24,25 తేదీల్లో జాతీయ సెమినార్
Published Wed, Aug 31 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బీక్యాంపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24,25 తేదీల్లో ‘ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు’ అన్న అంశంపై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సెమినార్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆమె తన కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమానికి ఎస్‌కే యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ హెచ్‌ఓడీ ఆనందనాయుడు ముఖ్యాతిథిగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామలింగారెడ్డి, రంగారెడ్డి, సాహిత్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement