుగులు వేయాలని ప్రముఖ కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హెచ్‌వోడీ ఎల్ఎస్ఆర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం నగరంలోని మారీస్స్టెల్లా కళాశాల ఇంగ్లీష్ విభాగం ఆ«ధ్వర్యంలో జాతీయస్థాయిలో జరిగే 'స్పార్క్‌లిట్–2కె17 కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసంపై పట్టు సాధించాలని, సమాజంలో ఉన్న వివిధ రకాల వ్యక్తుల స్వభావాలు, ప్రవర్తలను గమనించాలని అన్నారు. విద్యార్థులు ప్రవర్తనను ప్రతి ఒక్కరూ గమనిస్తుంటారని, సమాజంలో ఉన్నతమైన స్థానం సాధించాలంటే వ్యక్తిత్వం కీలకమని అన్నారు. అనంతరం ఆయన వ్యక్తిత్వ నైపుణ్యంపై పలు వీడియోలు, పేపర్ ప్రజంటేషన్ను ప్రదర్శించి విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ సిల్వ, ప్రిన్సిపాల్ సిస్టర్ రేఖ, ఆంగ్లవిభాగాధిపతి డాక్టర్ సంధా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గోన్నారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన పలు పోటీలు ఆసక్తికరంగా సాగాయి. వర్క్ ఆఫ్ ఫేత్ అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేలా సాగింది. భాషపై ఉన్న పట్టుత్వాని పరిక్షించేందుకు నిర్వహించిన లిటరసీ మేనియూ–క్విజ్ పోటీలు విద్యార్థుల భాషా ప్రావీణ్యాన్ని నిరూపించింది. సిల్వర్ టంగ్ పేరుతో నిర్వహించిన ఉచ్ఛారణపోటీలు విద్యార్థులకు వ్యాకరణపై ఉన్న ఆసక్తిని వివరించేలా సాగింది. విద్యార్థుల్లో నిఘూడంగా దాగిఉన్న కళాత్మక అంశాన్ని నిరూపించేలా సాగిన మినీ ధియోటర్–ఒన్ఆర్ట్ప్లే కార్యక్రమం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. చివరగా నిర్వహించిన చోర్పైప్– సంగీత ప్రదర్శన, రోలీక్లి–నృత్య ప్రదర్శన కార్యక్రమానికి హాజరైనవారిని ఉత్తేజపరిచింది. -
యువతకు ఎన్పీ టెల్ ఒక వరం
ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సదస్సు కోరంగి (తాళ్లరేవు) : దేశంలోని యువతకు ఎన్పీ టెల్ ఒక వరమని నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హేన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్పీ టెల్) కో-ఆర్డినేటర్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ తెలిపారు. కోరంగిలోని కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశంలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉన్నందున కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థికి సైతం ప్రపంచ స్థాయి సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో ఎన్పీ టెల్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ఆయా ఇంజనీరింగ్, డిగ్రీ, మేనేజ్మెంట్ సైన్సెస్, కళాశాలల్లోని అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. వెయ్యికి పైగా కోర్సులను అందిస్తున్నట్టు తెలిపారు. దేశంలో సుమారు 80 శాతం మంది ఈ కోర్సులను ఉపయోగించుకుంటున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల మంది ఎన్పీ టెల్ కోర్సుల్లో చేరారని తెలిపారు. ఎన్పీ టెల్ రీజనల్ మేనేజర్ భారతి మాట్లాడుతూ యువతను సాంకేతిక విజ్ఞానంలో నిష్టాతులను చేసేందుకు దూర విద్యను రూపొందించినట్టు తెలిపారు. ఈ నెల 23 వరకు 4, 6, 12 వారాల కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. సాఫ్ట్ స్కిల్స్, ఆంగ్ల విద్య, లీడర్షిప్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ తదితర అధునాతన మార్పులపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతీవారం విద్యార్థులకు వారాంతపు పరీక్షలు నిర్వహించి టీసీఎస్ ఐకాన్ ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. ఈ కోర్సులలో నేర్చుకున్నవారు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు కైట్ కళాశాలను రీజినల్ సెంటర్‌గా గుర్తించినట్టు ఆమె తెలిపారు. -
సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు ఈనెల 8న
కరీంనగర్లో ఏర్పాటు.. ప్రవేశం ఉచితం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడి అవకాశాలు అసంఖ్యాకంగా ఉన్నా యి. మరి ఏ సమయంలో ఎందులో పెట్టుబడి పెట్టాలి? అసలు ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఆర్థిక ప్రగతికి బాటలు పడతాయి? ఇలా ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడుల నిర్వహణ, స్టాక్ మార్కెట్స్ వంటి సమస్త సమాచారాన్ని అందించేందుకు ‘సాక్షి–మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ సదస్సు’ ఈ సారి కరీంనగర్లో జరుగుతోంది. ఈ నెల 8న కరీంనగర్లో ఇన్‌కం టాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జరగనుంది. ఈ సదస్సులో సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివ ప్రసాద్ వెనిశెట్టి, కొటక్ మ్యూచువల్ ఫండ్ జనరల్ మేనేజర్ తిరుమల్ రెడ్డి, కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ జోనల్ బ్రోకింగ్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ వింజమూరి వక్తలుగా పాల్గొంటారు. ప్రవేశం ఉచితం. సభ్యత్వ నమోదు కోసం 95055 55020 నంబర్లో సంప్రదించవచ్చు. -
నోట్ల రద్దు వెనుక వాస్తవాలపై విశ్లేషణ అవసరం
భీమవరం టౌన్: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యపరమైన హీనతతో బాధపడుతోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. నగదు రహిత ఆర్థికవ్యవస్థ చెడ్డదని, ఉపయోగం లేనిదని తాను చెప్పనని అయితే దానికి ముందుగా ఆర్థికవ్యవస్థ స్వరూపం మార్చాలని స్పష్టం చేశారు. భీమవరం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ‘పెద్దనోట్ల రద్దు.. ప్రజ లపై ప్రభావం’ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన నాగేశ్వర్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు దాని వెనుక ఉన్న వాస్తవాలపై ఆర్థిక విశ్లేషణ అవసరమన్నారు. పెద్దనోట్ల రద్దు సాహసం ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ చేయలేదు.. ప్రధాని మోదీ మాత్రమే చేశారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని నాగేశ్వర్ చెప్పారు. ఐరోపా దేశాల ఆర్థికకూటమి పెద్దనోట్లను గతంలో రద్దు చేసిందన్నారు. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు ఇదే మొదటిసారి కాదన్నారు. సామాన్యులు కూడా రూ.500 నోట్లు సంపాదిస్తున్నారని ఈ నోటు విలాసవస్తువో, సంపన్నులకు మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ నగదురహిత ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని చెప్పి 40 రోజులు తిరగకుండానే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాటమార్చారన్నారు. నల్లధనం రూ.500, రూ.1,000 నోట్లు అయితే బొగ్గు, స్పెక్టమ్ర్, కామన్వెల్త్, పశుగ్రాసం, బోఫోర్స్, కేజీ బేసిన్, హర్షద్ మెహతా తదితర కుంభకోణాల్లో ఎన్ని లక్షల కోట్లు ఆ కుంభకోణాలకు పాల్పడిన వారి ఇళ్లల్లో దొరికాయని నాగేశ్వరరావు ప్రశ్నించారు. నగదు రహిత విధాన కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్నారని హ్యాక్ జరిగితే నెలకొనే ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారో ఆయన చెప్పాలన్నారు. దేశంలో ఒక కోటి యాభై లక్షలు చిన్నదుకాణాలు ఉన్నాయని, స్వైపింగ్ మెషిన్లు 14 లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. 90 శాతం రోడ్డు పక్క వ్యాపారాలు చేసేవారే ఉన్నారన్నారు. ఒక్కోటి 50 లక్షల దుకాణాలకు స్వైపింగ్ మెషిన్లు ఎప్పుడిస్తారు? ఈలోపు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సదస్సుకు యూటీఎఫ్ అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షత వహించారు. వివిధ సంఘాల నాయకులు గాతల జేమ్స్, చింతకాయల బాబూరావు పాల్గొన్నారు. -
నగదు రహితం.. కష్టం
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అయినప్పటికీ తగినంత నగదు లభించడం లేదు. బ్యాంకులకు నగదు సరఫరా నామమాత్రంగానే ఉండడంతో రోజువారీ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్వైపింగ్, ఈ వాలెట్లు తదితర మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ‘నగదు రహిత లావాదేవీలు-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ జయశంకర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ హరిబాబు, టెక్నికల్ అధికారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యత, టెక్నాలజీపై మెజార్టీ ప్రజలకు అవగాహన లేకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదని తేల్చిచెప్పారు. -
మెడికో లీగల్ కేసులపై 27న సదస్సు
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలపై ఈ నెల 27వ తేదిన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాయంత్రం 7 గంటలకు స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్‌క్లబ్‌లో సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, గౌరవ అతిథిగా ఎస్పీ ఆకె రవికృష్ణ హాజరవుతారన్నారు. సదస్సులో వైద్యులు తమ వృత్తిలో ఎదుర్కొనే మెడికో లీగల్ కేసులు, న్యాయపరమైన సమస్యల గురించి సుప్రీంకోర్టు న్యాయవాది మహేంద్రకుమార్ బాజ్‌పాయి వివరిస్తారన్నారు. -
సామాజిక చైతన్యంపై సరళీకరణ ప్రభావం
విజయవాడ (గాంధీనగర్) : సమాజంలోని సామాజిక చైతన్యాన్ని సరళీకరణ విధానాలు దెబ్బతీశాయని సీనియర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ఉండ్రు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో 'భారతీయ సమాజంలో కుల, వర్గాలపై లిబరలైజేషన్ ప్రభావం' అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ సరళీకృత ఆర్థిక విధానాలతో గ్రామీణ సామాజిక, సాంస్కృతిక, జీవన విధానం ధ్వంసమైందన్నారు. దళితులు, అణగారిన వర్గాలు, శ్రామికులు తమ ఉనికిని, నైపుణ్యాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సామాజిక సమూహాల జీవన వైవిధ్యాలను, ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలిగే ప్రజాస్వామిక కార్యాచరణను రూపొందించుకోవాలని సామాజిక ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.వినయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాల వెలుగులో పరిపాలన కొనసాగించడం ద్వారానే సామాజిక సమస్యల పరిష్కారానికి సరైన మార్గం దొరుకుతుందన్నారు. సదస్సులో ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, సివిల్ సొసైటీ ఫోరం కన్వీనర్ గోపి, కాపునాడు నాయకులు జి.సుబ్రహ్మణ్యం, బీసీ ఫోరం కన్వీనర్ ఏ.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఈడేపల్లి : ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేష¯ŒS ఈడీ ఎ¯ŒSవీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక 27వ వార్డులోని ఎస్సీకాలనీలోని కమ్యూనిటీ హాలులో నిరుద్యోగ, యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీలకు విద్యార్హతతో బేధం లేకుండా అందరూ ఉపాధి పొందవచ్చన్నారు. రాష్ట్రంలో లక్ష మంది ఎస్సీలకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్న వెంటనే ఆ¯ŒSలై¯ŒSలో నమోదు చేస్తామన్నారు. దరఖాస్తులు చేసుకొన్న అభ్యర్థులకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతిలలో మూడు నెలలపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎగ్జిక్యూటీవ్ అధికారి లావణ్య, వార్డు టీడీపీ నాయకులు సనక నాగులు పాల్గొన్నారు. -
నిరంతర సాధనతోనే సంగీతం
విజయవాడ కల్చరల్: నిరంతర సాధనవల్లనే సంగీతం అలవడుతుందని సినీ సంగీత దర్శకుడు వీణాపాణి అన్నారు. ఆంధప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో 15 రోజులుగా నిర్వహిస్తున్న 72 మేళ కర్తరాగాల అవగాహన సదస్సు శుక్రవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ కర్నాటక సంగీతం భారతీయ సంగీత సంప్రదాయానికే తలమానికమని తెలిపారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ స్వరకామాక్షి కీర్తన సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా మిగిలిపోతుందన్నారు. ఘంటసాల సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజన్ మాట్లాడుతూ అవగాహన సదస్సులో నేర్చుకున్న అంశాలను సాధన చేయాలని సూచించారు. సంగీత కళాశాల అధ్యాపక అధ్యాపకేతిర సిబ్బంది పాల్గొన్ని వీణాపాణిని సత్కరించారు. -
తెలుగుజాతి మణిపూస కాశీనాథుని
విజయవాడ కల్చరల్: తెలుగుజాతి మణిపూస కాశీనాథుని నాగేశ్వరరావు పంతులని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కేంద్రసాహిత్య అకాడమీ, కృష్ణా విశ్వవిద్యాలయం, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా ఆంధ్రపత్రిక, భారతి పత్రికల సాహిత్యసేవ అంశంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. మండలి మాట్లాడుతూ ఆంధ్రపత్రిక, భారతి పత్రికలను దాని వ్యవస్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులును వేరుగా చూడలేమని తెలుగవారి సాహితీ గుండెచప్పుడు ఆయనదని అభివర్ణించారు. నాటి తెలుగువారిలో స్వాత్రంత్య్ర కాంక్షను, పత్రికలు అంతగాలేని రోజుల్లోనే తెలుగుపాఠకులలో చదువుల పట్ల ఆసక్తిని కలిగించాయని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ అకాడమీ మరుగున పడిన సాహిత్య నిర్మాతల జీవితాల ఆధారంగా అనేక పుస్తకాలను ప్రచురించిందని వివరించారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సంచాలకులు డాక్టర్ ఎన్.గోపి భారతి సాహిత్యపత్రిక సేవలను వివరిస్తూ ఆ పత్రికతో తన అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సభ్యుడు పాపినేని శివశంకర్, డాక్టర్ జీవీ పూర్ణచంద్లు ఆంధ్రపత్రిక సాహితీసేవలను వివరించారు. -
ప్రపంచ తెలుగుసాహిత్య సదస్సుకు నన్నయ వీసీ
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : సింగపూర్‌లో జరిగే ఐదవ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సులో పాల్గొనేందుకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పయనమయ్యారు. వంగూరి ఫౌండేషన్, సింగపూర్ తెలుగు సమితి, లోక్‌నాయక్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగే సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మంది వరకు తెలుగు సాహిత్య ప్రముఖులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ‘తెలుగు భాష మాధుర్యం – ఆవశ్యకత’ అనే అంశంపై తాను ఉపన్యసిస్తానన్నారు. -
ధాన్యం మద్దతు ధర పెంచాలి
ఏలూరు(సెంట్రల్) : ధాన్యం మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 4న ఏలూరులో సదస్సు నిర్వహిస్తున్నట్టు కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక అన్నే భన¯ŒSలో సోమవారం సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్యం మద్దతు ధర రైతులకు ఏమాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యం ఉత్పత్తికి రూ.1700కు పైగా ఖర్చు అవుతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1510, రూ.1470ను ధాన్యం మద్దతు ధగా ప్రకటించారని, క్వింటా ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ప్రస్తుత ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నవంబర్ 4న స్థానిక ఐఏడీపీ హాలులో ఉదయం 11గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని, రైతు సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గంజి నాగేశ్వరరావు, గొర్రెల సాంబశివరావు, వాడపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మక పరిశోధనలే ప్రగతికి మూలం
గుడ్లవల్లేరు: సృజనాత్మకతే పరిశోధనలకు మూలమని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ రీసెర్చ్ బోర్డ్ సలహాదారుడు డాక్టర్ పి.సంజీవరావు అన్నారు. గుడ్లవల్లేరు ఇంజజినీరింగ్ కాలేజీలో ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధనల ఆవశ్యతకపపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధ్యాపక వృత్తిలోని మేధావులు పరిశోధనాసక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ రీసెర్చ్ బోర్డ్ అన్ని రంగాల్లోని పరిశోధనలను 13 విభాగాలుగా గుర్తించినట్లు చెప్పారు. పరిశోధనలు చేయడానికి అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ బోర్డ్ విద్యార్థి దశ నుంచి పరిశోధనా పటిమ కలిగిన వారిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. సృజనాత్మక దృక్పథంతో ముందుకు వస్తే భారత ప్రభుత్వం అందించే వివిధ పథకాలతో వాటిలో నియమ నిబంధనలకు అనుగుణంగా పాటిస్తే జరిగే మేలును వివరించారు. అనంతరం ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీంద్రబాబు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ ఎం.కామరాజు, కరుణకుమార్, ఎస్ఆర్కే రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి
– రోబోటిక్స్‌పై జాతీయ సదస్సులో బృందావన్ కాలేజీ అకాడమిక్ డైరక్టర్ పిలుపు కల్లూరు (రూరల్): విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని బృందావన్ ఇంజినీరింగ్ కళాశాల అకాడమిక్ డైరక్టర్ ఎన్ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పెద్దటేకూరులోని బృందావన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం 'రోబోటిక్స్'పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా కళాశాల అకాడమిక్ డైరక్టర్ హాజరై మాట్లాడారు. పుస్తక పరిజ్ఞానం ఇంజినీరింగ్ విద్యార్థులకు సరిపోదన్నారు. హైదరాబాద్ డేటా పాయింట్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ పి. సాయికృష్ణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక రంగంలో దూసుకెళ్తేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో బిట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. గిరీష్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్స్ ప్రొఫెసర్ ఎస్.రమేష్‌రెడ్డి, ఎస్ నారాయణరెడ్డి, డేటా పాయింట్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ టి. శివప్రసాద్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి. హరికుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స.హ. చట్టానికి సర్కార్ తూట్లు
నందిగామ రూరల్ : సమాచార హక్కు చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని చట్టం రాష్ట్ర కమిషనర్ లాం తాంతియాకుమారి పేర్కొన్నారు. స్థానిక రహదారి బంగ్లాలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చట్టం ఇప్పటికీ ప్రజలకు చేరువ కాలేదన్నారు. కలెక్టర్లు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పారు. అర్జీదారు కోరిన సమాచారం ఇవ్వని పక్షంలో సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు అధికారులు తమ ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. సమాచారం పొందగోరే వారు రిజిస్టర్ పోస్టు ద్వారా అర్జీలు పంపాలని, తద్వారా నిర్ణీత గడువులోగా సమాచారం అందని పక్షంలో ఎకనాలెడ్జ్మెంటు కార్డు సాక్ష్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయ¶æూలల్లో 41బీ, సిటిజన్ చార్ట్ విధిగా ఏర్పాటు చేయాలని, అందుకు ఏ శాఖ మినహాయింపు కాదని స్పష్టం చేశారు. తక్షణమే ఇవి అన్ని కార్యాలయాల వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రీరామకృష్ణను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కురగంటి హనుమంతరావు పాల్గొన్నారు. -
సంగీతానికి లక్ష్యసిద్ధి ఉండాలి
విజయవాడ కల్చరల్: సంగీతానికి లక్ష్యసిద్ధి ఉండాలని సంగీత విద్వాంసుడు, సినీ సంగీత దర్శకుడు వీణాపాణి వివరించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సంయుక్తంగా సంగీత కళాశాలలో 72 మేళ కర్తరాగాల సులభతర అవగాహన సదస్సు కార్యక్రమాన్ని 13 రోజులపాటు నిర్వహించనున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో వీణాపాణి మాట్లాడుతూ సంగీతాన్ని మొక్కుబడిగా నేర్చుకోకూడదని, దిశా నిర్దేశం, లక్ష్యం ఉండాలని ప్రపంచంలోని సంగీతమంతా శబ్దం నుండే పుట్టిందని సంగీతానికి ప్రాణాధారం శబ్దమేనని వివరించారు. వాటి నుంచే స్వరకల్పన తయారైందని వివరించారు. లక్షమంది సంగీత విద్యార్థులకు 72 మేళ కర్తరాగాలతో అవగాహన కలిగించటానికి కృషిచేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్డర్ విజయభాస్కర్, దికల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కెఎస్. గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
కాల్‌మనీ వ్యాపారులపై చర్య తీసుకోవాలి
విజయవాడ(గాంధీనగర్) : దళిత, గిరిజనులను వేధిస్తున్న కాల్‌మనీ, వడ్డీ వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యాపారులపై దళితులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు బాధ్యతాయుతంగా దర్యాప్తు కొనసాగించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లోనూ దళితులకు న్యాయం చేయడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవానరంలో బుడగ జంగాల కులస్తులు కాల్‌మనీ వ్యాపారులపై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని చెప్పారు. ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేవీపీసీఎస్ నాయకులు పరిశపోగు రాజేష్ మాట్లాడుతూ చట్టవ్యతిరేకంగా సాగిస్తున్న వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని కోరారు. -
ఎఫ్పీవోలుగా ఏర్పడితేనే సాగు లాభసాటి
ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసులు కొబ్బరి రైతులకు అవగాహన సదస్సు అమలాపురం/ అంబాజీపేట : ‘ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో)లుగా ఏర్పడితేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అన్ని వాణిజ్య పంటల రైతులు తమ పంటల వారీగా ఎఫ్పీవోలుగా ఏర్పడాలని ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ శ్రీనివాసులు అన్నారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలోని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఇంటి వద్ద కొబ్బరి రైతులకు ఎఫ్‌పీవోలపై అవగాహన సదస్సు జరిగింది. కోనసీమ నలుమూలల నుంచి కొబ్బరి రైతులు హాజరయ్యారు. వినియోగదారుడు కొనుగోలు చేసే ధరలో ప్రస్తుతం రైతులకు కేవలం 25 శాతం మాత్రమే ధర లభిస్తుందని, దీనిని కనీసం 65 శాతం వరకు పెంచేలా ప్రభుత్వం ఎఫ్‌పీవోలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎఫ్‌పీవోలను, కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేయడం ద్వారా రైతుల ఉత్పత్తులను కంపెనీలు నేరుగా కొనుగోలు చేసే అవకాశముందని, దీని వల్ల రైతులకు లాభసాటి ధర వస్తుందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడంతో పాటు రూ.కోట్లతో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. కొబ్బరి రైతులు సైతం పెప్సీకో వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే అవకాశముందని, కోనసీమలోని సుమారు 10 లక్షల కురిడీ కొబ్బరికాయల నిల్వ చేసుకునే స్థాయిలో ప్యాక్‌హౌస్‌లను సైతం రైతులు నిర్మించుకునే అవకాశముందని ఆయన చెప్పారు. ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసుకునే విధివిధానాలపై వృత్తి స్వచ్ఛంద సంస్థకు చెందిన నరేంద్రనాథ మాట్లాడుతూ ములకనూరు రైతు సహకార సొసైటీ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని రైతులు ఎఫ్పీవోలుగా ఏర్పడాలన్నారు. గ్రామస్థాయిలోను, డివిజన్ స్థాయిలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని, ఒక పాలకవర్గాన్ని సైతం ఎన్నుకోవాలని సూచించారు. ఎఫ్‌పీవోలకు నాబార్డు, ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సహకాలందుతాయన్నారు. కేరళలో కొబ్బరి అభివృద్ధి వెనుక ఈ సంఘాల కృషి ఉందని ఆయన వివరించారు. హైదరాబాద్‌కు చెందిన ట్రేడర్ లక్ష్మీనారాయణ, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి, బలరామ్ కోకోనట్ ఫెడరేషన్ చైర్మన్ ఉప్పుగంటి భాస్కరరావు, రైతులు పెదమల్లు నాగబాబు, డీసీసీబీ డైరెక్టర్ జవ్వాది బుజ్జిలు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు పరంజ్యోతి విద్యార్థులు
అమలాçపురం రూరల్ : ఇండోనేషియా రాజధాని జకర్తలాలో రెండు వారాల పాటు జరిగే గ్లోబల్ స్కూల్ అంతర్జాతీయ సదస్సుకు అమలాపురం మండలం కామనగరువులోని పరంజ్యోతి పాఠశాల పదో తరగతి విద్యార్థులు ఇద్దరు హాజరవుతున్నారు. ప్రపంచ దేశాల్లోని విద్యా విధానం.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అధ్యయనం చేసేందుకు పరంజ్యోతి విద్యార్థులు ఎంపిక కావడం హర్షణీయమని ఆ విద్యా సంస్థల రెసిడెన్షియల్ డైరెక్టర్ కార్ల్ డేవిడ్ కొమానపల్లి (లాల్), అకడమిక్స్ డైరెక్టర్ ఎస్తేరు జ్యోతి తాతపూడి తెలిపారు. మంగళవారం ఆ స్కూలులో ప్రిన్స్‌పాల్ ప్రదాప్ ఫిలిక్స్, ఆస్ట్రేలియాకు చెందిన విద్యావేత్త జెన్నీఫర్ జోన్స్‌తో కలసి విలేకర్లతో మాట్లాడారు. తమ స్కూలు విద్యార్థులు పరమట శివాని, ఇమ్మానియేల్ పాల్ కొమనాపల్లితో పాటు స్కూలు కో ఆర్డినేటర్ నూకపెయ్యి ఆదిలక్ష్మి సదస్సుకు వెళ్లనున్నారన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన విద్యా సంస్థతో ఒప్పందం కుదర్చుకున్నామని చెప్పారు. ఆ దేశ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు తమ పాఠశాలకు వచ్చి విద్యా బోధన చేస్తున్నారన్నారు. ఈ నెల 30న విద్యార్థులు ఇండోనేషియా బయలు దేరుతున్నారన్నారు. ఆ దేశాల్లో ఉన్న విద్యా సమస్యలను వారు ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకుని ఇక్కడ పరిష్కారానికి విద్యార్థుల్లో చైతన్యం నింపుతామని లాల్ తెలిపారు. అంతర్జాతీయ సదస్సుకు వెళ్తున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
రేడియోధార్మికతతో ప్రయోజనాలు
శాస్త్రవేత్త వెంకటసుబ్రహ్మణి మొగల్రాజపురం : రేడియో ధార్మికత వల్ల వైద్య రంగంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసర్చ్ శాస్త్రవేత్త సి.ఆర్.వెంకటసుబ్రహ్మణి అన్నారు. మంగళవారం ఉదయం పి.బి.సిద్ధార్థ కళాశాలలోసి సెమినార్ హాలులో కశాళాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘రేడియో కెమిస్రీ’్ట అంశంపై సదస్సు జరిగింది. వెంకటసుబ్రహ్మణి మాట్లాడుతూ మనిషి ఎముకల సాంధ్రతను పరిశీలించడంతో పాటు పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో లభించే ఎముకలు, వస్తువులు ఎన్ని సంవత్సరాల పూర్వానికి చెందినవో తెలిపేందుకు రేడియోధార్మికత ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయరంగంలో కూడా దీనివల్ల ఉపయోగాలున్నాయని వివరించారు. విద్యార్థులు ఈ రంగంపై దృష్టి సారించి ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా పరిశోధనల జరిపి దేశానికి ఉపయోగపడవచ్చునని సూచించారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ తమ విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు వివిధ రంగాల్లో ప్రముఖులను తీసుకువచ్చి వారితోనే ఆయా అంశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కళాశాల డీన్ రాజేష్, ప్రిన్సిపాల్ ఎం.రమేష్, కళాశాల రసాయనశాస్త్ర విభాగాధిపతి ఎం.మనోరంజని పాల్గొన్నారు. -
తిరుపతిలో బీజేపీ సదస్సు
– రాయలసీమ జిల్లాల నేతలందరూ హాజరు – ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు – సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధిష్టానం సాక్షి ప్రతినిధి, తిరుపతి : అక్టోబరు 1న తిరుపతిలో భారీ సదస్సును నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నేతలను కూడా సదస్సుకు ఆహ్వానించనుంది. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందు కోసం సదస్సును ఏర్పాటు చేస్తోన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ తరహా సదస్సులను విశాఖపట్నం, విజయవాడల్లో నిర్వహించిన పార్టీ అధిష్టానం తిరుపతి కేంద్రంగా జరిగే సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజలను సమీకరించాలని చూస్తోంది. సోమవారం తిరుపతిలో సమావేశమైన జిల్లా పార్టీ నాయకులు చంద్రారెడ్డి, పొన్నలూరి భాస్కర్, భానుప్రకాశ్‌రెడ్డి, శాంతారెడ్డి తదితరులు సదస్సు నిర్వహణకు సంబంధించి సమీక్షించారు. తిరుపతి సదస్సును భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన సూచన మేరకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులకు ఆహ్వానాలు పంపాలని జిల్లా కమిటీ నిర్ణయించింది. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల నేతలతో మాట్లాడి ఏఏ స్థాయి నాయకులకు ఆహ్వానాలు పంపాలన్నవిషయంపై నాయకులు చర్చించారు. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రి కామినేని శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కమిటీ అ««ధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పార్టీ నాయకులు నిర్ణయానికి వచ్చారు. సదస్సు రోజున పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానం పలుకుతూ రేణిగుంట విమానాశ్రయం నుంచి సదస్సు జరిగే ప్రాంగణం వరకూ 2 వేల టూ వీలర్స్‌తో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. -
హిందీ భాషతోనే జాతీయ సమైక్యత
కేయూక్యాంపస్ : హిందీభాష భారతీయ ప్రజల సమైక్యతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని కాకతీయ యూనివర్సిటీ హిందీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ చిలక సంజీవ అన్నారు. శుక్రవారం హిందీభాషాదినోత్సవం సందర్భంగా హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందీ భారతీయ రాజ్యభాష అని, దేశంలో అత్యధికులు హిందీ భాషనే మాట్లాడుతారని ఆయన పేర్కొన్నారు. హిందీభాషలో భారతీయ సంస్కృతి ఇమిడి ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామానుజరావు మాట్లాడుతూ హిందీభాషతో దేశవ్యాప్తంగా ఎన్నోరకాల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మార్కులు ముఖ్యం కాదని విషయ పరిజ్ఞానం పెంచుకోవటం ముఖ్యమన్నారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుకర్, నెహ్రూ యువజన కేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్, హిందీ విభాగ్ అధ్యాపకురాలు డాక్టర్ సరస్వతి, డాక్టర్ సుజాత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ ఫరాఫాతిమా పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటకం
ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విజ్ఞాన శాస్త్ర నాటక పోటీలు స్థానిక అమీనాపేటలోని బాలయోగి సైన్స్ పార్కులో మంగళవారం నిర్వహించారు. డీఈవో డి.మధుసూదనరావు పర్యవేక్షణలో సైన్స్ పార్కు కోఆర్డినేటర్ సీహెచ్‌ఆర్‌ఎం చౌదరి నాటక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 14 పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులంతా వివిధ అంశాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. విజేతలు వీరే – శుభ్రమైన ఆరోగ్యమైన భారతదేశం అనే అంశంపై ఏలూరు సెయింట్ థెరిస్సా ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన నాటికకు ప్రథమ స్థానం లభించింది. – అబ్దుల్ కలాం జీవిత చరిత్ర అంశంపై పెదవేగి మండలం ప్రకాశ్‌నగర్‌లోని డీసెల్స్ మూగ, బధిర పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు ద్వితీయస్థానం వచ్చింది. – శుభ్రమైన, ఆరోగ్యమైన భారతదేశం అనే అంశంపై దూబచర్ల జెడ్పీ హైస్కూల్, గ్రీన్ ఎనర్జీపై ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ శర్వాణీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు తతీయస్థానం లభించింది. -
రేపు ప్రత్తిపాడులో జిల్లా స్థాయి ఉపాధ్యాయ సదస్సు
ప్రత్తిపాడు : ప్రత్తిపాడులోని ఆర్సీఎం పాఠశాల ఆవరణలో ఈనెల 21వ తేదీ బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ సదస్సు ఏర్పాటు చేసినట్టు ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. సామాజిక భద్రత లేని కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంపై ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గోరస దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సభలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పాండురంగ వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజగోపాల్, జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రాజు, ఉపాధ్యక్షుడు జె.మోహన్‌రావు, కార్యదర్శి బి.రామయ్య చౌదరి, ప్రత్తిపాడు తాలూకా జేఏసీ అధ్యక్షుడు రామిశెట్టి రాంబాబు తదితరులు ప్రసంగిస్తారని చెప్పారు. ఈ సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులంతా హాజరుకావల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
కన్నయ్య కుమార్‌కు చేదు అనుభవం
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో బెయిల్‌పై విడుదలైన మాజీ జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్‌కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఓ సెమినార్లో పాల్గొన్న కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా శ్రోతలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో మధ్యలోనే ఆయన ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేయడంతో కన్నయ్యపై అక్కడివారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. దేశంలో ప్రజలు వీధుల్లో, జైళ్లలో ఉంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నారంటూ కన్నయ్య విమర్శలు ఎక్కుపెట్టాడు. దేశంలో 65 శాతం యువత ఉండగా.. 65 ఏళ్ల వ్యక్తి వారికి నాయకుడిగా ఎలా ఉంటారు అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో అక్కడివారు కన్హయ్య ప్రసంగానికి అడ్డుపడటంతో 'దేశంలో స్వేచ్ఛ ఉంది. ఇలా అడ్డు తగులుతున్న మీపై ఎవరూ దేశ ద్రోహం కేసు నమోదు చేయరు' అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. -
కళాశాలల్లో బయోమెట్రిక్
- ఆధార్‌తో అనుసంధానం - ఇంజనీరింగ్, వృత్తి విద్యాకాలేజీల్లో అమలు - అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు వర్తింపు కానూరు (పెనమలూరు): రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు వృత్తివిద్యా కోర్సులు ఉన్న కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు విద్యార్థులకు బమోమెట్రిక్‌తో హాజరు అమలు చేస్తామని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ బి. ఉదయలక్ష్మి అన్నారు. కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం పీవీపీ సిద్ధార్థ, జేఎన్టీయు కాకినాడు సంయుక్తంగా ‘ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్’ అనే అంశం పై సమావేశం జరిగింది. ఇందులో ఆమె మాట్లాడుతూ కాలేజీలో బయోమెట్రిక్ పద్ధతితో హాజరు తీస విధానాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. దీంతో హాజరు వివరాలు కాలేజీ యాజమాన్యం, ప్రభుత్వానికి నేరుగా అందుతాయని వివరించారు. ప్రతి కాలేజీ పరిశ్రమలకు అనుసంధానంగా ఉండాలని, దీని వల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని తెలిపారు. విదేశీ అధ్యాపకులతో బోధన విదేశాల నుంచి వచ్చి అధ్యాపకులు ఇక్కడ పాఠాలు చెబుతారని, కేంద్ర ప్రభుత్వం నూతన పథకం అమలు చేస్తుందని ఉదయలక్ష్మి చెప్పారు. ప్రతి కాలేజీలో ఇంకుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి పరిశోధనలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలేజీల్లో ఇన్నవేటివ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్ఐఆర్ఎఫ్)తో ప్రతి కాలేజీకి ర్యాంకింగ్ ఇస్తారని, దీంతో విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ సమావేశంలో జేఎన్టీయు డైరెక్టర్ దక్షణమూర్తి, జెన్టీయు ప్రొఫెసర్లు ప్రభాకర్, జెవి.రమణ, చక్రవర్తి, ఎన్ఐసీ ప్రతినిధి సత్యసాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన పెంచుకుంటేనే పురోగతి
విజయవాడ (వన్‌టౌన్) : విద్యార్థులు తమ హక్కులు, అవకాశాలపై అవగాహన పెంచుకుని ముందుకు సాగాలని, అప్పుడే పురోగతి సాధించగలరని ఆంధ్రా విశ్వవిద్యాలయం దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య బి.రత్నకుమారి అన్నారు. కేబీఎన్ కళాశాలలో మహిళా సాధికారత వేదిక ఆధ్వర్యాన ‘మహిళలపై వివక్షత తొలిగినప్పుడే భారతీయ మహిళా వికాసం సాధ్యం’ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. ఆచార్య రత్నకుమారి మాట్లాడుతూ రాజ్యాంగం పలు హక్కులు కల్పించినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తు న్నా ఇప్పటికీ మహిళల వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉందన్నారు. పారి శ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. విద్యార్థినులు చదువుతోపాటు తమ సాధికారతకు అవసరమయ్యే అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్.రజిత్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, మహిళా అధ్యాపకులు డాక్టర్ వి.సుభాషిణి, డాక్టర్ కృష్ణప్రియ, దుర్గ, డాక్టర్ అనూరాధ పాల్గొన్నారు. -
చిన్న పరిశ్రమలపై దృష్టి పెట్టండి
విజయవాడ (లబ్బీపేట) : విద్యార్థులు చదువు పూర్తవగానే ఉద్యోగాల కోసం చూడకుండా చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఢిల్లీలోని ఎన్ఎస్ఐసీ రిసోర్స్ పర్సన్ జి.సుదర్శన్ సూచించారు. స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఎన్ఎస్ఐసీ ఆధ్వర్యాన బుధవారం కామర్స్ విద్యార్థులకు బుధవారం ఎంటర్ప్రెన్యూర్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న తరహా పరిశ్రమలను ఏ విధంగా ప్రారంభించాలి, ఫైనాన్స్‌ను ఏ విధంగా పొందాలి, ముద్ర, బ్యాంకులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్ఎస్ఐసీ నుంచి సహాయ సహకారాలు పొందే విధానం గురించి సుదర్శన్ వివరించారు. ఎంఎస్ఎంఈ, టీసీవో, డీఐసీ, ఎన్జీవోల నుంచి శిక్షణ కూడా పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పరిశ్రమలు స్థాపించి సొంతగా అభివృద్ధి సాధించాలని, పది మందికి ఉపాధి కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టి.విజయలక్ష్మి, కామర్స్ విభాగాధిపతి టి.రమాదేవి, ఇతర అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఎన్క్యూపీ సెమినార్ బహిష్కరణ
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో గురువారం నిర్వహించిన ఎన్క్యూపీ (న్యూ క్వాలి టీ పాలసీ) సెమినార్‌ను ప్రభుత్వ సాంఘిక సంక్షే మ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బహిష్కరించారు. సెమినార్‌కు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 22 మంది ఉపాధ్యాయులను ఎంపిక చే శారు. కేవలం ఇద్దరే హాజరుకాగా.. మిగిలినవారు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల జేఏసీ నాయకులు కె. వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేసే విధంగా సీసీ కెమెరాల నిఘాలో ఎన్క్యూపీ సెమినార్ నిర్వహించడం సమంజసం కాదన్నారు. దీనిని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
24,25 తేదీల్లో జాతీయ సెమినార్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బీక్యాంపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24,25 తేదీల్లో ‘ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు’ అన్న అంశంపై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సెమినార్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆమె తన కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమానికి ఎస్కే యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ హెచ్ఓడీ ఆనందనాయుడు ముఖ్యాతిథిగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామలింగారెడ్డి, రంగారెడ్డి, సాహిత్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సదస్సును జయప్రదం చేయాలి
నల్లగొండ టూటౌన్ : జిల్లా కేంద్రంలోని ఎస్పీటీ మార్కెట్లో ఈనెల 28న నిర్వహించనున్న పద్మశాలి యువజన సంఘం జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మశాలీల ఐక్యతకు, రాజకీయ చైతన్యం కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పద్మశాలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిలుకూరు శ్రీనివాస్, పున్న పాండు, కర్నాటి నీలయ్య, లక్ష్మీనారాయణ, మత్య్సగిరి, ధనుంజయ్ తదితరులున్నారు. -
జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌కు మమత ఎంపిక
పెద్దమందడి: జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌కు పెద్దమందడి మండలంలోని జగత్పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన మమ త ఎంపికైనట్లు హెచ్ ఎం తిరుపతిరెడ్డి, గైడ్ టీచర్ మల్లిఖార్జున్ తెలిపారు. మంగళవారం వనపర్తిలోని బా లుర ఉన్నత పాఠశాల్లో నిర్వహించిన డివి జన్స్థాయి సైన్స్ సెమినార్లో జగత్పల్లి వి ద్యార్థి మమత చక్కటి ప్రతిభ కనబర్చడం తో జిల్లాస్థాయి సైన్స్ మేళాకు అధికారులు ఎంపిక చేశారన్నారు. విద్యార్థి మమతను ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
ప్రజల హక్కులను కాపాడాలి
విజయవాడ లీగల్ : ప్రజల హక్కులు కాపాడడంలో న్యాయవాదులు కీలక పాత్ర వహించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు సూచించారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) హాలులో ‘సమాజంలో న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై సోమవారం సెమినార్ నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది న్యా యవాదులు ప్రజాప్రయోజన వ్యాజ్యల ద్వారా ప్రజా సంక్షేమానికి పాటు పడ్డారని చెప్పారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీబీఏ అధ్యక్షడు సిహెచ్.మన్మథరా వు, డి.ఆంజనేయ ప్రసాదు, కె.చంధ్ర మౌళి, పి.శ్రీనివాసరావు, పి.కిరణ్, కె.వరప్రసాదరావు, సీనియర్ న్యాయవాదులు చేకూరి శ్రీపతిరావు, సిహెచ్.అజయ్‌కుమార్, పిళ్ళా రవి, సోము కృష్ణమూర్తి, రాజనాల హెహర్ మోహన్ పాల్గొన్నారు. ఎంపీ కేశినేనిని కలిసిన ప్రతినిధులు పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని)ని బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిశారు. పుష్కరాలకు వచ్చే న్యాయవాదులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బార్ వాష్ రూంకు నిధులు కేటాయించాలని కోరారు. స్పందించిన ఆయన కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో బీబీఏ అధ్యక్షుడు సిహెచ్.మన్మథరావు, చేకూరి శ్రీపతిరావు, కె.వి.వి.పరమేశ్వరరావు, దాసరి ఆంజనేయ ప్రసాద్, కె.చంద్రమౌళి, కె.వరప్రసాదరావు, పి.శ్రీనివాసరావు, పి.కిరణ్ ఉన్నారు. -
‘అంబేద్కరిజం–ఉద్యోగుల పాత్ర’పై 10న సదస్సు
హన్మకొండ : భారత రాజ్యాంగ నిర్మా త బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ది యునైటెడ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సాదు మహేందర్ తెలిపారు. ఈ మేరకు సదస్సు కరపత్రాలను హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు.10వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ ఇంజనీర్స్ గెస్ట్‌హౌస్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు.‘అంబేద్కరిజం–ఉద్యోగుల పాత్ర’ అంశంపై జరగనున్న ఈ సదస్సులో సౌత్ ఇండియా సమాతా సైనిక్దల్ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కాంబ్లే, ది యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు జి.ఎస్.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి బి.భద్రూనాయక్, రాష్ట్ర అ ధ్యక్షుడు మామిడి నారాయణ ప్రసం గిస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉ ద్యోగులు పాల్గొని విజయవంతం చే యాలని కోరారు. ఫోరం నాయకులు వై.కొండల్రావు, కవిరాజారావు, రమేష్‌కుమార్, విష్ణుమూర్తి, కె.ఎల్లయ్య, రాజ్‌కుమార్, జితేందర్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి సదస్సుకు కేఎంసీ విద్యార్థి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజ్(కేఎంసీ) విద్యార్థి పృథ్వీరాజ్ జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికయ్యాడు. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్..విద్యార్థిని అభినందించారు. ఎస్. పృథ్వీరాజ్.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జీర్ యూనిట్–2లో పీజీ జనరల్ సర్జరీ ఫైనలియర్ చదువుతున్నారు. గత నెల 30, 31వతేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన వైద్యవిజ్ఞాన సదస్సుకు హాజరై సర్జరీలకు సంబంధించి పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. ఏపీ, తెలంగాణ , చత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 300 మంది పీజీ విద్యార్థులు పాల్గొనగా పథ్వీరాజ్ ప్రతిభ కబరిచారు. దీంతో ఆయనను వచ్చే డిసెంబర్లో మైసూర్లో జరిగే అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా(అపికాన్) జాతీయ స్థాయి సదస్సుకు ఎంపిక చేశారు. విద్యార్థి పథ్వీరాజ్‌ను జనరల్ సర్జరీ విభాగం యూనిట్–2 చీఫ్ డాక్టర్ మోహన్‌లాల్‌నాయక్, వైద్యులు మాధవీశ్యామల, జయరామ్, మల్లీశ్వరి తదితరులు అభినందించారు. -
‘ఉపాధి’పై విశాఖలో అంతర్రాష్ట్ర సదస్సు
పాడేరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై విశాఖలో ఆగస్టు 4,5,6 తేదీల్లో అంతరరాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్రామాలవారీ విజయగాథలతో కూడిన వార్షిక నివేదికలను రూపొందిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఉత్తమ కథనాలు రాసిన జిల్లాలోని జర్నలిస్టులకు పురస్కారాలు అందజేస్తామనిపోటీలో పాల్గొనే జర్నలిస్టులు వీడియో, ఫొటోగ్రఫీతో కూడిన విజయగాథల క్లిప్పింగులను ఆగస్టు 2వ తేదీలోగా తమ కార్యాలయానికి అందజేయాలన్నారు. ఉత్తమమైన వాటికి 3 కేటగిరీల్లో నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతికి రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తతీయ బహుమతిగా రూ.5 వేలు ఇస్తామన్నారు. 2015–16లో రూ.కోట్లతో జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టామన్నారు.ఈ పథకంపై ఉత్తమమైన విజయగాథల వీడియో క్లిప్పింగులను అంతరరాష్ట్ర సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చూపిస్తామన్నారు. ఈ పోటీలకు సంబంధించి సమాచారాన్ని విశాఖ ఎంవీపీ కాలనీలోని తమ కార్యాల యంలో నేరుగా, లేదా 0891 2712310/ 2530099 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. -
‘ఉపాధి’పై విశాఖలో అంతర్రాష్ట్ర సదస్సు
పాడేరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై విశాఖలో ఆగస్టు 4,5,6 తేదీల్లో అంతరరాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్రామాలవారీ విజయగాథలతో కూడిన వార్షిక నివేదికలను రూపొందిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఉత్తమ కథనాలు రాసిన జిల్లాలోని జర్నలిస్టులకు పురస్కారాలు అందజేస్తామనిపోటీలో పాల్గొనే జర్నలిస్టులు వీడియో, ఫొటోగ్రఫీతో కూడిన విజయగాథల క్లిప్పింగులను ఆగస్టు 2వ తేదీలోగా తమ కార్యాలయానికి అందజేయాలన్నారు. ఉత్తమమైన వాటికి 3 కేటగిరీల్లో నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతికి రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తతీయ బహుమతిగా రూ.5 వేలు ఇస్తామన్నారు. 2015–16లో రూ.కోట్లతో జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టామన్నారు.ఈ పథకంపై ఉత్తమమైన విజయగాథల వీడియో క్లిప్పింగులను అంతరరాష్ట్ర సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చూపిస్తామన్నారు. ఈ పోటీలకు సంబంధించి సమాచారాన్ని విశాఖ ఎంవీపీ కాలనీలోని తమ కార్యాల యంలో నేరుగా, లేదా 0891 2712310/ 2530099 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. -
ఫిరాయింపులపై చట్టసవరణ అత్యవసరం
జన చైతన్యవేదిక సెమినార్లో పలువురు వక్తల సూచన సాక్షి, విజయవాడ: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయడం అత్యవసరమని జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ నిర్వహించిన సెమినార్లో మాట్లాడిన వక్తలు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫిరాయించిన వెంటనే పదవిపై వేటుపడాలని వారు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్ నుంచి ఈసీకి బదిలీ చేసేలా చట్టసవరణ జరగాలని సూచించారు. ‘పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆదివారం విజయవాడలోని ఎంబీభవన్‌లో నిర్వహించిన ఈ సెమినార్లో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చ ట్టంలో సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. ఫిరాయింపులపై 1985లో, 2003లో చేసిన రెండు సవరణల్లోనూ లోపాలుండటం వల్ల మరోసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇతర పార్టీలనుంచి గెలిచిన వారిని సీఎం స్వయంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు పార్టీలకతీతంగా వ్యవహరించి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడాలన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణీత వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలనే నిబంధన పెట్టాలన్నారు. జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, నాగార్జున వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.రంగయ్య, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నాగార్జున వర్సిటీ ఆచార్యుడు అంజిరెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ ఎంసీ దాస్, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
బాధ్యతాయుతంగా మెలుగుతోంది
మీడియాపై ఢిల్లీ సీనియర్ జర్నలిస్ట్ వెంకటనారాయణ సాక్షి, హైదరాబాద్: దేశంలో మీడియా బాధ్యతాయుతంగా మెలుగుతోందని ఢిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఎస్.వెంకటనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ డే పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ‘మాధ్యమాలు-ప్రజాస్వామ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకటనారాయణ మాట్లాడుతూ.. మనదేశంలో 800 టీవీ చానళ్లు ఉన్నాయని, మీడియా వెనువెంటనే స్పందించడం వల్ల నిర్భయ లాంటి చట్టాలు వచ్చాయని, మీడియా బాధ్యతాయుతంగా పనిచేయడం వల్లే పార్లమెంట్లో ఎన్నో అంశాలకు సంబంధించిన బిల్లులు పాసవుతున్నాయని చెప్పారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాలతోపాటు నాలుగో స్తంభంగా మీడియా విశేషంగా పనిచేస్తోందన్నారు. తెలుగువారిలో రాజకీయ చైతన్యం ఎక్కువని, దీని మూలంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చానళ్లు ఉన్నట్లు భావిస్తున్నానని చెప్పారు. జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికల్లో దక్షిణ భారత వార్తలకి ప్రాధాన్యత ఎందుకు ఉండడం లేదన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ఇంగ్లిష్ పేపర్లకు రాష్ట్రస్థాయి ఎడిషన్లు ఉన్నాయని, ఆయా రాష్ట్రాల ఎడిషన్లు అక్కడి వార్తలను కవర్ చేయడానికి ఉన్నాయని పేర్కొన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం భాషపై పట్టు, ఎలా రాయాలన్న అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర విస్తృతంగా మారిందని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన జర్నలిస్ట్‌లను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బుద్ధవనం ప్రాజెక్ట్ డెరైక్టర్ మల్లెపల్లి లక్ష్మయ్య, హిందూ పత్రిక పూర్వపు సంపాదకులు నగేశ్‌కుమార్, వయోధిక జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి జీఎస్ వరదాచారి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రాజమౌళిచారి, ఎస్. విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు పలు పత్రికల సంపాదకులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టులు.. కమీషన్లేనా..!
♦ కేబీఆర్ పార్కు పరిరక్షణ పట్టదా? ♦ ఎస్ఆర్డీపీ వద్దు ‘సేవ్ కేబీఆర్ పార్క్’ ♦ సదస్సులో వక్తలు సోమాజిగూడ: అనాలోచితమైన విధానాలు, లోపభూయిష్టమైన అభివృద్ధి పథకాలు, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ పర్యావరణానికి తూట్లు పొడిచే విధానాలను ప్రభుత్వం అవలంబి స్తోందని పలువురు పర్యావరణవేత్తలు ఆభిప్రాయపడ్డారు. ఎస్ఆర్డిపీ (స్ట్రాటజిక్ రోడ్ డవలప్మెంట్ ప్లాన్) పథకాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజ లు, నిపుణుల అభిప్రాయలు స్వీకరించి శాస్త్రీయ, పర్యావరణ ప్రియమైన విధానాలతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ రైజింగ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బేగంపేట సెస్ భవన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ కేబీఆర్ పార్క్ ’ సదస్సులో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పట్టణీకరణ నిపుణురాలు కరుణాగోపాల్, అనంత్ మరింగంటి తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఎస్ఆర్డిపీ నిర్మాణ పథకాలను తీవ్రంగా తప్పు పట్టారు. నగరానికి ఆత్మలాంటి ఉద్యానవనాలు, చెరువులను కాపాడుకోవాలన్నారు. చార్మినార్, మక్కామజీద్ లాంటి హెరిటేజ్ భవనాలను పక్కన పెట్టి హైటెక్ భవనాలను చూపుతూ హైదరాబాద్ నగర ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తక్కువ చేస్తున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి తక్కువ ఖర్చుతో చక్కటి ప్రత్యామ్నాయాలు ఉండగా భారీ ఖర్చు, పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఫ్లైఓవర్ల నిర్మా ణం ఎందుకని ప్రశ్నించారు. కేబీఆర్ పార్క్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో నిర్మించే ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రతిపాదన తక్షణమే విరమించుకోవాలని లేకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. భారీ కాంట్రాక్ట్‌లు, కమీషన్ల మోజుతో నిర్మించే ఇలాంటి ప్రాజెక్ట్‌లు భవిష్యత్‌లో గుదిబండగా మారుతాయని , జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం కేబీఆర్ పార్క్ వద్ద భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో హైదరాబాద్ రైజింగ్ సంస్థ ప్రతినిధి శిల్పా శివరామన్తోపాటు పలువురు పర్యావరణప్రియులు పాల్గొన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఉచిత పథకాలతో అమాయక ఓటర్లను బుట్టలోవేసుకుంటున్న పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కమీషన్లకు కక్కుర్తి పడుతూ పనికిమాలిన పథకాలు ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన నిర్ణయాలు, ప్రాజెక్ట్‌లతో పాలకులు మందుకు వెళుతుంటే మన పాలకులు మాత్రం కాంట్రాక్టర్లు, కార్పొరేట్ లాబీల ప్రయోజనాల మేరకు పనిచేస్తూ విధ్వంసం చేస్తున్నారు. ఎస్ఆర్డీపీ కార్యక్రమానికి వ్యతిరేకంగా పర్యావరణవాదులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. ప్రాజెక్ట్ నిలిపివేసే వరకు కలిసికట్టుగా పోరాడదాం. - మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాజీ వైస్ చైర్మన్, ఎన్డీఎంఏ కేబీఆర్ పార్క్ సిటీకి ఆక్సిజన్ నగరానికి కేబీఆర్ పార్క్ ఒక మణిహారం లాంటిది. ఒక ఆక్సిజన్ మాస్క్. ఇలాంటి పార్క్‌కు ఎస్ఆర్డీపీతో తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రయోజనాల మేరకు పనిచేస్తూ కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి జీవితాలను పణంగా పెడుతున్నారు. కాలుష్యంతో సతమతమవుతున్న నగరాలలో ఉన్న అతికొద్ది పార్కులను కూడా ధ్వంసం చేస్తున్నారు. దీంతో అవి నరకాలుగా మారుతున్నాయి. అర్థంపర్థం లేని పట్టణీకరణ మానవ విధ్వంసానికి దారి తీస్తుంది. కనీస అవసరాలు తీరక సామాన్యులు నానాపాట్లు పడుతుంటే ఫ్లై ఓవర్లు కావాలని ఎవరు అడిగారు...తక్షణమే ఈ ప్రాజెక్ట్ ఉపసంహరించుకోవాలి. - ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త ఫ్లై ఓవర్లు సర్వరోగ నివారిణి కాదు నగరంలో కొన్ని ఫ్లైవోవర్లు నిర్మిస్తే అవి సర్వరోగ నివారిణి కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగుపరచడం, ఎంఎంటీఎస్ సమర్థ వినియోగం. కార్ పూలింగ్ ప్రొత్సహించడం, నగర వికేంద్రీకరణ ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కరించవచ్చు. ఎన్నో పక్షి జాతులు, పచ్చటి చెట్లతో నగరం నడిబొడ్డున కళకళలాడే కేబీఆర్ పార్క్‌ను అందరం కాపాడుకోవాలి. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులో సహజ సౌందర్యంతో ఉండే పార్క్ మొత్తం నగరానికి ఆక్సిజన్ మాస్క్ లాంటిది. - అనంత్ మరింగంటి , హైదరాబాద్ అర్బన్ల్యాబ్స్ డెరైక్టర్ వేల కోట్లు వృథా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఫ్లైఓవర్లు నిర్మించడం మానేశారు. ఇది పాత పద్ధతి. బెంగళూర్, మైసూర్ మధ్య కనెక్టివిటీ పెంచే ఉద్దేశ్యంతో కర్ణాటక ప్రభుత్వం 1998లో ప్రారంభించిన నైస్ ప్రాజెక్ట్ సుదీర్ఘంగా సాగి కొద్దికాలం క్రితమే పూర్తయింది. ఇన్ఫ్రా సైకిల్, పొలిటికల్ సైకిల్ వేరువేరు. తరచూ అధికారం చేతులు మారే ప్రజాస్వామంలో కొత్త పార్టీ రాగానే పాత ప్రాజెక్టులు పక్కన పడేస్తున్నారు. దీంతో వేలకోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. శాశ్వత ప్రాతిపదికన పర్యావరణహితమైన ప్రాజెక్టులు మాత్రమే మనుగడ సాగిస్తాయి. - కరుణాగోపాల్, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ వ్యవస్థాపకురాలు -
ఔత్సాహిక రియల్టర్ల కోసం డాలస్ 'టీ' సదస్సు
డాలస్: నానాటికీ విస్తరిస్తోన్న డాలస్ ఫోర్ట్ వర్త్ (డిఎఫ్ డబ్ల్యూ) రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఔత్సాహిక తెలుగు వ్యాపారవేత్తలు ప్రవేశించేలా చేయూత, సహకారం అందించడంలో భాగంగా సోమవారం డలాస్ లో తెలుగు ఎంటర్ ప్రెన్యూర్స్ అసోసియేషన్ (టీ) నిర్వహించిన సెమినార్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మార్కెట్ స్థితిగతులు, లాభాలు ఎలా గడించాలనే విషయాలపై నిపుణులు చేసిన సూచనలను సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలు శ్రద్ధగా విని తెలుసుకున్నారు. తెలుగు నేపథ్యం ఉన్న యువకులు, మహిళా వ్యాపారవేత్తలు డిఎఫ్ డబ్ల్యూ రియల్ రంగంలో రాణించేందుకు ఏర్పాటుచేసిన ఈ సెమినార్.. డాలస్ లోని దేశీ ప్లాజా ఈవెంట్ సెంటర్ లో మే9న జరిగింది. రెండు గంటలపాటు సాగిన సదస్సుకు దాదాపు 150 మందికిపైగా వ్యాపారులు హాజరయ్యారు. డీఎఫ్ డబ్ల్యూ రియల్ రంగంలో యువ వ్యాపారవేత్తలు ఏమేరకు రాణించే అవకాశం ఉందో, ఆమేరకు ఎదురయ్యే సవాళ్లు, అధిగమించాల్సిన కష్టనష్టాల గురించి తెలియపర్చడమే సదస్సు ముఖ్య ఉద్దేశం అని 'టీ' నిర్వాహకులు పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్రం శ్రీనివాసరెడ్డి సదస్సును ప్రారంభిస్తూ 'టీ' లక్ష్యాలను ఆహుతులకు వివరించారు. 2010లో ప్రారంభమైన నాటి నుంచి 2015 వరు 'టీ'ని పలు విధాలుగా విస్తరించిన మాజీ అధ్యక్షులు శీను పోహర్, సురేశ్ ఉలువల, ప్రతాప్ భీంరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు పల్లవి తోటకూర సదస్సు నిర్వహణలో ప్రధాన పాత్ర పోశించారు. టీ డాలస్ చాప్టర్ అధ్యక్షుడు రాజా పబ్బ మాట్లాడుతూ భవిష్యత్తులో వ్యాపారంలో రాణించాలనుకునేవారికి టీ చక్కటి వేదికగా నిలవబోతున్నదని, ఆ మేరకు రూపొందించిన ఐదు అంచెల విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమానికి వేదిక ఇచ్చిన దేశీ ప్లాజా యజమాని మనోహర్ నిమ్మగడ్డ, కృష్ణ పుట్టపర్తిలతోపాటు ప్లానో రెస్టారెంట్ భాగస్వామి శ్రీని వేములలకు ధన్యవాదాలు తెలియజేశారు. మహేశ్ గజ్జల, శ్రాన్ గాఫ్, శీను పొహార్, టీ డాలస్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ పల్లవి తోటకూర, సెక్రటరీ జాగ్స్ పోరండ్ల, జాయింట్ ట్రెజరర్ సంధ్య పడాల, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రత్న పట్నాల, శీను పోహర్, టీ మాజీ అధ్యక్షులు సురేశ్ వేముల, ప్రతాప్ భీంరెడ్డి, ప్రేమ్ గంగాలకుంట, మాజీ సెక్రటరీలు సత్యం వీర్నపు, శరత్ పున్ రెడ్డి, మాజీ ట్రజరర్ వెంకట్ అప్పిరెడ్డి, మాజీ జాయింట్ ట్రెజరర్, శారద సంగిరెడ్డి, ప్రస్తుత ట్రెజరర్ సాంబ అవెర్నేని, మాజీ ఉపాధ్యక్షుడు విసు పాలెపు, మాజీ ట్రెజరర్, విజయ్ పుట్టా, మాజీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగు గజ్జల, ఉపాధ్యక్షుడు రాజా పబ్బ, అధ్యక్షుడు మహేశ్ గూడూరి, కాకి వసుంధర, ప్రవీణ్ తోట, మనోహర్ గంజేటి, మహేందర్ గణపురం, మాజీ ఉపాధ్యక్షులు భీమా పెంట, సతీశ్ పున్నం, నాజ్ ఎం షేక్, శ్యామ రుమాళ్ల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తెలుగు సంఘం టాంటెక్స్ నుంచి అధ్యక్షుడు సుబ్బు జొన్నలగడ్డ, మాజీ అధ్యక్షుడు ఉరిమిండి నర్సింహారెడ్డి, తెలుగు జాతీయ సంస్థలు నాటా, టానా, ఆటా, నాట్స్, టాటా, టీడీఎఫ్, డాటా, టీపీఏడీలు తమ సహకారాన్ని అందించాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం www.teaglobal.org వెబ్ సైట్ లేదా www.facebook.com/teadallas ఫేస్ బుక్ పేజ్ ను సందర్శించవచ్చు. -
30న ఢిల్లీలో సీఐటీయూ అఖిలభారత సదస్సు: దేవరాయ్
ఈ నెల 30న ఢిల్లీలో అఖిలభారత స్థాయి సీఐటీయూ వర్కర్స్ యూనియన్ సదస్సు నిర్వహించనున్నట్టు సీఐటీయూ సెక్రటరీ స్వదేశీ దేవరాయ్ తెలిపారు. ఆదివారం విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైనే సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుందని చెప్పారు. సెప్టెంబర్ 2 నుంచి 20కోట్ల మంది కార్మికులతో సమ్మె నిర్వహించనున్నామని తెలిపారు. -
పంట కాలనీలపై సదస్సులు
♦ వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి వెల్లడి ♦ తెలంగాణ వ్యవసాయ అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: పంట కాలనీపై మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సదస్సులు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయశాఖ అధికారులు, విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులతో రాష్ట్రస్థాయిలో ఒక సదస్సు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆ తర్వాత జిల్లా, మండలస్థాయిలోనూ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి సదస్సులో పంట కాలనీలకు సంబంధించి మండల, జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. అందుకు సిలబస్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దండ రాజిరెడ్డి, డాక్టర్ ఎన్.వాసుదేవ్, డాక్టర్ పి.సి.రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం క్యాలెండర్‌ను ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ఆవిష్కరించారు. -
ఫిబ్రవరి 4-5 తేదీల్లో భారత పెట్టుబడుల సదస్సు
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 4, 5 తేదీల్లో దేశంలో పెట్టుబడుల సదస్సును నిర్వహించనుంది. న్యూ ఢిల్లీలో జరిగే ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు పాల్గొంటారని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం ట్వీట్ చేశారు. భారత్ ఆర్థికవృద్ధి లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వం... భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలుసహా పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సదస్సును ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. రోడ్లు, రహదారులు, చమురు, గ్యాస్, రైల్వే మంత్రిత్వశాఖల అధికారులు ఈ సదస్సులో పాల్గొని ఆయా రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను వివరించే అవకాశం ఉంది. పలు గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై జాతీయ టాస్క్‌ఫోర్స్
♦ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ సదస్సులో తీర్మానం ♦ స్థూలకాయం, ఆహార అలవాట్లపై పాఠశాలల్లో అవగాహన ♦ దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా నాలుగు నగరాల ఎంపిక సాక్షి, హైదరాబాద్: పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లపై పెద్ద ఎత్తున అవగాహన పెంచేందుకు జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. పిల్లల్లో మధుమేహం, స్థూలకాయం, కేన్సర్, గుండె జబ్బులు పరిపాటిగా మారిన నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, 19 ఏళ్ల లోపు యువతీ యువకులకు వీటిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్ కృషిచేస్తుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న పెడికాన్-2016 సదస్సులో రెండో రోజు శుక్రవారం ఈ మేరకు తీర్మానించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ నిర్మలతో పాటు స్వాతి భావే (పుణే), రేఖ హరీశ్ (జమ్ము కశ్మీర్), వాసుదేవ్ (ఢిల్లీ), రమేశ్ ధంపురి టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లోని పాఠశాలల విద్యార్థులతో వీరు భేటీ అయి ఈ సమస్యలపై వారికి అవగాహన కల్పిస్తారు. పాఠశాలల్లో జంక్‌ఫుడ్ తినకుండా పిల్లలను, రోజువారీ వ్యాయామం ప్రాధాన్యంపై ఉపాధ్యాయులను చైతన్యపరుస్తారు. ఆయా నగరాల్లో ఎంపిక చేసిన స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపడతారు. యువతలో పొగాకు, మద్యానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతారు. సీబీఎస్సీ స్కూళ్లల్లో జంక్‌ఫుడ్ తినొద్దంటూతీసుకున్న నిర్ణయం అంతటా అములయ్యేలా చూస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలిసి వీటిపై అవగాహన చర్యలు చేపడతారు. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేశాక, ఆ అనుభవంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచించాలని సదస్సు పిలుపునిచ్చింది. ప్రధానంగా 10-19 ఏళ్ల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం మద్యం, పొగాకుకు పిల్లలను దూరంగా ఉంచడం, వారికి వ్యాయామం తప్పనిసరి చేయడం. టీవీ వీక్షణ తగ్గించడంపై దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించింది. దేశవిదేశాల నుంచి వచ్చిన పిల్లల వైద్య నిపుణులు పిల్లల ఆరోగ్యం పట్ల సదస్సులో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల్లో ఇన్ఫెక్షన్లు తగ్గినా స్థూలకాయం, మధుమేహం, కేన్సర్, బీపీ తదితరాలు పరిపాటిగా మారాయని వ్యక్తంచేశారు. పిల్లలకు అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడాన్ని ఆపాలని సదస్సు కోరింది. ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వాక్ నిర్వహించారు. -
'మగువలు మగవారికంటే అధికులు'
సుల్తాన్‌బజార్: మహిళలు మగ వారితో సమానం కాదని, మగవారికన్న అధికులని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి అన్నారు. అన్ని రకాలుగా పనిచేయగల సత్తా మహిళల్లో ఉంటుందని తెలిపారు. బుధవారం కోఠి ఉమెన్స్‌కళాశాల పీజీ సెమినార్ హాల్లో విద్యార్థినుల భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జంటనగరాల్లోని 15 మహిళా కళాశాలల విద్యార్ధినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రమారాజేశ్వరి మాట్లాడుతూ... షీ టీమ్ ఏర్పాటు చేసిన సంవత్సరంలోపే స్త్రీలపై వేధింపులు తగ్గాయన్నారు. వ్యక్తిగత జీవితంలో తాను ఈవ్ టీజింగ్‌ను అనుభవించానని వివరించారు. రంగారెడ్డి జిల్లాల్లో 600ల హట్‌స్పాట్‌లను గుర్తించి మహిళలకు రక్షణ కల్పించామన్నారు. షీ టీమ్‌ను ఎలా సంప్రదించాలో విద్యార్థులకు వివరించారు. -
'సాక్షి భవిత' ఆధ్వర్యంలో గ్రూప్స్ పై సదస్సు
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో 'సాక్షి భవిత' ధ్వర్యంలో శుక్రవారం జరిగిన సదస్సుకు నిరుద్యోగులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గ్రూప్స్‌పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా పలువురు విద్యారంగ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... గ్రూప్స్ సిలబస్‌లో తెలంగాణ చరిత్రకు చోటు కల్పించడం శుభ పరిణామంగా అభివర్ణించారు. విద్యార్థులు స్థానిక అంశాలతోపాటు జాతీయ అంశాలపై అవగాహన కల్పించుకుంటే విజయావకాశాలు మెరుగవుతాయని సూచించారు. -
IAAతో ’సాక్షి’ ప్రత్యేక సెమినార్
-
హైదరాబాద్‌లో సర్వీస్ ట్యాక్స్‌పై సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేవా పన్ను వసూళ్లలో ఎదరవుతున్న న్యాయపరమైన అడ్డంకులపై అవగాహన కల్పించడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో శనివారం జరిగే ఈ అవగాహనా సదస్సులో కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్‌ట్యాక్స్ కమిషనర్ సునీల్ జైన్‌తో పాటు ఈ రంగానికి చెందిన ఇతర టెక్నికల్ స్పీకర్లు పాల్గొంటున్నట్లు ఐసీఏఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సదస్సులో పాల్గొనే సీఎంఏ మెంబర్స్ రూ. 800, ఇతర కార్పొరేట్ ప్రతినిధులు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. -
సదస్సు విఫలం
- ముందస్తు సమాచారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం - పూర్తి స్థాయిలో హాజరు కాని బీసీ సంచార జాతులు ఇందూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల కోసం ఏర్పాటు చేస్తున్న సమీక్షలు, సమావేశాలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. సమీక్షలు, సదస్సులే ఇలా ఉంటే ఇక సంచార జాతుల స్వావలంబన ఎలా ఉంటుందో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో చేపట్టిన సదస్సును చూస్తే తెలుస్తుంది. సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సదస్సు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ బాధ్యతను జిల్లా స్థాయి అధికారి తీసుకుని, సంచార జాతుల వారికి, సంబంధిత అధికారులకు, ముఖ్య అతిథులకు ఒకటి రెండు రోజుల ముందు సమాచారం అందించాలి. ఒక రోజు ముందే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అరుుతే మంగళవారం నిర్వహించిన సదస్సు గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. దీంతో సదస్సు విషయం తెలియక జిల్లాలోని బీసీ సంచార జాతుల వారికి తెలియక చాలా మంది సదస్సుకు హాజరు కాలేదు. దాదాపు 36 బీసీ సంచార జాతుల కుస్తులుంటే పది జాతుల లోపే హాజరయ్యారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా బోసిపోయి కనిపించాయి. బ్యానరు లేదు... ముఖ్య అతిథికి గౌరవం లేదు ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభం కావాలి. కాని సమాచారం లేకపోవడంతో చాల మంది సమయానికి హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని 1 గంటకు వాయిదా వేశారు. ఏజేసీ రాజారాంకు కూడా ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో సదస్సు చాల ఆలస్యంగా ప్రారంభమయింది. అలాగే ప్రభుత్వం తరపున సదస్సు నిర్వహిస్తున్నట్లు కనీసం బ్యానరు కూడా ఏర్పాటు చేయలేదు.కనీసం ప్రభుత్వ పథకాలు తెలిపే విధంగా కర పత్రాలు పంచకుండా సదస్సులో చేతులు దులుపుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సంచార జాతుల వారికి ప్రత్యేక పథకాలు సంచార జాతుల వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం సూచించారు. ఆర్థికాభివృద్ధికి బీసీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. బీసీలకు కళ్యాణ లక్ష్మి, సబ్‌ప్లాన్ విషయంలో ప్రభుత్వం ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సంచార జాతుల కులస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
కొండను తవ్వి.. ఏం చేసినట్లు?
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంపై పోలీసు, అటవీ అధికారులు నిర్వహించిన సెమినార్ కొండ ను తవ్వి.. ఎలుకను పట్టాం అన్న చందాన ముగిసింది. అన్నిశాఖల సహకారంతోనే ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టగలమని, అందుకు అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని ఈ సెమినార్ తేల్చిచెప్పింది. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో శని, ఆదివారాలు రెండు రోజులపాటు ‘ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ- సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో రాయలసీమ ఐజీ వేణుగోపాలకృష్ణ, ఇతర పోలీసు అధికారులు, అటవీ, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు సుధీర్ఘంగా చర్చించిన అధికారులు అన్ని శాఖల సమన్వయంతో గ్రీన్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక దళం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇదే విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. అయితే... ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం ఆ పని చిత్తశుద్ధితో చేస్తోందా?అధికారుల ఏంచేయాలి? చట్టాలు కఠినంగా లేని పరిస్థితిలో వారు చేయగలిగిందెంత? అధికార పార్టీ ఒత్తిళ్లు నేపథ్యంలో ఎంతమంది అధికారులు చిత్తశుద్ధితో పనిచేయగలుగుతున్నారు? అటవీ, సివిల్ పోలీసుల మధ్య సమన్వయం తదితర సవాలక్ష ప్రశ్నలకు సెమినార్లో సమాధానం దొరకలేదు. ఉన్నతాధికారుల సంగతి పక్కనబెడితే చందనం అక్రమ రవాణా విషయంలో కింది స్థాయి సిబ్బంది మధ్య సమన్వయం లేదన్నది సుస్పష్టం. సమస్యలు అనేకం కొంతమంది అటవీ, పోలీసు అధికారులకు చందనం ఆదాయ వనరుగా మారిందన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో రెండు వర్గాల మద్య విబేధాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ఈ విషయం సదస్సులో పాల్గొన్న కొందరు అధికారులు బహిరంగంగానే చెప్పడం తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లాలో రెండు విభాగాలు పరస్పర దాడులకు దిగి కత్తులతో పొడుచుకుని కేసులు కూడా పెటుకున్న విషయం తెలిసిందే. ఏకంగా చందనం స్మగ్లింగ్‌లో భాగస్తులయ్యూరన్న ఆరోపణలతో కొద్దికాలం క్రితం వైఎస్ఆర్ జిల్లాలో పాతిక మంది వరకూ అటు అటవీ, ఇటు సివిల్ పోలీసు అధికారులు, సిబ్బందిపై ఒకేసారి వేటువేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో చాలామంది పోలీసులు చందనం స్మగ్లింగ్ చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. కొందరు పోలీసులు కేసుల పేరుతో బెదిరింపులకు దిగి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ముఖ్యంగా చందనం అక్రమ రవాణా అరికట్టాలంటే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలను కఠినతరం చేయాలి. అధికారులకు భరోసా కల్పించాలి. చంద్రబాబు ఎన్నికలకు ముందు చందనం స్మగ్లింగ్‌పై హడావుడి చేశారు. ఎర్రదొంగలంతా ప్రతిపక్ష పార్టీలవారేనంటూ గవర్నర్ వద్ద పంచాయితీ పెట్టారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. చందనం స్మగ్లింగ్‌ను అరికట్టే పవరూ ఉంది. మరెందుకు ఆలస్యం. సదస్సులో ఓ ఫారెస్ట్ అధికారి చెప్పినట్లు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కఠిన చట్టాలకోసం చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి అధికారులకు భరోసా కల్పించాల్సి ఉంది. తొలుత ఇది జరిగితే సదస్సుల వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. -
నానో టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు
మదనపల్లెక్రైం: ప్రపంచంలో నానో టెక్నాలజీ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. సూక్ష్మ పదార్థాల ద్వారా వస్తు తయారీ విధానాన్ని అధ్యయనం చేసేందుకు స్థానిక బీటీ కళాశాలలో బుధవారం రూల్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయోసెన్సైస్‌పై జాతీయ సద స్సును ప్రారంభించారు. ముందుగా బీటీ కళాశాల వ్యవస్థాపకురాలు అనిబి సెంట్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో రెండు రోజుల సెమినార్‌ను ప్రారంభించారు. మొదటి రోజు పలు ప్రాముఖ్యమైన విషయాలపై ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మిట్స్ కాలేజ్ కరస్పాండెంట్ నాదేళ్ల విజయభాస్కర్‌చౌదరి మాట్లాడుతూ నానో టెక్నాలజీ విస్తరిస్తున్న సమయంలో జాతీయ స్థాయి సెమినార్ బీటీ కళాశాలలో నిర్వహించ డం గర్వంగా ఉందన్నారు. చైర్పర్సన్ ప్రొఫెసర్ లక్ష్మణరావు మాట్లాడుతూ నానోసైన్స్, నానో టెక్నాలజీని ఉపయోగించి పదార్థాలను సూక్ష్మస్థాయిలో సృష్టించి వాటి భౌతిక, రసాయనిక, జీవశాస్త్ర, విద్యుత్, దృశ్య, ఎలక్ట్రానిక్, యాంత్రిక ధర్మాలను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ, వైద్య, వాతావరణ పరిశోధక, సమాచార రంగాలను నానో టెక్నాలజీ ద్వారా అనువర్తించనున్నట్లు పేర్కొన్నారు. నానో టెక్నాలజీ ద్వారా పదార్థాన్ని, శక్తిని, స్థలాన్ని పొదుపు చేయవచ్చన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ సదస్సులో పాఠశాల ప్రిన్సిపాల్ కిజర్ మహ్మద్, వైస్ ప్రిన్సిపాల్ స్వర్ణరాణి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణమ్మ, ఆదిత్య కాలేజ్ రామలింగారెడ్డి, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓఎండీ హుస్సేన్, హెచ్‌వోడీ శివరామయ్య, శ్రీకుమార్, రాయలసీమ జిల్లాల్లోని ప్రొఫెసర్లు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విలువలులేని విద్య నిరర్థకం
హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకరరావు భవానీపురం : మానవత, విలువలు లేని విద్య, ఆత్మ ప్రబోధంలేని వృత్తి నిరర్థకమని హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు అన్నారు. గవర్నర్‌పేటలోని సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో శనివారం రిజి స్ట్రేషన్, స్టాంపుల చట్టాలు, వీలునామా, స్థలం అమ్మకాలు-కొనుగోలు, తనఖా తదితర అంశాలపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమాజంలోని పరిస్థితులను సరిదిద్దడానికి నూతన చట్టాలు పుట్టుకొస్తున్నాయని తెలి పారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత పెడదారిన పడుతోందని, అది చాలా బాధాకరమని పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, తాము ఎంచుకున్న వృత్తిలో ముందడుగు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. మనిషి సమాజంలోని మంచిని మాత్రమే స్వీకరించి చెడును విడనాడాలని సూచించారు. న్యాయవాదులు నిజాయితీ, మానవత విలువలను కాపాడుతూ న్యాయస్థానాలకు సహకరించడం ద్వారా ఉత్తమ తీర్పులు వెలువడే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్‌లో జరుగబోయే లావాదేవీల గురించి వివరించారు. రిజిస్ట్రేషన్-స్టాంపుల చట్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా పూర్తి అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆర్.మురళి మాట్లాడుతూ గతంలో కృష్ణాజిల్లాలో పని చేసిన శివశంకరరావు ఉన్నత శిఖరాలను చేరుకుని ఉత్తమ తీర్పులను ఇస్తున్నారని కొనియాడారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపర దుర్గాశ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు దివ్వెల పిచ్చయ్య, హేమంత్‌కుమార్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, బీబీఏ ప్రధాన కార్యదర్శి వజ్జే వెంకటరవికుమార్, ఉపాధ్యక్షులు ప్రసాద్, గోగిశెట్టి వెంకటేశ్వరరావు, పిళ్లారవి, కార్యవర్గ సభ్యులు చింతా ఉమామహేశ్వరరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, ఎం.హెప్సిబా, బి.సాయిబాబు, ఎం.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తిరుపతి సదస్సు’ను అడ్డుకున్న పోలీసులు
ఏపీలో ప్రజా సంఘాల అరెస్ట్ {Xన్హంట్ వ్యతిరేక కమిటీ సదస్సు రద్దు తిరుపతి: ఆపరేషన్ గ్రీన్‌హంట్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం జరగాల్సిన సదస్సు వాయిదాపడింది. సమావేశానికి హాజరవుతారని ప్రకటించిన కమిటీ ముఖ్య నేతలను పోలీసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా 41 ప్రజా సంఘాలతో ఏర్పాటైన కమిటీ సమావేశం తిరుపతిలో సీపీఐ కార్యాలయ ఆవరణలో ఆదివారం జరగాల్సి ఉంది. దీనికి కమిటీ కన్వీనర్, ప్రొఫెసర్ ఎస్.శేషయ్య అధ్యక్షత వహించాల్సి ఉంది. పౌర హక్కుల సంఘం, జనవిజ్ఞాన వేదిక, ప్రగతిశీల కార్మిక సంఘం, దేశభక ్త ప్రజాతంత్ర, విరసం తదితర ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. సమావేశానికి వచ్చేవారిని ఎక్కడికక్కడఅరెస్ట్ చేసినట్లు సమాచారం. సభావేదిక ఆవరణలోకి ఉదయం నుంచి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సదస్సు నిర్వహించలేదు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, ఏపీ, తెలంగాణ సీఎంల పరిపాలన ఎమర్జెన్సీని తలపించేలా సాగుతోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీమన్నారాయణ అక్కడ మీడియాతో అన్నారు. నాయకుల గృహ నిర్బంధం తిరుపతి సదస్సుకు వెళ్లకుండా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేషయ్య, అనంతపురం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు హరినాథరెడ్డిలను శనివారం రాత్రినుంచే గృహనిర్భందంలో ఉంచారు. -
తప్పెవరిది ? శిక్షెవరికి ? Part2
-
తప్పెవరిది ? శిక్షెవరికి ? Part1
-
సాక్షి మీడియా అక్షర యజ్ఞం
-
వైజాగ్‌లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పై సాక్షి సదస్సు
-
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై నేడు ‘సాక్షి’ సదస్సు
సాక్షి,హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భారీగా మిగిలిన సీట్లు.. రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించని సుప్రీంకోర్టు... దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి, సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు ‘సాక్షి’ ముందుకొస్తోంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన కారణాలు, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో చేపట్టదగిన చర్యలపై సోమవారం నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు ప్రముఖ విద్యావేత్తలు హాజరు కానున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమస్యలు - ప్రత్యామ్నాయాలతో పాటు, ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సాక్షి సదస్సు వివరాలు.. తేదీ: సెప్టెంబర్ 22 (సోమవారం) సమయం: ఉదయం పదకొండు గంటల నుంచి.. వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియం వక్తలు: ప్రొఫెసర్ తిరుపతి రావు, ఉస్మానియా విశ్వ విద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్, చుక్కా రామయ్య - ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్- ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ హరగోపాల్ - ప్రముఖ విద్యావేత్త. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ సింగరాచార్య ముగిసిన ఇంటర్ విద్యార్థుల ఇన్స్పైర్ క్యాంపు కేయూ క్యాంపస్ : విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాచార్య సూచించారు. కేయూ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆ విభాగం సెమినార్ హాల్లో ఇంటర్ విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఐదు రోజుల ఇన్స్పైర్ సైన్స్ క్యాంప్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో సింగరాచార్య ముఖ్యఅతిథిగా మాట్లాడారు. భారతదేశంలో అనేక వనరులు ఉండి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే, వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం వల్లే సమస్యల పరిష్కా రం సాధ్యం కావడం లేదన్నారు. ఈ మేరకు విద్యార్థులు శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొందించుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడమే కాకుండా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. ఇంటర్ పూర్తి కాగానే నిర్ణయించుకోవాలి.. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇన్స్పైర్ ప్రోగ్రాంలు దోహదం చేస్తాయని నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి అన్నార. క్యాంపులో భాగంగా పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు చెప్పిన అంశాలను సోపానంగా చేసుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కాకుండా అంతకంటే మెరుగైన ఉపాధి కల్పించే ఎన్నో కోర్సులు ఉన్నాయని తెలిపారు. అయితే, విద్యార్థులు ఇంటర్ పూర్తి కాగానే తమ భవిష్యత్ ప్రణాళికపై ఓ నిర్ణయం తీసుకుని దాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఇన్స్పైర్ క్యాంపు కోఆర్డినేటర్ ఎం.కృష్ణారెడ్డి, జువాలజీ విభాగాధిపతి స్వామి మాట్లాడారు. కాగా, చివరి రోజు సెషన్లో భాగంగా ఎన్జీ రంగా యూనివర్సిటీ శాస్త్రవేత్త ఉమారెడ్డి అగ్రికల్చర్ బీటెక్ ప్రాధాన్యతను వివరించారు. హైదరబాద్ ఐఐసీటీ సైంటిస్ట్ డాక్టర్ సీహెచ్.రాజిరెడ్డి మాట్లాడుతూ మానవాళి సంక్షేమం, నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులు, ఆహార పదార్థాల్లో కెమిస్ట్రీ ఉపయోగాలను తెలి పారు. ఆ తర్వాత క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు రక్షిత, అరుణ్,అభినవ్, మహేష్ మాట్లాడుతూ తాము నేర్చుకున్న అంశాలు ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అయితే, పదో తరగతిలో 9 జీపీఏ వచ్చిన వారికే కాకుండా 8 జీపీఏ వచ్చిన వారికి క్యాంపులో పాల్గొనే అవకాశం కల్పించి పది రోజుల పాటు నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ముగింపు సమావేశంలో భాగంగా పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.