ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భారీగా మిగిలిన సీట్లు.. రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించని సుప్రీంకోర్టు... దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
సాక్షి,హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భారీగా మిగిలిన సీట్లు.. రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించని సుప్రీంకోర్టు... దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి, సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు ‘సాక్షి’ ముందుకొస్తోంది.
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన కారణాలు, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో చేపట్టదగిన చర్యలపై సోమవారం నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు ప్రముఖ విద్యావేత్తలు హాజరు కానున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమస్యలు - ప్రత్యామ్నాయాలతో పాటు, ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
సాక్షి సదస్సు వివరాలు..
తేదీ: సెప్టెంబర్ 22 (సోమవారం)
సమయం: ఉదయం పదకొండు గంటల నుంచి..
వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియం
వక్తలు: ప్రొఫెసర్ తిరుపతి రావు, ఉస్మానియా విశ్వ విద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్, చుక్కా రామయ్య - ఎమ్మెల్సీ, ప్రముఖ
విద్యావేత్త, ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్- ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ హరగోపాల్ - ప్రముఖ విద్యావేత్త.